Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ అష్టాదశోధ్యాయః స్వాయమ్భువవంశవర్ణనమ్ అగ్ని రువాచ : ప్రియవ్రతోత్తానపాదౌ మనః స్వాయమ్భువః సుతౌ | అజీజనత్సుతాం రమ్యాం శతరూపాం తపోన్వితామ్. 1 కామ్యాం కర్దమ భార్యాతః సమ్రాట్ కుక్షిర్విరాట్ ప్రభుః | స్వాయంభువమనువు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కుమారులను, తపఃవాలిని యగు శతరూప యను సుందరి యగు కుమార్తెను జనింపచేసెను. సురుచ్యాముత్తమో జజ్ఞీ పుత్ర ఉత్తానపాదతః 2 సునీత్యాం తు ధ్రువః పుత్రస్తపస్తే పే స కీర్తయే | ధ్రువో వర్షసహస్రాణి త్రీణి దివ్యాని హే మునే. 3 ఉత్తానపాదుని వలన సురుచియందు ఉత్తము డను పుత్రుడును, సునీతయందు ధ్రువు డను పుత్రుడును జనించిరి. ఓ మునీ ! ధ్రువుడు, కీర్తికొరకై, మూడు వేల దివ్యవర్షములపాటు తపస్సు చేసెను. తస్త్మె ప్రీతో హరిః ప్రాదాన్మున్యగ్రే స్థానకం స్థిరమ్ | శ్లోకం పపాఠ హ్యుశనా వృద్ధిం దృష్ట్వా స తస్య చ 4 అహో7స్య తపసో వీర్యమహో శ్రుతమహాద్భుతమ్ | యమద్య పురతః కృత్వా ద్రువం సప్తర్షయఃస్థితాః. 5 ఆతని విషయమున సంతసించిన విష్ణువు ఆతనికి సప్తర్షులకంటె ముందు స్థిర మైన స్థానము నిచ్చెను. ఆతని అభివృద్దిని చూచి ఉశనుడు ఒక శ్లోకమును (ప్రశంసావాక్యమును) చదివెను. ''ఈతని తపస్సుయొక్క ప్రభావము ఎంత గొప్పది! ఈతని శాస్త్రజ్ఞాన మెంత అద్భుత మైనది! సప్తర్షులు కూడ ఈతని తమ ఎదుట నిలుపుకొని యున్నారు కదా! తస్మాచ్ఛిష్టిశ్చ భవ్యశ్చ ధ్రువాచ్చమ్భుర్వ్యజాయత | శిష్టేరాదత్త సుచ్ఛాయా పఞ్చ పుత్రానకల్మషాన్. 6 రిపుం రిపుఞ్జయం రిప్రం వృకలం వృకతేజసమ్ | రిపోరాధత్త బృహతీ చాక్షుషం సర్వతేజసమ్. 7 ధ్రుపునకు శిష్ట, భవ్యుడు శంభవు అను కుమారులు జనించిరి. శిషికి సుచ్ఛాయవలన, రిపువు. రిపుంజయుడు, రిప్రుడు, వృకలుడు, వృకతేజసుడు అను పుణ్యాత్ములైన కుమారులు జనించిరి. రిపువుకు బృహతియందు చాక్షుషుడు, సర్వతేజసుడు అను పుత్రులు జనించిరి. అజీజనత్పుష్కరిణ్యాం వీరణ్యాం చాక్షుషో మనుమ్ | మనోరజాయన్త దశ నడ్వలాయాం సుతోత్తమాః. 8 ఊరుః పూరుః శతద్యుమ్నస్తపస్వీ సత్యవాక్కవిః | అగ్నిష్టురతిరాత్రశ్చ సుద్యుమ్నశ్చాతిమన్యుకః. 9 చాక్షుషుడు పుష్కరిణిలో, వీరణియందు మనువును జనింపచేసెను. మనువునకు, నడ్వలయందు ఊరుడు, పూరుడు, తపస్వి, సత్యవాక్కు, కవి, అగ్నిష్టుడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, అతిమన్యుకుడు అను పదిమంది సుతోత్తములు జనించిరి. ఊరోర్జనయత్పుత్రాన్ షడాగ్నేయా మహాప్రభాన్ | అఙ్గం సుమనసం స్వాతి క్రతు మఙ్గిరసం గయమ్. 10 ఊరునివలన ఆగ్నేయ అంగుడు, సుమనసుడు, స్వాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అను కాంతిమంతులగు ఆరుగురు కుమారులను కనెను. అఙ్గాత్సునీధాపత్యం వై దేనమేకం వ్యజాయత | అరక్షకః పాపరతః స మతో మునిబిః కుశెః. 11 అంగునకు సునీథుని కుమార్తెయందు రేను డను ఒక కుమారుడు జనించెను. పాపాసక్తుడై ప్రజారక్షణము చేయని ఆ వేనుని మునులు కుశములను ప్రయోగించి సంహరించిరి. ప్రజార్థమృషయో7థాస్య మమన్ధుర్దక్షిణం కరమ్ | వేనస్య మథితే పాణౌ సమ్బభూవ పృథుర్నృపః. 12 పిమ్మట మునులు సంతానము కొరకై వేనుని కుడిచేతిని మధించగా దానినుండి పృథుచక్రవర్తి జనించెను తం దృష్ట్వా మునయః ప్రాహురేష వె ముదితాః ప్రజాః | కరిష్యతి మమాతేజా యశశ్చ ప్రాప్స్యతే మహత్. మును లందరును ఆతనిని చూచి - ''మహాతేజశ్శాతి యైన ఇతడు ప్రజలను రంజింపచేయగలడు. గొప్ప కీర్తిని కూడ పొందగలడు'' అని పలికిరి. స ధన్వీ కవచీ జాతస్తేజసా నిర్దహన్నివ | పృథుర్వెన్యః ప్రజాః సర్వా రరక్ష క్షత్రపూర్వజః. 14 క్షత్రియుల పూర్వపురుషుడును, వైన్యుని కుమారుడును, తేజస్సుచే దహింపచేయుచున్నట్లు కనబడుచున్నవాడును అగు ఆ పృథువు దనస్సును, కవచమును ధరించి ప్రజ లందరిని రక్షించెను. రాజసూయాభిషి క్తానామాద్యః స పృధివీపతిః | తస్మాచైవ సముత్పన్నౌ నిపుణౌ సూతమాగధౌ. 15 తత్ స్తోత్రం చక్రతుర్వీరౌ రాజాభూజ్జనరఞ్జనాత్ | దుగ్ధా గౌస్తేన సస్యార్థం ప్రజానాం జీవనాయ చ 16 ఆ రాజు రాజసూయ యాగము చేసి అభిషేకము పొందిన వారిలో మొదటివాడు. ఆతని నుండి పుట్టిన-నేర్పరులైన వీరులైన సూతమాగథులు ఆతనిని స్తుతించిరి. ఆతడు ప్రజల జీవనమున కుపయోగించు సస్యములను సంపాదించుటకై భూమిని సిదికెను. సహ దేవ్తెర్మునిగణౖర్గన్ధర్వైః సాప్సరోగణౖః | పితృభిర్దానవైః సర్పైర్వీరుద్బిః పర్వతైర్జనైః. 17 తేషు తేషు చ పాత్రేషు దుహ్యమాన వసున్దరా | ప్రాదాద్యధేప్సితం క్షీరం తేన ప్రాణానధారయత్. 