Sri Padma Mahapuranam-I    Chapters   

ఏకాదశోధ్యాయః

శ్రాద్ధ యోగ్య తీర్థక్షేత్ర వర్ణనమ్‌

శ్రాద్ధయోగ్య తీర్థక్షేత్రములు

శ్రాద్ధమాహాత్మ్యము :-

పగ లేభాగమందు పితృశ్రాద్ధ మాచరింపవలెను? ఏ తీర్థములందది పెట్టిన విశేషఫలముగల్గునని భీష్ము డడుగ పులస్త్యుం డిట్లనియె. పుష్కరతీర్థము ఇది ఉజ్జయిని ప్రాంతము మాల్వము శ్రాద్ధమునకు సర్వోత్తమము. ఉత్తమ ద్విజుల మనోరధము (కోరిక) రూపుగట్టెనా యన్నట్లున్నదేతీర్థము. ఇక్కడ చేసిన దానము హోమము జపము అనంతమయితీరును. పితృదేవతలకిది నిరంతర ప్రియస్థానమని ఋషుల పరమాభిప్రాయము. ఈపైన నందలలితము మాయాపురి ఇత్యాదిగ 137 పితృశాంతియోగ్యములయిన నదీ తీర్థక్షేత్రాలు పేర్కొనబడినవి. వాని స్థాననిర్ణయముచేసి యిప్పటివాని వాడుకపేర్లతో నొక పటము (Map) యిక్కడ యీయబడుచున్నది. ఇది ఈ అధ్యాయమునందున్నది.

భీష్మ ఉవాచ :

కస్మి న్వాసర భాగేతు పితృశ్రాద్ధం సమాచరేత్‌ | తీర్థేషు కేషు వై శ్రాద్ధం కృతం బహుఫలం ద్విజ ! || 1

పులస్త్య ఉవాచ : తీర్థంతు పుష్కరం నామ శ్రాద్ధే శ్రేష్ఠతమం స్మృతం

సర్వేషాం ద్విజ ముఖ్యానాం మనోరథ మివస్థితమ్‌ || 2

తత్రదత్తం హుతం జప్త మనంతం భవతి ధ్రువం | పితౄణాం వల్లభం నిత్య మృషీణాం పరమం మతమ్‌ || 3

నందాథ లలితం తద్వత్తీర్థం మాయా పురీ శుభా | తథా మిత్రపదం రాజం స్తతః కేదార ముత్తమమ్‌ || 4

గంగా సాగర మిత్యాహుః సర్వతీర్ధమయం స్మృతం | తీర్థం బ్రహ్మసర స్తద్వత్‌ శతద్రు సలిలం శుభమ్‌ || 5

తీర్థంతు నైమిశం నామ సర్వతీర్థ ఫలప్రదం | గంగోద్భే దస్తు గౌమత్యాం యత్రోద్భూతః సనాతనః || 6

తథాయజ్ఞపరాహస్తు దేపదేవశ్చ శూలభృత్‌ | యత్ర తత్కాంచనం దాన మష్టాదశ భుజోహరః || 7

నేమిస్తు ధర్మచక్రస్య శీర్ణా యత్రాభవ త్పురా | తదేత న్నైమిశారణ్యం సర్వతీర్థ నిషేవితమ్‌ || 8

దేవాదిదేవస్య తత్రాపి వరాహస్యచ దర్శనమ్‌ | యః ప్రయాతి స పూతాత్మా నారాయణపురమ్‌ వ్రజేత్‌ || 9

కోకాముఖమ్‌ పరమ్‌ తీర్థ మింద్ర మార్గోపి లక్ష్యతే | అథాపి పితృతీర్థంతు బ్రహ్మణో వ్యక్త జన్మనః || 10

పుష్కరారణ్య సంస్థోసౌ యత్ర దేవః పితామహః | విరించి దర్శనం శ్రేష్ఠమపవర్గ ఫలప్రదమ్‌ || 11

కృతం నామ మహాపుణ్యమ్‌ సర్వపాప నిఘాదనం | యత్రాద్యో నారసింహస్తు స్వయమేవ జనార్దనః || 12

తీర్థమిక్షుమతీ నామ పితౄణాంచ శుభావహా | తుష్యంతి పితరో నిత్యం గంగాయామున సంగమే || 13

కురుక్షేత్రం మహాపుణ్యమ్‌ యత్రమార్గోపి లక్ష్యతే | అద్యాపి పితృతీర్థంతు సర్వకామ ఫలప్రదమ్‌ || 14

నీలకంఠ మితి ఖ్యాతమ్‌ పితృతీర్థం నరాధిప | తథా భద్రసరః పుణ్యమ్‌ సరోమానసమేవచ || 15

మందాకినీ తథాచ్ఛోదా విపాశాచ సరస్వతీ | సర్వమిత్ర పదం తద్వద్వైద్యనాథమ్‌ మహాఫలమ్‌ || 16

క్షిప్రానదీ తథాపుణ్యా తథాకాలమ్‌ జరమ్‌ శుభమ్‌ | తీర్థోద్భేదమ్‌ గర్భభేదమ్‌ మహాలయమ్‌ || 17

భ##ద్రేశ్వరమ్‌ విష్ణుపదమ్‌ నర్మదా ద్వార మేపచ | గయా పిండప్రదానేన సమాన్యాహు ర్మహర్షయః || 18

ఏతాని పితృతీర్థాని సర్వపాప హరాణిచ | స్మరణాదపి లోకానాం కిము శ్రాద్ధ ప్రదాయినాం || 19

ఓంకారం పితృతీర్థంతు కావేరీ కపిలోదకమ్‌ | సంభేద శ్చండవేగాయామ్‌ తథైవామర కంటకమ్‌ || 20

కురుక్షేత్రాచ్చ ద్విగుణం తస్మిన్‌ స్నా నాదికం భ##వేత్‌ | శుక్ల తీర్థంతు విఖ్యాతం తీర్థం సోమేశ్వరమ్‌ పరమ్‌ || 21

సర్వవ్యాధిహరం పుణ్యం ఫలం కోటి గుణాధికమ్‌ | శ్రాద్దే దానే తథా హోమే స్వాధ్యాయేచాపి సన్నిధౌ || 22

కాయావారోహణం నామ దేవదేవస్య శూలిసః | అవతారం రోచమానం బ్రాహ్మణా వసధే శుభే || 23

జాతం తత్సుమహాపుణ్యం తధా చర్మణ్వతీ నదీ | శూలతాపీ పయోష్ణీచ పయోస్ణీసంగమస్తథా || 24

మహౌషధీ చారణాచ నాగతీర్థ ప్రవర్తినీ | మహావేణా నదీ పుణ్యా మహాశాల స్తథైవచ || 25

గోమతీ వరుణా తద్వత్తీర్థం హౌతాశనం పరమ్‌ | భైరవం భృగుతుంగంచ గౌరీతీర్థ మనుత్తమమ్‌ || 26

తీర్థం వైనాయకం నామ వస్త్రేశ్వర మనుత్తమమ్‌ | తథా పాపహరం నామ పుణ్యావేత్రవతీ నదీ || 27

మహారుద్రం మహాలింగం దశార్ణాచ మహానదీ | శతరుద్రా శతాహ్వాచ తథా పితృ పరం పదమ్‌ || 28

అంగారవాహకం తద్వన్నదౌ ద్వౌశోణ ఘర్ఘరే | కాలికాచ నదీ పుణ్య పితరాచ నదీ శుభా || 29

ఏతాని పితృతీర్థాని శస్యంతే స్నానదానయోః | శ్రాద్ధమేతేషు యద్దత్తం తదనస్తఫలం స్మృతమ్‌ || 30

శతావటా నదీ జ్వాలా శరద్వీచ సదీ తథా | ద్వారకా కృష్ణ తీర్థంచ తథా హ్యుదక్సరస్వతీ || 31

నదీ మానవతీనామ తథాచ గిరికర్ణికా | ధూత పాపమ్‌ తదా తీర్థక సముద్రే దక్షిణ తథా || 32

గోకర్ణో గజకర్ణశ్చ తథా చక్రనదీ శుభా | శ్రీశైలం శాక తీర్థంచ నరసింహ మతఃపరమ్‌ || 33

మహేంద్రంచ తధా పుణ్యం పుణ్యాచాపి మహానదీ | ఏతేష్వపి సదా శ్రాద్ధ మనంత ఫలదం స్మ్భతమ్‌ || 34

దర్శనాదపి పుణ్యాని సద్యః పాపహరాణివై | తుంగభద్రానదీ పుణ్యా తథా చక్రరధీతిచ || 35

భీమేశ్వరం కృష్ణవేణీ కావేరీచాంజనానదీ | నదీ గోదావరీ పుణ్యా త్రి సంధ్యాపూర్ణ ముత్తమమ్‌ || 36

తీర్థ త్రైయ్యంబకం నామ సర్వతీర్థ నమస్కృతం | యత్రాస్తే భగవాన్‌ భీమః స్వయమేవ త్రిలోచనః || 37

శ్రాద్ధమేతేషు సర్వేషు దత్తం కోటి గుణం భ##వేత్‌ | స్మరణాదపి పాపాని ప్రజంతి శతాధా నృప || 38

శ్రీవర్ణాచ నదీ పుణ్యా వ్యాసతీర్థ మనుత్తమమ్‌ | తదా మత్స్య నదీకారా శివధారా తథైవచ || 39

భవతీర్థంచ విఖ్యాతం పుణ్యతీర్థంచ శాశ్వతమ్‌ | పుణ్యం రామేశ్వరం తద్వద్వేణా పుర మలంపురమ్‌ || 40

అంగారకంచ విఖ్యాత మాత్మదర్శ మలంబుషమ్‌ | వత్సవ్రాతేశ్వరం తద్వత్తథా గోకాముఖం పరమ్‌ || 41

గోవర్థనం హరిశ్చంద్ర పురశ్చంద్రం పృధూదకమ్‌ సహస్రాక్షం హిరణ్యాక్షం తథాచ కదలీ నదా || 42

నామధేయానిచ తథా తథాసౌమిత్ర సంగతమ్‌ | ఇంద్రనీలం మహానాదం తథాచ ప్రియమేలకమ్‌ || 43

ఏతాన్యపి సదా శ్రాద్ధే ప్రశస్తాన్యధికానిచ | ఏతేషు సర్వదేవానాం సాం నిధ్యం పద్యతేయతః || 44

దాన మేతేషు సర్వేషు భ##వేత్కోటి శతాధికమ్‌ | బహుదాచ నదీ పుణ్యా తథా సిద్థపటం శుభమ్‌ || 45

తీర్థం పాశుపతంచైవ నదీ పర్యటికా తధా | శ్రాద్ధ మేతేషు సర్వేషు దత్తం కోటి శతోత్తరమ్‌ || 46

తథైవ పంచతీర్థంచ యత్ర గోదావరీ నదీ | యుతా లింగ సహస్రేణ సవ్యేతర జలావహా || 47

జామదగ్నస్య తత్తీర్థం మోదాయతన ముత్తమమ్‌ | ప్రతీకస్య భయాత్సిద్ధా యత్ర గోదావరీ నదీ || 48

తీర్థం తద్ధవ్య కవ్యానామ ప్సరోగణ సంయుతమ్‌ | శ్రాద్ధాగ్నిదాన కార్యంచ తత్రకకోటి శతాధికమ్‌ || 49

తథా సహస్రలింగంచ రాఘవేశ్వర ముత్తమమ్‌ | సేంద్రకాలా నదీపుణ్యా తత్ర శక్రో గతః పురా || 50

నిహత్య సముచిం మిత్రం తపసా స్వర్గమాప్తవాన్‌ | తత్ర దత్తం నరైః శ్రాద్ధ మనంత ఫలదం భ##వేత్‌ || 51

పుష్కరంనామవై తీర్థం సాలగ్రామం తధైవచ | శోణపాతశ్చ విఖ్యాతే యత్ర వైశ్వాన రాశయః || 52

తీర్థ సారస్వతంచైవ స్వామితీర్థం తధైవచ | మలందరా నదీ పుణ్యా కౌశికీ చంద్రకా తథా || 53

విదర్భాచాథవేగాచ పయోష్ణీ ప్రాజ్ముఖా పరా | కావేరీచోత్తరాంగాచ తధా జాలంధరో గిరిః || 54

ఏతేషు శ్రాద్ధ తీర్థేషు శ్రాద్ధ మానత్య మశ్నుతే | లోహదండం తథా తీర్థం చిత్రకూటస్తధైవచ || 55

దివ్యం సర్వత్ర గంగాయా స్తథా నద్యా స్తటం శుభమ్‌ | కుబ్జామ్రకమ్‌ తథా తీర్థ ముర్వశీపులినం తథా || 56

సంసారమోచనం తీర్థం తథైవ ఋణమోచనం | ఏతేషు పితృతీర్థేషు శ్రాద్ధమానంత్యమశ్నుతే || 57

అట్టహాసం తథా తీర్థం గౌతమేశ్వరమేవచ | తథా వాసిష్ట తీర్థంచ భారతంచ తతః పరమ్‌ || 58

బ్రహ్మావర్తం కుశావర్తం హంసతీర్థం తథైవచ | పిండారకంచ విఖ్యాతం శంఖోద్దారం తథైవచ || 59

భాండేశ్వరం బిల్వకంచ నీలపర్వతమేవచ | తథాచ బదరీ తీర్థం సర్వతీర్థేశ్వరేశ్వరం || 60

వసుధారాహ్వయం తీర్థ రామ తీర్థం తథైవచ | జయంతీ విజయాచైవ శుక్లతీర్థం తథైవచ || 61

ఏషు శ్రాద్ధ ప్రదాతారః ప్రయాంతి పరమంపదమ్‌ | తీర్థ మాతృగృహం నామ కరవీరపురం తథా || 62

సప్తగోదావరీనామ సర్వతీర్థేశ్వరేశ్వరమ్‌ | తత్ర శ్రాద్ధం వ్రదాతవ్య మనంత ఫలమీప్సుభిః || 63

గయాతీర్థ శ్రాద్ధ ప్రశంసా :

కీకటీషు గయాపుణ్యా పుణ్యం రాజగృహం వనమ్‌ | చ్యవనాశ్రమం పుణ్యం నదీ పుణ్యా పునః పునః || 64

విషయారాధనం పుణ్యం నదీయాతు పునః పునః | యత్ర గాథా విచరతి బ్రహ్మణా పరికీర్తితా || 65

ఏష్టవ్యా బహవః పుత్రా యద్యేకో పి గయాం వ్రజేత్‌ | యజేతవాశ్వమేధేన నీలం వా వృషముత్సృజేత్‌ || 66

ఏషాగాథా విచరతి తీర్థే ప్యాయతనేషుచ | సర్వే మనుష్యా రాజేంద్ర కీర్తయంతః సమాగతాః || 67

కిమస్మాకం కులే కశ్చిద్గయాం యాన్యతి యః సుతః | ప్రీణయిష్యతి తాన్‌ గత్వా సప్తపూర్వాం స్తథాపరాన్‌ || 68

మాతామహానామప్యేవం శ్రుతిరేషాంచిరంతనా | గంగాయా మస్థి నిచయం గత్వా క్షేపప్స్యతియః సుతః || 69

తిలైః సప్తాష్టభిర్వాపి దాస్యతేచ జలాంజలిమ్‌ | అరణ్యత్రితయేవాపి పిండదానం కరిష్యతి || 70

ప్రథమం పుష్కరారణ్య నైమిషే తదనంతరమ్‌ | ధర్మారణ్యం పునః ప్రాప్య శ్రాద్ధం భక్త్యాప్రదాస్యతి || 71

గయాయాం ధర్మపృష్టేవా నరసి బ్రహ్మణ స్తథా | గయాశీర్ష వటేచైవ పితౄణాం దత్తమక్షయమ్‌ || 72

వ్రజన్కృత్వా నివాపంయస్త్వధ్వానం పరిసర్పతి | నరకస్థా న్పితౄన్సోపి స్వర్గం నియతి సత్వరమ్‌ || 73

కులేతస్యన రాజేంద్ర ప్రేతో భవతి కశ్చన | ప్రేతత్వం మోక్షభావంచ పిండదానాచ్చ గచ్ఛతి || 74

ఏకో మునిస్తామ్రకరాగ్రహస్తో హ్యామ్రేఘ మూలే సలిలం దదాతి |

అమ్రాశ్చ సిక్తాః పితరశ్చ తృప్తా ఏకాక్రియా ద్వ్యర్థకరీ ప్రసిద్ధా || 75

గయాయాం పిండదానస్య నాన్యద్దానం విశిష్యతే | ఏకేన పిండ దానేన తృప్తాస్తే మోక్షగామినః || 76

ధాన్యప్రదానం ప్రవరం వదంతి వసుప్రదానం చ తథా మునీంద్రాః |

గయాసు తీర్థేషు నరైః ప్రదత్తం తద్ధర్మహేతుం ప్రవరం వదంతి || 77

సర్వాత్మనా సురుచినా మహాచల మహానదీ | యేతు పశ్యంతి తాం గత్వా మానసం దక్షిణోత్తరే || 78

ప్రణమ్య ద్విజముఖ్యేభ్యః ప్రాప్తం తైర్జన్మనః ఫలమ్‌ | యద్య దిచ్ఛతి వై మర్త్యస్తత్తదాప్నోత్య సంశయమ్‌ || 79

ఏష తూద్దేశతః ప్రో క్తస్తీర్థానాం సంగ్రహోమయా | వాగీశోపి న శక్నోతి విస్తరాత్కిము మానుషః || 80

సత్యం తీర్థం దయా తీర్థ మిన్ద్రియ నిగ్రహః | వర్ణాశ్రమాణాం గేహేపి తీర్థం శమ ఉదాహృతమ్‌ || 81

యేషు తీర్థేషు యచ్ఛ్రాద్ధమపవర్గదమ్‌ | గయాయాం యత్తు వై శ్రాద్ధం తచ్ఛ్రాద్ధమపవర్గదమ్‌ || 82

శ్రాద్ధయోగ్య సమయ నిరూపణమ్‌ :

యస్మాత్తస్మాత్ప్రయత్నేన తీర్థ శ్రాద్ధం విధీయతే | ప్రాతఃకాలో ముహూర్తాం స్త్రీ న్నంగవప్తావదేవతు || 83

మధ్యాహ్న స్త్రిమూహూర్తఃస్యా దపరాహ్ణ స్తతః పరమ్‌ | సాయాహ్నస్త్రిముహూర్తఃస్యా చ్ఛ్రాద్ధం తత్రనకారయేత్‌ || 84

రాక్షసీ నామసా వేలా గర్హితా సర్వకర్మసు | అహ్నో ముహూర్తా వ్యాఖ్యాతా దశపంచచ సర్వదా || 85

తత్రాష్టమో ముహూర్తోయః సకాలః కుతపః స్మృతః | మధ్యాహాత్సర్వదా యస్మాన్మందోభవతి భాస్కరః || 86

తస్మాదనంత ఫలద స్తత్రారంభో విశిష్యతే | ఖడ్గ పాత్రం చ కుతవ న్తథనైపాలకం బలః || 87

రుక్మం దర్భాస్తిలాగావో దౌహిత్రచ్చాష్టమః స్మృతః | పాపం కుత్సిత మిత్యాహు స్తస్య తత్తాపకారిణః || 88

అష్టావేతే యతస్తస్మాత్కతపా ఇతి విశ్రుతాః | ఊర్థ్వం ముహూర్తాత్కుతపాన్ముహూర్తంచ చతుష్టయమ్‌ || 89

ముహూర్త పంచకంచైవ స్వధావాచన మిష్యతే | విష్ణు దేహ సముద్‌భూతాః కుశాః కృష్ణతిలా స్తథా || 90

తిల దర్భ కుశాది వర్ణనమ్‌ :

శ్రాద్ధస్య లక్షణం కాలమితి ప్రాహుర్మనీషిణః | తిలోదకాంజలిర్దేయో జలాంతే తీర్థవాసిభిః || 91

సహదర్భ స్తే నైకేన గృహే శ్రాద్ధం గమిష్యతి | పుష్యం పవిత్ర మాయుష్యం సర్వపాప వినాశనమ్‌ || 92

బ్రహ్మణాచైవ కధితం తీర్థశ్రాద్ధాను కీర్తనమ్‌ | శృణోతియః పఠేద్వాపిశ్రీమాన్సంజాయతే నరః || 93

శ్రాద్ధకాలేచ వక్తవ్యం తథా తీర్థ నివాసిభిః | సర్వపాపోవశాంత్యర్థ మలక్ష్మీ నాశనం మతమ్‌ || 94

ఇదం పవిత్రం యశసో నిధాన మిదం మహాపాతక నాశనంచ |

బ్రహ్మార్కరుద్రైరభి పూజితంచ శ్రాద్ధస్య మహాత్మ్యముశంతి తజ్ఞాః || 95

ఇతి శ్రీ పద్మపురాణ ప్రథమే సృష్టిఖండే

శ్రాద్ధప్రకరణం నామ ఏకాదశోధ్యాయః.

గయాతీర్థ శ్రాద్ధ ప్రశంస

పెక్కుమంది పుత్రులు కలుగవలెనని కోరుకొనవలెను. ఒక్కడేని గయకు వెళ్ళునా అశ్వమేధయాగముచేయునా నల్లని యెద్దును అచ్చుపోసి విడచునా నేను దరింతును వాడు యిటు ఏడు తరములవారిని అటు తన తర్వాతి ఏడు తరముల వారిని తన వంశమువారిని మాతామహ వంశము వారిని దరింపజేయగలడు. అను గాథ లోకమందు ప్రసిద్ధమై యున్నది. దీనిని గుర్తించుచు యాత్రీకు లీ క్షేత్రతీర్థములకు వచ్చుచుందురు.

గంగయందు ఏడెనిమిది తిలలతో (నువ్వులతో) తిలాంజలి (తిలతర్పణము) సేయునా పితృదేవతలు తృప్తులగుదురు. 1. పుష్కరారణ్యము 2. నైమిశారణ్యము 3. ధర్మారణ్యము వీనియందు గయయందు ధర్మపృష్ఠమందు బ్రహ్మసరస్సునందు గయాశీర్షమందు పితరులకు బెట్టినది అక్షయమగును. ఈ తీర్థముల కేగి తిలాంజలులిచ్చినచో నరకము లందున్న పితరులను స్వర్గమందింపగలడు. వాని కులమందు ప్రేత అనువాడుండడు. ప్రేత అనగా ముక్తిపొందక అథోలోకాలలో భూతప్రేతపిశాచాది రూపములో వాయురూపమున సంచరించు జీవుడు ఈ చెప్పిన తీర్థములందు పిండప్రదాన మొక్కమారు చేసినను వాని పితృపితామహాదులు సంప్రీతులగుదురు. మోక్షముంగూడ పొందుదురు. గయలో చేసిన పిండ ప్రదానమును మించిన దాన మింకొకటిలేదు. ముని యొక్కడు (పుణ్యాత్ముడు) అరచేయి యెఱుపెక్కునట్లు మామిటిచెట్లకు నీరుపోసినచో ఆ చెట్లనుందియును పితరులుం దృప్తులగుదురు. చేసిన యొక్క పని రెండు ప్రయోజనములనిచ్చును. అను గాథయుం బ్రసిద్ధమే.

ధాన్యదానము ధనదానము గయలో పిండదానమును మహాగిరులను మహానదులను మానససరస్సును భారత దక్షిణోత్తర దిశలందున్నవారిని గయాతీర్థమును సేవించుట అత్యుత్తమ ధర్మహేతువుగా మహానుభావులు ఋషులు చాల ప్రశంసింతురు. ఉత్తమ బ్రాహ్మణులకు నమస్కరించినం జాలును జన్మము జన్మము సఫలమగును. అందువలన మానవు డేదేది కోరునదియెల్ల సిద్ధించితీరును.

కు=కుత్సికము పాపము దానిని తపింపజేయునది కుతపము. అట్టి కుతపములు ఎనిమిది. కుతపకాలము ఖడ్గపాత్ర (ఖడ్గమృగము తోలుతో జేసినది) నేపాలదేశపు కంబళి రుక్మము (బంగారము) దర్భలు తిలలు గోవులు దౌహిత్రుడు మనుమడు (దుహిత=కూతురు) కుతపము-దాని తరువాతి నాల్గు ముహూర్తములు (మొత్తమిది ముహూర్త పంచకము) స్వధాకారము విష్ణు శరీరమునుండి పుట్టిన దర్భలు నల్ల నువ్వులు పరమపవిత్రములు. తీర్థములందు నిత్యతర్పణము సేసిన తర్వాత తిలాంజలులు దర్భలం నువ్వులతో తీర్ధోదకమునుగొని దోసిలితో సమర్పింపవలెను. ఈ శ్రాద్ధవిధానము చతుర్ముఖబ్రహ్మ సెప్పినది. ఇది పుష్టికరము, ఆయుష్యము సర్వపాపహరము. ఇది విన్నను చదివినను మానవుడాగర్భ శ్రీమంతుడై పుట్టును. దీనిని శ్రాద్ధసమయమందు తీర్థవాసులు పారాయణము సేసినయెడల అలక్ష్మి (దారిద్ర్యము) పోవును. ఇది యశస్కరము పవిత్రము పాపహరము. బ్రహ్మా ఆదిత్యులు రుద్రులు గూడ పూజించిన దీ శ్రాద్ధమహాత్మ్యమని విజ్ఞులు మెచ్చుకొన్నారు.

ఇది ''శ్రాద్ధప్రకరణ'' మను పదునొకండవ అధ్యాయము.

Sri Padma Mahapuranam-I    Chapters