Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ చతుర్వింశో7ధ్యాయః 24 అథ కుణ్డనిర్మాణాగ్ని కార్యాదివిధిః నారద ఉవాచ : అగ్నికార్యం ప్రవక్ష్యామి యేన స్యాత్సర్వకామభాక్ | చతురభ్యధికం వింశమజ్గులం చతురస్రకమ్ 1 సూత్రేణ నూత్రయిత్వా తు క్షేత్రం తావత్ఖనీత్సమమ్ | ఖాతస్య మేఖలాః కౌర్యాస్తక్త్యా చైవాజ్గులద్వాయం 2 సత్ఞ్వాదిసంజ్తాః పూర్వాస్యాద్ధ్వాదశాజ్గులముచ్ఛ్రితాః | అష్టాజ్గులా ద్వ్యజ్గులాథ చతురజ్గులవిస్తృతా. 3 యోనిర్దశాజ్గులా రమ్యా షట్‌చతుర్ద్వ్యజ్గులాగ్రగా | క్రమాన్నిమ్నా తు కర్తవ్యా పశ్చిమాశావ్యవస్థితా. 4 అశ్వత్థపత్రసదృశీ కిఞ్చిత్కుణ్డనివేశితా | తుర్యాజ్గులాయతం నాలం పఞ్చదశాజ్గులాయతమ్. 5 మూలన్తు త్య్రజ్గులం యోన్యా అగ్రం తస్యాః షడజ్గులమ్ | లక్షణం చై కహస్తస్య ద్విగుణం ద్వికరాదిషు. 6 నారదుడు పలికెను: అన్ని కోరికలను తీర్చు అగ్నికార్యమును చెప్పెదను. ఇరవైనాలుగు అంగుళముల చతురస్ర క్షేత్రమును సూత్రముతో కొలచి సమముగా అంతటను సమముగా త్రవ్వవలెను. ఆ విధముగా త్రవ్వినదానికి రెండంగుళములు విడచి మేఖలలు (ఒడ్డాణము వంటి కట్లు) చేయవలెను. సత్త్వము మొదలగు పేర్లుగల ఆ మేఖలలు పూర్వాభిముఖములు గాను, పండ్రెండు అంగుళములు ఎత్తు కలవిగా ఉండవలెను. ఒకటి ఎనిమిది అంగుళముల విస్తారము కలది, రెండవది రెండు అంగుళములు విస్తారము కలది, మూడవది నాలగు అంగుళముల విస్తారము కలది అయి ఉండవలెను. పది అంగుళముల రమ్యమైన యోని ముందు వైపు వరుసగా ఆరు-నాలుగు-రెండు అంగుళములు ఎత్తు ఉండవలెను. పడమట నున్న దానిని క్రమముగా లోతుగా నుండు నట్లు చేయవలెను. రావి ఆకు ఆకారములో నున్న దానిని కొద్దిగా కుండములోనికి చేర్చి నిర్మింపవలెను. దాని నాళము నాలుగు, ఐదు, పది అంగుళాల పొడవు ఉండవలెను. ఆ యోనియొక్క మూలము మూడు అంగుళములు, దాని అగ్రము ఆరు అంగుళములు ఉండవలెను. ఏకహస్తకుండలక్షణము ద్విహస్తకుండాదుల విషయమున రెట్టింపు అగుచుండును. ఏకత్రిమేఖలం కుణ్డం వర్తులాది వదామ్యహమ్ | కుణ్డార్ధే తు స్థిరం సూత్రం కోణ యదతిరిచ్యతే. 7 తదర్దం దిశి సంస్థాప్య భ్రామితం వర్తులం భ##వేత్ | ఒక మేఖల, మూడు మేఖలలు గల వర్తులాదికుండములను గూర్చి చెప్పెదను. కుండము యొక్క అర్థమునందు సూత్రము నుంచగా కోణమునందు మిగిలిన ఆ సూత్రములోని అర్ధమును దిక్కునందుంచి త్రిప్పినచో అది వర్తుల మగును. 