Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ చతురధిక ద్విశతతమో7ధ్యాయః అథ మాసోపవాసవ్రతమ్ అగ్నిరువాచ : వ్రతం మాసోపవాసం చ సర్వోత్కృష్టం వదామితే | కృత్వా తు వైష్ణవం యజ్ఞం గురోరాజ్ఞామవాప్య చ. కృచ్ఛ్రాద్యైః స్వబలం బుద్ధ్వా కుర్యాన్మాసోపవాసకమ్ | వానప్రస్థో యతిర్వాథ నారీ వా విధవా మునే. 2 అగ్నిదేవుడు చెప్పెను : వసిష్ఠ మహామునీ! ఇప్పుడు అన్నింటికంటెను ఉత్తమమైన మాసోపవాస వ్రతమును గూర్చి చెప్పదను. వైష్ణవయజ్ఞము చేసి, ఆచార్యుని ఆజ్ఞ గైకొని, కృచ్ర్ఛాదివ్రతములను ఆచరించుట ద్వారా తన శక్తిని పరీక్షించుకొని, మాసోపవాసవ్రతము చేయవలెను. వానప్రస్థుడు, సంన్యాసి, విధవయగు స్త్రీ ఈ వ్రతము చేయవలెను. ఆశ్వినస్యామలే పక్షే ఏకాదశ్యాముపోషితః | వ్రతమేతత్తు గృహ్ణీయాద్యావత్త్రింశద్ధినాని తు. 4 అద్య ప్రభృత్యహం విష్ణో యావదుత్థానకం తవ | అర్చయే త్వామనశ్నన్ హి యావత్త్రింశద్దినాని తు. 5 కార్తిక్యాశ్వినియోర్విష్ణోర్యావదుత్థానకం తవ | మ్రియే మధ్యన్తరాలే7హం వ్రతభఙ్గో న మే భ##వేత్. 6 త్రికాలం పూజయేద్విష్ణుం త్రిః స్నాతో గన్దపుష్పకైః | విష్ణోర్గీతాదికం జప్యం ధ్యానం కుర్యాద్వ్రతీ నరః. వృథానాదం పరిహరేదర్థాకాఙాం వివర్జయేత్ | నావ్రతస్థం స్పృశేత్కఞ్చిద్వికర్మస్థాన్న చాలపేత్. 7 దేవతాయతనే తిష్ఠేద్యావత్త్రింశద్దినాని తు | ద్వాదశ్యాం పూజయిత్వా తు భోజయిత్వా ద్విజాన్ వ్రతీ. 8 సమాప్య దక్షిణాం దత్త్వా పారణం తు సమాచరేత్ | భుక్తిముక్తిమవాప్నోతి కల్పాంశ్చైవ త్రయోదశ. 9 ఆశ్వయుజశుక్లఏకాదశివాడు ఉపవాస ముండి ముప్పదిదివసములకై ఈ క్రింది విధముగ సంకల్పించి మాసోపవాసవ్రతమును గ్రహించవలెను : ''ఓ! మహావిష్ణూ! నేను ఈ దినము మొదలు ముప్పది దినములు నీ ఉత్థానముపర్యంతము నిరాహారుడుగా ఉండి నిన్ను పూజింజెదను. సర్వవ్యాపి వైన ఓ హరీ! ఆశ్వయుజశుక్లఏకాదశి మొదలు నీ ఉత్థానకాల మైన కార్తికశుద్ధఏకాదశి లోగా నేను మరణించినను, నీ కృపచే వ్రతంభగము కాకుండుగాక'' వ్రతము నాచరించువాడు దినమున మూడు పర్యాయములు స్నానము చేయుచు, సుగంధద్రవ్యములతోను, పుష్పములతోను, ప్రాతఃకాలమునను, మధ్యాహ్నముందును, సాయంకాలమునందును శ్రీ మహావిష్ణువును పూజించవలెను. తత్సంబంధి-గాన-ధ్యాన-జపాదులు చేయవలెను. వ్యర్థాలాపములను విడువలెను. ధనాశ పరిత్యజించవలెను. వ్రతహీను నెవ్వనిని స్పృశింపరాదు. శాస్త్రనిషిద్ధ కర్మ నాచరించువారిని ప్రేరేపించరాదు. ముప్పది దివసముల పాటు దేవాలయమునందే నివసించవలెను. వ్రతము చేయువాడు కార్తికశుక్లద్వాదశినాడు శ్రీమహావిష్ణువును పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి, వారికి దక్షిణ లిచ్చి, తాను కూడ పారణము చేసి, వ్రతసమాప్తి చేయవలెను. ఈ విధముగ పదమూడు మాసోపవాసములు చేసినవాడు భుక్తిముక్తులను రెండింటిని పొందును. కారయేద్వైష్ణవం యజ్ఞం యజేద్విప్రాంస్త్రయోదశ | తావన్తి వస్త్రయుగ్మాని భాజనాన్యాసనాని చ. 10 ఛత్రాణి సపవిత్రాణి తథోపానద్యుగాని చ | యోగపట్టోపవీతాని దద్యాద్విప్రాయ తైర్మతః 11 పిదప వైష్ణవ యజ్ఞము చేసి (పదముగ్గురు బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారి ఆజ్ఞచే) ఒక బ్రాహ్మణునకు పదమూడు ఉత్తరీయములను, పదమూడు అధోవస్త్రములను, పాత్ర-ఆసన-ఛత్ర-పవిత్ర-పాదుకా-యోగపట్ట-యజ్ఞోపవీతములను దానము చేయవలెను. అన్యవిప్రాయ శయ్యాయాం హైమం విష్ణం ప్రపూజ్య చ | ఆత్మనశ్చ తథా మూర్తిం వస్త్రాద్యైశ్చ ప్రపూజయేత్. 12 సర్వపాపవినిర్ముక్తో విప్రో విష్ణుప్రసాదతః | విష్ణులోకం గమిష్యామి విష్ణురేవ భవామ్యహమ్. 13 వ్రజ వ్రజ దేవ బుద్దే విష్ణోః స్థానమనామయమ్ | విమానేనామల స్తత్ర తిష్ఠేద్వష్ణుస్వరూపధృక్. 14 ద్విజానుక్త్వాథ తాం శయ్యాం గురవే7థ నివేదయేత్ | కులానాం శతముద్ధృత్య విష్ణులోకం నయేద్వ్రతీ. మాసోపవాసీ యద్దేశే స దేశో నిర్మలో భ##వేత్ | కింపునస్తత్కులం సర్వం యత్ర మాసోపవాసకృత్. 16 వ్రతస్థం మూర్ఛితం దృష్ట్వా క్షీరాజ్యం చైవ పాయయేత్| నైతే వ్రతం వినిఘ్నన్తి హవిర్విప్రానుమోదితమ్.17 క్షీరం గురోర్హితౌషధ్య ఆపో మూలఫలాని చ | విష్ణుర్మహౌషధం కర్తా వ్రతమస్మాత్సముద్ధరేత్. 18 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మాసోపవాస వ్రతం నామ చతురధికద్విశతతోమో7ధ్యయః. పిదప శయ్యపై తన ప్రతిమను, సువర్ణమయమగు మహావిష్ణు ప్రతిమను పూజించి వాటిని మరొక బ్రాహ్మణునకు దానము చేసి, ఆతనిని వస్త్రాదులచే సత్కరించవలెను. ''నేను సర్వపాపవిముక్తుడనై, బ్రాహ్మణ శ్రీమహావిష్ణు ప్రసాదముచే విష్ణులోకమునకు వెళ్ళగలను'' అని ఆతడు పలుకగా బ్రాహ్మణులు ''ఓ దేవత్మకా! నీవు రోగశోకరహిత మగు విష్ణులోకమునకు వెళ్ళి, అచట విష్ణురూపధారివై విమానమున విరాజిల్లును' అని పలుకవలెను. పిదప వ్రతము నాచరించినవాడు ద్విజులకు నమస్కరించి, ఆ శయ్యను ఆచార్యునకు ఇచ్చివేయవలెను. ఈవిధముగ వ్రత మాచరించిన వాడు తన నూరు కులములను ఉద్ధరించి వారిని కూడ విష్ణులోకమును తీసికొని వెళ్ళును. మాసోపవానము చేయువాడు నివసించు దేశము పాపరహితమై యుండును, మాసోపవాసవ్రతానుష్ఠానము చేసినవాడు పుట్టి కులము మాట చెప్పవలెనా? వ్రతము నాచరించు వాడు మూర్ఛ చెందినచో అతనికి నెయ్యి కలిపిన పాలు త్రాగించవలెను. ఈ క్రింద చెప్పిన పదార్థములు వ్రతభంగకరములు కావు-బ్రహ్మణుని అనుమతిచే గ్రహించిన హవిస్సు, ఆచార్యుని అనుజ్ఞచే గ్రహించిన ఓషధి, ఫలము, మూలము ఫలము. ఈ వ్రతమునందు ''శ్రీమహావిష్ణువే మహౌషధిస్వరూపుడు'' అను విశ్వాసముతో వ్రత మాచరించు వాడు వ్రతమును సమాప్తి చేయగలడు. అగ్ని మహాపురాణమునందు మాసోపవాసవ్రతవర్ణన మను రెండవందలనాల్గవ అధ్యాయము సమాప్తము.