Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ చతురశీతితమో7ధ్యాయః

అథ నిర్వాణదీక్షావిధానమ్‌:

ఈశ్వర ఉవాచ :

అథ ప్రాతః సముత్థాయ కృతస్నానాదికో గురుః | దధ్యార్థ్రమాంసమద్యాదేః ప్రశస్తాభ్యవహారితా. 1

గజాశ్వారోహణం స్వప్నే శుభం శుక్లాంశుకాదికమ్‌ | తైలాభ్యఙ్గాదికం హీనం హోమో ఘోరేణ శాన్తయే. 2

నిత్యకర్మద్వయం కృత్వా ప్రవిశం మఖమణ్డపమ్‌ | స్వాచాన్తో నిత్యవత్కర్మ కుర్యాన్నైమిత్తికేవిధౌ. 3

తతః సంశోధ్య చాత్మానం శివహస్తం తథాత్మని |

విన్యస్య కుమ్భగం ప్రార్చ్య ఇన్ద్రాదీనామనుక్రమాత్‌. 4

మణ్డలే న్థణ్డిలే వాపి ప్రకుర్వాత శివార్చనమ్‌ | తర్పణం పూజనం వహ్నేః పూర్ణాన్తం మన్త్రతర్పణమ్‌. 5

దుఃస్వప్నదోషమోషాయ శ##స్త్రేణాష్టాధికం శతమ్‌ |

హుత్వా హూం సంపుటేనైవ విదధ్యాన్మన్త్రదీపనమ్‌. 6

అన్తర్భలివిధానం చ మధ్యే స్థణిలకుబ్భయోః | కృత్వా శిషప్రవేశాయ లబ్ధానుజ్ఞో బహిర్వ్రజేత్‌. 7

కుర్యాత్సమయవత్తత్ర మణ్డలారోపణాదికమ్‌ | సంపాతహోమం తన్నాడీరూపదర్భకదానాగమ్‌. 8

సత్సన్నిధానాయ తిస్రో హుత్వా మూలానుణాహుతీః |

కుమ్భస్థం శివమభ్యర్చ్య పాశసూత్రముపాహరేత్‌. 9

స్వదక్షిణోర్ధ్వకాయస్య శిష్యస్యాభ్యర్చితస్య చ |

తచ్ఛిఖాయాం నిబధ్నీ యాత్పాదాజ్గుష్ఠావలమ్బితమ్‌. 10

తం నివేశ్వ నివృత్తేస్తు వ్యాప్తిమాలోక్య చేతసా | జ్ఞేయాని భునాన్యస్యాం శతమష్టాధికం తతః 11

ఈశ్వరుడు చెప్పెను. గురువు ప్రాతఃకాలమునందు లేచి, స్నానాదులు పూర్తి చేసికొని, మీరేమి స్వప్నములు చూచితి రని శిష్యులను అడుగవలెను. పెరుగు, పచ్చిమాంసము, మద్యము మొదలగువాటిని భుజించినట్లు గాని చూచి నట్లుగాని స్వప్నము వచ్చినచో అది ఉత్తమము, శుభసూచకము. అట్లే ఏనుగు, గుఱ్ఱము ఎక్కుట, శ్వేతవస్త్రాదులనుచూచుట గూడ శుభప్రదము. తైలము పూసికొని నట్లు స్వప్నము చూచినచో ఆశుభము. దాని శాంతికొరకై అఘోరమంత్రముతో హోమము చేయవలెను. ప్రాతఃకాల మధ్యాహ్నకాల నిత్యకర్మలు పూర్తిచేసికొని యజ్ఞమండపమున ప్రవేశించి, యధాశాస్త్రముగ ఆచమనము చేసి, నైమత్తిక కర్మ కూడ నిత్యవిధి వలెనే చేయవలెను. అధ్వశుద్ధి చేసుకొని తనపై హస్త ముంచుకొనవలెను. కలశ##పై నున్న శివుని పూజించి, క్రమముగ ఇంద్రాది దిక్పాలకుల పూజ చేయవలెను. మండలమునందును, వేదియందును శివునిపూజింపవలెను. పిమ్మట తర్పణములు, అగ్నిపూజ, పూర్ణాహుతివరకును హోమములు, మంత్రర్పణములు చేయవలెను. దుఃస్వప్న దోష నివారణార్థమై 'హూం' తో సంపుటితము చేసిన అస్త్రమంత్రముతో (హూం ఫట్‌ హూం) నూట ఎనిమిదిహోమముచేసి మంత్రదీపనము చేయవలెను. వేదీ-కలశలమధ్య అంతర్బలి చేసి, శిష్యుల ప్రవేశార్థమై ఇష్టదేవతానుజ్ఞపొంది గురువు మండపమునుండి బైటకు వెళ్ళవలెను. అచట, సమయదీక్షలోవలెనే మండలారోపణాదికము చేసి సంపాతహోమము. సుషుమ్నానాడీరూపమగు కుశమును శిష్యునిహస్తములోనుంచుట మొదలగుకార్యములను పూర్తిచేయవలెను. నివృత్తి కళాసాన్నిధ్యముకొరకై మూలమంత్రముచే మూడు ఆహుతు లిచ్చి, కుంభముపై నున్న శివుని పూజించి కలాపాశమయ మగు సూత్రమును సమర్పింపవలెను పిమ్మట పూజింపబడిన శిష్యుని ఊర్ధ్వదేహము కుడి భాగమున వాని శిఖకు ఆ సూత్రమును కట్టికాలి బొటనవ్రేలివరకును వ్రేలాడు నటుల ఉంచవలెను. ఆ విధముగ ఆ పాశమును ఉంచి, దానిలో నివృత్తి కళావ్యాప్తి జరిగి నట్లు భావన చేయవలెను. దానియందు నూటఎనిమిది భువనములు చూడవలెను.

