Sri Padma Mahapuranam-I
Chapters
త్రయోదశోధ్యాయః క్రోష్టు వంశ వర్ణనమ్ : పులస్త్య ఉవాచ : క్రోష్టోః శ్రుణుత్వం రాజేంద్రవంశ ముత్తమ పూరుషమ్ | యస్యాన్వవాయే సంభూతో విష్ణుర్వృష్ణికులోద్వహః || 1 క్రోష్టో రేవా భవత్పుత్రో వృజినీవా న్మహాయశాః | తస్య పుత్రో೭భవత్స్వాతిః కుశంకుస్తత్సుతో భవత్ || 2 కుశంకోరభవత్పుత్రో నామ్నా చిత్రరధో೭స్యతు | శశబిందు రితి ఖ్వాత శ్చక్రవర్తీ బభూవహ || 3 అత్రాసువంశ శ్లోకో೭యం గీతస్యపురా೭భపత్ | శశ బిందోస్తు పుత్రాణాం శతానామ భవచ్ఛతమ్ || 4 క్రోష్ట వంశ వర్ణనము : ఉత్తమ పురుషు లుదయించినది వృష్టికులోద్ధారకుడై విష్ణువు కృష్ణుడుగా నవతరించిన క్రోష్ట వంశము నాలింపుము. క్రోష్టుపునకు వృజినీవంతుడు గల్గెను. అతనికి ఖ్యాతి, కుశంకువు, చిత్రరధుడు, శకబిందువు వంశక్రమ మేర్పడినది. శశబిందువు చక్రవర్తి యయ్యెను. ఇక్కడ వంశపరంపరగా వినబడు ప్రాచీనశ్లోక మిది. ధీమతాం చారరూపాణాం భూరిద్రవిణ తేజసామ్ | తేషాం శతప్రధానానాం పృథుసాహ్వా మహాబలాః || 5 పృథుశ్రవాః పృథుయశాః పృథుతేజాః పృథూద్భవః | పృథుకీర్తిః పృథుమతో రాజానః శైశబిందవః || 6 శంసంతి చ పురాణజ్ఞాః పృథుశ్రవ సముత్తమమ్ | తతశ్చా స్యాభవత్పుత్ర ఉశనాః శత్రు తాపనః || 7 పుత్రశ్చో శసస్తస్యశినేయుర్నామ సత్తమః | అసీచ్ఛినేయోః పుత్రో యః సరుక్మక వచోమతః || 8 నిహత్య రుక్మకవచో యుద్ధే యుద్ధ విశారదః | ధన్వినో వివిధై ర్బాణౖరవాప్య పృథివీమిమామ్ || 9 అశ్వమేధే೭దదా ద్రాజా బ్రాహ్మణభ్యశ్చ దక్షిణామ్ | జజ్ఞేతు రుక్మక వచా త్పరావృత్పర వీరహా || 10 తత్పుత్రా జజ్ఞిరే పంచ మహావీర్య పరాక్రమాః | రుక్మేషు పృథురుక్మశ్చ జ్యామఘః పరిఘో హరిః || 11 దీని తాత్పర్యము : శతబిందువు కుమారులు నూర్గురు. ఆ నూర్వురకు నూర్వురు కొడుకులు గల్దిరి. వారందరు బుద్ధిమంతులు చక్కనివారు ఐశ్వర్యసమృద్ధులు తేజశ్శాలురు. ఆ రాజముఖ్యులకు నూర్వురకు పృథు శబ్దపూర్వకములైన పేర్లు కలవారార్గురు కుమారులు. పృథుశ్రవుడు పృథుయశుడు పృథుతేజుడు పృథూర్భవుడు పృథుకీర్తి పృథుమంతుడు శైశబిందువులు (శశబిందు సంతతి యన్నమాట) అందు పృథుశ్రవుని చాల యుత్తమునిగా పురాణజ్ఞులు కొనియాడుదురు. అతనికి శత్రుతాపనుడైన ఉశనసుడను కుమారుడు గల్గెను. అతనికి శినేయుడు రుక్మతని కొడుకు రుక్మవచుడు. అతడు యుద్ధ నిపుణుడు, వివిధ బాణముల మహావీరులం గూల్చి గెల్చుకొన్న యీ భూమినంతను ఱశ్వమేధము సేసి బ్రాహ్మణులకు యజ్ఞదక్షిణగా నిచ్చెను. అతనికి ఏకవరహంతకుడగు పరావృత్తమ కొడుకు గల్గెను. పరావృత్తు కొడుకులైదుగురు. వారి పేర్లు స్పష్టముగానున్నవి. పరిఘంచ హరించైవ విదేహే೭స్థాపయ త్పితా | రుక్మేషురభపద్రాజా పృథురుక్మ స్తథాశ్రయః || 12 తాభ్యాం ప్రవ్రాజితో రాజ్యా జ్జ్యామఘో೭వసదాశ్రమే | ప్రశాంతశ్చాశ్రమస్థస్తు బ్రాహ్మణన విబోధితః || 13 జగామ ధనురాదాయ దేశమన్యం ధ్వజీరథీ | నర్మదా తట ఏకాకీ కేవలం వృత్తికర్మితః || 14 ఋక్షవంతం గిరిం గత్వా ముక్తమన్యైరుపావిశత్ | జ్యామఘస్యో భవ ద్భార్యా శైబ్యా పరిణతా సతీ || 15 అపుత్రో೭ప్యభవద్రాజా భార్యామన్యామ చిన్తయన్ | తస్యాసీద్విజయో యుద్ధే తత్ర కన్యా మవాప్యసః || 16 భార్యా మువాచ సంత్రాసా త్స్నుషేయంతే శుచిస్మితే | ఏవముక్త్వాబ్రవీదేనం కస్యకేయంస్నుషేతివై || 17 రాజోవాచ యస్తేజనిష్యతే పుత్రస్తస్య భార్యా భవిష్యతి | తస్యాసా తపసోగ్రేణ కన్యాయాః సంప్రసూయత || 18 పుత్రం విదర్భం సుభగం శైబ్యా పరిణతా సతీ | రాజపుత్య్రాంతు విద్వాంసౌ స్నుషాయం క్రథకౌశికౌ || 19 లోమపాదం తృతీయంతు పుత్రం పరమధార్మికమ్ | పశ్చాద్విదర్భో೭జనయ చ్ఛూరం రణవిశారదమ్ || 20 పరిఘుని హరి విదేహరాజ్యమందు నిలిపెను. రుక్మౌఘుడు ప్రభువుగాగా, పృథురుక్ము డాతని దగ్గరనే యుండెను. జ్యామఘ చరిత్రము తద్వంశవర్ణనము జ్యామఘుడు సోదరుల విడిచి ప్రవ్రాజితుడై యిలువెడలి రాజ్యత్యాగముసేసి యాశ్రమవాసి యయ్యెను. అక్కడ మనశ్శాంతి గొని బ్రహ్మణునిచే జ్ఞానోపదేశమంది విల్లుగొని ధ్వజముం (టెక్కము) గొని రథమెక్కి నర్మదాతీరమందోక్కడై కేవలము శరీర స్థితి సాధనమైన వృత్తిగొని (అహారాదులు స్వీకరించుచు) కృశించి ఋక్షవంతమను పర్వతమున కేగి యెవ్వరుంజొరని యొక యేకాంతప్రదేశమున గూర్చుండెను. ఆతడు సేసికొన్న భార్య పతివ్రత శైబ్యి యను నామె యుండెను. ఆమెయందు పుత్రుడు కలుగకున్న నా రాజింకొక కన్యనుగూర్చి అలోచించకయే యుండెను, ఒక యుద్ధమం దతనికి విజయమొదవినంత నక్కడ నొక కన్యంగని, భార్య శైబ్యంగని జడియుచు శుచిస్మితే (అచ్చపు తెలినవ్వు మొగముధానా !) అని పిలిచి యిదిగో నీ కోడలనెను. అది విని రాజపత్ని శైబ్య యీమె యెవని భార్య యెవ్వరి కోడలని యెదురుప్రశ్న వేయ నా రాజు నీకు గలుగబోవు కొడుకును కీమె కాబోవు పెండ్లామని ప్రత్యుత్తరమిచ్చెను. ఆ కన్య సేసిన తీవ్ర తపస్సు వలన నా రాజు సేసికొన్న భార్య శైబ్యి విదర్భుడను చక్కని పుత్రునిం గనెను. విదర్భుడు రాజ పుత్రియందు విద్వాంసులు (జ్ఞానులు) అయిన క్రథకౌశికులను పరమధార్మికుడయిన రోమపాదునిం గనెను. అతడు రణ విశారదుడు వీరుడు. లోమపాదాత్మజో బభ్రుధృతి స్తన్యతు చాత్మజః | కౌశికస్యాత్మశ్చేది స్తస్మాచ్చైద్య నృపాః స్మృతాః || 21 క్రథో విదర్భ పుత్రోయః కుంతి స్తస్యాత్మజో೭భవత్ | కున్తే ర్జృష్టస్తతో జజ్ఞే ధృష్టా త్సృష్టః ప్రతాపవాన్ || 22 సృష్టస్య పుత్రో ధర్మాత్మా నివృత్తిః పరవీరహా | నివృత్తి పుత్రో దాశార్హో నామ్నాసతు విదూరథః || 23 దాశార్హపుత్రో భీమస్తు భీమా జ్జీమూత ఉచ్యతే | జీమూతపుత్రో వికృతి స్తస్య భీమరథః సుతః || 24 అథ భీమరథస్యాపి పుత్రో నవరథః కిల | తస్యచాసీద్దశరథః శకుని స్తస్య చాత్మజః || 25 తస్మాత్కరం భస్తస్మాచ్చ దేవరాతో బభూవహ | దేవక్షత్రో೭భవద్రాజా దేవరాతాన్మహాయశాః || 26 రోమపాదుని కొడుకు బభ్రువు. అతని కొడుకు ధృతి. కౌశికుని కుమారుడు చేది. అతని వంశమువారు చైద్యరాజులనువారు. విదర్భుని కుమారుడు క్రథరుని పుత్రుడు కుంతిరాజు కొడుకు ధృష్టుడు, అతని కొడుకు సృష్టుడు. అతని కొడుకు నివృత్తి యనువాడు ధర్మాత్ముడు శత్రువీర సంహర్త. నివృత్తి కుమారుడు దాశార్హుడు విదూరథుడను పేరివాడు. అతని కొడుకు భీముడు. అతని కొడుకు జీమూతుడు. అతని కొడుకు వికృతి. వికృతికొడుకు భీమరథుడు. అతని కొడుకు నవరథుడు, అతని కొడుకు దశరథుడు. శకుని యాతని కొడుకు. అతని కొడుకు కరంభుడు. వాని కొడుకు దేవరాజు. అతని కుమారుడు దేవక్షతుడు. మహా యశశ్శాలి. దేవగర్బసమో జజ్ఞే దేవక్షత్రస్య నన్దనః | మధుర్నామ మహాతేజా మధోః కురువంశః స్మృతః || 27 ఆసీత్కురువశాత్పుత్రః పురుహోత్రః ప్రతాపవాన్ | అంశుర్జజ్ఞే೭థ వైదర్భ్యాం ద్రవంత్యాం పురుహోత్రతః || 28 వేత్రకీత్వభ ద్భార్యా అంశో స్తస్యావ్యజాపత | సాత్వతః సత్వ సంపన్నః సాత్వతాం కీర్తివర్థనః || 29 ఇమాం విసృష్టిం విజ్ఞాయ జ్యామఘస్య మహాత్మనః | ప్రజావానేతి సాయుజ్యం రాజ్ఞః సోమస్య ధీమతః || 30 దేవక్షత్రుని నందనుడు దేవగర్భసముడు (దేవ కుమార సముడన్నమాట) మధువను నతడు. అతని కొడుకు కీరవాకుడు అతని పుత్రులు పురుహోత్రునికి అంశువనువాడు విదర్భరాజు కూతురగు ద్రవంతియందు కలిగెను. అంశుని భార్య వేత్రకీ. ఆమెయందతనికి సాత్వతుడు సత్యశాలియైనవాడు పుట్టెను. అతనికి కీర్తివర్థనుడుదయించెను. మహానుభావుడైన జ్యామఘుని యీ విసృష్టిని (ప్రతిసర్గమన్న మాట) తెలిసికొన్నతడు సంతానవంతుడగును. మహాత్ముడగు సోమరాజు సాయుజ్యముం బొందును. (సోముడనగా చంద్రుడు). సాత్వత వంశ వర్ణనమ్ : సాత్వతాన్సత్వ సంపన్నా కౌసల్యా సుషువే సుతాన్ | తేషాం గర్గాశ్చ చత్వారో విస్తరేణౖవతా ఞ్ఛృణు || 31 భజమానస్య సృఃజయ్యాం భజమాన సుతో೭భవత్ | సృంజ యస్య సుతాయాంతు భాజకాస్తు తతో೭భవత్ || 32 తస్య భాజస్య భార్యేద్వేనుఘవాతే సుతాన్బహూన్ | నేమిం చకృ కణం చైవ వృష్టిం పరపురం జయమ్ || 33 తే భాజకాః స్మృతాయస్మాద్భజమానా ద్ధ్విజజ్ఞిరే | దేవావృధః పృథున్వామ మధూనాం మిత్రవర్ధనః || 34 అపుత్రస్త్వభవ ద్రాజాచచార పరమం తపః | పుత్రః సర్వగుణపేతో మమ భూయాదితి న్పృహన్ || 35 సాత్వత వంశ వర్ణనము ry»R½*»R½V¬s ª«sÌÁƒ«s N_xqsÌÁù ƒ«sÌÁV*LRiV NRPVª«sWLRiVÌÁLi gRi®ƒsƒ«sV. ªyLRiV gRiLæRiVÌÁƒ«sV }msLRiLiµj…Lji. ªyLji ª«sLiaRP „sxqsòLRiª«sVV „sƒ«sVª«sVV. @LiµR…V ˳ÏÁÇÁª«sWƒ«sV²R…ƒ«sVªy¬sNTP xqsXLiÇÁLiVV ¸R…Vƒ«sV ƒy®ªsV¸R…VLiµR…V ˳ØÇÁÙ²R…ƒ«sV xqsV»R½V²R…VµR…LiVVLi¿Áƒ«sV. @»R½¬sNTP xqsXLiÇÁ¸R…VV¬s NRPW»R½VLRiLiµR…V ˳ØÇÁNRPVÌÁƒ«sVªyLRiV gRiÖæÁLji. ˳ØÇÁÙ¬s NTPµôR…LRiV ˳ØLRiùÌÁV. |msNRPV䪫sVLiµj… NRPVª«sWLRiVÌÁLi gRi¬sLji. ªyLRiV ®ƒs[„sV NRPXNRPßáV²R…V ª«sXztísQ¸R…VV ƒ«sƒ«sVªyLRiV. ÇÁª«sWƒ«sV xqsLi»yƒ«sª«sVV gSª«soƒ«s ªyLRiV ˳ØÇÁNRPVÌÁƒ«sV }msLRiLiµj…Lji. ®µ…[ªyª«sX´R…V²R…V ª«sX´R…Vª«sƒ«sV ƒ«sVxmsƒyª«sVª«sVV gRiÌÁªy²R…V ª«sVµ³R…VLSÇÁÙ ª«sLibdP¸R…VVÌÁNRPV „sVú»R½V²R…V ÇÁ¬sLi¿Áƒ«sV. @»R½²R…xmsoú»R½NRPV\®²… ƒyNRPV xqsLRi*gRiVßØÕ³ÁLSª«sVV²R…V NRPVª«sWLRiV²R…V gSª«sÛÍÁ సని తీవ్ర తపమొనరించెను. సంయోజృ కృష్ణమేవాథ వర్ణాశాయా జలం స్పృశన్ | సాతోయ స్పర్శనాత్తస్య సాంనిధ్యం నిమ్నగాహ్యగాత్ || 36 కల్యాణఞ్చర తస్తస్య శుశోచ నిమ్నగా తతః | చింతయాథ పరీతాత్మా జగామాథ వినిశ్చయమ్ || 37 భూత్వా గచ్ఛామ్యహం నారీ యస్యామేవం విధః సుతః | జాయేత తస్మాదద్యాహం భవామ్యస్య సుతప్రదా || 38 అథ భూత్వాకుమారీ సా బిభ్రతీ పరమం వపుః | జ్ఞాపయామాస రాజానం తామియేష నృప స్తతః || 39 అథసా నవమే మాసి సుషువే సరితాంవరా | పుత్ర సర్వగుణోపేతం బభ్రుం దేవా వృధాత్పరమ్ || 40 అత్రవంశే పురాణజ్ఞా బ్రువంతీతి పరిశ్రుతమ్ | గుణాన్దేవా వృధస్యాథ కీర్తయన్తో మహాత్మనః || 41 బభ్రు శ్రేష్ఠో మనుష్యాణాం దేవైర్దేవా పృధః సమః | షష్టిః శతంచ పుత్రాణాం సహస్రాణిచ సప్తతిః || 42 ఏతే೭మృతత్వం సంప్రాప్తాబభ్రోర్దేవావృధాదపి | యజ్ఞదాన తపోధీమాన్ బ్రహ్మణ్యః సుదృఢవ్రతః || 43 రూపవాంశ్చ మహాతేజా భోజో೭తో೭మృతకావతీ | శరకాస్తస్య దుహితా సుషువే చతురః సుతాన్ || 44 కృష్ణునే ధ్యానించుచు పర్ణాశానదీజలముపస్పృశించుచు నతడు తపస్సు చేయుచుండగా నతని స్పర్శ వలన నా నది దూరముగా నున్నది దగ్గరగా వచ్చెను. కల్యాణకార్య తీవ్ర తపోరూప మాచరించుచున్న యాతనింగని యా నది యా తపఃపరిశ్రమకు చాల పరితపించి అ చింతతో నేను స్త్రీనై యిలాటి కుమారుని గనవలె ననుకొని నేనే యీయన సంతానము నిచ్చుదాన నయ్యెదనుగాక అన్న యొక నిశ్చయమునకువచ్చి పరమసుందరియగు నొక కుమారియై యవతరించి తను నా రాజునకు జ్ఞాపకము సేసికొనెను. అంతట దేవావృథుడు నామెను వలచెను.ఆవల తొమ్మిదవ నెలలో సర్వగుణాభిరాముడగు బభ్రువనెడి పిల్లవానిం బ్రసవించెను. ఈ వంశములో మహాత్ముడగు దేవావృథుని గుణములను గొనియాడుచు, బభ్రువు మనుష్య శ్రేష్ఠుడు యితని తండ్రి దేవావృథుడు దేవసముడునను వారివలన డెబ్బదివేలారువందల మంది పుత్రులు అమృతత్వ మొందినారు. యజ్ఞదాస తపోధాములు బ్రహ్మణ్యులు ధృడవ్రతనిష్ఠులు ననువారు నని పురాణ వేత్తలు కొనియాడ వినుచున్నాము. వీరిలో భోజుడను నాతనివలన శరకాంతుని కూతురగు సమృతకావతి యను నామె నల్గురు కుమారులం గనెను. కుకురం భజసూనం చ శ్యామం కంబల బర్హిషమ్ | కుకురస్యాత్మజో వృష్టిర్వృష్టేస్తు తనయో ధృతిః || 45 కపోత రోమా తస్యాపి తిత్తిరి స్తస్యచాత్మజః | తస్యాదాద్ బహుపుత్రస్తు విద్వాన్పుత్రోనరిఃకిల || 46 ఖ్యాయతే తస్య నామాద్య చందనోదక దుందుభిః | అస్యాసీదభి జిత్పుత్రస్తతో జాతః పునర్వసుః || 47 అపుత్రోహ్యభిజిత్పూర్వ మృషిభిః ప్రేరితో ముదా | అశ్వమేధంతు పుత్రార్థమాజుహావనరోత్తమః || 48 తస్యమధ్యే విచరతః సభామధ్యాత్సుముత్థితః | అన్ధస్తు విద్వాన్ధర్మజ్ఞో యజ్ఞదాతా పునర్వసుః || 49 తస్యాసీ త్పుత్రమిథునం వసోశ్ఛారిజితః కిలః | ఆహుకశ్చాహుకీ చైవ ఖ్యాతామతి మతాంవర || 50 వారు కుకురుడు భజమానుడు శ్యాముడు కంబలబర్హిషదుడు నను పేరివారు. కుకురుని కొడుకు వృష్టి. వృష్టి కుమారుడు ధృతి. అతనివాడు కపోతరోముడు. తిత్తిరి యతని కొడుకు. అతని కొడుకు నరి. జ్ఞాని బహుపుత్రపంతుడును. అతని పేరీనాడు చందనోదక దుందుభి యను బ్రసిద్దికెక్కినది. ఇతని కొడుకు అభిజిత్తు. అతనికి పునర్వసువు పుట్టినాడు. అభిజిత్తు అపుత్రకుడై ఋషిప్రేరణను అశ్వమేధ మొనరించి పుత్రకామేష్టి సేసెను. ఆ యజ్ఞ మధ్యమందాత డుండగా సదస్సు నడుమనుండి గ్రుడ్డివాడు జ్ఞాని ధర్మజ్ఞుడు నగు పునర్వసువనువాడు లేచినాడు. అతనికి పుత్రమిథునము గల్గెను. వసుపు అరిజితుడుననియు ఆహుకుడు ఆహుకియు ననియు నా దంపతుల పేర్లు. ఇమాంశ్చోదాహరం త్యత్ర శ్లోకాంశ్చాతి రసాత్మకాన్ | సోపాసంగానుకర్షాణాం తను త్రాణాం వరూథినామ్ || 51 రథానాం మేఘఘోషాణాం సహస్రాణి దశైవతు | నా సత్యవాదినో భోజనాయ జ్ఞానా సహస్రదాః || 52 నాశుచిర్నాప్య విద్వాంసో నభోజాదధికో೭భవత్ | అహుకాంత మనుప్రాప్త ఇత్యేషో೭న్వయ ఉచ్యతే || 53 వీరిని బ్రశంసించు శ్లోకములను రసవత్తరమునగువానిని వీనిని పెద్దలుదాహరించుచుందురు. వాని భావ మిది. కవచధారులగు ఉపానందములు =అమ్ములపొదులు మోపుడు కొయ్యలుగల సేనల యొక్క మేఘఘోషము లైన రథముల యొక్క లెక్క పదివేలే. భోజరాజు అనృతవాదులు గారు. యజ్ఞముసేయనివారు లేనేలేరు. వేలకు వేలీ యనివారు కానేకాదు. అశుచి అవిద్వాంసుడు నీ వంశమందు లేడు. భోజునికంటె నధికుదింకొకడు లేడు. ఈ వంశ మహుకుని దాక వచ్చిన దందురు. అహుకశ్చాప్యవంతీషు స్వసారం చాహుకీం దదౌ | ఆహుకశ్చైవ దుహితా పుత్రో ద్వౌసమసూయత || 54 దేవకం చోగ్రసేనఞ్చ దేవగర్భ సమావుభౌ | దేవకస్య సుతాశ్చైవ జజ్ఞిరే త్రిదశోపమాః || 55 దేవవానుపదేవశ్చ సుదేవో దేవరక్షితః | తేషాం స్వసారః సపై#్తవ వసుదేవాయ తా దదౌ || 56 దేవకీ శ్రుత దేవాచ యశోదాచ శ్రుతిశ్రవా | శ్రీదేవాచోపదేవాచ సురూపాచేతి సప్తమీ || 57 నవోగ్రసేనస్య సుతాః కంసస్తేషాం చ పూర్వజః | న్యగ్రోధస్తు సునామాచ కంక శంకుః సుభూశ్చయః || 58 అన్యస్తు రాస్త్రపాలశ్చ బద్ధముష్టిః సముష్టికః | తేషాం స్వసారః పంచాసన్కంసాకంసనతీ తథా || 59 సురభా రాష్ట్ర పాలీచ కంకాచేతి పరాంగనాః | ఉగ్రసేనః సహావత్యో వ్యాఖ్యాతః కుకురోద్ధవః || 60 భజమానస్య పుత్రో೭భూద్రధి ముఖ్యో విదూరదః | రాజాధి దేవః శూరశ్చ విధూరథ సుతో೭భవత్ || 61 రాజాధిదేవస్య సుతౌ జజ్ఞాతే వీరసం మతౌ | క్షత్రప్రతే೭తి నిరతౌ శోణాశ్వః శ్వేతవాహనః || 62 ఆహుకునికి అవంతి (ఉజ్జయిని) దేశరాజులలో నొకడు తన చెల్లెలిని, ఆహుకి యను నామె నిచ్చెను. అహు కుని కూతురిద్దరు కొడుకులం గనెను. వారు దేవకుడు ఉగ్రసేనుడు ననువారు. ఇద్దరును దేవకుమారతుల్యులు. దేవకుని కుమారులు దేవసమానులు పుట్టిరి. వారు దేవవంతుడు ఉపదేవుడు సుదేవుడు దేవరక్షితుడు నను పేర్లవారు. వారి చెల్లెండ్రేడుగురు. వారిని వసుదేవునికిచ్చెను. దేవకి శ్రుతదేవ యశోద శ్రుతిశ్రవ శ్రీదేవ ఉపదేవ సురూప యనువారు, ఉగ్రసేనుని కొడుకులు తొమ్మండ్రు. అందు కంసుడు జ్యేష్ఠుడు. న్యగ్రోధుడు సునాముడు కంకుడు శంకువు సుభువు రాష్ట్ర పాలుడు బద్ధముష్టి సముష్టికుడు. వాని చెల్లెండ్రైదుగురు. కంస కంసవతి సురభి రాష్ట్రపాలి కంకయను సుందరులు. కుకుర కుమారుడగు నుగ్రసేనుడు అతని సంతతియు వివరింపబడినది. భజమానుని కొడుకు మహారథియగు విధూరథుడు రాజాధిదేవుడను శూరు విదూరథుని కుమారుడు. అధిదేవుని కొడుకులిద్దరు. క్షత్రవల్కుడు శ్వేతాశ్వవాహనుడగు శోణాశ్వుడనువాడు మహావీరలు. శోణాశ్వస్య సుతాః పంచ శూరా రణ విశారదాః | శమీచ రాజశర్మాచని మూర్తః శత్రుజిచ్ఛుచిః || 63 శమీపుత్రః ప్రతిక్షత్రః వృతిక్షత్రస్యచాత్మజః | ప్రతిక్షత్ర సుతో భోజో హృదీక స్తస్యచాత్మజః || 64 హృదీకస్యాభవన్ పుత్రా దశా భీమ పరాక్రమాః | కృతపర్మాగ్రజస్తేషాం శతధన్వాచ సత్తమః | దేవార్హశ్చ సుభానుశ్చ భీషణశ్చ మహాబలః || 65 అజాతశ్చ విజాతశ్చ కరకశ్చ కరంధమః | దేవార్హస్య సుతో విద్వాఞ్ఞజ్జే కంబల బర్హిషః || 66 అసమౌజాస్తతస్తస్య సమౌజాశ్చ సుతావుభౌ | అజాత పుత్రస్య సుతౌ ప్రజాయేతే సమౌజసౌ || 67 సమౌజః పుత్ర విఖ్యాతాస్త్రయః పరమధార్మికాః | సుదంశశ్చ సువంశశ్చ కృష్ణ ఇత్యనునామతః || 68 అంధకా నామిమం వంశం యః కీర్తయతి నిత్యః | ఆత్మనో విపులం వంశం ప్రజామాప్నోత్యయం తతః || 69 శోణాశ్వుని కొడుకులై దుగురు శూరులు. యుద్ధవిశారదులు. శమి రాజవర్మ నిమూర్తుడు శత్రుజిత్తు శుచి యను వారు. శమి కొడుకు ప్రతిక్షతుడు వానివాడు భోజుడు. హృదికుడు వాని కొడుకులు పందిమంది పరాక్రమశాలురు. వారిలో బెద్ద కృతవర్మ. శతధ్వనాదులు తరువాతివారు. దేవార్హుని తనయుడు జ్ఞాని కంబల బర్హిషుడు. వాని కొడుకు లిద్దరు అసమేజుడు సమేజుడు. చిరకాల మపుత్రుడైన తండ్రికి వీరు కల్గిరి. సమేజునికి ముగ్గురు కుమాళ్లు ధర్మపరులు. సుదంశుడు సువంశుడు కృష్ణుడు ననువారు. ఇది అంధకుల వంశము. నిత్యముం దీనిని కీర్తించునతడు వంశాభివృద్ధి సంతానాభివృద్దిని బొందును. స్యమంతకోపాఖ్యానమ్ గాంధారీచైవ మాద్రీచ క్రోష్టో ర్భార్మే బభూవతుః | గాంధారీ జనయామాస సుమిత్రం మిత్రవత్సలమ్ || 70 మాద్రీ యుథాజితం పుత్రం తతోవై దేవమీఢుషమ్ | అనమిత్రం శినించైవ పంచాత్ర కృత లక్షణాః || 71 అనమిత్ర సుతో నిఘ్నెని ఘ్నస్యాపిచ ద్వౌసుతౌ | ప్రసేనశ్చ మహావీర్యః శక్తిసేనశ్చతావు భౌ || 72 స్యమంతకం ప్రసేనస్య మణిరత్న మనుత్తమమ్ | పృధివ్యాం మణిరత్నానాం రాజేతి సముదాహృతమ్ || 73 హ్రది కృత్వా సుబహుశో మణిం తం సవ్యరాజత | మణిరత్నం యయాచే೭థ రాజార్థం శౌరిరుత్తమమ్ || 74 గోవిందశ్చ న తం లేభే శక్తో೭పిన జహారసః | కదాచిన్మృగయాం యాతః ప్రసేన స్తేన భూషితః || 75 బిలే శబ్ధం సశుశ్రావ కృతం సత్వేనకేనచిత్ | తతః ప్రవిశ్య స బిలం ప్రసేనో హ్యృక్ష మానదత్ || 76 ఋక్షః ప్రసేనంచ తథా ఋక్షం చాపి ప్రసేనజిత్ | ఆసాద్య యుయుధాతేతొ పరస్పర జయే చ్ఛయా || 77 హత్వాఋక్షః వృసేనంచ తతస్తం మణిమాదదాత్ | ప్రసేనంతు హతం శ్రుత్వా గోవిందః పరిశంకితః || 78 సత్రాజితాతు తద్భాత్రాదాయాదైశ్చ తథా పరైః | గోవిందేన హతో నూనం ప్రసేనో మణికారణాత్ || 79 స్యమంతకోపాఖ్యానము క్రోష్టు భార్యలు గాంధారీ మాద్రియును, గాంధారి సుమిత్రుం గనెను. మాద్రి యుధాజిత్తును దేవమీఢుషుని అనమిత్రుని శిని ఐదుగురం గనెను. అనమిత్రుని కొడుకు నిఘ్నుడు. వాని కొడుకు లిద్దరు ప్రసేనుడు శక్తిసేనుడు. ప్రసేనుని రత్నము స్యమంతకము పృథివందు రత్నరాజము లన్నిటికి రాజు. ప్రసేనుడు దానిని హృదయముపై ధరించి మిగుల రాణించెను, శౌరి (కృష్ణుడు) దాని నిమ్మని ప్రభువుకొరకు యతనిం గోరెను. కాని శక్తుడయ్యును దానిం బడయడయ్యె. దానిం గైసేసికొని ప్రసేను డొకతరి వేటకుం జనెను. అక్కడ నొక కలుగులో నొక శబ్దము విని యందుజొచ్చి యత డొక యెలుగుబంటిం జూచెను. ఇద్దరు నొండొరులందరిసి పోరాదిరి. ఆ ఋక్షము ప్రసేనుం గూల్చి మణి గొంపోయెను. నిహతుడగుట విని కృష్ణుడు చంపియుండునని సత్రాజిత్తు నతని జ్ఞాతులు మణికొరకు గోవిందునిచేతనే ప్రసేనుడు గూలె నిది నిశ్చయమని హరి శంకింపబడెను. ప్రసేనస్తు గతో೭రణ్యం మణిరత్నేన భూషితః | తం దృష్ట్వాని జఘానాథనత్యజన్తం స్యమంతకమ్ || 80 జఘానైవా ప్రదానేన శత్రుభూతంచ కేశవః | ఇతి ప్రవాద స్సర్వత్ర ఖ్యాతస్సత్రాజితా కృతః || 81 అథ దీర్ఘేణ కాలేన మృగయాం నిర్గతః పునః | యదృచ్ఛయాచ గోవిందో బిలాఖ్యాశ మథాగమత్ || 82 తతశ్శబ్దం యథాపూర్వం సచక్రే ఋక్షరాడ్ బలీ | శబ్దం శ్రుత్వాతు గోవిందః ఖడ్గపాణిః ప్రవిశ్యచ || 83 అపశ్యజ్జాంబవంతం చ ఋక్షరాజం మహాబలమ్ | తతన్తూర్ణం హృశీకేశస్త మృక్షమతిరంహసా || 84 జాంబవంతం సజగ్రాహ క్రోధసం రక్తలోచనః | దృష్ట్వా చైనం తథా విష్ణుం కర్మభిర్వైష్ణవీంతనుమ్ || 85 తుష్టాప ఋక్షరాజో೭పి విష్ణు సూక్తేన సత్వరమ్ | తతస్తు భగవాంస్తుష్టో వరేణ సమరోచయత్ || 86 మణిరత్నముం దాల్చి ప్రసేను డరణ్యమున కేగెను. అది యిమ్మన నీకు లేదనుటచే శత్రువైన వానిం గృష్ణుడు చంపెనన్న ప్రవాదను సత్రాజిత్తు లోకమంతటను చాటించెను. అటుపై చాలకాలమునకు గోవిందుడు వేటకుంజని అనుకోకుండ నటనున్న బిలముదరికిం జనెను. అంతట నా ఋక్షరాజము ముందరివలె నరచెను. అది విని కత్తింగొని లోనికిం జని జాంబవంతునిం గని కోపమూని కనులెఱ్ఱవడ వెంటనే మహావేగముతో జాంబవంతుం బట్టుకొనెను. అతడు పూర్వకర్మ సంస్కారముచే నీయనను వైష్ణవమూర్తింగా గని సత్వరము విష్ణుసూక్తముచే స్తుతించెను. అందువలన సంతుష్టుండై భగవంతుడు వరమడుగుమనెను. జామ్బవానుచ ఇష్టం చక్రప్రహారేణ త్వత్తోమే మరణం శుభమ్ | కన్యాచేయం మమ సుతా భర్తారంత్వా మవాప్నుయాత్ || 87 యో೭యం మణిః ప్రసేనాత్తుహత్వా చైవాప్తవానహమ్ | సత్వయా గృహ్యతాం నాథ మణిరేషో೭త్రవర్తతే || 88 జాంబవంతుడిట్లనియె : చక్రాయుధము దెబ్బకు నీచేతి మరణము శుభ మది. నా అభిమతము ఈ కన్య నా కూతురు నిన్ను భర్తగ బడయుంగాక. ఇక నీ మణి సంగతి నేను వ్రసేనునిం గూల్చి దీనిని నే బడసినాడను. ప్రభూ ! దీని నీవు గైకొనుము, ఇదిగో మణి యిక్కడున్నది. ఇత్యుక్తో జాంబవంతం వైహత్వా చక్రేణ కేశవః | కృతకార్యో మహాబాహుః కన్యాంచైవా దదౌ తదా || 89 తతః నత్రాజితే చైతన్మణిరత్నం సవై దదౌ | యల్లబ్ధమృక్షరాజాచ్చ సర్వయాదవ సన్నిధౌ || 90 తేన మిథ్యా ప్రవాదేన సంతప్తో೭యం జనార్దనః | తతస్తే యాదవాః సర్వే వాసుదేవా మథాబ్రువన్ || అస్మాకం మనసి హ్యాసీత్ప్రసేనస్తు త్వయాహతః | 91 అన యెలుగురాజునం గృష్ణుడు చక్రముచే జాంబవంతుని గూల్చి ఆవిధముగ పనిం జక్కబెట్టుకొని కన్యం గైకొనెను. అపవాదుకు భయపడ హరి నా మణిని ఋక్షరాజునుండి లభించినదానిని యాదవులందరి దరిని సత్రాజిత్తున కొసగెను. అందుల కవ్వల యాదవులందరు వాసుదేవుని నీ చేతనే ప్రసేనుడు గూలె ననుకొంటి మనిరి. సత్రాజిత వంశక్రమః ఏకైకస్యాస్తు సుందర్యోదశ సత్రాజితః సుతాః || 92 సత్యోత్పన్నా స్సుతా స్తస్య శతమేకంచ విశ్రుతాః | విఖ్యాతాశ్చ మహావీర్యా భంగకారశ్చ పూర్వజః || 93 సత్యావ్రత ప్రతీ స్వప్నభంగకారస్య పూర్వజా | సుషుపుస్తాః కుమారాంశ్చ శినీవాలః ప్రతాపవాన్ || 94 అభంగో యుయుధానశ్చ శినిస్తస్యాత్మజో೭భవత్ | తస్మాద్యుగంధరాః పుత్రాశ్శతం తస్య వ్రకీర్తితాః || 95 అనమిత్రాహ్వయో యోవై విఖ్యాతో వృష్టివంశజః | అనమిత్రాచ్ఛినిర్జజ్ఞే కనిష్ఠో వృష్ణి నందనః || 96 అనమిత్రాచ్చ సంజజ్ఞే వృష్ణివీరోయుధాజితః | అన్యేచ తనయో వీరా వృషభిశ్చిత్ర ఏవచ || 97 ఋషభః కాశిరాజస్యసుతాం భార్వా మనిందితామ్ | జయంతశ్చ జయంతీంచ శుభాం భార్యామవిందత || 98 సత్రాజిత్తు వంశక్రమము సత్రాజిత్తున కొక్కొక్క భార్యయందు పదిమంది కుమారులు గల్గిరి. వారు నూర్గురు. సత్య (సత్యభామ యాతని కూతురు. అందు మొదటివాడు భంగకారుడు. శినీవాలుడు అభంగుడు యుయుధానుడు అనువారు. శిని కొడుకులు నూర్గురు యుగంధరులనువారు. అందు అనమిత్రుడు వృష్టివంశవర్థనుడు వాని కొడుకులలో శిని చివరివాడు. అనమిత్రునికి యుధాజితుడు గల్గెను. వృషభుడు చిత్రుడునుంగూడ గల్గిరి. ఋషభుడు కాశిరాజు కూతురును పెండ్లాడెను. జయంతుడు జతి యనుదాని పెండ్లాడెను జయంతస్య జయంత్యాం వైపుతః సమభవత్తతః | సదా యజ్వాతి ధీరశ్చ శ్రుతావానతిధి ప్రియః || 99 ఆక్రూరః సుషువే