Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ఏకనవత్యుత్తర శతతమోధ్యాయః అథ త్రయోదశీవ్రతాని అగ్నిరువాచ : త్రయోదశీవ్రతానీహ సర్వదాని వదామి తే | అనఙ్గేన కృతామాదౌ వక్ష్యే೭నఙ్గత్రయోదశీమ్. 1 త్రయోదశ్యాం మార్గశీర్షే శుక్లే೭నఙ్గం హరం యజేత్ | మధు సంప్రాశ##యేద్రాత్రౌ ఘృతహోమస్తిలాక్షతైః. పౌషే యోగీశ్వరం ప్రార్చ్య చన్దనాశీ కృతాహుతిః | మహేశ్వరం మౌక్తికాశీ మాఘే೭భ్యర్య్చ దివం వ్రజేత్. 3 కాకోలం ప్రాశ్య నీరం తు ఫాల్గునే పూజయేద్ర్వతీ | కర్పూరాశీస్వరూపం చ చైత్రే సౌభాగ్యవాన్ భ##వేత్. 4 మహారూపం తు వైశాఖే యజేజ్జాతీఫలాశ్యపి | లవఙ్గాశీ జ్యేష్ఠదినే ప్రద్యుమ్నం పూజయేద్వ్రతీ. 5 తిలోదాశీ తథాషాడే చోమాభర్తారమర్చయేత్ | శ్రావణ గన్ధతోయాశీ పూజయేచ్ఛూలపాణినమ్. 6 సద్యోజాతం భాద్రపదే ప్రాశితా గురుమర్చయేత్ | సువర్ణవారి సంప్రాశ్య హ్యాశ్వినేత్రిదశాధిపమ్ 7 విశ్వేశ్వరం కార్తికే తు మదనాశీ యజేద్ర్వతీ | శివం హైమం తు వర్షాన్తే సంఛాద్యామ్రదలేన తు. 8 వస్త్రేణ పూజయిత్వా తు దద్యాద్విప్రాయ గాం తథా | శయనం ఛత్రకలశాన్ పాదుకారసభాజనమ్. 9 త్రయోదశ్యాం సితే చైత్రే రతిప్రీతియుతం స్మరన్ | అశోకాఖ్యం నగం లిఖ్య సిన్దూరరజనీముఖైః. 10 అబ్ధం యజేత్తు కామార్ధీ కామత్రయోదశీ వ్రతమ్ | ఇత్యాది మహాపురాణ ఆగ్నియే త్రయోదశీవ్రతాని నామైకనవత్యధిక శతతమో೭ధ్యాయః. అగ్నిదేవుడు చెప్పెను : ఇపుడు అన్నింటిని ఇచ్చు త్రయోదశీతిథివ్రతములను గూర్చి చెప్పెదను. మొదట అసంగత్రయోదశీవ్రతమును గూర్చి చెప్పెదను. పూర్వము అనంగుడు (మన్మథుడు) ఈ వ్రతము చేసెను. మార్గశీర్షశుక్ల త్రయోదశినాడు కామదేవస్వరూపుడగు హరుని పూజించవలెను. రాత్రి మధువు భుజించి తిలాక్షత మిశ్రఘృతము హోమము చేయవలెను. పౌషమాసమున యోగేశ్వరుని పూజించి మౌక్తికజలాహారము చేయవలెను. ఇట్లు చేసినవాడు స్వర్గము పొందును. ఫాల్గునమున వీరభద్రుని పూజించి కంకోలమును భుజించవలెను. చైత్రమున సురూపుని పూజించి కర్పూరాహారము తీసికొనువాడు సౌభాగ్యయుక్తు డగును. వైశాఖమున మహారూపుని పూజించి జాయఫలము భుజించవలెను. జ్యేష్ఠమున ప్రద్యుమ్నుని పూజించి లవంగము భక్షించవలెను. ఆషాఢమున ఉమాపతిని పూజించి తిలమిశ్రజలము త్రాగవలెను. శ్రావణమున శూలపాణిని పూజించి సుగంధితమగు జలము త్రాగవలెను భాద్రపదమున అగురు భక్షించి సద్యోజాతుని పూజించవలెను. #9; ఆశ్వయుజమున త్రిదశాధిపు డగు శంకరుని పూజించి స్వర్ణజలము త్రాగవలెను. కార్తికమున విశ్వేశ్వరుని అర్చించి లవణము భక్షించవలెను, ఈ విధముగ సంవత్సరము పూర్తియైన పిమ్మట సువర్ణనిర్మిత శివలింగమును మామిడాకులు, వస్త్రములు, కప్పి, గోవు, శయ్య, ఛత్రము, కలశము, పాదుకలు, రసపూర్ణపాత్రములు గూడ దానము చేయవలెను. చైత్ర శుక్లత్రయోదశిబాడు అశోక వృక్షమునకు సిందూరము, కాటుక పూసి, దాని మూలమున రతి - ప్రీతిసమేతు డగు కామదేవుని స్మరించవలెను. కామ్యములు కోరువాడు ఈ విధముగ ఒక సంవత్సరము కామదేవుని పూజించవలెను. ఇదియే ''కామత్రయోదశీవ్రతము'' అగ్నిమహాపురాణమునందు త్రయోదశీవ్రతవర్ణన మను నూటతొంబదియొకటవ అధ్యాయము సమాప్తము.