Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ పఞ్చషష్టితమో7ధ్యాయః

అథ సభాది స్థాపన కథనమ్‌

శ్రీ భగవానువాచ:

సభాదిస్థాపనం వక్ష్యే తథైతేషాం ప్రవర్తనమ్‌ | భూమౌ పరీక్షితాయాం చ వాస్తుయాగం సమాచరేత్‌. 1

స్వేచ్ఛయా తు సభాం కృత్వా స్వేచ్ఛయా స్థాపయేత్సురాన్‌ |

చతుష్పథే చ గ్రామాదౌ న శూన్యే కారయేత్సభామ్‌. 2

నిర్మలః కుల ముద్ధృత్య కర్త స్వర్గే విమోదతే | అనేక విధినా కుర్యాత్స ప్తభౌమం హరేర్గృహమ్‌. 3

యథా రాజ్ఞాం తథాన్యేషాం పూర్వాద్యాశ్చ ధ్వజాదయః | కోణభూజాన్వర్జయిత్యా చతుఃశాలం తు వర్తయేత్‌. 4

త్రిశాలం వా ద్విశాలం వా ఏకశాలమథాపి వా | వ్యయాధికం న కుర్వీత వ్యయదోషకరం హితత్‌. 5

ఆయాధికే భ##వేత్పీడా తస్మాత్కుర్యాద్వ్యయం సమమ్‌ | కరరాశిం సమస్తంతు కుర్యాద్వసుగుణం గురుః. 6

సప్తార్చిషా హతే భాగే గర్గవిద్యావిచక్షణః | అష్టధా భాజితే తస్మిన్యచ్ఛేషం స వ్యయోమతః. 7

అథవా కరరాశిం తు హన్యాత్సప్తార్చిషా బుధః | వసుభిః సంహతే భాగే ధ్వజాది పరికల్పయేత్‌. 8

ధ్వజో ధూమ్రస్తథా సింహః శ్వా వృషస్తు ఖరో గజః| ధ్వాంక్షశ్చేతి క్రమేణౖవ మాయాష్టకముదాహృతమ్‌. 9

హయగ్రీవుడు చెప్పెను; ఇపుడు సభాదులను స్థాపించు విధానము చెప్పెదను. భూమి పరీక్ష చేసి అచట వాస్తుపరీక్ష చేయవలెను. ఇచ్ఛానుసారముగ దేవసభా నిర్మాణము చేసి, ఇచ్ఛానుసారముగ దేవతా స్థాపన చేయవలెను. సభా నిర్మాణము నగర చతుష్పథమునందు గాని, గ్రామాదులలో గాని చేయవలెను. జనశూన్యప్రదేశములందు చేయరాదు. దేవసభా నిర్మాణము చేసినవాడు పాపరహితుడై తన వంశము నంతను ఉద్ధరించు స్వర్గమునందు ఆనందమనుభవించును. రాజసౌధము నిర్మించిన విధముగ శ్రీహరికి ఏడు అంతస్తుల దేవాలయమును నిర్మింపవలెను. ఇతర దేవతలకు కూడ అట్లే పూర్వాది దిక్కులందు ఏర్పడు ధ్వజాధ్యాయములలో వాటిలో విదిక్కుల ఆయమును విడువలెను. నాలుగు, మూడు, రెండు లేదా ఒకటి శాల లుండు గృహము నిర్మింపవలెను. వ్యయము అధికముగ నుండు పదముపై గృహము నిర్మింపరాదు. అచట నిర్మించిన గృహమునందు వ్యయ మధికముగ నుండును. ఆయ మధికముగ నున్న పీడ కలుగదు. అందుచే ఆయవ్యయములు సమభావములో నుండు నట్లు చూచు కొనవలెను. ఇంటి పొడవు వెడల్పులు ఎన్ని హస్తములుండునో వాటిని ఒకదానితో ఒకటి గుణింపగా వచ్చిన సంఖ్యకు 'కరరాశి' అని పేరు. గర్గాచార్యుని జ్యోతిశ్శాస్త్రమునందు నిపుణు డగు ఆచార్యుడు దానిని ఎనిమిది రెట్లు చేయవలెను. దానిని ఏడు చేతభాగించగా వచ్చిన శేషము 'వ్యయము' లేదా కరరాశిని ఏడుచేత గుణించి దానిని మరల ఎనిమిదిచేత భాగించగా వచ్చిన శేషమను బట్టి ధ్వజాద్యాయములను కల్పించవలెను. ధ్వజము, ధూమ్రము, సింహము, శ్వానము, వృషభము, ఖరము, గజము, ధ్వాంక్షము అను ఎనిమిది ఆయములు పూర్వాది దిక్కలందు ఏర్పుడును.