తస్మాత్సుదక్షో భూరిదక్షిణః | రత్నా కన్యాచ శైబ్యాచ అక్రూరస్తా మవాప్తవాన్ || 100 పుత్రా నుత్పాద యామాస ఏకాదశ మహాబలాన్ | ఉపలంభం సదాలంభ ముత్కలంచార్య శైశవమ్ || 101 సుధీరంచ సదా యక్షం శత్రుఘ్నం వారిమే జయమ్ | ధర్మ దృష్టించ ధర్మంచ సృష్టి మౌలిం తథైవచ || 102 ర్వేచ ప్రతిహర్తారో రత్నానాం జజ్ఞిరేచతే | అక్రూరా చ్ఛూర సేనాయాం సుతౌద్వౌకుల నందనౌ || 103 దేవ వానుపదేవశ్చ జజ్ఞాతే దేవ సంమతౌ | అశ్విన్యాం త్రిచతుః పుత్రాః పృథుర్విపృథురేవచ || 104 అశ్వగ్రీవో೭శ్వబాహుశ్చ సుపార్శ్వక గవేషణౌ | రిష్టనేమిః సువర్చాచ సుధర్మా మృదురేవచ || 105 భూమి ర్బహుభూమిశ్చ శ్రవిష్టా శ్రవణ స్త్రి¸° | ఇయం మిథ్యాభిశప్తం యో వేద కృష్ణస్య బుద్ధిమాన్ || 106 ఆమెయందతనికి పుత్రుడు గల్గెను. నిరంతరము యజ్ఞము సేసెను. వీరుడు పండితుడు అతిథిప్రియుడునై యుండెను. వానికి అక్రూరుడు గల్గెను. అతడు మంచి సమర్థుడు. భూరిదక్షిణుడు (సమ్బద్ధిగా దక్షిణలిచ్చి యజ్ఞములు సేసెనన్నమాట). అక్రూరునికి శైబ్యయందు పదునొకండుగురు కొడుకులు గల్గిరి. వారి పేర్లు స్పష్టముగా నున్నవి అందరూ రత్నహారులే. ఉత్తమపదార్థ సంపాదకులన్నమాట. అక్రూరునికి శూరసేనయందు దేవవంతుడు ఉపదేవుడను నందనులు కులనందనులుదయించిరి. దేవతలు మెచ్చుకొన్నవారు. అతనికి అశ్వినియను నామెయం దేడుగురు పుత్రులు పుజనరి. పేర్లు మూలములో స్పష్టముగా నున్నవి. అక్రూరునికి శ్రవిష్ఠ శ్రవణయునను కూతుండ్రిద్దరు. సఅసా మిధ్యాభి శాపేన అభిగమ్యశ్చ కేనచిత్ | ఐక్ష్వాకీ సుషువే పుత్రం శూర మద్భుత మీఢుషమ్ || 107 మీఢుషాజ్జజ్ఞిరే శూరా భోజాయాం పురుషాదశ | వసుదేవో మహాబాహుః పూర్వ మానక దుందుభిః || 108 దేవ భాగస్తథా జజ్ఞే తథా దేవశ్రవాః పునః | అనావృష్టిః కునిశ్చైవ ననందిశ్చైవ సకృద్యశాః || 109 శ్యామః శమీకః సప్తాఖ్యః పంచ చాస్య వరాంగనాః | శ్రుతకీర్తిః పృథాచైప శ్రుతదేవీ శ్రుతశ్రవాః || 110 ఇక్ష్వాకువు కూతురు శూరుడైన అద్భుతమీఢుడనువానిం గనెను. మీఢుషునికి భోజ యందు పదిమంది కొడుకులు శూరులు పుట్టిరి. వసుదేవుడు మొదటివాడు శూరుడు ఆనక దుందుభి యను పేరునూగలవాడు. అతనికి దేవభాగాదు లేడు గురు. శ్రుతకీర్తి మొదలుగా నైదుగురు కూతుండ్రునుం గల్గిరి. రాజాధిదేవీచ తథా పంచై తా వీరమాతరః | వృద్ధస్య శ్రుతదేవీ తుకారూపం సుషువే నృపమ్ || 111 కైకేయా చ్ఛ్రుతకీర్తేస్తు జజ్ఞేసంతర్దనో నృపః | శ్రుత శ్రవసి చైద్యస్య సునీథః సమపద్యత || 112 రాజాధిదేవ్యాః సంభూతో ధర్మాద్భయ వివర్జితః | శూరః సఖ్యేన బద్ధో೭సౌ కుంతిభోజే పృథాం దదౌ || 113 కైకేయుని వలన శ్రుతకీర్తికి సంతర్దనుడు పుట్టెను. శూరుడు మిత్రుడగు కుంతిభోజునికీ పెంచుకొనుమని పృథ నిచ్చెను. ఏవం కుంతీ సమాఖ్యాచ వసుదేవస్వసా పృథా | కుంతిభోజో೭దదాత్తాంతు పాండోర్భార్యా మనిందితామ్ || 114 పాణ్డ్వర్థే೭సూత దేవీసా దేవపుత్రా న్మహారథాన్ | ధర్మాద్యుధిష్ఠిరో జజ్ఞే వాతా జ్జజ్ఞే వృకోదరః || 115 ఇంద్రా ద్ధనంజయశ్చైవ శక్రతుల్య పరాక్రమః | యో೭సౌ త్రిపూరుషా జ్జాత స్త్రిభిః రంశైర్మహారథః || 116 దేవ కార్య కరశ్చైవ సర్వ దానవ సూదనః | అవధ్యశ్చాపి శక్రస్య దానవా యేన ఘాతితాః || 117 స్థాపిత స్సతు శ##క్రేణ లబ్ధవర్చా స్త్రివిష్టపే | మాద్రవత్యాంతు జనితా వశ్వినా వితి నఃశ్రుతమ్ || 118 వసుదేవుని చెల్లెలగు నామెకు కుంతి పృథ యను పేర్లీవిధముగా వచ్చినవి. కుంతిభోజు డా కుంతిని (పృథను) పాండురాజునకిచ్చెను. ఆమె పాండురాజు నిమిత్తముగా దేవతలవలన మహారథులం గనెను. ఆమెకు ధర్ముని వలన (యముని వలన) యుధిష్ఠిరుడు వాయుదేవుని వలనపృకోదరుడు (భీముడు) ఇంద్రుని వలన ధనంజయుడునుం బుట్టిరి. ఇట్లు ముగ్గురు పురుషులవలన మూడు వంశములతో మహారథమైన యీ సంతతి త్రితయ ముదయించెను. ఈసంతతి సర్వ దానవ సంహారము సేసినది. దేవకార్యము చక్కబెట్టినది. ఇంద్రునికింగూడ లొంగనిది. అఖండ తేజస్సంపత్తినుండి యీ సంతతి దేవేంద్రునిచే త్రివిష్టవమందు (స్వర్గమందు) నిలుపబడియున్నది. పాండురాజునకు మాద్రవతి (మాద్రియన్నమాట) యందు అశ్వినీదేవులుదయించిరని విందుము. వారే నకులసహదేవులు. రూపవంతులు గుణవంతులు. నకులః సహదేవశ్చ రూప సత్వగుణాన్వితౌ | రోహిణీ పౌరవీ నామ భార్యా చానక దుందుభేః || 119 లేభే చేష్టం సుతం రామం సారణం చ రణప్రియమ్ | దుర్థరం దమనంచైవ పిండారక మహాహనుమ్ || 120 వసుదేవుని రోహిణి పూరువంశజా రాముని పిండారకుడు మహాహనువు నను కొడుకులం గనెను. అథ మాయా త్వమావస్యా దేవకీయా భవిష్యతి | తస్యాం జిజ్ఞే మహాబాహుః పూర్వంతు స ప్రజాపతిః 121 అను జాతా భవత్కృష్ణా సుభద్రా భద్ర భాషిణీ | విజయోరోచమానస్తు వర్థమానశ్చ దేవలః || 122 ఏతే సర్వే మహాత్మాన ఉపదేవ్యాం ప్రజజ్ఞిరే | అగావహం మహాత్మానం బృహద్దేవీ వ్యజాయత || 123 బృహద్దేవ్యాం స్వయం జజ్ఞే మన్థకోనామ నామతః | సప్తమం దేవకీ పుత్రం రేమన్తం సుషువే సుతమ్ || 124 గవేషణం మహాభాగం సంగ్రామేష్వ పరాజితమ్ | శ్రుత దేవ్యా విహారేతు వనే విచరతా పురా || 125 వైశ్యాయాం సమ థబ్ఛౌరిః పుత్రం కౌశిక మగ్రజమ్ | శ్రుతం ధరాతు రాజ్ఞీతు సౌరగంధ పరిగ్రహః || 126 పుత్రంచ కపిలం చైవ వసుదేవాత్మజో బలీ | జనానాంచ విషాదో ೭భూత్ప్రథమః సధనుర్ధరః || 127 సౌభద్రశ్చాభవశ్చైవ మహాసత్వౌ బభూవతుః | దేవ భాగ సుతశ్చాపి ప్రస్తావః స బుధః స్మృతః || 128 పణ్డితం ప్రధమం బాహుదేవ శ్రవ స ముత్తమమ్ | ఇక్ష్వాకుకులతో యస్య మనస్విన్యా యశస్వినీ || 129 నివృత్త శత్రుః శత్రుఘ్నః శద్థాతస్మాజాయత | గండూషాయామపత్యాని కృష్ణస్తుష్టః శతం దదౌ || 130 స చంద్రంతు మహాభాగం వీర్యవంతం మహాబలమ్ | రంతి పాలశ్చ రంతిశ్చ నందనస్య సుతాపుభౌ || 131 మాయ అమావాస్యస్వరూపిణి దేవకి కాగలదు. ఆమె యందు మున్ను ప్రజాపతి పుట్టెను. అతని తర్వాత కృష్ణ సుభద్రయన మంగళభాషిణి యుదయించెను. విజయుడు రోచమానుడు వర్థమానుడు దేవలుడు నను నీ మహానుభావులుపదేవియందు జనించిరి. బృహద్దేవి అగావహుడను మహాత్మునిం గనెను. ఆమెయందు మంథకుడు స్వయముగ నావిర్భవించెను. దేవకి యేడవ కుమారుని రేమంతుని యుద్ధమునం దోడిపోని గవేషణుడను మహానుభావుని గనెను. శౌరి మున్ను వనవిహారము సేయుచు శ్రుతదేవియును వైశ్యస్త్రీ యందు కౌశికుడను పెద్దకొడుకుం గనెను. వసుదేవ కుమారుడు సౌర గంధుడు. అతని పత్ని శ్రుతంధర కపిలుని గనెను. సుభద్ర కుమారుడు ధనుర్దరులలో బ్రథముడు మహావీరుడు అభిమన్యుడు. అతడతి బాల్యమున యుద్ధమున హతుడగుటవలన జనులకెంతో విషాదముగల్గినది. కపిలుడు మహాబలవంతుడు దేవభగవానుని కొడుకు ప్రస్తావుడు. పండితుడు. శత్రుఘ్నుడు శత్రువులను మరలించినవాడు. అతనికి శ్రద్ధ యను కూతురు గల్గినది. కృష్ణుడు గండూష యెడ నానందభరితుడై నూరుగురు కుమారుల నిచ్చెను. అందు చంద్రుడనువాడు మహానుభావుడు. బలశాలి. వీర్యవంతుడు. వారిలో నందునుని కుమారులిద్దరు రంతిపాలుడు రంతి యనువారు. శమీకపుత్రా శ్చత్వారో విక్రాంతాః సుమహాబలాః | విలజశ్చ ధనుశ్చైవ వ్యోమ స్తస్యస సృంజయః || 132 అనపత్యో ೭భవద్ వ్యోమః సృంజయస్య ధనంజయః | యోజాయమానో ఖోజత్వం రాజర్షిత్వ మవాప్తవాన్ || 133 కృష్ణస్య జన్మాభ్యుదయం యః కీర్తయతి నిత్యశః | శృణోతి వానరో నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే || 134 శమీకుని కొడుకులు నల్గురు. మహాబలపరాక్రములు. విరజుడు ధనువు వ్యోముడు సృంజయుడు ననువారు. వ్యోమునికి సంతానము లేదు. సృంజయుని కొడుకు ధనంజయుడు. అతడు పుట్టగానే భోజుడు రాజర్షియు నయ్యెను. కృష్ణ జన్మ వర్ణసమ్ అథదేవో మహాదేవః పూర్వం కృష్ణః ప్రజాపతిః | విహారార్థం సదేవో೭సౌ మానుషేష్వప్యజాయత || 135 దేవక్యాం వసుదేవేన తపసా పుష్కరేక్షణః | చతుర్బాహుస్తు సంజాతో దివ్యరూపో జనాశ్రయః || 136 శ్రీవత్సలక్షణం దేపం దృష్ట్వా దేవైః సలక్షణమ్ | ఉవాచ వసుదేవ స్తం రూపం సంహర వైప్రభో || 137 భీతో೭హం దేవ కంసా ద్ధితతస్త్వేతత్ బ్రవీమితే | మమ పుత్రాహతాస్తేన శ్రేష్ఠా షడ్ భీమవిక్రమాః || 138 వసుదేవ వచః శ్రుత్వా రూపం సంహర దచ్చుతః | అనుజ్ఞాప్య తు తం శౌరి ర్నంద గోప గృహే೭నయత్ || 139 దత్వా తం నందగోపాయ రక్ష్యతా మితి చాబ్రవీత్ | అతస్తు సర్వ కల్యాణం యాదవానాం భవిష్యతి || 140 అయంతు గర్భో దేవక్యా యావ త్కసం హనిష్యతి | తావత్పృథివ్యాం భవితా క్షేమో భారాపహః పరమ్ || 141 యేవైదుష్టాస్తు రాజాన స్తాం స్తు సర్వాన్హ నిష్యతి | కౌరవాణాం రణ భూతే సర్వక్షత్ర సమాగమే || 142 సారథ్య మర్జున స్యాయం స్వయం దేవః కరిష్యతి | నిఃక్షత్రియాం ధరాం కృత్వా భోక్ష్యతే శేషతాం గతామ్ || సర్వం యదుకులం చైవ దేవలోకం నయిష్యతి అవ్వల వరమేశ్వరుడు శ్రీకృష్ణస్వరూపమున దేహధారియై మానవలోకమందు దేవకీ వసుదేవులు తొలి జన్మమందు జేసిన తపస్సునకు ఫలముగా నవతరించెను. అప్పుడు నాల్గు బాహువులతో శ్రీవత్పాది చిహ్నములతో దివ్యమూర్తిగా సాక్షాత్కరింపగా వసుదేవుడు ప్రభూ ! ఈ అప్రాకృతి దివ్యమంగళ స్వరూపమును తిరోహిత మొనరించు కొనుము. కంసుని వలన నేను జడిసి యిట్లనవలసివచ్చినది. లోగడ నా బిడ్డ లారుగురను వాడు సంహరించినాడని విని పరమాత్మ యా దివ్యరూపము నుపసంహరించికొనెను. వసువు స్వామి యనుమతింగొని గోకులమందు నందునింటికిం గొంపోయి యీ శిశువుం బెంచికొనుము, వీని వలన మీ యాదవు లందరకు శుభముజరుగగలదు. దేవకీగర్భమందుదయించిన యీ పిల్లవాడు కంసునిల జంపి భూమికి బరువైయున్న దుస్టులగు రాజులను కౌరవయుద్ధమందు గూల్చి యర్జున సారథియై యీ భూమిని నిఃక్షత్రియ మొనరించి తాననుభవించి యదుకులమును స్వర్గ మందించును. అని నందగోవుని కా నందను నొప్పగించెను. అనవిని భీష్ముడిట్లనియె. భీష్మ ఉవాచ : దేవకీవసుదేవాది చరిత్ర వర్ణనమ్ : క ఏష వసుదేవస్తు దేవకీ కా యశస్వినీ || 144 నందగోపశ్చ కశ్చైవ యశోదాకా మహావ్రతా | యా విష్ణుం పోషితవతీ యాం స మాతేత్య భాషత || 145 యా గర్భం జనయామాస యాచైనం సమవర్థయత్ | పులస్త్య ఉవాచ : పురుషః కశ్యప శ్చాసా వదితి స్తత్ప్రియా స్మృతా || 146 కశ్యపో బ్రహ్మణోం೭శస్తు ప్భథివ్యా అదితి స్తథా | నందో ద్రోణస్సమాఖ్యాతో యశోదాథ ధరా భవత్ || 147 అథ కామా న్మహాభాహుర్దేవాక్యాః సమపూరయత్ | యేతయా కాంక్షితాః పూర్వ మదా త్తస్మా న్మహాత్మనః || 148 అచిరం స మహాదేవః ప్రవిష్టో మానుషీం తనుమ్ | మోహయ న్సర్వ భూతాని యోగా ద్యోగీ సమాయ¸° || 149 నష్టే ధర్మే తథా యజ్ఞే విష్ణు ర్వృష్టికులే విభుః | క్రతు ధర్మ వ్యవస్థాన మసురాణాం ప్రణాశనమ్ || 150 రుక్మిణీ సత్యభామా చ సత్యా నాగ్నిజితీ తథా | సుమిత్రా చ తథా శూబ్యా గంధారీ లక్ష్మణా తథ || 151 సుభీమా చ తథా మాద్రీ కౌసల్యా విజయా తథా | ఏవ మాదీని దేవీనాం సహస్రాణిచ షోడశ || 152 దేవకీవసుదేవాదుల చరిత్ర : పరమాత్మను గన్న దేవకీవసుదేవు లెవరు? సాక్షాద్విష్ణువును బెంచిన తల్లి యశోదా నందగోపకులెవ రానతిమ్మని భీష్ముం డడుగ పులస్త్యుం దిట్లనియె కశ్యపుడు బ్రహ్మ యొక్క అంశము. అయన పత్ని యదితి భూదేవియొక్క యంశము. దేవకి మనోరధములం దీర్ప మనుష్యోపాధియందు బ్రవేశించి యోగీశ్వరుడు గావున తన యోగలీలలతో సర్వ భూతము లాశ్చర్యమొంద, నష్టమైన ధన్మమును నిలిపి అసుర సంహారము సేయును. రుక్మిణి సత్యభామ సత్య నాగ్న జితి సుమిత్ర శైబ్య గాంధారి లక్షణ సుభీమ మాద్రి కౌసల్యా విజయ మొదలుగ పదునారువేలమందిని సుందరుల వివాహ మాడెను. రుక్మిణీ జనయామాస పుత్రాన్‌శృణు విశారదాన్ | చారుదేష్ణం రణశూరం ప్రద్యుమ్నఞ్చ మహాబలమ్ || 153 సుచారుం చారుభద్రఞ్చ సదశ్వం హ్రస్వమేవచ | సప్తమఞ్చచారుగుప్తఞ్చ చారుభద్రఞ్చ చారుకమ్ || 154 చారుహాసం కనిష్ఠఞ్చ కన్యా ఞ్చచారుమతీం తథా | జజ్ఞిరే సత్యభామాయా భాను ర్భీమరథః క్షణః || 155 రోహితో దీప్తిమాం శ్చైవ తామ్రబంధో జలంధమః | చతస్రోజిజ్ఞిరే తేషాం స్వసారశ్చయవీయసీః || 156 జాంబవత్యాః సుతో జజ్ఞే సాంబశ్చై వాతిశోభనః | సౌరశాస్త్రస్య కర్తావై ప్రతిమా మందిరస్యచ || 157 మూలస్థానే నివేశశ్చ కృత స్తేన మహాత్మనా | తుష్టేన దేవదేవేన కుష్ఠురోగో వినాశితః || 158 సుమిత్రం చారుమిత్రంచ మిత్రవిందా వ్యజాయత | మిత్రబాహుః సునీయశ్చ నాగ్నజిత్యాం బభూవతుః || 159 ఏవ మాదీనీ పుత్రాణాం సహస్రాణి నిశామయ | అశీతిశ్చ సహస్రాణాం వాసుదేవసుతా స్తథా || 160 స్వామివారికి రుక్మిణియందు గల్గిన సంతానము చారుదేష్ణుడు ప్రద్యుమ్నుడు సుచారువు చారుభద్రుడు సదశ్వుడు హ్రస్వుడు చారుగుప్తుడు చారుభద్రుడు చారుకుడు చారుహాసుడు నను కొడుకులు చారుమతియను కన్యయు నుదయించిరి. సత్యభామయందు భానుపు భీమరథుడు క్షణుడు రోహితుడు దీప్తిమంతుడు తామ్రబంధువు జలంధముడు ననుపుత్రులుగల్గిరి. వీరికప్పగార్లు నల్గురు జనించిరి. జాంబవతికి సాంబుడు పరమసుందరుడు గల్గెను. ఈయన సౌరశాస్త్రముం జేసెను. (సూర్యసిద్ధాంతమన్నమాట) ఇతడు మూలస్థానమందు ఆలయ నిర్మాణము విగ్రహప్రతిష్ఠయుం జేసెను. దానిచే పరమాత్మ సంతుష్టుడై కుష్ఠురోగ నివారణ మొనరించెను. కృష్ణ పత్నులలో మిత్రవింద సుమిత్రుడు చారుమిత్రుడు నను పుత్రులం గనెను. మిత్రబాహుడు సునీయుడును నాగ్నజితియందు గల్గిరి. ఇట్లు కృష్ణపరమాత్మ సంతాన మెనుబదివేల మంది పుట్టినారు. ప్రద్యుమ్నస్యచ దాయాదో వైదర్భ్యాం బుద్ధిసత్తమః | అనిరుద్ధో రణ యోద్ధా జజ్ఞే೭స్య మృగకేతసః || 161 కామ్యా సుపార్శ్వతనయా సాంబా ల్లేభే తరస్వినః | సత్త్వ ప్రకృతయో దేవాః పరాః పంచ ప్రకీర్తితాః || 162 తిస్రః కోట్యః ప్రవీరాణాం యాదవానాం మహాత్మనామ్ | షష్టిః శతసహస్రాణి వీర్యవంతో మహాబలాః || 163 దేవాంశాః సర్వేఏవేహ ఉత్పన్నా స్తే మహౌజసః | దేవాసురే హతా వా అసురాస్తు మహాబలాః || 164 ఇహోత్పన్నా మనుష్యేషు బాధంతే సర్వమానవాన్ | తేషా ముద్ధరణార్థాయ ఉత్పన్నా యాదవే కులే || 165 కులానాం శతమేకంచ యాదవానా మ్మహాత్మనామ్ | విష్ణు స్తేషాం ప్రణతాచ ప్రభుత్వేచ వ్యవస్థితః || 166 నిదేశస్థాయిన స్తస్య బుద్ధ్యంతే నర్వయాదవాః | ప్రద్యుమ్నునికి (రుక్మిణీ కృష్ణుల కుమారునికి) వైదర్భియందు బుద్ధిమంతుడు అనిరుద్ధుడు యుద్ధసమర్థుడు ఇతడు మృగకేతనుడు. అనగా నితని జెండాపై గుర్తు లేడి యన్నమాట. సుపార్శ్వుని కూతురు కామ్య యనునామె కేవల సత్త్వగుణసంపన్నులు దేవతామూర్తులగు నైదుగురు సుతులం గనెను. యాదవవీరులు మహానుభావులు మహావీరులు మూడు కోట్ల ఆరు లక్షల మంది దేవాంశసంభూతులే. మున్ను దేవాసుర సంగ్రామములో గూలిన యసురులు మరల పుట్టి బాధించుచుండ దుష్టులను సంహరించి మానవోద్ధరణ చేయుటకు వీరు యాదవ వంశమునందవతరించినారు. మొత్తము వీరి కులములు (కుటుంబములు) నూటపదునొకండు. వీరందరకు నాయకుడు విష్ణువు(కృష్ణుడు) ప్రభుత్వస్థానమందున్న వాడు. ఆయన యాజ్ఞకు లోబడి యెల్ల యాదవులు వర్ధిల్లిరి. భీష్మ ఉవాచ : సప్తర్షయః కుబేరశ్చ యక్షో మణిధర స్తథా || 167 సాత్యకి ర్నారద శ్చైవ శివో ధన్వన్తరి స్తథా | ఆదిదేవ స్తథా విష్ణురేభిస్తు సహ దైవతైః || 168 కిమర్థం సహసంభూతాః సురసమ్భూతయః క్షితౌ | భవిష్యాః కతివాచాస్య ప్రాదుర్భావా మహాత్మనః || 169 సర్వక్షేత్రేషు సర్వేషు కిమర్ధమిహ జాయతే | యదర్థ మిహ సంభూతో విష్ణుర్వృష్ణ్యంధకే కులే || 170 పునః పున ర్మనుష్యేషు తన్మే త్వం బ్రూహి పృచ్ఛతః | పులస్త్య ఉవాచ : శృణు భూప ప్రవక్ష్యామి రహస్యాతి రహస్యకమ్ | యథా దివ్యతను ర్విష్ణుర్మానుషేష్విహ జాయతే || 171 యుగాంతే తు వరావృత్తే కాలే ప్రశిథిలే ప్రభుః | దేవాసుర మనుష్యేషు జాయతే హరిరీశ్వరః || 172 హిరణ్యకశిపు ర్దైత్యు సై#్రలోక్యస్య ప్రశాసితా | బలినాధిష్ఠితే చైప పున ర్లోకత్రయే క్రమాత్ || 173 సఖ్య మాసీత్పరమకం దేవానా మసురైః సహ | యుగాఖ్యా దశ సంపూర్ణా అసీదవ్యాకులం జగత్ || 174 నిదేశస్ఠాయినశ్చాపి తయో ర్దేవాసురాః స్వయమ్ | బద్ధో బలిర్వి మర్దో೭యం సుసంపృత్తః సుదారుణః || 175 దేవానా మసురాణాంచ ఘోరః క్షయకరో మహాన్ | కర్తుం ధర్మవ్యపస్థాంచ జాయతే మానుషేష్విహ || 176 భృగోః శాపనిమిత్తం తు దేవాసురకృతే తదా | భీష్మ ఉవాచ : కథం దేవాసుర కృతే మరిర్దేహ మవాప్తవాన్ || 177 సప్తర్షులు కుబేరుడు మణిధరుడను యక్షుడు సాత్యకి నారదుడు శివుడు ధన్వంతరి మొదలగు నీ దేవతలతో ఆదిదేవుడు విష్ణువవనిపై నెందుల కవతరించెను ? దేవతావతారము లెందులకు హరితో నిటవచ్చినవి? అమ్మహాత్ముని యొక్క యనేనక క్షేత్రములందు (ఇక్కడ క్షేత్రము=శరీరము ఉపాధి యన్నమాట) రాబోవు నవతారము లింక నేవేవి? అవి యేపనికి మరల మానవులందు వచ్చు నానతిమ్మని భీష్ముడన పులస్త్యుండిట్లనియె. రాజా ! పరమాత్మ మానవులందవతరించుట యిది రహస్యాతి రహస్య విషయము. వినుము. యుగాంతము నందు కాలము తిరుగబడి మిక్కిలి వదలు పదలైపోయినపుడు హరి యీశ్వరుడు దేవాసుర మనుష్యులందు జన్మించు చుండును. హిరణ్యకశివుడను దైత్యుడు ముల్లోకములకు శాసకుడు. వాని తరువాత బలిచక్రవర్తి ముల్లోకములు తిరిగి క్రమముగా నొకస్థాయికివచ్చి దేవతలకు నసురలతో వరమమైత్రి యేర్పడినది. పది యుగాలు సంపూర్ణముగ లోకమవ్యా కులముగనే యుండెను ఆ యిద్దరి యాజ్ఞకు దేవతలకు అసురులు లోబడి పరమమైత్రిగ నుండిరి. బలి బద్ధుడైన తరువాత దీనికి విరుద్ధముగా దారుణమైన కాలమేర్పడినది. అది దేవాసురుల క్షయము సేసినది. అప్పుడు పరమాత్మ ధర్మవ్యవస్థ చేయుట కవతరింపవలసివచ్చినది. దేవాసురుల నిమిత్తముగ దానికి భృగుశాపము కారణమైనది. అన విని భీష్ముడా కథ యెట్లు జరిగెనో తెలుపుమన పులస్త్యుండనియె. దైవాసురం యథావృత్తం తన్మే కథయ సువ్రత | పులస్త్య ఉవాచ తేషాం జయనిమిత్తం వై సంగ్రామాః స్యుః సుదారుణాః || 178 అవతారా దశద్వౌ చ శుద్థా మన్వంతరే స్మృతాః | నామధేయం సమాసేన శ్రుణు తేషాం విపక్షితమ్ || 179 ప్రథమో నారసింహస్తు ద్వితీయశ్చాపి వామనః | తృతీయస్తు వరాహశ్చ చతుర్థో೭మృతమంథనః || 180 సంగ్రామః పంచమశ్చైవ సుఘోరస్తారకామయః | షష్ఠో హ్యాడీవకాఖ్యశ్చ నప్తమసై#్తపుర స్తథా || 181 అష్టమ శ్చాంధకవధో నవమో వృత్రఘాతనః | ధ్వజశ్చ దశమస్తేషాం హాలాహస్తతః పరమ్ || 182 ప్రధితో ద్వాదశ##స్తేషాం ఘోరః కోలాహల స్తథా | జయనిమిత్తము వారిరువురకు పెక్కు యుద్ధములు జరిగినవి. ఒక మన్వంతరములో హరి యవతారములు పండ్రెండు. పేర్లు వినుము. 1. నారసింహము 2. వామనము 3. వరాహము 4. అమృతమథనము (కూర్మావతారము) జె తారకామయము (తారకాసుర సంహార నిమిత్తమైనది) 6 ఆడీబకము (ఆడేలు ఒక జాతి బాతు, బకము=కొంగ) 7. త్రిపురము (త్రిపురాసుర సంహారము) 8. అంధకాసుర సంహారము 9. వృత్రాసుర సంహారము 10. ధ్వజము 11. హాలాహలము 12. కోలాహలమను ఘోరమైన యవతారము. హిరణ్యకశివుర్దైత్యో నరసింహేన సూదితః || 183 వామనేన బలిర్బద్ధసై#్త్రలోక్యాక్రమణ పురా | హిరణ్యాక్షో హతో ద్వంద్వే ప్రతివాదేతు దైవతైః || 184 దంష్ట్రయాతు వరాహేణ సముద్రస్థో ద్విధాకృతః | ప్రహ్లాదో నిర్జితో యుద్ధ ఇంద్రేణామృత మంథనే || 185 విరోచనస్తు ప్రాహ్లాది ర్నిత్య మింద్రవధోద్యతః | ఇంద్రేణౖవచ విక్రమ్య నిహతస్తార కామయే || 186 నరసింహమూర్తి హిరణ్యకశిపుం గూల్చెను. వామనునిచే త్రిలోకాక్రమణచే బలి బద్ధుడయ్యెను. హిరణ్యాక్షుడు దేవతల ప్రతివాదమున (ప్రతివాది శత్రువన్నమాట) పరాహముచే గోరతో సముద్రమధ్యమందు రెండు గావింప బడెను. అమృతమథన సమయమున నింద్రుచే ప్రహ్లాదుడోదింపబడెను. ప్రహ్లాదుని కొడుకు విరోచను దింద్ర వధకు నిరంతరోద్యమము సాగించి ఇంద్రునిచే తారకామయ యుద్ధమందు నిహతుడైనాడు. అశక్నువత్సు దేవేషు త్రిపురం సోఢుమాసురమ్ | మోహయిత్వా ೭మృతోపి గోరూపేణా సురారిణా || 187 నా సఞ్జివయితుం శక్యా భూయో భూయెమృతాసురాః | నిహతా దాసవాః సర్వే త్రైలోక్యే త్ర్యంబకేణతు 188 అసురాశ్చ పిశాచాశ్చ దానవాశ్చాంధకే పధే | హతా దేవ మనుషై#్యస్తేపితృభిశ్చైవ సర్వశః || 189 సంపృక్తో దానవైర్వృత్రో ఘోరే కోలాహలే హతః | తదా విష్ణు సహాయేన మహేంద్రేణ నిపాతితః || 190 హతస్తతో మహేంద్రేణ మాయాచ్ఛన్నస్తు యోగవిత్ | వజ్రేణ క్షణ మావిశ్య విప్రచిత్తిః సహానుగః || 191 దైత్యాశ్చ దానవాశ్చైవ సంయుతాః కృత్స్నశస్తుతే | ఏతే దైవాసురా వృత్తా సంగ్రామాద్వాదశైవతు || 192 దేవతలు త్రిపురాసురులు నోర్వలేకున్నతరి గోరూపథారియై హరి యమృతము వారికి లేకుండ మోహపెట్టగా నా సమరమందు గూలిన అసురులు తిరిగి బ్రదికింప వశముగారైరి. ముల్లోకములందలి దానవులు త్రినేత్రునిచే హతులైరి. అంధకాసుర వధయందు హరునిచే అసుర పిశాచాదులు కూలిరి. దానవులంగూడి వృత్రాసురుడు పోరి ఘోరమైన కోలాహల యుద్ధమందు విష్ణుసహాయుడైన యింద్రునిచే మడిసెను. దేవ పితృదేవలచే నందు బెక్కుమంది దానవులు గూలిరి. అటుపై మాయా తిరోహితుడై యోగమెరిగిన విప్రచిత్తి సపరివారముగ నింద్రుని వజ్రాయుధమున కెరయై కూలెను. ఈ విధముగ దేవాసుర సంగ్రామములు పండ్రెండు జరిగినవి. ఇవి దేవాసురులను క్షయింపజేసి. ప్రజలకు మేలుసేసినవి. దేవాసుర క్షయకరాః ప్రజానాం చ హితాయవై | హిరణ్యకశివూ రాజా వర్షాణా మర్బుదం బభౌ || 193 ద్విసప్తతిం తథా న్యాని నియుతాన్యధికానితు | అశీతంచ సహస్రాణి త్రైలోక్యైశ్వర్యవానభూత్ || 194 పర్యాయేణతు రాజా భూద్బలి ర్వర్షార్బుదం పునః | షష్టించైవ సహస్రాణి నియుతానిచ వింశతిమ్ || 195 బలిరాజ్యాధికారేతు యావత్కాలశ్చ కీర్తితః | తావత్కాలంతు ప్రహ్లాదో నిర్వృతో హ్యసురైఃసహ || 196 జయార్థమేతే విజ్ఞేయా అసురాణాం మహౌజసః | త్రైలోక్య మిద మవ్యగ్రం మహేంద్రేణానుపాల్యత || 197 అసమ్పన్న మిదం సర్వం యావద్వర్షాయుతం పునః | పర్యాయేణౖవ సంప్రాప్తే త్రైలోక్యం పాకశాసనే 198 తతో೭సురాస్పరిత్యజ్య యజ్ఞో దేవానగచ్ఛత | యజ్ఞే దేవానథగతేదితిజాః కావ్య మబ్రువన్ || 199 హిరణ్యకశివుఒక అర్బుదము డెబ్బదిరెండు కోట్ల డెబ్బదిరెండు లక్షల యెనుబదివేలేండ్లు త్రైలోకైశ్వర్యము గొని ప్రభువై వెలిగెను. బలియు నట్లే యిరువదినియుతముల యిరువదివేలేండ్లు పెక్కుపర్యాయములు రాజయ్యోను. అతని యట్ల ప్రహ్లాదుడు నసురులతో నానందించెను. ఇట్లు పెక్కుకాలము దేవాసులు ఒక్కొక్క పర్యామ మొక్కొక్కడేసి నిలుకడగలేనిమీదట తిరి యింద్రుని సంక్రమించిన తర్వాత యజ్ఞమూర్తి యసురుల విడిచి దేవతల దరికేగెను. అది గని దైత్యులు శుక్రాచార్యుని కిట్లనిరి. దైత్యా ఊచుః హృతం మఘవతా రాజ్యం త్యక్త్వా యజ్ఞః సురాన్‌గతః | స్థాతుం నశక్ను మోహ్యత్రప్రవిశామోరసాతలమ్ || 200 ఏవముక్తో೭బ్రవీదేతా న్విషణ్ణాన్స్వాంతయన్గిరా | మాభైష్టధారయిష్యామి తేజసాస్వేనవో೭సురాః || 201 మంత్రాశ్చౌషధయశ్చైవ ధరాయాం యత్తువర్తతే | మయి తిష్ఠతి తత్సర్వం పాదమాత్రం సురేషువై || 202 తత్సర్వంచ ప్రదాస్యామి యుష్మదర్థే ధృతం మయా | ఇంద్రుడు రాజ్యమును హరించెను. యజ్ఞమూర్తియా మమ్ము వదలి దేవతల దరికేగెను. ఈ భూమిపై నిక నిలువలేకున్నాము. రసాతలమును జొచ్చెదమని దుఃఖించు దానవుల మంచిమాటల జడియకుడని నా తేజస్సుచే మిమ్ముల నేనుద్ధరింతును. నాలో భూమిగల మంత్రములు నోషధులు మొదలుగ సామగ్రి యంతయు నాయందున్నది. అందు నాల్గవవంతే దేవతలకు గలదు. మీకొరకు సేకరించినదంతయు మీకిచ్చెదననెను. తతో దేవాస్తు తా న్దృష్ట్వా ధృతాన్కావ్యేన ధీమతా || 203 అమంత్రయంత దేవావై సంవిగ్నాస్తజ్జిఘృక్షయా | కావ్యో హ్యేష ఇదం సర్వం వ్యావర్తయతి నో బలాత్ || 204 సాధుగచ్ఛామహే తూర్ణం యావన్నచ్యావయేత వై | ప్రసహ్య జిత్వా శిష్టాంస్తు పాతాలం ప్రాపయామహే || 205 తతోదేవాస్తు సంరబ్ధా దానవానువసృత్యహ | తతస్తే వధ్యమానాసై#్రః కావ్యమేవాభిదుద్రుపుః || 206 తతః కావ్యస్తు తాన్ దృష్ట్వా తూర్ణం దేవైరభిద్రుతాన్ | రక్షాకార్యేణ సంహృత్య దేవేభ్యస్తా న్సురార్దితాన్ || 207 కావ్యం దృష్ట్వా స్థితం దేవా నిర్విశంకాస్తు తే జహుః | తెలివిగలవాడు శుక్రుడవియెల్ల తమమంది నెంచికొననున్నాడని తెలిసి, యివి లాగికొనకుండ యిప్పుడే వానిపై నెత్తి గెలిచి యసురులను బాతాళమునకుం దరిమెదమని. వారిపై విజృంభించిరి. అసురులు వారిచే హతులగుచు శుక్రుని కడకు బరువెత్తిరి. అతడు రక్షా విధానమున (నొకానొక మంత్రవిధిచేత) దేవతలనుండి యసురుల వెలువరించిన నతనిం గని నిశ్శంకగా నా దానవుల వదలిపెట్టిరి. తతః కావ్యో೭నుచింత్యాథ బ్రహ్మణో వచనం హితమ్ || 208 తానువాచ తతః కావః పూర్వవృత్త మనుస్మరన్ | త్రైలోక్యం వోహృతం సర్వం వామనేన త్రిభిఃక్రమైః || 209 బలిర్బద్ధో హతో జంభో నిహతశ్చ విరోచనః | మహాసురా ద్వాదశ సుసంగ్రామేఘ సురైర్హతాః || 210 తైసై#్తరుపాయై ర్భూయిష్ఠా నిహతాస్తు ప్రధానతః | కేచ్ఛిష్టాశ్చ యూయం వై యుద్ధం మాస్త్వితిమేమతమ్ || 211 నీతయో వో విధాతవ్యా ఉపాసే కాల పర్యయాత్ | యస్యామ్యహం మహాదేవం మన్త్రార్థం విజయావహమ్ || 212 అప్రతీపాంస్తతో దేవాన్మంత్రాన్ప్రాప్య మహేశ్వరాత్ | యోత్స్యా మహే పునర్దేవైస్తతః ప్రాప్స్యథవై జయమ్ || 213 ఆపై శుక్రుడు బ్రహ్మ హితవచనము విని ఆలోచించి అంతమున్ను జరిగినదియుం దలచికొని దైత్యులంగని యిట్లనియె. మున్ను వామనునిచే మీ త్రైలోక్యము సామ్రాజ్యము గాజేయబడినది. బలి బద్ధుడయ్యెను. బింభుడు మడిసెను విరోచనుడు గూలెను? పండ్రెండు సంగ్రామములందు మహాసురులెందరో హతులైరి, ఆ యా యుపాయముచే నెందరో దనుజులు ప్రధానులు వోయిరి. పోగా మిగిలినవారు మీరు కొలదిమంది. కావున యుద్ధము గూడదని నా యభిప్రాయము. కాలము తప్పినందున నిపుడు నీతి ననుసరింపవలెను. అందులకే నుపాసన సేసెదను. విజయప్రదమైన మంత్రముకొర కేను మహాదేవుని సన్నిధికేగెదను. తిరుగులేని మంత్రములం బడసి యాపైని వేల్పులతో దలబడుదుము. అపుడు మీరు జయమందుదురనెను. తతస్తే కృత సంవాదా దేవానూచు స్తదాసురాః | న్యస్త శస్త్రావయం సర్వే నిఃసన్నాహా రధైర్వినా || 214 అంతట నొండొరులు చర్చించుకొని యేకాభిప్రాయమునకు వచ్చి దేవతల దరికి వచ్చి మేమస్త్రసన్యాసము సేసినాము రథములుతప్ప తక్కిన సన్నాహమంతయు విదిచితిమి. వయం తపశ్చరిష్యామః సంవృతా వల్కలైస్తథా | దేవాస్తేషాం వచః శ్రుత్వా సత్యాభివ్యాహృతం తతః || 215 తతో న్యవర్తయన్సర్వే విజ్వరా ముదితాశ్చతే | న్యస్త శ##స్త్రేషు దైత్యేషు వినివృత్తాస్తదా సురాః || 216 తతస్తానబ్రవీత్కావ్య ఉపాసధ్వం తపసి స్థితాః | నిరుత్సిక్తాస్తపోయుక్తాః కాలం కాయార్థ సాధకమ్ || 217 పితురాశ్రమ సంస్థావై మాం ప్రతీక్షథ దానవాః | తానుద్దిశ్యాసురాన్కావ్యో మహాదేవం వ్రపద్యత || 218 శుక్ర ఉవాచ మన్త్రానిచ్ఛామ్యహం దేవ యే నసన్తి బృహస్పతొ | పరాభవాయ దేవానా మసురాణాం జయాయ చ || 219 మేము నారవట్టలు గట్టుకొని తపస్సుచేయుదుమనిరి. దేవతలది నిజముగా బల్కినది విని హర్షించి యే బాధ లేకుండ సేనలతో వెనుకకు మరలిరి. తమ నివాసములకుం జనిరి. అవ్వల శుక్రుడు మీరు తపస్సునందు నిలిచి యుపాసన సేయుడు. నిరుత్సుక్తులై (ఉత్సేకము=గర్వము, కోపము, పొంగు) క్రోధముచే గర్వముచే నుద్రిక్తులుగాక శరీరము నిలుచుటకు మాత్రమవసరమైన ఆహారముగొని కాలము వెళ్ళింపుడు. మా తండ్రి యాశ్రఘమందుండి నా రాక కెదురు సూచుచుండుడు. అని పల్కి వారి నుద్దేశించి శుక్రుడు మహాదేవునిం దరిసెను. ఏపముక్తో೭బ్రవీద్దేవో వ్రతం త్వం చర భార్గవ | పూర్ణవర్షసహస్రం తు కణధూమమధః శిరాః || 220 యది పాస్యసి భద్రంతే తతో మన్త్రానవాప్స్యపి | తథేతి సమనుజ్ఞాప్య శుక్రస్తు భృగునన్దనః || 221 పాదౌ సంస్పృశ్య దేవస్య బాఢ మిత్య బ్రవీద్వచః | వ్రతం చరా మ్యహం దేవ త్వయాదిష్టో೭ద్యవై ప్రభో || 222 అదిష్టో దేవ దేవేన కృతవా న్భార్గవో మునిః | తదా తస్మిన్గతే శుక్రే అసురాణాం హితాయవై || 223 మహాదేవ ! బృహస్పతియందు లేనివి దేవ పరాభవమునకు అసురవిజయమునకును మంత్రముల నే నర్ధించుచున్నానని శుక్రుండన యా దేవుడు భార్గవ ! నీ వొక వ్రతమాచరింపుము. నిండ వేయి సంవత్సరములు తలక్రిందుగ కణ ధూమముం ద్రావితివేని, నీకు శుభమగుగాక ! అమీద మంత్రములం బడయగలవు. అనవిని సెలవుగొని భృగు నందనుడు పాదాభివందనము సేసి మంచిది ! నీవన్న వ్రత మాచరింతును. నీ వాజ్ఞాపించితివిగద ! అని చని భార్గవుండావ్రతము సేయం జనెను. మాన్త్రార్థే తనుతే కావ్యో బ్రహ్మచర్యం మహేశ్వరాత్ | తద్ బుద్ ధ్వానీతి పూర్వం వైరాజన్యాస్తు తదా సుఖమ్ || 224 అస్మిం చ్ఛిద్రే తదామర్షా ద్ధేవాస్తానభి దుద్రువుః | దంశితాః సాయుధాః సర్వే బృహస్పతి పురః సరాః || 225 అతడిట్లు నన నమరులది తెలిసి నీతి ననుసరించి రాజులట్లు (రాజనీతి యిదియని) శుక్రబలములేని ఛిద్రము (అవకాశము) నందు కసిగొని సులభముగ నసురులపై దండెత్తిరి. బృహస్పతి ముందుగ వారటు సాయుథులై సాగినంత వారింగని దైత్యులు హడలిపోయి తిరిగి ఆయుధములెత్తికొని యెదురు నడచి వారింగని యిట్లనిరి. దృష్ట్వా సురగణా దేవాన్ప్రహీతాయుధా న్పునః | ఉత్పేతు న్సహసా సర్వే సంత్రస్తాస్తాస్వచో೭బ్రువన్ || 226 దైత్యా ఊచుః స్యస్తశస్త్రా వయం దేవా ఆచార్యే వ్రతమాస్థితే | దత్వా భవంతస్త్వభయం సమ్ప్రాప్తానో జిఘాంసయా || 227 అనమర్షావయం సర్వే త్యక్త శస్త్రాశ్చ సంస్థితాః | చీరకృష్ణాజినధరా నిష్క్రియా నిష్పరిగ్రహాః || 228 రణ విజేతుం దేవాంశ్చన శక్ష్యామః కథంచన | అయుద్ధేన ప్రవత్స్యామః శరణం కావ్యమాతరమ్ || 229 జ్ఞావయామః కృచ్ఛ మిదం యావన్నాభ్యేతినో గురుః | నివృత్తేచ తథా శుక్రేయోత్స్యామోదంశితాయుధాః || 230 ఏవముక్త్వాచ తే ೭న్యోన్యం శరణం కావ్యమాతరమ్ | ప్రాపద్వంత తతో భీతాస్తేభ్యో ೭దా దభయంతు సా || 231 మేము మా ఆచార్యుడు వ్రతనిష్ఠుడయ్యెనని శస్త్రముల విడచితిమి. మీరభయమిచ్చి యిపుడు మమ్ము జంపనెంచి వచ్చినారు. ఈర్ష్య దొలగి నారచీరలు కృష్ణాజినములదాల్చి నిష్క్రియులము (కర్మరహితులు) నిష్పరిగ్రహులము (అహారాదులేమిము గ్రహింపనివారయు) నైయున్న మేము రణమందు దేవతల నెట్లునుం గెలువనేరము. యుద్ధము సేయక యిపుడు మేము కావ్యమాతను శరణొంది మా గురువు రానంతవరకీ మాకృచ్ఛ్రము (కష్టమును) నామెకు విన్నవించు కొందుము. శుక్రుడేతెంచిన తర్వాత నాయుధములంగొని యని సేయుదుము అని యొండోరులుం బలికికొని యా గురు మాతను శరణొందిరి. హడలి యటు వచ్చినవారింగని ఆ తల్లి యభయమిచ్చెను. న భేతవ్యం సభేతవ్యం భయం త్యజత దానవాః | మత్సన్నిధౌ వర్తతాం వో న భీర్భవితు మర్హతి || 232 తయాభిరక్షితాం స్తాంశ్చ దృష్ట్వా దేవాస్తదా೭సురాన్ | అభి జగ్ముః ప్రసహ్యైతానవిచార్య బలాబలమ్ || 233 తతస్తాన్వధ్యమానాంస్తు దేవైర్దృష్ట్వా సురాం స్తదా | దేవీ క్రుద్ధా ೭బ్రవీద్దేవా న్నిద్రయా మోహయామ్యహమ్ || 234 సంభృంత్య సర్వసంభారా న్నిద్రాం సా వ్యసృజత్తదా | తస్తమ్భ దేవీచ బలాద్యోగయుక్తా తపోధనా || 235 తతస్తం స్తమ్భితం దృష్ట్వా ఇంద్రం దేవాశ్చ మూఢవత్ | ప్రాద్రవంత తతో భీతా ఇంద్రం దృష్ట్వా వశీకృతమ్ 236 జడియకుడు జడియకుడు. జడువు విడుడు. నా దరినున్న మీకేలాటి జడుపుం గలగనేరదు, అని రక్షయిచ్చిన యామెను నయ్యసురులనుంగని వేల్పులు బలాబలము లాలోచింవక నొక్కుమ్మడి నసురలపైకి దూకిరి. అది సూచి కావ్యమాత వీరిని నిద్రమత్తులో బడజేసెదగాక యని సర్వసంభారములను సమకూర్చుకొని నిద్రావేవిని సృష్టించెను. తపోధన యామె యోగబలముచే వారిని స్తంభింపజేసెను. అపుడు మూఢుడట్టు బిగిసికొనిపోయిన లోబడిపోయిన యింద్రునిం గని వేల్పులు బెదరి పారిరి. గతేషు సురసంఘేషు విష్ణురింద్ర మభాషత | విష్ణురువాచ మాం త్వం ప్రవిశ భద్రంతే రక్షిష్యే త్వాం సురోత్తమ || 237 ఏవముక్త స్తతో విష్ణు ప్రవివేశః పురందరః | విష్ణు సంరక్షితం దృష్ట్వా దేవీ క్రుద్ధా వచో೭బ్ర వీత్ || 238 ఏషత్వాం విష్ణునాసార్ధం దహామి మఘవ న్బలాత్ | మిషతాం సర్వభూతానాం దృశ్యతాం మే తపోబలమ్ || 239 తయా భిభూతౌ తౌ దేవా వింద్ర విష్ణూ బభూవతుః | కథం ముచ్యేయ సహితో విష్ణురింద్ర మభాషత || 240 ఇంద్రోమ೭బ్రవీ జ్జహి హ్యేనాం యావన్నౌన దహేత్ప్రభో | విశేషేణాభిభూతో ೭స్మిజహీమాం జహి మాచిరమ్ || 241 తతః సమీక్ష్య విష్ణుస్తాం స్త్రీవధే కృచ్ఛ్రమాస్థితః | అభిధ్యాయ తతః శుక్రపస్నం సత్వరం ప్రభుః || 242 తతః సత్వరయా యుక్తః శీఘ్రకారీ భయాన్వితః | జ్ఞాత్వా విష్ణు స్తత స్తస్యాః క్రూరం దేవ్యా శ్చికీర్షితమ్ || 243 క్రుద్దశ్చ చక్రమాదాయ శిరశ్చిచ్ఛేదవై భయాత్ | తం దృష్ట్వా స్త్రీవధం ఘోరం చుక్రోధ భృగురీశ్వరః || 244 తతోహి శప్తో భృగుణా విష్ణుర్భార్యావధే కృతే | భృగురువాచ యత్త్వయా జానతా ధర్మ మవధ్యా స్త్రీ నిఘాదితా | యస్మాత్త్వం సప్తకృత్వోహి మానుషేఘావయాస్యసి || 245 తతస్తేనాభిశాపేన నష్టే ధర్మే పునః పునః || 246 లోకస్యచ హితార్థాయ జాయతే మానుషేష్విహ | అథ వ్యాహృత్య విష్ణుం స తదాదాయ శిరః స్వయమ్ || 247 సమానీయ తతః కాయం పాణౌ గృహ్యేదమబ్రవీత్ | భృగురువాచ ఏషా త్వం విష్ణునా దేవి హతా సంజీవయామ్యహమ్ || 248 యది కృత్స్నో మయా ధర్మోజ్ఞాయతే చరితో೭పివా | తేన సత్యేన జీవస్వ యది సత్యం బ్రవీమ్యహమ్ || 249 సురసంఘ మటువోవంగని విష్ణు వింద్రుం గని యిట్లనియె. నీవు నాలోనం బ్రవేశింపుము. భద్రమగుగాక నీకన. నతడట్లు సేయంగని యా దేవి కుపితయై ఓరి యింద్రుడ ! బలిమిమై నిన్నిప్పుడు సర్వభూతములు గనుచుండ విష్ణువుతోగూడ కాల్చివైచెద. నా తపోబలముం జూతువుగాక ! అన నామెచే విష్ణుజిష్ణువు లిద్దరు పరాభవింపబడిరి. విష్ణువు నిన్నెట్లు విడుతునని యింద్రునితో ననెను. ప్రభూ ! ఈమె మనలం గాల్చులోపల నీమెం జంపుము. చాల తలవంపు వడితిని, చంపు మీమెను. ఆలస్యము సేయకుమని యంద్రుడనెను. అంతట విష్ణువు స్త్రీవధయెడ నిరుకునంబడి నాపదలో బడిన యింద్రునిం దలచుచు సత్త్వము దయయుంగలవాడు శీఘ్రకారియుం గావున భయపడి, ఆ దేవి క్రూరచేష్ట యెరింగి కోపియై చక్రముంగొని ఆమె తల నరకెను. స్త్రీవధ యది సూచి భృగుమహర్షి పరమ సమర్థుడు (ఈశ్వరుడు) కుపితుడై. ధర్మమెరిగియు నీవవధ్యురాలగు స్త్రీని జంపితివి గావున మానుషలోకమున నీవేడు జన్మములెత్తుదువుగాక యని శపించెను. ఆ శాపమువలన ధర్మము నశించినతరి మరి మరి లోకము హితముగోరి హరి యీ మానవలోకమునం దవతరించు చుండును. భృగుమహర్షి విష్ణువునట్లుపలికి యాపై నాతల చేతంగొని, దేవీ ! నీవు విష్ణువుచే నిహతవయితి విదిగో నిన్ను నేను బ్రతికించుచున్నాను. నేను ధర్మము సమగ్రముగ దెలిసినవాడనేయైన, ధర్మమాచరించినవాడనేయైనచో నేను నిజము పల్కుచున్నాను. అట్లే సత్యముచే నీవు బ్రతుకుమని పల్కెను. తతస్తాం ప్రోక్ష్య శీతాద్భిర్జీవ జీవేతి సో೭బ్రవీత్ | తతో೭భివ్యాహృతే తస్మిన్దేవీ సంజీవితా తదా || 250 తతస్తాం సర్వభూతాని దృష్ట్వా సుప్తో త్థితా మివ | సాధుసాధ్వితి దృష్ట్వైవ వచస్తాం సర్వతో೭బ్రువన్ || 251 ఏవం ప్రత్యాహృతా తేన దేవీ సా భృగుణా తదా | మిషతాం దైవతానాం హి తదద్భుతమివా భవత్ || 252 అసంభ్రాంతేన భృగుణా పత్నీ సంజీవితా పునః | దృష్ట్వాచేంద్రో నాలభత శర్మ కావ్య భయాత్పుసః || 253 ప్రజాగరే తతశ్చేన్ద్రో జయంతీ మిదమబ్రవీత్ | సంధికామో೭భ్యధా ద్వాక్యం స్వాం కన్యాం పాకశాసనః || 254 ఇన్ద్ర ఉవాచ ఏష కావ్యోహ్యనింద్రాయ వ్రతంచరతి దారుణమ్ | తేనాహం వ్యాకులః పుత్రి కృతో మతిమతా దృఢమ్ || 255 తైసై#్తర్మనో ೭నుకూలైశ్చ ఉపచారైరతంద్రితా | ఆరాధయ తథా పుత్రి యథా తుష్యేత స ద్విజః || 