Devi Kathalu         Chapters          Last Page

దేవీ కథలు

సరసతగల్గి ధర్మముల సారమెఱింగి మనీషులై చెవుల్‌

తిరముగ గల్గియుండియును దేవి పురాణ కథా సుధారసా

దరమతి లేనివారు వసుధన్‌ విధివంచితులంచు పల్కుట

బ్బురమొకొ! వారి జన్మములు భూమికి భారములౌట వింతయే!

-ములుగు పాపయారాధ్యుల

''దేవీ భాగవతము.''

రచన:

ఆర్ష విద్యా భూషణ , పౌరాణిక సార్వభౌమ

భాగవతసుధా సింధు, మధుర భారతి

మల్లా ప్రగడ శ్రీరంగారావు

ప్రథమ ముద్రణ:

వేయి ప్రతులు

1996 ఏప్రిల్‌ 23 వైశాఖ పంచమి

ధాత- శంకర జయంతి

హక్కులు రచయితవి

వెల: రూ.30/-

ప్రతులకు:

శ్రీ మల్లా ప్రగడ శ్రీ రంగారావు

శ్రీ శారదా సదనము

సర్కిల్‌ పేట

మచిలీపట్నం-521 001

కృష్ణాజిల్లా.

ముద్రణ:

శ్రీ నటరాజ ప్రింటర్స్‌

పొన్నూరు- 522 124.

శుభాశీస్సులు

PRIVATE SECRETARY

To His Holiness Sri Jagadguru Sankaracharya

Dakshinamnaya Sri Sarada Peetham

SRINGERI-577 139 (Karnataka)

బ్రహ్మా శ్రీ వేదమూర్తులయిన మల్లా ప్రగడ శ్రీ రంగారావుగారికి నమస్కారములు తమరు రచించి పంపిన ''దేవీ కథలు'' అను గ్రంథమును శ్రీ చరణులు అవలోకించినారు. వేదవ్యాస మహర్షి విరచితములగు అష్టాదశ మహాపురాణములందు పరదేవతా మహిమ ప్రతి పాదకముగా దేవీ భాగవతమునకు విశిష్టమైన ఖ్యాతి యున్నది. ఆ పురాణము నందు అనేకములైన ఉపాఖ్యానములు వర్ణింప బడియున్నవి. అవి చదువరులకు మిక్కిలి చేతః ప్రసాదకములు మాత్రమే గాక జగన్మాత యందు భక్తిని పెంపొందించు నవిగ నున్నవి.

తమరు దేవీ భాగవత పురాణమును పలుమారులు ప్రవచనము చేసిన వారు కావున అందలి రంజకములైన యుపాఖ్యానములను ఈ గ్రంథము నందు సులభ సుందరమైన శైలిలో వ్రాసితిరి. దీనిని శ్రీ చరణులు అవలోకించి కడుమోదము నందిరి. ఈ గ్రంథము భక్త జనులకు ఉపాదేయమై యలరారుగాక యనియు, తమరు పరదేవతానుగ్రహ భాజనులై వెలయుదురు గాక యనియు శ్రీచరణులు ఆశీర్వదించినారు.

ఇంతే నమస్కారములు

శృంగేరి

15-3-1996

(సం) టి. దక్షిణామూర్తి

ముద్రణ దాత దంపతులు

శ్రీమద్దాలి కృష్ణమూర్తిగారు శ్రీమతి సత్యవతి గారు

పవిత్రమైన ఈ గ్రంథ ముద్రణ మహాయజ్ఞ నిర్వహణకు స్వచ్ఛందముగా ఆర్థిక బాధ్యతను స్వీకరించిన భక్తులు, సహృదయులు, వదాన్యులు, ఏకమనస్కులైన దంపతులు శ్రీ మద్దాలి కృష్ణమూర్తి గారు, శ్రీమతి సత్యవతిగారు.

వారికి నేనేమీయగలను?

"శతమానం భవతు....."

-రచయిత

గ్రంథకర్త దంపతులు

ఫోటో

బాపట్ల శంకర విద్యాలయములో, నెల్లూరు వేద సంస్కృత కళాశాలలో వేదశాస్త్రములను , ఉన్నత విద్యను అభ్యసించి, బ్రహ్మశ్రీ జమ్ములమడక మాధవరామశర్మగారి శిక్షణలో సాహిత్య విద్యా ప్రవీణులై, శ్రీశ్రీశ్రీ వాసుదేవేంద్ర సరస్వతీ స్వామివారి నుండి మంత్రదీక్షను స్వీకరించి, తమ ప్రవచనములద్వారా జాతిని జాగృతము గావించుచు, మంత్రముగ్దులైన శ్రోతల నుండి గండపెండేర, కనకాభిషేకాది ఘనసన్మానములందు కొనుచు, 'భారతీ వాఖ్య' (లలితా సహస్రనామ భాష్యము), 'త్రయీవిద్య'. (శాక్తేయోపనిషత్తులకు వివరణ), 'భగవద్గీతా హృదయము మున్నగు ప్రామాణిక గ్రంథములను రచించి, శ్రీశారదాపీఠ ఆస్థాన విద్వాంసులుగా శృంగేరీ జగద్గురువుల ఆశీస్సులు అందుకొనిన పవిత్ర చరిత్రులు

శ్రీమల్లా ప్రగడ శ్రీరంగారావుగారు.

జీవితములోని అన్ని రంగములలో ఆ మహానీయునికి తోడునీడగా మెలగుచు, సహధర్మచారిణి అను మాటకు సార్థకరూపమై నిలచిన సాధ్వి శ్రీరంగారావుగారి అర్థాంగి

శ్రీమతి వసుమతిగారు

ఆ పుణ్య దంపతులకు భక్తి ప్రసూనాంజలి.

-శిష్యబృందం

పంచకృత్య పరాయణా

సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ

సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీ ఈశ్వరీ

సదాశివా అనుగ్రహదా

Devi Kathalu         Chapters          Last Page