Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథచతుః పఞ్చాశత్తమో7ధ్యాయః అథ నానాలిఙ్గమానాదిలక్షణమ్ ః శ్రీ భగవానువాచ : వక్ష్యామ్యన్య ప్రకారేణ లిఙ్గమానాదికం శృణు | వక్ష్యే లవణజం లిఙ్గం ఘృతజం బుద్ధివర్ధనమ్. 1 భూతయే వస్త్ర లిఙ్గంతు లిఙ్గంతాత్కాలికం విదుః | పక్వాపక్వం మృన్మయం స్యాదపక్వాత్పక్వజం వరమ్. 2 తతోదారుమయం ముఖ్యం దారుజాచ్ఛైలజం వరమ్ | శైలాద్వరంతు ముక్తాజం తతోలౌహం సువర్ణజమ్. 3 రాజతం కీర్తితం తామ్రం పైత్తలం భుక్తి ముక్తిదమ్ | రఙ్గజం రసలిఙ్గంచ భుక్తిముక్తిప్రదం వరమ్. 4 రసజం రసలోహాది రత్నగర్భంతు తువర్దయేత్ | మానాది వేష్టం సిద్దాది స్థాపితే7థ స్వయంభువి. 5 హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఇపుడు నేను ఇతర లింగాదులను గూర్చి చెప్పెదను; వినుము లవణముతోను, ఘృతముతోను చేసిన శివలింగము బుద్ధిని వృద్ధి పొందించును. వస్త్రమయ లింగము ఐశ్వర్యదాయకము. అది తాత్కాలిక లింగము. మృత్తికతో నిర్మించిన లింగము పక్వము, అపక్వము అని రెండు విధములు. అపక్వము కంటె పక్వము శ్రేష్ఠము. దాని కంటె కఱ్ఱతో చేసిన లింగము అధిక పుణ్యదాయకము, పవిత్రము. దాని కంటె శిలా లింగము శ్రేష్ఠము. దాని కంటె ముత్యముల శివ లింగము. దాని కంటె సువర్ణ లింగము ఉత్తమములు వెండి, రాగి, ఇత్తడి, రత్నములు, పాదరసము వీటితో నిర్మించిన శివలింగము భోగమోక్షప్రదము, శ్రేష్ఠము, రసలింగమును రత్నములలోగాని, సువర్ణాది లోహములలో గాని బంధించి స్థాపించవలెను. సిద్ధాదులచే స్థాపింపబడిన స్వయం భూలింగాదులకు కొలతలు మొదలగునవి చేయుట యుక్తముకాదు. బాణ చ స్వేచ్ఛయాతేషాం పీఠప్రాసాద కల్పనా | పూజయేత్సూర్య బిమ్బ స్థందర్పణ ప్రతిబిమ్బితమ్. 6 పూజ్యోహరస్తు సర్వత్ర లిజ్గే పూర్ణార్చం భ##వేత్ | హస్తోత్తరోతచ్ఛ్రితం శైలం దారుజం తద్వదేవహి. 7 చలమజ్గులమానేన ద్వారగర్భకరైః స్థితమ్ | అజ్గులద్గృహలిఙ్గం స్యా ద్యావత్పఞ్చాదశాజ్గులమ్. 8 బాణ లింగమున విషయమున కూడ (నర్మదోద్భవమునకు) ప్రమాణాదిచింత ఉండ కూడదు. అట్టి లింగములకై ఇచ్ఛానుసారముగా పీఠప్రాసాదాది నిర్మాణము చేయవచ్చును. సూర్యమండలస్థ శివలింగమును అద్దములో ప్రతిబింబింపజేసి పూజించవలెను. లింగముపై శివార్చన పరిపూర్ణము, సకలకామప్రదము, శివలింగము ఎత్తు హస్తము కంటె ఎక్కువ ఉండవలెను. కాష్ఠమయ శివలింగము కూడ అంతయే ఉండవలెను. చల శివలింగ స్వరూపమును అంగుళమానానుసారమును, స్థిర లింగ స్వరూపమును ద్వార- గర్భ-హస్తమానముల అనుసారము నిర్ణయింపవలెను. గృహములో పూజింపబడు చల లింగము ప్రమాణము ఒక అంగుళము మొదలు పదునైదు అంగుళముల వరకును ఉండవచ్చును. ద్వారమానాత్త్రి సంఖ్యాకం నవధా గర్భ మానతః | నవధా గర్భమానేన లిఙ్గం ధామ్నిచ పూజయేత్. 9 ఏవం లిఙ్గాని షట్త్రింశద్ జ్ఞేయాని జ్యేష్ఠ మానతః | మధ్యమానేన షట్త్రింశత్ షట్త్రింశకదధమేనచ. 10 ఇత్థమైక్యేన లిఙ్గానాం శతమష్టోత్తరం భ##వేత్ | ఏకా జ్గులాది పఞ్చాన్తం కనిష్ఠం చలముచ్యతే. 11 షడాదిదశపర్యన్తం చలలిఙ్గంచ మధ్యమమ్ | ఏ కాదశాఙ్గులాదిస్యా జ్జ్యేష్ఠపఞ్చా దశాన్తకమ్. 12 షడజ్గులం మహారత్త్నె రన్త్యెర్న వాజ్గులమ్ | రవిభిర్హేమభారోత్ధం లిఙ్గం శేషైస్త్రిపఞ్చఖిః . 13 ద్వారమానమును బట్టి లింగము మూడు విధములగును. వీటిలో ఒక్కొక్క దానికి గర్భమానమును బట్టి, తొమ్మిదేసి భేదములగును. హస్తమానముచే తొమ్మిది భేదములగును. వీటిని దేవాలయములో పూజింపవలెను. ఈ విధముగ అన్నింటిని కలపగా ముప్పదియారు లింగములు. ఇది లింగముల జ్యేష్ఠమానము. మధ్యమమాన-కనిష్ఠ మానముల ఛేత కూడ ముప్పదియారు-ముప్పదియారు శివలింగము లగును. ఈ విధముగ అన్ని లింగములను కలుపగానూట ఎనిమిదిలింగము లగును. ఒకటి మొదలు ఐదు అంగులముల వరకు కనిష్ఠము (చిన్నది) ఆరునుండి పది అంగుళములవరకు చల లింగము మధ్యమము. పదకొండు నుండి పదునైదు అంగుళముల వరకు చల శివలింగము జ్యేష్ఠము. చాలమూల్యముగల రత్నములతో నిర్మించిన లింగము ఆరు అంగుళములు, సాధారణ రత్న నిర్మితము తొమ్మిది అంగుళములు, సువర్ణ నిర్మితము పండ్రెండు అంగుళములు ఇతర పదార్థ నిర్మితము పదునైదు అంగుళములు ఉండవలెను. షోడశాంశేచవేదాంశే యుగం లుప్త్వోర్ధ్వదేశతః | ద్వాత్రింశత్ షోడశాంశాశ్చ కోణయోస్తు విలోపయేత్. 14 చతుర్నివే శనాత్కణ్ఠో వింశతిస్త్రియుగై స్తథా | పార్శ్వాభ్యాంతు విలుప్తాభ్యాం ఘనలిఙ్గం భ##వేద్వరమ్. 15 ధామ్నోయుగర్తునాగాంశైర్ద్వారమానోన్నతం క్రమాత్ | లిఙ్గేద్వారోచ్ఛ్ర యాదర్వాగ్భ వేత్పాదోనితం క్రమాత్. 16 గర్భార్దేనాధమం లిఙ్గం భూతాంశైః స్సాత్త్రై భిర్వరమ్ | తయోర్మధ్యేచ సూత్రాణి సప్త సంపాదయేత్సమమ్. 