7 కుణ్డార్ధం కోణభాగార్దం దిశా చోత్తరతో బహిః 8 పద్మాకారే దలాని స్యుర్మేఖలాయాంతు వర్తులే. పూర్వపశ్చిమతో యత్నల్లాఞ్ఛయిత్వా తు మధ్యతః | సంస్థాప్య భ్రామితం కుణ్డమర్థచన్ద్రం భ##వేచ్ఛుభమ్. 9 కుండార్ధమును మించిన కోణభాగార్ధమును బయట ఉత్తరభాగమున పెంచి పూర్వపశ్చిమములు వైపు బైటకు చాపి మద్యమునందు ఉంచి సూత్రము త్రిప్పినచో అర్ధచంద్రాకార మైన శుభకరమైన కుండము ఏర్పడును. పద్మాకారమైన వర్తులకుండమునందు మేఖలయందు దలము లుండును. బాహుదణ్డప్రమాణన్తు హోమార్థం కారయే త్సృచమ్. 10 సప్తపఞ్చాజ్గులం వాపి చతురస్రం తు కారయేత్ | త్రిభాగేన భ##వేద్గర్తం మధ్యే వృత్తం సుశోభనమ్. 11 తిర్యగూర్ధ్వం సమం ఖాత్వా బహిరర్ధం తు శోధయేత్ | అఙ్గులస్య చతుర్థాంశం శేషార్ధార్ధం తథాన్తతః 12 ఖాతస్య మేఖలాం రమ్యాం శేషార్దేన తు కారయేత్ | కణ్ఠం త్రిభాగవిస్తార మఙ్గుష్ఠక సమాయతమ్. 13 సార్దమఙ్గుష్ఠకం వా స్యాత్తదగ్రే తు ముఖం భ##వేత్ | చతురజ్గుల విస్తారం పఞ్చాఙ్గుషలమథాపి వా. 14 త్రికం ద్వ్యఙ్గులకం తత్స్యాన్మధ్యం తస్య సుశోభనమ్ | ఆయామస్తత్సమ స్తస్య మధ్య నిమ్నః సుశోభనః. సుషిరం కణ్ఠదేశే స్యాద్విశేద్యావత్కనీయసీ | శేషం కుణ్డం తు కర్తవ్యం యథారుచి విచిత్రితమ్ . 16 హోమము చేయుటకై చేయు ప్రమాణము లేదు పండ్రెండు అంగుళముల ప్రమాణము గల సృక్కును చేయించవలెను. దాని మూలభాగము చతురస్రముగా ఏడు లేదా ఐదు అంగుళములు ఉండవలెను. దాని మధ్యయందు త్రిభాగమున అందమైన, వర్తులాకార మైనగర్తము (గొయ్యి) ఉండవలెను. అడ్డముగా, పై భాగమున సమముగా ఆ గర్తము నిర్మించి పైన అర్ధాంగుళ భాగమును శోధించవలెను. (చెక్కి నున్నగా చేయవలెను). నాల్గవ వంతు అంగుళమును మిగిలిన అర్ధములో అర్థమును కూడ శోధించవలెను. మిగిలిని అర్ధముచే గుర్తమునకు రమ్యమైన మేఖలను ఏర్పరుపవలెను. త్రిభాగవిస్తారము కలదియు, అంగుష్ఠ మంత ఆయతు మైనదియు అగు కంఠమును చేయవలెను. దాని అగ్రమునందు నాలుగు లేదా ఐదు అంగుళముల ప్రమాణము గల ముఖ ముండవలెను. దాని మధ్యము ఆరు అంగుళముల ప్రమాణ ముండవలెను. దాని ఆయామము కూడా అంతయే ఉండి మధ్యమున పల్లమై అందముగా ఉండవలెను. దాని కంఠదేశమునందు చిటికెనవ్రేలు ప్రవేశించు నంత రంధ్ర ముండవలెను. మిగిలిన కుండము ( స్రుక్కు/ముఖము) అభిరుచి ననుసరించి విచిత్రముగ చేయవలెను. స్రువం తు హస్తమాత్రం స్యాద్ధణ్డకేన సమన్వితమ్ | వటుకం ద్వ్యజ్గులం వృత్తం కర్తవ్యం తు సుశోభనమ్. గోపదం తు యథా మగ్నమల్పపఙ్కే తథా భ##వేత్ | స్రువము దండముతో సహా చేయి పొడ వుండవలెను. కొంచెము పంకమునందు ఆవు పాదము దిగిన లోతు ఎంట్లుండులో ఆ విధముగా అందమైన, రెండు అంగుళముల వృత్తము చేయవలెను. ఉపలిప్య లిఖేద్రేఖామజ్గులాం వజ్రనాసికామ్. 18 సౌమ్యాగ్రాం ప్రథమాం తస్యాం రేఖే పూర్వముఖే తయోః | మధ్యే తిస్ర స్తథా కూర్యాద్దక్షిణాది క్రమేణ తు. అగ్నికుండమును అలికి, అంగుళముప్రమాణము గల వజ్రనాసికాలేఖను గీయవలెను. అది ఉత్తరాగ్ర మగు మొదటి రేఖ. దానిపై పూర్వాభిముఖములైన రెండు రేఖలు గీయవలెను. వాటి మధ్య దక్షిణాదిక్రమమున మూడు రేఖలు గీయవలెను. అలంకృత్వా మూర్తిమతీం క్షిపేదగ్నిం హరిం స్మరన్. ఏవముల్లిఖ్య చాభ్యుక్ష్య ప్రణవేన తు మన్త్రవిత్ | విష్టరం కల్పయేత్తేన తస్మిన్ శక్తిం తు వైష్ణవీమ్ 20 మంత్రవేత్త ఈ విధముగా రేఖలు గీసి, ప్రణవ ముచ్చరించును నీళ్ళు చల్లి, ఓంకారము నుచ్చరించుచు పీఠమును కల్పించి దానిపై మూర్తిమతి యాగు వైష్ణవీశక్తిని అలంకరించి, విష్ణువును స్మరించుచు అగ్నిని ఉంచవలెను. ప్రాదేశమాత్రాః సమిధో దత్త్వా పరిసముహ్య తమ్. 21 దర్భైస్త్రిధా పరిస్తీర్య పూర్వాదౌ తత్ర పాత్రకమ్ | అసాదయేదిధ్మవహ్ని భూమౌ చ స్రుక్‌స్రుమద్వయమ్. 22 జానెడు పొడవు గల సమిధల నుంచి ఆ అగ్నిని ప్రజ్వలింపచేసి పూర్వాదిదిక్కులందు దర్భలు మూడు విధములుగా (చుట్టూ) పరచి, వాటిపై పాత్రను, ఇధ్మమును వహ్నిని సమీపమున నుండు నట్లు చేసి స్రుక్కున, స్రువమును భూమిపై ఉంచవలెను. అజ్యాస్థాలీం చరుస్థాలీం కుశాజ్యం చ ప్రణీతయా | ప్రోక్షయిత్వా ప్రోక్షణీం చ గృహీత్వా పూర్వ వారిణా. 23 పవిత్రాన్తర్హితే హస్తే పరిస్రావ్య చ తజ్జలమ్ | ప్రాజ్నీత్వా ప్రోక్షణీపాత్రం జ్యోతిరగ్రే నిధాయ చ. 24 éతదద్భిస్త్రిశ్చ సంప్రోక్ష్య ఇధ్మం విన్యస్య చాగ్రతః | ప్రణీతాయం సపుష్పాయాం విష్ణుం ధ్యాత్వోత్తరేణ చ. 25 ఆజ్యస్థాలీమథాజ్యేన సంపూర్యాగ్రే నిధాయ చ | సంప్లవోత్పవనాభ్యాం తు కుర్యాదాజ్యస్య సంస్కృతిమ్. 26 అఖణ్డితాగ్రౌ నిర్గర్భౌ కుశౌ ప్రాదేశమాత్రకౌ | తాభ్యాముత్తానపాణిభ్యామఙ్గుష్ఠానామికే నతే. 