Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ షణ్ణవతితమో7ధ్యాయః అథ అధివాసనవిధిః ఈశ్వర ఉవాచ : స్నాత్వా నిత్యద్వయం కృత్వా ప్రణవార్ఘకరో గురుః | సహాయైర్మూర్తిపైర్విప్త్రెః సహగచ్ఛేన్మఖాలయమ్. శాన్త్యాదితోరణాంస్తత్ర పూర్వవత్పూజయేత్క్రమాత్ | ప్రదక్షిణక్రమాదేషాం శాఖాయాం ద్వారపాలకాన్. ప్రాచి నన్దిమహాకాలౌ యామ్యే భృఙ్గివినాయకౌ | వారుణ వృషభస్కన్దౌ దేవీచణ్డ తథో త్తరే. 3 తచ్ఛాఖామూలదేశస్థౌ ప్రశాన్తశిశిరౌ ఘటే | పర్జన్యశోకనామానౌ భూతసఞ్జీవనామృతౌ. 4 ధనదశ్రీపదౌ ద్వౌ ద్వౌ పూజయేదనుపూర్వశః | స్వనామభిశ్చతుర్థ్యన్తైః ప్రణవాదినమో7న్తకైః. 5 లోకగ్రహావసుధ్యాఃస్థస్రవన్తీనాం ద్వయం ద్వయమ్ | భానుత్రయం యుగం వేదో లక్ష్మీర్గణపతిస్తథా. 6 ఇతి దేవా మఖాగారే తిష్ఠన్తి ప్రతితోరణమ్ | విఘ్నసంఘాపనోదాయ క్రతోః సంరక్షణాయ చ. 7 వజ్రం శక్తం తధా దణ్డం ఖడ్గం పాశం ద్వజం గదామ్| త్రిశూలం చక్రమమ్బోజం పతాకాస్వర్చయేత్ క్రమాత్. 8 ఓం హూం ఫట్ నమః. ఓం హూం ఫట్ ద్యాస్థశక్తయే హూం ఫట్ నమ ఇత్యాది మన్త్రైః కుముదః కుముదాక్షశ్ఛ పుణ్డరీకో7ధ వామనః | శజ్కుకర్ణః సర్భనేత్రః సుప్రతిష్ఠితః. 9 ధ్వజే7ష్టదేవతాః పూజ్యాః పూర్వాదౌ భూతకోటిభిః | ఓం కౌం కుముదాయ నమఇత్యాదిమన్త్రైస్తథా. 10 హేతుకం త్రిపురఘ్నం చ శక్త్యాఖ్యం యమజిహ్వకమ్ | కాలం కరాలినం షష్ఠమేకాఙ్ఘ్రిం భీమమష్ఠికమ్. తథైవ పూజయేద్దిక్షు క్షేత్రపాలాననుక్రమాత్ | బలిభిః కుసుమైర్దూపైః సన్తుష్టాన్పరిభావయేత్. 12 పరమేశ్వరుడు చెప్పెను. పురోహితుడు స్నానమాచరించి, ప్రాతః కాలమధ్యాహ్నకాల కృత్యములు నెరవేర్చుకొని మూర్తి రక్షకులగు బ్రహ్మణులతో కలిసి యజ్ఞ మండపము చేరుకొనవలెను. వెనుకటి వలెనే శాంత్యాదిద్వారపూజ క్రమముగ చేసి, ద్వారముల రెండు శాఖలందును, ప్రదక్షిణమున, ద్వారపాలపూజ చేయవలెను. పూర్వదిక్కున ద్వారపాలులైన నందీ-మహాకాలులను-దక్షిణమున భృంగి-వినాయకులను, పశ్చిమమున వృషభస్కందులను, ఉత్తరమున దేవి-చండులను పూజించవలెను. ద్వారశాఖామూలములందు, పూర్వాదిక్రమమున రెండేసి కలశలను పూజించవలెను. పూర్వదిక్కుననున్న కలశల పేర్లు ప్రశాంత-శిబిరములు, దక్షిణమున పర్జన్య-అశోకములు, పశ్చిమమున భూతసంజీవన-అమృతములు ఉత్తరమున ధనద-శ్రీప్రదములు, ఈ రెండేసి కలశలను క్రమముగా పూజించు విధానము చెప్పబడినది. వీటి పేర్ల ప్రారంభమున ఓంకారము, అంతమున 'నమః' చేర్చి చతుర్థ్యంతరూపము ఉంచవలెను. ఇవే దీని పూజామంత్రములు, ఉదా- ''ప్రశాన్త శిశిరాభ్యాం నమః'' మొ. యజ్ఞమండపమునందలి ప్రత్యేక ద్వారమునందును రెండు లోకములు, రెండు గ్రహములు, ఇద్దరు వసువులు, ఇద్దరుద్వారపాలురు, రెండు నదులు, ముగ్గురు, సూర్యులు, ఒక యుగము, ఒక వేదము, లక్ష్మి, గణశుడును ఉండును, విఘ్నములను తొలగించి యజ్ఞమును రక్షించుట వీరి కర్తవ్యము. పూర్వా దిదిక్కులు పదింటియందును వజ్ర-శక్తి-దండ-ఖడ్గ-పాశ-ధ్వజ-గదా-త్రిశూల-నక్ర-కమరములను పూజించి, ఒక్కొక్క దిక్కునందును దిక్పాలకపతాకా పూజ చేయవలెను. ''ఓం హూం హః హూం ఫట్'' 'ఓం హూం హః శక్తయే హూం ఫట్' ఇత్యాదులు మంత్రములు కుముద-కుముదాక్ష పుండరీక-వామన-శంకుకర్ణ-సర్వనేత్ర-సముఖ-సుప్రతిష్ఠితు లను ఎనుమండుగురు ధ్వజదేవతలను కోటికోటి భూతములతో పూజించవలెను. ''ఓం కుం కుముదాయ నమః'' ఇత్యాదులు పూజామంత్రములు హేరుక-త్రిపురఘ్న-శక్తి-యమజిహ్వ-కాల-కరాలీ-ఏకాంఘ్రి-భీము లను ఎనమండుగురు క్షేత్రపాలులను పూర్వాదిదిక్కులందు బలి-పుష్ప-ధూపాదులతో పూజించి సంతుష్టులను చేయవలెను. కాక్షీతృణషు వంశేషు స్థూణాష్యన్యేష్యనుక్రమాత్ | పఞ్చ క్షిత్యాది తత్త్వాని సద్యోజాతాదిభిర్యజేత్. 13 సదాశివపదవ్యాపి మణ్డపం ధామ శాఙ్కరమ్ | పతాకాశక్తిసంయుక్తం తత్త్వదృష్ట్యావలోకయేత్. 14 దివ్యాన్తరిక్షభూమిష్టవిఘ్నానుత్సార్య పూర్వవత్ | ప్రవిశేత్పశ్చిమద్వారా శేషద్వారాణి దర్శయేత్. 15 ప్రదక్షిణక్రమాద్గత్వా నివిష్ణో వేదిదక్షిణ | ఉత్తరాభిముఖః కుర్యాద్భూతశుద్ధిం యథాపురా. 16 అన్తర్యాగం విశేషార్ఘ్యం మన్త్రద్రవ్యాదిశోధినమ్ | కుర్వీత స్వాత్మనః పూజాం పఞ్చగవ్యాది పూర్వవత్. సాధారం కలశం తస్మిన్విన్యసేత్తదనన్తరమ్ | విశేషాచ్ఛివతత్త్వాయ తత్త్వత్రయమనుక్రమాత్. 18 లలాటస్కన్దపాదాన్తం శివవిద్యాత్మకం పరమ్ | రుద్రనారాయణబ్రహ్మదైవతం నిజసఞ్చరైః. 19 ఓం హాం హాం మూర్తీ స్తదీశ్వరాంస్తత్ర పూర్వవద్వినివేశ##యేత్| తద్వ్యాపకం శివం సాఙ్గం శివహస్తం చ మూర్దని. 