గురుస్తుతి
చిరునగవు మొగమున చిందులాడే స్వామి
బ్రహ్మతేజస్సుతో వెలిగిపోయెడు స్వామి
కఠిన నియమాలతో కరడుకట్టిన స్వామి
కామాక్షి పాదముల పరవశించెడు స్వామి- ||చిరు||
రుద్రనమకాలలో నిర్ణిద్రుడగు స్వామి
వేదాంతవీథులలో దేలిపోయెడు స్వామి- ||చిరు||
శాంతుడై దాంతుడై శాశ్వతానందుడై
సచ్ఛిష్య సందోహ స్తుత్యుడై మౌనియై
జ్ఞానియై జ్ఞేయుడై సన్మార్గగామియై
కామకోటి పీఠ శంకరాచార్యుడై.
షణ్మతస్థాపనాచార్యుడై వెలుగుచు
ఆశ్రయించెడు వారి కభయ మిచ్చెడు స్వామి-
చిరునగవు మొగమున చిందు లాడే స్వామి-
బ్రహ్మతేజస్సుతో వెలిగి పోయెడు స్వామి ||
''విశాఖ''
|