27é ఆజ్యాస్థాలిని, చరుస్థాలిని, కుశాజ్యమును ప్రణీతచే ప్రోక్షించి, ప్రోక్షిణిని గ్రహించి దానిని నీటితో నింపి, ఆ నీటిని పవిత్రముచే కప్పబడిన హస్తమునందు జారవిడిచి, ప్రోక్షణీపాత్రమును తూర్పుగా తీసికొని వెళ్ళి, దానిని అగ్నికీ ఎదురుకుగా ఉంచి, దానిని ఉదకముచే మూడు సార్లు ప్రోక్షించి, ఎదుట నుంచి, ఉత్తరమున పుష్పలముతో కూడిన ప్రణీతపై విష్ణువును ధ్యానించి, ఆజ్యసాత్రను ఆజ్యముతో నింపి ఎదుట ఉంచి, తెగని చిగుళ్ళు గల, గర్భము లేని జానెడు పొడవైన రెండు కుశములను వెల్లగితల చేయబడిన హస్తములచే బొటనవ్రేలితోను అనామికతోను పట్టుకొని, వాటిని నేతలో ఇటు నటు త్రిప్పినేతిని సంస్కరించవలెను. ఆజ్యం తయోస్తు సంగృహ్య ద్విర్నీత్యా త్రిరవాజ్‌క్ష పేత్ | స్రక్స్రువౌ చాపి సంగృహ్య తాభ్యాం ప్రక్షిప్య వారిణా. 28 ప్రతప్య దర్భైః సంమృజ్య పునః ప్రక్షాల్య చైవ హి | నిష్టప్య స్థాపయిత్వాతు ప్రణవేనైవ సాధకః 29 ప్రణవాదినమోన్తేన పశ్చాద్దోమం సమాచరేత్ | వాటి ఆజ్యమును సంగ్రహించి, రెండు పర్యాయములు తీసి, మూడు పర్యాయములు క్రిందికి చిమ్మవలెను. వాటితో స్రుక్స్రువములను గ్రహించి, నీటిచే తడిపి, వెచ్చచేసి, దర్భలచేత తుడిచి, మరల కడిగి, వెచ్చచేసి, ఓంకారము నుచ్చరించుచు క్రింద ఉంచి, సాధకుడు, పిమ్మట ఓంకారము మొదట ఉచ్చరించుచు, చివర 'నమః' అని లనుచు పిమ్మట హౌమము చేయవలెను. గర్భాధానాదికర్మాణి యావదంశవ్యవస్థయా. 30 నామాన్తం ప్రతబన్ధాన్తం సమావర్తావసానకమ్ | అధికారావసానం వా కుర్యాదఙ్గావసానతః 31 గర్భాధానాది కర్మలను ఆ యా అంశములను వ్యవస్థ చక్కగా పాటించుచు, అంగముల ననుసరించి, నామాంతముగా గాని, సమావర్తాంతము గాని, అధికారాంతము గాని చేయవలెను. ప్రణవేనోపచారం తు కుర్యాత్సర్వత్ర సాధకః | అజ్గైర్హోమస్తు కర్త వ్యో యథావిత్తానుసారతః 32 సాధకుడు అన్నింటను ఓంకారముతో ఉపచారము చేయవలెను. ధనలోభము చేయకుండగా అంగహోమములు చేయవలెను. గర్భాదానం తు ప్రథమం తతః పుంసవనం స్మృతమ్ | సీమన్తోన్నయనం జాతకర్మ నామాన్న ప్రాశనమ్. 33 చూడాకృతిం వ్రతబంధం వేదవ్రతాన్యశేషతః | సమావర్తనం పత్న్యా చ యోగశ్చాథాధికారకః 34 గర్భాధానము, పుంసవనము, సీమన్తోన్నయనము, జాతకర్మ నామకరణము, అన్నప్రాశనము, చౌలము, వ్రత బంధము (ఉపనయనము), సమస్త మైన వేదవ్రతాలు (నాలుగు), స్నాతకము, వివాహము, ఆధికారము అను సంస్కారములను వరుసగా చేయవలెను. హృదాదిక్రమతో ధ్యాత్వా ఏకైకం కర్మ పూజ్య చ | అష్టావష్టౌతు జుహుయాత్ప్రతికర్మాహుతీః పునః 35 ప్రతికర్మయందును హృదయాదిక్రమముచే ధ్యానించి, ఒక్కొక్క కర్మను పూజించి, మరల ఎనిమిదేసి ఆహుతులను హోమము చేయవలెను. పూర్ణాహుతిం తతో దద్యాత్ స్రుచా మూలేన సాధకః | వౌషడన్తేన మున్త్రేణ ప్లుతం సుస్వరముచ్చరన్. 36 సాధకుడు వౌషట్ చివర గల మంత్రమును చక్కగా ప్లుతస్వరముతో ఉచ్చరించుచు స్రుక్కు మొదటి భాగముతో పూర్ణాహుతి ఇవ్వవలెను. విష్ణోర్వహ్నింతు సంస్కృత్య అర్పయేద్వైష్టం చరుమ్ | ఆరాధ్య స్థణ్డిలే విష్ణు మన్త్రాన్ సంస్కృత్య సంశ్రయేత్. 37 విష్ణవునకై వహ్నిని సంస్కరించి వైష్ణవమైన చరువును అర్పించవలెను. స్థండిలముమీద విష్ణువును పూజించి, మంత్రములను స్మరించుచు ఆశ్రయించవలెను. ఆసనాదిక్రమేణౖవ సాఙ్గావరణముత్తమమ్ | గన్ధపుషై#్పః సమభ్యర్చ్య ధ్యాత్వా దేవం సురోత్తమమ్. 38 ఆదాయేధ్మ మతాఘారావాజ్యావగ్నీశసంస్థితౌ | వాయవ్యనైరృతాశాదిప్రవృత్తౌ తు యథాక్రమమ్. 39 ఆజ్యభాగౌ తతో హుత్వా చక్షుషీ ధక్షిణోత్తరే | మధ్యే7థ జుహుయా త్సర్వమన్త్రైరర్చాక్రమేణ తు. 40 ఉత్తమమైన సాంగావరణమును ఆసనాదిక్రమముచే గంధి పుష్పములతో పూజించి, దేవతాశ్రేష్ఠుడైన ఆ విష్ణువును ధ్యానించి, సమిధను ఉంచి, పిమ్మట ఆగ్నేయ ఈశాన్య దిక్కలందు ఆజ్యాఘారములను, వాయవ్య నైరృతదిక్కలంధు ఆజ్యభాగములను క్రమానుసారముగా సమర్పించి, పిమ్మట దక్షిణోత్తర చక్షుర్హోములు చేసి, పిమ్మట అర్చా క్రమానుసారముగా మధ్యయందు, సర్వమంత్రముల తోడను, హోమము చేయవలెను. ఆజ్యేన తర్పయేన్మూర్తిం దశాం శేనాఙ్గహోమకమ్ | శతం సహస్రం వాజ్యాద్యైః సమిద్భిర్వా తిలైః సహ. 41 ఆజ్యముచేత మూర్తినితృప్తిపరచవలెను. వదన అంశము అంగహోమము చేయవలెను. ఆజ్యము మొదలైనవాటితో లేదా తిలలతో గూడిన సమిధలతో మూరు లేదా వేయి హోమములు చేయవలెను. సమాప్యార్చాం తు హోమాన్తాం శుచీన్ శిష్యానుషోషితాన్ | ఆహుయాగ్రే నివేశ్యాథ హ్యస్త్రేణ ప్రోక్షయే శూత్పన్. 42 హోమము అంతమునందు గల పూజను సమాప్తి చేసి ఉపవాస మున్న పవిత్రులైన శిష్యలను పిలచి, తన ఎందుట ఉంచుకొని, ఆ పశువులను అస్త్రమంత్రముచే ప్రోక్షించవలెను. శిష్యానాత్మని సంయోజ్య విద్యాకర్మనిబన్ధనైః | లిఙ్గానువృత్తం చైతన్యం సహ లిఙ్గేన పాలితమ్. 43 ధ్యానమార్గేణ సమ్ప్రోక్ష్య వాయుబీజేన శోషయేత్ | తతో దహనభీజేన సృష్టిం బ్రహ్మణ్డసంజ్ఞికామ్. 44 నిర్దగ్ధాం సకలాం ధ్యాయేద్భస్మకూటనిభస్థితామ్ | ప్లావయేద్వారిణా భస్మ సంసారం వార్మయం స్మరేత్ . 45 శిష్యులను విద్యాకర్మనిబంధనములచే తనలో కలుపుకొని, లింగ శరీరమును అనుసరించి ఉన్నదియు, లింగ శరీరముతో కూడా పాలింపబడినదియు అగు చైతన్యమును ధ్యానమార్గమున సంప్రోక్షించి, వాయుబీజములచే శుష్కింపచేయవలెను. పిమ్మట బ్రహ్మాండ మను పేరు గల ఈ సృష్టి యంతయు అగ్నిబీజముచే కాల్చివేయబడి భస్మరాశి వలె ఉన్నట్లుగా ధ్యానము చేయవలెను. ఆ భస్మము నీటితో ముంచెత్తవెలను. ప్రపంచ మంతయు జలమయముగా ఉన్నట్లు స్మరించవలెను. తత్ర శక్తిం న్యసేత్పశ్చాత్పార్థివీం బీజసంజ్ఞికామ్ | తన్మాత్రాభిః సమస్తాభిఃసంవృత్తం పార్థివం శుభమ్. 46 అఖణ్డం తద్భవం ధ్యాయేత్తదాధారం తదాత్మకమ్ | తన్మధ్యే చిన్త యేన్మూర్తిం పౌరుషీం ప్రణావాత్మికామ్. 47 పిమ్మట దానియందు పృథివాకార మైనదియు, బీజ మను పేరు గలదియు అగు శక్తిని ఉంచవలెను. సమస్తమైన తన్మాత్రలచే ఏర్పడినది, పృథివీవికారము, శుభ##మైనదియు, అఖండము, దాని (శక్తి) నుండి పుట్టినది. తత్స్వరూపమును అగు దాని ఆధారమునుధ్యానించవలెను. దాని మధ్యయందు ప్రణవరూపమైన పురుషమూర్తిని ధ్యానించవలెను. లిఙ్గం సంక్రామయేత్పశ్చాదాత్మస్థం పూర్వంసంస్కృతమ్ | విభ##క్తేన్ద్రియ సంస్థానం క్రమాద్వృద్ధం విచిన్తయేత్. 48 పిమ్మట, పూర్వము సంస్కరింపబడిన, తనలో నున్న లింగశరీరమును దానిమీదికి సంక్రమింపచేయవలెను. అది క్రమముగా విభక్తమైన ఇందియములు, ఆవయవస్థితి కలదై వృద్ధిపొంది నట్లు చింతించవలెను. తతో7ణ్డమబ్దమేకం తు స్థిత్వా విశకలీకృతమ్ | ద్యావాపృథవ్యౌ శకలే తయోర్మధ్యే ప్రజాపతిమ్. 49 జాతం ధ్యాత్వా పునః ప్రేక్ష్యప్రణవేన తు తం శిశుమ్ | మన్త్రాత్మకతనుం కృత్వా యతాన్యాసం పురోదితమ్. 50 విష్ణుహస్తం తతో మూర్ధ్ని దత్త్వా ధ్యాత్వా తు వైష్ణవమ్ | ఏవమేకం బహూన్వాపి జపిత్వా ధ్యానమోగతః. కరౌ సంగృహ్య మూలేన నేత్రే బద్ధ్వా తు వాససా | నేత్ర మన్త్రేణ మన్త్రీతాన్ సదశేనాహతేను తు. 52 కృతపూజో గురుః సమ్యగ్ధేవదేవస్య తత్త్వవాన్ | శిష్యాన్ పుష్పఞ్జవిభృతః ప్రాఙ్ముఖానుపవేశ##యేత్. 53 పిమ్మట అండము ఒక సంవత్సరముపాటు ఉండి బ్రద్ధలైనట్లును అ ముక్కలు ద్యులోక పృథివీలోకములైనట్లును, వాటి మధ్య ప్రజాపతి జనించి నట్లును ధ్యానించవలెను. మరల చూచి, ఆ శిశువును ప్రణవముచే, పూర్వము చెప్పనట్లుగా న్యాసములు చేసి మంత్రాత్మక మగు శరీరము కలవానినిగా చేయవలెను. పిమ్మట శిరస్సుపై విష్ణుహస్తము నుంచి, వైష్ణవమంత్రమును ధ్యానించవలెను. ఈ విధముగా ధ్యానయోగముతో ఒకటి గాని, అనేకము గాని జపించి, హస్తములను మొదళ్ళయందు పట్టుకొని, మాంత్రికుడు నేత్రమంత్రము చదువుచు అంచుతో (జాలుతో) కూడిన చినగని వస్త్రముచే ఆ శిష్యుల నేత్రములు బంధించవలెను. తత్త్వము నెరిగి గురువు బాగుగా దేవదేవుని పూజించి, దోసిళ్లలో పుష్పములు ధరించి యున్న ఆ శిష్యులను పూర్వాభిముఖులనుగా కూర్చుండబెట్టవలెను. అర్చియేయుశ్చ తే7ప్యేవం ప్రసూతా గురుణా హరిమ్ | క్షిప్త్వా పుష్పాఞ్జలిం తత్ర పుష్పాదిభిరన న్తరమ్. 54 వాసుదేవార్చనం కృత్వా గురోః పాదార్చనం తతః | విధాయం దక్షిణాం దద్యాత్సర్వస్వం చార్ధమేవ వా. 55 ఆ శిష్యులు కూడ గుర్వనుజ్ఞ పొంది, అచట పుష్పాంజలిని చల్లి హరిని పూజింపవలెను. పిమ్మట పుష్పాదులతో వాసుదేవార్చనము చేసి. తరువాత గురుపాదార్చనము చేసి సర్వస్వమును గాని, దానిలో సగము గాని గురుదక్షిణగా ఇవ్వవలెను. గురుః సంశిక్షయేచ్ఛిష్యాంసై#్తః పూజ్యో నామభిర్హరిః | విష్వక్సేనం యజేదిశం శఙ్కచక్రగదాధరమ్. 56 తర్జయన్తం చ తర్జన్యా మణ్డలస్థం విసర్జయేత్. 57 విష్ణునిర్మాల్యమఖిలం విష్వక్సేనాయ చార్పయేత్. గురువు శిష్యులకు బోధించవలెను. వారు నామములతో హరిని పూజించవలెను. శంఖచక్రగదాధిరియై, తర్జనితో జళిపించుచున్న ప్రభు విష్వక్సేనుని పూజించి మండలమునందున్న హరికి ఉద్వాసన చెప్పవలెను. విష్ణునిర్మాల్యము నంతను విష్వక్సేనునకు సమర్పింపవలెను. ప్రణీతాభి స్తథాత్మానమభిషిచ్య చ కుణ్డగమ్. 58 మహ్నిమాత్మని సంయోజ్మ విష్వక్సేనం విసర్జయేత్ | బుభుక్షుః సర్వమాప్నోతి ముముక్షుర్లీయతే హరౌ. 59 ఇత్యాతి మహాపురాణ ఆగ్నేయే కుణ్డనిర్మాణాద్యగ్ని కార్యాదికథనం నామ చతుర్వింశో7ధ్యాయః. ప్రణీతలలో తనపైజలము చల్లుకొని, కుండములో నున్న అగ్నిని తనలో చేర్చికొని విష్వక్సేనుని విసర్జన చేయవలెను. ఈవిధముగ చేసినచో భోగములు అనుభవింప కోరిక గలవాడు సకలభోగములను పొందును. మోక్షేచ్ఛగల వాడు హరియందు లీను డగును. అగ్ని మహాపురాణములో కుండనిర్మాణాగ్నికార్యాది కథన రూప మగు ఇరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.