20 బ్రహ్మరన్ద్రప్రవిష్టేన తేజనా బాహ్యమన్తరమ్ | తమఃపటలమాధూయ ప్రద్యోదిత దిగన్తరమ్. 21 ఆత్మానం మూర్తిపైః సార్దం స్రగ్వస్త్రకుసుమాదిభిః | భూషయిత్వా శివో7స్మీతి ధ్యాత్వా బోధాసిముద్దరేత్. పిదపఉత్తమతృణములపైన, లేదా, వెదురుస్తంభములపై పృథ్వ్యాది పంచతత్త్వములను స్థాపించి, సద్యోజాతిమంత్ర పంచకముతో వాటిని పూజించవలెను. పతాకతోడను, శక్తితోడను యుక్త మగు సదాశివపదవ్యాపి యైన మండపము శంకరుని స్థానము అని తాత్త్వికదృష్టితో చూడవలెను. వెనుకటి వలె ద్యులోకాన్తరిక్షలోకభూలోకములలో నున్న విఘ్నములను తొలగించి పశ్చిమద్యారమున ప్రవేశించి ఇతర ద్వారముల దర్శనము చేయవలెను. ప్రదక్షిణక్రమమున మండపములోనికి ప్రవేశించి, వేదీదక్షిణభాగమున ఉత్తరాభిముఖముగ కూర్చుండి, వెనుకటి వలె భూతశుద్ధి చేయవలెను. అంతర్యాగ-విశేషార్ఘ్య-మంత్రద్రవ్యాదిశోధన-స్వాత్మపూజన-పంచగవ్యాదికము వెనుకటి వలె చేయవలెను. అచట అధారశక్తిప్రతిష్ఠాపూర్వకముగ కలశస్థాపనము చేయవలెను. విశేషించి శివధ్యానము చేయవలెను. పిదప మూడుతత్త్వముల చింతనము చేసి, లలాటమున శివతత్త్వమును, స్కంధదేశమునందువ విద్యాతత్త్వమును పాదాన్తభాగమునందు ఆత్మతత్త్వమును భావన చేయవలెను. శివతత్త్వమునకు రుద్రుడు, విద్యాతత్త్వమునకు నారాయణుడు, ఆత్మతత్త్వమునకు బ్రహ్మయు దేవతలు, వీరిని వారి వారి నామమంత్రములలో పూజించవలెను. వరుసగ ఈ తత్త్వముల ఆదిబీజములు ''ఓం ఈం ఆం'' అనునవి (ఓం హంహాం అనునవి).మూర్తులను మూర్తీశ్వరులను వెనుకటి వలెనే స్థాపించి, వాటిమీద వ్యాపకశివుని సాంగపూజ చేసి, శిరముపై శివహస్తమును ఉంచవలెను. బ్రహ్మరంధ్రమునుండి ప్రవేశించి తేజస్సుచే తన లోపలను, బైటను ఉన్న అంధకారరాశి నష్టమైనట్లు భావన చేసి, ''ఆత్మస్వరూపమే సంపూర్ణదిఙ్మండలమును ప్రకాశింపచేయుచున్న దని భావన చేయవలెను. మూర్తిపాలకులతో పాటు తనను గూడ వస్త్ర-ముకుటాదులతో అలంకరించకొని, ''నేనే శివుడను'' అని చింతించుచుభోధ ఖడ్గమును ఎత్తవలెను. చతుష్పాదాన్తసంస్కారైః సంస్కుర్యాన్మఖమణ్డపమ్ | విక్షిప్యవికిరాదీని కుశకూర్చోపసంహరేత్. 23 అసనీకృత్య వర్దన్యాం వాస్త్వాదీన్ పూర్వవదగ్యజేత్ | శివకుమ్భాస్త్రవర్దన్యౌ పూజయేచ్చస్థిరాసనే. 24 స్వదిక్షు కలశారుఢాన్ లోకపాలాననుక్రమాత్ | వాహాయుధాదిసంయుక్తాన్ పూజయేద్విధినా యథా. 25 ఐరావతగజారూఢం స్వర్ణవర్ణం కిరీటినమ్ | సహస్రనయనం శక్రం వజ్రపాణిం విభావయేత్. 26 సప్తార్చిషం చ బిభ్రాణమక్షమాలాం కమణ్ణలమ్ | జ్వాలామాలాకులం రక్తం శక్తిహస్తమజాసనమ్. 27 మహిషస్థం దణ్డహస్తం యమం కాలానలం స్మరేత్ | రక్తనేత్రం ఖరారూఢం ఖడ్గహస్తం చ నైరృతమ్. వరుణం మకరే శ్వేతం నాగపాశధరం స్మరేత్ | వాయుం చ హరిణ నీలం కుబేరం మేషసంస్థితమ్. 29 త్రిశూలినం వృషే చేశం కూర్మోనన్తం తు చక్రిణమ్ | బ్రహ్మాణం హం సగం ధ్యాయేచ్చతుర్వక్త్రం చతుర్భుజమ్. 30 స్తమ్భమూలేషు కుమ్భేషు వేద్యాం ధర్మాది కాన్యజేత్ | దిక్షు కుమ్భేష్వనన్తాదీన్ పూజయన్త్యసి కేచన. 31 శివాజ్ఞాం శ్రావయేత్కుమ్భం భ్రామయేదాత్మపృష్ఠగమ్ | పూర్వవత్థ్సాపయేదాదౌ కుమ్భం తదను వర్ధనీమ్. శివం స్థిరాసనం కుమ్భే శస్త్రార్థం చ ధ్రువాసనమ్ | పూజయిత్వా యథా పూర్వ ం స్పృశేదుద్భవముద్రయా. నిజయాగం జగన్నాథ రక్ష భక్తానుకమ్పయా | ఏభిః సంశ్రావ్య రక్షార్థం కుమ్భేఖడ్గం నివేశ##యేత్. 34 దీక్షాస్థాపనయోః కుమ్భే స్థణ్డిలీ మణ్డలే7ధవా | మణ్డలే7భ్యర్చ్య దేవేశం వ్రజేద్వై కుణ్డసన్నిధౌ. 35 చతుష్పదాంత సంస్కారములతో యజ్ఞమండపసంస్కారము చేసి, చల్ల వలసిన వస్తువులు నలుమూలల చల్లి కుశకుంచితో వాటినన్నింటిని ప్రోగుచేయవలెను. వాటిని అసనముక్రింద నుంచి, వర్ధనీజలముతో వెనుకటి వలె వాస్త్వాది పూజచేయవలెను. శివకుంభాస్త్రమును, వర్దనిని సుస్థిరాసనమును కూడ పూజించవలెను.వారి వారి కలశలపై నున్న ఇంద్రాది దిక్పాలకులను క్రమముగ ఆయుధ పరివారాది సహితముగ పూజించవలెను. తూర్పున, ఐరావతము నెక్కి, శిరముపై కిరీటమును, హస్తమును వజ్రమును ధరించిన సహస్రాక్షుడైన ఇంద్రుని ధ్యానించవలెను. అగ్నేయమున జ్వాలామయములగు ఏడు జిహ్వలు కలిగి, అక్షమాలాకమండలములు ధరించి, అజారూఢుడైన జ్వాలాపరివృతుడైన అగ్నిదేవుని ధ్యానించవలెను. ఆతని హస్తమునందు శక్త్యాయుధముండును. దక్షిణమున మహిషారూఢుడును. దండాధారియు, కాలాగ్నివలె ప్రకాశించువాడును అగు యముని ధ్యానించవలెను. నైరృతియందు ఖరారూఢుడై, ఖడ్గము ధరించి, ఎఱ్ఱని నేత్రములు గల నైరృతిని ధ్యానించవలెను. పశ్చిమమున, మకరారూఢుడును, శ్వేతవర్ణుడును, నాగపాశధారియు అగు వరుణుని ధ్యానించవలెను. వాయవ్యమునందు లేడి నెక్కిన, నీలవర్ణుడైన వాయువును, ఉత్తరమునందు గొర్రెనెక్కిన కుబేరును, ఈశాన్యమున త్రిశూలధారియు, వృషభారుఢుడును ఈశానుని, నైరృతి-పశ్చిమముల మధ్య కచ్ఛపారూఢుఢును చక్రధారియు అగు అనంతుని, ఈశాన-పూర్వదిఙ్మధ్యములందు నాలుగు ముఖములు, నాలుగు భజములును, గల హంసవాహనుడైన బ్రహ్మనుధ్యానించవలెను. స్తంభమూలమునందు న్న కలశములందును, వేదియందును ధర్మాదులను పూజించవలెను. కొందరు అన్ని దిక్కలందును ఉన్న కలశలపై అనంతాదులను పూజింతరు. పిదప శివాజ్ఞ వినిపించి, కలశములను తన పృష్ఠభాగము వరకును త్రిప్పవలెను. పిదప, ముందుగ కలశను, తరువాత వర్దనిని, వాటి స్థానములందుంచవలెను. స్థిరాసనము గల శివుని కలశమునందును, శస్త్రము నిమిత్తమై ధ్రువాసనమును వెనుకటి వలె పూజించి ఉద్భవముద్రతో స్పృశించవలెను. అపుడు ''జగన్నాధా! నీ భక్తులపై కృపతో ఈ నీ యజ్ఞమును రక్షించుము'' అని ప్రార్థించి కలశమునందు ఖడ్గస్థాపన చేయవలెను. దీక్షాస్థాపనాసమయములందు, కలశయందుగాని, వేదిపైగాని, మండలముపైగాని శివుని పూజించవలెను. మండలమునందు దేవేశ్వురు డగు శివుని పూజించి , కుండము దగ్గరకు వెళ్ళవలెను. కుణ్డనాభిం పురస్కృత్య నివిష్టా మూర్తాధారిణః | గురోరజేశతః కుర్యుర్నిజకుణ్ఢషు సంస్కృతిమ్. 36 జపేయుర్జాపినో7సంఖ్యం మన్త్రమన్యే తు సంహితామ్ | పఠేయుర్బ్రాహ్మణాః శాన్తిం స్వశాఖావేదపారగాః . 37 శ్రీసూక్తం పావమానీశ్చ మైత్రకం చ వృషాకపిమ్ | ఋగ్వేది పూర్వదిగ్భాగే సర్వమేతత్సముచ్చరేత్. 38 దేవవ్రతం తు భారుణ్డం జ్యేష్ఠసామ రథన్తరమ్ | పురుషం గీతిమేతాని సామవేదీ తు దక్షిణ. 39 రుద్రం పురుషసూక్తం చ శ్లోకాధ్యాయం విశేషతః | బ్రాహ్మణం చ యజుర్వేదీ పశ్చిమాయాం సముచ్చరేత్. 40 నీలరుద్రం తథాథర్వీ సూక్ష్మాసూక్ష్మం తథైవ చ | ఉత్తరే7థర్వశీర్షం చ తత్పరస్తుసముచ్చరేత్. 41 ఆచార్యశ్చాగ్నిముత్పాద్య ప్రతికుణ్డం ప్రదాపయేత్| వహ్నేః పూర్వాదికాన్ భోగాన్ పూర్వకుణ్డాదితః క్రమాత్. 42 ధూపదీపచరూణాం చ దదీతాగ్నిం సముద్దరేత్ | పూర్వవచ్ఛివమభ్యర్చ్య శివాగ్నౌ మన్త్రతర్పణమ్. 43 దేశకాలాదిసమ్పత్తౌ దుర్నిమిత్తప్రశాన్తయే | హోమం కృత్వా తు మన్త్రజ్ఞః పూర్ణాం దత్త్వా శుభావహామ్. 44 పూర్వవచ్చరుకం కృత్వా ప్రతికుణ్డం నివేదయేత్ | యజమానాలంకృతాస్తు వ్రజేయుః స్నానమణ్డపమ్. 45 భద్రపీఠే నిధాయే శం తాడయిత్వా7వకుంఠయేత్ | స్నాపయేత్పూజయిత్వా తు మృదా కాషాయవారిణా. 46 గోమూత్త్రెర్గోమయేనాపి వారిణా చాన్తరాన్తరా | భస్మనా గన్దతోయేన ఫడన్తాస్త్రేణ వారిణా. 47 దేశికో మూర్తిపైః సార్థం కృత్వాకరణ శోధనమ్ | ధర్మజప్తేన సంఛాద్య పీతవర్ణేన వాససా. 48 సంపూజ్య సితపుషై#్పశ్చ నయేదుత్తవేదికామ్| కుండనాభిని ముందు ఉంచుకొని కూర్చున్న మూర్తిధారులగు పురుషులు గురువు ఆజ్ఞ ననుసరించి తమతమ కుండములను సంస్కరించుకొనవలెను. జపముచేయు బ్రహ్మణులు, సంఖ్యారహితముగ జపము చేయవలెను. ఇతరులు సంహితాపాఠము చేయవలెను. వేదపారంగతులగు బ్రాహ్మణులు తమతమ శాఖల ననుసరించి శాంతిపాఠము చేయవలెను. ఋగ్వేదులగు బ్రహ్మణులుతూర్పున శ్రీసూక్త-పావమానీబుక్-మైత్రీయబ్రాహ్మణ-వృషాకపి మంత్రములను పఠించవలెను. సామవేదవేత్తలు దక్షిణమున దేవవ్రత-భారుండ -జ్యేష్ఠసామ-రథంతరసామ-పురుషగీతగానము చేయవలెను. యజుర్వేదులు పశ్చిమమున, రుద్రసూక్త-పురుషసూక్త-శ్లోకాధ్యాయములను, ప్రధానముగ బ్రహ్మణములను పఠించవలెను. అథర్వవేదులు, ఉత్తరమున, నీలరుద్ర, సూక్ష్మా సూక్ష్మ - అథర్వశీర్షములను శ్రద్ధతో పఠించవలెను. ఆచార్యుడు అగ్నిని పుట్టించి, అన్ని కుండములందును స్థాపింపచేయవలెను. అగ్నికి పూర్వాదిభాగములందు పూర్వకుండాది క్రమమున ధూప-దీప-చరువులకొరకై అగ్న్యుద్ధారము చేయవెలను. మొదట చెప్పిన విధముగ పరమేశ్వరుని పూజించి, శివాగ్నియందు మంత్రతర్పణము చేయవలెను. దేశకాలాది సంపన్నత్వము కొరకును, దుర్నిమిత్త శాంతికొరకును, మంత్రజ్ఞు డగు ఆచార్యుడు హోమము చేసి, మంగళకర మగు పూర్ణాహుతి ఇచ్చి, వెనుకటి వలె చరువును వండి, దానిని ఒక్కొక్కకుండము నందును నివేదన చేయవవలెను. యజమానునిచే వస్త్రాభూషణాదులతో సత్కరింపబడిన మూర్తిపాలకులగు బ్రహ్మణులు స్నానమండపమునకు వెళ్ళి, శివప్రతమను భద్రపీఠముపై స్థాపించి, తాడన-అవకుంఠన క్రియను చేయవలెను. పూర్వవేదికపై పూజచేసి మట్టి, కషాయజలమ, గోమయము, గోమూత్రము, - వీటితోను, మధ్య మధ్య జలముతోను భగవత్ప్రతిమకు స్నానము చేయించవలెను. పిదప భస్మముతోను. సుగంధిజలముతోను స్నానము చేయించవలెను. పిదప ఆచార్యుడు ''అస్త్రాయ ఫట్'' అను మంత్రముతో అభిమంత్రించిన జలముతో మూర్తిపాలులతో పాటు తన హస్తములు కూడ కడిగికొని, కవచ మంత్రాభిమంత్రిత మగు పీతాంబరముతో మూర్తిని ఆచ్ఛాదించి, శ్వేతపుష్పములతో పూజించవలెను. పిదప దానిని ఉత్తరవేదిమీదకు తీసికొని వెళ్ళవలెను. తత్ర దత్తాసనాయాం చ శయ్యాయాం సంనివేశ్య చ. 49 కుఙ్కుమాలిప్త సూత్రేణ విభజ్య గురురాలిఖేత్ | శలాకయా సువర్ణస్య అక్షిణీ శస్తరకర్మణా. 