Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకాశీతితిమో7ధ్యాయః

అథ సమయదీక్షా విథనామ్‌

ఈశ్వర ఉవాచ:

వక్ష్యామి భోగమోక్షాయ దీక్షాం పాపక్షయంకరీమ్‌ | మలమాయాదిపాశానాం విశ్లేషః క్రియతే యమా. 1

జ్ఞానం చ జన్యతే శిష్యే సా దీక్షీ భుక్తిముక్తిదా | విజ్ఞాతకలనామైకో ద్వితీయః ప్రలయాకలః. 2

తృతీయః సకలః శాస్త్రే7నుగ్రాహ్యాస్త్రివిధోమతః | తత్రార్యో మలయాత్రేణ ముక్తో7న్యో మలకర్మభిః. 3

కలాది భూమిపర్యన్తం స్తమైస్తు సకలో యుతః | నిరాధీరా సాధారా దీక్షాపి ద్వివిధా మతా. 4

నిరాధారా ద్వయోస్తేహాం సాధారా సకలస్యతు | ఆధారనిరపేక్షణ క్రియతే శమ్భుచర్యయా. 5

తీవ్రశక్తినిపాతేన నిరాధారేతి సా స్మృతౌ | ఆచార్యమూర్తిమాస్థాయ మాయా తీవ్రాదిభేదతూ. 6

శక్త్యా యాం కురుతే శమ్భుః సా సాధికరణోచ్యతే | ఇయం చతుర్విధా ప్రోక్తా సబీజా బీజవర్జితా. 7

సాధికారానధికారా యథా తదభిధీయతే | సమయాచారసంయుక్తా సబీజా జాయతే నృణామ్‌. 8

నిర్జీజాత్యసమర్థానాం సమయాచారవిర్జితా | నిత్యేనైమిత్తికే కామ్యే యతః స్యాదధికారితా. 9

సాధికారా భ##లేద్దీక్షా సాధకాచార్యయోరతః | నిర్బీజా దీక్షితానాం తు యదా నమయపుత్రయోః. 10

నిత్యమాత్రాధికారత్వాద్దీక్షా నిరధికారికా | ద్వివిధేయం ద్విరూపా హి ప్రత్యేకముపజాయతే. 11

ఏకా క్రియావతకీ తత్ర కుణ్డమణ్డలపూర్వికా | మనోవ్యాపారమాత్రేణ యా సా జ్ఞానవతీ మతా. 12

ఈశ్వరుడు పలికెను-ఇపుడు భోగ - మోక్షప్రద మగు దీక్షా విధానమును గూర్చి చెప్పెదను. ఇది సమస్త పాపములను నశింపచేయును. మల - మాయాదులను తొలగించును జ్ఞానమును కలిగించుదానికి దీక్ష యని పేరు. అది భోగ మోక్షముల నిచ్చును. విద్యచే అనుగ్రహింపదగిన శిష్యుడు - విజ్ఞానకలుడు, ప్రలయాకలుడు, సకలుడు అని మూడు విధములు. కేవలము మలరూప మగు పాశము కలవాడు "విజ్ఞానకలుడు" మలముచేతను, పాశములచేతను బద్ధుడైన వాడు "ప్రలయాకలుడు." కలలు మొదలు భూమివరకును గల సకలతత్త్వసమూహములచే బుద్ధుడైనవాడు "సకలుడు" ఈ పాశములనుండి ముక్తి పొందవలె నన్నచో జీవుడు (పశువు) ఆచార్యునినుండి మంత్రారాధనదీక్ష గ్రహింపవలెను, ఈ దీక్ష 'నీరాధార', 'సాధార' అని రెండు విధములు, విజ్ఞానాకల - ప్రలయాకలులకు నిరాధారదీక్ష విహిత మైనది. "సకల జీవునకు సాధారదీక్ష విహితమైనది ఆచార్యుని అపేక్ష లేకుండగనే శంభువుని నుండి తీవ్ర శక్తిపాతము ఇవ్వబడు దీక్షకు "నిరాధార" దీక్ష యని పేరు. శివుడు ఆచార్యుని శరీరములో నుండి మంద-తీవ్రాది భేదభిన్నమగు తన శక్తితో ఇచ్చు దీక్షకు "సాధారదీక్ష" యని పేరు ఈ సాధార దీక్షలో నున్న "సబీజ-నిర్బీజ- సాధికార- అనధికారములను నాలుగు భేదములను గూర్చి చెప్పెదను. సమర్థుల కిచ్చు సమయాచారయుక్తదీక్షకు 'సబీజదీక్ష' యనియు, అసమర్థుల కిచ్చు సమాయాచారశూన్యదీక్షకు 'నిర్బీజదీక్ష' అనియు పేర్లు సాధకునకును, ఆచార్యునకును నిత్య - నైమిత్తిక - కామ్యకర్మలందు అధికారమును కలిగించుదీక్షకు "సాధికార దీక్ష" యని పేరు. నిర్బీజదీక్షా దీక్షితులకును, సమయాచార దీక్షను స్వీకరించు సాధారణ శిష్యులకును, పుత్రకులను పేరుగల శిష్యులకును నిత్యకర్మలందు మాత్రమే అధికారము. అందుచే వారికి కిచ్చు దీక్ష నిరధికార దీక్ష సాధార - నిరాధారదీక్షలకు కూడ, ఒక్కొక్కదానికి, 'క్రియావతి' "జ్ఞానవతి' అను రెండేసి భేదములున్నవి. కర్మకాండ విధి ప్రకారము కుండము, మండలము స్థాపించి, పూజచేయు దీక్ష 'క్రియావతి' బాహ్యసామగ్రి ఏదియు లేక మానసిక వ్యాపారమాత్రముచేతనే సాధ్యమైనది "జ్ఞానవతి" .

ఇత్థం లబ్థాధికారేణ దీక్షాచార్యేణ సాధ్యతే | స్కన్దదీక్షాం గురుః కుర్యాత్కృత్వా నిత్యక్రియాం తతః. 13

ప్రణవార్ఘ్యకరామ్భోజః కృతద్వారాధిపార్చనః |

విఘ్నానత్సార్య ధేహల్యాం న్యస్సాస్త్రం స్వాసనే స్థితః . 14

కుర్వీత భూతసంశుద్ధిం మన్త్రయోగం యథోదితమ్‌ | తిలతణ్డుల సిద్దార్థకుశదూర్వాక్షతోదకమ్‌ | 15

సయవక్షేరనీరం చ విశేషార్ఘ్యమిదం తతః | తదమ్బునా ద్రవ్యశుద్ధిం తిలకం స్వాసనాత్మనోః. 16

పూజనం మన్త్రశుద్ధిం చ పఞ్చగవ్యం చ పూర్వవత్‌ | లాజచన్దనసిద్థార్థ భస్మదూర్యాక్షతం కుశాన్‌. 17

వికిరాఞ్ముద్దలాజాంస్తాన్సధూపానస్త్రమిన్త్రితాన్‌ | శస్త్రామ్భుప్రోక్షినేతాన్‌ కరచేనామగుణ్ఠితాన్‌. 18

నానాప్రహరణాకారాన్విఫ°్నఘవినివారకాత్‌| దర్భాణాం తాలమానేన కృత్వా షట్త్రింశతా దవైః. 19

సప్తజప్తం శివాస్త్రేక్ష వీణం బోధాసిముత్తమమ్‌ | శివమాత్మని విన్యస్య సృష్ట్వాధారమమభీప్సిమ్‌. #9; 20

నిష్కలం చ శివం న్యస్య శివో7హమితి భావయేత్‌ |

ఉష్ణేషం శిరసి న్యస్య అలజ్గుర్యాత్స్వదేహకమ్‌. 21

గన్దమణ్డనకం స్వీయే విదధ్యాద్దక్షిణ కరే | విథీనాత్రార్చయేదీశమిత్థం స్వాచ్ఛివమన్తకమ్‌. 22

విన్యస్య శివమన్త్రేణ భాస్వరం నిజమస్తకే | శివాదభిన్నమాత్మానం కర్తారం భావేయ ద్యాథా. 23

మణ్డలే కర్మణాం సాక్షే కలశే యజ్ఞరక్షకః | హోమాధికరణం వహ్నౌ శిష్యే పాశవిమోచకః. 24

స్వాత్మన్యనుగృహేతేతి షడాధారో య ఈశ్వరః | స్నో7హమేలేతి కుర్వీత భావం స్థిరతరం పునః. 25

ఈ విధముగ దీక్ష అధికారము గల ఆచార్యునిచేత ఇవ్వబడును. స్కందా! గురువు నిత్యకర్మలను యధా శాస్త్రముగ నిర్వర్తించుకొని శిష్యునకు దీక్ష ఇవ్వవలెను. గురువ ప్రణజపము చేయుచు త కరకమలములతో అర్ఘ్యము గ్రహించి ద్వారపాలపూజ చేయవలెను. విఘ్ననివారాణము చేసిన పిమ్మట ద్వారము గుమ్మము మీద అస్త్రన్యాసము చేసి, తన అసనముపై కూర్చుండి శాస్త్రోక్తవిధానమున భూతశుద్ధిని, అంతర్యాగమును చేయవలెను. తిలలు, బియ్యము, ఆవాలు కుశలు, దూర్వాంకురములు, యవలు, పాలు, ఉదకము-వీటి నన్నింటిని ఒక చోట ఉంచి విశేషార్ఘ్యము ఏర్పరచుకొనవలెను. ఆ జలముతో సమస్తద్రవ్యముల శుద్ధి చేయవలెను. తిలకము ధరించి వెనుకటి వలెనే పూజా-మంత్రశోధన-పంచగర్య ప్రాశనాదికము చేసి, పేలాలు, చందనము, ఆవాలు, భస్మము, దూర్వలు. అక్షతలు, కుశలు, చివర మరల శుద్ధమైన పేలాలు అను వికిరద్రవ్యములు (చల్లుటకు ఉపయోగించు ద్రవ్యములు) గ్రహించి, అస్త్రమంత్రముచే ఏడు పర్యాయములు అభిమంత్రించి, అస్త్రమంత్రాభి మంత్రిత జలముతో ప్రోక్షించి, కవచమంత్రముచే (హుమ్‌) ఆచ్ఛాదించి-"ఇది విఘ్నసమూహములను తొలగించు నానావిధాస్త్ర శస్త్రములు" అని భావన చేయవలెను. పిమ్మట ప్రాదేశమాత్రము పొడవైన ముప్పది యారు కుశదళములతో లేణీ రూపమును, బోధమయమును అగు ఉత్తమఖడ్గము నిర్మించి, దానిని శివ మంత్రము ఏడు పర్యాయములు జపించి, అభిమంత్రించవలెను. అది శివస్వరూపముగ భావించి తన హృదయమున ఉంచు కొనవలెను. తన కభీష్టమైన శివుని రూపమును ధ్యానించుచు, నిష్కల పరమాత్మయగు ఆ శివుని తనలో న్యాసము చేసికొనవలెను. పిదప "నేనే శివుడను" అని భావన చేయవెలను. శిరస్సుపై తెల్లని శిరస్త్రాణము ధరించి తన శరీరమును అలంకరించుకొనవలెను. పిమ్మట గురువు తన కుడి చేతిపై సుగంధద్రవ్యములతో గాని, కుంకుమలతో గాని మండలమును నిర్మించవలెను. దానిపై శివుని పూజించవలెను. ఇట్లు చేయటచే అది శివహస్తమగును. తేజస్వియైన ఆ శిన హస్తమును తన శిరస్సుపై ఉంచుకొని, -"నేను శివుడను సకల జగత్స్రష్టయగు పరమాత్ముడనైన శివుడను నేనే" అని దృఢమగు భావన చేయవలెను. ఈ విధముగ భావన చేసి గురువు యజ్ఞ మండపమునందు కర్మాసాక్షిగాను, కలశముపై యజ్ఞ రక్షకుడుగాను, అగ్నిలో హోమాధిష్ఠాతగాను, శిష్యుని ఆజ్ఞానమయపాశ##చ్చేత్తగాను, అంతరాత్మయందు అనుగ్రహకర్తగాను, ఐదు విధముల అభివ్యక్తుడైన ఈశ్వరరూపుడగును. ఆ "పరమేశ్వరుడను నేనే" అను దృఢతర మగు భావన గురువునకు ఉండవలెను.

జ్ఞానఖడ్గకరః స్థిత్వా నైరృత్యబిముఖో నరః |

సార్ఘ్యామ్బుషఞ్చగవ్యాభ్యాం ప్రోక్షయేద్యాగమణ్డపమ్‌. 26

చతుష్పథాన్తసంస్కారైః సంస్కురాదీక్షణాదిభిః | విక్షిప్య వికిర్ధాంస్తత్ర కుశకుర్చ్యోపసంహరేత్‌. 27

తానాశదిశి వర్థన్యామాసనాయోపకల్పయేత్‌ | నైరృతే వాస్తు గీర్వాన్ద్వారే లక్ష్మీం ప్రపూజయేత్‌. 28

అప్యే రత్నైః పూరయన్తీం హృదా మణ్డపరూపిణమ్‌ | సామ్భువస్త్రే సరత్నే చ ధాన్యాస్యే పశ్చిమాననే. 29

ఐశే కుమ్భే యజేచ్ఛమ్భుం శక్తిం కుమ్భస్య దక్షిణ |

పశ్చిమస్యాం తు సింహస్థాం వర్థనీం ఖడ్గరూపిణీమ్‌. 30

దిక్షు శక్రాదిదిక్పాలాన్‌ విష్ణన్తాన్‌ ప్రణవాసనాన్‌ | వాహనాయుధసంయుక్తాన్‌ హృధాభ్యర్చ్య స్వనానుభిః.

ప్రథమం తాం సమాదాయ కుమ్భస్యాగ్రాభిగామినీమ్‌ |

అవిచ్ఛిన్నపయోధారాం భ్రామయిత్వా ప్రదక్షిణమ్‌. 32

శివాజ్ఞాం లోకపాలానాం శ్రావమేన్మూలముచ్చరన్‌ |

సంరక్షిత యథా యోగం కుమ్భం ధృత్వాథ తాం ధరేత్‌. 33

తతః స్థిరాసనే కుమ్భే సాఙ్గం సంపూజ్య శఙ్కరమ్‌ | విన్యస్య శోధ్యమథ్వానం వర్థన్యామస్త్రమర్చయేత్‌. 34

పిమ్మట గురువు జ్ఞానరూప మగు ఖడ్గము చేత ధరించి యజ్ఞమండపము నైరృతి దిక్కున ఉత్తారాభిముఖుడై నిలచి జల-పంచగవ్యములతో మండపమును ప్రోక్షించి, ఈక్షణాది చతుష్పఢాంతసంస్కారములతో దానిని సంస్కరింపవలెను. యజ్‌క్ష మండపమున చల్లవలసిన వస్తువులను చల్లి వాటిని కుశకూర్చతో ప్రోగుచేసి, ఈశానకోణమునందు స్థాపిత మగు వర్దనికి ఆసనముగ చేయవలెను. నైరృతిదిక్కునందు వాస్తుదేవవతలను, పశ్చిమద్వారమున లక్ష్మిని పూజించవలెను. ''ఈ మండప రూపిణి యగు లక్ష్మి రత్నములతో యజ్ఞమండపమును నింపుచున్నది'' అని భావన చేయవలెను. ఈ విధముగ ధ్యానించి ఆవాహనము చేసి, హృదయమంత్రముతో (నమః) పూజించవలెను. ఈశాన్యమున సప్తధాన్యములపై స్థాపిత మైన, వస్త్ర వేష్టితము, పంచరత్నయుక్తము అగు పశ్చిమాభిముఖమైన జలపూర్ణ కలశముపై శంకరుని పూజించవలెను. ఆ కలశమునకు దక్షిణమున సింహముపై కూర్చున్న శక్తిని, పశ్చిమమున ఖడ్ధరూపిణి యగు వర్ధనిని పూజించవలెను. పిమ్మట పూర్వాధి దిక్కులందు ఇంద్రాది దిక్పాలకులను పూజించి, అంతమున విష్ణువును పూజించవలెను. ఆ దేవతలందరును ప్రణవరూప మగు ఆసనమున కూర్చుండి, తమ తమ వాహనములతోను, ఆయుధములతోను కూడియున్నట్లు భావన చేయుచు, వారి నామ ధేయములకు 'నమః' చేర్ఛి పూజ చేయవలెను. మొదట వర్ధనిని హస్తమున గ్రహించి, కలశము ఎదుటకు తీసికొనివెళ్ళి ప్రదక్షిణక్రమమున దాని నాల్గువైపుల త్రిప్పి, దానినుండి అవిచ్ఛిన్నముగు జలధార పడునట్లు చేయవలెను. మూలమంత్ర ముచ్చరించుచు ''లోకపాలులారా! మీరందరును యథాశక్తిగ ఈ యజ్ఞమును రక్షింపుడు'' అని శివాజ్ఞను వారికి వినిపించి, క్రింద ఒక కలశము నుంచి, దానిపై వర్ధనిని స్థాపింపవలెను. పిమ్మట సుస్థిరమైన ఆసనముపై ఉంచిన కలశముపై శివుని సాంగపూజ చేయవలెను. పిమ్మట కలాది షడధ్వన్యాసము చేసి, శోధనము చేసి, వర్థనిపై అస్త్రమును పూజించవలెను.

ఓం హః అస్త్రాసనాయ హూం ఫట్‌. ఓం ఓం అస్త్రమూర్తయే నమః

ఓం హూం ఫట్‌ పాశుపతాస్త్రాయ నమః. ఓం హూం హృదయాయ హూం ఫట్‌ నమః.

ఓం శ్రీం శిరసే హూం ఫట్‌ నమః

ఓం యం శిఖాయై హూం ఫట్‌ నమః. ఓం గూం కవచాయ హూం ఫట్‌ నమః.

ఓం ఫట్‌ అస్త్రాయ హూం ఫట్‌ నమః. 35

''ఓం హః అస్త్రాసనాయ హూంఫట్‌'' మొదలు ''ఓం ఫట్‌ అస్త్రాయ హూం ఫట్‌ నమః'' వరకును పైనచెప్పినవి అస్త్రపూజా మంత్రములు.

చతుర్వక్త్రం సదంష్ట్రం చ స్మరేదస్త్రం సశక్తికమ్‌ | సముద్గరత్రిశూలాసిం సూర్యకోటి సమప్రభమ్‌. 36

భగలిఙ్గసమాయోగం విదధ్యాల్లిఙ్గముద్రయా |

అఙ్గుష్ఠేన స్పృశేత్కుమ్భం హ్భదా ముష్ట్యాస్త్రవర్ధనీమ్‌. 37

భుక్తయే ముక్తయే త్వాదౌ ముష్టినా వర్ధనీం స్పృశేత్‌ | కుమ్భస్య ముఖరక్షార్థం జ్ఞానఖడ్గజం సమర్పయేత్‌. 38

శస్త్రం చ మూలమన్త్రస్య శతం కుమ్భే నివేశ##యేత్‌ | తద్దశాంశేన వర్థన్యాం రక్షాం విజ్ఞాపయేత్తతః 39

యథేతం కృతయత్నేన భగవన్మఖమన్పిరమ్‌ | రక్షణీయం జగన్నాథ సర్వాధ్వర ధర త్వయా. 40

పిమ్మట పాశుపతాస్త్ర స్వరూపమును ఈ విధముగ చింతన చేయవలెను. దానికి కోరలతో కూడిన నాలుగు ముఖములుండును. హస్తములలో శక్తి - ముద్గర - ఖడ్గ - త్రిశూలములుండును. వాటి కాంతి కోటి సూర్యకాంతి సమానముగ నుండును. పిమ్మట లింగముద్రను చూపి, భగలింగసమాయోగము చూపవలెను. హృదయమంత్రమును (నమః) ఉచ్చరించుచు అంగుష్ఠముతో కలశమును, ముష్టితో ఖడ్గరూప మగు వర్ధనిని స్పృశించవలెను. ముప్టితో ముందుగా వర్ధనిని స్పృశించినచో భోగమోక్షముల అభివృద్ధి కలుగును. కలశముఖరక్షణము నిమిత్తము దానిపై వెనుక చెప్పిన జ్ఞానఖడ్గము నుంచవలెను. మూమంత్రము నూటఎనిమిది పర్యాయములు జపించి ఆ జపమును కూడ కలశమునకు సమర్పించవలెను. పదవ వంతు జపము చేసి దానిని వర్ధనికి సమర్పించవలెను. పిమ్మట - ''సకలయజ్ఞధారకుడ వైన భగవంతుడవైన జగన్నాథా! ఈ యజ్ఞమందిరమును చాల ప్రయత్నముతో రక్షించుము" అని భగవంతుని ప్రార్థించవలెను.

ప్రణవస్థం చతుర్బాహుం వాయవ్యే గణమర్చయేత్‌ | స్థణ్డిలే శివమభ్యర్య్చ సార్ఘ్యః కుణ్డం వ్రజేన్నరః. 41

నివిష్టో మన్త్రతృప్త్యర్థమర్ఘ్యగన్ధఘృతాదికమ్‌ | వామే సవ్యే తు విన్యస్య సమిద్ధర్భతిలాదికమ్‌. 42

కుణ్డవహ్నిస్రగాజ్యాది ప్రాగ్వత్సంస్కృత్య భావయేత్‌ |

ముఖ్యతామూర్ధ్యవక్త్రస్య హృది వహ్నౌ శివం యజేత్‌. 43

స్వమూర్తే శివకుమ్భే చ స్థణ్డిలే త్వగ్నిశిష్యయోః | సృష్టిన్యాసేన విన్యస్య శోధ్యాద్వానం యథావిధి. 44

కుణ్డమానం ముఖం ధ్యాత్వా హృదాహుతిభిరీప్సితమ్‌ | బీజాని సప్తజిహ్వానామగ్నేర్హౌమాయ భణ్యతే. 45

పిదప ప్రణవమయ మైన ఆసనముపై కూర్చొని యున్న చతుర్భుజుడగు గణశుని వాయవ్యదిక్కునందు పూజించ వలెను. అనంతరము వేదిపై శివుని పూజించి, అర్ఘ్యమును చేత గ్రహించి యజ్ఞకుండము వద్దకు వెళ్ళి, అచట కూర్చుండి మంత్రదేవతాతృప్తికొరకు వామభాగమునందు అర్ఘ్య-గంధ-ఘృతాదులను, కుడివైపున సమిధలు, కుశలు, తిలలు మొదలగు వాటిని ఉంచి, వెనుకటి వలెనే కుండ - అగ్ని - ఘృత - సృక్‌ ఆదులను సంస్కరించి, హృదయమున ఊర్ధ్వముఖాగ్ని ప్రాధాన్యమును భావించుచు అగ్ని యందు శివుని పూజించవలెను. పిమ్మట గురువు తన శరీరమునందును, శివకలశమునందును, మండలమునందును, అగ్నియందును, శిష్యుని దేహమునందును సృష్టిన్యాసక్రమమును న్యాసకర్మను చూసి, యథా శాస్త్రముగ అధ్వశోధనము చేసి, అగ్నికుండము పొడవు వెడల్పులను పట్టి అగ్నిదేవుని ముఖము పొడవు వెడల్పులను భావన చేయుచు, అగ్ని జిహ్వానామమంత్రముల చివర 'నమః' చేర్చి పలుకుచు అభీష్టవస్తువుల హోమము చేసి అగ్నిని తృప్తుని చేయవలెను. అగ్ని జిహ్వలు ఏడింటికిని ఏడు బీజములున్నవి. హోమము చేయుటకై అవి యేవియో చెప్పబడుచున్నది.

విరేపావన్తిమౌ వర్ణౌ రేఫ షష్ఠస్వరాన్వితౌ | ఇన్దుబిన్దు శిఖాయుక్తౌ జిహ్వాబీజాన్యుపక్రమాత్‌. 46

హిరణ్యా కనకా రక్తా కృష్ణా తదను సుప్రభా | అతిరిక్తా బహురూపా రుద్రేన్ద్రాగ్న్యాప్యదిఙ్ముఖాః. 47

క్షీరాదిమధురైర్హోమం కుర్యాచ్ఛాన్తికపౌష్టికే | అభిచారే తు పిణ్యాకసక్తుకఞ్చుక కాఞ్జికైః. 48

లవణౖ రాజికాతక్రకటుతైలైశ్చ కణ్టకైః | సమిద్భిరపి వక్రాభిః క్రుద్ధో భాష్యాణునా యజేత్‌. 49

రేఫ తప్ప మిగిలిన చివరి రెండు వర్ణముల అన్ని అక్షరములకును, అనగా య మొదలు హ వరకు ఉన్న ఏడక్షరములకును రేఫ - ఊకారములను చేర్చి, దానిమీద అర్ధబిందువును చేర్చగా అవి య్రూట, ల్రూట, వ్రూట, శ్రూట, ష్రూట, స్రూట, హ్రూట అనునవి) ఏడు అగ్నిజిహ్వల బీజమంత్రములు. హిరణ్య, కనక, రక్త, కృష్ణ, సుప్రభ, అతిరిక్త, బహురూప, అని అగ్ని జిహ్వానామములు. వీటి ముఖములు వరుసగ ఈశాన్య - పూర్వ - ఆగ్నేయ, నైరృతి, పశ్చమ వాయవ్య, మధ్యదిక్కులం దుండును శాంతిక - పౌష్టికకర్మలలో క్షీరాది మధుర పదార్థములను, అభిచారకర్మలలో ఆవాల తెలకపిండి, సక్తువులు, యవల గంజి. ఉప్పు, రాజికలు, కటుతైలములు, ముళ్లు, వంకరటింకరగా నున్న సమిధలు, వీటితో క్రోధపూర్వకముగా, భాష్యమంత్రముతో హోమము చేయవలెను.

కదమ్బకలికాహోమాద్యక్షిణ సిద్థ్యతి ధ్రువమ్‌ | బన్ధూకకింశుకాదీని వశ్యాకర్షాయ హోమయేత్‌. 50

బిల్వం రాజ్యాయ లక్ష్యర్థం పాటలాంశ్చమ్పకానపి | పద్మాని చక్రవర్తిత్వే భక్ష్యభోజ్యాని సమ్పదే 51

దూర్వా వ్యాధివినాశాయ సర్వసత్త్వవశీకృతే | ప్రియఙ్గుపాటలీపుష్పం చూతపత్రం జ్వరా న్తకమ్‌. 52

మృత్యుఞ్జయో మృత్యుజిత్స్యాత్‌ వృద్ధిః స్యాత్తిలహోమతః |

రుద్రాశాన్తిః సర్వశాన్త్యా అథ ప్రస్తుతముచ్యతే. 53

కదంబపు మొగ్గలు హోమం చేసినచో తప్పక యక్షిణి సిద్ధించును. వశీకరణ - ఆకర్ణములకై బంధూక - కింశుక పుష్పాదులను హోమము చేయవలెను. రాజ్యలాభము కొరకై బిల్వఫలమును, లక్ష్మీ ప్రాప్తికొరకు పాటల -చంపక పుష్పములను, చక్రవర్తిత్వముకొరకై పద్మములను, సంపదకొరకు భక్ష్య - భోజ్య పదార్థములను, వ్యాధివినాశముకొరకు దూర్వలను, సర్వప్రాణులను వశము చేసికొనుటకు ప్రియంగు - పాటలీపుష్పాలను హోమము చేయవలెను. మామిడి ఆకుల హోమము జ్వరమును నశింపచేయును. మృత్యుంజయదేవత - మంత్రముల ఉపాసన చేయువాడు మృత్యువును జయించును. తిలల హోమముచే ఆభ్యుదయసిద్ధి కలుగును. రుద్రశాంతి సమస్తదోషములను శాంతింపచేయును. ఇపుడు ప్రస్తుత విషయము చెప్పబడును.

ఆహుత్వష్టశ##తైర్మూల మఙ్గాని తు దళాంశతః | సన్తర్పయేత మూలేన దద్యాత్పూర్ణాం యథాపురా. 54

తథా శిష్యప్రవేశాయ ప్రతిశిష్యం శతం జపేత్‌ | దుఇమిత్తాపసారాయ సునిమిత్తకృతే తథా. 55

శతద్వయం చ హోతవ్యం మూలమన్త్రేణ పూర్వవత్‌ |

మూలాద్యష్టాస్త్రమన్త్రాణాం సాహాన్తైస్తర్పణం సకృత్‌. 56

శిఖాసంపుటితైర్జీజైర్హుం ఫడ న్తైశ్చ దీపనమ్‌ | ఓం హూం శివాయ స్వాహేత్యాది మన్త్రైశ్చ తర్పణమ్‌. 57

ఓం హూం హౌం శివాయ హూం ఫడిత్యాదిదీపనమ్‌ |

తతః శవామ్భసా స్థాలీం క్షాళితాం వర్మగుణ్ఠితామ్‌. 58

చన్దనాది సమాలబ్దాం బధ్నీ యాత్కటకం గలే | వరాస్త్రజప్తసద్దర్భపత్రాభ్యాం చరుసిద్ధయే. 59

నూటఎనిమిది ఆహుతులచే మూలమును అందుదశాంశముచే అంగములను తర్పింపచేయవలెను. ఈ హోమమును మూలమంత్రముతో చేయవలెను. పిమ్మట వెనుకటి వలె పూర్ణాహుతి ఇవ్వవలెను. శిష్యులకు దీక్షాప్రవేశము నిచ్చుటకై ఒక్కొక్క శిష్యుని ఉద్దేశించి వందసార్లు జపము చేయవలెను. దుర్నిమిత్తనివారణముకొరకును, శుభనిమిత్తముల సిద్ధి కొరకును వెనుకటివలెనే మూలమంత్రముతో రెండువందల ఆహుతులీయవలెను. మొదట చెప్పిన ఎనిమిది అస్త్రమంత్రముల ఆదియందు మూలమంత్రమును, అంతమునందు ''స్వాహా'' ను చేర్చి ఉచ్చరించుచు ఒక్కొక్కసారి తర్పణము చేయవలెను. మూలమంత్రమునందలి బీజములను శిఖామంత్రము (వషట్‌)తో సంపుటితము చేసి, చివర ''హూం ఫట్‌'' చేర్చి జపము చేసినచో మంత్రదీపనము అగును. ''ఓం హూం శివాయ స్వాహా'' ఇత్యాదిమంత్రములతో తర్పణము చేయవలెన. ''ఓం ఓం శివాయ హూం ఫట్‌'' ఇత్యాదులు దీపనమంత్రములు. పిమ్మట గిన్నెను శివమంత్రాభిమంత్రిత మగు ఉదకముతో కడిగి కవచమంత్రముచే ఆచ్ఛాదించి, దానికి చందనాదులు పూయవలెను. దాని కంఠమునకు ''హూం ఫట్‌'' మంత్రముచే అభిమంత్రిత మైన ఉత్తమకుశ - సూత్రములు శట్టవలెను. దీనితో చరుసిద్ధి యగును.

దర్మాద్యైరాసనే దత్తే సార్ధేన్దుకృతమణ్డలే | న్యస్తాయాం మూర్తిభూతాయాం భావపుషై#్పః శివం యజేత్‌. 60

వస్త్రబద్ధముఖాయాం వా స్థాల్యాం పుషై#్పర్బహిర్భవైః |

చుల్ల్యాం పశ్చిమవక్త్రాయాం శుద్ధాయాం వీక్షణాదిభిః. 61

న్యస్తాహఙ్కారబీజాయాం న్యస్తాయాం కుణ్డదక్షిణ | ధర్మధర్మశరీరాయాం జప్తాయాం మానుషాత్మనా.

స్థాలీమారోపయేదస్త్రజప్తాం గవ్యామ్బుమార్జితామ్‌ | గవ్యం పయోస్త్రసంశుద్ధం ప్రాసాదశతమన్త్రితమ్‌. 63

తణ్డులాఞ్ఛ్యామకాదీనాం నిక్షిపేత్తత్ర తద్యథా | ఏకశిష్యవిధానాయ తేషాం ప్రసృతిపఞ్చకమ్‌. 64

ప్రసృతిం ప్రసృతిం పశ్చాద్యర్థయేద్ద్వ్యాదిషు క్రమాత్‌ | కుర్యాచ్చానలమన్త్రేణ పిధానం కవచాణునా. 65

శివాగ్నౌ మూలమన్త్రేణ పూర్వాస్యశ్చరుకం పచేత్‌ |

ధర్మము మొదలైన నాలుగు పాదములు గల ఆసనమునందు ఏర్పురుపబడిన అర్ధచంద్రాకారమండలము నందు పాత్రమునుంచి, అదియే ఆరాధ్యదేవతామూర్తి యని భావించి, దానిపై భావాత్మక పుష్పములతో శివుని పూజ చేయవలెను. లేదా ఆ పాత్రముఖమునకు వస్త్రముకట్టి, దానిపై బాహ్యపుష్పములతో శివుని పూజించవలెను. పశ్చిమాభిముఖముగా ఉంచిన శుద్ధమైన పొయ్యిపై అహంకారబీజమును న్యసించవలెను. పిమ్మట దానిని కుండమునకు కుడి వైపున ఉంచి ''ఈ పొయ్యి శరీరము ధర్మాధర్మమయ మైనది'' అని భావన చేయవలెను. దాని శుద్ధికై అస్త్రమంత్రము జపించుచు స్పృశించవలెను. పిమ్మట అస్త్రమంత్రము (ఫట్‌) చే అభిమంత్రింపబడిన గోఘృతముచే మార్జిత మైన ఆ పాత్రను పొయ్యిపై ఉంచవలెను. అస్త్రముచే శుద్ధము చేసిన గోక్షీరమును ప్రాసాదమంత్రము (హౌం) చే నూరు సార్లు అభిమంత్రించి ఆ పాత్రలో పోసి, ఆ పాలలో శ్యామాకాదితండులమును ఉంచవలెను. ఒక శిష్యుని దీక్షావిధికై ఐదు చేరలు బియ్యము పోయవలెను. ఇద్దరు ముగ్గురు లేదా ఎక్కువమంది శిష్యు లున్నచో వారి సంఖ్యను బట్టి ఐదేసి చేరలు పెంచుతుపోయవలెను. అస్త్రమంత్రముతో నిప్పు ముట్టించి, కవచ మంత్రముతో పాత్రను మూతపెట్టవలెను. పూర్వాభిముఖుడై శివాగ్నిలో, మూలమంత్రోచ్ఛారణ పూర్వకముగ చరువును వుండవలెను.

సుస్విన్నైస్త త్రచ్ఛుల్యాం స్రువమాప్యర్య సర్పిషాః. 65

స్వాహాన్తైః సంహితామన్త్రైర్దత్త్వా తప్తాభిమారణమ్‌ | సంస్థాప్య మణ్డలే స్థాలీం సదర్భే స్త్రాణునా కృతే. 66

ప్రణవేన పిధాయాస్యాం తద్దేహం లేపనం హృదా | సుశీతలోభవత్యేవం ప్రాప్య శీతాభిఘారణమ్‌. 67

విదధ్యాత్సంహితామన్త్రైః శిష్యం ప్రతి సకృత్సకృత్‌ | ధర్మాద్వాసనకే హుత్వా కుణ్డమణ్డలపశ్చిమే. 68

సంపాతం చ స్రుచా హుత్వా శుద్ధిం సంహితయా చరేత్‌ | చరుకం సకృదాలభ్య తయైవ వషడన్తనయా 69

ధేనుముద్రామృతీభూతం స్థణ్డిలే శాన్తికం నయేత్‌ | సాజ్యభాగం స్వశిష్యాణాం భాగో దేవాయ వహ్నయే. 70

కుర్యాత్తు లోకపాలాదేః సమధ్వాజ్యమిదం త్రయమ్‌ | నమోన్తేన హృదా దద్యాత్తేనై వాచమనీయకమ్‌. 71

తండులములు బాగుగా ఉడికిన పిమ్మట స్రువము నిండ ఆజ్యముపోసి, స్వాహాన్త సంహితామంత్రములతో, పొయ్యిలో తప్తాభిఘోర మను హోమము చేయవలెను. ఆ చరుపాత్రను మండలముపై ఉంచి, అస్త్రమంత్రముతో దానిపై కుశలను ఉంచవలెను. ప్రణవముతో పొయ్యిపై గీసి, హృదయమంత్రముతో అలికి వెనుకటి వలెనే శీతాభిఘార మను హోమము చేయవలెను. అపుడు పొయ్యి చల్లబడును. శీతాభిఘారము చేయు విధాన మేమనగా-సంహితామంత్రముల చివర 'వౌషట్‌' చేర్చి, దానితో కుండమండపమునకు పశ్చిమమున దర్భార్యాసనముపై ఒక్కొక్క శిష్యుని నిమిత్తము ఒక్కొక్క హోమము చేయవలెను. స్రుక్కుతో సంపాతహోమము చేసి సంహితామంత్రముతో శుద్ధి చేయవలెను. 'వషట్‌' చేర్చిన, సంహితామంత్రముతో ఒక పర్యాయము చదువు గ్రహించి ధేనుముద్రతో అమృతీకరణము చేయవలెను. పిమ్మట వేదికపై, దానితో శాంతిహోమము చేయవలెను. పిమ్మట గురువు, శిష్యులకొరకును, అగ్నిదేవతకొరకును, లోకపాలులకొరకును, ఘృతసహితములగు భాగము లేర్పరచవలెను. అన్ని భాగములందును ఆజ్యము సమముగా నుండవలెను. వారి నామ మంత్రముల చివర 'నమః' చేర్చ, వారి వారి భాగములను అర్పించి, ఆ మంత్రముతోడనే వారికి ఆచమనీయము సమర్పించవలెను.

