Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ఏకనవతితమో7ధ్యాయః అథ వివిధ మన్త్రాదాయః ఈశ్వర ఉవాచ : అభిషిక్తః శివం విష్ణుం పూజయేద్భాస్కరాదికాన్ | శఙ్ఖభేర్యాది నిర్ఘోషైః స్నాపయేత్పఞ్చగవ్యకైః 1 యో దేవాన్ దేవలోకం స యాతి స్వకులముద్ధరన్ | వర్షకోటిసహస్రేషు యత్పాపం సముపార్జితమ్. 2 ఘృతాభ్యఙ్గేన దేవానాం భస్మీభవతి పావకే | ఆఢకేన ఘృతాద్యైశ్చ దేవాన్ స్నాప్య సురో భ##వేత్. 3 చన్దనేనానులిప్యాథ గన్ధాద్యైః పూజయేత్తథా | అల్పాయాసేన స్తుతిభిః స్తుతా దేవాస్తు సర్వదా. 4 అతీతానాగతజ్ఞాన మన్త్రధీ భుక్తిముక్తిదా | గృహీత్వా ప్రశ్నసూక్ష్మార్ణే హృతే ద్వాభ్యాం శుభాశుభమ్. 5 త్రిభిర్జవో మూలధాతుశ్చతుర్భిర్బ్రాహ్మణాదిభిః | పఞ్చాదౌ భూతతత్త్వాది శేషే చైవం జయాదికమ్. 6 ఏకత్రికాతిత్రికాన్తే పదే ద్విపదకాన్తకే | అశుభం మధ్యం మధ్యేష్విన్ద్రస్త్రిషు నృపః శుభః. 7 సంఖ్యావృన్దే జీవితాబ్దం యమో7బ్దదశహా ధ్రువమ్ | సూర్యేభాస్యేశ దుర్గా శ్రీ విష్ణు మన్త్రెర్లిఖేత్కజే. 8 కఠిన్యా జప్తయా స్పృష్టే గోమూత్రాకృతిరేఖయా | ఆరభ్యైకం త్రికం యావత్త్రిచతుష్కావసానకమ్ . 9 మరుద్వ్యోమ మరుద్బీజైశ్చతుః షష్టిపదే తథా | అక్షాణాం పతనాత్ స్పర్శాద్విషమాదౌ శుభాదికమ్. 10 ఏకత్రికాదిమారభ్య అన్తే చాష్టత్రికం తథా | ధ్యజాద్యాయాః సమా హీనా విషమాః శోభనాదిదాః. 11 ఆ ఈపల్లవితైః కాద్యైః షోడశస్వర పూర్వగైః | ఆద్యైసై#్తః సస్వరైః కాద్యైస్త్రిపురాణామమన్త్రకాః. 12 శ్రీం బీజాః ప్రణవాద్యాః స్యుః నమోన్తా యత్ర పూజనే | మన్త్రా వింశతిసాహస్రాః శతం షష్ట్యధికం తతః. 13 ఓం హ్రీం మన్త్రాః సరస్వత్యాశ్చణ్డికాయాస్తథైవ చ | తథా గౌర్యాశ్చ దుర్గాయా ఆం శ్రీం మన్త్రాః శ్రియస్తథా. తథా క్షౌం మన్త్రాః సూర్యస్య ఆం హౌం మన్త్రాః శివస్య చ | ఆం గం మన్త్రా గణశస్య ఆం మన్త్రాశ్చ తథా హరేః. 15 శతార్దైకాధికైః కాద్యైస్తథా షోడశభిః స్వరైః | కాద్యైసై#్తః సస్వరైరాద్యైః కాన్తైర్మన్త్రాస్తథాఖిలాః. 16 రవీశ##దేవీవిష్ణూనాం స్వాబ్దిదేవేన్ద్రవర్తనాత్ | శతత్రయం షష్ట్యధికం ప్రత్యేకం మణ్డలం క్రమాత్. 17 అభిషిక్తో జపేధ్ధ్యాయేచ్ఛి ష్యాదీన్ దీక్షయేద్గురుః | ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే అభిషిక్తేన కర్తవ్యస్య తత్తద్దే వతామన్త్రజపాదేర్విధిర్నామ ఏకనవతితమో7ధ్యాయః. పరమేశ్వరుడు చెప్పెను : అభిషేకానంతరము దీక్షితుడు శివ-విష్ణు-సూర్యదిదేవతలను పూజించవలెను. శంఖ భేర్యాదివాద్యధ్వనులతో దేవతలకు పంచగవ్యములతో స్నానము చేయించు వాడు, తన కులమును ఉద్ధరించి తాను దేవలోకమునకు వెళ్లును. దేవతల శరీరమునకు ఆజ్యాభ్యంగనము చేయుటచే, కోటి సహస్రవర్ష సంచితమైన పాపము భస్మ మైపోవును. ఒక ఆఢకము (అడ్డెడు) నెయ్యి మొదలైన వాటితో దేవతలకు స్నానము చేయించిన మనుష్యుడు దేవత యగును. చందనము పూసి గంధాదులతో దేవపూజ చేయువానికి గూడ అదే ఫలము లంభించును. కొంచెము ప్రయాసతో మాత్రమే స్తోత్రపాఠము చే దేవతాస్తుతి చేసినచో భూతభవిష్యజ్ఞానము, మంత్రజ్ఞానము, భోగమోక్షములు లభించుచు ఎవరైన