50 అఞ్జయేల్లక్ష్మకృత్పశ్చాచ్ఛాస్త్రదృష్టేణ కర్మణా | కృతకర్మా చ శ##స్త్రేణ లక్ష్మీ శిల్పీ సముతిపేత్. 51 త్య్రంశాదర్దో7థ పాదార్ధదర్దాయా అర్ధతో7థవా | సర్వకామ ప్రసిద్ద్యర్థం శుభం లక్ష్మావతారణమ్. 52 లిఙ్గదీర్ఘవికారాంశే త్రిభ##క్తే భాగవర్ణనాత్ | విస్తారో లక్ష్మదేహస్య భ##వేల్లిఙ్గస్య సర్వతః. 53 యవస్య నవభక్తస్య భాగైరష్టాభిరావృతా | హాస్తికే లక్ష్మరేఖా చ గామ్భీర్యద్విస్తరాదపి. 54 ఏవమష్టాంశవృధ్యా తు లిఙ్గుసార్దకరాదికే | భ##వేదష్టయవా పృథ్వీ గమ్భీరాత్ర చ హస్తికే. 55 శామ్భవేషు చ లిఙ్గేషు పాదవృద్దేషు%ి సర్వతః | లక్ష్మదేహస్య విష్కమ్భో భ##వేద్వైయావదర్ధనాత్. 56 గమ్భీరత్వపృథుత్వాభ్యాం రేఖాపి త్య్రంశవృద్ధితః | సర్వేషు చ భ##వేత్సూక్ష్మం లిఙ్గమస్తకమస్తకమ్. 57 లక్ష్మక్షేత్రే7ష్టధా భ##క్తే మూర్ద్ని పాదద్వయే శుభే | షడ్భాగ పరివర్తేన ముక్త్వా భాగద్వయం త్వధః. 58 రేఖాత్రయేణ సంబద్ధం కారయేత్పృష్ఠదేశగమ్ | రత్నజే లక్షణోద్ధారౌ యవౌ హేమసముద్భవే. 59 స్వరూపం లక్షణం తేషాం ప్రభారత్నేషు నిర్మలా | నయనోన్మీలనం వక్త్రే సాన్నిధ్యాయ చ లక్ష్మ తత్. అచట ఆసనయుక్త మగు శయ్యపై పరుడం బెట్టి కుంకుమరంగు పూసిన దారముతో అంగవిభాజనము చేసి, ఆచార్యుడు సువర్ణశలాకతో ప్రతిమయందు నేత్రములను గుర్తించవలెను. ఈ పని శస్త్రక్రియ ద్వారా జరుగవలెను. చిహ్నములు చేసిన గరువును ముందుగ నేత్ర చిహ్నమును అంజనాంకితము చేయగా, పిమ్మట, మూర్తి నిర్మాణము చేసిన శిల్పి శస్త్రముతో ఆ నేత్రచిహ్నస్థానమును చెక్కవలెను. ఆ మూర్తియందు మూడు అంశములకంటె తక్కువగా గాని, నాల్గవంతు గాని, అర్ధ భాగమునందు గాని సంపూర్ణ కామసిద్ధి కొరకై, శుభ చిహ్నములను ఉంచవలెను. శివలింగము పొడవును మూడుచే భాగించి, ఒక భాగము విడువగా ఎంత ప్రమాణము వచ్చునో అదే లింగముయొక్క లక్ష్మదేహమునకు అన్ని వైపుల నుండి విస్తారము కావలెను. హస్తమాణ మగు శిలయందు గీయు లక్ష్మరేఖల లోతు-వెడల్పులు యవయొక్క తొమ్మిది భాగములలో ఒక దానిని విడిచి ఎనిమిది గ్రహించి నంత ఉండవలెను. ఇదే విధముగ ఒకటిన్నర లేదా రెండు హస్తములు మొదట ప్రమాణము గల శివలింగము మొదలు, తొమ్మిది హస్తముల ప్రమాణము గల లింగము వరకును, క్రమముగ ఎనిమిదవ వంతు పెంచుచు చిహ్నరేఖలు గీయవలెను.ఈ విధముగ తొమ్మిది హస్తముల లింగమునందు ఎనిమిది యవల లోతు వెడల్పులు గల చిహ్నరేఖ లుండవలెను. పరస్పరాంతరముతో ఉత్తరోత్తరము పాదవృద్ధి గల శివలింగమున లక్ష్మదేహ విస్తారము ఒక్కొక్క యవ పెరుగుతూ పోవలెను. లోతు-వెడల్పుల పెరుగుట ననుసరించి, రేఖ మూడవ వంతు పెరుగుచుండును. అన్ని శివలింగములందును దాని పైభాగమే దాని సూక్ష్మశిరము చిహ్నక్షేత్రమును ఎనిమిది భాగములు చేసి, రెండు భాగములు%ు శిరస్సునందుండు నట్లు చేయవలెను. మిగిలిన ఆరు భాగములలో క్రింది రెండు భాగములను విడిచి మధ్యయందు మిగిలిన భాగములందు మూడ రేఖలు గీసి, వాటిని పృష్ఠదేశమునకు తీసికొని వెళ్ళి విడవలెను. రత్నమయలింగము లైనచో లక్షణోద్ధారము ఆవశ్యకము కాదు భూమినుండి స్వతః ఆవిర్భవించిన లింగములకు గాని, నర్మదాదినదులం దుధ్భవించిన లింగములకు గాని లక్ష్మోద్ధార మపేక్షితము కాదు. రత్నమయ లింగముల రత్నములం దున్న నిర్మలకాంతియే వాటి స్వరూపమునకు లక్షణము ముఖభాగమునందు నేత్రోన్మీలనము ఆవశ్యకము అందు నిమిత్తమే ఈ చిహ్నము నిర్మించబడుచున్నది. లక్షణోద్ధార రేఖాం చ ఘృతేన మధునా తథా | మృత్యుఞ్జయేన సంపూజ్య శిల్పిదోషనివృత్తయే. 61 అర్చయేచ్చ తతో లిఙ్గం స్నాపయిత్వా మృదాదిభిః | శిల్పినం తోషయిత్వా తు దద్యాద్గాం గురవే తతః. 62 లిఙ్గం ధూపాదిభిః ప్రార్చ్య గాయేయుర్భర్తృగాః స్త్రియః | సవ్యేన చాపసవ్యేన సూత్రేణాథ కుశేన వా. 63 స్మృత్వా చ రోచనం దత్త్వా కుర్యాన్నిర్మథనాదికమ్ | గుడలవణధాన్యాకదానేన విసృజేచ్చ తాః . 64 గురుర్మూర్తిధరైః సార్థం హృదా వా ప్రణవేన వా | మృత్స్నా గోమయగోమూత్రభస్మభిః సలిలాన్తరమ్. స్నాపయేత్పఞ్చగవ్యేన పఞ్చామృతపురస్సరమ్ | విరూక్షణం కషాయైశ్చ సర్వౌషధిజలేన వా. 66 శుభ్రపుష్పఫల స్వర్ణ రత్నశృఙ్గయవోదకైః | తథా ధారాసహస్రేణ దివ్యౌషధిజలేన చ . 67 తీర్థోదకేన గాఙ్గేన చన్దనేన చ వారిణా | క్షీరార్ణవోదభిః కుమ్భైః శివకుమ్భజలేన చ. 68 విరూక్షణం విలేపం చ సుగన్ధైశ్చన్దనాదిభిః | సంపూజ్య బ్రహ్మభిః పుషై#్పర్వర్మణా రక్తచీవరైః. 69 రక్తరూపేణ నీరాజ్య రక్షాతిలకపూర్వకమ్ | ఘృతౌ ఘైర్జలదుగ్ధైశ్చ కుశాద్యైరర్ఘ్యసూచితైః. 70 ద్రవ్యైః స్తుత్యాదిభిస్తుష్టమర్చయేత్పురుషాణునా | సమాచమ్య హృదా దేవం బ్రూయాదుత్థీయతాం ప్రభో. 71 దేవం బ్రహ్మరథేనైవ క్షిపన్ ద్రవ్యాణి తన్నయేత్ ః మణ్డపే పశ్చిమద్వారే శయ్యాయాం వినివేశ##యేత్. 72 శక్త్యాదిమూర్తిపర్యన్తే విన్యసేదాసనే శుభే | లక్షణోద్ధార రేఖను మృత్యుంజయమత్రముతో, ఘృతమధువులతో పూజించి, శిల్పిదోషపరిహారార్థమైన మృత్తికాది స్నానము చేయించి, లింగమును పూజించవలెను. పిదప దానమానాదులతో శిల్పిని సంతోషబెట్టి గురువునకు గోవు నీయవలెను. సౌభాగ్యవతు లగు స్త్రీలు ధూపదీపాదులతో లిగంమునకు విశేష పూజలు చేసి మంగళ గీతములను గానము చేయవలెను. సవ్యాపవ్య భావముతో కుశముతో గాని, సూత్రముతో గాని స్పర్శపూర్వకముగ గోరోచనము సమర్పించవలెను. పిదప యజమానుడు బెల్లము, ఉప్పు, ధాన్యాకము (కొత్తుమ్మరి) మొదలగునవి ఇచ్చి ఆ స్త్రీలను పంపివేయవలెను. పిమ్మట గురువు మూర్తిరక్షకు లగు బ్రాహ్మణులతో కలిసి, ''నమః'' లేదా ప్రణవమంత్రముతో మట్టి, గోమయము, గోమూత్రము, భస్మము-వీటితో వేరు వేరుగా స్నానము చేయించవలెను. ఒక్కొక్క దానితో స్నానము చేయించిన పిదప మధ్యయందు జలముతో స్నానము చేయించవలెను. పిదప పంచగవ్యములు, పంచామృతము, రూక్షత్వమును తొలగించు కషాయద్రవ్యములు, సర్వౌషధి మిశ్రజలము,శ్వేత పుష్పములు, ఫలములు, సువర్ణము, రత్నములు, శృంగము, యవలు కలిపిన జలము, సహస్రధార, దివ్యౌషధిముక్తజలము, తీర్థజలము, గంగాజలము, చందనమిశ్రజలము, క్షీర సాగరాదిజలము, కలశజలము, శివకలశజలము వీటిచే స్నానము చేయించవలెను. రూక్షత్వమును తొలగించు విలేపనము ఉత్తమగంధము చందనము మొదగువాటితో పూజ చేసిన పిమ్మట బ్రహ్మమంత్రముతో పుష్పములను, కవచమంత్రముతో రక్త వస్త్రములను సమర్పించవలెను. అనేకవిధములగు హారతి ఇచ్చి, రక్షా-తిలక పూర్వకముగ గీతవాద్యాదులతోను వివిధ ద్రవ్యములతోను, జయజయ ధ్వనులతోను, స్తుత్యాదులతోను, పరమేశ్వరుని సంతుష్టునిచేసి, పుష్పమంత్రములతో పూజచేయవలెను. హృదయమంత్రముతో ఆచమనము చేసి ''ఓ ప్రభూ! లెమ్ము'' అని ఇష్టదేవతతో చెప్పవలెను. పిదప ఇష్టదేవతను బ్రహ్మరథముపై కూర్చుండబెట్టి నాలుగు దిక్కులందును త్రిప్పి వివిధద్రవ్యములను వెదజల్లుచు, పశ్చిమద్వారమునకు తీసికొనిపోయి అచట దేవతను శయ్యపై కూర్చుండ బెట్టవలెను, ఆసనము ఆద్యంతముల యందు శక్తి భావన చేయుచు ఆశుభాసనముపై కూర్చుండబెట్టవలెను. పశ్చిమే పిణ్ఢికాం తస్య న్యసేద్బ్రహ్మశిలాం తథా . 73 శస్త్రమస్త్రశతాలభ్దినిద్రాకుమ్భం ధ్రువాసనమ్ | ప్రకల్ప్య శివకోణ చ దత్త్వార్ఘ్యం హృదయేన తు. 74 ఉత్థాప్యోక్తాసనే లిఙ్గం శిరసా పూర్వమస్తకమ్ | సమారోప్య న్యసేత్తస్మిన్సృష్ట్యాధర్మాదివన్దనమ్. 75 దద్యాద్రూపం చ సంపూజ్య తథా వాసాంసి వర్మణా | గృహోపకృతినైవేద్యం హృదా దద్యాత్స్వశక్తితః. ఘృతక్షౌద్రయుతం పాత్రమభ్యఙ్గాయ పదాన్తికే | దేశికశ్చ స్థితస్తత్ర షట్క్రింశ త్తత్త్వసంచయమ్. 77 శక్త్యాదిభూమిపర్యన్తం స్వతత్త్వాధిపసం కయుతమ్ | విన్యస్య పుష్పమాలాభిస్త్రిఖణ్డం పరికల్పయేత్. 78 మాయాపదేశశ క్త్యన్తంతుర్యాంశాష్టాంశవర్తులమ్ | తత్రాత్మతత్త్వవిద్యాఖ్యం శివంసృష్టిక్రమేణ తు. 79 ఏకశః ప్రతిభాగే తు బ్రహ్మవిష్ణుహరాధిపాన్ | విన్యస్య మూర్తిమూర్తీశాన్ పూర్వాదిక్రమతో యథా. 80 క్ష్మావహ్నియజమానార్కజలవాయునిశాకరాన్ | ఆకాశమూర్తిరూపాంస్తాన్న్యసేత్తదధినాయకాన్. 81 శర్వం పశుపతిం చోగ్రం రుద్రం భవముఖేశ్వరమ్ | మహాదేవశం చ భీమం చ మన్త్రస్తద్వాచకా ఇమే. 82 ల వ శ ష చ య సాశ్చ హకారశ్చ త్రిమాత్రికాః | ప్రణయో హృదయాణు వా మూలమన్త్రోథవా క్వచిత్. పఞ్చకుణ్డాత్మకే యాగే మూర్తీః పఞ్చాథవాన్యసేత్ | పృథివీజలతేజాంసి వాయుమాకాశ##మేవ చ. 84 క్రమాత్తదధిపాన్ పఞ్చ బ్రహ్మాణం ధరణీధరమ్ | రుద్రమీశం సదాఖ్యం చ సృష్టిన్యాయేన మన్త్రవిత్. 85 ముముక్షోర్వా నివృత్తాద్యా అజాతాద్యాస్తదీశ్వరాః | త్రితత్త్వం వాథ సర్వత్ర న్యసేద్వ్యాప్త్యాత్తకారకమ్. 86 పశ్చిమాభిముఖ మైన ప్రాసాదమునందు పశ్చిమము వైపున పిండిక స్థాపించి, దానిపై బ్రహ్మశిల ఉంచవలెను. శివకోణము నందు నూరు అస్త్రమంత్రములతో అభిమంత్రించిన నిద్రాకలశమును, శివాసనమును కల్పించి, హృదయమంత్రముతో అర్ఘ్యమిచ్చి, దేవతను లేవదీసి, శిరోమంత్రముతో, లింగమయా సనముపై, తూర్పువైపు శిరస్సు ఉండునట్లు ఉంచవలెను. పిదప చందనధూపాదులు సమర్పించి దేవుని పూజించి కవచమంత్రముతో వస్త్రము సమర్పించి, గృహోపకరణాదు లర్పించి, శక్త్యనుసారము నమస్కారపూర్వకముగ నైవేద్యము నివేదించవలెను. అభ్యంగము కొరకై, ఘృత-మధు యుక్తమగు పాత్రను దేవతాపాద సమీపమున ఉంచవలెను. ఆచార్యుడు, శక్తి మొదలు భూమి వరకునునున్న ముప్పదియారు తత్త్వములను, తదధిపతి సహితముగ స్థాపించి, వాటిని, పుష్పమాలలతో మూడు భాగములుగ విభజించవలెను. ఇది మాయమొదలు శక్తిపర్యంతమైన భాగములు; మొదటిది చతుష్కోణము; రెండవది అష్టకోణము; మూడవది వర్తులాకారము. సృష్టి క్రమానుసారము ఈ భాగములకు బ్రహ్మవిష్ణుశివులు అధిపతులు. పిదప పూర్వాది క్రషుమున మూర్తులను, మూర్తీశ్వరులను న్యాసము చేయవలెను. పృథివి, అగ్ని, యజమానుడు, సూర్యుడు, జలము వాయువు చంద్రుడు, ఆకాశము ఈ ఎనిమిది మూర్తిరూపములు. వీరి న్యాసము చేసిన పిమ్మట అధిపతుల న్యాసము చేయవలెను. శర్వ-ఉగ్ర-రుద్ర-భవ-ఈశ్వర-మహాదేవ-భీములు అధిపతులు. లం, రం, శం, ఖం, చం, పం, సం, హం, అనునవి వీరి మంత్రములు. త్రిమాత్రిక ప్రణవహాంలు గాని, హృదయమంత్రములుగాని, మూల మంత్రముగాని వీరి పూజకై వినియోగింపబడును. లేదా పంచకుండాత్మక యాగమునందు పృథ్వీ-జల తేజో- వాయు-ఆకాశములనేతు పంచమూర్తుల న్యాసము చేయవలెను. పిదప, మంత్రజ్ఞుడు, బ్రహ్మ - శేషుడు, రుద్రుడు ఈశుడు, సదాశివుడు అనువారిని స్పష్టిక్రమమున న్యాసము చేయవలెను. యజమానుడు ముముక్షువైనచో పంచమూర్తులకు బదులు నివృత్త్యాది పంచకళలను అజాతుడు మొదలగు తదధిపతులను న్యాసము చేయవలెను. లేదా సర్వత్ర వ్యాప్త రూపమగు కారణాత్మక త్రితత్త్వన్యాసము చేయవలెను. శుద్దే చాత్మని విద్యేశా అశుద్దే లోకనాయకాః | ద్రష్టవ్యా మూర్తిపాశ్చైవ భోగినో మన్త్రనాయకాః. 87 పంఞ్చవింశత్తథైవాష్ట పఞ్చ త్రీణి యథాక్రమమ్ | ఏషాం తత్త్వం తదీశానామిన్ద్రాదీనాం తతో యథా 88 ఓం హాం శక్తితత్త్వాయ నమ ఇత్యాది. ఓం హాం శక్తి తత్త్వా ధిపాయ నమ ఇత్యాది. ఓం హాం క్ష్మామూర్తయే నమః ఓం హాం క్ష్మామూర్త్యధీశాయ శివాయ నమః ఇత్యాది. ఓం హాం పృథివీ మూర్తయే నమః. ఓం హాం మూర్త్యాధిపాయ బ్రహ్మణ నమః ఇత్యాది. ఓం హాం శివతత్త్వాధిపాయ రుద్రాయ నమః ఇత్యాది. నాభికన్దాత్సముచ్చార్య ఘణ్టానాదవిసర్పణమ్ | బ్రహ్మాదికారణత్యాగాద్ద్వాదశాన్తసమాశ్రితమ్. 89 మన్త్రం చ మనసాభిన్నం ప్రాప్తానందరసోపమమ్ | ద్వాదశాన్తాత్సమానీయ నిష్కలం వ్యాపకం శివమ్. 90 అష్టత్రింశత్కలోపేతం సహస్రకిరణోజ్జ్వలమ్ | సర్వశక్తిమయం సాఙ్గం ధ్యాత్వా లిఙ్గే నివేశ##యేత్. 91 జీవన్యాసో భ##వేదేవం లిఙ్గే సర్వార్థసాధకః | పిణ్డికాదిషు తు న్యాసః ప్రోచ్యతే సామ్ప్రతం తథా. 92 పిణ్డికాం చ కృతస్నానాం విలిప్తాం చన్దనాదిభిః| సద్వస్త్రే చ సమాచ్ఛాద్య రన్త్రే చ భగలక్షణ. 93 పఞ్చరత్నాదిసంయుక్తాం లిఙ్గస్యోత్తరతః స్థితామ్ | లిఙ్గవత్కృతవిన్యాసాం విధివత్సంప్రపూజయేత్. 94 కృతస్నానాదికాం తత్ర లిఙ్గమూలే శిలాం న్యసేత్ | కృతస్నానాదిసంస్కారం శక్త్యన్తం వృషభం తథా. ప్రణవపూర్వం హూం పూం హ్రీం మధ్యాదన్యతమేన చ | క్రియాశక్తియుతాం పిణ్డీం శిలామాధారరూపిణీమ్. భస్మదర్భతిలైః కుర్యాత్ర్పాకారత్రితయం తతః | రక్షాయై లోకపాలాంశ్చ సాయుధాన్పూజయేద్బహిః. 97 శుద్ధాధ్వయంరు విద్యేశ్వరులను అశుద్ధాధ్వయందు లోకనాయకులను మూర్తిపతులనుగా చూడవలెను. భోగి (సర్పము) కూడ మంత్రేశ్వరుడు. క్రమముగ ముప్పదేయైదు, ఎనిమిది, ఐదు, త్రిమూర్తిరూపములును చెప్పబడినవి. ఇవే వీటి తత్త్వములు, ఏతత్తత్త్వాధిపతుల మంత్రములు దిగ్దర్శనము మాత్రము చేయబడుచున్నది. ''ఓం హాం శక్తి తత్త్వాయ నమః'' ఇత్యాదికము ''ఓం హాం శక్తి తత్త్వాధిపాయ నమః'' ఇత్యాదికము ''ఓం హాం క్ష్మామూర్తయే నమః'' ''ఓం హాం క్ష్మామూర్త్యధిపతయే బ్రహ్మణ నమః ఇత్యాదికము ''ఓం హాం శివతత్త్వాయ నమః'' ''ఓం హాం శివతత్త్వాధిపతయే రుద్రాయనమః'' ఇత్యాదికము నాభిమూలము నుండి ఉచ్చిరింపబడును ఘంటానాదము వలె నలువైపుల వ్యాపించు చున్నదియు, బ్రహ్మాది కారణత్యాగ పూర్వకముగ ద్వాదశాన్తస్థానమును పొందిన మనస్సు కంటె అభిన్నమును అగు మంత్రమును, నిష్కళుడును, ముప్పదియారు కళలతో కూడివాడును, సహస్రకిరణములతో ఫ్రకాశించుచున్నవాడును సర్వశక్తిమయుడును, సాంగుడును అగు వ్యాపకశివుని ధ్యానించుచు, ఆ దేవుని ద్వాదశాంతమునుండి తీసికొని వచ్చి శివ లింగముపై స్థాపింపవలెను. శివలింగముపై చేయు జీవన్యాసము సకలపురుషార్థ సాధనముగ నుండవలెను. పిండికాది న్యాసవిధానము చెప్పబడుచున్నది. పిండికకు స్నానము చేయించి, చందనాదులు పూసి, సుందరవస్త్రములు కప్పి, దాని భగస్వరూపమగు ఛిద్రమునందు పంచరత్నాదులు వేసి, లింగమునకు ఉత్తరమున ఉంచవలెను. లింగమునందు వలె దాని యందు కూడ న్యాసము చేసి యథావిధిగ పూజించవలెను. స్నానాది పూజాకార్యములు పూర్తిచేసి లింగ మూలభాగమున శివుని న్యాసము చేయవలెను. పిదప శక్త్యంత వృషభమునకు కూడ స్నానాది సంస్కారములు చేసి స్థాపన చేయవలెను. పిదప మొదట ప్రణవమును, తరువాత హ్రాం హ్రూం హ్రీం లలో ఒక బీజాక్షరమును ఉచ్చరించుచు క్రియాశక్తి సహితమగు, ఆధారరూపిశిల (పిండిక) ను పూజించవలెను. భస్మ - కుశ-తిలలతో మూడు ప్రాకారములు నిర్మించి రక్షణార్థమై బైట ఆయుధములతో కూడిన లోకపాలులను నిలిపి, పూజించవలెను. ఓం హ్రూం హ్రాం క్రియాశక్తయే నమః. ఓం హ్రూ హ్రాం హః మహాగౌరి రుద్రదయితే స్వాహేతి చ పిణ్డికా యామ్. ఓం హాం ఆధారశక్తయే నమః ఓం హాం వృషభాయ నమః. ధారికా దీప్తిమత్యుగ్రా జ్యోత్స్నా చైతాబలోత్కటాః | తథా ధాత్రీ విధాత్రీ చ న్యసేద్వా పఞ్చ నాయికాః. వామా జ్యేష్ఠా క్రియా జ్ఞానా వేధా తిస్రో7థవా న్యసేత్ | క్రియా జ్ఞానా తథేచ్ఛా చ పూర్వవచ్ఛాన్తిమూర్తిషు. 99 తమీ మోహా క్షమీ నిష్ఠా మృత్యుర్మాయా భవజ్వరాః | పఞ్చచాథ మహామోహా ఘోరా చ త్రితయజ్వరా. తిస్రో7థవా క్రియా జ్ఞానా తథా బాధాధినాయికా | ఆత్మాదిత్రిషు తత్త్వేషు తీవ్రమూర్తిషు విన్యసేత్. 101 అత్రాపి పిణ్డికా బ్రహ్మశిలాదిషు యథావిధి | గౌర్యాదిసఞ్చరైరేవ పూర్వవత్సర్వమాచరేత్. 102 ఏవం విధాయ విన్యాసం గత్వా కుణ్డాన్తికం తతః | కుణ్ణమధ్యే మహేశానం మే ఖలాసు మహేశ్వరమ్. క్రియాశక్తిం తథాన్యాసు నాదమోష్ఠే చ విన్యసేత్ | ఘటం స్థణ్డిలవహ్నీశైర్నాడీసన్దానకం తతః. 104 పద్మతన్తుసమాం శక్తిముద్వాతేన సముద్యాతామ్ | విశన్తీం సూర్యమార్గేణ నిఃసరన్తం సముద్గతామ్. 105 పునశ్చ శూన్యమార్గేన విశన్తీం స్వస్యచిన్తయేత్ | ఏవం సర్వత్ర సన్దేయం మూర్తిపైశ్చ పరస్పరమ్. 106 ''ఓం హ్రీం క్రియాశక్తయే నమః ఓం హ్రీం మహాగౌరి రుద్రదయితే స్వాహా అనునవి పూజా మంత్రములు; ''ఓం హ్రీం ఆధార శక్తయే నమః ఓం హ్రాం వృషభాయ నమః అను మంత్రములతో పిండికను పూజించవలెను. ధారికా దీప్తా-అత్యుగ్రా-జ్యోత్స్నా-బలోత్కటా-ధాత్రీ-విధాత్రీలను పిండిపై న్యాసము చేయవలెను. లేదా వామా-జ్యేష్ఠా-క్రియా-జ్ఞానా-వేధా అను ఐదుగురు నాయికలను న్యాసము చేయవలెను. లేదా క్రియా-జ్ఞానా-ఇచ్ఛా అను ముగ్గురినే న్యాసము చేయవలెను. వెనుకటి వలెనే-శాంతి మూర్తులలో తమీ-మోహా-క్షుధా-నిద్రా-మృత్యుమాయా-జరా-భయలను న్యాసము చేయవలెను. లేదా తమా-మోహా-ఘోరా-రతి-అపజ్వరా అను ఐదు గుర న్యాసము చేయవలెను. లేదా క్రియా-జ్ఞానా-ఇచ్ఛా అను ముగ్గురు అధినాయికలను తీవ్రమూర్తి గల ఆత్మాది తత్త్వము త్రయుముపై న్యాసము చేయవలెను. ఈ విధముగ న్యాసకర్మ చేసి కుండము దగ్గరకు వెళ్ళి దాని లోపల మహేశ్వరుని మేఖలయందు చతుర్భుజుని, నాభియందు క్రియా శక్తిని న్యాసము చేయవలెను. కలశ-వేది-అగ్ని-శివులతో నాడీసంధాన కర్మ చేయవలెను. తామరతూదులోని దారము వలె అతిసూక్ష్మమైన శక్తి ఊర్ధ్వగతమగు వాయువుసహాయముతో పైకి ఎగిరి, శూన్యమార్గమునుండి శివునిలో ప్రవేశించును ఆ ఊర్ధ్వగతశక్తి అచటి నుండి బయలుదేరి వచ్చి శూన్యమార్గమునుండి తనలో ప్రవేశించుచున్నదని భావన చేయవలెను. ఈ విధముగనే మూర్తిపాలుల సంధానము కూడ చేయవలెను. సంపూజ్యధారికాంశక్తిం కుణ్ద సన్తర్ప్యచక్రమాత్ | తత్త్వత త్త్వేశ్వరాన్మూర్తీర్మూర్తీశాంశ్చ ఘృతాదిభిః. 107 సంపూజ్య తర్పయిత్వా తు సన్నిధౌ సహితాణుభిః | శతః సహస్రమర్దం వా పూర్ణయా సహా హోమయేత్. తత్త్వత త్త్వేశ్వరాన్మూర్తీర్మూర్తీశాంశ్చ కరేణుకాన్ | తథా సన్తర్ప్య సాన్నిధ్యే జుహుయుర్మూర్తిపా అపి. తతో బ్రహ్మభిరంగైశ్చ ద్రవ్యకాలానురోధతః | సన్తర్ప్య శక్తిం కుమ్భామ్భఃప్రోక్షితే కుశమూలతః. 110 లిఙ్గమూలం చ సంస్పృశ్వ జపేయుర్హోమసంఖ్యయా | సన్నిధానం హృదా కుర్యుర్వర్మణాచావకుణ్ఠనమ్. ఏవం సంశోధ్య బ్రహ్మాది విష్ణ్వన్తాదివిశుద్ధయే | విధాయ పూర్వవత్సర్వం హోమసంఖ్యాజపాదికమ్. 112 కుశమధ్యాగ్రయోగేన లిఙ్గమధ్యాగ్రకం స్పృశేత్ | యథా యథా చ సన్ధానం తదిదానీమిహోచ్యతే. 113 ఓం హాం హం ఓం ఓం ఓం ఐం ఓం భూం భూం బాహ్యమూర్తయే నమః ఓం హాం వాం ఓం ఓం ఓం షాం ఓం భూం భూం వాం వహ్నిమూర్తయే నమః. ఏవం చ యజమానాది మూర్తిభిరభిసన్దేయమ్ | పఞ్చమూర్త్యాత్మకే7ప్యేనం సన్దానం హృదయాదిభిః. 114 మూలేన స్వీయబీజైర్వా జ్ఞేయం తత్త్వత్రయాత్మకే | శిలాపిణ్డీవృ షేష్వవం పూర్ణాచ్ఛిన్నం సుసంవరైః. 115 భాగాభాగవిశుద్ధ్యర్థం హోమం కుర్యాచ్ఛతాదికమ్ | న్యూనాదిదోషమోషాయ శివేనాష్దాధికం శతమ్. 116 హుత్వాథ యత్కృతం కర్మ శివశ్రోత్రే నివేదయేత్ | కుండమునందు ఆధారశక్తిని పూజించి, తర్పణము చేసిన పిదప క్రమముగా, తత్త్వ-తత్త్వేశ్వర-మూర్తి మూర్తీశ్వరులను ఘృతాదులతో పూజించి, తర్పణము చేయవలెను. పిదప వారిపై సంహితామంత్రములతో నూరు గాని వెయ్యిగాని, ఐదు వందలుగాని హోమములు చేసి, పూర్ణాహూతి ఇవ్వవలెను. ఈ విధముగ తత్త్వతత్త్వేశ్వరులకును, మూర్తి మూర్తీశ్వరులకును, ఒండొరుల సాంనిధ్యమున తర్పణములు చేసిన పిమ్మట మూర్తిపాలకులు గూడ వారికై హోమములు చేయవలెను. పిదప ద్రవ్యకాలానుసారము వేదములనుతోను, అంగములతోను తర్పణము చేసి, శాంతికలశ జలముతో ప్రోక్షించిన కుశమూలముతో లింగమూలభాగమును స్పృశించి, ఎన్ని హోమములో అంత జపము చేసి, హృదయ మంత్రముచే సంనిధాపనమును కవచమంత్రముచే ఆచ్ఛాదనమును చేయవలెను. ఈ విధముగ సంశోధనము చేసి లింగోర్థ్వభాగమున బ్రహ్మను మూలభాగమున విష్ణువును పూజించి, శుద్ధి నిమిత్తమై వెనుకటి అన్నికార్యములు పూర్తి చేసి, హోమ సంఖ్యానుసారము జపాదులు చేయవలెను. కుశమధ్యభాగముచే లింగమధ్యభాగమును, కుశాగ్రభాగముచేలింగాగ్రభాగమును స్పృశించవలెను. ఏ మంత్రముచే ఏ విధముగ సంధానము చేయవలెనో. చెప్పబడుచున్నది. ''ఓం హాం హం ఓం ఓం ఏం ఓం భూం భూం బాహ్యమూర్తయే నమః, ఓం హాం వాం ఆం షాం ఓం భూం భూం వాం వహ్ని మూర్తయే నమః యజమానాది మూర్త్యభి సంధానము కూడ ఇట్లే చేయవలెను. పంచమూర్త్మాత్మక శివునిసంధానకర్మ కూడ హృదయాదిమంత్రములతో ఈ విధముగనే చేయవలెను. త్రితత్త్వాత్మక స్వరూపమునందు సంధానకర్మమూల మంత్రముతో గాని, స్వస్వబీజమంత్రములతో గాని చేయవలెనని గ్రహించవలెను. శిలా-పిండికా-వృషభములకు కూడ సంధానము ఈ విధముగనే చేయవలెను. ఒక్కక్క భాగము శుద్ధి కొరకై, దాని మంత్రములతో శతాది హోమము చేయవలెను. న్యూనతాదిదోష పరిహారార్థమై శివమంత్రముతో నూట ఎనిమిది హోషుములు చేసి, చేసిన కర్మను గూర్చి శివునకు చెవిలో చెప్పవలెను. ఏతత్సమన్వితం కర్మ త్వచ్ఛక్తౌ చ మయా ప్రభో. 117 ఓం నమో భగవతే రుద్రాయరుద్రదేవ నమోస్తు తే | విధిపూర్ణమపూర్ణం వాస్వశక్త్యాపూర్య గృహ్యతామ్. ఓం హ్రీం శాంకరి పూరయ స్వాహా ఇతి పిణ్డికాయామ్ | అథ లిఙ్గే న్యసేద్జానీ క్రియాఖ్యం పీఠవిగ్రహే. ఆధారరూపిణీం శక్తిం న్యసేద్బ్రహ్మ శిలోపరి | నిబధ్య సప్తరాత్రం వా పఞ్చరాత్రం త్రిరాత్రకమ్. 120 ఏకరాత్రమథో వాపి యద్వా సద్యో7ధివాసనమ్ | వినాధివాసనం యాగః కృతో7పి న ఫలప్రదః. 121 స్వమన్త్రెః ప్రత్యహం దేయమాహుతీనాం శతం శతమ్ | శివకుమ్భాది పూజాం చ దిగ్బలిం చ నివేదయేత్. గుర్వాది సహితో వాసో రాత్రౌ నియమ పూర్వకమ్ | అధివాసః స వసతేరధేర్భావే ఘఞీరితః. 123 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ప్రతిష్ఠాయామధివాస విధిర్నామషణ్ణవతి తమో7ధ్యాయః. ''ప్రభూ! నేనీ కార్యమును నీ శక్తిచేతనే చేయగలిగితిని, భగవంతుడగు రుద్రునకు నమస్కారము. రుద్రదేవా! నీకు నమస్కారము, కర్మ విధి పూర్ణమైనను కాకపోయినను, నీవు నీ శక్తి చేతనే దీనిని పూర్ణము చేసి గ్రహించుము.'' ''ఓం శాంకరి పూరయ స్వాహా'' అని చెప్పి పిండికపై న్యాసము చేయవలెను. పిదప జ్ఞాని యగు పురుషుడు లింగమున క్రియాశక్తిని, పీఠ విగ్రహమునందు, బ్రహ్మశిలపైన ఆధారరూపిణి యగు శక్తిని న్యాసము చేయవలెను. ఏడురాత్రులు ఐదు, రాత్రులు లేదా ఒక రాత్రి దానిని నిరోధించి వెంటనే అధివాసనము చేయవలెను. అధివాసనము లేకుండగ చేసిన యాగము ఫలదాయకము కాదు గాన అధివాసనము తప్పక చేయవలెను. అధివాసనకాలమున ప్రతిదినమునను, దేవతలకు వారి వారి మంత్రములతో వందేసి హోమములు చేసి శివకలశాది పూజ చేసి, దిక్కులందు బలి సమర్పించవలెను. గుర్వాదులతో రాత్రి నియమపూర్వకముగ నివసించుట ఆధివాసము; అధి పూర్వక వన్ ధాతువునకు భావార్థమున ఘఞ్ ప్రత్యయము చేర్చుటచే అధివాసన శబ్దము నిష్పన్నమైనది. అగ్నిమహాపురాణమునందు ప్రతిష్ఠాంతర్గతాధివాసవిధి యను తొంబది యారవసర్గ? సమాప్తము.