Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ సప్తతితమో7ధ్యాయః అథ వృక్షాది ప్రతిష్ఠాకథనమ్ శ్రీ భగవానువాచ: ప్రతిష్ఠాం పాదపానాం చ వక్ష్యే7హం భుక్తిముక్తిదామ్ | సర్వౌషధ్యుదకైర్లిప్తాన్ పిష్టాతకవిభూషితాన్. 1 వృక్షాన్మల్యైరలంకృత్య వాసోభిరభివేష్టయేత్ | సూచ్యాసౌవర్ణయా కార్యం సర్వేషాం కర్ణవేధనమ్. 2 హేమశలాకయఞ్జనం చ వేద్యాం తు ఫలసప్తకమ్ | అధివాససయేచ్చ ప్రత్యేకం ఘటాన్బలినివేదనమ్. 3 ఇన్ద్రాదేరధివాసో7థ హోమః కార్యో వనస్పతేః | వృక్షమధ్యాదుత్సృజేద్గాం తతో7భి షేకమన్త్రతః. 4 ఋగ్యజుఃసామన్త్రైశ్చ వారుణౖర్మఙ్గలారైవః | వృక్షవేదికకుమ్బైశ్చ స్నపనం ద్విజపుఙ్గవాః. 5 తరుణాం యజమానస్య కుర్యశ్చ యజమానకః | భూషితో దక్షిణాం దద్యద్గోభూభూషణవస్త్రకమ్. 6 క్షీరేణ భోజనం దద్యాద్యావద్దినచతుష్టయమ్| హోమస్తిలాద్యైః కార్యస్తు పలాశసమిధైస్తథా . 7 ఆచార్యే ద్విగుణం దద్యాత్పూర్వవన్మణ్డపాదికమ్ | పాపనాశఃపరా సిద్దిర్వృక్షారామప్రతిష్ఠయా. 8 స్కన్దాయేశో యథాప్రాహ ప్రతిష్ఠాద్యం తథా శృణు | సూర్యేశగణశాక్త్యాదేః పరివారస్య వై హేరేః. 9 ఇత్యాది మహాపురాణ అగ్నేయే పాదపారామప్రతిష్ఠాకథనం నామ సప్తతితమో7ధ్యాయః శ్రీ భగవంతుడు చెప్పెను : ఇపుడు భోగమోక్షముల నిచ్చు వృక్ష ప్రతిష్ఠనుగూర్చి చెప్పెదను. వృక్షములకు సర్వౌషధిజలములు పూసి, సగుంధచూర్ణము చల్లి, మాలలచే అలంకరించి వస్త్రములు చుట్టబెట్టవలెను. అన్ని వృక్షములకు బంగారు సూదులతో కర్ణవేధనము చేసి, సువర్ణమయ శలాకతో అంజన ముంచవలెను. వేదికపై ఏడు ఫలము లుంచి, ఒక్కొక్క వృక్షమునకు అధివాసనముచేసి కుంభము సమర్పించవలెను. పిదప ఇంద్రాది దిక్పాలకుల నుద్దేశించి బలిప్రదానము చేయవలెను. వృక్షాధివాసన సమయము, బుగ్వేదమంత్రములతోగాని, యజుర్వేదమంత్రుమలతో గాని, సామవేద మంత్రములతోగాని, వరుణ దేవతాకమంత్రములతో గాని, మత్తభైరవమంత్రములతో గాని హోమము చేయవలెను. శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు వృక్షవేదికపై నున్న కలశలతో వృక్షములకును, యజమానునకును స్నానము చేయించవలెను. యజమానుడు అలంకరించుకొని బ్రాహ్మణులకు గో-భూ-భూషణ-వస్త్రాదులు దక్షిణగా ఇచ్చి నాలుగు దివసములు క్షీరయుక్త భోజనము పెట్టవలెను. తిల-ఘృత-పలాశసమిధలతో హోమము చేయించవలెను. ఆచార్యునకు రెట్టింపు దక్షణ ఇవ్వవలెను. మండపాది నిర్మాణము వెనుక చెప్పిన విధముననే చేయవలెను. వృక్ష-ఉద్యానముల ప్రతిష్ఠ చేయుటటే పాపములు నశించి పరమసిద్ధి లభించును. ఇపుడు సూర్య-శివ-గణపతి-శక్తి-శ్రీహరి పరివారముల ప్రతిష్ఠా విధానమును వినుము. దీనిని మహేశ్వరుడు కుమారస్వామికి చెప్పెను. అగ్ని మహాపురణామునందు పాదపారామప్రతిష్ఠావిధాన కథనమను డెబ్బదవ అధ్యాయము సమాప్తము.