Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ అష్టమో7ధ్యాయః. అథ కిష్కిన్ధాకాణ్డ వర్ణనమ్. నారద ఉవాచ : రామః పమ్పాసరో గత్వా7శోచత్స శబరీం తతః | హనూమతాథ సుగ్రీవం నీతో మిత్రం చకార హ. 1 కిష్కన్ధాకాణ్డవర్ణనము. నారదుడు పలికెను. రాముడు పంపాసరస్సు చేరి దుఃఖించెను. పిమ్మట శబరివద్దకు వెళ్లెను. పిమ్మట హనుమంతడు సుగ్రీవుని వద్దకు తీసికొనిపోగా ఆతనిని తన మిత్రినిగ చేసికొనెను. సప్త తాళాన్వినిర్భిద్య శ##రేణౖ కేన పశ్యతః | పాదేన దున్దుబేః కాయం చిక్షేవ దశయోజనమ్. 2 సుగ్రీవుడు చూచుచుండగా ఒక బాణము చేత ఏడు తాళవృక్షములను భేదించి, దుందుభి శరీరమును పది యోజనముల దూరము విసరెను. తద్రిపుం వాలినం హత్వా భ్రాతరం వైరకారిణమ్ | కిష్కిన్ధాం కపిరాజ్యం చ రుమాం తారాం సమార్పయత్. బుశ్యమూ కే హరీశాయ కిష్కిన్ధేశో7బ్రవీత్స చ | సీతాం త్వం ప్రాప్స్యసే యద్వత్తథా రామ కరోమి తే. 4 ఆతని సోదరుడును, వైరము చేయుటచే శత్రవును ఆగు వాలిని చంపి ఋశ్యమూకముపై ఉన్న ఆతనికి కిష్కింధను, వానరరాజ్యమును, రుమను, తారను ఇచ్చెను. సుగ్రీవుడు ఇట్లు పలికెను. ''రామా! నీకు సీత లభించు నట్లు చేసెదను. తచ్ర్ఛుత్వా మాల్యవత్పృష్ఠే చాతుర్మాస్యం చకార సః | కిష్కిన్ధాయాం చ సుగ్రీవో యదా నాయాతి దర్శనమ్. 5 తదా బ్రవీత్తం రామోక్తం లక్ష్మణో వ్రజ రాఘవమ్ | న స సఙ్కుచితః పన్థా యేన వాలీ హతో గతః. 6 సమయే తిష్ఠ సుగ్రీవ మా వాలిపథమన్వగాః. రాముడు ఆ మాటలు విని మాల్యవత్పర్వతముపై వర్షాకాలము నాలుగు మానములను గడపెను. కిష్కింధలో ఉన్న సుగ్రీవుడు మరల కనబడక పోగా లక్ష్మణుడ రాముడు చెప్పిన విధమున ఆతనితో ఇట్లు చెప్పెను. ''నీవు రాముని దగ్గరకు వెళ్లుము. వాలి రామునిచే నిహతుడై వెళ్లిన మార్గము ఇంకను మూసివేయబడలేదు. సుగ్రీవా! మాటమీద నిలబడుము. వారి మార్గమును అనుసరించకుము''. సుగ్రీవ ఆహ సంసక్తో గతం కాలం న బుద్దవాన్ | ఇత్యుక్త్వా స గతో రామం నత్వోవాచ హరీశ్వరః. 7 వానరాధిపతి యైన సుగ్రీవుడు ''కార్యాసక్తుడనైన నేను గడచిన కాలమును గుర్తించ జాలకపోతిని'' అని పలికి రాముని వద్దకు వెళ్లి నమస్కరించి ఇట్లు పలికెను. సుగ్రీవ ఉవాచ : ఆనీతా వానరాః సర్వే సీతాయా శ్చ గవేషణ త్వన్మతాత్ర్పేషయిష్యామి విచిన్వన్తు చ జానకీమ్ | పూర్వాదౌ మాసమాయాన్తు మాసాదూర్ధ్వం నిహన్మి తాన్. 9 సుగ్రీవుడు పలికెను: వానురరులనందరిని పిలిపించితిని. నీ అభిలాష ప్రకారము వారిని సీతాన్వేషణమ నిమిత్తమై పంపగలను. వారు తూర్పుదిక్కు మొదలైన దిక్కులందు సీతను మానములోపున అన్వేషించవలెను. మాసము దాటినచో వారిని చంపెదను. ఇత్యుక్తా వానరాః పూర్వపశ్చిమోత్తరమార్గగాః | జగ్మూ రామం ససుగ్రీవమపశ్యన్తస్తు జానకీమ్. 10 ఈ విధముగా ఆజ్ఞాపింపబడిన వానరులు తూర్పు-పశ్చిమము, ఉత్తరము వైపు వెళ్లి అచట సీతను గానక రామ సుగ్రీవుల వద్దకు తిరిగి వచ్చిరి. రామాఙ్గులీయం సఙ్గృహ్యా హనుమాన్ వానరైః సహ | దక్షిణ మార్గయామాస సుప్రభాయా గుహాన్తికే. 11 హనుమంతుడు రాముని అంగుళీయకమును తీసికొని, వానరసమేతుడై దక్షిణ దిక్కునందు సుప్రభ గుహ సమీపమున అన్వేషించెను. మాసాదూర్ధ్వం చ విన్ధ్యస్థా అపశ్యన్తస్తు జానకీమ్ | ఊచుర్వృథా మరిష్యామో జటాయుర్ధన్య ఏవ సః. 12 సీతార్థే యో7త్యజత్ర్పాణాన్ రావణన హతో రణ | మాసము దాటిన తరువాత కూడ వింధ్యపర్వతమునందు ఉండి సీతను చూడజాలని ఆ వానరులు ఇట్లు అనుకొనిరి. ''మన మందరము వ్యర్థముగా మరణించనున్నాము. యుద్దమునందు రావణునిచే చంపబడి, సీత నిమత్తమై ప్రాణములు విడచిన ఆ జటాయువు ధన్యుడు కదా!'' తచ్ర్ఛుత్వా ప్రాహ సమ్పాతిర్విహాయ కపిభక్షణమ్. 13 భ్రతా7సౌ మే జటాయుర్త్వె మయోడ్డీనో7ర్కమణ్డలమ్ | అర్కతాపాద్రక్షితో7గాద్దగ్ధపక్షో7హమభ్రగః. 14 రామవార్తాశ్రవాత్పక్షౌ జాతా భూయోథ జానకీమ్ | పశ్యామ్యశోకవనికాగతాం లఙ్కాగతాం కిల. 15 శతయోజనవిస్తీర్ణే లవణాబ్దౌ త్రికూటకే | జ్ఞాత్వా రామం ససుగ్రీవం వానరాః కథయన్తు వై. 16 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే రామాయణ కిష్కిన్ధాకాణ్డ వర్ణనం నామాష్టమో7ధ్యాయః. ఆ మాటలు విని సంపాతి వానరులును భక్షించుట మాని ఇట్లు పలికెను. ఆ జటాయువు నాసోదరుడు , నాతో కలిసి సూర్య మండలము వైపు ఎగిరెను. అతనిని నేను సూర్యుని వేడవిమినుండి రక్షించగా భూమి పై పడెను. ఆకాశము పైనున్న నా రెక్కలు కాలిపోయినవి. రాముని కథ వినుటచే నా రెక్కలు మరల మొలచినవి. ఓ వానరులారా! శత యోజనవిస్తీర్ణమైన లవణ సముద్రమున,. త్రికూటపర్వతముపై నున్న లంకాపట్టణమునందు అశోకవనములో ఉన్న జానకి నాకు కనబడుచున్నది. ఈ విషయము తెలిసికొని రామసుగ్రీవులకు తెలుపుడు. అగ్ని మహాపురాణమునందు రామాయణ కథలో కిష్కిన్దాకాండ వర్ణనమును అష్టమాధ్యమాయము సమాప్తము.