Jagadguru divyacharithra   Chapters   Last Page

 

2. కామకోటి సర్వజ్ఞ పీఠం

ఐశ్వర్యమిందుమౌలే రైకాత్మ్యా ప్రకృతి కాంచిమధ్యగతం |

ఐందవకిశోర శేఖర మైదంపర్యం చకాస్తి నిగమానాం ||

కామపరిపంధికామిని కామేశ్వరి కామపీఠమధ్యగతే |

కామదుమాభవకములే కామకలే కామకోటి కామాక్షి ||

- మూకపంచశతి.

కాంచీక్షేత్ర వైభవం స్థూలంగా తెలిసికొన్నాము. ఈ కంచి శ్రీచక్రాకృతిని పోలిన పట్టణం. అందు బిందు స్థానీయమైనది కామకోటి కామాక్షీ. ఆమె సాక్షాత్తు బ్రహ్మ విద్యా స్వరూపిణియైన పరాశక్తి.

కాంచీపురం సమాలోక్య ననంద కమలాముహుః |

ఆధిభౌతిక మంహోఘ్నం నాభిస్థానం భువఃపరం||

కాం. మా. 31 అధ్యా.

అథక్షితే రద్భుత కాంచిమైక్షత|| శంకరాభ్యుదయం||

కనుక అనాదిసిద్ధమైన ఈ కామకోటిపీఠం భగవత్పాదులగు శ్రీ ఆదిశంకరులకు పరమపూజ్యమైంది. వారిచట 'శారదా మఠము'న యోగలింగ శ్రీ మేరువుల నర్చించుకొంటూ తమ తుదిసమయా న్నిచటనే గడిపారు. ఈ దక్షిణామ్నాయశక్తియైన కామకోటి కామాక్షీదేవి నామంతోనే 'కామకోటి పీఠం' అనే పేరుతో ఆదిశంకరులనుండి నేటి వరకు అవిచ్ఛిన్నగురుపరంపరతో ఉన్న ఈ పీఠవైభవాన్ని మన భాగ్యవశంచేత మనం కన్నులారా దర్శించుకోగలుగుతున్నాము. ఆదిశంకరు లీ కామాక్షీదేవి సన్నిధిలోనే 'సర్వజపీ' ఠాధిరోహణం చేశారు. కనుక ఈ పీఠానికి, 'సర్వజ్ఞ' సారనామం వ్యవహారంలో ఉన్నది.

ఈ కామకోటి పీఠానికి ప్రధమాచార్యులు ఆదిశంకరులు. వారి శిష్యులు సురేశ్వరాదుల కీ పీఠము పరమాదర పాత్రమైనది. అవిచ్ఛిన్నమైన శిష్యపరంపరతో ఈ పీఠం అద్వైత బ్రహ్మవిద్యకు ఆలంబనంగా ఉండవలెనన్నదే శ్రీ భగవత్పాదులగు ఆదిశంకరుల అభిమతము.

వారి సంకల్పసిద్ధికి సాక్షీభూతులై ఆదినుండి మహామహులీ పీఠాధిష్టితులుగా ఉంటున్నారు. వారి కనుసన్నలలోనే అద్వైత బ్రహ్మవిద్యాసామ్రాజ్య విజయలక్ష్మీ విజయదుందుభులతో అపూర్వశోభను దినదినప్రవర్థకంగా సంతరించుకొంటోంది.



ఆదిపీఠంగా పౌరాణిక ప్రశస్తి

శ్రుతి, స్మృతి, ఇతిహాస, పురాణ, సదాచారములనెడి ఐదింటిలో ఒకటియై ధర్మస్వరూపావగతికి పరమోపాదేయమైన స్కాందపురాణాంతర్గత 'కాంచీమాహాత్మ్యము' నందలి 31 వ అధ్యాయమునందిట్లున్నది.

నామ్నాచవిగ్రహో దేవ్యాః కాంచ్యాం తన్మూలవిగ్రహః |

కామకోటి స్మృతస్సోయం కారణాదేవ చిన్నభః ||

యత్రకామకృతోధర్మో జంతునా యేనకేనవా |

సకృద్వాపి సధర్మాణాం ఫలంఫలతి కోటిశః ||

తేనేదం కామకోటితి బిలద్వారం ప్రసిద్ధమత్‌ |

ఉక్తో7థవాశ్రుతః కామః కామేశో ధనదశ్శ్రుతః ||

తత్కోటిదా పీఠశక్తిః కామకోటి రితిశ్రుతా |

అథవాబహుథాకామాః పశుపత్నీ సుతాదయః ||

తేషాంకోటిప్రదా యత్ర దేవ్యాస్తే బిలరూపిణీ |

కామకోటి విమాన స్తత్పసిద్ధం యత్రచిన్నభః ||

ఆకాశశరీరం బ్రహ్మసనాదం బిందుసంయుతం |

బిలరూపేణ వైకాంచ్యాం ప్రత్యక్షం మోక్షదం పరం ||

అథవారుద్రనేత్రాగ్ని నిర్దగ్ధఃకామఏకకః |

ససృష్టోలీలయామాత్రా నేత్రాభ్యాం కోటిసంఖ్యయా ||

కొమకోటితి విఖ్యాతం కాంచ్యాం యచ్ఛిన్మయంనభః |

అథకామస్తృతీయో7త్ర పురుషార్ధేషు విశ్రుతః ||

తత్పరస్తాచ్ఛ్రుతోమోక్షః కోటిశ##బ్దేన శబ్దితః |

కామకోటి శ్శ్రుతోమోక్షః పురాషార్ధ చతుర్ధకః ||

క ఇతి బ్రహ్మణోనామ తదకారో హరస్మృతః |

మకారోరుద్ర ఇత్యుక్తః త్రయఃకామా ఇతిశ్రుతాః ||

తే బ్రహ్మవిష్ణురుద్రాశ్చ కోటివారం యుగేయుగే |

యద్బిలాదుద్గతాస్తస్మా త్కామకోటి బిలాత్మికా ||

సా కాంచ్యాం పరమాకాశః కామకోటిరితి స్మృతః |

అథవా కేతి విద్యోక్తా వేదవేదాంతరూపిణీ ||

మేతిలక్ష్మీ ర్విభూతిస్యాత్తేతుయన్నే త్రకోటిజే |

కామకోటిరితిఖ్యాతా కాంచ్యామీశకుటుంబినీ ||

యత్ర తేషా మవస్థానం శ్రేయసే జగతాంయతః |

కామకోష్ఠాఖ్యయాచాపి ప్రసిద్ధి మగమద్బిలం ||

ఏతేషా మాదిపీఠ త్వా దాదిపీఠంచ విశ్రుతమ్‌ ||

[పుట 252 253 శ్లో|| 73-87]

వీటి తాత్పర్యమిది : - కంచియందు పరదేవతా చిదాకాశరూపిణిగా ఉంటుంది. అందువల్లనే ''కామకోటి''అను పే రాపరదేవత కిచట ప్రసిద్ధమైనది. ఏ ప్రాణి ఐనప్పటికి ఇచట ఏ కోరికతో ధర్మానుష్ఠానం చేసినా అది ఒక్క మారే ఐనా కోటిరెట్లుగా ఫలాన్నిస్తుంది. గనుక ఇచట బిలమునందు చిదాకాశరూపిణియైన పరదేవత కామకోటి అని ప్రసిద్ధి నందినది. కాముడు కామేశుడు. (రాజాధిరాజాయ.................. నమః) అతడు ధనదుడు. దాన్ని కోటిగా ఇచ్చు పీఠశక్తికే కామకోటి అనిపేరు. పశుపత్నీ సుతాది కామములు బహువిధము లున్నవి. అట్టి కామములు కోటిగా ప్రసాదించు చిదాకాశ రూపిణికే కామకోటి అని పేరు. నాదబిందువులతో కలిసి ఉన్న ఆకాశరూపిణి బ్రహ్మవిద్యా స్వరూపిణియై కంచిలో బిలరూపిణిగా ఉండి కంచిలో ప్రత్యక్షంగా మోక్షాన్ని ఇస్తుంది. రుద్రుని తృతీయ నేత్రాగ్నిచే కాముడుదగ్ధుడైనాడు. కాని యీ పరదేవత కరుణాకటాక్షములచే కాములు కోటిసంఖ్యలో సృష్టింపబడ్డాడు. కనుక కామకోటి, పురుషార్ధములలో కామము మూడవది. దాని తరవాతిదగు మోక్షము కోటిశబ్ధంతో చెప్పబడుతోంది. కనుక 'కామకోటి' అనగా నాలుగవదగు మోక్షపురుషార్ధమని తెలియవలెను. క కారము బ్రహ్మను తెలుపుతుంది. అందలి ఆకారం విష్ణువును చెపుతుంది. మకారంచేత రుద్రుడు చెప్పబడతాడు. ఈ త్రిమూర్తులు ప్రతియుగంలోను కోటిమారు లే బిలాకాశం లోంచి ఉద్భవిస్తూ ఉంటారో ఆ చిదాకాశానినే 'కామకోటి' అని పేరు.

కకారం విద్యయందు చెప్పబడిన వేద వేదాంతరూపిణియైన పరదేవత. మకారం లక్ష్మివిభూతి. ఈ రెండును ఏ దివ్య శక్తియొక్క కంటి కొనలయం దుద్భవించాయో ఆ దేవతే కామకోటి. ఆమె మహాశంభు కుటుంబినిగా కంచిలో ఉంటుంది. లోకముల శ్రేయస్సే ఆ ఉనికికి నిదానం. ఆ బిలమే కామకోష్ఠ మనే పేరుతో ప్రసిద్ధినందింది. ఇన్ని శక్తుల కిది ఆదిపీఠం కావటంచేత ఆదిపీఠంగా ప్రసిద్ధినందింది.



కామకోటిపీఠం-పౌరాతన్యం

మార్కండేయ పురాణాంతర్గత కామకోటి మహిమా దర్శమునందిట్లున్నది.

తేషు చా ష్టాదశ శ్రేష్ఠాన్యేషు పీఠత్రయం వరం |

తత్త్రయే కామరాజాఖ్యం ప్రథమం హి ప్రశస్యతే ||



త త్పీ ఠే వాగ్భవం కూటం హయ గ్రీవేణ పూజితం

జాలన్ధ్రాఖ్యం ద్వితీయంతు మధ్యకూటం మనోభవం ||



భృగుణాభ్యర్చితం పీఠం జ్వాలాముఖ్యాంతు తద్యిదుః |

ఓడ్యాణాఖ్యం తృతీయంతు పరాబీజ స్వరూపకం ||



తత్పీఠం కామరూపే7స్తి వ్యాసే నో పాసితం సదా |

ఏవం పీఠత్రయం శ్రేష్ఠం-సర్వ పీఠోత్త మోత్తమమ్‌ ||



ప్రాగుక్తం కామరాజాఖ్యం కాంచీక్షేత్రేహి వర్తతే |

తత్పీఠం కామరాజాఖ్యం కామకోటీతి విశ్రుతమ్‌ ||

----- ----- ----- -----

[2]

కామానాం వర్ణ తాత్పర్యాత్తత్కోటి గుణసంఖ్యయా |

కామకోటివిఖ్యాతం కామకోష్ఠ ధరాతలమ్‌ ||

కామకోటిః శ్రుతో మోక్షః పురుషార్ధ-చతుర్థకః ||

(వి.వి. సం. పుట-15)

అనగా శక్తిపీఠాలలో శ్రేష్ఠములైన పదునెనిమిదింటిలో మూడు ముఖ్యమైనవి. పంజాబునందలి జలంధర్‌లోని 'జ్వాలాముఖి పీఠం- అస్సాంలోని కామరూప పీఠం-కంచిలోని కామరాజపీఠమే కామకోటిపీఠంగాను ప్రసిద్ధమై ఉన్నవి. కామకోటి పీఠమును హయగ్రీవు డర్చించాడు. హయగ్రీవునకు కంచికిగల సంబంధం ఇంతకుపూర్వమే ఈ గ్రంథంలో వివరింపబడినది.

''నిజశిష్యపరంపరా మాకల్పం కాంచీపీఠాది తత్తత్పట్టణ స్థాపినీంకృత్వా తన్మూలాదేవ సకలశిష్యేభ్యో మోక్ష మార్గోపదేశం.''

(ఆనందగిరిశంకర విజయం-66వ ప్రకరణం)

సర్వజ్ఞ పీఠం

భూమేఃప్రదక్షిణం కృత్వా రాయసేతు మవాపసః |

స్నాత్వా తీర్థే యథావత్తై శ్శిషై#్యస్సహ యతీశ్వరః ||

గంగాతోయాభిషిక్తంచ రామనాథం ననామ సః |

తతః కాంచీపురం గత్వా సర్వజ్ఞో యతిపుంగవః ||

సర్వజ్ఞపీఠమారోడు మైచ్ఛత్తత్ర విరాజితం ||

- గోవిందనాథుని శంకారాచార్య చరిత్ర

(1926లో తిరుచూరు, మంగళోదయం ప్రెస్సులో ముద్రితం)

ఉపయాత్సు బుధేషు సర్వదిగ్భ్యః

ప్రదిశన్నాశు పరాభవం య ఏభ్యః |

 

విధృతాఖిలవిత్పదశ్చ కాంచ్యా

మధృతార్తిః స దిశేచ్ఛ్రియం చ కాంచిత్‌ ||

(గురు రత్నమాలిక 30)

కాంచ్యాం - కాంచీనగరే, అధృతార్తిశ్చ - లీలయైవ సర్వాన్‌ విజిత్యైవేత్యర్థః | విధృతాఖిలవిత్పదః ఆరూఢ సర్వజ్ఞ పీఠ ఇతిబోధ్యం-

[సుషమ - 30వ పుట]



స్వకాశ్రమే-కాంచ్యాం-సిద్ధిం-ఆప.

ఉత్తర దక్షిణ భారతదేశంలోని శివరహస్య ప్రతులన్నీ ఏకవాక్యంగా; స్వకాశ్రమే - కాంచ్యాం - సిద్ధిం - ఆప - అని స్పష్టంగా ఉద్ఘోషించుతున్నవి. కాశీలోని మహాపండితు లందరు, కాశీమహారాజు గ్రంథాలయంలోనిది, మహాపండితులైన ''ధర్మపాణ'' శ్రీ ద్రవిడ లక్ష్మణశాస్త్రి మహోదయుల గృహంలో నిది - రెండు శివరహస్య వ్రతులను కాశీలోని రామతారక మఠంలోని వ్రాతప్రతిగా ఉన్న ఆనందగిరి శంకర విజయం, మార్కండేయ సంహిత మొదలైన ప్రమాణాలతో ఆదిశంకరులు కంచిలో తమకు ప్రత్యేకంగా మఠం కల్పించు కొన్నారని కంచిలోనే విదేహముక్తి నందారని వివరిస్తూ కామకోటిపీఠ పౌరాత్యాన్ని, ఔన్నత్యాన్ని - బహుధా ప్రస్తుతించారు.

మైసూరు మహారాజావారు 1950లో ప్రచురించిన శివరహస్య ప్రతిలో ఈ పాఠమే ఉన్నది.

చిత్సుఖాచార్యుల బృహచ్ఛంకర విజయం ఇలా స్పష్టం చేసింది.

వాణీం విజత్య చ వియద్విశదాభ దేహాం,

సర్వజ్ఞ పీఠ మధిరుహ్య చ తత్ర కాంచ్యాం |

 

విద్వద్వరార్చితపదో యతిసార్వభౌమో,

దేవ్యాః పురం పరతరే పురుషే విలిల్యే ||

 

ప్రాచీన శంకర విజయం ఇలా నిశ్చయించింది.

 

సర్వజ్ఞ పీఠ మధిరుహ్య తతస్త దగ్రే

మిశ్రా9 విజిత్య సహసోపనతా9 ప్రయాగాత్‌ |

అధ్యాస్త కాంచి మభిమండిత కామకోటి

పీఠో నిజ మవాప్య స శారదాఖ్యమ్‌||

కేరళీయ శంకరవిజయంలో ఇలా ఉన్నది.

