Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ అష్టనవతితమో7ధ్యాయః

అథ గౌరీప్రతిష్టావిధానమ్‌

ఈశ్వర ఉవాచ :

వక్ష్యె గౌఠీప్రతిష్ఠాం చ పూజయా సహితాం శృణు | మణ్డపాద్యం పురో యచ్చ సంస్థాప్యం చాధిరోపయేత్‌ || 1

శయ్యాయాం తాంశ్చ విన్యస్య మన్త్రాన్మూర్త్యాదికాన్గుహ | ఆత్మవిద్యా శివాన్తం కుర్యాదీశనివేశనమ్‌. 2

శక్తిం పరాం తతో న్యస్య హుత్వా జప్త్వా చ పూర్వవత్‌ |

సన్దాయ చ తథా పిణ్డీం క్రియాశక్తి స్వరూపిణీమ్‌. 3

సదేశవ్యాపికాం ధ్యాత్వానస్తేరత్నాదికాంస్తధా | ఏవం సంస్థాప్య తాం పశ్చాద్ధేవీం తస్యాం నియోజయేత్‌. 4

పరాశక్తి స్వరూపాం తాం స్వాణునా శక్తియోగతః తతోన్యసేత్ర్కియాశక్తిం పీఠే జ్ఞానం చ విగ్రహే 5

తతో7పి వ్యాపినీం శక్తిం సమావాహ్య నియోజయేత్‌|

అమ్భికాం శివనామ్నీం చ సమాలభ్య ప్రపూజయేత్‌ || 6

ఓం ఆధారశక్తయేనమః ఓం కూర్మాయ నమః ఒం స్కన్దాయ |

చ తథా నమః ఓం హ్రీం నారాయణాయ నమః ఓం ఐశ్వర్యాయ నమః ఓం అం అధశ్చరనాయ నమః

ఓం పద్మాసనాయ సమః అథ సంపూజ్యాః కేశవాస్తధా | ఓం హ్రీం కర్ణికాయై నమః ఓం క్షం పుష్కరాకేభ

ఇహార్చయేత్‌ ''ఓం హాం ప్రష్ట్యె హ్రీం చ

జ్ఞానయై హ్రూం క్రియాయై తతో నమః ఓం నాలాయ నమః రుం ధర్మాయ నమః రుం జ్ఞానాయ వైనమః

ఓం వైరాగ్యాయ నమః ఓం వై అధర్మాయ నమః ఓం రుం అజ్ఞానాయ నమః

ఓం అవైరాగ్యాయ నమః

ఓం అనైశ్వర్యాయ నమః హ్రూం వాచే హ్రూం చ రాగిణ్యౖ జ్వాలినై తతో నమః ఓం హ్రౌంశమాయై చ

నమః హ్రుం జ్యేష్ఠాయై తతో నమః ఓం హ్రౌం రౌం నవశ##క్త్యేగౌం చగౌర్యాసనాయ చ గౌం గౌరీమూర్తయే

నమః గౌర్యా మూలమధోచ్యతే ఓం హ్రీం సౌః మహాగౌరి రుద్రదయితే స్వాహా గౌర్త్యె నమః

గాం హ్రూం హ్రీం శివో గూం స్యాచ్ఛిఖాయై కవచాయచ| 7

గోం నేత్రాయ చ గోం అస్త్రాయ ఓం గౌం విజ్ఞానశక్తయే

ఓం గూం క్రియాశక్తయే నమః పూర్వదౌ శక్రాదికాన్‌| 8

ఓం సుం సుభగాయై నమః హ్రీం బీజలలితా తతః

ఓం హ్రీం కామిన్యై చ నమః ఓం హ్రూం స్యాత్‌ కామాశాలినీ |

మన్త్రైర్గౌరీం ప్రతిష్ఠాప్య ప్రాప్య జప్త్వాద సర్వభాక్‌ 9

ఇత్యాది మహాపురాణ అగ్నేయే గౌరీప్రతిష్ఠావిధానం నామఅష్టనవతితమో7ధ్యాయః

పరమేశ్వరుడు చెప్పెను: స్కందా! ఇపుడు పూజాసహితముగ గౌరీప్రతిష్టావిధి చెప్పదను వినుము. వెనుక చెప్పిన విధముననే మండపాది రచనచేసి, దేవీస్థాపన, శయ్యాధివాసము చేయవలెను. పూర్వము చెప్పిన మంత్ర - మూర్త్యాదుల న్యాసము చేసి ఆత్మతత్త్వ- విద్యాతత్త్వ-శివతత్త్వములను పరమేశ్వరుని యందు స్థాపించవలెను. పిదప పరాశ క్తిన్యానము, హోమజపాదులను వెనుకటి వలె చేసి క్రియాశక్తి రూపిణి యగు పిండిని సంధానము చేయవలెను. సర్వవ్యాపిని యగు పిండిని ధ్యానించి, అచట రత్నాది న్యాసము చేయవలెను. ఈ విధముగ పిండి స్థాపన చేసి దానిపై దేవీస్థాపన చేయవలెను. ఈ దేవి పరాశక్తిస్వరూపిణి. ఆ దేవీమంత్రముతోడనే, సృష్టిన్యాసపూర్వకముగ దేవీస్థాపన చేయవలెను. పిదప పీఠముపై క్రియా శక్తిని, దేవీ విగ్రహముందు జ్ఞానశక్తిని స్థాపించవలెను. పిదప సర్వావ్యాపిని యగు శక్తిని ఆవాహనమును చేసి దేవీప్రతిమపై ఆ శక్తిని చేర్చవలెను, 'శివా' యను పేరు గల అంబికా దేవిని స్పృశించి పూజించవలెను. పూజా మంత్రములు ఈ విధముగ నుండును. ''ఓం ఆం ఆధారశక్తయే నమః ఓం కూర్మాయ నమః ఓం కన్దాయ నమః ఓం హ్రీం నారాయణాయ నమః ఓం ఐశ్వర్యాయ నమః ఓం అధశ్ఛదనాయ నమఃఓం పద్మాసనాయ నమః'' పిదప కేసరములను పూజించవలెను. పిదప "ఓం హ్రీం కర్ణికామై నమః ఓం క్షం పుష్కరాక్షేభ్యో నమః'' అను మంత్రములతో కర్ణికా-కమలాక్షములను పూజించవలెను. పిదప ''ఓం హాం పుష్ట్యె నమః ఓం హ్రీం జ్ఞానాయై నమః ఓం హ్రూం క్రియాయై నమః'' అను మంత్రములతో పుష్టి-జ్ఞానా క్రియా శక్తులను పూజించవలెను. ''ఓం నాలాయ నమః ఓం రుం ధర్మాయ నమః ఓం రుం జ్ఞానాయ నమః ఓం వైరా గ్యాయ నమః ఓం అధర్మాయ నమః ఓం రుం అజ్ఞానాయ నమః ఓం వైరాగ్యాయ నమః ఓం అనైశ్వర్యాయ నమః'' అను మంత్రములతో నాలాదులను పూజించవలెను. ''ఓం హుం వాచే నమః ఓం హుం రాగిణ్యౖనమః ఓం హుం జ్వలిన్యై నమః ఓం హ్రౌం శమాయై నమః ఓంహ్రూం జ్యేష్ఠాయై నమః ఓం హ్రౌం రౌం క్రౌం నవశ##క్త్యై నమః అను మంత్రములతో వాగాది శక్తులను పూజించవలెను. ''ఓం గౌం గౌర్యాసనాయ నమఃఓం గౌం గౌరీమూర్తయే నమః'' ఇపుడు గౌరీమూలమంత్రము చెప్పడుచున్నది ''ఓం హ్రీం సః మహాగౌరి రుద్రదయితే స్వాహా గౌర్త్యె నమః ఓం గాం హృదయామ నమః ఓం గీం శిరసేస్వాహా ఓం గూం శిఖాయై వషట్‌ ఓం గైం కవచాయ హుం ఓం గౌం నేత్రత్రయాయ వౌషట్‌ ఓం గః అస్త్రాయ ఫట్‌ ఓం గౌం విజ్ఞానశక్తయే నమః'' ఈ మంత్రములతో శిఖాదులను పూజించవలెను. ''ఓం గూం క్రియాశక్తయే నమః'' అను మంత్రముతో క్రియాశక్తిని పూజించవలెను. పూర్వది దిక్కులందు ఇంద్రాదులను పూజించవలెను. ఈ మంత్రములు వెనుక చెప్పబడినవి . ''ఓంసుం సుభగాయై నమః'' అను మంత్రముతో సుభగను ''ఓం హ్రీం లలితాయై నమః'' అను మంత్రముచే లలితను పూజించవలెను. ''ఓం హ్రీం కామిన్యై నమః, ఓం హ్రుం కామ మాలిన్యై నమ'' అను మంత్రములతో గౌరీప్రతిష్ఠా-పూజా-జపములు చేయుటచే ఉపాసకుడు అన్నియు పొందగల్గును.

అగ్నిమహాపురాణమునందు గౌరీ ప్రతిష్ఠావిధాన మను తొంబదిఎనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters