దివ్యసందేశము
శ్రీ కాంచీ కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ శంకరాచార్య
శ్రీశ్రీశ్రీ చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ శ్రీచరణుల
ఆత్మవదేవ పరానపి పశ్యత
యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత
త్యజత పరేష్వక్రమ మాక్రమణమ్||
తా|| అందరి హృదయములను జయించుమైత్రిని పెంచుము.
ఇతరుల నందరిని నీవలెనే చూచుకొనుము.
యుద్ధమును, స్పర్థను త్యజించుము.
ఇతరులపై అక్రమ ఆక్రమణను వదలిపెట్టుము.
శ్లో|| జననీ పృథ్వీ కామదుఘూ೭స్తే
జనకోదేవః సకలదయాళుః
దామ్యత దత్త దయధ్వం జనతాః
శ్రేయో భూయాత్ సకలజనానామ్||
తా|| పుడమితల్లి అన్ని కోర్కెలను పిదుకగలదు.
తండ్రి పరమేశ్వరుడు అందరియెడ దయాళువు.
ఓ! ప్రపంచప్రజలారా!దయా దాననిగ్రహాదులను అలవరచుకొనుడు.
మీకెల్లరకు శ్రేయమగుత.
- ఈ సందేశము 23 అక్టోబర్ 66 న ఐక్యరాజ్యసమితిలో శ్రీమతి యమ్. యస్. సుబ్బలక్ష్మిచే గానము చేయబడినది.