Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ఏకోనశతతమో7ధ్యాయః అథ సూర్య ప్రతిష్ఠా విధానమ్. ఈశ్వర ఉవాచ : వక్ష్యే సూర్యప్రతిష్ఠాం చ పూర్వవన్మణ్డపాదికమ్ | స్నానాదికం చ సంపాద్య పూర్వోక్తవిధినాతతః . 1 విద్యామాసనశయ్యాయాం సాఙ్గం విన్యస్య భాస్కరమ్ | త్రితత్త్వం విన్యసేత్తత్రసస్వరం ఖాదిపఞ్చకమ్. 2 శుద్ధ్యాది పూర్వవత్కృత్వా పిణ్డీం సంశోధ్య పూర్వవత్ | సదేశపదపర్యన్తం విన్యస్య తత్తు పఞ్చకమ్ . 3 శక్త్యా చ సర్వోతో ముఖ్యా సంస్థాప్య విధివత్తతః | స్వాణునా విధివత్సూర్యం శక్త్యన్తం స్థాపయేద్గురుః. 4 స్వామ్యన్తమథవాదిత్యం పాదాన్తం నామ ధారయేత్ | సూర్యమన్త్రాస్తు పూర్వోక్తా ద్రష్టవ్యాః స్థాపనే7పి చ. ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే సూర్యప్రతిష్ఠా విధానం నామ నవనవతితమో7ధ్యాయః. అ (38) పరమేశ్వరుడు పలికెను:- ఇపుడు సూర్యప్రతిష్ఠావిధానము చెప్పెదను. వెనుకటి వలె మండపాది నిర్మాణము, స్నానాదికముచేసి, పూర్వము చెప్పిన విధి ననుసరించి విద్యను, సాంగసూర్యదేవతను ఆసనశయ్యపై న్యాసము చేసి, తత్త్వములను, ఈశ్వరుని, ఆకాశాది పంచభూతములను న్యాసము చేయవలెను. పూర్వము వలె శుద్ధ్యాదికము చేసి, పిండిశోధనము చేయవలెను. సదేశపదమువరకును తత్త్వ పంచకన్యాసము చేయవలెను. సర్వతోముఖీశక్తితోకూడ యథావిధిగ స్థాపనము చేసి, గురువు, సూర్యమంత్రము జపించుచు శక్త్యన్తసూర్యుని స్థాపించవలెను. సూర్యదేవతకు పేరుచివర 'స్వామి' అని కాని 'పాద' అని కాని ఉంచవలెను. స్థాపనకు పూర్వోక్తసూర్యమంత్రములచే ఉపయోగించవలెను. అగ్ని మహాపురాణమునందు సూర్యప్రతిష్ఠావిధాన మను తొంబదితొమ్మిదివ అధ్యాయము సమాప్తము.