Sri Sankara Jayant  Chapters    Last Page

అ భి యు క్తి

శ్లో || దోషత్వ ముజ్జ్వలగుణా అపి యాన్తి యేషు

తైరున్నతేః కి మథ వేహ తిరస్కృతేః కిమ్‌?

దోషో7పి యేషు గుణతా ముపయాతి భూయాం

స్తేభ్యో నమో7స్తు సతతం భువి సజ్జనేభ్యః ||

(చిత్సుఖీటీకా)

తా|| సన్న్యాసాదిఉజ్జ్వలగుణములుకూడా యెవరి దృష్టిలో దోషములుగ భాసించుచున్ననో, అట్టివారు ప్రశంసించినను, నిందిచినను ప్రయోజనరహితమే. ఏ మహాపురుషులయందు పెద్దదోషముకూడా గుణత్వము పొందుచున్నదో అట్టి సజ్జనులకొరకు నిరంతరము వందన ముండుగాక.

శ్లో|| విద్వాంసో యది మమ దోష ముద్గి రేయుః ,

యద్వా తే గుణగణ మేవ కీర్తయేయుః |

తుల్యం త ద్బహు మనుతే మనో మదీయం

కష్టం త ద్బత మనుతే యదాహ మందః ||

(సంక్షేపశారీరకమ్‌)

తా|| బ్రహ్మవేత్తలైనవారు నా దోషము లుగ్గడించినను, లేక గుణగణమును కీర్తించినను నామనస్సు రెంటిని గౌరవము గానే భావించును. జ్ఞానములేనివాడు పై రెంటిలో నేది వాగినను మనస్సునకు కష్టముగా తోచును.

Sri Sankara Jayant  Chapters    Last Page