మంత్రమునకు సంభంధించిన శుభాశుభఫలములను గూర్చి ప్రశ్నించినచో, ఆ ప్రశ్న వాక్యములో నున్న అక్షరములు లెక్కించి, రెండుచే భాగించగా ఒకటి శేషించినచో శుభము, శూన్యముగాని, రెండు గాని శేషించినచో అశుభము. మూడుచే భాగించినచో మూలధాతురూపజీవుని విషయము తెలియును. ఒకటి శేషించినచో వాతజీవుడు, రెండు శేషించినవో పిత్తజీవుడు, మూడు శేషించినచో కఫజీవుడు. నాలుగుతో భాగించినచో బ్రహ్మణాదివర్ణబుద్ధి కలుగును, ఐదుచే భాగించినచో భూతత్త్వాది జ్ఞానము కలుగును. ఈ విధముగనే జయపరాజయాది జ్ఞానము కూడ కలుగును, మంత్రపదాంతమునందు ఒక త్రికము (ముడు బీజాక్షరములు) నన్ను, అధికబీజాక్షరములున్నను, ప, మ, కలు ఉన్నను వీటిలో మొదటిది అశుభము. మధ్యలో నున్నది మధ్యమము, చివరిది శుభము. చివర సంఖ్యాసమూహ మున్నచో ఆది జీవనకాలము పది సంవత్సరములు అని సూచించును. దశసంఖ్య ఉన్నచో పది సంవత్సరముల పిమ్మట ఆ మంత్రసాధకుడు తప్పక మరణించును, సూర్య-గణపతి-శివ-దుర్గా-లక్ష్మీ-విష్ణు మంత్రముల అక్షరములతో, అంగుష్ఠస్పృష్టమైన కమలపత్రముమీద, గోమూత్రాకారరేఖపై, ఒక త్రికము (మూడు అక్షరములు) తో ప్రారంభించి పండ్రెండు త్రికములవరకును వ్రాయవలెను. అరువదినాలుగు కోష్ఠముల మండలము చేసి దాని పై యం, హం యం అను బీజాక్షరముల త్రికములను మొదటి కోష్ఠమునుండీ ఎనిమిదవ కోష్ఠమువరకును వ్రాయవలెను. ఈ స్థానములపై పాచిక వేయుటచేత గాని, స్పృశించుటచేత గాని శుభాశుభజ్ఞానము కలుగును. పాచిక లేదా స్పర్శ విషమసంఖ్యకల దానిపై పడినచో శుభము, సమసంఖ్యగలదానిపై అశుభము. 'యం హం హం' అను మూడు బీజాక్షరముల ఎనిమిది త్రికముల ధ్వజాదు లగు ఎనిమిది ఆయములకు ప్రతీకములు, వీటిలో సమ మైనవి అశుభములు, విషయములు శుభప్రదములు. క మొదలగు అక్షరములను పదునారు స్వరములతోడను, అట్లే పదునారు స్వరములను కాద్యక్షరములతో చేర్చి, వాటికి 'ఆం ఈం' అను పల్లవములను కూర్చవలెను. పల్లవయుక్తములైన ఈ సస్వరకాద్యక్షరములను ఆదియం దుంచి వాటితో త్రిపురామంత్రమును వేరువేరుగ చేర్పవలెను. వీటి మొదట 'హ్రీం', చివర 'నమః' చేర్చవలెను. ఈ విధముగ పూజావిని యుక్తము లగు ఈ మంత్రముల ప్రస్తారముచే ఇరువదివేల నూట అరువది మంత్రము లేర్పడును. సరస్వతీ - చండీ - గౌరీ-దుర్గామంత్రములకు 'ఆం హ్రీం' అను బీజములును, శ్రీదేవి మంత్రమునకు 'ఆం శ్రీం' అను బీజములును, సూర్యమంత్రమునకు 'అం క్షౌం' లును, శివమంత్రమునకు 'ఆం హూం'లును గణశమంత్రములకు 'ఆం గం' లును, విష్ణువునకు 'ఆం అం' లును ఉండును. కాదివ్యంజనములు అకారాది షోడశస్వరములు కలిసి మొత్తము ఏబదియొ క్క అక్షరములగును. ఈ విధముగ సస్వరము లగు కాద్యక్షరములను ఆదియందును, సస్వర క్షాది కాంతాక్షరములను అంతమునందును ఉంచగా సంపూర్ణమంత్రమగును. మొత్తము మండలముల సంఖ్య 1440 కాగా సూర్య శివ-దేవీ-దుర్గా-విష్ణువుల మండలములు మూడువందల అరువది చొప్పున అగును. అభిషిక్తుడైన గురువు ఈ అన్నిమంత్రముల జపము, దేవతల ధ్యానము చేసి, శిష్యునకును పుత్రునకును దీక్ష ఇవ్వవలెను. అగ్ని మహాపురాణమునందు నానామంత్రాది కథన రూప మగు తొంబదియొక్కటవ అధ్యాయము సమాప్తము.