తొలి పలుకు
గోస్వామి తులసీదాసు
హిందీభాషలో రచించిన రామాయణము
శ్రీ రామచరిత మానసము
రమారమి నాలుగువందల సంవత్సరములకు పూర్వము గోస్వామిచే గానముచేయబడిన మానసము విశ్వ విఖ్యాతి చెందినది.
ప్రచురింపబడిన రామచరితమానస ప్రతులయందు అనేక పాఠాంతరములున్నవి. లభించినంతవరకు వానిని పరిశీలించి మిక్కిలి సమంజసమని తోచినవానిని గ్రహించితిని.
అనువాదమున అనేక గ్రంథములు సహాయపడినవి. ఆయా గ్రంథకర్తలకు, ప్రచురణ కర్తలకు నా కృతజ్ఞతలు.
అనువాదమున దొరలిన దోషములకు పాఠక మహాశయులు నన్ను మన్నింతురుగాక.
[గుడ్లవల్లేటి వేంకటాచలపతిరావు] 19-6-78
అనువాదమున ఉపకరించిన ముఖ్య
గ్రంథములు :
హిందీ :
గీతా ప్రెస్‌వారి శ్రీ రామచరిత మానసము-
వివిధ ప్రతులు, మానస పీయూషము,
ఇంగ్లీషు :
(1) Ramayana of Tulsi Das by
F.S.Grouse.
(2) The Holy Lake of the Acts of
Rama -by W.Douglas P.Hilt.
(3) Sri Ramacharita Manas,
Published by GITA PRESS,
GORAKHPUR