కపాలో7జశ్చ బుద్ధశ్చ వజ్రదేహః ప్రమర్దనః | విభూతిరవ్యయః శాస్తా పినాకీ త్రిదశాధిపః. 12

అగ్నీ రుద్రో హుతాశీ చ పిఙ్గలః ఖాదకో హరః | జ్వలచో దహనో బభ్రుర్భస్మాన్తకక్షపాన్తకౌ. 13

యామ్యమృత్యుహరో ధాతా విధాతా కార్యరఞ్జకః | కాలో ధర్మోప్యధర్మశ్చ సంయోక్తా చ వియోగకః. 14

నైరృతో మారణో హన్తా క్రూరదృష్టిర్భయానకః |

ఊర్ధ్వాంశకో విరూపాక్షో ధూమ్రలోహితదం ప్ట్రవాన్‌. 15

బలశ్చాతి బలశ్త్చెవ పాశహస్తో మహాబలః | శ్వేతశ్చ జయభద్రశ్చ దీర్ఘబాహుర్జలాన్తకః. 16

వడవాస్యశ్చ భీమశ్చ దశైతే వారుణాః స్మృతాః |

సూక్ష్మో లఘుర్వాయువేగః సూక్ష్మస్తేక్ష క్షపాన్తకః. 17

పఞ్చాన్తకః పఞ్ఛశిఖః కపర్దీ మేఘవాహనః | జటాముకుటధారీ చ నానారత్నధరస్తథా., 18

నిధీశో రూపవాన్ధన్యః సౌమ్యదేహః ప్రసాదకృత్‌ | ప్రకాశో7ప్యథ లక్ష్మీవాన్‌ కామరూపో దశోత్తరీ. 19

విద్యాధరో జ్ఞానధరః సర్వజ్ఞో వేదపారగః | మాతృవృత్తశ్చ పిఙ్గాక్షో భూతపాలో బలిప్రియః. 20

సర్వవిద్యావిధాతా చ సుఖదుఃఖహరో దశ | అనన్తః పాలకో ధీరః పాతాలాధిపతిస్తథా. 21

వృషే వృషధరో వీర్యో గ్రసనః సర్వతోముఖః | లోహితశ్త్చెవ విజ్ఞేయా దశ రుద్రాః ఫణిస్థితాః. 22

శమ్భుర్విభుర్గణాధ్యక్షస్త్వ్రక్షస్త్రిదశవన్దితః | సంహారశ్చ విహారశ్చ లాభో లిప్సుర్విచక్షణః. 23

అత్తా కుహకకాలగ్నిరుద్రా హాటక ఏవచ | కూష్మాణ్డశ్చైవ సత్యశ్చ బ్రహ్మా విష్ణుశ్చ సప్తమః. 24

రుద్రశ్చాష్టావిమే రుద్రా కటాహాభ్యన్తరే స్థితాః | ఏతేషామేవ నామాని భువనానామపి స్మరేత్‌. 25

కపాల-అజ-అహిర్బుధ్న్య-వజ్రదేహ-ప్రమర్దన-విభూతి-అవ్యయ-శాస్తృ-పినాకి త్రిదశాధిపు లను పదిమంది రుద్రులు తూర్పు దిక్కున నుందురు. అగ్నిరుద్ర-హుతాశ-పింగల-ఖాదక-హర-జ్వలన-దహన-బభ్రు-భస్మాంతక-క్షపాన్తకులను పదిమంది రుద్రులు ఆగ్నేయమున నుందురు. దమ్య-మృత్యుహర-ధాతృ-విధాతృ కర్తృ-కాల-ధర్మ-అధర్మ-సంయోక్తృ-వియోజకు లను పదిమంది రుద్రులు దక్షిణమున నుందురు. నైరృత్య-మారుత-హన్తృ-క్రూర దృష్టి-భయానక-ఊర్ధ్వకేశ-విరూపాక్ష-ధూమ్ర-లోహిత-దంష్ట్రులను పదిమంది రుద్రులు నైరృతిదిక్కునందుందురు. బల- అతిబల-పాశహస్త-మహాబల-శ్వేత-జయభద్ర-దీర్ఘబాహు-జలాంతక-వడవాస్య-భీము లను పదిమంది రుద్రులు పశ్చిమమునందుదురు. శీఘ్ర-లఘు-వాయువేగ-సూక్ష్మ-తీక్ష-క్షమాంతక-పంచాంతక-పంచశిఖ-కపర్ది-మేషువాహను లను పదిమంది రుద్రులు వాయవ్యమునం దుందురు. జటాముకుటధారి-నానారత్నధర, నిధీశ-రూపవత్‌-ధన్య-సౌమ్యదేహ-ప్రసాదకృత్‌-ప్రకామ-లక్ష్మీవత్‌-కామరూపులను పదిమంది రుద్రులు ఉత్తరమునం దుందురు. విద్యాధర-జ్ఞానధర-సర్వజ్ఞ-వేదపారగ మాతృవృత్త-పింగాక్ష-భూతపాల-బలిప్రియ-సర్వవిద్యావిధాతృ-సుఖదుఃఖకరు లను పదిమంది రుద్రులు ఈశాన్యమునందుదురు. అనంత-పాలక-ధీర-పాతాలాధిపతి-వృష-వృషధర-వీర-గ్రసన-సర్వతోముఖ-లోహితు లను పదిమంది రుద్రులు క్రింది దిక్కునందు పాతాలలోకమునం దుదురు. శంభు-విభు-గణాధ్యక్ష-త్య్రక్ష-త్రిదశవందిత-సంవాహ వివాహ-సభ విప్సు-విచక్షణు లను పదిమంది రుద్రులు ఊర్ధ్వదిక్కనం ందుదురు, హుహుక కాలాగ్ని రుద్ర-హాటక- కూష్మాండ-సత్య-బ్రహ్మ-విష్ణు-రుద్ర లను ఎనమండుగురు రుద్రులు బ్రహ్మాండ కటాహము మధ్య నుందురు. ఈ రుద్రుల పేర్లను బట్టియే నూట ఎనిమిది భువనముల పేర్లు ఏర్పడిన వను విషయమును గుర్తించుకొనవలెను.

భవోద్భవః సర్వభూతః సర్వభూతసుఖప్రదః | సర్వసాన్నిధ్యకృద్బ్రహ్మవిష్ణురుద్రశివార్చితః. 26

సంస్తుత పూర్వస్థిత ఓం సాక్షిన్‌ ఓం రుద్రాన్తక ఓం పతఙ్గ ఓం

శబ్ద ఓం సూక్ష్మ ఓం శివ సర్వ సర్వద సర్వసాన్నిధ్యకర బ్రహ్మ

విష్ణురుద్రపర ఓం నమః శివాయ ఓం నమః

అష్టావింశతిపదాని వ్యోమవ్యాపి మనో గుహ

సద్యోహృదస్త్రనేత్రాణి మన్త్రవర్ణాష్టకో మతః. 27

బీజాకారో మకారశ్చ నాడ్యావిడాపిఙ్గలహ్వాయే |ప్రాణాపానావుభౌ వాయూ ఘ్రాణోపస్థే తథేన్ద్రియే. 28

గన్ధస్తు విషయః ప్రోక్తో గన్ధాదిగుణపఞ్చకే | పార్థివం మణ్డలం పీతం వజ్రాఙ్కం చతురస్రకమ్‌. 29

విస్తారో యోజనానాన్తు కోటిరస్య శతాహతా | అత్త్రెవాన్తర్గతా జ్ఞేయా యోనయో7పి చతుర్దశ. 30

ప్రథమా సర్వదేవానాం మన్యాద్యా దేవయోనయః | మృగః పక్షే చ పశవశ్చతుర్థా తు సరీసృపాః. 31

స్థావరం పఞ్చమం సర్వం యోనిః షష్ఠీ అమానుషీ | పైశాచం రాక్షసం యాక్షం గాన్ధర్వం చైన్ద్రమేవ చ.

సౌమ్యం ప్రాణశ్వరం బ్రాహ్మమష్టరుం పరికీర్తితమ్‌| అష్టానాం పార్ధివం తత్త్వమధికారాస్పదం మతమ్‌. 33

(ఒకటి రెండు శ్లోకాలు మూలపాఠంలో లోపించినట్లున్న ఈ అనువాదం హిందీపాఠాన్ని అనుసరించి ఇవ్వబడినది) సద్భావేశ్వర, మహాతేజః, యోగధిపతే, ముంచ ముంచ. ప్రమథ ప్రమథ, శర్వ శర్వ, భవ భవ, భవోద్భవ, సర్వభూత సుఖప్రద, సర్వసాంనిధ్యకర, బ్రహ్మవిష్ణురుద్ర పర, అనర్చితానర్చిత, అసంస్తుతాసంస్తుత, పూర్వస్థిత, సాక్షిన్‌ సాక్షిన్‌, తురు తురు, పతఙ్గ, పతఙ్గ, పిజ్గ, పిజ్గ, జ్ఞాన జ్ఞాన, శబ్ద శబ్ద, సూక్ష్మ సూక్ష్మ, శివ-సర్వ, సర్వద, ఓం నమో నమః ఓం నమః శివాయ, నమో నమః. ఇవి ఇరువదియెనిమిది పదములు. స్కందా! వ్యాపక మైన ఆకాశము మనస్సు. ''ఓం నమో వౌషట్‌-ఇది అభీష్టమంత్రవర్ణము, అకారలకారములు (అం లం) బీజములు. ఇడా పింగళలు రెండు నాడులు ప్రాణాపానములనునవి రెండు వాయువులు ఘ్రాణము, ఉపస్థ అనునవి రెండు ఇంద్రియములు. గంధము విషయము. దీనియందు గంధాదులగు నాలుగు గుణములున్నవి. ఇది పృథ్వీతత్త్వముతో సంబంధించినది. పీతవర్ణము, దీని మండలాకారము చతురస్రము. నాలుగు వైపులా వజ్రముచే చిహ్నితమైనది. ఈ పార్థివమండల విస్తారము నూరు కోట్ల యోజనములు. పదునాలుగు యోనులు దీనియందే అంతర్గతము లని గ్రహించవలెను. మొదటి ఆరును మృగాదియోనులు, తరువాతి ఎనిమిది దేవయోనులు, మొదటిది మృగయోని, రెండవది పక్షియోని, మూడవది పశుయోని, నాల్గవది సర్పాదియోని, ఐదవది స్థావరయోని, అరవది మనుష్యయోని. ఎనిమిది దేవయోనులు వరుసగ పిశాచ-రాక్షస-యక్ష-గంధర్వ-ఇంద్ర-సోమ-ప్రజా-పతి బ్రహ్మలకు సంబంధించినవి. ఈ ఎనిమిది యోనులకును పార్థివతత్త్వముపై అధికార మని చెప్పబడినది.

లయస్తు ప్రకృతౌ బుద్ధౌ భోగీ బ్రహ్మా చ కారణమ్‌ | తతో జాగ్రదవస్థానైః సమసై#్తర్భువనాదిభిః. 33

నివృత్తిం గర్భితాం ధ్యాత్వా స్వమన్త్రేణ నియోజ్య చ |

ఓం హాం హ్రూం హాం నివృత్తికలాపాశాయ హూం ఫట్‌ తత ఓం

హాం హాం నివృత్తికలాపాశాయ స్వాహేత్యనే నాజ్కుశముద్రయా |

పూరకేణాకృష్య ఓం హ్రూం హాం హ్రూం నివృత్తికలాపాశాయ |

హూం ఫడిత్యనేన సంహారముద్రయా కుమ్భకేనాధః స్థా

నాదాదాయ ఓం ఓం హ్రాం హాం నివృత్తికలాపాశాయ నమః |

ఇత్యనేనోద్భవముద్రయా రేచకేన కుమ్భే సంస్థాప్య |

ఓం హాం నివృత్తిక లాపాశాయ నమః ఇత్యనేనార్ఘ్యం |

దత్త్వా సంపూజ్య విముఖేనైవ స్వాహాన్తేనైవ సంసిధానా |

యాహుతిత్రయం సన్తర్పణాహుతిత్రయం చ దత్త్వా |

ఓం హాం బ్రహ్మణ నమ ఇతి బ్రహ్మాణమావాహ్య సంపూజ్య |

చ స్వాహాన్తేన సంతర్ప్య |

బ్రహ్మం స్తవాధికారే7స్మిన్‌ ముముక్షుం | దీక్షయామ్యహమ్‌. 35

భావ్యం త్వయానుకూలేన విధిం విజ్ఞాపయేదితి | ఆవాహయేత్తతో దేవీం రక్షాం వాగీశ్వరీం హృదా. 36

ఇచ్ఛాజ్ఞానక్రియారూపాం షడ్విధాం హ్యేకకారణమ్‌ | పూజయేత్తర్పయేద్దేవం ప్రకారేణామునా తతః. 37

వాగీశ్వరీం వినిఃశేషయోని విక్షోభకారణమ్‌ | హృత్సంపుటార్థబీజాదిహుం పడన్త శరాణునా. 38

తాడయేద్దృదయే తస్య ప్రవిశేత్సవిధానవిత్‌ | తతః శిష్యస్య చైతన్యం హృది వహ్ని కణోపమమ్‌. 39

నివృత్తిస్థం వృతం పాశైర్జ్యైష్ఠయా విభ##జేద్యథా |

ఓం హాం హూం హః ఫట్‌ ఓం హాం స్వాహేత్యనేనాథ పూరకేణాంకుశముద్రయా. 40

తదాకృష్య స్వమన్త్రేణ గృహేత్వాత్మని యోజయేత్‌ | ఓం హాం హ్రూం హాం ఆత్మనే సమః.

లయము ప్రకృతియందును, భోగము బుద్ధియందును అగును. బ్రహ్మ కారణము పిమ్మట జాగ్రదవస్థవరకును సమస్తభువనాది గర్భిత యగు నివృత్తికళను ధ్యానము చేసి, తదీయమంత్రముచే వినియోగము చేయవలెను. ''ఓం హాం హ్రాం హాం నివృత్తికలాపాశాయ హుం ఫట్‌ స్వాహా'' అనునది దాని మంత్రము పిదప ''ఓం హాం హ్లాం హోం నివృత్తి కలాపాశాయ హూం ఫట్‌ స్వాహా'' అను మంత్రముచే అంకుశముద్రాప్రదర్శన పూర్వంముగ, పూరక ప్రాణాయామముతో ఆ కళను ఆకర్షించవలెను. పిదప ఓం హూం హ్లాం హాం హూం నివృత్తికలాపాశాయ హూం ఫట్‌ స్వాహా'' అనుమంత్రముచే సంహారముద్రా కుంభక ప్రాణాయామములతో దానిని నాభి క్రింది భాగమునకు తీసికొనిపోయి ''ఓం హాం నివృత్తికలాపాశాయ నమః'' అను మంత్రముచే, ఉద్భవముద్రారేచక ప్రాణాయామములతో దానిని కుండమునందు ఏదైన ఒక ఆధారముపై నుంచవలెను. పిమ్మట ''ఓం హాం నివృత్తికలాపాశాయ నమః అను మంత్రముచే అర్ఘ్యప్రధానపూర్వకముగ పూజించి దాని చివర ''స్వాహా'' చేర్చితర్పణముచేసి, సంవిధానముకొరకై వేరువేరుగా మూడు హోమములు చేయవలెను. ''ఓం హాం బ్రహ్మణ నమః'' అను మంత్రముచే బ్రహ్మను ఆవాహన చేసి, పూజించి, దాని చివర ''స్వాహా'' చేర్చి మూడు హోమములచే బ్రహ్మను సంతృప్తుని చేయవలెను. అనంతరము ''ఓ బ్రహ్మదేవా! ఈ ముముక్షువునకు, నీ అధికారమున, దీక్ష ఇచ్చుచున్నాను. నీవు సర్వదావీనికి అనుకూలుడవుగ నుండుము.'' అని ప్రార్థించవలెను. పిదప, రక్తవర్ణ యగు వాగీశ్వరిని, హృదయమంత్రముతో, తన మనస్సులోనే ఆవాహన చేయవలెను. ఆ దేవి ఇచ్ఛా-జ్ఞాన-క్రియారూపిణి. ఆరు అధ్వలకును ఏకైకకారణము. వెనుక చెప్పిన విధానమున వాగీశ్వరికి పూజాతర్పణములు చేయవలెను. సమస్తయోనులను విక్షుబ్ధము చేయువాడును, హృదయములో నుండువాడును అగు వాగీశ్వరదేవుని కుడ పూజించి తర్పణము చేయవలెను. అదియందు బీజముతోడను, అంతమునందు అస్త్రమంత్రముతోడను కూడిన అస్త్రమంత్రముతో శిష్యుని హృదయ తాడనము చేసి, ఆతనిలో ప్రవేశించినట్లు భావన చేయవలెను. హృదయమునందు, నివృత్తికళలోపల నున్న, అగ్నికణసదృశ మగు పాశబద్ధమైన శిష్యజీవచైతన్యమును జ్యేష్ఠతో విభక్తము చేయవలెను. ''ఓం హాం హూం హః హూం ఫట్‌ '' అనునది విభానమంత్రము. ''ఓం హాం స్వాహా'' అను మంత్రముచే, పూరక ప్రాణాయామ అంకుశముద్రలతో, ఆ జీవచైతన్యమును హృదయమునందు ఆకర్షించి, ఆత్మ మంత్రముచే పట్టుకొని, దానిని లన ఆత్మలో చేర్చవలెను. ''ఓం హాం హాం హాం ఆత్మనే నమః'' అనునది ఆత్మ మంత్రము.

ప్రిత్రోర్విభావ్య సంయోగం చైతన్యం రేచకేన తత్‌. 41

బ్రహ్మాది కారణత్యాగాన్నత్వా శివాస్పదమ్‌ | గర్భాధానార్ధమాదాయ యుగపత్సర్యయోనిషు. 42

క్షి పేద్వాగీశ్వరీయోనౌ వామయోద్భవముద్రయా |

ఓం హాం హాం హమ్‌ ఆత్మనే నమః | పూజయేదప్యనేనైవ తర్పయేదపి పఞ్చధా. 43

అన్యయోనిషు సర్వాసు దేహశుద్ధిం హృదా చరేత్‌ | నాత్రపుంసవనం స్త్ర్యాదిశరీరస్యాపి సంభవాత్‌. 44

సీమన్తోన్నయనం వాపి దైవాన్యఙ్గాని దేహవత్‌ | శిరసా జన్మ కుర్వీత యుగపత్సర్వదేహినామ్‌. 45

తదైవ భావయేదేషామధికారం శివాణునా | భోగం కవచమన్త్రేణ శ##స్త్రేణ విషయాత్మనా. 46

మోహరూపమభేద్యం చ లయసంజ్ఞం విభావయేత్‌ | శివేన స్రోతసాం శుద్ధిం హృదా తత్త్వవిశోదనమ్‌ . 47

పఞ్చ పఞ్చాహుతీః కుర్యాద్గర్భాధానాదిషు క్రమాత్‌ | మాయయా మలకర్మాది పాశబన్ద నివృత్తయే. 48

