xసువర్ణో పదాః
బ్రహ్మశ్రీ తాడేపల్లి రఘవనారాయణ శాస్త్రిభిః సమర్పతాః
ప్యాభాసాదిత కామకోటి పద పీఠీ పేటికాంత స్థితిం
భాస్వంతం భువి పృష్ఠ తో೭పి పురతః పార్శ్వేషు పర్యన్తతః
ప్రత్యక్షం కధ మాహ్వయామి మనసా ధ్యాయామ్యధో కింకరః-?
తా|| శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ చంద్రశేఖరయతీంద్రులు ఆనందపూర్ణులై తమ ప్రభ##చే కామకోటి పీఠయను పేటికలోనుండి లోకము యందు వెనుక ప్రక్కల యందు అంతటా ప్రకాశించుచుండగా తత్కింకరుడనైన నేను ఎట్లు ఆహ్వానించ గలను? మనసులో ధ్యానించగలను?
(కింకరుడను, ఏమియ తోచనివాడను యని అర్థము)
2) శ్లో|| ఆసీనంకిల సత్యసీమ్ని గురునాధం స్వాసనే నార్చితుం
నార్హామ్యర్హణయా కయాచిదధవా పర్యాప్త ఆప్తుంకధం
స్నాతో೭స్నాత ఉతప్రదృశ్యత ఇడాసంపాత తత్పింగళా
సంగే೭సంగత ఏవయస్త మహ మప్యాసే೭ర్ధ రూఢింత్యజన్||
తా|| సత్యసీమయందు ఆసీనుడై యున్న గురునాథుడగు శ్రీ స్వామివారికి నేవిధమగు నాస సమర్పింతును. మరి ఇడాపింగళుల కూడలి స్థానమగు భ్రూమధ్యమున అసంగతుడుగనే యుండి స్నాతుడుగను, అస్నాతుడుగను నున్న ఆ గురుదేవుని ''నేను'' అను పదము యొక్క రూఢ్యర్థమును వీడి చేరుదును.
(అహం శబ్దమునకు శరీరేంద్రియాదులతో కలిసిన చైతన్యము రూఢ్యర్థమని, కేవల చైతన్యము ¸°గికార్థమని సంప్రదాయము)
3) శ్లో|| కధమావృణోమి వసనై రావృతి విక్షేప రహిత భూమానం,
యద్వాతదర్ధ మాశాః తా అపినాద్యాపి జాతు సంజాతాః||
తా|| ఆవరణ విక్షేపశూన్యమగు బ్రహ్మరూపుడగు ఆ గురుదేవుని నేనెట్లువస్త్రములచే నావరింతును? దిగంబరుడు కాగలడందుమా? అప్పుడు దిక్కులే పుట్టలేదుకదా! సర్వకారణ భూతుడగు బ్రహ్మను కార్యరూపములగు దిక్కులుగాని, వస్త్రములుగాని ఎట్లు ఆవరింప గలవు? కావున పూజలో వస్త్ర రూపమగు నుపచారమునెట్లు కల్పింతునని భావము.
4) శ్లో|| యజ్ఞోపవీతవహనశ్రమ మాశ్రమో వసహతే|
కింగంధా దిభిరేభిః దూరస్య గురోర్హి వాస నౌఘానామ్||
తా|| యజ్ఞోపవీత సమర్పణ రూపమగు ఉపచారము కల్పింతు నందునా? యజ్ఞోపవీత ధారణ శ్రమనుసన్యాసాశ్రమము సహించదుకదా! (సన్యాసులు యజ్ఞోపవీతమును త్యజింపవలయు ననిశాస్త్రము) వాసనలకు దూరుడైన గురుదేవునకు గంధముతో నేమిపని?
5) శ్లో|| పుషై#్పఃపూజాకార్యాతన్మాత్రోత్పత్తిరపిచ నాద్యాపి|
ధూపోదీపో೭నవసరః ఊర్జితపుణ్యస్యదీప్య మానస్య||
తా|| పుష్పముల పూజించుటకు గంధరసరూపాది తన్మాత్రలే యప్పటికి పుట్టలేదుకదా! అధికమయిన పుణ్యముతో నొప్పుచూ స్వయంప్రకాశమానుడగువానికి ధూపదీపాదులతో నేమిపని?
6) శ్లో|| అన్నాదో೭న్నం యోవై తత్కిం కేన ప్రదీయతే కసై#్మ?
హస్తాంఘ్రి ప్రక్షాళన మాచమనం చా೭పి తస్య తత్కల్పం||
తా|| అన్నము, అన్నాదుడు కూడా ఆయనయే అయియుండగా అన్నరూప నైవేద్యము ఎవనిచే ఎవనికొరకీయబడును? చేతులు కాళ్ళు కడుగుట ఆచమనము కూడ ఆయనకు అట్టిదియే.
7) శ్లో||తాంబూలాదిక మౌప చారిక మహో నీరాజనం కింకృతే
నిశ్శేషేణ విరాజమాన మహసే సర్వస్య శర్వస్యవా?
మంత్రం పుష్పమితి ద్వయస్య పదయోః జానామి నార్థం కధం?
దద్యాం శిష్టమిదం నమః పదమహో ''కృఞ'' ప్రత్యయాపేక్షయా||
తా|| సన్యాసికి తాంబూలాదికములు కేవలము పచారార్ధమే కానీ అక్కరలేనిదికదా! స్వయం ప్రకాశముచే పూర్తిగా ప్రకాశించు తేజోరూపుడగు ఆ పరబ్రహ్మకు గానీ, పరమ శివునికి గానీ నీరాజన మెందులకు, యిక మంత్రపుష్పము సంగతి చూడ ''మంత్రం పుష్పమని'' చెప్పవలయునో లేదా ''మంత్రస్య పుష్పమ''ని విగ్రహ వాక్యము చెప్పవలయునో బోధపడుటలేదు. అట్టిచో మంత్రపుష్పము నేమియిత్తును. ఇంక నమః పదము మిగిలియున్నది. దానికి ప్రక్కన కృఞ్=కరణ అను ధాతువునకు కృత్ ప్రత్యయమును చేర్చి ''నమష్కారః'' అని కాని, నమస్కరణమనిగాని, నమస్కృతియనిగాని చెప్పవలయును గాని, కేవలము నమః పదమునెట్లు అర్పింతును.
8) శ్లో|| యోనాదో೭న్తర్బహిరితి వినా సంతతం సంనదత్యోమ్
తస్యానుధ్యాన వశత ఇతే వృత్తి సంవృత్తి భారే|
ఏకావృత్తి శ్చరమ చరమావేదయంతీ గతంవా
ప్రాప్తం స్ధానం విరమతి యతః కామకోటిశ్వరో೭సౌ''
తా|| లోపల వెలుపల యనునది లేక ఎల్లప్పుడును ద్వనించుచున్న ''ఓం''కార నాదము నను ధ్యానించుటచే నా వృత్తులన్నియు సన్నితములు కాగా చరమవృత్తి ఒక్కటే గతమును పొందబడిన స్థానమును తెల్పుచు ఎక్కడ నాగిపోవుచున్నదియో-అదియే కామకోటీశ్వర నామమున వ్యవహరింపబడు చున్నది.
9) శ్లో|| ఆవిర్భావ తిరోభావౌ నచత్తస్య మహాత్మనః
అస్మాకం దృష్టి దోషో೭యం తౌదర్శయతి చాన్యధా||
తా|| అట్టి మహానుభావునకు ఆవిర్భావ తిరోభావము లేవు=మన దృష్టిదోషము, లేని వానిని ఉన్నట్లుగా చూపుచున్నది.
10) శ్లో|| విద్యా వల్లీవేల్లితాన్త శ్శరీరో పాధ్యా೭ వార్యా೭స్మద్విధార్య ప్రజాతిః
ధన్య స్స్వానాం సంచినోత్సేవభారాన్ బాభాతే೭ద్ధా కామకోటీట్ గృహస్థః||
తా|| విద్యాలతచే బెనవేయబడిన అంతశ్శరీరము గల వాడైననూ, వీరికి మనవంటి వారిని తప్పక పాలింప వలసియున్నది. ఆ కామకోటీశ్వరుడు ధన్యుడైననూ ధనసమూహముల గడించుట చేత గృహస్థుడుగా భాసించు చున్నాడు. విద్యావల్లియే పత్ని. అహ్మదాదులము సంతానము. ధన సంగ్రహణము కార్యము. ఈ మూడును కలదియే గృహస్థ ధర్మము.
11) శ్లో|| శాస్త్రీయ సంసార మథో೭నుపశ్యన్ సంసారి వద్భాత్యవలోకకానాం
యస్తస్యతజ్జన్మదినం ప్రతీమః ప్రవర్తతాముత్సవ ఏవసోయమ్||
తా|| శాస్త్రీయ సంసారము నవలోకించుచున్న ఈ గురువు చూచువారికి సంసారిగా కన్పించుచున్నాడు. అట్టి వీరి జన్మదినమును భావించుచున్నాము. జన్మదినము చక్కగా జరుగుగాక||
12) శ్లో|| శ్రీ చంద్రశేఖర పరివ్రాజకాచార్యపాదయోః
సువర్ణఘటితాభాన్తు హ్యుపదా అర్పితా ఇమాః
శ్రీ చంద్రశేఖరరేంద్ర సరస్వతీస్వామి శ్రీ పాదుల పాదములయందు సువర్ణ (బంగారముచేతను, మంచివర్ణములచేతనూ) ఘటితములయిన ఈ శ్లోక రూపములగు కానుకలు అర్పితములై విలసిల్లుగాక!