Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ షట్సప్తత్యుత్తర శతతమో7ధ్యాయః అథ ప్రతిపద్ర్వతాని అగ్ని రువాచ : వక్ష్యే ప్రతిపదాదీని వ్రతాన్యఖిలదాని తే | కార్తికాశ్వయుజే చైత్రే ప్రతిద్ర్బహ్మణ స్తిథిః. 1 పఞ్చదశ్యాం నిరాహారః ప్రతిపద్యర్చయేదజమ్ | ఓంతత్సద్ర్బహ్మణ నమో గాయత్ర్యా వాబ్దమేకకమ్. 2 అక్షమాలాం స్రువం దక్షే వామే స్రుచం కమణ్డలుమ్ | లమ్బకూర్చం చ జటిలం హైమం బ్రహ్మాణమర్చయేత్. 3 శక్త్యా క్షీరం ప్రదద్యాత్తు బ్రహ్మా మే ప్రీయతామితి | నిర్మలో భోగభుక్ స్వర్గే భూమౌ విప్రో ధనీ భ##వేత్. ధన్యం వ్రతం ప్రవక్ష్యామి హ్యధన్యో ధన్యతాం వ్రజేత్ | మార్గశీర్షే ప్రతిపది నక్తం హుత్వా ప్యుపోషితః. అగ్నయే సమ ఇత్యగ్నిం ప్రార్చ్యాబ్దం సర్వభాగ్భవేత్ | ప్రతిపద్యేకభక్తాశీ సమాప్తే కపిలాప్రదః. 6 వైశ్వానరపదం యాతి శిఖివ్రతమిదం స్మృతమ్ | ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ప్రతిపద్ర్వతాని నామ షట్సప్తత్యధిక శతతమో೭ధ్యాయః. అగ్ని పలికెను. అన్ని కోరికలను తీర్చు ప్రతి పదాది వ్రతములను గూర్చి నీకు చెప్పెదను. కార్తిక-ఆశ్వయుజ-చైత్రమాసములందలి ప్రతిపత్తు బ్రహ్మప్రీతికర మగు తిథి. పూర్ణిమయందు ఉపవాసము చేసి ప్రతిపత్తు నందు ఓం తత్సద్ర్బహ్మణ నమః మంత్రముతో బ్రహ్మను పూజించవలెను. లేదా ఒక సంవత్సరము పాటు గాయత్రీ మంత్రముతో కుడి చేతులలో అక్షమాలను, స్రువమును, ఎడమచేతులలో స్రుక్కును, కమండలమును ధరించుచున్న వాడును, దీర్ఘమైన గడ్డముగల వాడును, జటాధారియు, సువర్ణవర్ణము గలవాడును అగు బ్రహ్మను పూజించవలెను. నా విషయమున బ్రహ్మ అనుగ్రహించుగాక! అని పలుకుచు శక్త్యనుసారముగా క్షీరమును సమర్పించవలెను. ఈ విధముగ చేసిన విప్రుడు పాపవిముక్తుడై భూమియందు ధనవంతుడై, స్వర్గమునందు భోగములను అనుభవించును. ఇపుడు ధన్యవ్రతమును గూర్చి చెప్పెదను. దానిని చేయుటచే అధన్యుడు ధన్యుడగును. మార్గ శీర్ష ప్రతిపత్తునందు రాత్రి హోమము చేసి ఉపవాసమున్న వాడై, అగ్నయే నమః అను మంత్రముచే ఒక సంవత్సరము అగ్నిని పూజించి, సర్వకామములను పొందును. ప్రతిపత్తు నందు ఒక్క పర్యాయమే భుజించుచు, సమాప్తమైన పిదప కపిల గోవును దానము చేసిన వాడు వైశ్వానరుని స్థానమును చేరును. ఇది శిఖివత్రము. ఆగ్నేయమహాపురాణమునందు ప్రతిపద్ర్వతములను నూటడెబ్బదియారవ అధ్యాయము సమాప్తము.