నిష్కృత్త్యెవ హృదా పశ్చాద్యజేత శతమాహుతీః| మలశక్తినిరోధేన పాశానాం చ వియోజనమ్‌ . 49

స్వాహాన్తాయుధమన్త్రేణ పఞ్చ పఞ్చాహృతీర్యజేత్‌ | మాయాద్యన్తస్య పాశస్య సప్తవారాస్త్రజప్తయా. 50

కర్తర్యా భేదనం కుర్యాత్కల్పశ##స్త్రేణ తద్యథా | ఓం హూం నివృత్తికలాపాశాయ హూం ఫట్‌.

మాతాపితరుల సంయోగమును భావన చేయుచు, రేచకప్రాణాయామముతో బ్రహ్మాదికారణములను క్రమముగ త్యజించుచు జీవచైతన్యమును శివరూపాధిష్ఠానమునందు చేర్చి, గర్భాధానముకొరకై దానిని గ్రహించి ఒకే సమయమున అన్ని యోనులందును, వామా-ఉద్భవముద్రలతో వాగీశ్వరయోనియందును ఉంచవలెను. పిమ్మట ''ఓం హాం హాం హామ్‌ ఆత్మనే నమః'' అను మంత్రముతో పూజను, ఐదు పర్యాయములు తర్పణమును చేయవలెను. అన్ని యోనులయందును, ఈ జీవచైతన్యమునకు, హృదయమంత్రముచే దేహసాధనము చేయవలెను. స్త్రీ శరీరాదులు పుట్టుటకు కూడ అవకాశమున్నది గాన పుంసవనసంస్కారము చేయ నవసరము లేదు. దైవవశముచేత అంధాదిశరీరోత్పత్తి కూడ సంభావ్యము గాన సీమంతోన్నయనము కూడ అనావశ్యకము. శిరోమంత్రము (స్వాహా)చే ఒకే సమయమున సకలజీవులు జనించి నట్లు భావన చేయవలెను. శివమంత్రముతో కూడ ఈ విధముగనే భావన చేయవలెను. కవచమంత్రముతో భోగమును అస్త్రమంత్రముతో విషయమునందును ఆత్మయందు మోహరూప మగు లయమను భావన చేయవలెను. పిదప శివమంత్రముతో స్రోతశ్శుద్ధిని, హృదయమంత్రముతో తత్త్వశోదనమును చేసి గర్భాధానాది సంస్కారములు నిమిత్తమైవరుసగ ఐదేసి హోమములు చేయవలెను. మాయజనిత-మలజనిత-కర్మజనితాది పాశబంధములు తొలగుటకై హృదయమంత్రముచే శుద్ధి చేసి, అగ్నిలో నూరు హోమములు చేయవలెను. మలశక్తిని లయింపచేయుటకును. పాశములు తొలగించుకొనుటకును స్వాహాంత మగు అస్త్రమంత్రముతో ఐదేసి హోమములు చేయవలెను. ''ఓం హాం హాం హాం నివృత్తికలాపాశాయ హః హూం ఫట్‌'' అను మంత్రము నుచ్చరించుచు, అస్త్రమంత్రజపాభిమంత్రిత మగు ఖడ్గ మైన కళాశస్త్రముతో అంతఃకరణములో నున్న మలాదిపాశములను ఏడు పర్యాయములు భేదించవలెను.

బన్ధకత్వం చ నిర్వర్త్య హస్తాభ్యాఞ్చ శరాణునా. 51

విసృజ్య వర్తులీకృత్య ఘృతపూర్ణే స్రువే ధరేత్‌ | దహేదనుకలాస్త్రేణ కేవలాస్త్రేణ భస్మసాత్‌. 52

కుర్యాతృఞ్చాహుతీర్ధత్త్వా పాశాంకుశనివృత్తయే.

ఓం హః అస్త్రాయ హూం ఫట్‌ | ప్రాయశ్చిత్తం తతః కుర్యాధస్త్రాహుతిభిరష్టభిః. 53

అధావాహ్య విధాతారం పూజయేత్తర్పయేత్తథా |

తత ఓం హాం శబ్దస్పర్శశుద్ధబ్రహ్మాన్‌ గృహాణ స్వాహేత్యా

హుతిత్రయేణాధికారమస్య సమర్పయేత్‌ | దగ్ధనిఃశేషపాపస్య బ్రహ్మన్నస్య పశోస్త్వయా. 54

బన్ధాయ న పునః స్థేయం శివాజ్ఞాం శ్రావయేదితి | తతో విసృజ్య ధాతారం నాఢ్యా దక్షిణయా శ##నైః. 55

సంహారముద్రాయాత్మానం కుమ్భకేన విజాత్మనా | రాహుయుక్తైకదేశేన చన్ద్రబిమ్భేన సన్నిభమ్‌. 56

ఆదాయ యోజయేత్సూత్రే | రేచకేనోద్భవాఖ్యయా వ| పూజయిత్వార్ఘ్యపాత్రస్థతోయబిన్దుం సుధోపమమ్‌. 57

ఆప్యాయనాయ శిష్యస్య గురుః శిరశి విన్యసేత్‌ | విసృజ్య పితరౌ దద్యాద్వౌషడన్త శివాణునా. 58

పూరణాయ విధిః పూర్ణా నివృత్తిరితి శోధితా.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నిర్వాణదీక్షాయాం నివృత్తికలాశోధనం నామ చతురాశీతీతమో7ధ్యాయః.

పాశము బంధించకుండ ఉండుటకు దానిని అస్త్రమంత్రముతో, రెండు చేతులతో నలిపి, గోలాకారము చేసి నేతితో నింపిన స్రువములో పడవేయవలెను. కలామయ మగు అస్త్రముచేత గాని, దేవతాస్త్రమంత్రముచే గాని దానిని కాల్చివేసి భస్మము చేయవలెను. పిమ్మట పాశాంకురము తొలగిపోవుటకు నాలుగు హోమములు చేయవలెను. ''ఓం హాః అస్త్రాయ హూం ఫట్‌ స్వాహా'' అనునది హోమమంత్రము. పిదప అస్త్రమంత్రముతో ఎనిమిద హోమములు చేసి ప్రాయశ్చిత్తము చేయవలెను. పిమ్మట విధాతను ఆవాహన చేసి పూజాతర్పణములు చేయవలెను. ''ఓం హాం శబ్దస్పర్శౌ శుల్గ్కం బ్రహ్మన్‌ గృహాణ స్వాహ'' అను మంత్రముతో మూడు హోమములు చేసి శిష్యునకు అధికారము సమర్పింపవలెను. శివుని ఆజ్ఞను ఈ విధముగ బ్రహ్మకు తెలుపవలెను. ''ఓం బ్రహ్మా! ఈ పిల్లవాని పాశము లన్నియు దగ్ధములైనవి. ఈతని మరల బంధనములలో పడవేయుటకై నీ విచట ఉండరాదు''. ఇట్లు చెప్పి, బ్రహ్మను పంపివేసి, సంహారముద్రా కుంభకప్రాణాయామములతో, రాహువు యుక్తచంద్రైక దేశమువలె నున్న ఆత్మను, ఆత్మమంత్ర ముచ్చరించుచు కుడినాడి ద్వారా మెల్ల మెల్లగా తీసికొని, రేచకప్రాణాయామ ఉద్భవముద్రలతో వెనుకటి సూత్రమునందు చేర్చవలెను. మరల దానిని పూజించి గురువు అర్ఘ్యపాత్రలో నున్న అమృతోపమజలబిందువులను గ్రహించి, శిష్యుని పుష్టి- తృప్తులకొరకై అతని శిరముపై నుంచవలెను. పిమ్మట మతాపితరుల విసర్జనము చేసి వౌషడంత మగు అస్త్రమంత్రముతో, విధిదూర్తికొరకై పూర్ణాహుతి ఇవ్వవలెను. ఇట్లు చేయుటచే నివృత్తికళశుద్ధ మగును. ''ఓం హూం హాం అముకస్య ఆత్మనో నివృత్తి కలాశుధ్ధిరస్తు స్వాహా ఫట్‌ వౌషట్‌'' అనునది పూర్ణాహుతి మంత్రము.

అగ్నిమహాపురాణములో, నిర్వాణదీక్షయందు నిర్వాణకళాశోధన మను ఎనుబదినాల్గవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters