Kamakoti   Chapters   Last Page

 

19. వార్తలు - విశేషాలు

శ్రీ కామకోటి జగద్గురు శంకరాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామివారు 10-3-71 రాత్రి గం 11-45 ని||లకు పల్లె పట్టునుంచి కాలి నడకన కార్వేటి నగరసంస్థానమునకు విజయము చేసిరి. సంయుక్తమద్రాసురాష్ట్రశాసనమండలి మాజీసభాపతి శ్రీ ఆర్‌. బి. రామకృష్ణంరాజుగారి ఆధ్వర్యమున పురప్రముఖులు అసంఖ్యాకముగ ఎదురేగి శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయమువద్ద పూర్ణకుంభము, ఛత్ర, చామర లాంఛనములతో స్వాగతము ఇచ్చినారు. ప్రతిదినము ఉదయము 8గం|| మొ||మధ్యాహ్నము 2గం|| వరకు వచ్చు భక్తజనులకు శ్రీవారు దర్శనమనుగ్రహించుచున్నారు. సంస్థానాధిపతులైన శ్రీ వెంకట పెరుమాళ్‌ రాజుగారు త్రవ్వించిన నెత్తగుంట అను తటాకపు ఒడ్డున శ్రీవారికొరకు పంచాయతి ప్రెసిడెంటుగారిచే ప్రత్యేకముగా నెలకొల్పబడిన శాలయందు వసంత నవరాత్రములు జరిపి యుండిరి. తదాది మౌనదీక్ష నవలంబించి యచటనే ఒక ఏకాంతస్ధలము నేర్పరచుకొని ఆదిశంకరభగవత్పాదుల పాదుకల నెలకొల్పి శంకరజయంతి మహోత్సవములను అతినిరాడంబరముగా జరిపిరి. షర్ట్‌డొ బ్రహ్మసరస్సు ఒడ్డున పురుద్ధరింపబడిన మంటపమునందు ఆదిశంకరుల విగ్రహము ప్రతిష్ఠించిరి.

 

* * * * *

శ్రీ జయేంద్రసరస్వతీ నవ్య శ్రీచరణులు 26-3-71 సాయంత్రము ఆరు గంటలకు కోయంబత్తూరు విజయము చేసినప్పుడు స్థానికపురప్రముఖులు అసంఖ్యాకముగ విచ్చేసి ఊరిబయటనున్న శ్రీనివాసదేవాలయమువద్ద మేళతాళములతో పూర్ణకుంభ స్వాగతమొసగిరి. అచటనుండి మూడు మైళ్ళ పొడవునా ఊరేగింపుగా మేళతాళములతో భజనలతో వేదఘోషతో ఊరేగింపుగా అయ్యప్ప పూజాసంఘము వద్దకు తీసుకొని వెళ్ళిరి. పట్టణములో ముఖ్యులగు 232 ప్రముఖసభ్యులతో నొక ఆహ్వానసంఘమేర్పడి శ్రీవారు అచట మకాము చేసియున్న సమయములో వారికి వసతులను ఏర్పరచుటకు నిర్ణయించిరి.

శ్రీమఠమునందు ప్రతినిత్యము జరుగు గో, గజపూజలను చంద్రమౌళీశ్వర పూజలను దర్శించి తరించుటకుగాను అసంఖ్యాక భక్త జనులు వచ్చి తమ జన్మ ధన్యచరితమైనట్లు భావించిరి. శ్రీవారు అచటనే వసంత నవరాత్ర ఉత్సవములను మహావైభవముగ జరిపిరి.

* * * * *

ఒక శుభముహూర్తమున మూడువందలమంది బాలురకు ధర్మోపనయనము గావించి వారికి శ్రీ జగద్గురువులు స్వయముగా గాయత్రీమంత్ర ప్రాముఖ్యమును అనుష్ఠాన అవసరము ఆ వటువులకు బోధించిరి.

శ్రీవారు అక్కడ విడిది చేసియున్న సమయములో రామనగరములోని రామాలయమును, కోయంబత్తూరు గ్రామదేవత ''కోణయమ్మ'' దేవాలయము, ఉప్పిలి పాలయంలోని ''దండుమరియమ్మ'' దేవాలయము, ఆర్‌. యస్‌. పురములోని 'కల్పకనాయక' దేవాలయము, కన్యకాపరమేశ్వరీదేవాలయము, వేణుగోపాలస్వామి దేవాలయము, శ్రీకృష్ణదేవాలయమును, శృంగేరిమఠము, ఆంజనేయ దేవాలయము, శివసుబ్రహ్మణ్యస్వామి దేవాలయములు, తెలుగు బ్రాహ్మణ వీధిలోని గణపతి దేవాలయము అయ్యప్ప సేవాసంఘము జి.డి. నాయుడు పారిశ్రామిక ప్రదర్శనము మొ||నవి దర్శించిరి. ప్రతిదినము ఉపన్యాసములను ఇచ్చిరి. రోటరీక్లబ్బు, భారతీయవిద్యాభవనము మొ|| సంస్థలు సంయుక్తముగా సవితాహాలులో ఏర్పాటుచేసిన సభలో శ్రీవారు ప్రసంగించుచు హిందూధర్మమును ఉగ్గడించుచు ప్రపంచశాంతి సౌభాగ్యమున కొరకు హిందువుల కర్తవ్యమును గూర్చి ఉపదేశించిరి.

కోయంబత్తూరు సెంట్రల్‌ జైలులోని రెండువేలమంది ఖైదీలనుద్దేశించి ప్రసంగించుచూ నేరస్థులందరు పశ్చాత్తాపము చెంది తిరిగి సంఘములో గౌరవము కలుగునటుల సంచరించవలసినదిగా ఆదేశించిరి.

అయ్యప్పన్‌ పూజా సమాజము వారిచే ఏర్పాటు చేయబడిన రాష్ట్రీయ స్వయంసేవకసంఘమువారిని సంఘఅభివృద్ధికి సంక్షేమపధకములు చేపట్టవలసినదిగా కోరిరి. అచ్చట జేరిన పెద్దలను ఉద్దేశించి ప్రతివారము భజనలు చేయవలసినదిగాను తమ తమ పట్టణములలోని వెనుకబడిన ప్రాంతములలోని ప్రజలకు సహాయము చేయవలసినదిగాను బీదలకు వస్త్రదానమువంటి సహాయ కార్యక్రమములు అమలు పరచవలసినదిగా కోరిరి. 9-4-71 శుక్రవారము రాత్రి శ్రీవారిని పుష్పపల్లకీయందు ఆసీనులను గావించి శాయిబాబా కాలనీలోని గణపతి దేవాలయము వద్దకు మహావైభవముతో ఊరేగింపుగా తీసుకొని వచ్చి అచట జయేంద్రసరస్వతీ ప్రవచన మంటపము అను నొక దానిని ఏర్పరచిరి.

నగరములో శ్రీవారు విజయము చేసిన ప్రతిస్థలము, దేవాలయము, గృహము ఎంతో ముచ్చటగా అలంకరించి పూర్ణకుంభస్వాగతములు, కానుకలు సమర్పించిరి.

శ్రీవారు అచ్చటచ్చట సభలలో ప్రసంగించుచూ అందరునూ తమ మాటలయందును, నీతినిజాతీలతో ప్రవర్తించి సౌశీల్యము నలవరచుకొని పవిత్రమైన బుద్ధికలిగి భగవంతుని ఆరాధించవలసినదిగా ప్రబోధించిరి.

శ్రీరామనవమీ సందేశ మొసంగుచు శ్రీవారు ధర్మో రక్షతి రక్షితః అను విషయముపై ప్రసంగించుచూ పట్టాభిషేకభంగసమయమున అరణ్యమునకు బయలుదేరుచున్న శ్రీరామచంద్రమూర్తిని జూచి కౌసల్య దీవించుచూ రాముడు అనుష్ఠించిన ధర్మమే అడవులలో రాముని కాచును. అన్న సంఘటనను జ్ఞప్తిచేయుచు ఋజుమార్గములో ప్రవర్తించిన మానవులను, సంఘములను ఎవరునూ ఏమియు చేయలేరు అని ఉద్ఘాటించిరి.

స్థానిక శ్రీకంచి కామకోటిపీఠ సేవాసమాజమువారు తమ సమాజ ఆవరణయందు 10-4-71 రాత్రి సంస్కృతములోను, మళయాళములోను, ఒక సన్మానపత్ర మొసంగిరి. ఇంకను అనేక సంస్థలు సమాజములు సన్మానపత్రములను శ్రీవారికి సమర్పించుకొనిరి.

11-4-71 పేరూరు, 12, 13, 14 మడుక్కరై, 15 కేరళ రాష్ట్రములోని కంజికోడె, 16, 17, 18 పాలఘాట్‌ లోని సూరణి' యందలి శ్రీ శంకర శారదా కల్యాణ మంటపములోను, విడిదిచేసిరి. తరువాత పట్టికాడు, మణాలి, చిలక్కుడి, అంగమళి అలగప్పనగర్‌ ల మీదుగా ఏప్రిల్‌ 24 వ తేదీన త్రిచ్చూరు విజయము చేసిరి.

24-4-71 నుండి 29-4-71 వరకు శంకరజయంతి కార్యక్రమములు త్రిచ్చూరులో జరిపిరి.

గురువాయూర్‌ దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమములకు శంకుస్థాపన చేయుటకుగాను ఆహ్వానింపబడి 30-4-71 వ తేదీకి గురువాయూర్‌ చేరిరి. 1-5-71 వ తేదీన పునరుద్ధరణ కార్యక్రమములకు ప్రారంభోత్సవము గావించిరి. 2-5-71 వరకు గురువాయూరులో నుండి, అచటి నుండి ఆదిశంక భగవత్పాదుల జన్మస్థలమగు కాలడి క్షేత్రము సందర్శించగలరని తెలియుచున్నది.

* * * * *

తూర్పుబెంగాల్‌ సహాయార్ధము శ్రీ జగద్గురువులు రు 1,500 లను విరాళముగా నిచ్చిరి.

* * * * *

గుంటూరు మండల వేదప్రవర్ధక, విద్వన్మహాసభలు 29, 30 1 తేదీలలో రేపల్లె బ్రాహ్మణసంఘ ఆహ్వానమును పురస్కరించుకొని రైలుపేటలోని శివాలయములో జరుపబడినవి. ఆఖరిదినమున అధ్యాపకులను, విద్యార్ధులను మహాసభవారు ఉచితముగ సన్మానించిరి. ఈసభల కనుబంధముగా సంస్కృత పరీక్షలు కూడా ఈసంవత్సరము నిర్వహింపబడినవి.

* * * * *

అపరత్యాగ బ్రహ్మమనియు, పుదుకొట్టె అప్పా అనియు, ప్రసిద్ధివహించిన భాగవత శిఖామణులు శ్రీగోపాలకృష్ణ భాగవతస్వామి 30-4-71 వ తేదీన పుదుక్కోటలోని తమ స్వగృహమున పరమపదించిరని చెప్పుటకు విచారించుచున్నాము.

* * * * *

Kamakoti   Chapters   Last Page