17 ఏవం స్యుర్నవసూత్రాణి భూతసూత్రైశ్చ మధ్యమమ్ | ద్వ్యన్తరో వామభాగశ్చ లిఙ్గానాం దీర్ఘతా తవ. 18 హస్తా ద్వివర్ధతే హస్తో యావత్స్యుర్నవ పాణయః | హీనమధ్యోత్తమం లిఙ్గం త్రివిధం త్రివిధాత్మకమ్. 19 లింగ శిలను పదునారు భాగములు చేసిపై నాలుగు భాగములలో ప్రక్కనున్న రెండు భాగములను తీసివేయవలెను. మరల ముప్పది రెండు భాగములు చేసి దాని రెండు కోణములందును ఉండు పదునారు భాగములు తీసివేయవలెను. మరల దానిలో నాలుగు భాగములు కలుపగా కంఠము ఏర్పడును. అనగా ఇరువది భాగములు కంఠముగా ఏర్పుడను. రెండు ప్రక్కలను పడ్రెండు భాగములను తీసివేయుటచే జ్యేష్ఠ చల లింగము ఏర్పడును. ప్రాసాద (దేవాలయ)ము ఎత్తును పదునారు భాగములుగా విభజింపగా, నాలుగు, ఆరు, ఎనిమిది భాగముల ఎత్తుచే వరుసగా కనిష్ఠ-మధ్య-జ్యేష్ఠద్వారము లేర్పుడును. ద్వారము ఎత్తులో నాల్గవ వంతు తగ్గించగా అది లింగము ఎత్తు అగును. లింగ శిలాగర్భము ఎత్తులో సగము ఎత్తుగల శివలింగము కనిష్ఠము. పదునైదు భాగముల ఎత్తు గలది జ్యేష్ఠము. ఈ రెండింటి మధ్య ఏడు చోట్ల సూత్రపాతము చేయవలెను. ఈ విధముగ తొమ్మిది సూత్రము లగును ఈ తొమ్మిది సూత్రములలో ఐదు సూత్రముల ప్రమాణము గల లింగము మధ్యమము, లింగముల ఎత్తు రెండేసి భాగముల తేడాతో ఉండును. ఈ విధముగ లింగముల పొడవు పెరగగా తొమ్మిది లింగములు నిర్మాణమగును. హస్తప్రమాణముచే లింగమును నిర్మించినచో, మొదటి లింగము ప్రమాణము ఒక హస్తము రెండవ దాని ప్రమాణము మొదటి దాని కంటె ఒక హస్తము ఎక్కువ. ఈ విధముగ తొమ్మిది హస్తములు కొలత పూర్తిఅగు వరకు ఒక్కొక్క హస్తము పెంచుతు పోవలెను. పైన చెప్పిన హీన-మధ్యమ-జ్యేష్ఠ లింగములో ఒక్కొక్క దానికి మూడేసి భేదములుండను. ఏకైక లిఙ్గ మధ్యేషు త్రీణిత్రీణి చ పాదశః | లిఙ్గాని ఘటయేద్ధీమాన్ షట్సు చాష్టోత్తరేషు చ. 20 స్థిరదీర్ఘ ప్రమాణౖస్తు ద్వార మర్ధకరాత్మికా | భాగేశం చాప్యమీశంచ దైవేశంతుల్య సంజ్ఞితమ్. 21 చత్వారి లింగరూపాణి విష్కమ్బేణతు లక్షయేత్. దీర్ఘమాయాన్వితం కృత్వా లింగం కుర్యాత్త్రి రూపకమ్. 22 చతురష్టాష్టవృత్తంచ తత్త్వ త్రయగుణాత్మకమ్ | లిఙ్గానామీప్సితం దైర్ఘ్యం తేనకృత్వాఙ్గు లానివై. 23 ధ్వజాయాదైః స్వరైర్భూతైః శిఖిబి ర్వాహరేత్కృతిమ్ | తాన్యజ్గులాని యచ్ఛేషం లక్షయేచ్బ శుభాశుభమ్. బుద్ధిమంతుడు ఒక్కొక్క లింగమునందు విభాగ పూర్వకముగ. మూడేసి లింగములు నిర్మింప చెయవలెను. ద్వారమానము, గర్భమానము,హస్తమానము అను ఈ మూడు దీర్ఘమానానుసారము స్థిర లింగమును నిర్మింపవలెను. పై మూడు ప్రమాణముల ననుసరించి భ##గేశుడు, జవేశుడు, దేవేశుడు అని మూడు పేర్లు ఏర్పడును. విష్కంభ (విస్తార) మును బట్టి లింగమునకు నాలుగు రూపములు గుర్తింపవలెను. దైర్ఘ్య ప్రమాణానుసారము ఏర్పడు, మూడు రూపములలో కావలసిన లింగమునకు శుభమగు ఆయాదికముండు నట్లు చూచు కొనవలెను. ఈ మూడు విధముల లింగముల పొడవు నాలుగు లేదా ఎనిమిది హస్తములుండుట మంచిది. ఇవి వరుసగ త్రిగుణ స్వరూపములు. లింగము పొడవు ఎన్ని హస్తములున్నదో ఆ హస్తములను అంగుళములలోనికి మార్చి, ఎనిమిది, ఏడు, ఐదు, మూడు సంఖ్యలచే విభజింపవలెను. మిగిలిన దానిని పట్టి శుభాశుభ నిర్ణయము చేయవలెను. ధ్వజాద్యా ధ్వజసిం హేభ వృషాః శ్రేష్ఠాః పరే శుభాః | స్వరేషు షడ్జగన్ధార పఞ్చమాః శుభదాయకాః. 25 భూతేషుచ శుభాభూఃస్యాదగ్నిశ్చాహవనీ యక ః | ఉక్తా యామస్యచార్ధంశే నాగాంశైర్భాజితే క్రమాత్ . 26 రసభూతాంశ షష్ఠాంశత్య్రం శాధిక శ##రైర్భవేత్ | అఢ్యానాఢ్య సురేజ్యార్క తుల్యానాం చతురస్రతా. 27 పఞ్చమం వర్ధ మానాఖ్యం వ్యాసానాహ ప్రవృద్ధితః | ద్విధా భేదా బహూన్యత్ర వక్ష్యన్తే విశ్వకర్మతః . 28 అఢ్యాదీనాం త్రిధా స్థౌల్యాద్యవధూతం తదష్టధా | త్రిధాహస్తా జ్జినాఖ్యంచ యుక్తం సర్వ సమేన చ. 29 ధ్వజాద్యాయములలో ధ్వజ - సిహ - గజ - వృషభాయములు మంచివి. మిగిలిన నాల్గును చెడ్డవి. స్వర సంఖ్యచే - అనగా ఏడుచేత భాగించినపుడు షడ్జ-గాంధార-పంచమములు (శేషము) సుభదాయకములు. భూతములచేత-అనగా ఐదుచేత భాగించినపుడు శేషము పృథివి అయిన శభము. అగ్నిచేత-అనగా మూడుచేత భాగించినపుడు-శేషము ఆహవనీయాగ్నియైన శుభము. లింగము పొడవును సగము చేసి, దానిని ఎనిమిదిచే భాగించగా శేషము ఏడు వచ్చనచో ఆ లింగము ''అఢ్యము'' ఐదు కంటె అధికము శేషమైనచో ''అనాఢ్యము'' ఆరు అంశల కంటె అధికము శైషమైనచో అది ''దేవేజ్యము''. మూడు అంశల కంటె అధికము శేషించినచో అది ''అర్కతుల్యము''. ఈ నాలుగు విధములగు లింగములును చతుష్కోణములుగ నుండను. ఐదవది ''వర్ధమాన లింగము'', దీనికి వ్యాసము కంటె ఆనాహము అధికము. ఆనాహము వ్యాసముతో సమానముగ ఉండుట, దాని కంటె పెద్దదిగా ఉండుట అను దానినిపట్టి, ఈ లింగములలో రెండు భేదములుండును. విశ్కర్మ శాస్త్రానుసారము ఈ అన్నింటి భేదము లనేకములు చెప్పబడగలవు. స్థూలత్వాదులచే అఢ్యాది లింగములలో మరల మూడు భేదము లుండును. వాటికి ఒక్కొక్క యవ చొప్పున పెంచగా మొత్తము ఎనిమిది విధముల లింగము లేర్పుడును. హస్తమానమును పట్టి 'జన' మను లింగమునకు గూడ మూడు భేదము లగును. దానిని సర్వ సమలింగమున కలిపివేయవలెను. పఞ్చవింశతి లిఙ్గాని వాద్యే దేవార్చితే తథా | పఞ్చ సప్తభి రేకత్వాజ్జినైర్భక్తైర్భవన్తిహి. 30 చతుర్ధశ సహస్రాణి చతుర్దశ శతానిచ | ఏవమష్టాజ్గుల విస్తారో నవైకకర గర్భతః. 31 తేషాంకోణార్ధ కోణస్థైశ్చిన్త్యాత్కోణాని సూత్రకైః | విస్తారం మధ్యతః కృత్వా స్థాప్యంవా మధ్యతస్త్రయమ్. 32 విభాగా దూర్ధ్వ మష్టాస్రో ద్వ్యష్టాస్రః స్యాచ్ఛివాంశకః | పాదాజ్జాన్వన్తకో బ్రహ్మా నాభ్యన్తో విష్ణురిత్యతః. అనాఢ్యము, దేవార్చితము, అర్కతుల్యము అను లింగములకు గూడ ఐదేసి భేదములగుటచే ఇరువదియైదు అగును. ఏక-జిన-భక్త-భేదములచే డెబ్బదియైదు భేదము లగును. అన్నియు కలుపగా పదునైదువేల, నాలుగు వందల శివలింగములగును . ఎనిమిది అంగుళముల విస్తారముగల లింగము కూడ ఏకాంగుళమానము, హస్తమానము, గర్భమానము అను మానత్రయము ననుసరించి తొమ్మిది భేదము లగును. వీటి నన్నింటిని కోణ-అర్ధకోణము లందున్న సూత్రములచే వీటి కోణములను విభజింపవలెనని ఒక్కొక్క విభాగము మొక్క విస్తారము, లింగ మధ్యభాగ విస్తారతుల్యముగ భావించి మధ్య-ఊర్ధ్వ-అధో విభాగము లేర్పరుపవలను. మధ్యమ విభాగముపై నున్న అష్ట కోణము లేదా షోడశకోణము అగు విభాగము శివుని అంశము. మూల భాగమునుండి జానువు పర్యంతము ఉండు లింగాధోబాగము బ్రహ్మ యొక్క అంశము. జానువు నుండి నాభి వరకును ఉన్న లింగ మధ్యభాగమున విష్ణు యొక్క అంశము. మూర్దాన్తో భూతభాగేశో వ్యక్తే7వ్యక్తే చతద్వతి | పఞ్చ లింగవ్యవస్థాయాం శిరోవర్తుల ముచ్యతే. 34 ఛత్రాభం కుక్కుటాభంవా బాలేందు ప్రతిమా కృతిః | ఏకైకస్య చతుర్భేదైః కామ్యాభేదాత్ఫలం వదే. 35 లింగమస్త కవిస్తారం వసుభక్తంతు కారయేత్ | అధ్యభాగం చతుర్ధాతు విస్తారోచ్ఛ్రాయతోభ##జేత్. 36 చత్వారి తత్రసూత్రాణి భాగభాగానుపాతనాత్ | పుణ్డరీకంతు భాగేన విశాలాఖ్యం విలోకనాత్. 37 త్రిశాతనాత్తు శ్రీవత్సం శత్రుకృద్వేదలోపనాత్ | శిరః సర్వసమేశ్రేష్ఠం కుక్కుటాంభంసురాహ్వయే. 