18 దేవతలును మునిగణములను, గంధర్వులును, అప్సరోగణములను, పితృదేవతలును, దానవులును, సర్పములును, లతలును, పర్వతములను, జనులును, ఆ యా పాత్రలలో పిదుకగా భూమి వారివారికి కావలసిన క్షీరము నిచ్చెను. దానిచే వారందరును ప్రాణధారణము చేసిరి. పృథోః పుత్రౌ తు ధర్మజ్ఞౌ జజ్ఞాతే7న్తర్థిపాలితా | శిఖణ్డినీ హవిర్దాన మన్తర్భాణ ద్వ్యజాయత. 19 హవిర్దానాత్ షడాగ్నేయీ ధిషణాజనయత్సుతాన్ | ప్రాచీనబర్హిషం శుక్రం గయం కృష్ణం ప్రజాజినౌ. 20 పృథుచక్రవర్తికి ఆంతర్ది, పాలితుడు అను ధర్మవేత లైన ఇరువురు కుమారులు నించిరి. శిఖండిని అంతర్ధ నుండి హవిర్ధాను దనెడు కుమారుని కనెను. అగ్ని పుత్రి యగు ధిషణ హవిర్దానుని వలన ప్రాచీనబర్హిస్సు, శుక్రుడు, గయుడు. కృష్ణుడు, వ్రజుడు, అజినుడు అను ఆరుగురు కమారులను కనెను. ప్రాచీనాగ్రాః కుశస్తస్య పృథివ్యాం యజతో యతః | ప్రాచీనబర్హిర్బగవాన్మహానాసీత్ ప్రజాపతిః. 21 యజ్ఞము చేయుచున్నప్పుడు కుశలు, వాటి అగ్రములు తూర్పు వైపున కుండు నట్లు భూమిపై పరవబడెను. అందుచే పూజ్యు డైన ఆ ప్రజాపతికి ''ప్రాచీన బర్హిస్సు'' అను పేరు వచ్చెను. సవర్ణా7ధత్త సాముద్రీ దశ ప్రాచీనబర్హిషః | సర్వే ప్రచేతసో నామ ధనుద్వేదస్య పారగాః. 22 సముద్రుని కుమార్తె యైన సవర్ణ ప్రాచీనబర్హిస్సువలన పదిమంది కుమారులను కనెను వారందరికిని ప్రచేతను లనియే పేరు. వారందరును ధనుర్వేదమునందు పరిపూర్ణప్రజ్ఞ కలవారు. అపృథగ్ధర్మచరణాస్తే7తప్యన్త మహత్తపః | దశ వర్షసహస్రాణి సముద్రసలిలేశయాః. 23 ఒకే విధముగా ధర్మము నాచరించుచున్న వారందరును సముద్ర జలమున నివసించి పది వేల సంవత్సరములు గొప్ప తపస్సు చేసిరి. ప్రజాపతిత్వం సంప్రాప్య తుష్టా విష్ణోశ్చనిర్గతాః | భూః ఖం వ్యాప్తం హి తరుబిస్తాంస్తరూనదహంశ్చ తే. ముఖజాగ్ని మరుద్భ్యాం చ దృష్ట్వాచాథ ద్రుమక్షయమ్ | ఉపగమ్యాబ్రవీదేతాన్రాజా సోమః ప్రజాపతీన్. 24 కోపం యచ్చత దాస్యన్తి కన్యాం వోమారిషాం వరామ్ | తపస్వినో మునేః కణ్డోః ప్రవ్లూెచాయం మయ్తెవ చ. భవిష్యం జానతా సృష్టా భార్యా వో7స్తు కులఙ్కరీ | అస్యాముతృద్యతే దక్షః ప్రజాః సంవర్దయిష్యతి. 26 వారు విష్ణువునుండి ప్రజాపతిత్వమును పొంది, సంతసించినవారై సముద్రజలమునుండి లేచిరి అపుడు భూమ్యాకాశములు వృక్షములచే వ్యాప్తములై యుండెను వారు తమ ముఖమునుండి పుట్టిన అగ్ని వాయువులచే ఆ వృక్షములను దహింపచేయ మొదలిడిరి. అపుడు రాజైన సోముడు ప్రజాపతుల దగ్గరికి వెళ్లి-- ''కోపమును ఉపసంహరింపుడు భవిష్యత్తును గూర్చి తెలిసిన నేను తపశ్శాలి యగ కండుముని కుమార్తె యైన ప్రవ్లూెచయందు ఉత్తమురాలగు మారిషయను కన్యను జనింపచేసితిని ఆమెను మీకు ఇచ్చెదరు. ఆమె మీ వంశమును వృద్ది పొందించు బార్య యగుగాక. ఆమెయందు పట్టిన దక్షుడు ప్రజలను వృద్దిపొందించును. ప్రచేతసస్తాం జగృహుర్దక్షో7స్యాం చ తతో7భవత్ | అచరాంశ్చచరాంశ్చైవ ద్విపదో7థ చతుష్పదః. 