Brahma Suthra Vivruthi Chapters Last Page
పండితాభ్రిప్రాయములు
''తర్కవేదాంత సార్వబౌమ, శాస్త్ర రత్నాకర, బ్రహ్మశ్రీ వేదమూర్తులు''
మండలీక వేంకట శాస్త్రిగారు
ప|| ప|| శ్రీ శ్రీ శ్రీ గాయత్రీ పీఠాధిపతులు శ్రీ విద్యాశంకర భారతీస్వామివారిచే రచితమైన బ్రహ్మసూత్రార్థ వివరణముతో గూడిన బ్రహ్మసూత్ర వివృతిని స్థాలీపులాకన్యాయముగ చూచి ఆనందించితిని. ఉపనిషత్తత్త్వము నెఱుంగగోరువారికి శ్రీ శంకర భగవత్పాద విరచిత బ్రహ్మ సూత్ర భాష్యము అవశ్య పఠనీయము. తత్పఠనము శాస్త్రజ్ఞానము లేని వారికి సంస్కృత భాషానభిజ్ఞులకును కష్టసాధ్యము. ఈ ప్రస్తుత గ్రంథము సంస్కృత భాషా పరిచయము లేనివారికి సైతము సులభ పఠనీయమై అద్వైత సిద్ధాంత ప్రవేశమును కలిగించి సూత్రభాష్య పఠనాభిరుచిని పెంపొందించుచు ఉపనిషత్తత్వమును కరతలామలకముగ నందింపగలదు. శ్రీ స్వాములవారు ఇట్టి గ్రంథమును వ్రాసి తత్త్వజిజ్ఞాసువులైన సర్వ జనులకు మహోపకృతిని గావించిరి. ఈ గ్రంథము అందరి మన్ననలను పొందగలదని ఆశించుచున్నాను.