Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథషట్చత్వారింశోధ్యాయః అథశాలగ్రామాది మూర్తిలక్షణమ్ శ్రీ భగవానువాచ : శాలగ్రామాది మూర్తీశ్చ వక్ష్యే7హం భుక్తిముక్తిదాః | వాసుదేవో7సితోద్వారి శిలాలగ్నద్విచక్కకః. 1 జ్ఞేయః సఙ్కర్షణోలగ్న ద్విచక్రో రక్త ఉత్తమః | సూక్ష్మచక్రోబహుచ్ఛిద్రః ప్రద్యుమ్నోనీలదీర్ఘకః. 2 పీతో7నిరుద్ధః పద్మాఙ్కోవర్తులోద్విత్రి రేఖకః | కృష్ణో నారాయణో నాభ్యున్నతః సుషిరదీర్ఘవాన్. 3 పరమేష్టీ సాబ్జచక్రః పృష్ఠచ్ఛిద్రశ్చ బిన్దుమాన్ | స్థూలచక్రో7సీతోవిష్ణుర్మధ్యే రేఖాగదా కృతిః. 4 నృసింహః కపిలః స్థూలచక్రః స్యాత్పఞ్చబిన్దుకః | వరాహః శక్తి లిఙ్గః స్యాత్తచ్ఛక్రే విషమౌస్మృతౌ. 5 ఇన్ద్రనీలనిభః స్థూలస్త్రిరేఖాలఞ్ఛితః శుభః | కూర్మస్తథోన్నతః పృష్ఠే వర్తులావర్తకో7సితః 6 హయగ్రీవో7జ్కుశాకారరేఖో నీలః సబిన్దుకః | వైకుణ్ఠ ఏకచక్రో7బ్జీ మణిభః పుచ్ఛరేఖకః. 7 మత్స్యో దీర్ఘస్త్రిబిన్దుః స్యాత్కాచవర్ణస్తు పూరితః | శ్రీధరో వనమాలాఙ్కః పఞ్చరేఖస్తు వర్తులః. 8 వామనో పర్తులశ్చాతిహ్రస్వోనీలః సబిన్దుక ః | శ్యామస్త్రివిక్రమో దక్షరేఖో వామేన రిక్తకః. 9 అనన్తో నాగభోగాఙ్గో నైకాభో నైకమూర్తిమాన్ | స్థూలో దామోదరోమధ్య చక్రః స్యాత్సూక్ష్మబిన్దుకః. 10 సుదర్శనస్త్వేకచక్రో లక్ష్మీనారాయణో ద్వయాత్ | త్రిచక్రశ్చాచ్యుతోదేవస్త్రిచక్రోవా త్రివిక్రమః. 11 జనార్దనశ్చతుశ్చక్రో వాసుదేవశ్చ పఞ్బభిః | షట్చక్రశ్త్చెవ ప్రద్యుమ్నః సఙ్కర్షణశ్చసప్తభిః. 12 పురుషోత్తమో7ష్టచక్రో నవవ్యూహోనవాఙ్కితః | దశావతారో దశభిర్దశై కేనానిరుద్ధకః. 13 ద్వాదశాత్మా ద్వాదశభిరత ఊర్ద్వ మనన్తకః | ఇత్యాది మహాపురాణ అగ్నేయే శాలగ్రామాది మూర్తిలక్షణం నామ షట్చత్వారింశో7ధ్యాయః హయగ్రీవుడు చెప్పెను. బ్రహ్మదేవా! సాలగ్రామాదులపై నుండు హరిమూర్తులను గూర్చి చెప్పదను. ఇది భోగ మోక్షములనిచ్చునది. ద్వారమునందు రెండు చక్రములతో నల్లని సాలగ్రామము వాసుదేవుడు రెండు చట్రములున్న ఎఱ్ఱని శాల గ్రామము సంకర్షణుడు. చిన్న చక్రము, అనేక రంధ్రములును ఉన్న నీలవర్ణ సాలగ్రామము ప్రద్యుమ్నుడు కమల చిహ్నము, గోలాకారము, పచ్చని రంగు, మూడురేఖలు ఉన్నది అనిరుద్ధుడు నాభియందు ఉన్నతమై, పెద్ద రంధ్రములతో నల్లగా నుండునది. నారాయణుడు. కమల-చక్రచిహ్నములు, పృష్ఠభాగమున రంధ్రము, బిందువు ఉన్న శాలగ్రామము పరమేష్ఠి. స్థూలమైన చక్రము మధ్య గదవంటి రేఖ ఉన్న శ్యామవర్ణమగు శాలగ్రామము విష్ణువు. స్థూలచక్రము ఐదు బిందువులు ఉన్న కపిలవర్ణ శాలగ్రామము నృసింహుడు, శక్తి అను అస్త్రముగుర్తు, విషమములైన రెండు చక్రములు, మూడు స్థూల రేఖలు ఉన్న ఇంద్రనీలమణి వంటి రంగుగల శాలగ్రామము వరాహము. ఎత్తైన పృష్ఠ భాగము, గోలాకారమైన సుడి ఉన్న శ్యామవర్ణ శాలగ్రమము కూర్మము. అంకుశ##రేఖలు, బిందువులు ఉన్న నీల వర్ణ శాలగ్రామము హయగ్రీవుడు ఒక చక్రము, ఒక కమలము, పుచ్ఛాకారమేన రేఖలు ఉన్న, మణి వలె ప్రకాశించు శాలగ్రామము వైకుంఠుడు మూడు బిందువులతో, కంచు వలె తెల్లగానుండు, పెద్ద ఆకారముగల శాలగ్రామము మత్స్యము. వనమాల, ఐదురేఖలు గల గోలాకారమైన శాలగ్రామము శ్రీధరుడు. చాల చిన్నదై , బిందువులుండి, గోలాకారమైన నీల శాలగ్రామము వామనము కుడి ప్రక్క హార రేఖయు, ఎడమ ప్రక్క బిందువులు, ఉన్న శ్యామ వర్ణమగు శాలగ్రామము త్రివిక్రముడు. సర్ప శరీర చిహ్నము, అనేక మూర్తులు ఉండి, చాలరంగులతో ప్రకాశించు శాలగ్రామము అనంతుడు-అదిశేషుడు, మధ్యభాగమున చక్రము, క్రింద సూక్ష్మబిందువు ఉన్న స్థూలమగు శాలగ్రామము దామోదరుడు ఒక చక్రమున్న శాలగ్రామము సుదర్శనము, రెండు చక్రములున్నది లక్ష్మీనారాయణుడు, మూడు చక్రములున్నది అచ్యుతుడు, లేదా త్రివిక్రముడు. నాలుగు చక్రములున్నది జనార్దనుడు ఐదు చక్రములున్నది వాసుదేవుడు. ఆరు చక్రములున్నది ప్రద్యమ్నుడు, ఏడు చక్రములున్నది సంకర్షణుడు ఎనిమిది చక్రములున్నది పురుషోత్తముడు. తొమ్మిద చక్రములున్నది నవవ్యూహము. పది చక్రములున్నది దశావతారమూర్తి పదకొండు చక్రములున్నది అనిరుద్ధుడు. పండ్రెండు చక్రములున్నది ద్వాదశాత్మ. అంతకంటె అధిక చక్రములున్నది అనంతుడు. అగ్నిమహాపురాణము నందు శాలగ్రామ మూర్తి వర్ణనమను నలుబది యారవ అధ్యాయము సంపూర్ణము.