Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథాష్టావింశో7ధ్యాయః అథాచార్యాభిషేకవిధానమ్ నారద ఉవాచ : అభిషేకం ప్రవక్ష్యామి యథా కుర్యాత్తు పుత్రకః | సిద్ధిభాక్సాధకో యేన రోగీ రోగాద్విముచతే. 1 రాజ్యం రాజా సుతం స్త్రీ చ ప్రాప్నుయాన్మలనాశనమ్ | నారుదుడు పలికెను : శిష్యుడు ఆచార్యాభిషేకము ఎట్టు చేయవలెనో చెప్పదను. దీనిచేత సాధకుడు సిద్ధిని పొందును. రోగి రోగవిముక్తు డగును. రాజు రాజ్యమును, స్త్రీ కుమారుని, పాపవినాశమును పొందును. మృత్స్నాకుమ్భాన్ సురత్నాఢ్యాన్మధ్యే పూర్వాదితో న్యసేత్. 2 సహస్రావర్తితాన్ కుర్యాదథవా శతవర్తితాన్ | మణ్డలే మణ్డలే విష్ణుం ప్రాచ్చైశాన్యోశ్చ పీఠకే. 3 నివేశ్చ సకలీకృత్య పుత్రకం సాధకాదికమ్ | అభిషేకం సమభ్యర్చ్య కుర్యాద్గీతాదిపూర్వకమ్. 4 తూర్పున ప్రారంభించి మంచి రత్నములతో కూడిన మట్టి కుండలను మండప మధ్యభాగమున ఉంచవలెను. వాటిని సహస్రావర్తితములు లేదా శాతావర్తితములు చేయవలెను. మండలమునందు తూర్పు - ఈశాన్యదిక్కులందు పీఠముపై విష్ణువును ఉంచి, సాధకునికిని, శిష్యునికిని సకలీకరణము చేయవలెను. పిమ్మట గీతాదిపూర్వకముగా అచార్యునకు పూజ చేసి అభిషేకము చేయవలెను. దద్యాఛ్చ యోగపీఠాదీన్ స్వనుగ్రాహ్యాస్త్వయా నరాః | గురుశ్చ సమయాన్ బ్రూయాద్గుప్తః శిష్యో7థ సర్వభాక్. 5 ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే ఆచార్యాభిషేకో నామాష్టావింశో೭ధ్యాయః | యోగపీఠాదులను సమర్పింపవలెను. ''నీవు నరులను అనుగ్రహింపవలెను'' అని ప్రార్థించవలెను. గురువు కూడ శిష్యునకు నియమము లన్నియు బోధించవలెను. ఈ విధముగా గురురక్షణ పొందిన శిష్యుడు అన్ని లాభములను సంపాదింపగలడు. అగ్ని మహాపురాణములో ఆచార్యాభిషేక మను ఇరువది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.