ఇతి నిశ్చిత్య మనసా శ్రీమా9 శంకర దేశికః

మఠే శ్రీ శారదాభిఖ్యే సర్వజ్ఞం న్యదధాన్మునిం |

సురేశ్వరం వృత్తికృతం అంతికస్థం సదా 77దరాత్‌ ||

సమం సంస్థాప్య తసై#్తస్వం వక్తుం భాష్యం సమన్వశాత్‌ ||

స్వశిష్య పారంపర్యేణ లింగం స్వం యోగనామకం||

సేవయేనం కామనకోటిపీఠే సార్థం వసేతి చ ||

ఇత్యాజ్ఞాం సంప్రదాయా సై#్త త్యక్త పీఠ మఠ స్పృహః||

కామాక్ష్యా నికటేజాతు సన్నివిశ్వ జగద్గురుః |

దేహిభిర్దుజంభేజే దేహంతత్రైవ సంత్యజన్‌ ||

అఖండజ్యోతి రానందం అక్షరం పరమంపదం |

సఏవ శంకరాచార్యో గురుర్ముక్తి ప్రదస్సతాం ||

అవ్యాప్తి మూర్తిచైతన్యమివ తత్రైవ తిష్ఠతి |

వ్యాసాచలీయ శంకరవిజయంలో ఇలా ఉన్నది.

ఏవం నిరుత్తరపదాం సవిధాయ దేవీం

సర్వజ్ఞపీఠ మధిరుహ్య మఠేస్వక్లప్తే |

మాత్రాగిరామపి తథో పగతైశ్చమిశ్రైః

సంభావితః కమపి కాలమువాసకాంచ్యాం ||



ప్రాగష్టమాద్విదిత వేద్య ముదూఢబాల్యం

సర్వజ్ఞసంజ్ఞ మఠ హంసిత మాత్మనైవ |

శ్రీ కామకోటి బిరుదే న్యదధాత్స్వపీఠే

గుప్తం స్వశిష్యతిల కేన సురేశ్వరేణ |

 

ఇత్థం సశంరుగురుః కృతకృత్యభావాత్‌ |

ప్రకాశ్య నిగమాన్తగిరాం నిగూఢాన్‌.

కాంచ్యాం విముచ్య వపురాదృత మిచ్ఛయైవ

స్వసై#్యపధామ్ని పరమే స్వత ఏవ లిల్యే ||

మార్కండేయ సంహిత ఇలా స్పష్టం చేస్తోంది.

కాంచ్యాం శ్రీకామకోటీంకలిమల శమనీం కల్పయిత్వాసురేశే |

శ్రీవిద్యారాజ పీఠార్చన మహిత మహాసామ్రాజ్యలక్ష్మీం ||

 

సంవేశ్యాత్మీయశిష్యే సకలభువనసమ్మోదహే తోర్మహాత్మా |

చిద్రూపస్వానుభూతిం భజతి భవ మహాంబోధిసంతారుణాయ ||

'కమలినీ కలహంస' 'తంత్రశిఖామణి' మున్నగు గ్రంథకర్త, రాజచూడామణిమఖి తన శంకరాభ్యుదయ కావ్యంలో ఇలా వ్రాశాడు.

కంపాతీరనివాసినీ మనుదినం కామేశ్వరీమర్చయన్‌ |

బ్రహ్మానంద మవిందత త్రిజగతాంక్షేమంకర శ్శంకరః ||

రామభద్రదీక్షితుడు తన పతంజలి చరిత్ర అనే గ్రంథలో పతంజలి - గౌడపాదులు - గోవింద భగవత్పాదులు చరిత్రలను వ్రాసి గోవింద భగవత్సాదులు ముక్తి నొందిన తర్వాత శ్రీ శంకరులను గూర్చి ఇలా వ్రాశాడు. ఈతడే 'జానకీపరిణయ' గ్రంథకర్త.

అద్వైతభాష్య ముపకల్ప్య దిశోవిజిత్య |

కాంచీపురేస్థితి మవాప సశంకరార్యః || 8వ అధ్యా 71 వ శ్లో.

(కావ్యమాలా ప్రచురణ, నిర్ణయ సాగరప్రెస్‌, బొంబాయి. నెం.51)

సమతిష్ఠిపదా హిమాద్రి సేవ్యం

క్రమశో ధర్మ విచారణాయ దివ్యం |

అధి కాంచి చ శారదా మఠం

యో 7భ్యధికం న స్సుఖ మాతనోతు సో7యం ||

(గురు రత్నమాలిక 31)

సుషమలో ఇలా ఉన్నది :- ఆ హిమాద్రి సేవ్యం పుణ్యభూమౌచ ఆసేతో ః ఆ చ శీతాద్రేః అఖిలవర్ణ వంద్యం శారదామఠం తదాఖ్యం మఠం చ | చాత్‌ కామకోటీతి పీఠం చ | అధికాంచి కాంచీపురే సమతిష్టి పత్‌ ఇత్యర్థః | సో 7య మస్మ దాచార్యః కామకోటి పీఠాధిపతిః జగద్గురు రిత్యర్థంః||

పరికాంచిపుర పరే నిలీనః (33)

సుషమ :- పరికాంచీపురం కాంచీనగర ఏవ పరే పరస్మి9 చిద్వ్యోమని నిలీనః లయం ప్రాప్త సః సద్గురుః ||

కంచి కామాక్షీదేవి ఆలయంలో పురుషాకృతి సమమైన శిలామూర్తిగా శ్రీఆదిశంకరుల విగ్రహం వారి సమాధి స్థానమున ఉన్నది. ఈ శిల్పం భారతదేశంలోని శంకర విగ్రహా లన్నింటిలో అతి ప్రాచీన శిల్పం. దీనిలోనే ఆరుగురు శిష్యుల శిల్పం ఉన్నది. అందులో నలుగురు ఏకదండ సన్న్యాసులు.

ఈ విషయాలేకాక ఇంకా అనేక సంప్రదాయాంశాలు కూడ 'ది ట్రేడిషనల్‌ ఏజ్‌ ఆఫ్‌ శ్రీ శంకరాచార్య అండ్‌ ది మఠ్స్‌' అనే గ్రంథంలో వివరింపబడి ఉన్నవి. ఇకముందు ఈ ఆంగ్లగ్రంథం - ఈ పుస్తకంలో - 'ఆదిశంకరుల మఠసంప్రదాయ చరిత్ర' అనే పేరుతో ఉల్లేఖించబడుతూ ఉంటుంది.

మదరాసులోని ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో హూజ్‌ లిఖిత సంస్కృత ప్రతుల రిపోర్టు పార్టు III (భారతీ సన్న్యాసి సంప్రదాయ వివరణ సందర్భంలో 2146 I ) ఇలా ఉన్నది. (మదరాసు గవర్నమెంటు ప్రెస్సులో 1905 లో ముద్రింపబడి ప్రచురింప బడినది)

అగచ్ఛత్‌ స్వేచ్ఛయా కాంచీంపర్యటన్‌ పృథివీతలే |

తత్ర సంస్థాప్యకామాక్షీం జగామ పరమంపదం ||

కుడలి (శృంగేరి) గురుపరంపరను తెలిపే గ్రంథాన్ని ఆ మఠంవారే మైసూరులోని శేషాద్రిప్రెస్సులో ముద్రించారు. దానిలో పై దానికంటె కొద్ది మార్పుతో ప్రచురింపబడినది.

స్వేచ్ఛయా పర్యటన్‌ భూమౌ య¸°కాంచీపురంగురుః |

తత్రసంస్థాప్య కామాక్షీం దేవీంపరమగాత్పదం||

మహోపాధ్యాయ, అభినవ పండితరాజ, విద్వత్కవిసార్వభౌమ. వైయాకరణకేసరి, విద్యావాచస్పతి, ధర్మస్థాపక, బ్రహ్మశ్రీ పుల్య ఉమామహేశ్వరశాస్త్రిగారు సంస్కృతంలో రచించిన అనేక గ్రంథాలతోపాటు (తూర్పుగోదావరి జిల్లా ముంగొండ అగ్రహార వాస్తవ్యులు. స్వతంత్ర భారతంలో రాష్ట్రపతి వార్షిక సమ్మానాన్ని పొందారు) తాము సంస్కృత భాషలో రచించిన 'నవశంకరవిజయార్యా సహస్రం' అనే గ్రంథంలో ఆదిశంకరులు కంచిలో సర్వజ్ఞపీఠాధిరోహణం చెయ్యటం, కామకోటి పీఠాధిపత్యం వహించటం, కంచిలోనే విదేహముక్తినొందిన అంశాలను స్పష్టంగా వివరించారు. ఈ గ్రంథానికే 'విద్వత్కవి సార్వభౌమీయం' అనే పేరున్నది. ఈ గ్రంథస్థానాంశాలకు అనేక విధములైన శంకర చరిత్రల నుండి 51 పుటలలో ప్రమాణవచన సంగ్రహం అనే పేరుతో శ్లోకాలను ఎత్తిచూపారు. వీరు తమ 70 సంవత్సరాల వయస్సులో, 1958, హేవిలంబి మాఘ శుద్ధ పంచమినాడు ఈ గ్రంథరచనను పూర్తిచేశారు. ఇది వీరి అంతిమ రచన.

దీని పీఠికలో ఈ గ్రంథ విషయసంగ్రహాన్ని పేర్కొంటూ ఆర్షవిద్యాభూషణ, శ్రీ జటావల్లభుల పురుషోత్తం, ఎం. ఏ., గారు ఇలా పేర్కొన్నారు.

52వ పుట :- శంకరస్య కాంచీగమనం ఉగ్రకామాక్షీం సౌమ్యమూర్తీం కృత్వా స్వనిర్మితే శ్రీచక్రేతస్యాః ప్రతిష్ఠాపనమ్‌. దేవభూదేవగృహ నిర్మాణాయ చోలాధిపం ప్రతి శంకరాదేశః. శంకరకృత కామకోటి పీఠ నిర్మాణం. యోగలింగ ప్రతిష్ఠాపనంచ. స్వీయ నివాసాయ శంకరేణ కాంచ్యాం శారదాపీఠ స్థాపనం| తత్రశాస్త్రవాదే నిఖిల దేశాగ తానాం ఋధేంద్రాణం శంకరాత్పరాజయః, శంకరస్య సర్వజ్ఞ పీఠాధిరోహణ వృత్తాంతః ||

62వ పుట - కాంచీపుర్యాం కలి 2625 వత్సరే శంకరా చార్యస్య దేహత్యాగః |

99వ పుట :- ''కామకోటిపీఠం నకేవల మాదిశంకర విహితం, కింతు తదధిష్ఠితంచ, ఆఢ్యంచ, సకల మఠాదీశ పూజనీయతమంచ'' ఇతి సకల బుధహస్తాక్షర భాసురస్య పత్రస్య శ్రీచరణ సవిధే సమర్పణమ్‌.

ఈ తుది అంశం కాశీలో ప్రస్తుతం కామకోటి పీఠాధిష్ఠితులు పూర్ణయాత్రా సందర్భంగా ఉన్నప్పుడు జరిగిన సంగతిని స్పష్టం చేస్తోంది. ఈ విషయాలు మరికొన్ని ఈ గ్రంథంలోనే 'పూర్ణ - విజయ - యాత్ర' అనే అధ్యాయంలో వివరింపబడుతవి.

చివరకు 'శంకర విజయవిలాసం'లో కూడ 25వ అధ్యాయంలో (75, 76, 77, 78 పుటల్లో) దాదాపు 50 శ్లోకాలు శంకరుల కాంచీ నగర పునర్నిర్మాణ విశేషాలు వర్ణింపబడివి. కామాక్షీదే వ్యాలయంలో శ్రీచక్ర నిర్మాణాదికాన్ని వివరించింది. అందులోనే శ్రీ శంకరుల సర్వజ్ఞ పీఠారోహణాంశం కూడ వ్రాసి ఉన్నది. ఈ గ్రంథానికే 'చిద్విలాసీయం' అనే వ్యవహారం కూడ ఉన్నది.

ఆరురోహాథ సర్వజ్ఞ పీఠం దేశిక పుంగవః || 60వ శ్లో ||

మాధవీయం అని చెప్పబడే సంక్షేప శంకరవిజయం కూడ ఈ అంశాన్ని పేర్కొనక తప్పలేదు. 15 అధ్యాయంలో 4, 5 శ్లోకాలివి.

ద్రవిడాంశ్చ తతోజగామ కాంచీనగరీం హస్తిగిరే

ర్నితంబ కాంచీం |

సురధాయ స తత్రకారయిత్వా పరవిద్యాచరణా(శరణా)ను

సారి చిత్రం ||

అపవార్య చ తాంత్రికాన తానీ ద్భగవత్యా శ్శ్రుతి

సమ్మతాం సపర్యామ్‌ ||

ఇందలి 'పరవిద్యా' శబ్దం 'సౌందర్యలహరి'లోని 11వ శ్లోకంలో చెప్పబడిన శ్రీచక్రస్వరూపాన్ని నిర్దేశించుతోంది. కంచికామాక్షీదేవి విషయమిది అని స్పష్టము.

ఐతే ఈ చిద్విలాసీయ, మాధవీయాలు రెండూ శంకరుల విదేహముక్తి విషయాన్ని మోక్షపురిఐన కాంచీక్షేత్రం నుంచి తప్పించినది.

ఇందులో మొదటి గ్రంథం బదరి అని పేర్కొంటే (94 వ పుట 31 అధ్యా. 25 శ్లో) రెండవది కేదారం అని చెప్తోంది. (వావిళ్ళ వారి ప్రతి 442 వ పుట 100 శ్లో) ఈ రెండిటికి మధ్య సుమారు 80 మైళ్ళదూరం ఉన్న సంగతి ప్రసిద్ధమే గదా : ఈ రెండుపుస్తకాల్లో ఈ ఒక్క భేదమేకాదు. మొదటి గ్రంథం శంకరుల కాంచీకార్యక్రమం. నగరనిర్మాణం, శ్రీచక్ర ప్రతిష్ఠ, సర్వజ్ఞ పీఠాధిరోహణం మొదలైన అంశాలు 50 శ్లోకాల్లోచెప్తే రెండవ పుస్తకం కంచినిగూర్చి చెప్పలేక తప్పించుకొంటూ పైన చూపిన శ్లోకాల్లో చెప్పినట్టు నటించింది. అంతే కాక పైపుస్తకానికి పోటిగా సర్వజ్ఞపీఠ చరిత్రను కాశ్మీరానికి తరలించి అక్కడ యాభై అరవై శ్లోకాలలో వర్ణించినది.

శ్రీ పుల్య ఉమామహేశ్వరశాస్త్రిగారి (ఈ అధ్యాయంలోనే చెప్పిన) గ్రంథస్థాంశాలను పేర్కొంటూ శ్రీ జటావల్లభుల పురుషోత్తంగారు 76, 77, 78, 79 పుటలను గూర్చి వ్రాసిన వాక్యాలను చదవండి.

''తత్ర విజయంప్రాప్య పున ర్హిమగిర్యాగమనం, కాశ్మీరరాజ నికటస్థ అష్టపండితదిగ్గజానాం పరాజయః, ఆదిశంకరా దష్టత్రింశ జగద్గురొరస్య కామకోటిపీఠాధీశస్య సర్వజ్ఞపీఠాధిరోహణం, కలిగిత 4193 వత్సరే కర్తవ్యాభావ శేషాద్దత్తాత్రేయ దర్యాం జగద్గురో స్తిరో ధానం సాక్షాత్తచ్ఛిష్య భూతభట్టోద్భట విరచిత శంకరేంద్రవిలాసాఖ్యే గ్రంథ ఏతచ్చరితస్య పరిదర్శనమ్‌| కైశ్చిద్గ్రంథకర్తృభి రుభయ శంకర జీవితాంశ సంకరః కృతః | అస్మిన్నపి విషయే అభినవ కాళిదాసకృతస్య గ్రంథస్య అప్రామాణ్యం ||''

దీని తాత్పర్యం స్పష్టమేగదా : కామకోటి పీఠాధిపతులైన 38వ ఆచార్యులు శ్రీ అభినవశంకరులు కాశ్మీరంలో సర్వజ్ఞ పీఠాధిరోహణం చేశారు. హిమాలయాల్లోని దత్తాత్రేయగుహలో ప్రవేశించారు. కొంత మంది గ్రంథకర్తలు ఈ చరిత్రను ఆదిశంకరుల చరిత్రతో కలిపి సంకరం చేశారు. ఈ విషయంలో అభినవ కాళిదాస గ్రంథం అప్రమాణం. అంటే మాధవీయ శంకరవిజయాన్ని అభినవ కాళిదాస గ్రంథం అని పరిశీలనాదక్షులైన పండితులు పేర్కొంటారు. ఈ సంగతి ఈ గ్రంథంలోనే తుదిని 'తెలిసికోదగిన అంశాలు' అనే అధ్యాయంలో సప్రమాణంగా వివరింపబడి ఉన్నది.

ఇప్పటికి, మాధవీయ కాశ్మీరచరిత్ర రహస్యం బయటపడినది. బదిరి, కేదారముల సంగతి ఉన్నది.

శృంగేరీవారికి పరమ ప్రమాణమైన అధికారికమైన చరిత్ర గ్రంథం మరొకటి ఉన్నది. క్రీ.శ. 1705-1741లో శ్రీ శృంగేరీ పీఠాధిపతులుగా ఉన్న శ్రీ సచ్చిదానంద భారతీస్వామివారి ప్రత్యక్షపర్యవేక్షణలో వారే 'నిర్మాపయిత'లుగా ఉండి వారి పీఠచరిత్రను తెలిపే గురువంశకావ్యాన్ని రచింపజేశారు. దానికి ఆ గ్రంథకర్తచేతనే వ్యాఖ్యానం కూడ వ్రాయించారు. మూలము - వ్యాఖ్య ఒకరే వ్రాశారు గనుక పీఠాధిపతులు నిర్మాపయితలుగా ఉన్నారు గనుక ఇంతకంటే ఆ పీఠచరిత్రకు ప్రమాణగ్రంథం మరేమికావాలి ? అందువల్లనే 1968లో కడప రాయలు అండ్‌ కో వారి సౌజన్యంతో, 'బ్రహ్మవిద్యాసింహాసనము' అనే పేరుతో ప్రచురించుకొన్న శృంగేరీపీఠ చరిత్ర గ్రంథంలో ప్రతిపుటలోను గురువంశకావ్య ప్రామాణ్యాన్ని ఉద్ఘోషించుతూ ఉల్లేఖించుకొన్నారు.

ఈ గురువంశకావ్యంలో ఆదిశంకరుల విదేహముక్తిని గూర్చి 3వ సర్గలో 68-70 శ్లోకాలలో వివరణ ఉన్నది. అచట వ్యాఖ్యలో తత్ర = మాహురీపురే, భాషమానౌ = సంలపంతౌ, తౌ దత్తాత్రేయ శంకరాచార్యౌ. అని ఉన్నది.

ఇచట పేర్కొనబడిన మాహూరీపురి హైదరాబాదు-అదిలాబాదు మధ్యలోని కిన్వట్‌ స్టేషనుకు 30 మైళ్ళ దూరంలో ఉన్నది. ఘోరక్‌పూరులోని కల్యాణకల్పతరు వారి 1957లోని తీర్థాంకతో 239 వ పుటలో ఈ మాహూరి పురిని గూర్చి వివరిస్తూ అచటి దత్తాత్రేయాశ్రమాన్ని వర్ణిస్తూ అచటి విశేషాలు విపులీకరింపబడినవి.

కాగా, గురువంశకావ్యం మాహూరీపురి, చిద్విలాసీయం బదిరి, మాధవీయం కేదారం - అని తెలిసింది. ఈ మూడు ఈ అంశాన్ని కంచినుండి చరిత్రను మరలించినవేకాని వీటిలో పరస్పరం ఏకవాక్యత లేదు. అది ఇచట గమనార్హమైన అంశం.

పై గురువంశ కావ్యంలోనే 1 అధ్యా. 6 శ్లోకంలో ''ఆర్యానాంకుల ముపదర్శితం కవీంద్రైః'' అని ఉన్నది. దీని వ్యాఖ్యలో, ఆర్యానామితి - కవీంద్రైః = ఆనందగిరి యతీంద్రాదిభిః, ఉపదర్శితం = ప్రకటీకృతం, ఆర్యానాం = శ్రీమదాచార్యానాం కులపరంపరాం || కాగా 18వ శతాబ్దంవరకు శృంగేరీవారికి ఆనందగిరీయమే పరమప్రమాణ గ్రంథంగాని మాధవీయ, చిద్విలాసీయాలు కావని స్పష్టమైంది. ఈ రెండును వీరి అభీష్టసిద్ధికై 18వ శతాబ్ది తరువాత అవతారములు మార్చుకొన్న గ్రంథములు. కాని ఆనందగిరీయంలో స్పష్టంగా పేర్కొనబడిన శ్రీశంకరుల విదేహముక్తి విషయం మొట్టమొదట ఈ గ్రంథకర్తయే నేర్పుతో మార్పుచేశారనేది మరింత సుస్పష్టము.

గురువంశ కావ్యం

ఈ గురువంశకావ్యం 19 సర్గల గ్రంథమట. అప్పటి పీఠాధిపతులు 15 సర్గలవరకు గ్రంథకర్తచేతనే స్వయంగా వ్యాఖ్యానం వ్రాయించారట.

కాని ఈ గ్రంథాన్ని ముద్రించినపుడు శ్రీరంగం వాణీ విలాస ప్రెస్సు అధిపతులు (గురుభక్తశిఖామణి - శృంగేరి) శ్రీ టి. కె. బాలసుబ్రహ్మణ్యయ్యరుగారు మొదట ఉపోద్ఘాతంలో అనేకాంశాలు వ్రాశారు. దీని ముద్రణ ఆరంభించి ఎన్నో సంవత్సరాలు ఆ పని ఆపినారట. ప్రసిద్దములనై శంకర విజయాలలోని ఆదిశంకర చరిత్ర కంటె ఇందులో ఆదిశంకర చరిత్ర భిన్నంగా ఉన్నదని సంశయించారట. శంకరులు కాశీలో ఐదు మఠాలు స్థాపించటం మొదలైన అంశాలను కూడ వారా ఉపోద్ఘాతంలో వ్రాశారు. అలాగే విద్యారణ్యచరిత్రలో కూడ చాలా భేదాలున్నాయని వ్రాశారు. మొత్తంమీద వ్యాఖ్యతోకూడ 7 సర్గలను మాత్రం ముద్రించి అందలి చారిత్రక సత్యాన్ని పండితుల నిర్ధారణకు వదులుతున్నానని చెప్పుకొన్నారు

1966లో గురువంశకావ్యం పునర్ముద్రణము

'శంకరగ్రంథ రత్నావళి' పేరుతో ఎన్నో గ్రంథాలను అచ్చువేసిన, వారు ఈ గ్రంథాన్ని పూర్తిగా అచ్చువేయలేక ఆనాడు వదలి ఉండరు. ఆనాడు లోకంలో ఆ గ్రంథస్థాంశాలపై వ్యతిరేకతను శంకించిఉంటారు. ఈనా డీ గ్రంథాన్ని పూర్తిగా ముద్రించారు.

క్రొత్త ముద్రణ ఆశయం

ఇందులో ప్రధానమైనది ఆనాటి పీఠాధిపతులు గ్రంథకర్త చేతనే వ్రాయించిన వ్యాఖ్య తీసివేయబడినది. ఈ పనిని ఆయన చేయలేకపోయి ఉంటారు.

ఈ వ్యాఖ్యానం తీసివేయటంవల్ల-ఆనందగిరీయం పేరు. మాహూరిపురి- రెండు కనుపించకుండగ పోతవి. అందులో ముఖ్యంగా ఆనందగిరీయాన్ని విశేషంగా దూషిస్తూ వీరు గ్రంథాలను ప్రచురించుతున్నారు. వీరు ప్రమాణ గ్రంథానికే ప్రమాణగ్రంథమైన ఆనందగిరీయాన్ని నిందించుతూ ఉంటే పై విషయాన్ని ఎవరైనా ఎత్తిచూపితే శృంగేరీ గ్రంథకర్తలు నిరుత్తరులై నిలబడవలసివస్తోంది. కనుక ప్రాథమికంగా ఈ ప్రయోజనాన్ని ఆశించిఉంటారు.

లేనిచరిత్రపై మోజు

1966 లో ప్రచురించిన 'శరదాపీఠం' అనే గ్రంథంలో (తెలుగు) 26వ పుటలో ''ఆచార్యులవా రల్లక్కడి కైలాసమునుండి తీసుకొని వచ్చినట్లు చెప్పెడు ఐదు చంద్రమౌళీశ్వర స్ఫటికలింగములలోను... శృంగేరీమఠమునకై ఒక చంద్రమౌళీశ్వరలింగమును సురేశ్వరులవారి కిచ్చిరి.'' అని వ్రాయబడి ఉన్నది.

ఆ గ్రంథములోనే 126వ పుటలో శ్రీ శంకరాచార్యాష్టోత్తర శతనామావళిలో ''కైలాసయాత్రా సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయనమః'' అని వ్రాసికొన్నారు.

ఈ అంశము సంప్రదాయసిద్ధమైన చరిత్ర. వీరి చరిత్ర దీనికి పూర్తిగా భిన్నము. కాని సాహసించి ఈ చరిత్రనే తమ కన్వయించుకొని ప్రచారం చేసికొంటున్నారు. మంచిదే.

ఈ గురువంశకావ్యం వీరశైవాచార్యుడైన రేవణ సిద్ధునివల్ల, వీరికి చంద్రమౌళీశ్వర లింగము లభించినట్లు చెప్పుచున్నది. ఈ అంశం కూడా వ్యాఖ్యానంలోనే స్పష్టపడినది.

గు. వం. కావ్యం 3సర్గ 33 శ్లో|| సుసిద్ధదత్తం అనే పదానికి, రేవణసిద్ధ మహాయోగినాదత్తం - అని ఉన్నది.

కనుక రేవణసిద్ధ పదానికి అన్యార్థకల్పనం కూడ 1966 ముద్రణలో ఆవశ్యకం అనుకొన్నారు.

శైవాచార్యులు రేవణసిద్ధయోగి

గోవింద భగవత్పాదులు ఒకటేనా?

రేవణసిద్ధు లనగా గోవిందభగవత్పాదులని అర్థం చెప్పుతూ పాణిని (5-2-100) సూత్రంవల్ల ఈ అర్థం రాబట్టినట్టు వ్రాసికొన్నారు. అలా చూచినా 'పామాదులలో' రేవాశబ్దం లేదు. శాస్త్రార్థం చేస్తే అగతిక స్థితి ఏర్పడుతుంది. పృషోదరాదిన్యాయాన్ని ఆశ్రయించినా శిష్టప్రయోగం కావాలి. ఇన్ని గ్రంథాలు వ్రాసిన ఆదిశంకరులు నాగురువు రేవణసిద్ధుడని చెప్పితేనే ఈ అర్థానికి గతిగలుగుతుంది. అదిలేదు. లేకపోతే పై కల్పన మనుస్మృతి (4-256) కి కూడ విరుద్ధము.

ఇంత ద్రావిడ ప్రాణాయామం చేసినా సంప్రదాయ చరిత్రకు వీరి క్రొత్త అర్థానికి కూడ పొంతకుదరదు. వీరికి మాధవీయం ఈ అంశంలో అక్కరకురాలేదు. చిద్విలాసీయాన్ని ఆశ్రయించితే అందులో వీరికి 'ఇష్టంకాని' 50 శ్లోకాలలో ఆదిశంకరులు కంచిలో సర్వజ్ఞపీఠాధిరోహణవర్ణన ఉన్నది. అగతికమై దానినే ఆశ్రయించారు. ఈ గ్రంథం కృతక పాఠాలకు పుట్టినిల్లు. అందువల్ల (1917లో శాస్త్ర సంజీవని ప్రెస్‌, మదరాసులో ముద్రణ) 27వ పుట 9 అధ్యా. 52 శ్లోకాన్ని ఆశ్రయించారు.

పరస్పర ఖండన

ఆ గ్రంథంలోనే ముద్రింపబడిన శివరహస్య శ్లోకాలు పై చూపిన 52వ శ్లోకం పరస్పర విరుద్ధములు. 52 శ్లోకంలోని 'క్రమాత్‌'అనే పదానికి - స్వయంగానే ఆదిశంకరులు కైలాసంనుండి గ్రహించిన చరిత్ర పరస్పర ఖండనాత్మకము.

అంతేకాదు. ఈ చిద్విలాసీయంలోనే శివరహస్యం పాఠం కృతికమైనది ఒకటి ఉన్నది. 'కాంచ్యామధసిద్ధిమాప' అనే పాఠానికి వ్యతిరేకమైన పాఠమిది. ఈ పాఠం కాశీ, కలకత్తాలకు వెళ్ళి ఘోర పరాజయాన్ని పొందింది.

తరువాత 1950లో మైసూరునందు శ్రీ జయచామ రాజేంద్ర గ్రంథ రత్నమాల నెం 32లో 23 వ సంపుటం 200 పుటలో 'కాంచ్యాం సిద్ధిమాప' అని ప్రచురింపబడటంతో పై కృతక పాఠం నిర్జీవమైనది.

దీనికే ప్రస్తుతం విజయవాడలో ఊరేగింపు జరుగుతోంది -

ఫలితాంశం :

ఇప్పుడు కొత్తగా వ్యాఖ్యానం లేకుండా ఈ గ్రంథం ముద్రించటానికి హేతువు వ్యయ ప్రయాసలు భరింపలేకపోవుట గాని లేక మరేకారణంగాని, సమర్థనీయంకాదు. ఇంకా పైన చూపిన వానిని పోలిన కారణా లింకెన్నో ఉండవచ్చును.

కాని గురువంశ కావ్యానికి 'ఆనందగిరీయం' ప్రమాణ గ్రంథమని - ఈ గ్రంథంలోని అంశాన్ని కంచినుండి మొట్టమొదట - మాహూరీపురికి ఈ గ్రంథమే మార్చిందని - సుమారు 12 వ శతాబ్దంలోని వాడగు రేవణసిద్ధునివల్ల లేదా వారి పరంపరలోని వారివల్ల వీరికి చంద్రమౌళీశ్వరలింగము లభించినదని చరిత్ర విస్మరింపదు.

[3]

కనుక ఆదిశంకరుల సిద్ధిస్థానం కంచి అనటానికి ఆనందగిరీయ నిదర్శనంచాలు. ఈ ఆనందగిరీయ ప్రతికొరకు కాశీ, కలకత్తాలకు వెళ్ళనక్కరలేదు. 10-12-1867 వ సంవత్సరంలో తప్పులతడికగా మద్రాసులో ప్రచురింపబడిన ప్రతిలోకూడ 255 వ పుటలో ఇట్లున్నది. భారతదేశంలోని ఏ ప్రతిలోను దీనికి భిన్నమైన పాఠం లేదనేది స్పష్టమే.

''తతఃపరం సర్వలోకగురురాచార్యః.... స్వలోకం గంతువిచ్చుః కాంచీనగరే ముక్తిస్థలే కదాచి దుపవిశ్య స్థూల శరీరం సూక్ష్మేణాంతర్థాయ సద్రూపోభూత్వా, సూక్ష్మంకారణ విలీనం కృత్వా చిన్మాత్రోభూత్వాంగుష్ఠపురుష స్తదుపరి పూర్ణం ఆఖండ మండలాకారానందం ప్రాప్య సర్వజగద్వ్యాపకం చైతన్య మభవత్‌'' (74 వ ప్రకరణం.)

ఆది శంకరులు కంచికామాక్షి దేవ్యాలయం రెండవ ప్రాంగణంలోనే విదేహముక్తి నొందిరనుట సిద్దాంతము.

ఐదు పీఠములు

శ్రీ శృంగేరీమఠాధిపతులైన శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారి నక్షత్రమహోత్సవ సందర్భంలో శ్రీ నూరని, యన్‌. అనంతకృష్ణ శాస్త్రిగారు 'భక్తికుసుమాంజలిని' రచించారు. అది శ్రీరంగం వాణి విలాస ప్రెస్‌లో ముద్రింపబడినది. అందిట్లున్నది.---

'సహస్రాణి సహస్రశోయేరుద్రా అదిభూమ్యాం' శతఇతిరుద్రీయ వాక్యం. శంకరభగవత్పాద ప్రతిష్ఠాపిత తత్తత్ర్పధాన ఉపపీఠాధ్యక్షాన్‌ ధర్మాచార్యానేవ గోచరయతి.

ఆత్మనో దిగ్విజయయాత్రాప్రసంగేన తత్ర తత్ర బహూని పీఠాని భగవత్పాదైః ప్రతిష్ఠాపితాని | సాం ప్రతమపి పరంపరాక్రమేణ కేచన కేచన తపస్వి ప్రవరా అధితిష్ఠం త్యేవ| తత్రచ భగవతః సదాశివస్య పంచాననతా భగవతో గురువర్యస్య సాంతేవాసినః శ్రీదక్షిణా మూర్తేః; సాక్షాత్‌ శ్రీభగవత్పాదస్య సాంతేవాసినః స్థూలశరీరాణి ప్రాచ్య, దక్షిణ, పాశ్చాత్య, ఉదీచ్య, ఊర్థ్వామ్నాయరూపాణి - వా - ప్రథానాని పంచపీఠాని. ఇదంతు నవివాదాస్పదం.

1957 లో ఘోరక్‌ పూరులోని కల్యాణ్‌ ప్రెస్‌వారు ప్రచురించిన 'తీర్థాంక'లో 547 వ పుటలో ఆదిశంకరులు స్థాపించిన పంచ ప్రథానపీఠాలలో కంచికామకోటి పీఠం ఒకటి అని స్పష్టం చేశారు.

యతిసంప్రదాయ పరంపరలో చాతుర్మాస్యారంభంలో సనకాది, వ్యాసాది, పీఠపంచకంవలెనే శ్రీ శంకరాచార్యాది పీఠ పంచకము శాస్త్ర విహితమే ఇది యతిసంప్రదాయసిద్ధమైన అంశం.

ఐదు మఠములు

శృంగేరీ చరిత్రకు ప్రమాణ గ్రంథమైన గురువంశ కావ్యం 3వ సర్గలో 23వ శ్లోకంలో ఇలా ఉన్నది.

వారాణసీం యోగివరోధిగమ్య

భుజైరివ శ్రీహరి రేష శిషై#్యః |

సహాత్మనా పంచమఠా నమీషాం

ప్రకల్ప్యతస్ఠౌ కతిచిద్దినాని ||

దీనికి గ్రంథకర్త వ్రాసిన వ్యాఖ్యలోనే 'ఆత్మనాసహ అమీషాం శిష్యాణాం పంచమఠాన్‌ ప్రకల్ప్య'అని ఉన్నది. అనగా ఆదిశంకరులు కాశీవెళ్ళినప్పుడు సైతం అచట శ్రీమహావిష్ణువు నాలుగు భుజములవలె నున్న నలుగురు శిష్యులకు నాల్గు మఠాలను, తనకు ఒక మఠాన్ని మొత్తం ఐదు మఠాలను నిర్మించుకొన్నారని స్పష్టము.

అనగా ఆదిశంకరులకు మొదటినుండి నలుగురు శిష్యులకు నాలుగు మఠాలను ఏర్పాటు చేసి తమకొక ప్రత్యేక మఠం ఏర్పాటు చేసుకోవాలని వారి సిద్ధాంతం అనేది సుస్పష్టము. కాశీయాత్రలో కూడ వీరీ నియమాన్ని పాటించారనేది విస్మరింపరాని అంశం.

ఈ గురువంశ కావ్యాన్ని గూర్చే 1928 లో మైసూరు ఆర్కియాలజీ డిపార్టుమెంటువారి వార్షిక నివేదికలో మైసూరు ఆర్కియాలజీ డిపార్టుమెంటు డైరెక్టరుగా రీ కావ్యాన్ని గూర్చి ఇలా వ్రాశారు. దీన్ని మైసూరు యూనివర్శిటీ అధ్వర్యాన ప్రచురించారు. దీని 15 వ పుట ఇది.

Guruvamsakavya : History of Teachers of Sringeri Math : Author, Lakshmana Sastry, son of Visweswara Sastry, under the orders of Sri Satchidanand Bharati, disciple of Sri Narasimha Bharati. The Author is contemporary of Soma Sekhara II (1714-1739) Keladi when Sachichidanandha Bharati (1705-1741) adorned the pontifical seat at Sringeri.............. it may be reasonably presumed that the faithfully copied all traditional informations about the successive teachers of Sringeri .......... The Author says that He set up five maths and mentions the names of Sringeri, Kanchi Badari, Kasi, and Jagannadh.

(ప్రెసెప్టర్స్‌ ఆఫ్‌ అద్వైత పుట 377)



మహావాక్యములు

అనంతములైన వేదములలో ఋగ్యజుస్సామాధర్వ భేదంతో నాలుగు వేదాలలోను సంహిత, బ్రాహ్మణ, ఉపనిషద్భేదం ఉంటుంది. మొత్తం 1180 శాఖలలోను అన్ని సంఖ్యగల ఉపనిషత్తులుంటవి. వాటి సారభూతములైన మహావాక్యాలున్నవి. అందును ముఖ్యంగా 108 ఉపనిషత్తుల్ని ప్రథానం చేశారు. వీటిలో 1008 మహాకావ్యాలను ఏర్చికూర్చి శ్రీరామచంద్రుడు తన పట్టాభిషేక సమయాన శ్రీ ఆంజనేయస్వామికి ఉపదేశించాడు. ఇవి అన్నీ జీవబ్రహ్మైక్యమును బోధించుతున్నవి. ఇవి అన్నీ మహావాక్య గ్రంథరత్నావళి అనే గ్రంథంలో ఉన్నవి. జ్ఞానానంద తీర్థులవారి తాత్పర్యంతో ప్రకటించిన ఈ మహావాక్య గ్రంథరత్నావళి 140 వ పుటలో రెండవ పంక్తిలో ''ఓంతత్సత్‌'' మహావాక్యమని పేర్కొనబడి ఉన్నది. కఠవల్లి ప్రణవము ఉపదేశవాక్యమని నిరూపిస్తోంది.

ఓంతత్సత్‌ : - ఇది జీవబ్రహ్మైక్యము నిట్లు బోధించుచున్నది. సత్పదస్యయో7ర్థః ః అస్థిత్వరూపః స భగవత్పాదైః బ్రహ్మసూత్రభాష్యారంభే ''సర్వస్యాత్మత్వాచ్చ బ్రహ్మాస్తిత్వ ప్రసిద్ధిః| సర్వోహ్యాత్మా స్తిత్వం ప్రత్యేతిననా హమస్మీతి''| ఇత్యనేన ప్రత్యగాత్మాన మువలక్ష్యైవ నిరూపితః | అన్యత్ర చ ''సంత మేనం తతో విదురితి'' ఇతీయం తైత్తిరీయ శ్రుతిః సచ్ఛబ్దార్థం ఆస్థిక జీవమాచష్టే, తథాచ తత్పదిత్యత్ర జీవాత్మ పరమాత్మైక బోధస్యాపి ప్రసక్తిర్భవతి|

నాలుగు వేదములకు ఉపలక్షకములుగా నాలుగు మహా కావ్యాలను గ్రహించుతున్నారు. ఋగ్వేదం (1) ప్రజ్ఞానం బ్రహ్మ యజుర్వేదం (2) అహం బ్రహ్మాస్మి, సామవేదం (3)తత్త్వమసి అధర్వణ వేదం (4) అయమాత్మా బ్రహ్మ.



ధర్మశాస్త్రం

యతీశ్వరుల గురుశిష్య పరంపరలో మహావాక్యోపదేశాన్ని గూర్చి ధర్మశాస్త్ర గ్రంథాలు కొన్ని నియమాలను చెప్పుతున్నవి. ధర్మసింధువు ప్రణవోపదేశం చేసి శిష్యశాఖ ననుసరించి ఆ మహావాక్యం ఒక్కటే చెప్పవలసిందిగా నిర్దేశించుతోంది. ఆది శంకరులు తమ శిష్యపీఠాలలో ఈ పద్ధతిని నిర్దేశించి ఉండవచ్చు.

నిర్ణయ సింధువు నాలుగు కంటే ఎక్కువ వాక్యాలను బోధించవలసిందిగా చెప్పుతోంది. మూడు వాక్యాలను చెప్పి అధిపదం చెప్పింది. కనుక నాలుగుకంటె ఎక్కువ అనేది స్పష్టము.

విశ్వేశ్వరస్మృతియందు శిష్యశాఖ ననుసరించి ఆ వాక్యంలో ఆరంభం చేసి మొత్తం నాలుగు వాక్యాలను చెప్పవలసిందిగా నిర్దేశింపబడినది.

కంచి కామకోటిపీఠం ఆదిశంకరులు స్వయంగా అధిష్టించిన పీఠం గనుక శ్రీశంకరులకు వారి గురువు లుపదేశించిన క్రమమే ఇందు అనుస్యూతంగా ఉండటం సహజంగదా : అందువల్లనే చిద్విలాసీయంకూడ 25వ పుట 9 అధ్యా. 18, 19 శ్లోకాలు విశ్వేశస్మృతి విధానంతో శంకరులుపదిష్టులైనారని చెప్పింది. మాధవీయం కూడ ఈ అంశాన్ని ఒప్పుకోక తప్పలేదు.

కామకోటి పీఠమునందు విశ్వేశస్మృతి, నిర్ణయ సింధు గ్రంధాలలో నిర్దేశింపబడిన సంప్రదాయముండుట ప్రసిద్ధమైన అంశము.

జగద్గురు శిష్య పరంపరైక సమధిగమ్యమైన బ్రహ్మ విద్యోపదేశ విషయమున ఇంతకుమించిన విచారణమునకు సంప్రదాయజ్ఞు లెవ్వరు సాహసింపరు.

