Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకషష్టితమో7ధ్యాయః

అథద్వారప్రతిష్టా ధ్వజారోహణాది విధిః

భగవానువాచ:

వక్ష్యేచావభృథస్నానం విష్ణోర్నత్వేతి హోమయేత్‌ | ఏకాశీతిపదే కుమ్భాన్థ్సాప్య సంస్థాపయేద్దరిమ్‌ . 1

పూజయేద్గన్ధపుష్పాద్యైర్బలిం దత్త్వా గురుం యజేత్‌ | ద్వారే ప్రతిష్ఠాం వక్ష్యామి ద్వారాధో హేమ వై దదేత్‌.

అష్టభిః కలశైః స్ధాప్య శాఖోదుమ్బరకౌ గురుః | గన్దాదిభిః సమభ్యర్చ్య మన్త్రైర్వేదాదిభిర్గురుః. 3

కుణ్ణషు హోమయేద్వహ్నిం సమిర్లాజతిలాకదిభిః | దత్త్వాశయ్యాదికం చాధో దద్యాదాధారశక్తికామ్‌. 4

శాఖయోర్విన్యసేన్మూలే దేవౌ చణ్డప్రచణ్డకౌ | ఊర్ధ్వోదుమ్బరకే దేవీం లక్ష్మీం సురగణార్చితామ్‌. 5

న్యస్యాభ్యర్చ్య యతాన్యాయం శ్రీసూక్తేన చతుర్ముఖమ్‌ | హుత్వాతు శ్రీ ఫలాదీని ఆచార్యదేస్తు దక్షిణామ్‌.

ప్రతిష్ఠా సిద్దద్వారస్య త్వాచార్యః స్ధాపయేద్ధతిమ్‌| ప్రాసాదస్య ప్రతిష్ఠాం తు హృత్ప్రతిష్ఠేతి తాం శృణు. 7

సమాప్తౌ శుకనాసాయా వేద్యాః ప్రాగ్గర్భమస్తకే | సౌవర్ణం రాజతం కుమ్భమథవా శుక్లనిర్మితమ్‌. 8

అష్టఠత్నౌషధీధాతుబీజకాహాన్వితం శుభమ్‌ | సవస్త్రం పూరితం చార్చర్మణ్డలే చాధివాసయేత్‌. 9

సపల్లవం నృసింహేన హుత్వా సంపాతసఞ్చితమ్‌ | నారాయణాఖ్యతత్త్వేన ప్రాణభూతం న్యసేత్తతః. 10

హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఇపుడు నేను అవభృథస్నానమును గూర్చి చెప్పెదను. "విష్ణోర్నుకం వీర్యాణి" ఇత్యాదిమంత్రముతో హోమము చేయవలెను. ఎనుబది యొక్క పదముల వాస్తుమండపమునందు కలశస్థాపన చేసి వాటి ఉదకముతో శ్రీహరికి స్నానము చేయించవలెను. స్నానానంతరము గంధపుష్పాదులతో పూజించి, సమర్పించి, గురువును పూజించవలెను. ఇపుడు ద్వారప్రతిష్ఠను గూర్చి చెప్పెదను. గురువు ద్వారము క్రింద బంగారము నుంచవెలను. ఎనిమిది కలశలతో అచట రెండు ఉదుంబరశాఖ లుంచవలెను. వైదికమంత్రములు చదువుచు, గంధాద్యుపచారములతో పూజించి కుండములందు స్థాపింపబడిన అగ్నిలో సమిధులు, ఆజ్యము, తిలలు మొదలగునవి హోమము చేయవలెను పిమ్మట శయ్యాదిదానము చేసి క్రింద ఆధారశక్తిని స్థాపింపవలెను. ఆ రెండు శాఖల క్రింద చండ-ప్రచండులను దేవతలను స్థాపించవలెను. ఉదుంబరశాఖల పైభాగమున దేవవృందపూజితురా లగు లక్ష్మిని స్థాపించి శ్రీ సూక్తముతో యథోచితముగ పూజింపవలెను. పిమ్మట బ్రహ్మను పూజించి, ఆచార్యునకు శ్రీఫలము (నారికేళఫలము) మొదలగు దక్షిణ లీయవలెను. ప్రతిష్ఠిత మగు ద్వారముపై ఆచార్యుడు శ్రీహరిని స్థాపింపవలెను. (దేవాలయప్రతిష్ఠను "హృత్ప్రతిష్ఠా" ఇత్యాదిమంత్రముతో చేయవలెను. దానిని గూర్చి వినుము. వేదికంటె ముందు, (లేదా వేదికి తూర్పుగా) శుకనాస ఎచట సమాప్తమగునో అచట, గర్భగృహశిరోభాగమునందు బంగారు కలశను గాని, వెండి కలశను గాని స్థాపింపవలెను. దానిలో ఎనిమిది విధములైన రత్నములు, ఓషధులు, ధాతువులు, బీజములు, సువర్ణము ఉంచవలెను. ఆ కలశము కంఠమునకు వస్త్రము చుట్టి దానిని నీటితో నింపి, దానిని మండలముపై అధివాసితము చేయవలెను. దానిలో చిగుళ్ళు వేయవలెను. పిమ్మట నృసింహమంత్రముతో అగ్నియందు అజ్యధార పోయుచు హోమము చేసి నారాయణతత్త్వముతో ప్రాణన్యాసము చేయవలెను.

వైరాజభూతం తం ధ్యాయేత్ప్రాసాదస్య సురేశ్వర | తతః పురుషవత్సర్వం ప్రాసాదం చిన్తయేద్భుధః. 11

అధో దత్త్వా సువర్ణం తు తద్వద్బూతం ఘటం న్యసేత్‌. |

గుర్వాదౌ దక్షిణాం దద్యాతద్బ్రాహ్మణాదేశ్చ భోజనమ్‌. 12

తతః పశ్చాద్వేదిబన్దం తదూర్ధ్వం కణ్ఠబన్ధనమ్‌ | కణ్ఠోపరిష్టాత్‌ కర్తవ్యం విమలామలసారకమ్‌. 13

తదూర్ధ్వం వృకలం కుర్యాచ్చక్రం చాద్యం సుదర్శనమ్‌ |

మూర్తిం శ్రీవాసుదేవస్య గ్రహగుప్తాం నివేదయేత్‌. 14

కలశం వాథ కుర్వీత తదూర్ధ్వం చక్రముత్తమమ్‌ | వేద్యాశ్చ పరితః స్థాప్యాస్త్వష్టౌ విఘ్నేశ్వరాస్త్వజ. 15

చత్వారో వా చతుర్దిక్షు స్థాపనీయా గరుత్ముతః | ధ్వజారోహం చ వక్ష్యామి యేన భూతాది నస్యతి. 16

సురేశ్వరా! ఆ ప్రాసాదకలశమును విరాడ్రూపముగా భావింపవెలను. మొత్తము ప్రాసాదమును పురుషునిగా భావన చేయవలెను. క్రింద సువర్ణ ముంచి, సువర్ణకలశను స్థాపింపవలెను. గురువు మొదలైనవారికి దక్షిణ లిచ్చి బ్రహ్మణులకు భోజనములు పెట్టవలెను. దానిపైన కంఠభాగమునందు దారము గాని మాల గాని చుట్టవలెను. దానిపైన కూడ 'విమలామలసార' అను పుష్పమాలను దేవాలయము నాల్గువైపుల కట్టవలెను. దానిపైన వృకలము, దానిపైన సుదర్శనచక్రము నిర్మింపవలెను. అచటనే వాసుదేవాలయమూర్తి గ్రహగుప్త యని తెలుపవలెను. లేదా మొదట కలశమును, దానిపైన సుదర్శనచక్రమును ఏర్పాటు చేయవలెను. బ్రహ్మదేవా! వేదికి నలువైపుల ఎనమండ్రు విఘ్నేశ్వరులను స్థాపించవలెను. లేదా నాలుగు దిక్కులందు నలుగురు విఘ్నేశ్వరులను స్థాపించవలెను. ఇపుడు భూతాదినినాశ గరుడధ్వజారోపణవిధానము చెప్పెదను.

ప్రాసాదబిమ్భద్రవ్యాణాం యావన్తః పరమాణవః | తావద్వర్షసహస్రాణి తత్కర్తా విష్ణులోకభాక్‌. 17

కుమ్భాణ్డవేదిబిన్దూనాం భ్రమణాద్వాయునా నవ | కుణ్డస్యావేష్టనాద్‌జ్ఞేయం ఫలం కోటిగుణం ధ్వజాత్‌. 18

పతాకం ప్రకృతిం విద్ధి దణ్డం పురుషరూపిణమ్‌ | ప్రాసాదం వాసుదేవస్య మూర్తిభేదం నిబోధమే. 19

ధారణాద్దరణీం విద్ది ఆకాసం సుషిరాత్మకమ్‌ | తేజస్తత్పావకం విద్ది వాయుం స్పర్శగతం తథా. 20

దేవాలయమును నిర్మించినవాడు, ప్రాసాదబింబద్రవ్యములలో ఎన్ని పరమాణువు లున్నవో అన్ని వేల సంవత్సరములు విష్ణులోకములో నుండను. పాపరహితుడ వైన బ్రహ్మదేవా! వాయువుచే కదల్చబడిన ధ్వజపటము కలశమును, వేదిని, ప్రాసాదబింబకంఠమును ఎప్పుడు చుట్టుకొనునో అపుడు ప్రాసాదకర్తకుధ్వజారోపణముకంటె కోటిరెట్లు అధిర మగు ఫలము లభించు నని తెలిసికొనవలెను. వాతాక ప్రకృతి; దండము పురుషుడు; ప్రాసాదము వాసుదేవస్వరూపము. ప్రాసాదము భగవంతని ధరించుచున్నది గాన అదియే దానిలోని ధరణీతత్త్వము, దేవాలయము నందలి ఏ శూన్యావకాశ మున్నదో అదియే అకాశతత్త్వము. దానిలోని ప్రకాశ##మే అగ్నితత్త్వము. దానిలో కలుగు వాయుస్పర్శయే వాయుతత్త్వము.

పాషాణాదిష్వేవ జలం పార్థివం పృథివీగుణమ్‌ | ప్రతిశబ్దోద్భవం శబ్దం స్బర్శం స్యాత్కర్కశాదికమ్‌. 21

శుక్లాదికం భ##వేద్రూపం రసమన్నాది దర్శనమ్‌ | ధూమాదిగన్ధ గన్ధం తు వాగ్భేర్యాదిషు సంస్థితా. 22

శుకనాస్మృతా నాసా బాహూ తద్రథకౌ స్మృతౌ | శిరస్త్వణ్డం నిగదితం కలశో మూర్ధజాః స్మృతాః 23

కణ్ఠం కణ్ఠమితి జ్ఞేయం స్కన్ధో వేదో నిగద్యతే | పాయూపస్థే ప్రణాలే తు త్వక్సుధా పరికీర్తితా. 24

ముఖం ద్వారం భ##వేదస్య ప్రతిమా జీవ ఉచ్యతే| తచ్ఛక్తిం పిణ్డికాం విద్ది ప్రకృతిం చ తదాకృతిమ్‌. 25

నిశ్చలత్వం చ గర్భో7స్యా అధిష్ఠాతా తు కేశవః | ఏవమేష హరిః సాక్షాత్ప్రాసాదత్వేన సంస్థితః. 26

జజ్ఘాత్వస్య శివో జ్ఞేయః స్కన్ధేధాతా వ్యవస్థితఃం | ఊర్ద్వభాగే స్థితో విష్ణురేవం తస్యస్థితస్య హి. 27

ప్రాసాదస్య ప్రతిష్ఠాం తు ధ్వజరూపేణ పేణ మే శృణు | ధ్వజం కృత్వాసురైర్ధైత్యా జితాః శస్త్రాదిచిహ్నితమ్‌. 28

అణ్డోర్ధ్వం కలశం న్యస్య తదూర్థ్వం విన్యసేద్ధ్వజమ్‌ | బిమ్భార్ధమానం దణ్డస్య త్రిభాగేనాథ కారయేత్‌. 29

అష్టారం ద్వాదశారం వా మధ్యే మూర్తిమతాన్వితమ్‌ | నారసింహేన తార్‌క్ష్యేణ ధ్వజదణ్డస్తు నిర్వ్రణః. 30

ప్రాసాదస్య తు విస్తారో మానం దణ్డస్య కీర్తితమ్‌ | శిఖరార్ధేన వా కుర్యాత్తృతీయార్ధేన వా పునః. 31

ద్వారస్య దైర్ఘ్యాద్ద్విగుణం దణ్డం వా పరికల్పయేత్‌ | ధ్వజయష్టిర్దేవగృహే ఐశాన్యాం వాయవే7థవా. 32

పాషాణాదులలో నున్న జలము పార్థివజలము దానిలో పృథీవీగుణ మగు గంధ ముండును. ప్రతిధ్వనిరూప శబ్దమే అచటి శబ్దము. స్పృశింపగా కనబడు కఠోరత్వాదికమే స్పర్శ. శుక్లాదీవర్ణములు రూపము. ఆహ్లాదమును కలిగించు రసమే రసము ధూపాదిగంధమే గంధము భేర్యాదులలో ప్రకట మగు నాదమేవాక్కు. అది వాగింద్రియము వంటిది అందుచే వాగింద్రియము అచటనే ఉన్నదిని భావించవలెను. నాసిక శుకనాసయం దుండను, దాని రథకములు భుజములు. శిఖరముపై అండాకారము నున్నది శిరస్సు. కలశ కేశపాశము. ప్రాసాదకంఠభాగము కంఠము. వేది భుజము. రెండు నాళికలు గుదోపస్థులు . సున్నము త్వక్కు. ద్వారము ముఖము. ప్రతిమయే దేవాలయజీవాత్మ. పిండిక జీవశక్తి. దాని ఆకారము ప్రకృతి. నిశ్చలత దాని గర్భము. నారాయణుడు దాని అధిష్ఠాత. ఈ విధముగ మహావిష్ణులే దేవాలయరూపమున నిలచియున్నాడు. శివుడు కాళ్ళు; బ్రహ్మ స్కంధముపైన నున్నాడు. ఊర్థ్వభాగమున సాక్షాత్తు విష్ణువే ఉండును. ఈ విధముగ నున్న ప్రాసాదమున ప్రతిష్ఠింపబడు ధ్వజమును గూర్చి వినుము. శస్త్రాదిచిహ్నములతో కూడిన ధ్వజమును నిలబెట్టి దేవతలు దైత్యులను జయించిరి. అండముపై కలశము నుంచి, దానిపైన ధ్వజమును స్థాపింపవలెను. ధ్వజమానము బింబమానములో సగ ముండవలెను. ద్వజదండము పొడవులో మూడవ వంతుతో చక్రము నిర్మింపవలెను. ఆ చక్రమునందు ఎనిమిది కాని పండ్రెండు గాని ఆకు లుండవలెను. దాని మధ్య నృసింహుని మూర్తి గాని, గరుడుని మూర్తి గాని ఉండవలెను. ధ్వజదండము విరిగినదిగాని, రంధ్రాదు లున్నది గాని కాకూడదు. దండము పొడవు ప్రాసాదము వెడిల్పుతో సమముగా నుండవలెను. లేదా దాని పొడవు శిఖరముయొక్క సగముభాగము లేదా మూడవవంతు ఎంత ఉండునో అంత ఉండవలెను. లేదా ద్వారము పొడవుకంటె రెట్టింపు పొడవు ఉండవలెను. ఆ ధ్వజదండమును దేవాలయముపై ఈశాన్యమున గాని, వాయవ్యమున గాని స్థాపింపవలెను.

క్షమాద్యైశ్చ ధ్వజం కుర్యాద్విచిత్రం వైకవర్ణకమ్‌ | ఘణ్టాచామరకిఙ్కిణ్యా భూషితం పాపనాశనమ్‌ . 33

దణ్డా గ్రాద్దరణిం యావద్దసై#్తకం విస్తరేణ తు | మహాధ్వజః సర్వదః స్యాత్తుర్యాంశాద్దీనతో7ర్చితః 34

ధ్వజే చార్ధేన విజ్ఞేయా పతాకా మానవార్జితా | విస్తారేణ ధ్వజః కార్యో వింశదజ్గులసన్నిభః. 35

అధివాసవిధానేన చక్రం దణ్డం ధ్వజం తథా | దేవవత్సకలం కృత్వా మణ్డపస్నపనాదికమ్‌. 36

నేత్రోన్మలనకం త్యక్త్వా పూర్వోక్తం సర్వమాచరేత్‌ | అధివాసయేచ్చ విధినా శయ్యాయాం స్థాప్య దేశికః. 37

ధ్వజవస్త్రము (పతాక) పట్టుగుడ్డ మొదలైనవాటితో విచిత్రవర్ణముగ నుండునట్లు చేయవలెను. లేదా ఒకే రంగు ఉండునట్లు చేయవలెను. దానికి ఘంట, చామరములు, చిరుగంటలు కట్టినచో అది సర్వపాపవినాశకమగును. దండాగ్రమునుండి నేలవరకు వ్రేలాడు వస్త్రమునకు "మహాధ్వజము" అని పేరు. అది సంపూర్ణమునోరథముల నిచ్చును. దానికంటె నాల్గవ వంతు చిన్న దైనదానిని పూజించినచో సర్వమనోరథము సిద్దించును. ధ్వజములో సగము ప్రమాణము గల వస్త్రముతో నిర్మించినదానికి 'పతాక' అని పేరు లేదా పతాకకు కొలత ఏదియు అవసరము లేదు. ధ్వజవిస్తారము ఇదువది అంగుళము లుండవలెను. చక్ర-దండ-ధ్వజముల అధివాసనమును దేవతామూర్తులకు వలె చేసి, స్రకలీకరణము గూడ కావించి, మండపస్నానాదికార్యములు కూడ చేయవలెను. నేత్రోన్మీలనము తప్ప వెనుక చెప్పిన కార్యము లన్నియు చేయవలెను. ఆచార్యుడు వీటి నన్నింటిని శయ్యపై ఉంచి అదివాసనము చేయవలెను.

తతః సహస్రశీర్షేతి సూక్తం చక్రే న్యసేద్భుధః | తథా సౌదర్శనం మన్త్రం మనస్తత్వం నివేశ##యేత్‌. 38

మనోరూపేణ తసై#్యవ సజీవకరణం స్మృతమ్‌ | అరేషు మూర్తయో న్యస్యాః కేశవాద్యాః సురోత్తమ. 39

నాభ్యబ్జప్రతినేమీషు న్య సేత్తత్త్వాని దేశికః | నృసింహం విశ్వరూపం వా అబ్జమధ్యే నివేశ##యేత్‌. 40

సకలం విన్యసేద్దణ్ణ సూత్రాత్మానం సజీవమ్‌ | నిష్కలం పరమాత్మానం ధ్వజే ధ్యాయన్న్య సేద్దరిమ్‌. 41

తచ్ఛక్తిం వ్యాపినీం ద్యాయేద్ద్వజరూపాం బలాబలామ్‌ |

మణ్డపే స్థాప్య చాభ్యర్చ్య హోమం కుణ్ణషు కారయేత్‌. 42

కలశే స్వర్ణశకలం న్యస్య రత్నాని పఞ్చ చ | స్థాపమేచ్చక్రమన్త్రేణ

స్వర్ణచక్రమధస్తతః. 43

పారదేనతు సంప్లావ్య నేత్రపట్టేన ఛాదయేత్‌ | తతో నివేశ##యేచ్చక్రం తన్మధ్యే నృహరిం స్మరేత్‌. 44

పిమ్మట విద్వాంసుడు " సహస్రశీర్షా" ఇత్యాదిసూక్తమును ధ్వజాంకితచక్రముపై న్యాసము చేసి, సుదర్శన మంత్రమును, మనస్తత్త్వమును గూడ న్యాసము చేయవలెను. అది మనోరూపమున ఆ చక్రమున సజీవీకరణము. సురశ్రేష్ఠా! పండ్రెండు ఆకులపై (అదములపై) క్రమముగ కేశవాదిమూర్తుల న్యాసము చేయవలెను. కమలముపై నృసింహుని గాని, విశ్వరూపుని గాని ఉంచవలెను. దండముపై జీవసహితు డగు సూత్రాత్మను న్యాసము చేయవలెను. ధ్వజముపై, శ్రీహరిధ్యానము చేయుచు, నిష్కలపరమాత్ముని స్థాపించపవలెను. అతని బలాబలరూపవ్యాపకశక్తిని ధ్వజరూపమున ధ్యానింపవలెను. మండపముపై దానిని స్థాపించి, పూజించి, కుండములలో హోమము చేయవలెను. కలశములో బంగారు ఖండము, పంచరత్నములు ఉంచి, అస్త్రమంత్రముతో చక్రమును స్థాపింపవలెను. పిమ్మట సువర్ణచక్రమును, క్రింద నున్న పాదరసములో ముంచి నేత్రపటముతో కప్పవలెను. పిమ్మట చక్రము నుంచి, దాని మధ్యమున శ్రీహరిని స్మరింపవలెను.

ఓం క్షాం నృసింహాయ నమః పూజయేత్థ్సాపయేద్ధరిమ్‌ |

తతో ధ్వజం గృహీత్వా తు యజమానః సబాన్దవః. 45

దధిభక్తయుతే పాత్రే ధ్వజస్యాగ్రం నివేశ##యేత్‌ | ధ్రువాద్యేన ఫడన్తేన ధ్వజం మన్త్రేణ పూజయేత్‌. 46

శిరస్యాధాయ తత్పాత్రం నారాయణమనుస్మరన్‌ | ప్రదక్షిణం ప్రకుర్వీత తూర్యమఙ్గలనిఃస్వనైః. 47

తతో నివేశ##యేద్దణ్డం మన్త్రేణాష్టాక్షరేణ తు | ముఞ్చామిత్వేతి సూక్తేన ధ్వజం ముఞ్చేద్విచక్షణః. 48

పాత్రం ధ్వజం కుఞ్జరాది దద్యాదాచార్య కేద్విజః | ఏషసాధారణః ప్రోక్తో ధ్వజస్యారోహణ విధిః. 49

యస్య దేవస్య యచ్చిహ్నం తన్మన్త్రేణ స్థిరం చరేత్‌ | స్వర్గచ్ఛేద్ధ్వజదానాత్తు భువి రాజా బలీ భ##వేత్‌. 50

ఇత్యాది మహాపురాణ అగ్నేయే ద్వారప్రతిష్ఠాధ్వజారోహణావిధి ర్నామైక షష్టితమో7ధ్యాయః

"ఓం క్షౌం నృసింహాయ నమః" అను మంత్రముతో హరిని స్థాపించి పూజిచంవలెను. పిమ్మట యజమానుడు, బంధుసమేతుడై ధ్వజము తీసికొని దాని అగ్రభాగమును పెరుగుపాత్రలో ముంచవలెను. 'ఓం ఫట్‌' అను మంత్రముతో ధ్వజపూజ చేయవలెను. పిమ్మట ఆ పాత్రను తలపై పెట్టుకొని నారాయణస్మరణ చేయుచు వాద్యధ్వనులతో, మంగళపాఠములతో, పరిక్రమణము చేయవలెను. పిమ్మట అష్టాక్షరమంత్రముతో ధ్వజదండమును స్థాపించవలెను. "ముఞ్చామి త్వా" ఇత్యాదిసూక్తము చదువుచు ధ్వజములు విడువ (ఎగురువేయ) వలెను. ఆచార్యునకు పాత్ర-ధ్వజ-గజాదులు దానము చేయవలెను. ఇది ధ్వజారోపణసాధారణ విధి. ఏ దేవతకు ఏ చిహ్నమో ఆ చిహ్నమే ఉన్న ధ్వజమును, ఆ దేవాతామంత్రముతో స్థిరముగ స్థాపింపవలెను. ధ్వజదానము చేసినవాడు స్వర్గమునకు వెళ్ళును; ఈ లోకమునందు బలవంతు డగు రాజగును.

శ్రీఅగ్నిమహాపురాణమునందు ద్వార ప్రతిష్ఠాద్వజారోహణాదివిధి

యను ఆరువదియొకటవ అద్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters