Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

ఎనిమిదవయధ్యాయము - సంసారాఖ్యాయికా

వివరణము

1 హేమచూడుఁడు ప్రియురాలి మాటలవలన పరమేశ్వరుని స్వరూపము చిన్మయ మని తెలిసకొని, గురువులవన గుణరూపిణియైన త్రిపురాదేవియొక్క ఉపాసనమునకొఱకు మంత్రతంత్రాదికమైన విధానము నెఱింగి ఏకాగ్రచిత్తముతో ఆమెను ఆరాదింపఁజొచ్చెను. అట్లు కొన్ని మాసములు గడచెను. ఆదేవి ఆతనిహృదయమునందు ప్రసన్నురాలయ్యెను. అప్పుడు ఆమెయనుగ్రమువలన ఆతనిచ్చతము భోగవిషయములనుండి విముఖమై ఆత్మవిచారమునందు ఆసక్తమయ్యెను. ఆపరాదేవియొక్క అనుగ్రమహములేక మోక్షమునకు ముఖ్యకారణమైన ఆత్మవిచారము ఎవ్వనికిని కలుగదు. అది లేకుండ ఇత రోపాయములు ఎన్ని యున్నను శ్రేయస్సు కలుగదు.

పిమ్మట హేమచూడుఁడు ఒకదినమున హేమలేఖ యొద్దకు పోయెను. ఆమె వానికి ఎదురేగి స్వాగతమును చెప్పి అర్ఘ్యపాద్యములతో పూజించి మిక్కిలి అనురాగముతో ఇట్లనెను. ''నాథా! చాలకాలమునకు కన్పించితిని. ఆరోగ్యముతో నున్నావుకదా! నన్ను చూడకుండ నాతో మాటాడకుండ నీవు ఒక్కపూట కూడ గడువువాఁడవుకావు. మఱి ఇంతకాలమైనను నీవు నన్ను ఏల స్మరింపవైతివి? నీకు ఇష్టముకాని పద్ధతియందు నేను కలలో కూడ వర్తింపను. ఏల ఇట్లు దూరమైతివి? నేను లేకున్నచో ఒక్కక్షణము కూడ నీకు ఒక కల్పముగా నుండెడిది. మఱి ఇన్నిరాత్రులు ఎట్లు గడిపితివి?'' ఇట్లు పలుకుచు ఆమె అతనిన కౌఁగిలించుకొని భిన్నురాలివలె నుండను.

అతఁడు ఆమెయొక్క కౌఁగిటియందు ఉండియు ఎట్టివికారమును పొందక ఇట్లనెను. ''ప్రియా! నాకేల మోహమును కలిగింతువు? నీవు ఈలోకమును పరతత్త్వమును తెలిసికొన్న ధీరురాలవు. నిన్ను మోహము ఎట్లు స్పృశించును? నీకు దుఃఖమునకు కారణమే లేదని నాకు దృఢముగా తెలియను. నీవు ఇంతకు పూర్వము నీవృత్తాంతమును చెప్పియుంటివి. దానినిగూర్చి ప్రశ్నించుటకు వచ్చితిని. నీవు చెప్పిన మీతల్లి ఎవరు? ఆమె యొసంగిన సఖి ఎవరు? ఆమెయొక్క భర్త పుత్రులు మొదలగువారు ఎవరు? ఎక్కడ నున్నారు? వారు నాకు ఎట్లు సంబంధింతురు? ఇది యంతయు నాకు స్పష్టముగా చెప్పుము. నీవు చెప్పినది అసత్యము కాదని ఏదో ఒకసంకేతముతో అట్లు చెప్పితివని తలంచుచున్నాను. కాఁభట్టి దానిని నాకు తెలియునట్లు స్పష్టముగా వివరించి చెప్పుము. నేను నిన్ను శరణము పొందుచున్నారు. నాహృదయములోని సంశయము ఛేదింపుము.''

మాటలను విని హేమలేఖ ఇట్లనుకొనెను. ''ఈయనకు దేవి యనుగ్రహములవల బుద్ధి నిర్మల మయ్యెను. పూర్వపుణ్యములు ఫలించి ఈయన విషయ సుఖములందు విముఖుఁéడై ధీరుఁడైనాఁడు. ప్రబోధించుటకు ఇది తగినసమయము. కావున ప్రబోధింతును.'' పిమ్మట ఆమె ప్రసన్నమైన ముఖముతో ఆతనిని అనురాగముతో చూచుచు ఇచ్లు పలికెను. ''నాథా! ఈశ్వరానుగ్రహమును నీకు మహా భాగ్యము కలిగినది. భోగములయందు విముఖత్వము విచారము నందు ఆసక్తి అనునవి ఈశ్వరానుగ్రహమునకు సూచకములు. ఇంక నాస్థితిని చెప్పెదను వినుము. కేవలమైన చైతన్యమే నాజనని, ఆమె యొసంగిన చెలికత్తె బుద్ధి, బుద్ధితో కుడియుండిన దుష్టురాలు అవిద్య. అవిద్యకు ఎంత విచిత్రమైన సామర్థ్యమున్నదో లోకమున ప్రసిద్ధమే. అది త్రాడునందు సర్పము తోఁచునట్లుగా చేసి గొప్పభయమును కలిగించుచున్నది. మహామోహుఁడు ఆమెకు పుత్రుఁదు. వాని కుమారుఁడైన అస్థిరుఁడే మనస్సు. మనస్సుయొక్క భార్య కల్పన, జ్ఞానేంద్రియములు అయిదు కల్పనయొక్క పుత్రులు. వారి స్థానముల నుండి విషయములను దొంగిలించుట యనఁగా సుఖదుఃఖనుభవములకు పిమ్మట మనస్సునందు వానిసంస్కారము ఏర్పడుట. ఆసంస్కారములవలన కలుగుననుభవమే స్వప్నము. కల్పనయొక్క చెల్లెలు మహాశన. మహాశనపుత్రులు క్రోధము లోభము. నాపురమనఁగా ఈశరీరమే. స్వరూపస్ఫురణము నాకున్న మహాతంత్రము. మనస్సనకు ప్రియమిత్రుఁడైన ప్రచారుఁడు ప్రాణము. అడవులు మొద లైనవి నరకములు. నేను బుద్ధితో కూడియుండుట సమాధి. నేను నాతల్లియొక్క లోకమునకు చేరుట మోక్షము. ఇది నావృత్తాంతము నీవృత్తాన్తము కూడ ఇట్టిదే. నేను మోక్షమును పొందినవిధానమును చక్కఁగా తెలిసికొని నీవు కూడ పరమమైన శ్రేయస్సును పొందుము.

జ్ఞానఖండమున హేమచూడోపాఖ్యానమునందు సంసారాఖ్యాయికావివరణ మన్నది. అష్టమాధ్యయము.

బాలప్రియ

''నేను నిన్ను శరణము పొందుచున్నాను'' అని హేమచూడుఁడు భార్యకు శరణాగతి చెసెను. ప్రియాప్రియములనుగూర్చి చర్చ ఆరంభ##మైనప్పుడు అతఁడు స్త్రీలకు లోకజ్ఞాన ముండదు అనుతలంపుతో నుండెను. స్త్రీత్వముచేత, వయస్సుచేత, జ్ఞనముచేత, భార్యత్వము చేత హేమలేఖ తనకన్న తక్కువస్థాయిలో నున్న దని తాను పరుషుఁడుగా, పెద్దవాఁడుగా, విద్యాధికుఁడుగా, భర్తగా ఆమెకన్న అన్నివిధముల అధికుఁడని అతఁడు గట్టిగా తలంచుచుండెను. అట్టివాఁడు ''నేను నిన్ను శరణము పొందుచుచున్నాను'' అని పలికె నన్నచో అతనియందు పెద్దమార్పు కలిగె నన్నమాట. మొదట ఆమెమాటలను అతఁడు చిన్నపిల్ల చెప్పుచున్న మాటలనువలె వినోదముతో వినెను. ఆమెమాటల యందలి నిజమును గ్రహించినతరువాత భోగములయందు విరక్తుఁడై వానిని వదలుకొనలేక వానివలన సుఖపడలేక క్లేశము నొందుచుండియు ఆమెతో చెప్పుకొనుటకు సిగ్గపడుచుండెను. అతనియవస్థను ఆమెయే గ్రహించి అతనిని బుజ్జగించి త్రిపురాదేవి నుపాంచిననే కాని భోగములయందు పూర్మమైనవిరక్తి కలుగ దని సూచించి తాను ముక్తిని పొందిన విధమును, సంకేతము లతో కథగా చెప్పను. అప్పటికి అతనికి నేను అధికుఁడను అనుభావముపోయి ఆమెమాటలు మిత్రునియొక్క మాటలనువలె ఆదరముతో వినెను. ఆయినను ఆకథ ఏమియు అర్థము కాకపోవుటవలన ఆమెమాటలయందు అతనికి శ్రద్ధ ఏర్పడలేదు. ఆమె వెంటనే శ్రద్ధయొక్క ఆవశ్యకతను సహేతుకముగా నిరూపించెను. గురువుచెప్పునది బోధపడకున్నచో ఆయననే నమ్మి సందేహములు తీరువఱకు ప్రశ్నించుచు తత్త్వమును గ్రిహంపవలె కాని ఆయన మాటలయందు అనాదరమును చూపరాదని నచ్చఁజెప్పెను. ఈశ్వరానుగ్రహము వలన తప్ప మఱియొకవిధముగా తత్త్వజ్ఞానమును పొందుటకు అర్హత కలుగదని తెలిసికొనిన హేమచూడుఁడు హేమలేఖయొక్క విజ్ఞానాతి శయమును గుర్తించి ''ఈశ్వరుఁడెవరో'' నిరూపింపుమని ఆమెను ప్రశంసాపూర్వకముగా కోరెను. అప్పుడామె త్రిపురాదేవి యొక్క ఉపాసనము ఆవశ్యక మని చెప్పఁగా ఆమె మాటలను దృఢముగా విశ్వసించి అతఁడు గురువువలన మంత్రతంత్రాదికమైన విధానమును తెనిసికొని త్రిపురాదేవి నుపాసించెను. మంత్రదీక్ష నతఁడు ఆమె వలన పొందలేదు. ఆదీక్షను మంత్రసిద్ధులైన పెద్దలవలననే స్వీకరింపుమని ఆమెయే చెప్పియుండును. ఏమైనను అప్పటికి అతఁడు ఆమెను గురువునుగా భావించుటలేదని గ్రహింపవచ్చును.

త్రిపురోపాసనము గావించిన తరువాత దేని యనుగ్రహమువలన ఆతని దృక్పథమున పెద్దమార్పు వచ్చెను. అతనిమనస్సు భోగముల నుండి విముఖమైన ఆత్మవిచారమునందు లగ్నమగుటయే కాక, ''హేమలేఖ తత్త్వజ్ఞురాలు; సామాన్యురాలు కాదు. ఆమెను గురువునుగా గైకొని శరముపొందిననే తప్ప నాకు ముక్తి కలుగడు"అను భావము దృఢముగా ఏర్పడెను. అందువలననే ఆమె సాధారణమైన భార్యవలెనే అతనిని కౌఁగలించుకొని ప్రియముగా మాటాడుచున్నప్పుడు, అతఁడు ఆమెవలన భోగమును ఆపేక్షింపక, ఆమెను భార్యమాత్రముగా తలంపక, కేవలము గురువునుగా భావించుచు సకలసంకోచములను వీడి ''నేను నిన్ను శరణము పొందుచున్నాను. నాహృదయములోని సంశయములను ఛేదింపుము'' అని ప్రార్థించుచు శిష్యుఁడయ్యెను.

గురుశిష్యసంబంధము శిష్యునివలననే ఏర్పడవలె. ఇతరులకు తత్త్వమును బధింపవలయు ననుకుతూహలము జ్ఞానులకు ఉండదు. ఎవరైనను వచ్చి తమ్ము ఆశ్రయించినను వారిశ్రద్ధను పరీక్షించిన తరువాతనే జ్ఞానులు తత్త్వమును బోధింతురు. శ్రీకృష్ణఁడు అర్జునునకు తత్త్వమును బోధింపవలె నని ఎప్పుడను కుతూహలము నొందలేదు. అర్జునుఁడు విషాదమునుపొంది కర్తవ్యమును బోధింపు మని శ్రీకృష్ణుని ''నేను నీకు శిష్యుఁడను. నిన్ను శరణుఁజొచ్చితిని నన్ను శాసింపుము'' (శిష్యస్తే7హంశాది మాం త్వాం ప్రసన్నమ్‌) అని ప్రార్థించినప్పుడు అర్జునుఁడు శిష్యుఁడై శ్రీకృష్ణుఁడుగురు వయ్యెను అంతవఱకును వారిరువురు బావమఱుదులే. అట్లే హేమచూడుఁడు హేమలేఖను శరణుపొందినంతనే అతఁడు శిష్యుఁడై ఆమె గురువయ్యెను. కావున పూర్వసంబంధము ఎట్టిదైనను, మోక్షమును కోరువాఁడు సకలసంకోచములను వీడి గురువును ప్రత్యక్షదైవతముగా భావించుచు శరణుఁజొచ్చిననే తప్ప ఉపదేశ ఫలింప దనుట స్పష్టము.

దీనినిబట్టిచూచినచో ఈశ్వరానుగ్రహమువలననే గురువునందు భక్తి కూడ కుదురు నని స్పష్టమగుచున్నది. ''నన్ను పూజించువారికి నన్ను చేరుటకు సాధనమైన బుద్ధియోగము నొసంగుదును'' (దదామి బుద్ధియోగంతం యేన మా ముపయాంతితే భగవద్గీత) అన శ్రీకృష్ణుఁడు చంప్పెను.'' ఎవనికి దేవునియందు పరమభక్తి కలదో, అట్లే గరువునందు కూడ పరమభక్తి కలదో అట్టి మహాత్మునకే ఉపనిషత్తు నందు చెప్పఁబడిన యీవిషయములు ప్రకాశించును'' అని శ్వేతాశ్వత రోపనిషత్తునందు కూడ చెప్పఁబడియున్నది.

యస్య దేవే పరాభక్తి ర్యథా దేవే తథా గురే|

తస్త్యేత కథితా హర్థాః ప్రకాశ##న్తే మహాత్మగః ||

ముందుగా దగేవునియందు పరమభక్తిని పొంది దేవునియను గ్రహమువలన గురువునందు కూడ అట్టిభక్తినే పొందవలయు నని, అట్టి గురుభక్తి పొందినవాఁడే మహాత్ముఁడని, అట్టివానికే ఉపనిషత్తులలో ప్రతిపాదింపఁబడిన తత్త్వము చక్కఁగా బోధపడు నని స్పష్టమగుచున్నది. మఱి గురువులవలననే కదా దేవునిమహిమను తెలిసి కొని ఎవఁడైనను దైవభక్తి నొందును. అందువలన గురుభక్తి వలననే దైవభక్తి కలుగు నని ఏల చెప్పరాదు? పురాణములవల్లనో హరికథలవల్లనో పెద్దల ప్రసంగములవల్లనో ఏవిధముగా నైనను దైవభక్తి కలుగవచ్చును. దైవభక్తి కలిగినంత సులభముగా గురుభక్తి కలుగదు. జగత్కర్త జగత్పరిపాలకుఁడు అని భావింపఁబడుచున్న పరమేశ్వరునియందు భక్తి కలుగునట్లుగా, మనవలెనే మనుష్యుఁడుగా కన్పించుచున్న గురువునందు భక్తి కలుగుట సులభముకాదు. విద్యాసంస్కారము చిత్తనిర్మైల్యము కలిగినవారే పెద్దల యొక్క మహిమను గుర్తించి గౌరవింపఁగలరు. చిత్తనైర్మల్యము ఈశ్వరారాధనమువలన కలుగును. ఈశ్వరునియందు భక్తి సత్సంగమువలన కలుగను. పూర్వపుణ్యమువలన సత్సంగము సంభవించును.

హేమచూడునకు పూర్వపుణ్యమువలననే హేమలేఖతో సాగంత్యము కలిగినది. ఆసాంగత్యమువలన అతఁడు త్రిపురాదేవి నుపాసింపఁగలిగెను. ఆదేవియొక్క అనుగ్రహమున అతఁడు హేమలేఖ యొక్క మహత్త్వమును గుర్తించి నిస్సంకోచముగా ఆమెకు శిష్యుఁడై తత్త్వమును బోధింపు మని ప్రార్థింపఁగలిగెను. అతని శ్రద్ధను గమనించి ఆమె తత్త్వమును బోదింపఁగా అతఁడు కృతార్థుఁడయ్యెను. ఇట్టి గురుశిష్యసంబంధము లేకపువుటవలన కువలుఁడు పౌరాణికుని బోధవలన కృతార్థుఁడు కాఁజాలకపోయెను.

భర్త తనదగ్గరకు వచ్చినప్పడెల్ల హేమలేఖ అతనియారోగ్య మునుగూర్చి మిగుల ఆదరముతో ప్రశ్నించుచుండుట గమనింపఁదగియున్నది. భర్తయొక్క ఆరోగ్యమునందు భార్య శ్రద్ధ యుండుట సహజము. మఱి దత్తాత్రేయుఁడు కూడ పరశురాముని విషయమున ఇట్లే ఆరోగ్యమును గూర్చి ప్రశ్నించెను.

ఇట్లు ప్రశ్నించుటలో ప్రేమ వాత్సల్యము అనునవియే కారణములు కాదు. మోక్షము కోరువానికి విషయములయందు విరక్తి అవశ్యక మైనట్లే ఆత్మవిచారము చేయుటకు తగినయారోగ్యము కూడ ఆవఖ్యకమే. ''దేహము అనిత్యము తుచ్ఛము హేయము'' అను తలంపుతో సాధుకఁడు దేహముయొక్క ఆరోగ్యమును ఉపేక్షింపరాదు. శరీరము ఆరోగ్యము సామర్థ్యమును కలిగియున్నప్పుడే సాధకుఁడు చక్కగా గురువునకు శుశ్రూష యొనర్చి ఆత్మవిచారమును కొనసాగించి కృతార్థుఁడు కాఁగలుగును. ముక్తి కలుగువఱకు జ్ఞానమును సంపాదించుటలో ముఖ్యసాధనమైన శరీరమును ఉపేక్షింపరాదు. నదిని దాటువఱకు మంచిపడవ ఎట్లు ఆవశ్యకమో అట్లే అజ్ఞానసము ద్రమును దాచువఱకు మోక్షమును గోరువానికి ఆరోగ్యముదగల శరీరము ఆవశ్యకము. ఈవిషయమును హెచ్చరించుటయకే గురువులు శిష్యులయారోగ్యవిషయమున శ్రద్ధను చూపుచుందురు.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters