Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ త్రిపఞ్చాశత్తమో7ధ్యాయః అథ లిఙ్గాది లక్షణమ్: శ్రీ భగవానువాచ: లిఙ్గాది లక్షణం వక్ష్యే కమలోద్భవ తచ్ఛృణు | దైర్ఘ్యార్ధం వసుభిర్భక్త్యా త్యక్త్వా భాగత్రయం తతః. 1 విష్కమ్భం భూతభాగైస్తు చతురస్రంతు కారయేత్ | ఆ యామం మూర్తిభిర్భక్త్వా ఏకద్విత్రిక్రమాన్న్యసేత్. 2 బ్రహ్మ విష్ణుశివారి శేషు వర్ధ మానో7య ముచ్యతే | చతురస్రే7స్య కార్ణార్ధం గుహ్యకోణషు లాఞ్ఛ యేత్. 3 అష్టాగ్రం వైష్ణవం భాగం సిధ్యత్వేవన సంశయః | షోడశాస్రం తతః కుర్యాద్ద్వాత్రింశాస్రం తతఃం పునః. 4 హయాగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఇపుడు నేను లింగాదుల లక్షణము చెప్పెదను; వినుము. లింగము పొడవులో సగమును ఎనిమిది భాగములు చేసి. వాటిలో మూడు భాగములు విడచి, మిగిలిన ఐదు భాగములతో చతురస్రమైన విష్కంభము నిర్మింపవలెను. మరల పొడవును ఆరు భాగములు చేసి వాటిని ఒకటి, మూడు అను క్రమమున వేరుగా ఉంచవలెను. వీటిలో మొదటి భాగము బ్రహ్మదేవునిది; రెండవది విష్ణువునకు సంబంధించినది. మూడవది శివునిది. దీనికి ''వర్ధమాన భాగము'' అని పేరు. చతురస్ర మండపమున కోణ సూత్రార్థ ప్రమాణము గ్రహించి, దానిలో అన్ని కోణముల మీదను గుర్తులుంచవలెను. ఇట్లు చేయగా ఎనిమిది కోణముల వైష్ణవ భాగము సిద్ధించును. సందేహము లేదు. పిమ్మట పదునారు కోణముల తోడను, ముప్పదియారు కోణములతోడను కూడిన దానిగా చేయవలెను. చతుఃషష్ట్యస్కకం కృత్వా వర్తులం సాధయేత్తతః | కర్తయేదథ లిఙ్గస్య శిరో వైదేశికోత్తమః . 5 విస్తారమథ లిఙ్గస్య అష్టదా సంవిభాజయేత్ | భాగర్దార్దంతు సంత్యజ్య ఛత్రాకారం శిరోభ##వేత్. 6 త్రిషుభాగేషు సదృశ అయామో యస్య విస్తరః | తద్ద్విభాగసమం లిఙ్గం సర్వ కామఫలప్రదమ్. 7 దైర్ఘ్యస్యతు చతుర్థేన విష్కమ్భం దేవ పూజితే | సర్వేషామేన లిఙ్గానం లక్షణం శృణుసామ్ప్రతమ్. 8 పిమ్మట అరువది నాలుగు కోణములుండునట్లు చేసి అచట ఒక గోళాకార రేఖ గీయవలెను. పిమ్మట శ్రేష్ఠుడైన ఆచార్యుడు లింగము శిరోభాగమును ఖండించవలెను. పిమ్మట లింగ విస్తారమును ఎనిమిది భాగములుగ విభజింపవలెను. పిమ్మట వాటిలో ఒక భాగము యొక్క నాల్గవ భాగమును విడువగా ఛత్రాకారమగు శిరస్సు ఏర్పుడును. మూడు భాగములందును పొడవు వెడల్పులు సమానముగా నుండు లింగ సకల మనోభిష్టములను ఇచ్చును. దేవపూజిత లింగము నందు పొడవులోని నాలుగవ భాగముచే నిష్కంభము ఏర్పడును. ఇపుడు అన్ని లింగముల లక్షణములను వినుము. మధ్య సూత్రం సమాసాద్య బ్రహ్మరుద్రాన్తికం బుధః | షోడశాజ్గుల లిఙ్గస్య షడ్భాగైర్భాజితో యథా . 9 తద్త్వె యమన సూత్రాభ్యాం మానమన్తరముచ్యతే | యవాష్టముత్తరే కార్యం శేషాణాం యవహానితః. 10 అర్చాభాగం త్రిధాకృత్వా త్వర్ధమేకం పరిత్యజేత్ | అష్టదా తద్ద్వయం కృత్వా ఊర్ధ్వభాగత్రయం త్యజేత్. 11 ఊర్ధ్వంచ పఞ్చమాద్భాగాద్బ్రా మ్యరేఖాంప్రలమ్బయేత్ | భాగమేకం పరిత్యజ్య సఙ్గమం కారయేత్తమోః 12 ఏ తత్సాధారణం ప్రోక్తం లిఙ్గానాం లక్షణం మయా | సర్వసాధారణం వక్ష్యే పిణ్డికాం తన్ని బోధమే. 13 పండితుడు పదునారు అంగుళముల లింగమునకు మధ్య బ్రహ్మరుద్ర భాగములకు సమీపమున నున్న సూత్రము తీసికొని దానిని ఆరు భాగములుగ విభజింపవలెను. వైయమన సూత్రముల సాహాయ్యముతో నిశ్చయింపబడిన ఈ పరిమాణమునకు 'అంతరము' అని పేరు. అన్నింటి కంటె ఉత్తరము నందున్న లింగమును ఎనిమిది యవల పెద్దదిగా ఉండునట్లు చేయవలెను. మిగిలిన లింగములను ఒక్కొక్క యవ తగ్గునట్లు చేయవలెను. పైన చెప్పిన లింగము క్రింది ప్రదేశమును మూడు భాగములుగా విభజించి పై భాగము నొకదానిని విడచి వేయవలెను. మిగిలిన రెండు భాగములను ఎనిమిది భాగములుగ విభజించి పై మూడు భాగములను విడచి వేయవలెను. ఐదవ భాగముపై భాగము నుండి తిరుగుచున్న ఒక దీర్ఘరేఖ గీయవలెను. ఒక భాగమును విడచి, మధ్యయందు ఆ రెండు రేఖలను కలపవలెను. ఇది లింగముల సాధారణ లక్షణము. ఇపుడు పిండిక యొక్క సర్వసాధారణ లక్షణమును చెప్పెదను; వినుము. బ్రహ్మభాగప్రవేశంచ జ్ఞాత్వా లిఙ్గస్య చోచ్ఛ్రయమ్ | న్యసేద్భ్రహ్మ శిలాం విద్వాస్సమ్యక్కర్మిశిలోపరి. 14 తథా సముచ్ఛ్రయం జ్ఞత్వా పిణ్డికాం ప్రవిభాజయేత్ | ద్విభాగముచ్ఛ్రతం పీఠం విస్తారే లిఙ్గసం మితమ్. 15 త్రిభాగం మధ్యతః భాతం కృత్వాపీఠం విభాజయేత్ | స్వమానార్ధ త్రిభాగేణబాహుల్యం పరికల్పయేత్. 16 బాహుల్యస్య త్రిబాగేణ మేఖలామథ కల్పయేత్ | భాతంస్యాన్మేఖలా తుల్యం క్రమాన్నిమ్నంతు కారయేత్. మేఖలా షోడశాం శేన ఖాతంవాతత్ప్రమాణతః | ఉచ్ఛ్రియం తస్యపీఠస్య లింగాకారం తు కారయేత్. 18 భౌమౌ ప్రవిష్టమేకం తు భాగేనై కేన పిణ్డికా | కణ్ఠం భాగైస్త్రిఖిః కార్యం భాగేనై కేన పట్టికా. 19 ద్వ్యంశేన చోర్ధ్వపట్టం తు ఏకాంశాః శేషపట్టికాః | భాగం భాగం ప్రవిష్టంతు యావత్కణ్ఠం పునః పునః. 20 నిర్గమం భాగమేకం తు యావద్వై శేషపట్టికా | ప్రణవస్య త్రిభాగేణ నిర్గమస్తు త్రిభాగతః . 21 మూల్కే7జ్గుల్యగ్రవిస్తార మగ్రేత్య్రంశేన చార్దతః | ఈషన్నిమ్నంతు కుర్వీత ఖాతంతచ్చోత్తరేణవై. 22 పిణ్డికాసహితం లిఙ్గమేతత్సాధారణం స్మృతమ్. ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే లిఙ్గాది లక్షణం నామ త్రిపఞ్చాశత్తమో7ధ్యాయః. బ్రహ్మ భాగమునందు లింగము%ి ఎత్తు తెలిసికొని, పండితుడు, బ్రహ్మ శిలాస్థాపనముచేసి, దానిపైననే ఉత్తమరీతిచే కర్మ సంపాదనము చేయవలెను. పిండిక ఎత్తు తెలిసికొని దానిని విభజించవలెను. రెండు భాగముల ఎత్తును పీఠముగా గ్రహింపవలెను. వెడల్పులో అది లింగముతో సమానముగనే ఉండవలెను. పీఠ మధ్య భాగమున గుంట చేసిన దానిని మూడు భాగములుగ విభజింపవలెను. తన ప్రమాణము యొక్క సగము త్రిభాగముచే ''బాహుల్యమును'' ఏర్పరుపవలెను. బాహుల్యము తృతీయ భాగముచే మేఖల నిర్మించి దానితో సమానముగ గుంట చేయవలెను. అది క్రమముగ పల్లముగ నుండవలెను. మేఖల పదహారవ భాగమంత మేఖల నిర్మించి దాని కొలతను అనుసరించి పీఠము ఎత్తు ఏర్పరుపవలెను. దీనికి ''విక రాజ్గము'' అని పేరు. శిల యొక్క ఒక భాగము భూమిలోనికి ఉండవలెను. ఒక భాగములో నిర్మితము కావలెను. మూడు భాగములతో కంఠము, ఒక భాగముతో పట్టిక నిర్మింపవలెను. రెండు భాగముల పైన పట్టము నిర్మింపవలెను. ఒక భాగముచే శేష పట్టికలు నిర్మింపవలెను. కంఠము వరకు ఒక్కొక్క భాగము ప్రవేశించవలెను. పిమ్మట ఒక భాగముచే నిర్గమము (నీరుపోవు మార్గము) నిర్మింపవలెను. ఇది శేషపట్టిక వరకు ఉండవలెను. ప్రణాల తృతీయ భాగముచే నిర్గమము ఏర్పడవలెను. మూడవ భాగము మొదటి వ్రేలిచివరి భాగమంత గుంట చేయవలెను. అది మూడవ భాగములో సగము విస్తారముండవలెను. ఆ గుంట ఉత్తరమువైపు ఉండవలెను. ఇది పిండికా సహితమైన సాధారణ లింగము వర్ణనము. అగ్ని పురాణమందు లింగాది లక్షణమును ఏబదిమూడవ అధ్యాయము సమాప్తము.