సాజ్యం మన్త్రశతం హుత్వా దద్యాత్పూర్ణం యధావిధి |

మణ్డలం కుణ్డతః కూర్వే మధ్యే వాశమ్భుకుమ్భయోః .72

రుద్రమాతృగణాదీనాం నిర్వర్త్యాన్తర్బలిహృదా | శివమధ్యేప్యలబ్ధాజ్ఞో విధాయోకత్వభావనమ్‌. 73

సర్వజ్ఞతారియుక్తోహం సమన్తాచ్చోపరి స్థితః | మమాంశో యోజనాస్థానమధిష్ఠాతాహమధ్వరే. 74

శివోహమిత్యహఙ్కారీ నిష్క్రమేద్యాగమణ్డపాత్‌ | న్యస్తపూర్వాయసన్దర్భే శస్త్రాణుకృతమణ్డలే. 75

ప్రణవాసనకే శిష్యం శుక్లవస్త్రోతరీయకమ్‌ | స్నాతం చోదఙ్ముఖే ముక్త్యై పూర్వవక్త్రం తు భుక్తయే. 76

ఊర్ధ్వకాయం సమారోప్య పూర్వాస్యం ప్రవిలోకయేత్‌ | చరణాది శిఖాం యావన్ముక్తౌ విలోమతః. 77

చక్షుషా సప్రసాదేన శైవం ధామ వివృణ్వతా.

పిమ్మట మూలమంత్రముతో నూట ఎనిమిది హోమములు చేసి, యథాశాస్త్రముగ పూర్ణాహుతి ఇవ్వవలెను. మండలములోపల, కుండమునకు తూర్పున గాని, శివ-కుండముల మధ్య యందు గాని హృదయమంత్రముతో, రుద్రమాతృకాగణాదులకు అంతర్బలి సమర్పించవలెను. శివుని ఆశ్రయించి, ఆతని ఆజ్ఞ పొంది, ఏకత్వభావన చేయుచు ఈ విధముగ భావన చేయవలెను. ''సర్వజ్ఞత్వాది గుణములతో కూడినవాడును, సమస్తాధ్వలకును పైన ప్రకాశించుచున్న వాడును అగు శివుడను నేనే. ఈ యజ్ఞస్థానము నా అంశము. నేనే యజ్ఞాధిష్ఠాతను.'' ఈ విధముగ అహంకార పూర్వకముగ - అనగా శివాభేదదృష్టితో-గురువు యజ్ఞమండపమునుండి బైటకు రావలెను. అస్త్రమంత్రమచే (ఫట్‌) నిర్మించిన మండలముపై తూర్పునకు అగ్రములుండు నట్లు ఉత్తమమైన కుశలు కప్పి, దానిపై ప్రణవమయ మగు ఆసనము భావన చేయుచు, స్నానము చేసిన శిష్యుని దానిపై కూర్చుండబెట్టవలెను. శిష్యుడు ఆ సమయమున శ్వేతవస్త్రోత్తరీయములు ధరించి యుండవలెను. అతడు ముక్తికాముడైనచో ఉత్తరాభిముఖుడగను, భుక్తికాము డైనచో పూర్వాభి ముఖుడుగను కూర్చుండవలెను. శిష్యుని చీలమండల పైభాగము ఆసనముపై ఉండవలెను. క్రింది భాగము ఉండగూడదు. గురువు శిష్యుని దగ్గర పూర్వాభిముఖుడై కూర్చుండవలెను. మోక్షమును అభిలషించినచో, శిష్యుని అంగములపై పాదములనుండి శిఖవరకును, భోగములను అభిలషించిన పక్షమున శిఖనుండి పాదములవరకును, ప్రసన్నము, శైవతేజస్సును ప్రసరింపచేయు నదియు అగు దృష్టితో చూడవలెను.

అస్త్రోదకేన సంప్రోక్ష్య మన్త్రామ్బుస్నానసిద్ధయే. 78

భస్మస్నానాయ విఘ్నానాం శాన్తయే పాపభిత్తయే | నృష్టిసంహారయోగేన తాడయే దస్త్రభస్మనా. 79

పునరస్త్రామ్బునా ప్రోక్ష్య సకలీకారణాయ తమ్‌ | నాభేరూర్థ్వం కుశాగ్రేణ మార్జనీయాస్త్రమ్చురన్‌. 80

త్రిఢాలభేత తన్మూలైర ఘమర్షాయ నాభ్యధః | ద్వైవిధ్యాయ చ పాశానామాలభేత శరాణునా. 81

తచ్ఛరీరే శివం సాఙ్గం సాసనం విన్యసే త్తతః | పుష్పాదిపూజితస్యాస్య నేత్రే నేత్రేణ వా హృదా. 82

బద్ధ్వా మన్త్రిత వస్త్రేణ సితేన సదశీన చ | ప్రదక్షిణక్రమాదీనం ప్రవేశ్య శివదక్షిణమ్‌. 83

నవస్త్రమాసనం దద్యాద్యథావర్ణం నివేదయేత్‌ | సంహారముద్రయాత్మానం మూర్త్యా తస్య హృదమ్భుజే. 84

నిరుద్ధ్య శోధితే కాయే న్యాసం కృత్వా తమర్చయేత్‌.

పిమ్మట అస్త్రమంత్రముచే అభిమంత్రించిన జలముతో శిష్యుని ప్రోక్షించి మంత్రోదకస్నానము పూర్తి చేయవలెను. పిమ్మట విఘ్నశాంతికొరకును, పాపవినాశముకొరకును భస్మస్నానము చేయించవలెను. అస్త్రమంత్రముచే భస్మను అభిమంత్రించి, దానితో శిష్యుని సృష్టి సంహారమోగముచే తాడనము చేయవలెను. అనగా పైనుంచి క్రిందికిని, క్రిందినుండి పైకిని వాని శరీరముపై భస్మము చల్లవలెను. బదియే భస్మస్నానము. పిదప సకలీకరణము నిమిత్తమై, వెనుకటివలెనే అస్త్రజలముతో శిష్యుని ప్రోక్షించి, ఆస్త్రమంత్రోచ్చారణ పూర్వకముగ కుశాగ్రముతో నాభినుండి పైభాగమునందు మార్జనము చేయవలెను. హృదయ మంత్రముజపించుచు కుశమూలములతో నాభినుండి క్రింది భాగమును, పాపవినాశార్ధమై, స్పృశించవలెను. సమస్తపాశములను భేదించుటకై అస్త్రమంత్రముతో మరల ఆ కుశలతోడనే పూర్వము చెప్పిన విధము మార్జన స్పర్శనములు చేయవలెను. పిమ్మట ఆతని శరీరముపై ఆసనసహితుడైన సాంగశివుని న్యాసము చేసి, శివభావనతో, పుష్పాదులచే ఆతనిని పూజించవలెను. పిమ్మట నేత్రమంత్రము (వౌషట్‌) గాని, హృదయమంత్రము (నమః) గాని ఉచ్చరించుచు తెల్లనిదియు, దశకలదియు అగు వస్త్రముతో ఆతని నేత్రములు కట్టవలెను. ప్రదక్షిణ క్రమమున ఆతని శివుని వద్దకు తీసికొని వెళ్లి, అచట శివునకు కుడి వైపున కూర్చుండబెట్టవలెను. సంహార ముద్రచే తనను శివాభిన్నునిగ చేసి, ఆతని హృదయపద్మమున నిరోధించి, న్యాసము చేసి, ఆతనిని పూజించవలెను.

పూర్వాననస్య శిష్యస్య మూలమన్త్రేణ మస్తకే. 85

శివహస్తం ప్రదద్యాచ్చ రుద్రేశపదదాయకమ్‌ | శివసేవాగ్రహోపాయం దత్తహస్తం శివాణునా. 86

శివే ప్రక్షేపయేత్పుష్పమపనీయార్చ కాన్తరమ్‌ | తత్పాత్రస్థాన మన్త్రాఢ్యం శివదేవగణానుగమ్‌. 87

విప్రాదీనాం క్రమాన్నామ కుర్యాద్వా స్వేచ్ఛయాగురుః | ప్రణతిం కుమ్భవర్థన్యోః కారయిత్వానలాన్తికే. 88

సదక్షిణాసనే తద్యత్సౌమ్యాస్యముపవేశ##యేత్‌| శిష్యదేహవినిష్క్రాన్తాం సుషుమ్నామివ చిన్తయేత్‌. 89

నిజవిగ్రహవీనాం చ దర్భమూలేన మన్త్రితమ్‌ | దర్భాగ్రం దక్షిణ తస్య విధాయ కరపల్లవే. 90

తన్మూలమాత్మజఙ్ఘాయామగ్రం చేతి శిఖిధ్వజే | శిష్యస్య హృదయం గత్వా రోచకేన శివాణునా. 91

పూర కేణ సమాగత్య స్వకీయం హృదయాన్తరమ్‌ | శివాగ్నినా పునః కృత్వా నాడీసన్ధానమీదృశమ్‌. 92

హృదా తత్సన్నిధానార్థం జుహుయాదాహుతిత్రయమ్‌ | శివహస్త స్తిరత్వార్ధం శతం మూలేన హోమయేత్‌.

ఇత్థం సమయదీక్షాయాం భ##వేద్యోగ్యో భవార్చనే |

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సమయదీక్షావిధిర్నామైకాశీతితమోధ్యాయః.

తూర్పునకు తిరిగి కూర్చొని యున్న శిష్యుని శిరముపై మూలమంత్రముచే శివహస్త ముంచవలెను. అది రుద్రేశపదమును ఇచ్చును. పిమ్మట శిష్యుని హస్తమునందు, శివమంత్ర పురస్సరముగా శివసేవాప్రాప్తికి ఉపాయముగా ఒకపుష్పము నుంచవలెను. దానిని శివునిపై ఉంచవలెను. పిమ్మట ఆతని నేత్రములకు కట్టిన వస్త్రము తొలగించి, ఆతనికొరకై శివదేవగణాంకిత మైన స్థాన మంత్ర - నామదికమును ఊహించవలెను. లేదా, బ్రాహ్మణాది వర్ణములకు, వరుసగ, తన ఇష్టము వచ్చిన పేరు ఉంచవలెను. శివకలశమునకును, వర్ధనికిని నమస్కరింపచేసి అగ్నిసమీపమున, తనకు కుడి ప్రక్కన నున్న ఆసనముపై, శిష్యుని వెనుకటివలెనే ఉత్తరాభిముఖముగ కూర్చుండబెట్టి - ''ఆతని శరీరమునుండి సుఘుమ్నానాడి బైటకు వచ్చినా శరీరములో విలీనమైనది.'' అని భావన చేసి, మూల మంత్రముచే అభిమంత్రించిన దర్భ గ్రహించి, దాని అగ్రమును శిష్యుని హస్తమునందును, మూలభాగమును తన కాలిపైనను లేదా, అగ్రభాగమును తన కాలిపైనను, మూలభాగమును శిష్యుని హస్తమునందును ఉంచవలెను. శివమంత్రముతో రేచక ప్రాణాయామము చేసి, శిష్యుని హృదయములో ప్రవేశించుచున్నట్లు భావన చేయుచు, మరల అదే మంత్రముతో పూరక ప్రాణాయామముచే తిరిగి తన హృదయాకాశమును చేరి నట్లు భావన చేయవలెను. శివాగ్నిచే ఈ విధమగు నాడీసంధానము చేసి, తత్సన్నిధానము నిమిత్తము హృదయ మంత్రముతో మూడు హోమముల చేయవలెను. శివహస్తస్థైర్యము కొరకై, మూల మంత్రముతో నూరు హోమములు చేయవలెను. ఈ విధముగ చేయుటచే శిష్యుడు సమయదీక్షా సంస్కారయోగ్యుడగును.

ఆగ్ని మహాపురాణమునందు సమయదీక్షావిధి యను ఎనుబది యొకటవ అధ్యాయము సమాప్తము.

అ (30)

Sri Madhagni Mahapuranamu-1    Chapters