38 మూర్ధాన్తభాగము భూతభాగేశ్వరునిది. వ్యక్త-అవ్యక్తలింగములన్నింటికిని ఇదే పద్ధతి. ఐదులింగముల ఏర్పాటున్న శివలింగమునకు గుండ్రముగ చేయవలెను. ఈ గోలాకారము ఛత్రమువలె నుండవచ్చును, కోడిగుడ్డువలె నుండవచ్చును, లేదా నవోదితచంద్రువలె ఉండవచ్చును. కామ్యభేదమును పట్టి నాలుగువిధములగు ఫలభేదములను చెప్పుచున్నాను. లింగము శిరోవిస్తారము ఎన్ని అంగుళములుండునో ఆ సంఖ్యను ఎనిమిదిచే భాగించవలెను. ఈ విధముగ శిరస్సును ఎనిమిదిభాగములుగ విభజించి మొదటి నాలుగుభాగములును విస్తార-ఔన్నత్యములననుసరించి గ్రహింపవలెను. ఒక భాగమును తీసివేయగా ''పుండరీకము'' అను లింగము, రెండుభాగములను తీసివేయగా, 'విశాలము' అనులింగము, మూడు భాగమునులను తీసివేయగా ''శ్రీవత్సము'' అనులింగము, నాలుగుభాగములను తీసివేయగా ''శత్రుకారలింగము'' ఏర్పడును. అన్ని ప్రక్కలనుండియు శిరోభాగము సమముగనున్నది శ్రేష్ఠము. దేవపూజ్యలింగమునందు లింగశిరోభాగము కుక్కుటాండమువలె గోలాకారమున నుండవలెను. చతుర్భాగాత్మ కే లింగేత్రపుషం ద్వయలోపనాత్ | అనాద్యస్న శిరః ప్రోక్తమర్ధచన్ద్రం శిరః శృణు. 39 అంశాత్ప్రాన్తే యుగాంశైశ్చ ద్వ్యేకహాన్యామృతాక్షకమ్ | పూర్ణబాలేన్దుకుముదం ద్విత్రివేదక్షయాత్క్రమాత్. 40 చతుస్త్రిరేఖం వదనం ముఖలింగమతః శృణు | వూజాభాగః ప్రకర్తవ్యో మూర్త్యగ్ని పదకల్పితః. 41 అర్కాంశం పూర్వవత్త్యక్త్వా షట్‌స్థానాని వివర్తయేత్ | శిరోన్నతిః ప్రకర్తవ్యాలలాటం నాసికా తతః. 42 వదనం చిబుకంగ్రీవా యుగభాగైర్భుజాక్షిభిః | కరాభ్యాం ముకులీకృత్యప్రతీమాయాః ప్రమాణతః. 43 ముఖం ప్రతి సమః కార్యో విస్తారాదష్టమాం శతః | చతుర్ముఖం మయా ప్రోక్తం త్రిముఖం చోచ్యతే శృణు. చతుర్భాగాత్మక లింగమునందు పై రెండు భాగములను తొలగించగా ''త్రపుష'' మను లింగ మేర్పడును. ఇది అనాఢ్యమను శివలింగముయొక్క శిరస్సుగా చెప్పబడుచున్నది. ఇపుడు అర్ధచంద్రాకార శిరస్సు గూర్చి వినుము. శివలింగ ప్రాంతభాగమునందు ఒక అంశమును నాలుగు అంశములచేసి ఒక అంశమును విడిచినచో దానికి ''అమృతాక్షరము'' అని పేరు. రెండవ- మూడవ- నాల్గవ అంశములను తొలగింపగా క్రమముగ వాటికి ''పూర్ణేందు'' ''బాలేన్దు'' ''కుముద''ము లని పేర్లు. ఇవి క్రమముగ చతుర్ముఖ- త్రిముఖ-ఏకముఖములు. ఈ మూడింటికి "ముఖలింగము" లని కూడ పేర్లు. ఇపుడు ముఖలింగమును గూర్చి వినుము. పూజాభాగమును. మూర్తిపూజ, అగ్నిపూజ, పదపూజ అని మూడు విధములుగ కల్పించుకొనవలెను. వెనుకటివలె ద్వాదశాంశమును విడచి, ఆరుభాగముల ద్వారా ఆరు స్థానములను అభివ్యక్తము చేయవలెను. శిరస్సు ఎత్తుగానుండనట్లు, లలాట-నాసికా-మఖ-చిబుక-కంఠములు స్పష్టముగ కనబడునట్లు చేయవలెను. నాలుగు అంళములచే రెండుభుజములను, నేత్రములను ఏర్పరుపవలెను. ప్రతిమాప్రమాణానుసారము హస్తము ముకులాకారముగా ఏర్పరచి, విస్తారములోని ఎనిమిదవ అంశముచే నాలుగుముఖములను ఏర్పరుపవలెను. అన్ని ప్రక్కలనుండియు సమముగ ఉండవలెను. ఇంతవరకు చతుర్ముఖ లింగమును గూర్చి చెప్పితిని; ఇపుడు త్రిముఖలింగమును గూర్చి చెప్పదను: వినుము. కర్ణపాదాధికాన్యస్య లలాటాదీని నిర్దిశేత్ | భౌజౌ చతుర్భిర్హభాగైస్తు కర్తవ్యౌ పశ్చిమోర్జితౌ. 45 విస్తారాదష్టమాంశేన ముఖానాం ప్రతినిర్గమః | ఏకవక్త్రం తథా కార్యం పూర్వస్యాం సౌమ్యలోచనమ్. 46 లలాట నాసికా వక్త్ర గ్రీవాయాం చ వివర్తయేత్ | భుజాచ్ఛపఞ్చమాం శేన భుజహీనం వివర్తయేత్. 47 విస్తారస్య షడం శేన ముఖైర్నిర్గమనం హితమ్ | సర్వేషాం ముఖలింగానాంత్ర పుషం వాథ కుక్కుటమ్. 48 ఇత్యాది మహాపురాణ అగ్నేయే లిఙ్గమానాది వ్యక్తావ్యక్తలక్షణం నామ చతుఃపఞ్చాశత్తమో7ధ్యాయః చతుర్ముఖలింగముకంటె త్రిముఖలింగమునకు చెవులు, పాదములు అధికము. లలాటాదులను వెనుకటివలెనే ఏర్పరుపవలెను. నాలుగు అంశలతో రెండు భుజములను నిర్మింపవలెను. వాటి వెనుక భాగము దృఢముగా నుండవలెను. విస్తారముయొక్క ఎనిమిదవ అంశమునందు మూడు ముఖములును స్పష్టముగ కనబడవలెను. (ఏక ముఖ లింగము):- ఏకముఖమును తూర్పువైపున నిర్మింపవలెను. దాని నేత్రములు సౌమ్యముగా నుండవలెను. దాని లలాట-నాసికా-ముఖ-కంఠములు పైకి ఉబికి యుండవలెను. బాహువిస్తారములో ఐదవ అంశముచే పైన చెప్పిన అవయముల నిర్మాణము జరుగవలెను. దానిని బాహురహితముగ నిర్మింపవలెను. ఈ ఏకముఖలింగమునందు విస్తారములో ఆరవ అంశమునందు. ముఖ నిర్మాణము హితకరమని చెప్పబడినది. ముఖయుక్తములగు అన్ని లింగము శిరోభాగములును త్రపుషాకారములో గాని, కుక్కుటాండాకారముగాని ఉండవలెను. అగ్నిమహాపురాణమునందు లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణమును ఏబదినాల్గవ అధ్యాయము సమాప్తము.