Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ పఞ్చత్రింశో7ధ్యాయః. అథ పవిత్రాధివాసనాది విధిః అగ్ని రువాచ : సమ్పాతాహుతినా సిచ్య పవిత్రాణ్యధివాసయేత్ | నృసింహమన్త్రజప్తాని గుప్తాన్యస్త్రేణ తాని తు. 1 వస్త్రంవేష్టతాన్యేవ పాత్రస్థాన్యభిమన్త్రయేత్ | బిల్వాద్యద్భిః ప్రోక్షితాని మన్త్రేణ త్వేకధా ద్విధా. 2 కుమ్భపార్శ్వే తు సంస్థాప్య రక్షాం విజ్ఞాప్య దేశికః | దన్తకాష్ఠం చామలకం పూర్వే సఙ్కర్షణన తు. 3 ప్రద్యుమ్నేన భస్మతిలాన్ద్రక్షే గోమయమృత్తికామ్ | వారుణ చానిరుద్ధేన సౌమ్యే నారాయణన చ. 4 దర్భోదకం చాథ హృదా అగ్నౌ కుఙ్కమరోచనమ్ | ఐశాన్యాం శిరసా ధూపం శిఖయా నైరృతే7ప్యథ. 5 మూలపుష్ఫాణి దివ్యాని కవీచేనాథ వాయవీ | చన్దనామ్భ్యక్షతదధిదూర్వాశ్చ పుటికాస్థితాః. 6 గృహం త్రిసూత్రేణాదేష్ట్య పునః సిద్దార్థకాన్ క్షిపేత్ | అగ్నిదేవుడు చెప్పెను :- సంపాతాహుతిచేత పవిత్రలను తడిపి వాటి అధివాసనము చేయవలెను. నృసింహ మంత్రమును జపించి, వాటిని అభిమంత్రించి, అస్త్రమంత్రముచే (అస్త్రాయ ఫట్ ) వాటిని సురక్షితములు చేయవలెను. పవిత్రలకు వస్త్రములు చుట్టి ఉండగనే పాత్రములో ఉంచి వాటిని అభిమంత్రించవలెను. బిల్వాదిసంసృష్ట మైన జలముతో, మంత్రోచ్చారణపూర్వకముగ వాటిని ఒకటి రెండు సార్లు ప్రోక్షించవలెను. కుంభపాత్రమునందు పవిత్రలను ఉంచి, గురువు, వాటి రక్షణనిమిత్తము, ఆ పాత్రను తూర్పున సంకర్షణమంత్రముతో దంతచాష్ఠమును, ఉసరికాయను, దక్షిణమున ప్రద్యుమ్నమంత్రముతో భస్మమును, తిలలను, పశ్చిమమున నారాయణమంత్రముతో కుశోదకమును ఉంచవలెను. పిమ్మట అగ్నేయమునందు హృదయమంత్రముతో కుంకుమమును, గోరోచనమును, ఈశాన్యదిక్కు నందు శిరోమంత్రముతో ధూపమును, నైరృతి దిక్కునందు శిఖామంత్రముతో దివ్యమూలపుష్పములను, వాయవ్యదిక్కునందు కవచమంత్రముతో చందన-జల-అక్షత-దధి-దూర్వలను దొన్నెలో ఉంచవలెను. మండపమును త్రిసూత్రముతో చుట్టి మరల అన్ని ప్రక్కల ఆవాలు చల్లవలెను. దద్యూత్పూజాక్రమేణాథ సై#్వసై#్తర్గన్ధపవిత్రకమ్ 7 మన్తైర్వై ద్వారపాదిఖ్యో విష్ణుకుమ్భే త్వనేన గ | విష్ణుతేజోభవం రమ్యం సర్వపాతకనాశనమ్. 8 ధర్మకామార్థసిద్ధర్థ్యం స్వకే7ఙ్గే ధారయామ్యహమ్ | అసనే పరివారాదౌ గురౌ దద్వాన్పవిత్రకమ్. 11 గన్ధాధిభిః సమభ్యర్చ్య గన్దపుష్ఫాక్షతాదిమత్ | విష్ణుతేజో భ##వేత్యాదిమూలేన హరయే7ర్చయేత్. 12 వహ్నిస్థాయ తతో దత్త్వా దేవం సంప్రార్థయేత్తతః| ఏ క్రమమున దేవతల పూజ జరిగినదో ఆ క్రమముననే ఆ దేవతలకు, వారి వారి మంత్రముల నుచ్చరించుచు గంధపవిత్రము లర్పింపవలెను. ద్వారపాలాదులకు గూడ నామమంత్రములతో గంధపవిత్రము లర్పింపవలెను. ఈ క్రమమునే పాటించుచు కుంభమున మహావిష్ణువును ఉద్దేశించి- "ఓ దేవా! ఇది నీ తేజస్సునుండియే పుట్టినది. సుందరమైనది. సర్వపాపవినాశకము. ఇది అన్ని మనోరథములను ఇచ్చునది. దీనిని నీకు సమర్పించుచున్నాను" అని పలుకుచు పవిత్రకమును సమర్పింపవలెను. ధూపదీపాదుల ద్వారా బాగుగా పూజ చేసి మండపద్వారసమీపమునకు వెళ్ళి, గంధపుష్పాక్షితలతో గూడిన ఆ పవిత్రకమును తాను కూడా "ఇది విష్డుతేజోరూవ మైనది. మహాపాతకములను నశింప చేయునది. ధర్మార్ధకామముల సిద్ధికై దీనిని ధరించుచున్నాను" అని చెప్పుచు ధరింపవలెను. ఆసనముపై శ్రీహరిపరివారమునకును గురువునకును పవిత్రకము నీయవలెను. గంధపుహ్పాక్షతాదులచే శ్రీహరిని పూజించి, గంధపుష్పాదులతో పూజించిన పవిత్రమును శ్రీహరికి సమర్పింపవలెను. ఆ సమయమున "విష్ణుతేజో భవమ్" ఇత్యాది మూలమంత్రమును పఠించవలెను. పిమ్మట అగ్న్యధిష్ఠాతగా నున్న మహావిష్ణువునకు పవిత్రకము సమర్పించి ఇట్లు ప్రార్థింపవలెను. క్షీరోదధిమహానాగశయ్యావస్థితవిగ్రహ. 13 ప్రాతస్త్వాం పూజయిష్యామి సన్నిధౌ భవ కేశవ | ఐన్ధ్రాదిభ్యస్తతో దత్త్వా విష్ణుపార్షదకే బలిమ్. 14 తతో దేవాగ్రతః కుమ్బం వాసోయుగసమన్వితమ్ | రోచనాన్ద్రకాశ్మీరగన్ధాద్యుదకసంయుతమ్. 15 గన్ధపుష్పాదినా భూష్య మూలమన్త్రేణ పూజయేత్ మణ్డపాద్బహిగత్య లిలిప్తే మణ్డలత్రయే. 16 పఞ్చగప్యం చరుం దన్తకాష్ఠం చైవ క్రమార్భవేత్ | పురాణశ్రవణం స్తోత్రం పఠఞ్జాగరణం నిశి. 17 పరప్రేషకబాలానాం స్త్రీణాం భోగభుజాం తథా | సద్యోధివాసనం కుర్యాద్వినా గన్ధపవిత్రకమ్. 18 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే పవిత్రాదివాసనం నామ పఞ్చత్రింశో7ధ్యాయః. కేశవా! నీవు, క్షీరసాగరమున శేషశయ్యపై శయనించి యున్నావు, నేను ప్రాతఃకాలమున నీ పూజ చేసెదను. నీవు ఇచట ఉపస్థితుడవు కమ్ము! పిమ్మట ఇంద్రాది దిక్పాలకులను, శ్రీవిష్ణుపార్షదులకును బలి సమర్పింపవలెను. పిమ్మట రోచనా-కర్పూర-కేసర-గంధాదులచే అలంకృతమై రెండు వస్త్రము లుంచిన జలపూర్ణకలశమునకు మూలమంత్రముతో పూజ చేయవలెను. మండపమునుండి బైటకు వచ్చి తూర్పున అలికిన మండలత్రయమునందు వరుసగ పంచగవ్యమును, చదువును, దంతకాష్ఠమును ఉంచవలెను.రాత్రి పురాణశ్రవణ-స్తోత్రపాధాదులతో జాగరణము చేయవలెను. పరులకు భృత్యులుగా ఉండువారు, బాలులు, స్త్రీలు, భోగిజనులు మొదలగు వారి గంధపవిత్రములు తప్ప మిగిలిన వాటికి అప్పుడే అధివాసనము చేయవలెను. అగ్ని మహాపురాణమునందు పవిత్రాదివాసనమును ముప్పదియైదవ అధ్యాయము సమాప్తము.