Kamakoti   Chapters   Last Page

 

1. దేవీస్తుతిః

శ్లో|| తవస్వాధిషానే హుతవహమధిష్ఠాయ నిరతం

తమీడే సంవర్తం జనని మహతీం తాంచనమయాం,

యదాలోకే లోకాన్‌ దహతి మహసి క్రోథకలితే

దయార్ద్రా యాదృష్టి శ్శిశిరముప చారం రచయతి

తా|| తల్లీ! స్వాధిష్ఠానచక్రమందున్న అగ్నితత్త్వము నధిష్ఠంచి ఎల్లప్పుడూ ప్రకాశించుచూ, ప్రసిద్ధమైన సంవర్తాగ్ని రూపమున జ్వలించుచున్న ఆ పరమేశ్వరుని ప్రార్ధించుచున్నాను. మహచ్చబ్దవాచ్యయగు సమయ యను పేరుగల సంవర్తాగ్ని రూపిణియగు నిన్నునూ ప్రార్ధించుచున్నాను. ఏశక్తి యొక్క క్రోధయుతమగు చూపు లోకములనన్నిటినీ దహింపచేయగా కరుణాపూరితమైనఆచూపే మరల చల్లబరచుచున్నట్టి ప్రళయానల జ్వాలరూపయగు ఆ శివశక్తిని బ్రార్ధించెదను.

(ఈ శ్లోక పునశ్చరణ వలన దుస్స్వప్నశాంతి కలుగునని మంత్రశాస్త్రము)

 

Kamakoti   Chapters   Last Page