Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ సప్తోత్తరద్విశతతమో7ధ్యాయః

అథ కౌముదవ్రతమ్‌

అగ్నిరువాచ :

కౌముదోక్తం మయోక్తం చ చరేదాశ్వయుజే సితే | హరిం యజేన్మాసమేకమేకాదశ్యాముపోషితః. 1

ఆశ్వినే శుక్లపక్షేహమేకాహారో హరిం జపన్‌ | మాసమేక భుక్తిముక్త్యై కరిష్యే కౌముదం వ్రతమ్‌. 2

ఉపోష్య విష్ణుం ద్వాదశ్యాం యజేద్దేవం విలిప్య చ | చన్దనాగురుకాశ్మీరైః కమలోత్పలపుష్పకైః. 3

కహ్లారైర్వాథ మాలత్యా దీపం తైలేన వాగ్యతః | అహోరాత్రం చ నైవేద్యం పాయసాపూసమోదకైః 4

ఓం నమో వాసుదేవాయ విజ్ఞాప్యాథ సమాపయేత్‌ | భోజనాది ద్విజే దద్యా ద్యావద్దేవః ప్రబుధ్యతే. 5

తావన్మాసోపవాసః స్యాదధికం ఫలమప్యతః

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే కౌముదవ్రతం నామ సప్తాధికద్విశతతమో7ధ్యాయః.

అగ్నిదేవుడు చెప్పెను : ఇపుడు కౌముద వ్రతమును గూర్చి చెప్పెదను. దీనిని ఆశ్వయుజ శుక్లపక్షమునందు ప్రారంభించవలెను. వ్రతము చేయువాడు ఏకాదశీదివసమున ఉపవాసము చేసి ఒక మాసము శ్రీమహావిష్ణువును పూజించవలెను "నేను ఆశ్వయుజశుక్లపక్షమునందు ఒక పూట మాత్రమే భోజనము చేయుచు శ్రీమన్నారాయణుని మంత్రము జపించుచు, భుక్తిముక్తిప్రాప్తికొరకై ఒక మాసము పర్యంతము కౌముదవ్రతమును అనుష్ఠించెదను." అని సంకల్పించవలెను. వ్రతము సమాప్తమైన పిదప ఏకాదశీదివసమున ఉవవాసము చేసి ద్వాదశీసమయమున శ్రీమహావిష్ణువును పూజించవలెను. శ్రీ మహావిష్ణువు విగ్రహముపై చందనము, అగరు, కేసరములు, అనులేపనము చేసి, కమల-ఉత్పల-కహ్లార-మాలతీపుష్పములతో విష్ణువును పూజించవలెను. వాక్సంయమముతో తైలపూర్ణదీపము వెలిగించి, రెండు వేళలయందును పాయసము, అపూపములు, లడ్డులు నైవేద్యము చేయవలెను. "ఓం నమో భగవతే వాసుదేవాయ" అను ద్వాదశాక్షరమంత్రమును నిరంతరము జపించవలెను. పిదప బ్రహ్మణభోజనము చేయించి క్షమాప్రార్థనాపూర్వకముగ వ్రతవిసర్జనము చేయవలెను. దేవజాగరణీ ఏకాదశి వరకు, ఒకమాసము ఉపవాసము చేయుటచే కౌముద ప్రతము పూర్ణమగును. పూర్వోక్తమాసోపవాసము గూడ ఇన్ని దినములే జరుగును కాని ఈ కౌముదవ్రతముచే దానికంటె అధికఫలము లభించును.

అగ్నిహామపురాణమునందు కౌముదవ్రతవర్ణనమను రెండువందల ఐదవఅధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters