Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ సప్తవింశో7ధ్యాయః అథ దీక్షా విధిః నారద ఉవాచ : వక్ష్యే దీక్షాం సర్వదం చ మణ్డలే7బ్జే హరిం యజేత్ | దశమ్యాముపసంహృత్య యాగద్రవ్యం సమస్తకమ్. విన్యస్యనారసిం హేన సంమన్త్య్ర శతవారకమ్ | సర్షపాంస్తు ఫడ న్తేన రక్షోఘ్నోన్ సర్వతః క్షిపేత్. 2 నారుదుడు పలికెను. : అన్ని ఫలములను ఇచ్చు దీక్షను చెప్పదను. మండలమునందలి పద్మమునందు హరిని పూజించవలెను. దశమి యందు సమస్తమైన యాగద్రవ్యములను సమకూర్చుకొని, అచట ఉంచి, 'ఫట్' అనునది అంతమునందు గల నారసింహా మంత్రముచేత ఆవాంను నూరు పర్యాయములు అభిమంత్రించి, వాటిని నలుమూలల చల్లవలెను. శక్తిం సర్వాత్మికాం తత్ర న్యసేత్ప్రాసాదరూపిణీమ్ | సర్వౌషదీః సమాహృత్య వికిరానభిమన్త్రయేత్. 3 శతవారం శుభే పాత్రే వాసుదేవేన సాధకః | సంసాధ్య పఞ్చగవ్యం తు పఞ్చ భిర్మూలమూర్తిభిః. 4 నారాయణాన్తైః సంప్రోక్ష్య కుశాగ్త్రెస్తేన తాం భువమ్ | వికిరన్వాసుదేవేన క్షి పేదుత్తానపాణినా. 5 త్రిధా పూర్వముఖస్తిష్ఠన్ ధ్యాయేద్విష్ణుం తథా హృధి | వర్ధన్యా సహితే కుమ్ఛే సాఙ్గం విష్ణం ప్రపూజయేత్. 6 అచట సర్వాత్మికయు, ప్రాసాదరూపిణియు అగు శక్తిని నిలుపవలెను. సాధకుడు శుభ మైన పాత్రయందు సమస్తౌషధును ఉంచి నూరు పర్యాయములు వాసుదేవమంత్రముచే వికిరములను అభిమంత్రించవలెను. పంచగవ్యమును నారాయణాన్తములైన ఐదు మూలమూర్తులచే సంపాదించుకొని, దానిచే ఆ భూమిని కుశాగ్రములతో సంప్రోక్షించి, వాసుదేవ మంత్రముచే చిమ్ముచు, వెల్లిగితం ఉంచబడిన హస్తుముతో మూడు పర్యాయములు విసిరివేయవలెను. తూర్పుగా తిరిగి విష్ణువును మనస్సులో ధ్యానించవలెను. వర్ధనితో కూడిన కుంభమునందు అంగసహితుడగు విష్ణువును పూజింపవలెను. శతవారం మన్త్రయిత్వా త్వస్త్రేణౖవ చ వర్ధనీమ్ | అచ్ఛిన్నధారయా సిఞ్చన్నీశానాన్తం నయేచ్చ తామ్ . 7 వర్ధనిని అస్త్రముచేతనే నూరు పర్యాయములు అభిమంత్రించి, భిన్నము కాని ధారతో తడుపుచు ఈశాన్యదిక్కు వరకును తీసికొని వెళ్ళవలెను. కలశం పృష్ఠతో నీత్వా స్థాపయేద్వికిరోపరి | సంహృత్య వికిరాన్దర్భైః కుమ్భేశం కర్కరీం యజేత్. 8 కలశమును వెనుకనుంచి తీసికొని వెళ్ళి వికిరములపై స్థాపించవలెను. వికిరములను దర్భలచేత పోగుచేసి కుంభేశుని కర్కరిని పూజింపవలెను. సవస్త్రం పఞ్చరత్నాఢ్యం స్థణ్డిలే పూజయేద్దరిమ్ | అగ్నావపి సమభ్యర్చ్వ మన్త్రాన్ సంజప్య పూర్వవత్. 9 ప్రక్షాళ్య పుణ్డరీ కేణ విలిప్యాన్తః సుగన్ధినా | ఉఖామాజ్యేన సంచపూర్య గోక్షీరేణ తు సాధకః 10 ఆలోక్య వాసుదేవేన తతః సఙ్కర్షణన చ | తణ్డులానాజ్యసంసృష్టాన్ క్షిపేత్ క్షీరే సుసంస్కృతే. 11 వస్త్రములతోడను పంచరత్నములతోడను కూడిన విష్ణువును స్థండిలముపై పూజించవలెను. అగ్నియందు కూడ పూజించి, పూర్వమునందు వలె మంత్రములను జపించి, పాత్రను కడిగి, మంచి సువాసన గల పద్మములచే లోపల తుడిచి, నేతితోను, గోక్షీరముతోను నింపి, వాసుదేవమంత్రముతో దానివైపు చూచి, పిమ్మట సంకర్షణమంత్రముతో, సంస్కృతమైన క్షీరములో నెయ్యి పూసిన తండులమును పోయవలెను. ప్రద్యుమ్నేన సమాలోడ్య దర్వ్యా సంఘట్టయేచ్ఛనైః పక్వముత్తారయేత్ఫశ్చాదనిరుద్ధేన దేశికః. 12 ప్రక్షాల్యాలిప్య తత్కుర్యాదూర్ధ్వపుణ్డ్రం తు భస్మనా | నారాయణన పార్శ్వేషు చరుమేవం సుసంస్కృతమ్. ప్రద్యుమ్న మంత్రముతో కలిపి గరిటిచేత మెల్లగా ఎనపవలెను. ఉడికిన తరువాత, గురువు అనిరుద్ధమంత్రముతో దింపవలెను. ఆ పాత్రను కడిగి, నారాయణమంత్రముతో, భస్మచేత పాత్రకు ఊర్ధ్వపుండ్రము లుంచవలెను. ఈ విధముగ ఆ చరువును చక్కగా సంస్కరించవలెను. భాగమేకం తు దేవాయ కలశాయ ద్వితీయకమ్ | తృతీయేన తు భాగేన ప్రదద్యాదాహుతిత్రయమ్. 14 శిషై#్యః సహ చతుర్థం తు గరురద్యాద్విశుద్ధయే| నారాయణన సంమన్త్య్ర సప్తధా క్షీరవృక్షజమ్. 15 దన్తకాష్ఠం భక్షయిత్వా త్యక్త్వా జ్ఞాత్వా స్వపాతకమ్| ఐన్ద్రాగ్న్యుత్తర కేశానీముఖం పతితముత్తమమ్. 16 శుభం సింహశతం హుత్వా ఆచమ్యాథ ప్రవిశ్యచ | పూజాగారం న్యసే న్మన్త్రీ ప్రాచ్యాం విష్ణుం ప్రదక్షిణమ్. 17 ఒక భాగము దేవునకు, రెండవ భాగము కలశకు సమర్పించి, మూడవ భాగముచే మూడు ఆహుతులు చేయవలెను. నాల్గవ భగామును గురువు శిష్యులతో కూడా భుజించవలెను. క్షీరవృక్షమనుండి దంత కాష్ఠమును గ్రహించి, దానిని నారాయణ మంత్రముచే ఏడు సార్లు అభిమంత్రించి పవిత్రము చేసి, దానిని నమలి విడువవలెను. తన పాప మంతయు ఈశాన్యదిగభి ముఖముగా పడిపోయినట్లు భావన చేయవలెను. శుభ##మైన నరసింహమంత్రముతో నూరు సార్లు హోమము చేసి, ఆచమనము చేసి, పూజా గృహము ప్రవేశించి, తూర్పున విష్ణువును స్థాపించి ప్రదక్షిణము చేయవలెను. సంసారార్ణవమగ్నానం పశూనాం పాపముక్తయే| త్వమేవ శరణం దేవ సదా త్వం భక్తవత్సల. 18 దేవదేవానుజానీహి ప్రాకృతైః పాశబన్ధనైః పాశితాన్మోచయిష్యామి త్వత్ప్రసాదాత్పశూనిమాన్. 19 "భక్తవత్సలుడవైన ఓదేవా! సంసార సముద్రమునందు మునిగి యున్న పశువుల పాపములను తొలగించుటకు నీ వొక్కడవేశరణము. ఓ! దేవదేవా! ప్రాకృతములైన పాశబంధనములచే బద్ధులైన ఈ పశువులను, నీ అనుగ్రహము వలన విముక్తులను చేసెదను. అనుజ్ఞఇమ్ము." అని విష్ణువును ప్రార్థించవలెను. ఇతి విజ్ఞాప్య దేవేశం సంప్రవిశ్యం పశూంస్తతః | ధారణాభిస్తు సంశోధ్య పూర్వవజ్జ్వలనాదినా. 20 సంస్కృత్య మూర్త్యా సంయోజ్య నేత్రే బుద్ధ్వా ప్రదర్శయేత్ | పుష్పపూర్ణఞ్జలీంస్తత్ర క్షిపేతన్నామ యోజయేత్. 21 అమన్త్రమర్చనం తత్ర పూర్వవత్కారయేత్క్రమాత్ | యస్యాం మూర్తౌ పతేత్పుష్పం తస్య తన్నామ నిర్దిశేత్. 22 విష్ణువునకు ఈ విధముగా విజ్ఞాపన చేసి, పిమ్మట పశువులను ప్రవేశించి, పూర్వము చేప్పినట్లు ధారణలచేతను, జ్వలనాదికముచేతను సంశోధనముచేసి సంస్కరించి, మూర్తితో కలిపి, నేత్రములను బంధించి చూపవలెను. అచట పుష్పమములతో నిండిన దోసిళ్లను విసిరి, ఆ పేర్లను చేర్చవలెను. అచట వెనుకటివలె క్రమముగా మంత్రరహితముగా అర్చన చేయవలెను. పుష్పము ఏ మూర్తిపై పడునో ఆ మూర్తి యొక్క పేరు ఆతనికి పెట్టవలెను. శిఖాన్తసంమితం సూత్రం పాదాఙ్గష్ఠాది షడ్గుణమ్ | కన్యయా కర్తితం రక్తం పునస్తత్త్రిగుణీకృతమ్. 23 యస్యాం సంలీయతే విశ్వం యయా వశ్వం ప్రసూయతే | ప్రకృతిం ప్రక్రియాభేదైః సంస్థితాం తత్ర చిన్తయేత్. 24 పాదాంగుష్ఠము మొదలు శిఖ వరకు పొడవు గల ఆరు పేట్ల ఎఱ్ఱటి దారమును కన్యచేత భేదింపచేసి, మరల దానిని మూడు పేటలు చేసి, దానిపై, ఏ ప్రకృతిలో విశ్వము లీనమగునో, దేనినుండి జనించునో అట్టి ప్రకృతిని వివిధ ప్రక్రియలతో భావన చేయవలెను. తేన ప్రాకృతికాన్ పాశాన్ గ్రథిత్వాతత్త్వసంఖ్యాయా | కృత్వాశరావేతత్సూత్రం కుణ్డపార్శ్వే నిధాయతు. తతస్తత్త్వాని సర్వాణి ధ్యత్వా శిష్యతనౌ న్యసేత్ | సృష్టిక్రమాత్ప్రకృత్యాది పృథివ్యన్తాని దేశికః 26 ఆ సూత్రముతో, ఎన్ని తత్త్వము లున్నవో అన్ని ప్రాకృతికపాశములను ముడివేసి, దానిని మూకుడులో అగ్ని కుండపార్శ్వమునందుంచి, గురువు, ప్రకృతి మొదలు పృథివి వరకున ఉన్న ఆ తత్త్వములను స్పష్టిక్రమానుసారము ధ్యానించుచు శిష్యుని శరీరముపై న్యాసము చేయవలెను. తత్త్రెకధా పఞ్చధా స్యాద్ధశ ద్వాదశధాపి వా| వాతవ్యః సర్వభేదేన గ్రథితస్తత్త్వచిన్తకైః 27 అఙ్గైః పఞ్చభిరధ్వానం నిఖిలం వికృతిక్రమాత్ | తన్మాత్రాత్మని సంహృత్య మాయాసూత్రే పశోస్తనౌ. 28 వికృతుల క్రమము ప్రకారము నిఖిలమార్గమును పంచాంగములతో, తన్మాత్రాత్మకమగు మాయాసూత్రమైన పశువు శరీరమునందు ఉపసంహరించి, తత్త్వచింతకులు అచట ఐదు, పది, లేదా పండ్రెండు విధములచే ఆ గ్రథితమైన సూత్రమున పర్వ భేదముచే ఇవ్వవలెను. ప్రకృతిర్లిఙ్గశక్తిశ్చ కర్తా బుద్ధి స్తథామనః| పఞ్చ తన్మాత్రబుద్ధ్యాఖ్యం కర్మాఖ్యం భూతపఞ్చకమ్. 29 ధ్యాయేచ్చ ద్వాదశాత్మానం సూత్రే దేహే తథేచ్ఛయా| హుత్వా సంపాతవిధినా సృష్టేః సృష్టిక్రమేణ తు. 30 ఏకైకశతహోమేన దత్త్వా పూర్ణాహుతిం తతః| శరావే సంపుటీకృత్య కుంభేశాయ నివేదయేత్. 31 తన ఇచ్ఛననుసరించి, సూత్రమునందును, దేహమునందును - ప్రకృతి, లింగశక్తి కర్త, బుద్ధి, మనస్సు తన్మాత్రలు, జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములు పంచభూతములు - వీటినన్నింటిని, ద్వాదశాత్మను ధ్యానించవలెను. సృష్ట్యనులోమవిలోమక్రమములచే ఒక్కొక్క శతము హోమములు చేసి, పిమ్మట పూర్ణాహుతి ఇచ్చి, మూకుడులో సంపుటముగా చేసి, కుంభీశునకు నివేదనము చేయవలెన. అధివాస్య యథన్యాయం భక్తం శిష్యం తు ధీక్షయేత్ | కరణీం కర్తరీం వాపి రజాంసి ఖటికామపి. 32 అన్యదప్యుపయోగి స్యాత్సర్వం తద్వామగోచరే | సంస్థాప్య మూలమన్త్రేణ పరామృశ్యాధివాసయేతే. 33 ఈ విధముగ, శాస్త్రానుసారముగా, అధివాసితము చేసి; భక్తుడై శిష్యునికి దీక్ష ఇవ్వవలెను. కరణి, కర్తరి, రజస్సులు, ఖటిక, ఇంకను ఉపయుక్తములైన వస్తువులు, వీటి నన్నింటిని ఆతని ఎడమ ప్రక్క దగ్గరగా ఉంచి, మూల మంత్రముచే స్పృశించి, అదివాసితములు చేయవలెను. నమో భూతేభ్యశ్చ బలిః కుశే దేయః స్మరన్ హరిమ్ | మణ్డపం భూషయిత్వాథ వితానఘటిలడ్డుకైః. 34 మణ్డలే7థ యజేద్విష్ణుం తతః నన్తర్ప్య పావకమ్ | ఆహూయ దీక్షయేచ్ఛిష్యాన్ బద్ధ పద్మాసనస్థితాన్. 35 హరిని స్మరించుచు "నమో భూతేభ్యః" అని భూతబలిని కుశములపై ఇవ్వవలెను. పిదప వితానము (చందన) చేత, ఘటముచేత, లడ్డుల చేత మండలమును అలంకరించి, మండలముపై విష్ణువును పూజింపవలెను. పిమ్మట అగ్నిని పూజించి పద్మాసనము కట్టి కూర్చున్న éశిష్యులను పిలచి వారికి దీక్ష ఇవ్వవలెను. సంప్రోక్ష్య విష్ణుం హస్తేన మూర్ధానం స్పృశ్యవైక్రమాత్ | 36 ప్రకృత్యాదివికృత్యన్తాం సాధిభూతాదైవతామ్. సృష్టి మాధ్యాత్మికీం కృత్వాహృది తాం సంహర్రేత్కమాత్ | తన్మాత్రభూతాం సకలాం జీవేన సమతాం గతామ్. 37 విష్ణువును హస్తముచే ప్రోక్షించి, శిరస్సును స్పృశించి, క్రమముగా ప్రకృతి మొదలు వికృతులు వరకును గల, అధిభూతాధి దైవతములతో కూడిన సృష్ణినిగూర్చి మనస్సులో భావనచేసి దానిని మరల క్రమముగా ఉపసంహరించి, ఆసృష్టి యంతయు తన్మాత్రలగా అయిపోయినట్లును, జీవునితో సమానమైననట్లును భావన చేయవలెను. తతః సంప్రార్థ్య కుమ్భేశం సూత్రం సంహృత్యం దేశికః | అగ్నేః సమీపమాగత్యపార్శ్వేతం సన్నివేశ్యతు. 38 మూలమన్త్రేణ సృష్ణీశమాహుతీనాం శ##తేన తమ్ ఉదాసీన మథాసాద్య పూర్ణాహూత్యా చ దేశిక. 39 శుక్లం రజః సమాసాద్య మూలేన శతమన్త్రితమ్ | సన్తాడ్య హృదయం తేన హుంఫట్ కారాన్త సంయుతైః. 40 వియోగపద సంయుక్తైర్భీజైః పాదాదిభిః క్రమాత్| పృథివ్యాదీని తత్త్వాని విశ్లిష్య జుహుయాత్తతః. 41 పిమ్మట గురువు కుంభేశును ప్రార్థించి, సూత్రమును ప్రోగుచేసి, అగ్ని దగ్గరకు వచ్చి, దానిని అగ్ని పార్శ్వము నందుంచి, సృష్టికి అధిపతియైన ఆ అగ్నిని మూలమంత్రముతో నూరు అహుతులతోను, పిమ్మట పూర్ణాహుతితోను పూజించ వలెను. మూలమంత్రముతో నూరుసార్లు అభిమంత్రించిన తెల్లనిర జస్సుతోహృదయతాడనముచేయవలెను, వియోగపద సంయుక్తములను, పాదాదీంద్రియ ఘటితములను, బీజయుక్తములును అగు వాక్యములతో క్రమముగా పృథి వ్యాది తత్త్వ విశ్లేషణము చేసి హోమము చేవలెను. వహ్నావఖిల తత్త్వానామాలయే వ్యాహృతే హరౌ | నీయమానం క్రమాత్సర్వం తత్రాధ్వానం స్మరేద్భుదః. 42 తాడనేన వియోజ్యైవాదాయాపాద్య శామ్యతామ్ | ప్రకృత్యాహృత్యజుహుయాద్యథోక్తే జాతవేదసి. 43 పండితుడు అఖిలత త్త్వములకును నిలయమైన వహ్నియమందును, వ్యహృతుడగు హరియందును సమస్తమైన అర్చనామార్గము క్రమముగ ఉంచబడుచున్నట్లు స్మరిచంపవలెను. తాడనముచే విడదీసి, గ్రహించి, శమింపచేసి ప్రకృతిచే స్వీకరించిన, పూర్వోక్తమైన అగ్నియందు హోమము చేయవలెను. గర్భాధానం జాతకర్మ భోగం చైవలయం తథా| హుత్వాష్టౌ తత్ర తత్త్రైవ తతః శుద్ధన్తు హోమయేత్ . 44 గర్భాధానమును, జాతకర్మను, భోగమును, లయమును, ఆ అగ్నియందే ఎనిమిది హోమములు చేసి, పిమ్మట శుద్ధహోమము చేవలెను. శుద్ధం తత్త్వం సముద్ధృత్య పూర్ణాహుత్యా తు దేశికః సన్ధయేద్ధిపరే తత్త్వే యావదవ్యాకృతం క్రమాత్. 45 గురువు శుద్ధతత్త్వమును గ్రహించి, దానిని అవ్యాకృతమువరకును క్రమముగ పూర్ణహుతిచే పరతత్త్వము నందు హోమము చయవలెను. తత్పరం జ్ఞానయేగేన విలాప్య పరమాత్మని | విముక్తబన్ధనం జీవం పరస్మిన్నవ్యయే పదే. 46 నిర్వృతం పరమానన్దే శుద్ధే బుద్ధే స్మరేద్బుధః దద్యాత్పూర్ణాహుతిం పశ్చాదేవం దీక్షాసమాప్యతే. 47 పండితుడు, జ్ఞానయోగముచేత ఆ పరమున పరమాత్మయందు విలీనముచేసి, బంధ విముక్తడై జీవుడు సుద్ధము, జ్ఞానస్వరూపము, నిర్వికారము, పరమానందరూపము అగు పరమాత్మయందు ఆనందము పొందు చున్నట్లు భావింపవలెను. పిమ్మట పూర్ణాహుతి ఇవ్వవలెను. ఈ విధముగా దీక్ష పూర్తియగును. ప్రమోగమన్త్రాన్ వక్ష్యామి యైర్దీక్షాహోమసంలయః | ఓం యం భూతాని విశుద్దం హుం ఫట్ | అనేన తాడనం కుర్యాద్వియోజనమిహ ద్వయమ్. 48 దీక్షా-హోమ-విలయముల కుపయుక్తములగు ప్రయోగమంత్రములను చెప్పెదను. ''ఓం యం భూతాని విశుద్ధం హుం ఫట్'' అను మంత్రముచే తాడనమును, వియోజనమును చేయవలెను. ఓం యం భూతాన్యా పాతయే7హమ్ | ఆదానం కృత్వా చానేన ప్రకృత్యా యోజనం శృణు | ఓం యం భూతాని పుంశ్చాహో. ''ఓం యం భూతాన్యాపాతయే7హమ్'' అను మంత్రముచే ఆదానము చేయవలెను. ప్రకృతితో యోజనము చేయు మంత్రమును వినుము, 'ఓం యం భూతాని పుంశ్చాహో'' అనునది ప్రయోజన మంత్రము. హోమమన్త్రం ప్రవక్ష్యామి తతః పూర్ణాహుతేర్మనుమ్ | 49 ఓం భూతాని సంహర స్వాహా ఓం అం ఓం నమో భగవతే వాసుదేవాయ వౌషట్ పూర్ణాహుత్యనన్తరే తు తత్త్వే శిష్యం తు సాధయేత్ | ఏవం త్తత్వాని సర్వాణి క్రమాత్సంశోధయేద్బుధః. 50 హోమ మంత్రమును, పిమ్మట పూర్ణాహుతి మంత్రమును చెప్పెను- ''ఓం భూతాని సంహర స్వాహా'' అనునది హోమమంత్రము ''ఓం శ్రీం ఓం నమోభగవతే వాసుదేవాయ వౌషట్'' అనునది పూర్ణాహుతి మంత్రము. పూర్ణాహుత్యనంతరము తత్త్వమునందు శిష్యుని సాధించవలెను. ఈ విధముగా బుధుడు క్రమముగ సర్వతత్త్వ సంశోధనము చేయవలెను. నమోన్తేన స్వబీజేన తాడనాది పురః సరమ్ | ఓం వాం కర్మేన్ద్రి యాణి - ఓం దేం బుద్ధీన్ద్రియాణి- యం బీజేన సమానన్తు తాడనాదిప్రయోగకమ్. 51 నమః అనునది అంతమునందుగల ఆయా తత్త్వముల బీజములతో తాడనాది పూర్వకముగా తత్త్వసంశోధనము చేయవలెను. 'ఓం వాం కర్మేన్ద్రియాణి నమః' 'ఓం దేం బుద్ధీన్ద్రియాణి నమః' ఇత్యాది విధమున చేయవలెను. తాడనాది ప్రయోగము 'యం' బీజముతో చేసినట్లె చేయవలెను. ఓం సుగన్ధ తన్మాత్రే వియుజ్‌క్ష్వ హుం ఫట్ ఓం సంపాహి స్వాహా ఓం స్వం స్వం యుజ్‌క్ష్వ ప్రకృత్యా ఓం సుం హుం గన్ధతన్మాత్రే సంహర స్వాహా తతః పూర్ణాహుతి శ్చైవముత్తరేషు ప్రయుజ్యతే | ఓం రాం రసతన్మాత్రే ఓం ఖేం రూపతన్మాత్రే ఓం రం స్పర్శ తన్మాత్రే ఓం ఐం శబ్దతన్మాత్రే ఓం భం మనః ఓం సోం అహఙ్కారః ఓం నం బుద్ధౌ ఓం ఓం ప్రకృతౌ ఏకమూర్తావయం ప్రోక్తో దీక్షాయోగః సమాసతః | ఏవమేవ ప్రయోగస్తు నవవ్యూహాదికే స్మృతః. 52 ఓం సుగన్ధతన్మాత్రే వియుజ్‌క్ష్వ హుం ఫట్ ఓం సంపాహి స్వాహా'' అనునది గంధతన్మాత్రా విమోజన మంత్రము. ''ఓం స్వం స్వం యుజ్‌క్ష్వప్రకృత్యా'' అనునది ప్రకృతి సంయోజన మంత్రము, ''ఓం సుం హుం గన్ధతన్మాత్రే సంహర స్వాహా' అనునది సంహార మంత్రము, పిమ్మట పూర్ణాహుతి చేయవలెను. మిగిలినవాటి విషయమున గూడ ఇట్లే చేయవలెను. ''ఓం రసతన్మాత్రే'' మొదలు ''ఓం ఓం ప్రకృతౌ'' అను దానివరకును ఉన్న ఎనిమిది యుత్తత్ర్పయోగాలలో ఉపయోగించు ఉమంత్రములు. ఇది ఏకమూర్తి విషయమున సంపూర్ణముగ చెప్పబడిన దీక్షా విధానము. నవవ్యూహాదికమునందు కూడ ప్రయోగ మిట్లే అని చెప్పబడినది. దగ్ధ్వా పరస్మిన్ సందధ్యాన్నిర్వాణ ప్రకృతిం నరః | అవికారే సమాదధ్యాదీశ్వరే ప్రకీతిం నరః. 53 శోధయిత్వాథ భూతాని కర్మాఙ్గాని విశోధయేత్ | బుద్ధ్యాఖ్యాన్యథ తన్మాత్రం మనో జ్ఞానమఙ్కృతమ్. 54 నరుడు ప్రకృతిని దహించి దానిని పరమ నిర్వాణమునందు చేర్చవలెను. నరుడు ప్రకృతిని అవికారుఢగు ఈశ్వరునితో చేర్చవలెను. పిమ్మట భూతశుద్ధి చేసి బుద్ధ్యాఖ్యములగు కర్మాంగములను, పిమ్మట తన్మాత్రలను, మనస్సును జ్ఞానమును, అహంకారమును శోధించవలెను. లిఙ్గాత్మానం విశోధ్యాన్తే ప్రకృతిం శోధయేత్పునః | పురుషం ప్రాకృతం శుద్ధమీశ్వరే ధామ్ని సంస్థితమ్. 55 స్వగోచరీకృతాశేషభోగం ముక్తౌ కృతాస్పరమ్ | ధ్యాయన్ పూర్ణాహుతిం దధ్యాద్దీక్షేయం త్వాధికారిణీ. 56 అంతమునందు లింగాత్మశోధనము చేసి మరల ప్రకృతి శోదనము చేయవలెను. పరిశుద్ధుడును, ఈశ్వరధామమున నున్న వాడును, అన్ని భోగములను తన గోచరముచేసికొనినవాడును, ముక్తియందు స్థితి సంపాదించినవాడును అగు ప్రాకృతీ పురుషుని ధ్యానించుచు పూర్ణాహుతిని ఇవ్వవలెను. ఇది అధికారికి సంబంధించిన దీక్షా విధానము. అఙ్గెరారాధ్య మన్త్రస్య నీత్వా తత్త్వగణం నమమ్ | క్రమాదేవం విశోధ్యాన్తే సర్వసిద్ది సమన్వితమ్. 57 ధ్యాయన్ పూర్ణాహుతిం దద్యాద్దీక్షేయం సాధకీ స్మృతా. మంత్రాంగములచే ఆరాధనచేసి తత్త్వముల సముదాయమును సమముగా నుండునట్లుచేసి ఈవిధముగ సక్రమముగా విశోధనముచేసి, అంతమునందు సర్వసిద్ధి సమన్వితుని ధ్యానించుచు పూర్ణాహుతి ఇవ్వవలెను, ఇది సాధకుడు చేయవలసిన దీక్షా పద్ధతి. ద్రవ్యస్య వా న సంపత్తి రశక్తి ర్వాత్మనో యది. 58 ఇష్ట్వా దేవం యథాపూర్వం సర్వోపకరణాన్వితమ్ | సద్యో7ధివాస్య ద్వాదశ్యాం దీక్షయేద్దేశికోత్తమః. 59 ద్రవ్యములను కూర్చుకొనుటకు సామర్ధ్యము లేకపోయినచో? లేదా తనకు శక్తి లేకపోయినచో, దేశికోత్తముడు పూర్వము చెప్పినట్లు సర్వోపకరణసహితు డగు దేవుని ఆరాధించి వెంటనే శిష్యునకు ద్వాదశియందు దీక్ష ఇవ్వవలెను. భక్తో వినీతః శారీర్తెర్గుణౖః సర్త్వెః సమన్వితః | శిష్యో నాతిధనీ యస్తు స్థణ్డిలే7 భ్యర్చ్య దీక్షయేత్. 60 భక్తుడును, వినయవంతుడును, సమస్తమైన శారీర గుణములు కలవాడును అగు విష్యుడు అధిక ధనవంతుడు కానిచో ఆతనికి స్థండిలాభ్యర్చన చేయించి దీక్ష ఇవ్వవలెను. అధ్వానం నిఖిలం దైవం భౌతం వాధ్యాత్మికీ కృతమ్ | సృష్ట క్రమేణ శిష్యస్య దేహే ధ్యాత్వా తు దేశికః. 61 అష్టాష్టాహుతిభిః పూర్వం క్రమాత్సంతర్ప్య సృష్టిమాన్ | స్వమన్త్రైర్వాసుదేవాదీన్ జ్వలనాదీన్విసర్జయేత్. 62 గురువు, సమస్తమైన దైవమార్గమును గాని, ఆధ్యాత్మికముగా బావన చేయబడిన భౌతిక మార్గమునుగాని, శిష్యుని దేహముపై ధ్యానించి, ముందుగా వాసుదేవాది దేవతలను, అగ్ని మొదలైనవారిని, క్రమముగ వారి వారి మంత్రములతో ఎనిమిదేసి ఆహుతులచేత తృప్తిపరచి, విసర్జనము చేయవలెను. హోమేన శోధయేత్పశ్చాత్సంహారక్రమయోగతః | యాని సూత్రాణి బద్దాని ముక్త్వా కర్మాణి దేశికః. 63 శిష్యదేహాత్సమాహృత్య క్రమాత్తత్త్వాని శోధయేత్ | అగ్నౌ ప్రాకృతికే విష్ణౌ లయం నీత్వాధిదైవికే. 64 శుద్దం తత్త్వమశుద్ధేన పూర్ణాహుత్యా తు సాధయేత్ | పిమ్మట సంహారక్రమమున హోమముచే శోధనము చేయవలెను. శిష్యుని దేమముపై కట్టిన కర్మరూప సూత్రములను విడిపించి, వాటిని ఒకచోట పోగుచేసి, తత్త్వ శోధనము చేయవలెను. ప్రాకృతికాగ్నియందును, ఆధిదైవిక విష్ణువునందును లయముచేసి, అశుద్ధులతో కూడిన తత్త్వమును పూర్ణాహుతిచే శుద్ధము చేయవలెను. శిష్యే ప్రకృతిమాపన్నే దగ్ధ్వా ప్రాకృతికాన్ గుణాన్. 65 మోచయే దధికారే వా నియుంజ్యాద్ధేశికః విశూన్ | ప్రాకృతిక గుణములను దహించి శిష్యుడు ప్రకృతిస్థుడైన పిమ్మట గురువు ఆతనిని విముక్తుని చేయవలెను; లేదా శిశువులను (శిష్యులను) అధికారమునందు నియుక్తులను చేయవలెను. అథాన్యాం శక్తి దీక్షాం వా కుర్యాద్భావే స్థితో గురుః. 66 భక్త్యా సంప్రతిపన్నానాం యతీనాం నిర్ధనస్య పచ | సంపూజ్య స్థణ్డిలే విష్ణుం పార్శ్వస్థం స్థాప్య పుత్రకమ్. 67 దేవతాభిముఖః శిష్యస్తిర్యగాస్యః స్వయం స్థితః | అధ్వానం నిఖిలం ధ్యాత్వా పర్వభిః స్త్వెర్వికల్ఫతమ్. 68 శిష్యదేహే తథా దేవమాదిదైవిక యాజనమ్ | ధ్యానయోగేన సంచిన్త్య పూర్వవత్తాడనాదినా. 69 క్రమాత్తత్త్వాని సర్వాణి శోధయేత్థ్సణ్డిలే హరౌ | లేదా గురువు భావస్థితుడై మరియొక శక్తిదీక్ష యైన చేయవలెను. యతులు గాని, నిర్ధనులు గిన భక్తి పూర్వకముగ తన నాశ్రయించి నపుడు స్థండిలముపై విష్ణువును పూజించి, పార్శ్వమునందే కూర్చుండబెట్టవలెను. శిష్యుడు దేవతాభిముఖుడుగా ఉండగా గురువు ముఖమును అడ్డముగా త్రిప్పి కూర్చుండవలెను. స్వీయపర్వములతో వికల్పిత మైన సకలాధ్వమును శిష్యునిదేహముపై ధ్యానించి పిమ్మట ఆధిదైవికపూజ చేయవలెను. ధ్యానమోగముచే చింతించి, వెనుక చెప్పిన విధమున తాడనాదికముచే క్రమముగ స్థండిలముపై నున్న హరియందు సకలతత్త్వసంశోధనము చేయవలెను. తాడనేన వియోజ్యాథ గృహీత్వాత్మని తత్పరః. 70 దేవే సంయోజ్య సంశోధ్య గృహీత్వా తత్స్వభావతః | ఆనీయ శుద్దభావేన సన్ధయిత్వా క్రమేణ తు. 71 శోధయేద్ధ్యానయోగేన సర్వతో జ్ఞానముద్రయా | పిమ్మట తాడనముచేత విడిపించి, తత్పరత్వముతో తనలో గ్రహించి, దేవునితో సంబంధింప చేసి, పరిశోధనము చేసి, దేవస్వరూపమున గ్రహించి, శుద్ధభావముతో తీసికొని వచ్చి, క్రమముగ సంధింపచేసి, ధ్యానమోగము నవలంబించి జ్ఞానముద్రతో శోధింపవలెను. శుద్ధేషు సర్వతత్త్వేషు ప్రధానే చేశ్వరే స్థితే. 72 దగ్ఠ్వా నిర్వాపయేచ్ఛిష్యాన్ పదే చైశే నియోజయేత్ | నినయేత్సిద్దిమార్సే వా సాధకం దేశికోత్తమః. 73 సర్వతత్త్వములను శుద్ధము లైన పిమ్మట ప్రధాను డగు ఈశ్వరుడు మాత్రము ఉండగా, శిష్యులను(పాశములను) దహించి నిర్వాపితులను చేయవలెను. ఈశ్వరస్థానమున వారిని నియుక్తులను చేయవలెను. లేదా దేశికోత్తముడు సాధికుని సిద్ధిమార్గమును పొందింపచేయవలెను. ఏవమేవాధికారస్థో గృహే కర్మణ్యతన్ద్రితః | ఆత్మానం శోధయంస్తిష్ఠే ద్యావద్రాగక్షయో భ##వేత్. 74 అధికారము గల గృహస్థుడు ఈ విధముగ కర్మాచరణవిషయమున అలసత్వము లేనివాడై, రాగము క్షీణించు వరకును ఆత్మశోధనము చేసికొనుచు ఉండవలెను. క్షీణరాగమథాత్మానం జ్ఞాత్వా సంశుద్ధకిల్బిషః | ఆరోప్య పుత్రే శిష్యే వాహ్యధికారం తు సంయమీ. 75 దగ్ధ్వా మాయామయం పాశం ప్రవ్రజ్య స్వాత్మని స్థితః | శరీరపాతమాకాజ్‌క్షన్నా సీతావ్యక్త లిఙ్గవాన్. 76 ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే సర్వదీక్షాకథనం నామ సప్తవింశో7ధ్యాయః. తన కున్నరాగము క్షీణించిన దను విషయము గుర్తించి, పాపము లన్నియు తొలగిన ఆతడు పుత్రునకు గాని శిష్యునకు గాని అధికారము అప్పగించి, సంయమియై, మాయామయ మగు పాశమును దహింపచేసకిని, సన్యాసము స్వీకరించి, ఆత్మచింతాపరాయణుడై, తన స్థితిని ఇతరులకు వ్యక్తముచేయక శరీరపాతమునకై (మరణమునకై) వేచి యుండవలెను. అగ్ని మహాపురాణములో సర్వదీక్షాకథన మను ఇరువదిఏడవ అధ్యాయము సమాప్తము.