Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ నవతితమో7ధ్యాయః

అథ అభిషేకాది.

ఈశ్వర ఉవాచ :

శివమర్చ్యాభిషేకం కుర్యాచ్ఛిష్యాదికే శ్రియే | కుమ్భానీశాది కాష్ఠాసు క్రమశో నవ విన్యసేత్‌. 1

తేషు క్షారోదం క్షీరోదం దధ్యుదం ఘృతసాగరమ్‌ | ఇక్షుగాదమ్బరీస్వాదుమస్తూదానష్ట సాగరాన్‌. 2

నివేశ##యేద్యథాసంఖ్యమష్టౌ విద్యేశ్వరానథ | ఏకం శిఖణ్డినం రుద్రం శ్రీకణ్ఠం తు ద్వితీయకమ్‌. 3

త్రిమూర్తమేకరుద్రాక్షమేకనేత్రం శివోత్తమమ్‌ | సప్తమం సూక్ష్మనామానమనన్తం రుద్రమష్టమమ్‌. 4

మధ్యేశివం సముద్రం చ శివమన్త్రం చ విన్యసేత్‌ | యాగాలయాన్దిగీశస్య రచితే స్నానమణ్డపే. 5

కుర్యాత్కరద్వయాయామాం వేదిమష్టాజ్గులో చ్ఛ్రితామ్‌ | శ్రీపర్ణాద్యాసనే తత్ర విన్యస్యానన్తమాసనమ్‌. 6

శిష్యం నివేశ్య పూర్వస్యాం సకలీకృత్య పూజయేత్‌. | కాఞ్జీకోదనమృద్భస్మదూర్వాగోమయగోలకైః. 7

సిద్దార్థదధితాయైశ్చ కుర్యాన్నిర్మథనం తతః | క్షారోదాను క్రమేణాథ హృదా విద్యేశశమ్బరైః. 8

కలశైః స్నాపయేచ్ఛిష్యం స్వధాధారణయాన్వితమ్‌ | పరిధాప్య సితే వస్త్రే నివేశ్య శివదక్షిణ. 9

పూర్వోదితాసనే శిష్యం పునఃపూర్వవదర్చయేత్‌ | ఉష్ణీషం యోగపట్టం చ ముకుటం కర్తరీం ఘటీమ్‌. 10

అక్షమాలాం పుస్తకాది శిబికాద్యధికారకమ్‌ | దీక్షావ్యాఖ్యా ప్రతిష్ఠాద్యం జ్ఞాత్వాద్యప్రభృతి త్వయా. 11

సుపరీక్ష్య విధాతవ్యమాజ్ఞాం సంశ్రావయేదితి | అభివాద్య తతః శిష్యం ప్రణిపత్య మహేశ్వరమ్‌. 12

విఘ్నజ్వాలాపనోదాయ కుర్యాద్విజ్ఞాపనం యథా | అభిషేకార్థమావిష్టస్తయాహం గురుమూర్తినా. 13

సంహితాపారగః సో7యమభిషిక్తో మయా శివ | తృప్తయే మన్త్రచక్రస్య పఞ్చపఞ్చాహుతీర్యజేత్‌. 14

éదద్యాత్పూర్ణాం తతః శిష్యం స్థాపయేన్నిజదక్షిణ | శిష్యదక్షిణపాణిస్థా అజ్గుష్ఠాద్యజ్గులీః క్రమాత్‌. 15

లాఞ్ఛయేదుపబద్దాయ దగ్దదర్భాగ్రశమ్బరైః | కుసుమాని కరే దత్వా ప్రణామం కారయేదముమ్‌. 16

కుమ్భేనలే శివే స్వస్మిం స్తత్కృత్య మావిశేత్‌ | అనుగ్రాహ్యస్త్వయా శిష్యాః శాస్త్రేణ సుపరీక్షితాః. 17

భూపవన్మానవాదీనామభి షేకాదభీప్సితమ్‌ |

ఓం శ్రాం శ్రౌం పశు హూం ఫడిత్యస్త్రరాజాభిషేకతః. 18

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నిర్యాణదీక్షాభిషేకాది విధిర్నామ నవతితమో7ధ్యాయః.

పరమేశ్వరుడు చెప్పెను :- శివపూజానంతరము గురువు శ్రీప్రాప్తికై శిష్యాదులకు స్నానము చేయించవలెను. ఈశాన్యాది దిక్కులందు ఎనిమిది కలశములను, మధ్య ఒక కలశమును స్థాపించవలెను. ఆ ఎనిమిది కలశములలో వరుసగ క్షారోదక-క్షీరోదక-దధ్యుదక-ఘృతోదక-ఇక్షుకసోదక-సురోదక-స్వాదూదక-గర్భోదక సముద్రముల ఆవాహనము చేసి క్రమముగ శిఖండి-శ్రీకంఠ-త్రిమూర్తి-ఏకరుద్ర-ఏకనేత్ర- శివోత్తమ-సూక్ష్మ-అనంతరుద్రులను ఎనమండుగురు విద్వేశ్వరులను స్థాపించవలెను. మధ్యనున్న కలశములో శివ-సముద్ర-శివమంత్రములను స్థాపించవలెను యాగమండపదిక్కునందు స్వామికొరకై ఏర్పరచిన స్నానమండపమునందు రెండు బెత్తుల పొడవు, ఎనిమిది అంగుళముల ఎత్తు గల ఒకవేది నిర్మించవలెను. దానిపై కమలాద్యాసనములు కప్పి, దానిపై ఆసనస్వరూపుడైన అనంతుని న్యాసము చేసి శిష్యుని పూర్వాభిముఖముగ కూర్చుండబెట్టి సకలీకరణపూర్వకముగ పూజ చేయవలెను. ఆతని శరీరమునకు గంజి, అన్నము, మట్టి, భస్మము, దూర్వలు, గోమయగోళములు, ఆవాలు, పెరుగు, ఉదకము వ్రాసి క్షారోదకాదిక్రమమున, నమస్కారసహితము లగు విద్వేశ్వరనామ మంత్రములతో, కలశజలములో శిష్యునికి స్నానము చేయించవలెను. శిష్యుడు మనస్సులో తాను అమృతముచేస్నానము చేయించబడున్నట్లు భావన చేయవలెను. పిదప ఆతనికి రెండు శ్వేతవస్త్రములు కట్టించి శివుని కుడి వైపున కూర్చండబెట్టవలెను. పైన చెప్పిన ఆసనమునందు శిష్యునకు, వెనుకటి వలెనే, మరల పూజ చేయవలెను. పిమ్మట ఆతనికి తలబాగ, కిరీటము, యోగపట్టిక, కర్తరి, చిన్నపాత్ర అక్షమాల, పుస్తకము, పల్లకి మొదలగునవి ఇచ్చి ఆతనికి అధికారము నీయవలెను. నేటినుండి నీవు బాగుగ తెలిసికొని పరీక్షించి, ఎవని కైనను దీక్షా-వ్యాఖ్యా-ప్రతిష్ఠాదుల ఉపదేశము నిచ్చు చుండుము.'' అని ఆజ్ఞను వినిపింపవలెను. శిష్యుని అభివాదనము స్వీకరించి, మహేశ్వరునకు ప్రణామము చేసి, విఘ్నసమూహనివారణార్థమై - ''పరమేశ్వరా! నీవు గురుస్వరూపుడవు. ఈశిష్యునకు అభిషేకము చేయుటకై నాకు ఆజ్ఞ ఇచ్చితివి. తదనుసారము నేను అభిషేకము చేసితిని, ఇతడు సంహితాపారంగతు డైనాడు'' అని పలుకుచు ప్రార్థించవలెను. మంత్రచక్రతృప్తికొరకై ఐదేసి ఆహుతు లిచ్చి మరల పూర్ణాహూతి చేయవలెను. పిమ్మట శిష్యుని తన కుడి ప్రక్కకూర్చుండబెట్టుకొని, ఆతని కుడి చేతి బొటనవ్రేలు మొదలగు వ్రేళ్లకు, దర్భాగ్రములు కాల్చిన మసి పూయవలెను. వాని చేతిలో పుష్పము లుంచి అతనిచే కలశ-అగ్ని-శివులకు నమస్కరింపచేయవలెను. ''నీవు శాస్త్రానుసారముగా బాగుగా పరీక్షించి శిష్యులను అనుగ్రహించవలెను'' అని ఆతనికి ఉపదేశించవలెను. మానవాదులకు అభిషేకము రాజాభిషేకము వలె చేయుటచే అభిష్టసిద్ధి కలుగును. ''ఓం శ్రాం శ్రౌం పశు హూం ఫట్‌'' అనునది అస్త్రరాజమైన పాశుపతమంత్రము. దీనితో అస్త్రరాజమును పూజించి, అభిషేకము చేయవలెను.

అగ్నిమహాపురాణమునందు అభిషేకావిధివర్ణన మను తొంబదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters