Sri Naradapuranam-3    Chapters    Last Page

ద్విపంచాశత్తమోధ్యాయః యాభయి రెండవ అధ్యాయము

పురుషోత్తమమాహాత్మ్యమ్‌.

మోహిన్యువాచ:

ధన్యోసి విప్రవర్య త్వం కృపాలుః సర్వదేహిషు l యచ్చ్రుతం తే ముఖాంభోజా త్కాశీమహాత్మ్య ముత్తమమ్‌ 1

అధునాహం కృతార్థాస్మి త్వయా హి ప్రతిబోధితా l కృపాలునా నిపతితా భ్యుద్దృతా భవసాగరాత్‌ 2

అధునా శ్రోతుమిచ్చామి హరేః క్షేత్రస్య మానద l మహాత్మ్యం యత్ర గమనా త్కృతార్థో జాయతే నరః 3

పురుషొత్తమ విష్ణొస్తు క్షేత్రం ముక్తి విధాయకమ్‌ l శ్రష్టయతే హి పురాణషు వర్ణితం మునిభిర్ద్వజైః 4

తత్కధ్యతాం మహాభాగ శిష్యాహం యది తే ప్రియా l సాధనః సర్వలోకస్య సతతోపకృతౌ స్థితా

మోహిని పలికెను:-

నీవు సర్వప్రాణులందు దయచూపు చున్నావు కావున ధన్యుడవు. ఓబ్రాహ్మణోత్తమా? నీ ముఖ పద్మములనుండి ఉత్తమమగు కాశీ మహాత్మ్యమును వింటిని. నీచే బోధించబడిన నేను ఇపుడు కృతార్థురాలనైతిని. దయగల నీవు సంసార సాగరమునుంéడి నన్నుద్దరించితివి. ఇపుడు శ్రీహరి క్షేత్ర మహాత్మ్యమును విన గోరుచున్నాను. హరిక్షేత్రముననకు వెళ్ళిన నరుడు కృతార్థుడగును. పురుషోత్తముడగు శ్రీహరి క్షేత్ర మాహాత్మ్యమును విన గోరుచున్నాను. హరిక్షేత్రమునకు వెళ్ళిన నరుడు కృతార్థుడగును. పురుషోత్తముడగు శ్రీహరి క్షేత్రము ముక్తి విధాయకమని పురాణములలో మునులు చెప్పుచుందురు. నేను నీకు ప్రియశిష్యురాలనేని పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యమును చెప్పుడు. సాధుజనులు సర్వకాలములందు సకలలోకోపకారమునే చేయుచుందురు కదా.

వసురువాచః

శృణుదేవి ప్రవక్ష్యామి తుభ్యం మాహాత్మ్యముత్తమమ్‌ l పురుషోత్తమ నామ్నస్తు క్షేత్రస్య బ్రహ్మణోదితమ్‌ 6

పృధివ్యాం భారతే వర్షే దక్షిణోదధితీరగః 7

ఉత్కలేతిసమాఖ్యతః స్వర్గమోక్షప్రదాయకః | సముద్రాదుత్తరం తావ ద్యావద్విరజమండలంమ్‌ 8

దేశోsసౌ పణ్యశీలానాం గుణౖః సర్వైలంకృతః | సర్వతీర్థాని పుణ్యాని పుణ్యాన్యాయతననానిచ 9

ఉత్కలేతు విశాలాక్షి వేదితవ్యాని తాని తు l సముద్రస్యోత్తరే తీరే తస్మిన్దేశే s ఖిలొత్తొమే 10

ఆస్తే గుహ్యం పరం క్షేత్రం ముక్తిదం పాపనాశనమ్‌ l సర్వత్ర వాలుకా కీర్ణే పవిత్రం ధర్మకామదమ్‌ 11

దశయోజనవిస్తీర్ణం క్షేత్ర పరమ దుర్లభమ్‌ l నక్షత్రాణాం యథా సోమః సరసాం సాగరో యథా 12

తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ l వసూనాం పావకో యద్వ ద్రుద్రాణాం శంకరోయథా 13

తథా శ్రేష్ఠం హి తీర్థానాం సర్వేషాం పురుషోత్తమమ్‌ l వర్ణానాం బ్రాహ్మణో యద్వ ద్‌వ్గనతేయశచ పక్షిణామ్‌ 14

తథా సమస్త తీర్థానాం వరిష్ఠం పురుషోత్తమమ్‌ l సేనానీనాం యథా స్కంథః సిద్దానాం కపిలో యథా 15

ఐరావతోగజేంద్రాణాం మహర్షీణాం భృగుర్యథా l మేరుః శిఖరిణాం యద్వ న్నగానాం చ హిమాలయః 16

ఉచ్ఛెః శ్రనా యధాశ్వానాం కవీనా ముశనా యథా l మునీనాంచ యథా వ్యాసః కుబేరోయక్షరక్షసామ్‌ 17

ఇంద్రియాణాం మనో యద్వ ద్బూతానామవనీ యథా l అశ్వత్థః సర్వవృక్షాణాం పవనః పవతాం యథా 18

అకారః సర్వవర్ణానాం గాయత్రి ఛందసాం యథా l

సర్వాంగేభ్యో యథా శ్రేష్ఠ ముత్తమాంగం విధాతృజే l యథా సమస్త విద్యానాం మోక్షవిద్యా పంపా స్మృతా l 20

మనుష్యాణాంప యథా రాజా ధేనూనాం కామధుగ్యధా l సువర్ణం సర్వధాతూనాం సర్పాణాం వాసుకిర్యధా l

ప్రహ్లాదః సర్వదైత్యానాం రామః శస్త్ర భృతాం యధా l ఝుషాణాం మకరో యద్వ న్మృగాణాం మృగరాడ్యధా 22

వరుణో యాదసాం యద్వ ద్యమః సంయవినాం యథా l క్షీరోదః సాగరాణాం చ దేవర్షీణాం చ నారదః 23

పురోధసాం యధా జీవః కాలః కలయతాం యధా l గ్రహాణాం భాస్కరోయద్వ న్మంత్రాణాం ప్రణవో యధా 24

కృత్యానాం ధర్మకార్యం చ తద్వచ్ఛ్రీ పురుషోత్తమమమ్‌ l పురుషాఖ్యం సకృద్దృష్ట్వా సాగరాంత ః సకృన్మతః 25

బ్రహ్మవిద్యాంప సకృజ్‌జ్ఞాత్వా గర్భవాసో న విద్యతే l ఏవం సర్వగుణోపేతం క్షేత్రం పరమ దుర్లభమ్‌ 26

ఆస్తే యత్రవరారోహే విఖ్యాతం పురుషోత్తమమ్‌ l జగద్వ్యాపీ స విశ్వాత్మా దేవేశః పరుషోత్తమః 27

జగద్యోనిర్జగన్నథా స్తత్ర సర్వం ప్రతిష్ఠితమ్‌ l అజః శక్రశ్చ రుద్రశ్చ దేవాశ్చాగ్ని పురోగమాః 28

నివసంతి మహాభాగే తస్మిన్దేశే సదైవ హి l గంధర్వాప్సరసః సిద్దాః పితరో దేవమానుషాః 29

యక్షా విద్యాధరాశ్చైవ మనయః శంసితవ్రతాః l ఋషయో వాలఖిల్యాద్యాః కశ్యపాద్యాః ప్రజేశ్వరాః 30

సుపర్ణాః కిన్నరా నాగా స్తధాన్యే స్వర్ణవాసినః l సాంగా వేదాశ్చ చత్వారో శాస్త్రాణి వివిధాని చ 31

ఇతిహాసపురాణాని యజ్ఞాశ్చ బహుదక్షిణాః l నద్యశ్చ వివిధాః పుణ్యా స్తీర్థాన్యాయతనానిచ 32

సాగరాశ్చ యధాశైలా స్తస్మిన్దేశే వ్యవస్థితాః | ఏవం పుణ్యతమే దేశే దేవర్షిపితృసేవితే 33

సర్వోపభోగ సహితే వాసః కస్య న రోచతే l శ్రేష్ఠత్వం తస్య దేవస్య కించాన్యదధికం తతః 34

ఆస్తే యత్ర జగద్దేవొముక్తిదః పురుషోత్తమః l ధన్యాస్తే విబుధ ప్రఖ్యా యే వసంత్యుత్కలే నరాః 35

తీర్థ రాజజలే స్నాత్వా పశ్యంతి పురుషోత్తమమ్‌ l స్వర్గే వసంతి తే మర్త్యాన తుతే రాజసాలయే 36

యే వసంత్యుత్కలే క్షేత్రే పుణ్య శ్రీ పురుషొత్తమే l సఫలం జీవితం తేషా మౌత్కలానాం సుమేధసామ్‌ 37

యే పశ్యంతి సుతామ్రౌష్ఠ ప్రసిన్నాయతలొచనమ్‌ l చారు భ్రూకేశ ముకుటం చారు కర్ణలతాంచితమ్‌ 38

చారుస్మితం చారుదంతం చారుకుండల మండితమ్‌ | సునాసం సుకపోలంచ సులలాటం సులక్షణమ్‌ 39

త్రైలోక్యానంద జననం కృష్ణస్య ముఖ పంకజమ్‌ l పురా కృతయుగే దేవి శక్రతుల్య పరాక్రమః 40

బభూవ నృపతిః శ్రీమా నింద్రద్యుమ్న ఇతి శ్రుతః l సత్యవాదీ శుచిర్దక్షః సర్వశస్త్ర భృతాం వరః 41

రూపనావాన్సుభగః శూరో దాతా భోక్తా ప్రియంవదః l యష్టా సమస్త యజ్ఞానాం బ్రహ్మణ్యః సత్య సంగరః 42

ధనుర్వేదే చ వేదేచ శాస్త్రే చ విపుణః కృతీ వల్లభో నరనారీణాం పౌర్ణమాస్యాం యథా శశీ 43

ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష్యో మదురశ్చంద్రమా ఇవ l వైష్ణవః సత్య సంపన్నో జితక్రోధో జింతేంద్రియః 44

అధ్యాత్మవిద్యానిరతో యుయుత్సుర్థర్మ తత్పంరః l ఏవం సపాలరుత్పృధ్వీం రాజా సర్వగుణాకరః 45

తస్య బుద్దిః సముత్పన్నా విష్ణోరారాధనం ప్రతి l కథమారాధయిష్యామి దేవ దేవం జనార్థనమ్‌ 46

కస్మిన్‌క్ష్కేత్రేs థవా తీర్థే నదీ తీరే తథాశ్రమే l ఏవం చింతాపరః సో థ నిరీక్ష్య మనసా మహీమ్‌ 47

అలోక్య సర్వతీర్థాని యాని పాపహరాణి చ l తాని సర్వాణి సంచింత్య జగామ మనసా పునః 48

విఖ్యాతం పరమం క్షేత్రం ముక్తిదం పురుషోత్తమమ్‌ l స గత్వా నృపతిస్తత్ర సమృద్ధ బలవాహనః 49

అయజచ్చాశ్వమేధేన విధివద్బూరి దక్షిణః l కారయిత్వా మహోత్సేదాం ప్రాసాదం భూరి దక్షిణమ్‌ 50

తత్ర సంకర్షణం కృష్ణం సుభద్రాం స్థాప్య వీర్యవాన్‌ l పంచతీర్థం చ విధివ త్క్యత్వా తత్ర మహీపతిః 51

స్నానం దానం తపః హోమం దేవతా ప్రేక్షణం తథా l భక్త్యాచారాధ్య విధివ త్ప్రత్యహం పురుషోత్తమమ్‌

ప్రసాదాద్దేవ దేవస్య తతో మోక్షమవాప్తవాన్‌ 52

వసువు పలికెను :-

ఓదేవీ ! ఇపుడు నీకు బ్రహ్మ చెప్పిన పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యమును చెప్పెదను. ఈ భూమండలమున భారత వర్షము కర్మభూమిగా ప్రసిద్ది గాంచినది. ఈ భారత వర్షమన దక్షిణ సముద్ర తీరమున ఉత్కలమను తీర్థము స్వర్గమోక్ష ప్రదాయకము కలదు. సముద్రమునకుత్తర భాగమున విరజమండలము వరకు వ్యాపించి యున్నది. ఈ ప్రదేశము పుణ్యశీలుల పవిత్ర గుణములచే అలంకరించబడి యున్నది . సకల పుణ్య తీర్థములు, సకల పుణ్యాయతనములు ఉత్కల తీర్థముననే చూడవలయును. సముద్రమునకు ఉత్తర తీరమున సర్వోత్తమ ప్రదేశమున పరమ రహస్యమగు మోక్ష ప్రదము పాపనాశనమగు క్షేత్రము కలదు. ఈ క్షేత్రము అంతటా వాలుకా కీర్ణము. పవిత్రము. ధర్మకామ ప్రదమ. ఈ క్షేత్రము పరమ దుర్లభము. దశయోజన విస్తీర్ణము. నక్షత్రములలో చంద్రుడు, సరస్సులలొ సాగరము శ్రేష్ఠమైనట్లు ఈ పురుషొత్తమ క్షేత్రము అన్ని క్షేత్రములలో వరిష్ఠము. వసువులలొ పావకుని వలె రుద్రులలో శంకరుని వలె ఈ పురుషోత్తమ తీర్థము సర్వతీర్థ శ్రేష్ఠము. వర్ణములలో వరిష్ఠము. వసువులలొ పావకునిపవలె రుద్రులలొ శంకరుని వలె ఈ పురుషోత్తమ తీర్థము సర్వతీర్థ శ్రేష్ఠము. వర్ణములలో బ్రాహ్మణుని వలె, పక్షులలో వైనతేయుని వలె, సేనానులలో స్కందుని వలె, సద్దులలొ కపిలుని వలె, గజేంద్రములలో ఐంపావతము వలె, మహార్షులలో భృగువువలె, అశ్వములలో ఉచ్చైశ్శ్రవము వలె, కవులలో శుక్రునివలె,మునులలో వ్యాసునివలె, యక్షరాక్షసులలొ కుభేరుని వలె, ఇంద్రియములలో మనసువలె, భూతములలో భూమివలె, వృక్షములలో అశ్వత్థము వలె, వీచువాటిలొగాలి వలె స్త్రీలలో అరుంధతి వలె, శస్త్రములలో వజ్రాయుధము వలె అన్ని వర్ణములలో అకారము వలె, ఛందస్సులో గాయత్రి వలె, అన్ని అవయవములలో శిరస్సువలె, అన్ని విద్యలలో మోక్ష విద్యవలె, మనుష్యులలో రాజువలె, ధేనువులలొ కామధేనమవు వలె, అన్ని ధాతువులలొ సువర్ణము వలె, సర్పములలో వాసుకి వలె, దైత్యులలో ఫ్రహ్లాదుని వలె, శస్త్ర ధారులలో రాముని వలె, ఝుషములలో మకరమువలె, మృగములలో సింహము వలె, దైత్యులలొ ఫ్రహ్లాదుని వలె, సంయములలో యముని వలె, సముద్రములలో క్షీరసాగరము వలె, దేవర్షులలో నారదుని వలె, పురోహితులలో బృహస్పతివలె, కలుపు వాటిలోకాలమువలె, గ్రహములొ సూర్యుని వలె, మంత్రములలోప్రణవము వలె కృత్యములలో దర్మకార్యమువలె, పురుషోత్తమ క్షేత్రము అన్ని క్షేత్రములలో శ్రేష్ఠమ. ఒకసారి పురుషోత్తమ క్షేత్రమును దర్శించి, సాగరాంతమును ఒకసారి దర్శించి, ఒకసారి బ్రహ్మవిద్యను తెలుసుకొని మర లజన్మను పొందడు. ఇట్లు సర్వగుణోపేతము, పరమ దుర్లభమగు నిదిపరుషోత్తమ క్షేత్రము. ఈ క్షేత్రము జగద్వ్యాపి, విశ్వాత్మ, దేహేశుడు, పురుషోత్తముడు, జగత్కారణము, జగన్నాథుడు అన్నియూ ప్రతిష్ఠించబడినవి . బ్రహ్మ ఇంద్రుడు, రుద్రుడు, అగ్నిమొదలగు దేవతలు, ఈక్షేత్రమున ఎల్లపుడూ నివసించుచున్నారు. గంధర్మలు, అప్సరసలు, సిద్దులు, పితరులు, దేవతలు, మనుష్యులు, యక్షులు, విద్యాధరులు, వ్రతపరులగు మునులు, వాలఖిల్యాది ఋషులు, కశ్యపాది ప్రజాపతులు, సుపర్ణులు, కిన్నరులు, నాకుగు ఇతర స్వర్గవాసులు, సాంగ చతుర్వేదములు, వివిధ శాస్త్రములు, ఇతిహాస పురాణములు, బహుదక్షిణలగు యజ్ఞములు, వివిధ పవవిత్రనదులు, వివిధ తీర్థములు, ఆయతనములు, సాగరములు,, శైలములు ఇచటనే ఉన్నవి. ఇట్టి పుణ్యతమము, దేవర్షి పితృసేవితము, సర్వోపభోగ సమితమగు క్షేత్రమున ఎవరు నివసించరు? జగద్దేవుడు ముక్తి ప్రదుడగు పురుషోత్తముడు సవయముగా నివసించుట కంటే క్షేత్ర మాహాత్మ్యము ఏమి కావలయును? ఉత్కలమున నుండు దేవ సన్నిభులగు నరులుధన్యును. తీర్థ రాజజలమును స్నానము. చేసి పురుష్ణత్తమున %ిదర్శించు చుందురు. పవిత్రమగు ఉత్కల దేశమున స్నానము చేసి పురుషోత్తమ క్షేత్రము నివసించు వారు స్వర్గమున వసింతురు. కాని నరకమునకు వెళ్ళరు. ఉత్కల క్షేత్ర వాసులు సుబుద్దులు, వీరు నిత్యము సుతామ్రౌష్ఠప్రసిన్నారుతలోచనుని, చారు భ్రూకేశముకుటుని, చారు కర్ణలతాంచితుని, చారుస్మితుని, చారుదంతుని, చారుకుండల మండితుని, సునాసుని, సుకపోలుని సులలా%ాటుని, సులక్షణుని త్రైలోక్యానంద జనకుని,.పద్మముఖుడగు శ్రీకృష్ణుని దర్శించు చుందురు. పూర్వకాలమున కృతయుగమున ఇంద్రతుల్య పరాక్రముడగు ఇంద్రద్యుమ్నుడను మహారాజుండెను. సత్యవాది, శుచి, దక్షుడు, సర్వ శస్త్ర ధారులలోశ్రేష్ఠుడు, రూపవంతుడు, సుందరుడు, శూరుడు, దాత భోక్త, ప్రియవాది, సమస్త యజ్ఞకర్త, బ్రహ్మణ భక్తుడు, సత్యసంగరుడు, ధనుర్వేదమున, వేదమున, శాస్త్రములలొ నిపుణుడు, కార్యశీలి, నరనారీ ప్రియుడు, పున్నమ చంద్రుని వంటివాడు. సూర్యుని వలె చూడశక్యము కానివాడు, చంద్రుని వలె మధురుడు, విష్ణుభక్తుడు, సత్య సంపన్నుడు, జితక్రోథుడు, జింతేంద్రియుడు, అధ్యాత్మ విద్యా నిరతుడు, యుయుత్సువో, ధర్పతత్పరుడు, సర్వగుణాకరుడగు ఇంధ్రద్యుమ్నమహారాజు పృధ్విని పాలించుచెండెను . ఇతనికి మహావిష్ణువును ఆరాదించవలెననికోరిక కలిగెను. దేవదేవుడగు జనార్ఞనుని ఎట్లారాధించవలయును? ఏక్షేత్రమున, ఏ తీర్థమున, నదీతీరమున, లేదా ఆశ్రమమున ఆరాధించవలయును? ఇట్లు విచారించుచు మనసుచే భూమండలమునంతటిని సమీక్షించెను. పాపాపహములగు సకల తీర్థములను గూర్చి మానసికముగా చింతించి మోకోప్రదమని ప్రసిద్ది గాంచిన పురుషోత్తమ క్షేత్రమునకు సబల వాహనుడై వెళ్ళిప భూరి దక్షిణలతో అశ్వమేధ యాగము నాచరించెను. ఇట్లు యాగమును పూర్తి చేసి భూరిదక్షిణలనిచ్చి సంకర్షణుని, శ్రీకృష్ణుని, సుభద్రను ప్రతిష్ఠించి, యధావిధిగా పంచతీర్థము నాచరించి ( స్నానము, దానము తపము, హోమము దేవతా ప్రేక్షణము ప్రతిదినము భక్తిచే పురుషోత్తము నారాధించి, దేవదేవుని అనుగ్రహము వలన మోక్షము పొందెను.

మోహిన్యువాచ:-

తస్మిన్‌ క్షేత్రే వరే పుణ్య వైష్ణవే పురుషోత్తమే 53

కిం తత్ర ప్రతిమా పూర్వం సుస్థితా వైష్ణవీ ప్రభో l యేనాసౌ నృపతిస్తతం గత్వా సబల వాహనః 54

స్థాపయామాస కృష్ణంచ రామం భద్రాం శుభప్రదామ్‌ l సంశయోస్తి మహాంస్తత్ర విస్మయశ్చ ద్విజోత్తమ 55

éశ్రోతుమిచ్చామి తత్సర్వం బ్రూహి తత్కారణం చ యత్‌

మోహిని పలికెను:-

ఇట్లు శ్రేష్ఠము పావనము అగు పురుషోత్తమ క్షేత్రమున పూర్వము విష్ణుప్రతిమ యుండెనా? ఇపుడు ఇంద్రద్యుమ్నమహారాజు సబల వాహనుడై వెడలి కృష్ణుని రాముని సుభద్రను ఎందుకు ప్రతిష్ఠించెను. ఈ విషయమున నాకు సంశయము ఆశ్చర్యము కూడా కలగుచున్నవి. కావున దీని నంతటిని వినగోరుచున్నాను. దీని కారణమును దయచేసి తెలుపుము.

వసురువాచ :-

శృణుష్వ పూర్వ వృత్తాంతం కధాం పాపప్రణాశినీమ్‌ 56

ప్రవక్ష్యామి సమాసేన శ్రియా పృష్టంచ యత్పురా l సుమేరోః కాంచనే శృంగే సర్వాశ్చర్య సమన్వతే 57

తత్ర స్థితం జగన్నాధం జగత్ర్సస్టారమవ్యయమ్‌ l ప్రణమ్య శిరసా దేవి లోకానాం హితకామ్యయా 58

పప్రచ్చేదం మహాప్రశ్నం భుమౌ స్థానమనుత్తమమ్‌

వసువు పలికెను :-

ఇచట పూర్వ వృత్తాంతమును సంగ్రహముగా తెలిపెదను. పాప ప్రణాశని యగు ఈ కథను పూర్వమిచుట శ్రీనివాసమును వినుము. సర్వాశ్చర్య సమన్వితమగు సుమేరు శృంగము ఉన్న జగత్ర్సష్ఠ అవ్యయుడగు జగన్నాథుని లోకహిత కామనచే నమస్కరించి భూమిలో నివాసమును కోరుచు ఇట్లు అడిగెను.

శ్రీరువాచ :-

బ్రూహిత్వం సర్వలోకేశ సంశయం మే హృది స్థితమ్‌ 59

మర్త్యలోకే మహాశ్చర్యే భూమౌ కర్మ సుదుర్లుభే l లోభమోహమహా గ్రాహే కామక్రోథమహార్ణవే 60

యేన ముచ్యేత ఆత్యేశ దుర్గ సంసార సాగరాత్‌ l త్వామృతే నాస్తి లోకే స్మి న్వక్తా సంశయ నిర్ణయే 61

శ్రుత్వైవం వచనం తస్యా దేవదేవో జనార్దనః l ప్రోవాచ పరయా ప్రీత్యా పరం సారామృతోపమమ్‌ 62

సుఖోపాయం సుసాధ్యం చ నిపరాయాసం మహాఫలమ్‌

మహాలక్ష్మి అడిగెను. సర్వలోకేశా? నా మదిలో నున్న సంశయమును తొలగించుము. మహాశ్చర్యకరము, కర్మ దుర్లభము, లోభమోహ మహాగ్రహములు కలది, కామక్రోధ మహాసాగరము అగు మర్త్యలోకమున దుర్లభమగు సంసార సాగరము నుండి మానవుడు ఎట్లు విముక్తి పొందును? ఈ సంశయమును తొలగించ గలవాడు నీకంటే ఇతరుడు లేడు. దేవదేవుడగు జనార్థనుడు ఈమాటలను విని అత్యంత ప్రీతితో అమృతోపమము, సుఖోపాయము, సుసాధ్యము, ఆయాసము మహాఫలప్రదమగు మార్గమును బోధించెను.

శ్రీభగవానువాచ:-

ఆస్తే తీర్థవరం దేవి విఖ్యాతం పురుషోత్తమమ్‌ 63

న తేన సదృశం కించిత్త్రి షు లోకేషు విద్యతే l కీర్తననాద్యస్య దేవేశి ముచ్యతే సర్వ పాతకైః 64

న విజ్ఞతో నరైః సర్వై ర్నదైత్యైర్ననచ దానవైః | మరీచ్యాద్యైర్ముని వరై ర్దర్శితో యం వరాననే 65

దక్షిణస్యోధధేస్తీరే న్యగ్రోధో యత్ర తిష్ఠితి l యస్తుకల్పే సముత్పన్నే మహదుల్కా నిబర్హణ 66

వినాశం నైవ చా భ్యేతి స్వయం తత్రైవ సంస్థితః l దృష్టమాత్రే వటే తస్మి ఞ్చాయామాశ్రిత్య చాసకృత్‌ 67

బ్రహ్మహత్యా ప్రముచ్యేత పాపేష్వన్యేషు కా కధా l ప్రదక్షిణం కృతం యైస్తు నమస్కారైస్తు జంతుభిః 68

సర్వే విధుత పాపా స్తే గతా వై కేశవాలయమ్‌ l న్యగ్రోధస్యోత్తరే కించి ద్దక్షిణ కేశవస్య తు 69

ప్రాసాదే తత్ర తిష్ఠేత్తు పరం ధర్మమ యం హితత్‌ l ప్రతిమాం తత్ర తాం దృష్ట్వా స్వయం దేవేన నిర్మితామ్‌ 70

అనాయాసేన వై యాంతి భవనం మే తతో నరాః l గచ్చన్నేవ తు తం దృష్ట్వా ఏకదా ధర్మరాట్‌ స్వయమ్‌ 71

మదంతిక మనుప్రాప్య ప్రణమ్య శిరసాబ్రవీత్‌ l నమస్తే భగవన్దేవ లోకనాధారు తేజసే 72

క్షీరోదవాసినంప దేవం శేషభోగోరు శాయినమ్‌ l వరం వరేణ్యం వరదం కార్తారం హ్యక్షయం ప్రభుమ్‌ 73

విశ్వేశ్వరమణం విష్ణుం సర్వజ్ఞ మపరాజితమ్‌ l నీలోత్పలదళశ్యామం పుండరీకనిభేక్షణమ్‌ 74

సర్వగం నిర్గుణం శాంతం జగద్దాతారమవ్యయమ్‌ l సర్వలోక విధాతారం లోకనాధం సుఖావహమ్‌ 75

పురాణపురుషం వేద్యం వ్యక్తావ్యక్తం సనాతనమ్‌ l పురాపురాణం స్రష్టారం లోకతీర్థం జగద్గురుమ్‌ 76

శ్రీవత్స వక్ష సాయుక్తం వనమాలా విభూషిత l పీతవస్త్రం చతుర్బాహుం శంఖచక్రగదాధరమ్‌ 7

హారకేయూర సంయుక్తం ముగుటాంగదధారిణమ్‌ l సర్వలక్షణసంయుక్తం సర్వేంద్రియ వివర్జితమ్‌ 78

కూటస్థ మచలం సూక్ష్మం జ్యోతీరూపంసనాతనమ్‌ l భావాభావ వినిర్ముక్తం వ్యాపినం ప్రకృతేః పరమ్‌ 79

తం నమస్యే జగన్నాథ మీశ్వరం సుఖదం ప్రభుమ్‌ l ఇత్యేవం ధర్మరాజస్తు పురా న్యగ్రోధసన్నిధౌ 80

స్తుత్వా నానావిదైః స్తోత్రైః ప్రణామమకరోత్తదా l తం దృష్ట్వా చ మహాభాగే ప్రణతం ప్రాంజలిం స్థితమ్‌ 81

స్తోత్రస్య కారణం దేవి పృష్టవానహ మంతకమ్‌ l వైవస్వత మహాబాహో సర్వదేవమయో హ్యసి 82

కిమర్థం స్తుతవానిత్థం సంక్షేపాత్‌ బ్రూహి తన్మమ 83

శ్రీహరిపలికెను :-

దేవీ! సర్వతీర్థ శ్రేష్ఠము సుప్రసిద్దమగు పరుషోత్తమమను తీర్థము కలదు. మూడు లోకములలో ఇటువంటి క్షేత్రము మరియొకటి లేదు. ఈ క్షేత్ర నామ కీర్తనము వలన సర్వపాతకములు నశించును. ఈ క్షేత్రమును దైత్య దానవులు నరులు తెలియలేరు. మరీచ్యాది మునిశ్రేష్ఠులు దీనిని చూపిరి. దక్షిణ సముద్రతీరమున న్యగ్రోధ వృక్షము కలదు. గొప్ప ఉల్కలను వర్షించు చున్న ప్రళయ కాలమున కూడా ఈ వృక్షము నశించక యట్లే యుండును. ఈ వట వృక్షమును చూచినంతనే బ్రహ్మహత్య పాతకము కూడా నశించు నన్న ఇక ఇతర పాపములమాటేల? ఈ వట వృక్షమునకు నమస్కారములతో ప్రదక్షిణములుచేసిన వారు సర్వపాపములుతొలగి శ్రీహరిలోకమును చేరెదరు. న్యగ్రోధ వృక్షమునకు ఉత్తర భాగమున కొద్ది దక్షిణమున కేశన ప్రాసాదము కలదు. ఇది పరమధర్మమయము. ఇచట నివసించవలయును. ఇచట స్వయముగా దేవ నిర్మితమగు ప్రతిమను దర్శించి సులభముగా నాలోకమునకు వచ్చెదరు. ఒకసూరి యను ధర్మరాజు అటు వెళ్ళుచు ఆప్రతిమను దర్శించి నా వద్దకు వచ్చి శిరసుచే నమస్కరించి ఇట్లు పలికెను. ఓదేవా, లోకనాధా! తేజోరూపా నీకు నమస్కారము శ్రేష్ఠుని, వరదుని, కర్తను, అక్షయుని, ప్రభువును, విశ్వేశ్వరుని, ఆజుని, విష్ణుని, సర్వజ్ఞుని, అపరాజితుని, నీలోత్పల దలశ్యాముని, పుండరీపక నిభేక్షణుని, సర్వగతుని, నిర్గుణుని, శాంతుని, జగద్దాతను, అవ్యయుని, సర్వలోక విధాతను, లోకనాధుని, సుఖావహుని, పురాణ పురుషుని, వేద్యుని, వ్యాక్తావ్యక్తుని, సనాతనుని, పురాణస్రష్ఠను, లొక తీర్థుని, జగద్గురువును, శ్రీవత్సవక్షుని, వనమాలా విభూషితుని, పీతవస్త్రుని, చతుర్బాహుని, శంఖచగ్రగదాధురుని, హారకేయూర సంయుక్తుని, మకుటాంగదధారిని, సర్వలకోణ సంయుక్తుని, సర్వేంద్రియ వివర్జితుని, కూటస్థుని, అచలుని, సూక్ష్ముని, జ్యోతీరూపుని, సనాతనుని, భావా భావ వినిర్ముక్తున్తి, వ్యాపిన ప్రకృతిపరుని, జగన్నాధుని, సుఖప్రదుడగు ప్రభువును నమస్కరించు చున్నాను. ఇట్లు పూర్వము యమధర్మరాజు వటవృక్ష సమీపమున నానావిధ స్తోత్రములచే నమస్కరించెను. ఇట్లు స్తుతించి చేతులు జోడించి నమస్కరించు యమధర్మరాజును స్తోత్తకారణము నడిగితిని. ఓ వైవస్వతా? మహాభాహో నీవు సర్వదేవమయుడవు. నీవెందుకిట్లు స్తుతించితివో సంక్షేపముగా పతెలుపుము అని.

యమ ఉవాచ:-

అస్మిన్నాయతనే పుణ్య విఖ్యాతే పురుషోత్తమే l ఐంద్రీనీలమయీ దృష్టా ప్రతిమా సర్వకామికీ 84

తాం దృష్ట్ప్యా పుండరీకాక్ష భావేనైకేన శ్రద్దయా l శ్యేతాఖ్యం భువనం యాంతి నిష్కామశ్చైవ మానవాః 85

అతశ్చైవం న శక్నోమి వ్యాపారమరి సూదన l ప్రసీద త్వం మహాదేవ సంహర ప్రతిమాం విభో 86

శ్రుత్వా వైవస్వతసై#్యత ద్వాక్యం తమహముక్తవాన్‌ l యమైతాం గోపయిష్యామి సి కతాభిః సమంతతః 87

తతః సా ప్రతిమా దేవి నల్లీభిర్గోపితా తథా l యథా తత్ర న పశ్యంతి మనుజాః స్వర్గ కాంక్షిణః 88

ప్రచ్చాద్య వల్లికైర్దేవి జాతరూప పర్చిదైః | యమం ప్రస్థాపయామాస తాం పురీం దక్షిణాం దిశమ్‌ 89

గుప్తాయాం ప్రతిమాయాం తు ఇంద్రనీలస్య వైతదా l తస్మిన్‌ క్షేత్ర వరే పుణ్య విఖ్యాతే పురుషోత్తమే 90

యత్కృతం తత్ర వృత్తాంతే దేవదేవో జనార్థనః l తత్సర్వం కధ యామాస స తసై#్య భగవాన్పురా 91

ఇంద్రద్యుమ్నస్య గమనం క్షేత్ర సందర్శనం తథా l క్షేత్రస్య వర్ణనం చైవవ్యుష్టిం తస్య చ మోహిని 92

దర్శనం బలదేవస్య కృష్ణస్య చ విశేషతః l సుభద్రాయాశ్చ తత్రైవ మహాత్మ్యం చైవ సర్వశః 93

దర్శనం నరసింహ్య వ్యుష్టి సంకీర్తనం తథా l అనంతవాసు దేవస్య దర్శనం గుణ కీర్తనమ్‌ 94

శ్వేత మాధవ మాహాత్మ్యం స్వర్గ ద్వారస్య వర్ణనమ్‌ l ఉదధేర్దర్శనం చైవ స్నానం తర్పణమేవచ 95

సముద్ర స్నాన మాహాత్మ్య మింద్రద్యుమ్నస్య చాపివై l పంచతీర్థ ఫలం చైవ మహాజ్యైష్ట్యాం తథైవ చ 96

స్నానం కృష్ణస్య హలినః సర్వయాత్రాఫలం తథా l వర్ణనం విష్ణులోకస్య క్షేత్రస్యచ పునః స్వయమ్‌

పూర్వం కధిత వాం స్తథ్యాం తసై#్యస పురుషోత్తమః 97

ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణోత్తర భాగే

వసు మోహినీ సంవాదే

పురుషోత్తమ మాహాత్య్మే

ద్విపంచశత్తమోs ధ్యాయః

యమధర్మరాజు పలికెను:-

పురుషోత్తమ తీర్థముగా ప్రఖ్యాతి గాంచిన ఈ పుణ్యాయ తనమున ఇంద్రనీలమయమగు సర్వకామ ప్రదయగు ప్రతిమసృజించ బడినది. ఆ ప్రతిమను నిశ్చల భావముచె దర్శించిన వారు కామనా రహితులైశా శ్వాతలోకమును చేరుచున్నారు. కావున నా కర్తవ్యమును నేను చేయ జాలమన్నాను. కావున నాయందు దయతలచ దయతలచి ప్రతిమనుప సంహరించుకొనుము అని. ఈయముని వాక్యమును విని నేనిట్లు పలికితిని . ఓయమ ధర్మరాజా! ఈ ప్రతిమను సైకతము చే కప్పివేతును. అని అప్పుడంతట వల్లుల చే ఆ ప్రతిమను కప్పి పుచ్చితిని. అచట మానవులు ఈ ప్రతిమనుచూడజాలరు. బంగారు వన్నెగల లతలచే ప్రతిమను కప్పి యముని పంపివేసెను. ఇట్లు ప్రసిద్దిగాంచిన పురుషోత్తమ క్షేత్రమున ఇంద్రనీలమయ ప్రతిమను దాచిన తరువాత జరిగిన వృత్తాంతమును దేవదేవుడగు జనార్దనుడు వివరించెను. ఇంద్రద్యుమ్నుడు వెళ్ళుట, క్షేత్ర సందర్శనము, క్షేత్ర వర్ణము, క్షేత్ర మహాత్మ్యము, బలదేవ కృష్ణ సుభద్రా దర్శనము, నరసింహ దర్శను, వ్యుష్టి సంకీర్తనము, అనంత వాసుదేవ దర్శనము, గుణకీర్తనము, శ్వేత మాధవ మాహాత్మ్యము, స్వర్గద్వార వర్ణనము, సముద్ర దర్శనము, స్నానము, తర్పణము, సముద్రస్నాన మహాత్మ్యము, ఇంద్రద్యుమ్నుడాచరించిన పంచతీర్థఫలము, మహాజ్యేష్టీ విశేషము, కృష్ణ బలరాముల స్నానము, సర్వయాత్రా ఫలము, విష్ణులొక వర్ణనము, క్షేత్ర వర్ణనము దీనినంతటిని పూర్వము మహాలక్ష్మీదేవికి పురుషోత్తముడు వివరించెను.

ఇది శ్రీ బృహన్నారాదీయ మహాపురాణమున

ఉత్తర భాగమున వసుమోహినీసంవాద

మున పురుషోత్తమ మాహత్మ్యమను

యాబది రెండవ అధ్యాయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page