Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ఏకోనాశీత్యధిక శతతమో೭ధ్యాయః అథ చతుర్థీవ్రతాని అగ్ని రువాచ : చతుర్థీవ్రతాన్యాఖ్యాస్యే భుక్తిముక్తి ప్రదాని తే | మాఘే శుక్లచతుర్థ్యాం తు హ్యుపవాసీ యజేద్గణమ్. 1 పఞ్చమ్యాం చ తిలాన్నాదీ వర్షాన్నిర్విఘ్నతః సుఖీ | గం స్వాహామూలమన్త్రో೭యం గామాద్యం హృదయాదికమ్. 2 ఆగచ్ఛోల్కాయ చావాహ్య గచ్ఛోల్కాయ విసర్జనమ్ | ఉల్కాద్యైర్గాదిగంధాద్యైః పూజయేన్మోదకాదిభిః. 3 ఓం మహోల్కాయం విద్మ హే వక్రతుణ్డాయ ధీమహి | తన్నోదన్తీప్రచోదయాత్. మాసి భాద్రపదే చాపి చతుర్థీకృచ్ఛివం వ్రజేత్ | చతుర్థ్యఙ్గార7కేభ్యర్భ్య గణం సర్వమవాప్నుయాత్. 4 చతుర్థ్యాం ఫాల్గునే నక్తమవిఘ్నాఖ్యా చతుర్థ్యపి | చతుర్థ్యాం దమనైః పూజ్య చైత్రే ప్రార్చ్య గణం సుఖీ. 5 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే చతుర్థీవ్రతాని నామైకోనాశీత్యధిక శతతమోధ్యాయః. అగ్నిదేవుడు చెప్పెను : ఇపుడు భుక్తిముక్తిప్రదములగు చతుర్థీవ్రతములను గూర్చి చెప్పెదను. మాఘశుక్ల చతుర్థీదివసమున ఉపవాసము చేసి గణశ పూజ చేయవలెను. పంచమినాడు తిలములు భుజించవలెను. ఇట్లు చేసినవాడు అనేక సంవత్సరముల పాటు, విఘ్నరహితుడై సుఖముగానుండును. ''గం స్వాహా'' అనునది మూలమంత్రము, ''గాం నమః'' ఇత్యాదులతో హృదయాదిన్యాసము చేయవలెను. ''ఆగచ్చోల్కాయ'' అని గణపతిని ఆవాహనము చేయవలెను. విసర్జన చేయునపుడు ''గచ్ఛోల్కాయ'' అని చెప్పెవలెను. ఈ విధముగ ఆదియందు 'గ' కారయుక్తము, అంతమున 'ఉల్కా' శబ్దయుక్తము అగు మంత్రముతో గుణపత్యావాహనాదికము చేయవలెను. గంధాద్యుపచారములు, మోదకాదులు సమర్పించి గణపతిపూజ చేయవలెను. పిదప- ''ఓం మహోల్కాయ విద్మహే వక్రతుణ్డాయ ధీమహి తన్నో దన్తీ ప్రచోదయాత్'' అను మంత్రము జపించవలెను. భాద్రపదశుక్ల చతుర్థీదివసమున వ్రతము చేసినవాడు శివలోకమును పొందును. మంగళవారము కలిసిన చతుర్థినాడు. గణపతి పూజ చేసిన వాడు సకలాభీష్టవస్తువులు పొందును. ఫాల్గుణచతుర్థినాడు రాత్రి మాత్రమే భోజనము చేయవలెను. దీనికి ''అవిఘ్నాచతుర్థి'' అని పేరు. చైత్రచతుర్థినాడు దమనకపుష్పములతో గణపతి పూజ చేసినవాడు సుఖభోగములను పొందును. అగ్ని మహాపురాణమునందు చతుర్థీవ్రతకథనమును నూటడెబ్బది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.