త్రిశాలకగృహం శస్తముదక్పూర్వవివర్జితమ్‌ | యామ్యాం పరగృహోపేతం ద్విశాలం లభ్యతే నదా. 10

యామ్యే శాలైకశాలం తు ప్రత్యక్శాలమథాపి వా | ఏకశాలద్వయం శస్తం శేషాస్త్వన్యే భయావహాః 11

చతుఃశాలం సదా శస్తం సర్వోదోషవివర్జితమ్‌ | ఏకభౌమాది కుర్వీత భవనం సప్తభౌమకమ్‌. 12

ద్వారవేధాదిరహితం పూరణన వివర్జితమ్‌ | దేవగృహం దేవతాయాః ప్రతిష్ఠావిధినా సదా. 13

సంస్థాప్య మనుజానాం చ సముదాయోక్తకర్మణా | ప్రాతః సర్వౌషధీస్నానం కృత్వా శుచిరతన్ద్రితః. 14

మధురైస్తు ద్విజాన్‌ భోజ్య పూర్ణకుమ్బాదిశోభితమ్‌ | సతోరణం స్వస్తి వాచ్య ద్విజన్మా పృష్ఠహస్తకః. 15

గృహీ గృహం ప్రవిశేచ్చ దైవజ్ఞాన్ప్రార్చ్య సందిశేత్‌.

గృహే పుష్టికరం మన్త్రం పఠేచ్చేమం సమాహితః. 16

ఓం వన్దే నన్దయ వాసిష్ఠే వసుభిః ప్రజయా సహ | జయే భార్గవదాయాదే ప్రజానాం విజయావహే. 17

పూర్ణే7ఙ్గిరసదాయాడే పూర్ణకామం కురుష్వ మామ్‌ | భ##ద్రే కాశ్యపదాయాదే కురు భద్రాం మతిం మమ. 18

సర్వబీజౌషధీయుక్తం సర్వరత్నౌషధీవృతే | రుచిరే నన్దనే నన్దే వాస్ఠిషే రమ్యతామిహా. 19

ప్రజాపతిసుతే దేవి చతురస్రే మహీయసి | సుభ##గే సువ్రతే దేవి గృహే కాశ్యపి రమ్యతామ్‌. 20

పూజితే పరమాచార్యైర్గన్ధమాల్యైరలంకృతే | భవభూతికరే దేవి గృహే భార్గవి రమ్యతామ్‌. 21

అవ్యక్తే వ్యాకృతే పూర్ణే మునేరఙ్గిరసః సుతే | ఇష్టకే త్వం ప్రయచ్ఛేష్టం ప్రతిష్ఠాం కారయామ్యహమ్‌. 22

దేశస్వామి పురస్వామి గృహస్వామి పరిగ్రహే | మనుష్యధనహస్త్యశ్వపశువృద్ధికరీ భవ. 23

ఇత్యాదిమహాపురాణ అగ్నేయ సభాగృహస్థాపనం నామ పఞ్చషష్టితమోధ్యాయః.

త్రిశాలగృహమున కున్న అనేక భేదములలో మొదటి మూడును ఉత్తమమైనవి. వీటిని ఈశాన్యమునందు నిర్మింపరాదు. దక్షిణమున అన్యగృహములతో గూడిన ద్విశాలాగృహము సర్వదా శ్రేష్ఠము. దక్షిణమున అనేక శాలా గృహము, ఏకశాలాగృహము గూడ ఉత్తమము. నైరృతిదిక్కునందు ఏకశాలాగృహము శ్రేష్ఠము. ఏకశాలగృహములో మొదటి రెండు భేదములును (ధ్రువము, ధాన్యము అనునవి) ఉత్తమముల. మిగిలినవి, అనగా పంచమ-నవమ-దశమ-ఏకాదశ- త్రయోదశ-చతుర్దశ భేదములు భయహేతువులు, చతుఃశాలాగృహము సర్వదా ఉత్తమము; సర్వదోషరహితము, దేవతలకు ఒక అంతస్తు మొదలు, ఏడు అంతస్తులు లుండునట్లు ఏర్పరుపవలెను. దానికి ద్వారవేధాది దోషములుగాని, ప్రాచీన వస్తువులు గాని ఉండకూడదు. దానిని మానవులకు చెప్పిన కర్మలు, ప్రతిష్ఠా విధానము అనుసరించి స్థాపించవలెను. గృహప్రవేశము చేయనున్న గృహస్థుడు, సోమరితనము లేనివాడై, ఉదయముననే లేచి, సర్వౌషధులు కలిపిన జలముతో స్నానముచేసి, పవిత్రుడై, దైవజ్ఞములైన బ్రహ్మణులకు నమస్కరించి, వారికి మధురపదార్థములు భుజింప చేసి, వారిచే స్వస్తివాచనాదికము చేయించి, నడ్డిపై చేతులు పెట్టుకొని పూర్ణకలశాదులతో సుశోభిత మగు తోరణములు గల గృహము ప్రవేశించవలెను. పిమ్మట ఏకాగ్రచిత్తుడై గోవు ఎదుట చేతులు జోడించి, ఈ పుష్టికారక మంత్రములు పఠించవలెను. ''ఓం వసిష్ఠునిచే పాలింపబడిన ఓ నందా! ధనసంతానాదుల నొసగి నా ఆనందమును వృద్ధిపొందిపుము. ప్రజలకువిజయము నిచ్చు భార్గవనందినియైన జయా! నన్ను ధనసంపదలతో ఆనందింపచేయుము, అంగిరసుని పుత్రియైన ఓ పూర్ణా! నా మనోరథమునలు ఈడేర్పుము. నన్ను పరిపూర్ణకాముని చేయుము, కాశ్యపకుమారి యైన భద్రా! నా బుద్ధిని కల్యాణమయము చేయుము. అందరికిని ఆనందము నిచ్చు వసిష్ఠనందిని యైన నందా ! నీవు సమస్తబీజములతో, ఓషధులతో కూడి, సకలరత్నౌషధి పూర్ణురాలవై ఈ సుందర భవనమునందు ఆనలదపూర్వకముగ నివసింపుము. కశ్యప్రజాపతిపుత్రివైన ఓ భద్రా ! నీవు సర్వవిధముల సుందర మైనదానవు, మహత్త్వము కలదానవు. సౌభాగ్యశాలినివి. ఉత్తమవ్రతమును పాలించుదానవు. నా ఇంటిలో ఆనందపూర్వకముగ నివసింపుము. దేవి! భార్గవీ! జయా! సర్వశ్రేష్ఠులైన ఆచార్యులు నిన్ను పూజించిరి. చందనపుష్పమాలాలంకృతురాల వైన నీవు ప్రపంచమునందలి సకలైశ్వర్యములను ఇచ్చుదానవు. నా గృహమునందు ఆనందపూర్వకముగ విహరింపుము. అంగిరసుని పుత్రి వైన పూర్ణా! నీవు అవ్యక్తరూపిణివి. ఓ ఇష్టకాదేవీ! నీవు నాకు అభిష్టవస్తువుల నిమ్ము. నా ఇంటిలో ఉండు మని కోరుచున్నాను. నీవు దేశప్రభువును గ్రామనగర ప్రభువులను, గృహప్రభువును అనుగ్రహించుదానవు. నా గృహమునందు జన-ధన-గజ-అశ్వ-గో-మహిష్యాదివృద్ధి కలుగు నట్లు చేయుము.

శ్రీ అగ్నిమహాపురాణమునందు సభాగృహస్థాపన మను అరువదియైదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters