Maa Swami    Chapters   

7. ఆచార్య!

(రాబర్డు వాల్సెర్‌)

జినీవా

22-6-65

ఆచార్యా!

„dsVLRiV Fs. LSª«sVry*„sV ª«sVWÌÁLigS xmsLizmsƒ«s úxmsryµR…Li @Liµj…ƒ«sµj…. FsLi»][ NRPX»R½ÇìÁÙ²T…¬s.

మిమ్ములను తరుచూ స్మరిస్తూ ఉంటాను. మరొక్కమారు ఉత్సాహం కల్గించే మీ సమక్షంలో ఉండాలని కాంక్షిస్తున్నా! నేను మళ్ళా దక్షిణభారతానికి వస్తానా? మీకే తెలియాలి మరి!

నా జీవితం అతఃకరణంలోని గురువు నిర్ణయించినట్లు క్రమక్రమంగా విప్పారుతున్నది. రోజు రోజుకూ అనుభూతి గాఢతరం ఔతుందనీ, కృతకృత్యుణ్ణి ఔతాననీ ఎదురుచూపు. కాని, కంచికివచ్చి, మీ దర్శనం చేయాలన్న కాంక్షమాత్రం వదలటంలేదు. మీ మధురములైన దివ్యబోధలను వినాలన్న కుతూహలం పోవటంలేదు. మీరున్న ఆవరణ ఎంత ప్రశాంతంగా వుండినది. మీవద్దనున్న ఆ బ్రాహ్మణులు ఎంత ఆదరణ చూపారని? దేవుడు వాళ్లనందరినీ రక్షించుగాక! మిమ్ములను చాలకాలం చిరంజీవులుగా ఉండునట్లు చేయుమని దేవుణ్ణి మరీ మరీ ప్రార్ధిస్తున్నా. ముముక్షువులగు మీ జీవితం పరమార్ధదాయకంకదా! భారతదేశపు నిజమైన సంపత్తి మీబోటివారే. ఉత్తేజకరంగా ఒక చిన్నమాట ఐనా చాలు, చెప్పండి. అది నాకు ఎంతో సహాయకరంగా వుంటుంది. నా ఆత్మని మీరు ఆవలోకించినట్లు ఇంతవరకు ఎవరూ చూడలేదు.

నా కృతజ్ఞాతా, గౌరవమూ, ప్రేమనూ అందుకోండి-

రాబర్టు వాస్లెర్‌.

Maa Swami    Chapters