మాధవీయం. సామవేద మహాకావ్యం ?

పండితులు ఇప్పటికైనా కన్నులు తెరచి గ్రహింపదగిన అంశం మరొకటి ఉన్నది. మాధవీయం ఆదిశంకరుల మహావాక్యోపదేశ విషయమున విశ్శేశ్వరస్మృతి, నిర్ణయసింధు క్రమాన్ని స్పష్టంగా అనుసరించింది.

కాని 10 వ సర్గలో ఆదిశంకరులు శ్రీ సురేశ్వరులకు ధర్మసింధు క్రమంలో మహావాక్యోపదేశాన్ని చేసిన విషయాన్ని పేర్కొన్నది. (వావిళ్ళవారి ప్రతి 261 వ పుట.) 75, 76 శ్లోకాలలో.

''కర్ణేజగౌ తత్త్వమసీతి వాక్యం''

''తదాది వాక్యం పునరాబభాసే''

వాఖ్యా :-డిండిమం :- తత్త్వమసివాక్యం పునరాబభాషే-- అర్థసహితముక్తవాన్‌ || యజుర్వేదీయ మహావాక్యమైన 'అహం బ్రహ్మాస్మి' దానితో పాటు 800 సంవత్సరాలు సుర్వేశ్వరుల పీఠాధిపత్యాన్ని కేటాయించుకొన్న శృంగేరీకి వారి మాధవీయం లోని సామవేదవాక్యం-గజం మిథ్య, పలాయనం మిథ్య, అని ఘోషిస్తూంటే పండితులు కొంతమంది చెవులుండి వినటం లేదు. కన్నులుండి చూడటం లేదు మరికొందరు.

ఆమ్నాయం - సంప్రదాయం

ఆమ్నాయము అను శబ్దం 'మ్నా' అనుధాతువునుండి ఏర్పడినది. మ్నా-అభ్యాసే అనునది ధాత్వర్థము. గురుపారంపర్యంగా అభ్యసించునది అని అర్థము. 'అథామ్నాయ స్సంప్రదాయః' అని అమరనిఘంటువు. మఠమ్నాయమని చెప్పునపుడు ఆమ్నాయములు నాలుగు మాత్రమే లేవు గనుక వేదములతో పోల్చకూడదు. వేదములు నాలుగు, ఇవి ఎనిమిది కనుక ఆమ్నాయశబ్ద మిచట వేదవాచికాదు. ఆమ్నాయాశ్చత్వారః మఠాశ్చాత్వారః ఆచార్యాశ్చత్వారః అని చెప్పిన దానికి ఆచార్యులవారు ఏర్పరచిన సంప్రదాయమును పాటించు శిష్య మఠములు నాలుగు అనేదే దీని తాత్పర్యం. ఆచార్య పీఠమును విడచి పరమానందయ్య శిష్యుల లెక్క దీనికి జోడింపరాదు.

నాలుగు దిక్కులకు నాలుగామ్నాయములు. వీటిని పూర్వామ్నాయం అంటారు. మధ్యామ్నాయం లేక మౌలామ్నాయం ఒకటి. ఊర్థ్వ, ప్రత్యక్‌, నిష్కలామ్నాయములు మూడున్నవి. వీటిని ఉత్తరామ్నాయం అంటారు.

శ్రీవిద్యోపాసకులు సైతం నాలుగు దిక్కుల నాలుగు ద్వారా మ్నాయములు చెప్పి ఊరుకొంటారా? మధ్యామ్నాయాన్ని విడువరు. ఆ సంప్రదాయజ్ఞుల కది తెలుస్తుంది. శ్రీ విద్యా ప్రథాన సంప్రదాయం ఆచార్యపీఠాల్లో ఉన్నది. ఇచట శ్రీచక్రపూజ నియతమని తెలిసిన విషయమే.

ఇప్పటికి భారతదేశంలో వెలువడిన మఠామ్నాయ క్రమం ఏకవాక్యతతోలేదు. ఇందులో చాలా సంప్రదాయ భేదం ఉన్నది. కామకోటి పీఠం మధ్యమ్నాయం లేక మౌలామ్నాయం అన్నది స్పష్టమే.

శృంగేరీ దేనికి దక్షిణం?

శృంగేరీమాత్రం దక్షిణామ్నాయమని చెప్పబడుతోంది. దక్షిణ భారత దేశానికి వాయవ్యంగా ఉన్న ఈ శృంగేరీ దేనికి దక్షిణం అనే ప్రశ్న ఎవరికి తేలకుండా ఉన్నది.

ఈ విషయంలో మఠామ్నాయం, మఠేతివృత్తం, మఠత్త్వవిచారం అనే గ్రంథపరిశీలనంతో 'ఆదిశంకరుల మఠసంప్రదాయ చరిత్ర' అనే ఆంగ్లగ్రంథంలోను, 'ప్రెసెప్టర్స్‌ ఆఫ్‌ అద్వైత' అనే గ్రంథంలో 'కామాక్షి-ఆమ్నాయశక్తి' అనే వ్యాసంలోను, కాశీలో ప్రచురింపబడిన శాంకరపీఠ తత్త్వదర్శనం అనే సంస్కృత గ్రంథంలోను సుదీర్ఘ పరిశీలన చేయబడినది. మఠామ్నాయంలోని కామకోటి పీఠ ఔన్నత్యం స్పష్టం చేయబడినది - ఆ గ్రంథాలు చూడవచ్చు. విస్తరభీతిచే ఇచట వివరించటం లేదు.

భారతభూమి - యజ్ఞవేదిక

భారతభూమి అంతా యజ్ఞవేదిక అని, నాలుగు దిక్కులలో నాలుగు మఠాలు-నాలుగు వేదసంప్రదాయాలున్నవని చెప్పుకొంటారు. నిజమే ఆచార్యులవారు ఆరంభించిన జ్ఞానయజ్ఞంతో ఈ నలుగురు ఋత్వికులాంటి వారు. యజమాన స్థానమందున్నదే ఆచార్యుల వారధిష్టించిన కామకోటిపీఠం.

ఉపసంహారము

శాంకర పీఠతత్త్వ దర్శనంలోనే (కాశీ విద్యావిలాస ప్రెస్‌లో ప్రచురణ) మఠామ్నాయ విచారమునందలి ఈ వాక్యాలను వినండి.

''మఠాశ్చత్వార ఏవ ఆచార్యశ్చత్వార ఏవేత్యర్థక మఠామ్నాయ వాక్యేపి ఆచార్యపదేన శంకరాచార్యత్వం భగవత్పదైః స్వావస్థితి సమయ ఏవ యచ్చతుర్భ్య ఆచార్యేభ్యః ప్రదత్తం, తద్ధి సూర్యేణ హిమాంశుమండలే ప్రదీయమానం స్వకీయం తేజ ఇవ ప్రతిబింబభూతం సత్‌ న బింబరూపస్య భగవత్పాదాచార్యత్వస్య, విఘాత పురస్సరం దత్తమితి సన్నిపాత పరిభాషా విదామపి ప్రత్యక్షం.''

పై గ్రంథంలోనే లాహోరు ఓరియంటల్‌ సంస్కృత మహావిద్యాలయాధ్యక్షులైన 'మహామహోపాధ్యాయ' పండిత మాధవశాస్త్రి భండారి అనేక ప్రమాణవచనాలతో తుదకిట్లు నిశ్చయించారు.

''సతిచైవం శ్రీ కాంచీ కామకోటిపీఠం అనాది సిద్ధం భగవత్పాదాధిరూఢం, సుర్వేశ్వరాచార్యదీనామపి పరమాదర పాత్రం శిష్యపరంపరయా అవశ్యం పరిరక్షణీయత్వేన భగవత్పాదాభిప్రేతం ప్రథానతమం పీఠమితి నిగద వ్యాఖ్యాతమితి.''

కనుక కంచి కామకోటిపీఠం అనాది సిద్ధమైంది. ఆదిశంకరుల ధిష్టించినది. సుర్వేశ్వరాదులకిది పరమాదర పాత్రమైనది. శిష్యపరంపరతో తప్పక పరిరక్షింపవలె ననునదియే భగవత్పాదుల అభిప్రాయము. ఇది ప్రధానమతపీఠం. ఇదే సారాంశము....

''పరమశివ వధూటీ పాతుమాం కామకోటి''

Jagadguru divyacharithra   Chapters   Last Page