27 స సృష్ట్వా మనసా దక్షః పశ్చా ద సృజత స్త్రియః | రదౌ స దశ ధర్మాయ కశ్యపాయ త్రయోదశ. 28 సప్తవింశతిం సోమాయ చతస్రో7రిష్టనేమయే | ద్వే చైవ బహుపుత్రాయ ద్వే నై వాఙ్గిర సే హ్యదాత్. 29 తాను దేవశ్చ నాగాద్యా మైథునాన్మనసా పురా | ప్రచేతసులు ఆమెను స్వీకరించిరి. ఆమెకు దక్షుడును కుమారుడు జనించెను. ఆతడు మనస్సుచే స్థావరజంగమములకు, ద్విపాత్తులను (మనుష్యులు మొదలగువారిన) చతుష్పాత్తులను (నాలుగు కాళ్ళుగల పశ్వాదులను.) సృజించి పిమ్మట స్త్రీలను సృజించెను. వారిలో పదిమందిని యమధర్మరాజునకును, పదముగ్గురిని కశ్యపునకును, సోమునకు ఇరువది యేడుగురిని, అరిష్టనేమికి నలుగురిని, బహుపుత్రునకు ఇద్దరిని, ఆంగిరసునకు ఇద్దరిని ఇచ్చెను. పూర్వము వారియందు మానస మైథునముచే దేవతలును నాగాదులను జనించిరి. ధర్మసర్గం ప్రవక్ష్యామి దశపత్నీషు ధర్మతః. 30 విశ్వేదేవాస్తు విశ్వాయాః సాధ్యాన్సాధ్యావ్యజాయత | మరుత్త్వన్త్యా మరుత్త్వన్తౌ వసోస్తు వసవో7భవన్. 31 భానోస్తు బానవః పుత్రా ముహూర్తాస్తు ముహూర్తజాః | లమ్బాయా ధర్మతో ఘోషో నాగవీథీ చ యామిజా పృథివీ విషయం సర్వం మరుత్వత్యాం వ్యజాయత | సఙ్కల్పాయాస్తు సఙ్కల్పా ఇన్ధోర్నక్షత్రతః సుతాః. ఆపోధ్రువశ్చ సోమశ్చ ధరశ్చైవానలో7నలః | ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో7ష్టౌ చ నామతః. 35 యమధర్మరాజునకు తన పదిమంది భార్యలవలన కలిగిన సంతానమును గూర్చి చెప్పెదను. విశ్వకు విశ్వేదేవతలు, సాధ్యకు సాధ్యులు, మరుత్వలకి ఇద్దరు మరుత్వంవతులు, వసువునకు వసువులు భానువుకు బానువలు, ముహూర్తకు ముహూర్తులు, లంబకు ఘోషుడు, యామికి నాగవీధి, మరుత్వతికి పృథివీ సంబద్దమగు సకల వస్తుజాతము, సంకల్పకు సంకల్పులు జనించిరి. చంద్రునకు నక్షత్రముల వలన ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, ఎనమండుగురు వసువులను జనించిరి. ఆపస్య పుత్రో వై తణ్డ్యః శ్రమః శాన్తో మునిస్తధా | ధ్రువస్య కాలో లోకాన్తో వర్జాః సోమస్య వై సుతః. 36 ధరస్య పుత్రో ద్రవిణో హుతహవ్యవహ స్తథా | మనోహరాయాః శిశిరః ప్రాణోథ రమణ స్తథా. 37 పురోజవో7నిలస్యాసీ ధవిజ్ఞాతో7నలస్య చ | అగ్నిపుత్రః కుమారశ్చ శరస్తమ్బే వ్యజాయత. 38 తస్య శాఖో విశాఖశ్చ నైగమేయశ్చ పృష్ఠజః | కృత్తికాతః కార్తికేయో యతిః సనత్కుమారకః. 39 ఆపుని కుమారులు వైతండ్యుడు, శ్రముడు, శాంతుడు, ముని అనువారు. లోకాంతుడైన కాలుడు ధ్రువుని కుమారుడు. వర్చసుడు సోముని కుమారుడు. ద్రవిణుడు, హుతహవ్యవహుడు శిశిరుడు, ప్రాణుడు, రమణుడు అనువారు ధరునికి మనోహరయ దు కుమారులుగా జనించిరి. అనిలుని కుమారుడు పురోజపుడు. అనలుని కుమారుడు అవిజ్ఞాతుడు. కుమారుడు అగ్నిపుత్రుడుగా శరస్తంబమునందు జనించెను. ఆతని తరువాత శాఖుడు, విశాఖుడు, నైగమేయుడును పట్టిరి కృత్తిక నుండి కార్తి కీయుడును, యతియైన సనత్కుమారుడును పుట్టిరి. ప్రత్యూషాద్దేవలో జజ్ఞే విశ్వకర్మా ప్రభాయుతః | కర్తా శిల్పసహస్రాణాం త్రిదశానాం చ వర్దకిః. 40 మనుష్యాశ్చోపజీవన్తి శిల్పం వై భూషణాదికమ్ | వేలకొలది శిల్పములను చేయువాడును, దేవతల వడ్రంగియు, కాంతిమంతుడును ఆగు విశ్వకర్మయను దేవలుడు ప్రత్యుషునినుండి జనించెను. మనుష్యులు భూషణాది శిల్పములను జీవనాధారముగా చేసి కొనుచుందురు. సురభీ కశ్యపాద్రుద్రానేకాదశ విజజ్ఞుషీ. 41 మహాదేవప్రసాదేన తపసా భావితా సతీ | అజైకపాదహిర్బుధ్న్య స్త్వష్టా రుద్రశ్చ సత్తమ. 42 త్వష్టుశ్చైవాత్మజః శ్రీమాన్విశ్వరూపో మహాయశాః | హరశ్చ బహురూపశ్చ త్ర్యమ్బకశ్చాపరాజితః 43 వృషాకపిశ్చ శమ్బుశ్చ కపర్దీ రైవత స్తథా | మృగవ్యాధశ్చ సర్పశ్చ కపాలీ దశ చై కకః. 44 రుద్రాణాం చ శతం లక్షం యైర్వ్యాప్తం సచరాచరమ్ | ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే స్వాయమ్భువ మనువంశవర్ణనం నామాష్టదశో7ధ్యాయః సురభి తపస్సుచే పవిత్రీకృతురాలై, మహాదేవుని ప్రసాదముచే ఏకాదశరుద్రులను కనెను. మేక పాదము వంటి ఒక పాదము గల అహిర్బుధ్న్యుడు, త్వష్టయను రుద్రుడు, బహురూపుడు, హరుడు, పరాజితుడు కాని త్ర్యంబకుడు, వృషాకమియు, కపర్ద (జటా) ధారియగు శంభువు, రైవతుడు, మృగవ్యాధుడు, సర్పుడు, పదకొండవవాడైన కపాలియు, చరాచర జగుత్తును వ్యాపించిన కోట్లకొలది రుద్రులు జనించిరి. శ్రీమంతుడును, మహా యశః శాలియు అగు విశ్వరూపుడు త్వష్ట కుమారుడు. అగ్ని మహాపురాణములో స్వాయంభువమనువంశకర్ణన మన అష్టాదశాధ్యాయము సమాప్తము.