256 యమ్మహర్షి యామెపై చల్లనినీళ్ళు ప్రోక్షించి 'జీవ జీవ బ్రతుకు బ్రతుకు' అని యన్నంత యా దేవి యప్పుడ ప్రాణముం బొందెను. నిదురనుండి లేచినట్లున్న యామెనుగని సర్వభూతములు మేలుమేలని యెల్లెడం బల్కినవి. ఇట్లా దేవి భృగునివలన నుజ్జీవితయైనది. అది తిలకించు దేవతల కత్యాశ్చర్యమయ్యెను. భృగుమహానుభావుడేమాత్రము తడవడక యామెం బ్రతికించుట గని శుక్రునివలని భయముచే యింద్రుడించుకేని హాయిసందడయ్యె. నిద్రపట్టక యతడు తన కూతురు జయంతిం జూచి యాతనితో సంధిసేసికొనగోరి యిట్లనియె. ఇడుగో శుక్రు డనింద్రమగుగాక జగమని దారుణ తపస్సు సేయుచున్నాడు. ఆ బుద్ధిమంతునిచే నేనెంతో వ్యాకులుడనగుచున్నాను. కుమారి ! నీవేమాత్రము తొందరపడక అతని నాయా మనోనుకూలములయిని మాటల నుపచారములచేత నా బ్రాహ్మణుడు సంతోషపడునట్లారాధింపుము. గచ్ఛ త్వం తస్య దత్తాసి ప్రయత్నం కురు మత్కృతే | ఏవ ముక్తా జయంతీ సా పచః సంగృహ్య వై పితుః || 257 అగచ్ఛద్యత్ర ఘోరం స తపో హ్యారభ్య తిష్ఠతి | తం దృష్ట్వా చ పిబన్తం సా కణధూమ మధో ముఖమ్ || 258 యక్షేణ పాత్యమాసం చ కుణ్డ ధారేణ పావనమ్ | దృష్ట్వా తం యతమానం తు దేవీ కావ్య మవస్థితమ్ || 259 శత్రూప ఘాతే శ్రామ్యన్తం దుర్బల స్థితి మాస్థితమ్ | పిత్రా యథోక్తం వాక్యం సా కావ్యే కృతవతీ తదా || 260 గీర్భిశ్చైవానుకూలాభిః స్తుపంతీ వల్గు భాషిణీ | గాత్ర సంవాహనైః కాలే సేవమానా త్వచః సుఖైః || 261 ప్రత చర్యాను కులాభి రుపాస్య బహులాః సమాః | పూర్ణే దూమవ్రతే తస్మి న్ఘోరే వర్ష సహస్రకే || 262 వరేణ చ్ఛంద యామాస శివః ప్రీతో೭భవత్తదా | మహేశ్వర ఉవాచ ఏతద్ వ్రతం త్వయైకేన చీర్ణం నాన్యేన కేనచిత్ || 263 తస్మాద్వై తపసా బుద్ధ్యా శ్రుతేన చ బలేన చ | తేజసా చ సురాన్సర్వాం తస్త్వమేకో೭భిభవిష్యసి || 264 యచ్చ కించిన్మయి బ్రహ్మ న్విద్యతే భృగునందన | ప్రతి దాస్యామి తత్సర్వం త్వయా వాచ్యం న కస్యచిత్ || 265 కిం భాషితేన బహునా అవధ్యస్త్వం భవిష్యసి | తాన్దత్వా తు వరాం స్తసై#్త్మభార్గవాయ పునః పునః || 266 ప్రజేశత్వం ధనేశత్వ మవధ్యత్వం చ వై దదౌ | ఏతాం లబ్ధ్వా వరాన్కావ్యః సంప్రహృష్టతనూరుహః || 267 ఏవ మాభాష్య దేవేశ మీశ్వరం నీలలోహితమ్ | ప్రజ్ఞాన్విత స్తతస్తసై#్మ ప్రాఞ్జలిః ప్రణతో೭భవత్ || 268 అమ్మాయి నీవ యేగుము. అతనికి నిన్నిచ్చితిని. నాకై ప్రయత్నము సేయుము. అన జయంతి తండ్రి మాట గైకొని యతడెక్కడ తపస్సారంభించియున్నాడో యటకుం జని యాతనిం నధోముఖుడైబోవు యక్షుడొకడు కుండపోతగా పోయుచుండ కణథూమముం ద్రావుచున్న శత్రువుం జంప శ్రమించుచు దుర్బలస్థితినున్న శుక్రునిం జూచి. తండ్రి చెప్పినట్లతనితో ప్రసంగము సేసెను. అనుకూల వాక్యముల మధురముగ స్తుతించుచు తగు సమయమందు సుఖమున మేనొత్తుచు సేవించుచు అతని వ్రతచర్య కనుకూలముగ పెక్కేండ్లు వానిని సేవించుచుండ వేయేండ్లకా ఘోరమైన ధూమ వ్రతము పూర్తికాగా శివుడు ప్రీతిసెంది వరము గోరుమనెను. ఈ వ్రతము నీవొక్కడవ సేసితివి. ఇంకెవ్వడుం జేయ లేదు. అందువలన తపస్సుచే జ్ఞానముచే శ్రుతముచే (వినికిడిచేత, పాండిత్యముచేత నన్నమాట) బలముచే తేజస్సుచే సర్వసురల నతిక్రమించితివి. ఓ బ్రహ్మణ్యా ! నాయందేకొంచెమేని యున్న నదియెల్ల నీ కొసంగెద నిది యేరికిం జెప్పకుము. పలుమాటలేల ? నీవవధ్యుడయ్యెదవు. అని యా వరములను మరల మరల యనుగ్రహించి ప్రజాపతిత్వమును ధనాధి వతిత్వమును అవధ్యద్వమును ననుగ్రహించెను. ఈ వరములం బడసి భార్గవుడు మేను బులకరింప నా దేవేశ్వరుని నీల లొహితుని బ్రజ్ఞాన్వితుడై (తెలివిగొని) స్తుతించి సెలవుగొని దోసిలొగ్గి సాష్టాంగప్రణామములు సేసెను. తతః సోం೭తర్హిణ దేవే జయంతీ మిదమబ్రవీత్ | కస్య త్వం సుభ##గే కా వా దుఃఖితే మయి దుఃఖితా || 269 మహతా తపసా యుక్తా కిమర్థం మాం జిగీషసి | అనయా సంస్థితా భక్త్యా ప్రశ్రయేణ దమేన చ || 270 స్నే హేన చైవ సుశ్రోణి ప్రీతో೭స్మి వరవర్ణిని | కిమిచ్ఛసి వరారోహే కస్తే కామః సముద్యతః || 271 తం తే సంపాదయామ్యద్య యద్యపి స్యా త్సు దుష్కరమ్ | ఏవ ముక్తా బ్రవీదేసం తపసా జ్ఞాతు మర్హసి || 272 చికీర్షితం హి మే బ్రహ్మం స్త్వం వై వద యథా తథమ్ | ఎవ ముక్తో೭బ్రవీదేనాం దృష్ట్వా దివ్యేన చక్షుషా || 273 స్వామి యంతర్ధానమైనంత జయంతితో నిట్టనియె. సుందరి ! నీవెవ్వరిదాన వెవ్వతెవు? నేను పరితపింప నీవు పరితపించుచున్నావు. గొప్ప తపస్సుచేత నన్గెలువ నున్నావెందులకు? ఈలాటి నీ భక్తిచే వినయముచే నింద్రియ నిగ్రహ ముచే చెలిమిచే నే నెంతేనిం బ్రీతి సెందితిని. ఏమి కోరెదవు ? నీలో నేమి యభిలాష యుదయించినది ? అది యెంత దుష్కరమైనను యిప్పుడు యది నీకు సాధించిపెట్టెదనని నాకన్నియ తపస్సుచే నది తెలియగలవు. నా చేయదలచిన దున్న దున్నట్లు నీవ సెప్పుము. నావిని దివ్యదృష్టింగని యాతడిట్లు పలికెను. మయా సహ త్వం సుశ్రోణి శతవర్షాణి భామిని | సర్వభూతై రదృశ్యాంతః సంప్రయోగ మిహేచ్ఛసి || 274 దేవి ఇందీవరశ్యామే వరార్హే వామలోచనే | ఏవం వృణోషి కామాం స్త్వం దదే వై వల్గు భాషితే || 275 ఏవం భవతు గచ్ఛావ గృహం మే మత్తకాశిని | తతః సగృహ్య మాగమ్య జయంత్యాసహ చోశనా || 276 తయా సహా వ సద్దేవ్యా వర్షాణి శత వర్షాణి భార్గవః | ఆదృశ్యః సర్వభూతానాం మాయయా సంశితవ్రతః || 277 కృతార్థ మాగతం జ్ఞాత్వా శుక్రం సర్వే దితేః సుతాః | అభి జగ్ముర్గృహం తస్య ముదితాస్తే దిదృక్షపః || 278 నాతోగూడ నూరేండ్లేరికిం గానరాకుండ యేకాంత నంప్రయోగ మిట గోరుచున్నావు. దేవీ ! నీ మేను నల్లగలువ చాయనున్నది. నీ కనులెంతో చక్కగ నున్నవి. మిక్కిలి పూజనీయవు నీ పలుకు లెంతొ ముద్దుగనున్నవి. ఈ వేవియొ వరములం గోరుచున్నా వవి యిచ్చెద. నిట్ల యగుగాక ! మా యింటికి వెళ్లుదమని యా జయంతితో నింటికి వచ్చి నూరేండ్లామెతో గూడ వసించుచు వ్రతమాచరించుచు మాయచే నే భూతమునకు గనిపింపక చరించెను. దైత్యులతడు కృతార్థుడై వచ్చెనని తెలిసి సంతోషించి యాతనిం జూడ నాతని యింటికేగిరి. గతా యదా న పశ్యంతి మాయయా సంవృతం గురుమ్ | లక్షణం తస్య చా బుద్ధ్వా నాద్యాగచ్ఛతి నో గురుః || 279 ఏవం తే స్వాని ధిష్ణ్యాని గతాః సర్వే యథా గతాః | తతో దేవగణా స్సర్వే గత్వాంగిరస మబ్రువన్ || 280 దానవా లయేతు భగవాన్గత్వా తత్ర చ తాం చమూమ్ | మోహయిత్వాత్మవశగాం క్షిప్రమేవ తథాకురు || 281 ధిషణ స్తాన్సురా నాహ ఏవమేవ వ్రజామ్యహమ్ | తేన గత్వా దానవేంద్రః ప్రహ్లాదో వై వశీకృతః || 282 శుక్రో భూత్వా స్థిత స్తత్ర పౌరోహిత్యం చకార సః | స్థితో వర్ష శతం సాగ్రముశనా తాప దాగతః || 283 దనుపుత్రై స్తతో దృష్టః సభాయాం తు బృహస్పతిః | ఉశనా ఏక ఏవాత్ర ద్వితీయః కిమిహాగతః || 284 సుమహత్కౌతుకం చాత్ర భవితా విగ్రహో దృఢమ్ | కిం వదిష్యతి లోకో೭యం ద్వారి యో೭యం వ్యవస్థితః || 285 సభాయామాస్థితో యో೭యం గురుః కింనో వదిష్యతి | ఏవం ప్రజల్పతాం తేషాం దనూనాం కవిరాగతః || 286 స్వరూప ధారిణం తత్ర దృష్ట్వాసీనం బృహసృతిమ్ | ఉవాచ వచనం క్రుద్ధః కిమర్ధం త్వమిహాగతః || 287 శిష్యాన్మోహయసే మే త్వం యుక్తం సురగురో స్తవ | మూఢా స్తే త్వాం న జానంతి త్వన్మాయా మోహితా ధ్రువమ్ || 288 తన్నయుక్తం తవ బ్రహ్మస్పరశిష్య ప్రధర్షణమ్ | వ్రజ త్వం దేవలోకం స్వం తిష్ఠ ధర్మమవాప్స్యసి || 289 వారేగి మాయావృతు నతనిం దమ గురునిం గానక యతని జాడయుం దెలియక మన గురువిప్పుడు రాడని వారందరు వచ్చినట్ల తమ యిండ్లకుం జనిరి. అవ్వల దేవగణము దానవ గృహ మేగి నీ వక్కడి సేనను సమ్మోహపరచి యిప్పుడ నీ వశము సేసికొన మన దేవ గురువు (ధిషణుడు) అట్ల చనియెద ననియె, అన్నట్లేగి ప్రహ్లాదుని వశపరచుకొనెను. అక్కడ శుక్రుడై యాతనికడ పౌరోహిత్యమును నిర్వహించెను, వేయేండట్లున్నతరి ఉశనుడు శుక్రు డటకు వచ్చెను. దానవుల కతడు సభలో గనబడెను శుక్రుడిట నొక్కడేకద రెండవ వాడెటువచ్చెను ? ఇది మిక్కిలి కుతూహలము గూర్చు విషయము. ఇట నేదో తగవు గానున్నది. లోకమేమనును. ద్వారమందున్నా డితడెవ్వడు? సభలో నున్న మన గురువేమనును ? ఇట్లా దానవొండొరులం జూచి ప్రసంగింప నటకు శుక్రుడు వచ్చెను. తన రూపము పూని యట గూర్చున్న బృహస్పతిం జూచి కోపమూని ఎందుల కీవిటకు వచ్చితివి ? నా శిష్యులను మోహపెట్టుచున్నావు. దేవగురువవు నీకీపని తగినదే, నీ మాయలోబడి మూఢులై నిన్నెరుంగరైరి. బ్రహ్మణ్యుడవు పర శిష్యులను దబ్బిబ్బువరచు టిది నీకు తగదు. నీవు నీ స్వర్గలోకమునకుం బొమ్మట నుండుము. దాన నీవు ధర్మముం బొందెదవు. శిష్యోహి మే కచః పూర్వం హాతో దానవపుంగవైః | విద్యర్థీ తసయో బ్రహ్మం స్తవాయోగ్యా గతిస్త్విహ || 290 శ్రుత్వా తు తస్య తద్వాక్యం స్మితం కృత్వావదద్ గురుః | సంతి చోరాః పృథివ్యాం యే పరద్రవ్యాపహారిణః || 291 ఏవం విధాన దృష్టాశ్చ రూవదేహాపహారిణః | వృత్రఘాతేన చేంద్రస్య బ్రహ్మహత్యా వురాభవత్ || 292 లోకాయతిక శాస్త్రేణ భవతా సా తిరస్కృతా | జానామి త్వా మాంగిరసం దేవాచార్యం బృహస్పతిమ్ || 293 మద్రూవథారిణం ప్రాప్తం సర్వే పశ్యత దానవాః | ఏషవో మోహనాయాలం ప్రాప్తో విష్ణువిచేష్టితైః || 294 తదేనం శృంఖలైర్భధ్వా క్షిపేత లవణార్మవే | పునరేవా బ్రవీచ్చుక్రః పురోధాయం దివౌకసామ్ || 295 మోహితా నూన మేతే న క్షయం యాస్యథ దానవాః | భో అహం దానవేంద్రేహ వంచితో೭స్మి దురాత్మనా || 296 కిమర్థం భవతా త్యక్తః కృతశ్చాన్యః పురోహితః | దేవాచార్యోం೭గిరః పుత్ర ఏష ఏవ బృహస్పతిః || 297 వంచితో೭సిన సన్దేహో హితార్థం తు దివౌకసామ్ | త్యజసై#్వనం మహాభాగ శత్రువక్ష జయావహమ్ || 298 అను శిష్యభయాద్యాతః పూర్వమేవ మహం వ్రభో | జలమధ్యే స్థితః ప్రీతో మహాదేవేన శమ్భునా || 299 ఉదరస్థస్య మే జాతం సాగ్రం వర్షశతం కిల | ఉదరాచ్ఛుక్ర రూపేణ శిశ్నే నాహం విసర్జితః || 300 నా శిష్యుడు కచుడు దానవ శ్రేష్టులచే గూలినాడు. విద్యార్థియై వచ్చినాడు. నీ కొడుకు ఇటకు నీరాక మంచిది గాదు. ఇతరుల ద్రవ్యముల హరించు దొంగలు మేదిని నున్నారు, కాని రూపమును దేహమును దొంగిలించు నీలాటివారు గనబడరు. పుత్రఘాతచే మున్నింద్రునకు బ్రహ్మహత్యాపాపము వచ్చినది. లోకాయతిక శాస్త్రముచేత నీవు దానిల దిరస్కరించితివి. నీవు సురాచార్యుడ వంగిరసు కుమారుడవు బృహస్పతివని నేను గ్రహించితిని. నా రూపుగొని వచ్చిన వీనిం దానవులార ! చూడుడు విష్ణువు చేసిన చేష్టలంబట్టి మిమ్ము మోహపెట్ట నిటకు వచ్చినాడు. వీని సంకెళ్ళంగట్టి ఉప్పు సముద్రమున విసరుడు. అని శుక్రుడు దేపపురోహితునిం జూచి వెండియు నిట్లనియె. వీని మోహమునంబది నీవు నిక్కముగ క్షయముంబొందుదువు, ఓ దానవపతి ! నేనిట వంచింపబడితిని. నీవు నన్నేల విడిచితివి? ఇంకొక పురోహితుని జేసికాంటి వెందులకు? శత్రుపక్షమునకు జయము గూర్చు వీనిని వదలివేయుము. శిష్యుని వలని భయముచే నేను బోయి జలమధ్య మందుండి మహాదేవుడగు శంభునిచేత నేను ద్రావబడి యా స్వామి యుదరమందు నూరేండ్లు పైగా నుంటినిగద. శిశ్నము నుండి శుక్రరూపమున నాయనచే నేను విడువబడినాను. వరదః ప్రాహ మాం దేవ శ్శుక్రేష్టం త్వం వరం వృణు | మయా వృతో పరం రాజన్దేవ దేవః పినాకధృత్ || 301 మనసా చింతితా హ్యర్థా మానసే యే స్ధితా వరాః | భవంతు మయి తే నర్వే వ్రసాదా త్తవ శంకర 302 ఏవ మస్త్వితి దేవేన ప్రేషితో೭స్మి తవాంతికమ్ | తావదత్రాభవ చ్చాయం పురోధాస్తే బృహస్పతిః || 303 దృష్టః సత్యం దానవేంద్ర మయోక్తం త్వం నిశామయ | బృహస్పతి స్తదా వాక్యం ప్రహ్లాదం ప్రత్యభాషత || 304 నాహమేతం ప్రజానామి దేవం వా దానపం నరమ్ | మద్రూప ధారిణం రాజన్వం చనార్థం తవాగతమ్ || 305 తతస్తే దానవాః సర్వే సాధు సాధ్వితి వాదినః | పురోధాః పౌర్వికో నో೭స్తు యో వా కో వా భవత్వితి || 306 నానేన కార్య మస్మాకం యాతు హ్యేష యథాగతః | సక్రోధమశపత్కావ్యో దానవేంద్రాన్సమాగతాన్ || 307 త్యక్తో యథాహం యుష్మాభి స్తథా సర్వాం శ్చిరాదివ | గతశ్రీకా న్గతప్రాణా న్పశ్యేయం దుఃఖ జీవికాన్ || 308 సుఘోరామాపదం ప్రాప్తా నచిరాదేవ సర్వశః | ఏవ ముక్త్వా గతః కావ్యో యదృచ్ఛాత స్తపోవనమ్ || 309 వరమడుగుమన, వరమేశ్వరుని నీ ప్రసాదముచే నేననుకొన్న వన్నియు నాకు సిద్ధించుగాక యన నట్లయగునని స్వామి పంపగా నీ దరికి వచ్చినంతలో నీకు పురోహితుడుగ నీ బృహస్పతి కనబడినా డిది నిజము సెప్పితి. నిది యాలింపు మనియె. బృహస్పతి యపుడు ప్రహ్లాదునితో ఇతడు దేవుడో దానవుడో నేనెరుగను. నిన్ను వంచింప నా రూపు గొని వచ్చినాడన నెల్ల దానవులు బాగు బాగు ! ఎవ్వడైన నగుగాక. మాకు ముందటి పురోహితుడే కావలయును. మా కీయనతో బనిలేదు. వచ్చిన దారిం దిరిగి యేగుగాక ! అనిరి. అపుడు శుక్రుడు కోపముతో దానవేంద్రులను శపించెను. మీచే నేనాయుథము విడిచి యటు వోయి చిరకాలమున కైశ్వర్యము వోయి ప్రాణములు వోయి దుఃఖముతో జీవించు మిమ్ము జూచితిని. సర్వవిధముల ఘోరమైన విపత్తులకు గురియైనారు. అని వలికి శుక్రాచార్యుడు స్వేచ్ఛగ తపోవనము నకుం జనెను. తస్మిన్గతే తతః శుక్రే స్థిత స్తత్ర బృహస్పతిః | పాలయన్ధానవాం స్తత్ర కించిత్కాల మతిష్ఠత || 310 తతో బహు తిథే కాలే అతిక్రాంతే సరేశ్వర | సంభూయ దానవాః సర్వే పర్య పృచ్ఛం స్తదా గురుమ్ || 311 సంసారే ೭స్మిన్నసారే తు కించి జ్ఞానం ప్రయచ్ఛ నః | యేన మోక్షం వ్రజామశ్చ ప్రసాదాత్తవ సువ్రత || 312 తతః సురగురుః ప్రాహ కావ్యరూపీ తదా గురుః | మమాప్యేషా మతిః పూర్వం యా యుష్మాభి రుదాహృతా || 313 క్షణం కుర్వంతు సహితా శ్శుచీభూయ సమాహితాః | జ్ఞానం వక్ష్యామి వో దైత్యా అహం వై మోక్షదాయి యత్ || 314 ఏషా శ్రుతి ర్వైదికీయా ఋగ్యజుః సామ సంజ్ఞితా | వైశ్వానర ప్రసాదాత్తు దుఃఖదా ప్రాణినామిహ || 315 యజ్ఞ శ్రాద్ధ కృతం క్షుద్రై రైహిక స్వార్థ తత్పరైః | యే త్వమీ వైష్ణవా ధర్మా యే చ రుద్రకృతా స్తథా || 316 కుధర్మాధార సహితై ర్హింసా ప్రాయాః కృతాహితైః | అర్థనారీశ్వరో రుద్రః కథం మోక్షం గమిష్యతి || 317 వృతో భూతగణౖ ర్భూరి భూషిత శ్చాస్థిభి స్తథా | న స్వర్గో నైవ మోక్షో೭త్ర లోకాః క్లిశ్యంతి వై తథా || 318 హింసాయా మాస్థితో విష్ణుః కథం మోక్షం గమిష్యతి | రజోగుణాత్మకో బ్రహ్మా స్వాం సృష్టి ముపజీవతి || 319 దేవర్షయో೭థ యే చాన్యే వైదికం పక్షమాశ్రితాః | హింసా ప్రాయాః సదాక్రూరా మాంసాదాః పాపకారిణః || 320 సురాస్తు మద్యపానే న మాంసాదా బ్రాహ్మణాస్త్వమీ | ధర్మేణానేన కః స్వర్గం కథం మోక్షం గమిష్యతి || 321 యచ్చ యజ్ఞాదికం కర్మ స్మార్తం శ్రాద్ధాదికం తథా | తత్ర నైవాపవర్గో7స్తి యత్రైషా శ్రూయతే శ్రుతిః || 322 బృహస్పతి నాస్తిక బోధ అతడటువోవ బృహస్పతి యా దైత్యుల గాపాడుచు గొంతకాల మటనే యుండెను. అపైని చాలకాలము గడువ దానవు లందరుం గలిసి యా గురువు నసారమైన యీ సంసారమం దించుక జ్ఞాన మనుగ్రహింపుము నీ ప్రసాదమున మేము మోక్షముం బొందుదుమన శుక్రాచార్య రూపమున నున్న యా సుర గురువు నాకును మునుపీలాటియూహ గలిగినది. మీ రొక్క క్షణము మనసు నిలిపి శుచిగ నందరుం గూడి యిట నుండుడు. మోక్ష మిచ్చు జ్ఞానమును నేనుపదేశింతును. ఋగ్యజుసామములను నీ వైదిక శ్రుతి వైశ్వానరాగ్ని ప్రసాదముచే ఇహలోకసుఖ మర్థించు స్వార్ధపరులు నీచులు యజ్ఞములు శ్రాద్ధములనునీ కర్మ మెల్ల ప్రాణులకు దుఃఖము నిచ్చును. వైష్ణములు శైవములు నను నీ ధర్మము లన్నియు పాడుపను లివి భార్యతోగూడి చేయనీ పనులన్నియు హింసాప్రాయములు. భూత ప్రేత గణములతో గలిసి ఎముకలం దాల్చు నర్థనారీశ్వరుడు రుద్రుడు మోక్షముం బొందుటెట్లు ? స్వర్గము లేదు మోక్షమును లేదు. వ్రజలు వృధా క్లేశమునకు గురియగుచున్నారు. విష్ణువు కేవలము హింసాపరుడు. మోక్ష మెట్లు పొందును? రజోగుణప్రాయుడు బ్రహ్మ తన సృష్టి వ్యాపారముచే బ్రతుకుచున్నాడు. ఇంకనున్న దేవర్షులు వైదికపక్షము నాశ్రయించి హింసాపరులు క్రూరులు మాంసము తిని పాపములు సేయుచున్నారు. దేవతలు మద్యము త్రాగుచున్నారు. ఈ బ్రాహ్మణులు మాంసభక్షకులు. ఈ ధర్మముచే నెవ్వడు స్వర్గ మెటువొందును ? మోక్షమెట్లందును ? వేదోక్తమైన యజ్ఞాది కర్మము స్మార్తము (స్మృతులు సెప్పిన) శ్రాద్ధాదులందు మోక్షము లేదు. యజ్ఞం కృత్యా పశుం హత్వా కృత్వా రుధిర కర్ధమమ్ | యద్యేవం గమ్యతే స్వర్గో నరకః కేన గమ్యతే || 323 యది భుక్త మిహాన్యేన తృప్తిరన్యస్య జాయతే | దద్యాత్ప్రవసతః శ్రాద్ధం న సభోజనమాహరేత్ || 324 ఆకాశగామినో విప్రాః పతితా మాంస భక్షణాత్ | తేషాం న విద్యతే స్వర్గో మోక్షో నైవేహ దానవాః || 325 జాతస్య జీవితం జంతో రిష్టం సర్వస్య జాయతే | ఆత్మమాంసోపమం మాంసం కథం ఖాదేత పందితః || 326 యోనిజాస్తు కథం యోనిం సేవంతే జంతవస్త్వమీ | మైథునేన కథం స్వర్గం యాస్యంతేదానవేశ్వర | మృద్భస్మనా యత్ర శుద్ధి స్తత్ర శుద్ధిస్తు కా భ##వేత్ || 327 విపరీతతమం లోకం పశ్య దానవ యాదృశమ్ | విణ్మూత్రస్య కృతో త్సర్గే శిశ్నాపానే తు శోధనమ్ || 328 న సంభారో7స్తి వదనే మృదా తో యేన వా పునః | భుక్తే వా భోజనే రాజన్కథం నాపాన శిశ్నయోః || 329 క్రియతే శోధనం తద్వద్విపరీతా స్థితిస్త్వియమ్ | యత్ర ప్రక్షాలనం ప్రోక్తం తత్ర తేనైవ కుర్వతే || 330 తారాం బృహస్పతే ర్భార్యాం హృత్వా సోమః పురాగతః | తస్యాం జాతో బుధః పుత్రో గురుర్జగ్రాహ తాం పునః || 331 గౌతమస్య మునేః పత్నీ మహల్యాం నామ నామతః | అగృహ్ణాత్తాం స్వయం శక్రః పశ్య ధర్మో యథావిధః || 332 రక్తపు మడుగులడుసగు యజ్ఞములు సేసి పశువుం జంపి స్వర్గమందునేని మరి నరకమున కేగువా డెవ్వడు? ఇంకొక డిక్కడ తిన్న నింకొకని కాహారమగునేని పొరుగూరికి పోయినవానికి తద్దినము పెట్టిన; వాడు తినుటలేదే? ఆకాశమునకు పోయిన విప్రులు, మాంసభక్షణముచే క్రిందబడిపోదురు. వాండ్రకు స్వర్గము లేదు. పుట్టిన జీవు లెల్లరకు జీవితము (బ్రతుకవలెననునది) ఇష్టమగును. తెలిసినవాడు తన మాంసములాటి మాంసము మెక్కుటెట్లు ? యోని నుంది పుట్టిన యీ జంతువులా యోనినే యెట్లనుభవింతురు? మైథునముచే స్వర్గ మెట్లందుదురు ? మన్ను, బూడిదచేత శుద్ధియట. అట గల్గు శుద్ధి యేలాటిది? మూత్రపురీషోత్సర్జనముసేసి శిశ్నము ముడ్డియుం గడిగికొనుటిది యేమి లోకము తలక్రిందులు జగత్తు చూడుము. మట్టిపూత నీటితో గడగికొందు రాలాటి శుద్ధి సామగ్రి మట్టిచే నీళ్ళచే భోజనము చేసినపుడు నోరేల గడిగికొనరు? ఇదంతయు విపరీత పరిస్థితి. ఎక్కడ ప్రక్షాళనము దేనితో చెప్పబడినదో యది యక్కడనే చేయవలెను. (ఇక్కడ పాపము చేసి ఎక్కడనో శుద్ధిచేసికొనుట యేమి? స్వర్గమేమి నరకమేమి యేమియు లేదని భావము) బృహస్పతి యిల్లాలిం దారను సోముడు గాజేసెను. దానియందు బుధుడు పుట్టినాడు. గురువా తారను తిరిగి స్వీకరించెను. గౌతముని పత్ని నహల్య నింద్రుడు లాగికొన్నాడు చూడు ధర్మమేలాటిదో. ఏతదన్యచ్చ జగతి దృశ్యతే పాపదాయికమ్ | ఏవం విధో యత్ర ధర్మః పరమార్ధో మతస్తుకః || 333 ఇదియు నింకొకటియు పాపకార్యము లోకమందు కనిపించుచున్నవి. ఈలాటిది ధర్మమయినచో నిక వరమార్థమేది? దానవేంద్ర ! నీవు సెప్పుము. ఇంకను నీకేమి సెప్పుదును? వదస్వ త్వం దానవేంద్ర వద భూయో వదామి తే | గురోస్తు గదితం శ్రుత్వా పరమార్థాన్వితం వచః || 334 జాత కౌతూహలాస్తత్ర వివిక్తాస్తు భవార్ణవాత్ | దానవా ఊచుః దీక్షయస్వ గురో సర్వాన్ప్రపన్నా న్భక్తితః స్థితాన్ || 335 యేన వై న పునర్మోహం వ్రజామస్తవ శాసనాత్ | సువిరక్తాః స్మ సంసారే శోక మోహ ప్రదాయిని || 336 ఉద్ధరస్వ గురో సర్వాన్కేశా కర్షేణ కూపతః | కస్య దేవస్య శరణం గచ్ఛామో బ్రాహ్మణోత్తమ || 337 దైవతం చ ప్రపన్నానాం ప్రకాశయ మహామతే | స్మరణ నోపవాసేన ధ్యాన ధారణయా తథా || 338 పూజోపహారే చ కృతే ఆపవర్గస్తు లభ్యతే | విరక్తాస్స్మ కుటుంబే తు భూయో నాత్ర యతామహే || 339 ఏవం చైవ గురుచ్ఛన్న సెరుక్తో దనుజపుంగవైః | చింతయా మాస తత్కార్యం కథమే తత్కరోమ్యహమ్ || 340 కథమేతే మయా పాపాః కర్తవ్యా నరకౌకసః | విడంబనాచ్ఛ్రుతే ర్బాహ్యా సై#్రలోక్యే హాస్యకారిణః || 341 ఇత్యుక్త్వా ధిషణో రాజంశ్చింతయామాస కేశవమ్ | తస్య తచ్చింతితం జ్ఞాత్వా మాయామోహం జనార్దనః || 342 సముత్పాద్య దదౌ తస్య ప్రాహ చేదం బృహస్పతిమ్ | మాయామోహో7య మఖిలాంస్తాన్ దైత్యా న్మోహయిష్యతి || 343 పరమార్ధముతొగూడిన గురుని పలుకాలించి దానవులు కుతూహలముగొని సంసారమునుండి దానవులు విడివడి యిట్లనిరి. గురో ! భక్తితో నీ దరికి వచ్చితిమి. నీయాన. తిరిగి సంసార లంపటమున మోహపడకుండ మాకు దీక్షయిమ్ము. నూతి నుండి జుట్టుపట్టి లాగినట్లు మమ్మందరి నుద్ధరింపుము. మేమే దేవుని శరణందవలె బ్రాహ్మణోత్తమ! బుద్ధిశాలివి. ఆ దేవతలను, నీకు ప్రపన్నులమైన మాకు వెల్లడింపుము. స్మరణము ఉపవాసము ధ్యానము థారణ పూజోపహారము వలన ప్రమాద మేర్పడుచున్నది. ఈ కుటుంబమునెడ (సంసారమునెడ) విరక్తులమైనాము. తిరిగి దీనికిక యత్నింపము. అని దానవశ్రేష్ఠుల మరుగువడియున్న (మాయావియైయున్న) బృహస్పతి వీరు పరమ పాపులు నాస్తికులు నరక నివాసులు కాదగినవారు. శ్రుతి విడంబనమున వేదములను వేదవిహితానుష్ఠానములను బరిహసించు నీ దుష్టులు ముల్లోకము లందు వెలివేయవలసినవారని బృహస్పతి విష్ణుధ్యానము సేసెన, అతని యూహ తెలిసి విష్ణువు మాయామోహుడనువానిని సృజించి గురునితో ఇడుగో వీడా తపోనిరతులగు దైత్యులను మోహపరచును. తప్పుదారి పట్టించుననెను. భవతా సహితః సర్వాన్వేదమార్గ బహిష్కృతాన్ | ఏవమాదిశ్య భగవానంతర్థానం జగామహ || 344 తపస్యభిరతా న్సో7థ మాయామోహో గతో 7సురాన్ | తేషాం సమీప మాగత్య బృహస్పతిరువాచహ || 345 అనుగ్రహార్థం యుష్మాకం భక్త్యా ప్రీతస్త్విహాగతః యోగీ దిగమ్బరో ముణ్డో బర్హిపత్రధరో హ్యయమ్ || 346 ఇత్యుక్తో గురుణా వశ్చాన్మాయా మోహో7బ్రవీద్వచః | భో భో దైత్యాధి పతయః ప్రభూ తపసి స్థితాః || 347 ఐహికార్థం తు పారక్యం తపసః ఫలమిచ్ఛథ | దానవా ఊచుః పారక్య ధర్మా లాభాయ తవశ్చర్యా హినో మతా || 348 అంతట బృహస్పతి దైత్యుల కడకు వచ్చి మీ భక్తికి ప్రీతిసెంది మిమ్మనుగ్రహింప వచ్చితిని. ఇడుగో యోగి దిగంబరుడు తలబోడి నెమలిపించము దాల్చినాడన్న తరువాత మాయామోహు డోదైత్యాధిపతులార ! నిండు తపస్సు నందున్నారు. ఇహముకొరకు పారలౌకికమయిన ఫలము కోరుచున్నారస దానవులు కాదు కాదు మేము పరలోకముకొరకు తపశ్చర్య చేయుట మా యభిప్రాయము. మేమిది యారంభించినాము. ఇందు నీ చెప్పదలచినదేమి ? అన దిగంబరు డిట్లనియె. ఆస్మాభిరియ మారబ్ధా కిం వా తత్ర వివక్షితమ్ | దిగంబర ఉవాచ కురుధ్వం మమ వాక్యాని యది ముక్తి మభీప్సథ || 349 ఆర్హతం సర్వమే తచ్చ ముక్తి ద్వార మసంవృతమ్ | ధర్మాద్విముక్తే రర్హోయం నై తస్మాద పరః || 350 అత్రైవావస్థితాః స్వర్గం ముక్తిం చాపి గమిష్యథ | ఏవం ప్రకారై ర్బహుభి ర్ముక్తి దర్శన వర్జితైః || 351 మాయా మోహేన తే దైత్యా వేదమార్గ బహిష్కృతాః | ధర్మాయై తద ధర్మాయ సదే తద సధ్వితపి || 352 విముక్తయే త్విదం నైతద్విముక్తిం సంప్రయచ్ఛతి | పరమార్థో7య మత్యర్థం పరమార్థో న చాప్యయమ్ || 353 కార్యమే తదకార్యం హి నైతదేతత్స్ఫుటం త్విదమ్ | దిగ్వాససామయం ధర్మో ధర్మో7యం బహువాససామ్ || 354 ముక్తి కావలెనన్న నా చెప్పినది సేయుడు. అర్హత మను మత మిదియెల్ల తెరచియున్న ముక్తిద్వారము. ముక్తి నీగల యీ ధర్మముకంటె నర్హమయిన దింకొకటి లేదు. ఇక్కడనే యుండి స్వర్గమును మోక్షమునుం బొందుడు. అని యీలాటి పెక్కురకాల మోక్షశాస్త్ర నిషిద్ధములైన మాటలచే దైత్యులు మాయామోహునిచే వేదమార్గము దప్పింపబడిరి. ఇది ధర్మమున కిది అధర్మమునకు ఇది మంచిది ఇది చెడ్డది ఇది ముక్తి ఇది ముక్తినీయదు ఇది అత్యంత పరమార్థము ఇది పరమార్థముకాదు ఇది కార్యము ఇది ఆకార్యము ఇది స్ఫుటమయిన విషయము ఇది దిగంబరుల ధర్మము ఇది బహువస్త్రులది. ఇత్యనేకార్థ వాదాం స్తు మాయా మోహేన తే యతః | ఉక్తాస్తతో 7ఖిలా దైత్యాః స్వధర్మాం స్త్యాజితా సృప || 355 అర్హధ్వం మామకం ధర్మం మాయామోహేన తే యతః | ఉక్తా స్తమాశ్రితా ధర్మ మార్హతా స్తేన తే7భవన్ || 356 త్రయీ మార్గం సముత్సృజ్య మాయా మోహేన తే7సురాః | కారితా స్తన్మయా హ్యాసం స్తథాన్యే తత్ప్రబోధితాః || 357 తైరప్యన్యే పరేతైశ్చ తైరన్యోన్యై స్తదాపరే | నమో7ర్హతే చేతి సర్వే సంగమే స్థిరవాదినః || 358 అల్త్పెరహోభిః సంత్యక్తాసై#్తర్దైత్యైః ప్రాయ శస్త్రయీ | పునశ్ఛ రక్తాంబర ధృ న్మాయా మోహో జితేక్షణః || 359 సో7నా నప్యసురా న్గత్వా ఊచే7న్య న్మధురాక్షరమ్ | స్వర్గార్థం యదివో వాఞ్ఛా నిర్వాణార్థాయ వా పునః || 360 తదలం పశుఘాతాది దుష్ట ధర్మై ర్నిబోధత | విజ్ఞానమయ మేతద్వై త్వశేష మధిగచ్ఛత || 361 బుధ్వధ్వం యే వచః సమ్యగ్బుధ్తెరేవ మిహోదితమ్ | జగదేతద నాధారం భ్రాంతి జ్ఞానాను తత్పరమ్ || 362 రాగాది దుష్ట మత్యర్ధం భ్రామ్యతే భవ సంకటే | నానా ప్రకారం వచనం స తేషాం ముక్తియోజితమ్ || 363 తథా తథా7వదద్ధర్మం తత్యజుస్తే యథా యథా | కేచిద్వినిన్ధాం వేదానాం దేవానామపరే నృప || 364 యజ్ఞకర్మకలాపస్య తథా చాన్యే ద్విజన్మనామ్ | నై తద్యుక్తిసహం వాక్యం హింసా ధర్మాయ జాయతే || 365 అని అనేకార్థవాదములను వాడేకరువుపెట్టెను. దాన దైత్యులెల్ల స్వధర్మమునుండి భ్రష్టులు గాపింపబడిరి. నా ధర్మము సర్హింపుడు పూజింపుడు (అర్హముగా గ్రహింపుడు) అని మాయామోహునిచే జెప్పబడి యా ధర్మమున జేరి నందున వారు ఆర్హతులయిరి. త్రయీ (వేదత్రయ) మార్గము విడిచి అసురులు తన్మయులైపోయిరి. వారి బోధలు విని యన్యులు నట్లయిరి. ఇట్లంధ పరంపరగా మత ప్రబోధములు సేయుచు సమావేశమునందు అర్హంతునకు నమస్కారమనుచు గట్టిగ వాదించుచు కొలది రోజులలోనే వేదమార్గముం దప్పికొనిరి. మరియు నా మాయోమోహు డెఱ్ఱని బటలు కట్టుకొని నల్లని కండ్లతో తదితర దైత్యులకడకేగి యింకొకరకము తీయని మాటలు పలికెను. మీకు స్వర్గముకొరకు ముక్తికొరకు కోరికగలదేని, యిదిగో యీ యశేష విజ్ఞానమును నేర్చికొనుడు. నా మాట నెరిగికొనుడు. పండితులిట్లు చక్కగ జెప్పినారు. ఈ జగత్తు నిరాధారము, భ్రాంతి జ్ఞాన విషయము. మిక్కిలి రాగద్వేషాదులచే దుష్టముమీర సంసార సంకటమున తిరుగుడువడుచున్నారు ఆని నానావిధముగ ముక్తిగూర్చున దీమాట యని వారు ధర్మదూరులగునట్లాయా మాటలు చెప్పెను. కొందరు వేదనిందను కొందరు దేపనింద కొందరు యజ్ఞ కర్మకలాపనిందను కొందరు బ్రాహ్మణ దూషణమును జేయసాగిరి. జీవహింస ధర్మకారణమగునన్న యీమాట యుక్తిసహముగాదుః హవీంష్య నల దగ్ధాని ఫలాన్యర్హంతి కో విదాః | నిహ తస్య పశోర్యజ్ఞే స్వర్గప్రాప్తి ర్యదీష్యతే || 366 స్వపితా యజమానేన కింవా తత్ర నహన్యతే | తృప్తయే జాయతే పుంసో భుక్త మన్యేన చేద్యది || 367 దద్యాచ్ఛ్రాద్ధం ప్రవసతోన వహేయుః ప్రవాసినః | యజ్ఞైరనేకై దేవత్వ మవాప్యేన్దే)ణ భుజ్యతే || 368 శమ్యాది యదిచేత్కాష్ఠం తద్వరం మిత్రభుక్పశుః | జనా శ్రద్ధేయ పత్యే త దవగమ తు తద్వచః || 369 ఉపేక్ష్య శ్రయసే వాక్యం రోచతాం యన్మయేరితమ్ | నహ్యాప్తవాదానభసోనిపతంతి మహాసురాః || 370 యుక్తి మద్వచనం గ్రాహ్యం మయాన్యైశ్చ భవద్విధైః | దానవా ఊచుః తత్త్వవాదే వయం సర్వే ప్రపన్నాస్తవ భక్తితః || 371 హవిస్సులు అగ్నిదగ్ధములయిపోయినవి. నిపుణులు వాని ఫలితముల కర్హులగుదురట. యజ్ఞమునం జంపబడిన పశువునకు స్వర్గప్రాప్తి నిజమేనుని యజకుమారుడు తన తండ్రి నేల బలియీయరాదు ? ఇంకొకడు తిన్నది యింకొకని తృప్తికలుగునేని ప్రవాసమేగినవానికి శ్రాద్ధము పెట్టుడు. దారిబత్తెము మూటగట్టుకొని పొరుగూరు పోవలసిన పని యుండదు. పెక్కు యజ్ఞములు చేయుటవలన నింద్రుడు జమ్మి మొదలయిన కఱ్ఱలను దినుచున్నాడు. జీవుడు యజ్ఞ పశువుం దినుటకంటె తన కొడుకునే తినుట మంచిదిగదా ? ఇదంతయు గమనించి వేద వాదముల అసందర్భ భావము నాలోచించి, జనులార ! మీకు యజ్ఞాదుల వలన ప్రయోజనం లేదని నమ్ముడు. ఆ మాటను ద్రోసివేసి నా మాట వినుడు. ఆప్తవాక్యము ప్రమాణమని మూర్ఖులందురు. ఆప్తము వేదమందురు. ఆమాట లాకసమునుండి యూడిపడవు. నేనుగాని మీలాటివా రెవ్వరుగాని యుక్తిసహనమైన మాట గ్రహింపనగునన దానవు లిట్లనిరి. కురుష్వానుగ్రహం చాద్య ప్రసన్నో7సి యది వ్రభో | సంభారానాహరాయో7ద్య దీక్షా యోగ్యాంశ్చ సర్వశః || 372 ప్రసాదాత్తపయేనా శుమోక్షో హస్తగతో భ##వేత్ | తతస్తా నబ్రవీ త్సర్వాన్మాయా మోహో7సురాంస్తదా || 373 ప్రపన్నః శాసనం హ్యేష మదీయో గురు రగ్ర్యధీః. దీక్షాం దాస్యతి యుష్మాకం నిదేశాన్మమసత్తమః || 374 ఏతా న్దీక్షయభో బ్రహ్మన్వచనా న్మమ పుత్రకాన్ | గతే మోహే దానవాస్తే భార్గవం వాక్య మబ్రువన్ || 375 దేహి దీక్షాం మహాభాగ సర్వ సంసార మోచనీమ్ | తధేత్యాహోశనా దైత్యాన్గచ్ఛామో నర్మదామను || 376 మేము భక్తితో నీ తత్త్వవాదమునందు (యథార్థవచననమందు) ప్రపత్తిగొన్నాము నమ్మకముబెట్టుకొన్నాము. ప్రసన్నుడవేని యిపుడు మాపై యనుగ్రహము సూపుము. మోక్షదీక్షా యోగ్యములైన సామగ్రులనిప్పుడ ప్రోగుసేసి కొందము. నీ ప్రసాదమున మాకు మోక్షము కరతలామలకమగునట్లు మా చేయవలసినదానతిమ్మని దానపులనిరి. మాయామోహుడు ఇడుగో మా గురువు. షుహాజ్ఞాని. ఆజ్ఞ యీయగలడు. ఇతడు దీక్ష ఈయగలడు. నేనిప్పించెదనని అని శుక్రాచార్యునితో వీరు నా పుత్రులు. వీరికీ దీక్షయిమ్మని మాయామోహుడు వెళ్ళిపోయెను. అపై దైత్యులు మహానుభావ! సర్వసంసారముక్తికి దీక్ష యిమ్మన నాయన నర్మదా తీరమునకు వెళ్ళెదమనియె. భోభో స్త్యజత వాసాంసి దీక్షాం కారయితాస్మి వః | ఏవం తే దానవా భీష్మ భృగురూపేణ ధీమతా || 377 ఆంగిరసేన తే తత్ర కృతా దిగ్విససో 7సురాః | బర్హిపింఛధ్వజం తేషాం గుంజికాచారుమాలికామ్ || 378 దత్వా చకార తేషాం తు శిరసో లుంచనం తతః | కేశస్యోత్పాటనం చైవ పరమం ధర్మ సాధనమ్ || 379 ధనానా మీశ్వరో దేవో ధనదః కేశలుంచనాత్ | సిద్ధిం పరమికాం ప్రాప్తాః సదా వేషస్య ధారణాత్ || 380 నిత్యత్వం లభ్యతే హ్యేవం పురాప్రాహార్హతః స్వయమ్ | వాలోత్పాటేన దేపత్వం మానుషైర్లభ్యతే త్విహ || 381 కిం న కుర్వీత తత్తస్మాన్మహాపుణ్యప్రదం యతః | మనోరథో హి దేవానాం లోకే వై మానుషే కదా || 382 అస్మిన్స్యాద్భారతే వర్షే జన్మనః శ్రావకే కులే | తపసా యుఞ్ట్మహే7స్మాన్వై కేశోత్పాటన పూర్వకమ్ || 383 తీర్థంకరా శ్చతుర్వింశ త్తథా తైస్తు పురస్కృతాః | ఛాయా కృతం ఫణీన్ద్రేణ ధ్యానమార్గ ప్రదర్శకమ్ || 384 స్తువన్తం మంత్రవాదేన స్వర్గో హస్తగతో7ర్హతమ్ | మోక్షో వా భవితా నూనం విచారః కో7త్ర కథ్యతే || 385 కదా స్యామర్షయో భూత్వా సూర్యాగ్ని సమతేజసః | జప్త్వా విరాగిణశ్చైవ మను పంచాంగకం తథా || 386 తథా తపస్యతాం మృత్యుం గతానాం కాల పర్యయాత్ | పాషాణన శిరోభగ్నం భవతే పుణ్య కర్మణామ్ || 387 అరణ్య నిర్జనే వాసః కదా వై భవితా హి నః | కర్ణజప్యం శ్రావకాశ్చ కిష్యంతి సమాహితాః || 388 మీకు దీక్ష యిచ్చెద మీ బట్టలు విప్పివేయుడన శుక్రాచార్య వేషమున నున్న వాని మాటలు విని దానవులు దిగంబరులై నెమలిపింఛము ధ్వజము (జెండా) గురివిందపూసల మాల యునిచి యందరి తల గొరిగించి బోడులంజేసెను. కేశమును గొరగికొనుట పరమ ధర్మసాధనము, కుబేరుడు ధనాధిపతి. కేశములను గొరిగించికొని వేషము ధరించుట వలనెనే పరమ ధనలాభమందినాడు. దీనివలననే నిత్యంతు నాడని మున్ను అర్హతుడు తాన పల్కియున్నాడు. మనుజులు జుట్టు తీసివేయుటచేతనే యీలోకమందు దేవత్వమందుదురు. ఇది మహాపుణ్యమిచ్చు పని. ఎందుకు జేయరు. ఎందుకు జేయరు ? దేవతలు గూడ శ్రావక కులమందు మనుష్యలోకమున భారతవర్షమున (శ్రావకకులమందు బౌద్ధకుటుంబమందు) బుట్టవలెనని కోరుదురు. కేశములను గొరిగించికొని తపోయుక్తుల మగుదము. తీర్థంకరు లిరువదినల్గురను వారనుసరించిరి. ఫణీంద్రుడు ఛాయాకృతమైన మార్గమును జూపించి మంత్రవాదముచే నర్హతుని స్థుతించిన మోక్షము కల్గితీరును. ఇందాలోచన యెందులకు. సూర్యాగ్ని తేజస్వులగు ఋషుల మెప్పుడగుదుమోగదా. పంచాంగములుగల మనువును (మంత్రమును) జపించి తుదకు తపస్సుచేయుచు కాలవశముస మృత్యువును పుణ్యాత్ములకు పాషాణముతో తలబ్రద్దలుకొట్టుకొనుట మూలమున చావేనాడువచ్చునో. నిర్జనారణ్యమున మనకెప్పుడు నివాసముగల్గునో శ్రావకులు చెవులో జపముపదేశింతురో ఆవిధమున మోక్షమార్గమున పోవలయును. భో భో ఋషే న గంతవ్యం మోక్షమార్గో యతో భ##వేత్ | లబ్ధాని యాని స్థానాని భూయో వృత్తి కరాణి చ || 389 త్యాజ్యాని తేన చైతాని సత్యమేవ వచో హి నః | అస్మదీయేన తవసా నియమై ర్వివిధై స్తథా || 390 వ్రజధ్వం చోత్తమం స్థానం మోక్షమార్గం చ యం బుధాః | విన్దన్తి భక్తి భావేన తపో యుక్తా స్తపస్వినః || 391 అక్షేషు నిగ్రహో యత్ర దయా భూతేషు సర్వదా | తత్తపో ధర్మ ఇత్యుక్తం సర్వ చాన్యా విడమ్బనమ్ || 392 జ్ఞాత్వై తద్భవతాగి సాధ్యం గంతవ్యం పరమం పదమ్ | యాం వై తీర్థంకరాయాతాయాం గతిం యోగినో గతాః || 393 ఏవం వై దేవతాః పూర్వం విద్యాధరా మహోరగాః | మనోరథాభిలాషాం స్తే చింతయంతో దివానిశమ్ || 394 యద్యేషణావై యుష్మాకం సంసార విరతౌ కృతా | వరిత్యజధ్వం ద్వారాణి స్వర్గమార్గార్గలానిచ || 395 యస్యాం యోనౌ పితా యా తస్తాం యోనిం సేపసే కథమ్ | ఆత్మమాంసోపమం మాంసం కథం ఖాదంతి జంతవః || 396 ఓ ఋషీ ! నీవు మోక్షమార్గమువైపు పోవలదు. జీవనోపాయమునకు (బ్రతుకుతెరువునకు) యే పదపులు మీ కున్నవో యవి యన్నియును విడిచిపెట్టుడు. మన మతానుసారి నియమములతో నడువుడు. తపోనిరతులైనవారు భక్తి భావముతో ముక్తినందుదురు. ఇంద్రియనిగ్రహము భూతదయయును తపస్సు ధర్మమని చెప్పబడినది. తక్కినదంతయు వట్టి కాలక్షేపము. మీకిది సాధ్యమైన యీ మార్గము తెలిసి పరమపదమందుడు. తీర్థంకరులు యోగు లేదారినం జనిరో మునుపు దేవతలు విద్యాధరులు పన్నగులుం దమ మనోరధములను వాంఛలను రేయింబవళ్ళాలోచించి యా దారిన చనిరి. సంసారవిరతియందు మీకు కోరికలున్నచో స్వర్గద్వారమునకు గడియ లీభార్యలను విడిచిపెట్టుడాపై ఏ యోనియందు మీ తండ్రి ప్రవర్తించె నద్దానినే నీ వనుభవించుటెట్లు? ఇది యేమి దారుణము! తమ మాంసములాటిదేకదా! మాంసమును జీవులెట్లు తిందురు ? అనెను. తతస్తే దానవా భీష్మ ఊచుః సర్వే గురుం వచః | దీక్షస్వనో మహాభాగ భ్రూణకా నగ్రతః స్థితాన్ || 397 తథా కృత్వా స తానాహ సమయేన పురోహితః | ప్రణామో నాన్యదేవేషు కర్తవ్యో పః కదాచన || 398 ఏకస్ధానే యదా భక్తం భోక్తవ్యం కరసంపుటే | తత్ర స్థానే స్థితం తోయం కేశకీట వివర్ణితమ్ || 399 తుల్యం ప్రియా ప్రియం కార్యం నాస్యద్ దృష్టిహతం క్వచిత్ | భోక్తవ్య మేతేన విభో ఆచరేణ తథా కురు || 400 భవధ్వం సహితా యూయం తే తథా మోక్షభాగినః | ఏవ ముక్త్వా స నియమా స్కృత్వా తా న్దనుపుంగవాన్ || 401 జగామ ధిషణో రాజన్దేవలోకం దివౌకసామ్ | ఆచచక్షే స తత్సర్వం దానవానాం చ కారితమ్ || 402 తతస్తే త్వసురా జగ్ము ర్నర్మదా మభితో వసన్ | దృష్ట్వా తాన్ధానవాం స్తత్ర ప్రహ్లాదేన వినాకృతాన్ || 403 దేవరాజ స్తతో హృష్టో నముచిం ప్రాహ వైవచః | హిరణ్యాక్షం యజ్ఞహనం ధర్మఘ్నం వేద నిందకమ్ || 404 రాక్షసం క్రూరకర్మాణం ప్రఘసం విఘసం తథా | ముచించైవ తథా భాణం విరోచన మథాపి వా || 405 మహిషాక్షం బాష్కలం చ ప్రచణ్డం చండ కం తథా | రోచమానం తథా త్యుగ్రం సుషేణం దానవోత్తమమ్ || 406 ఏతాన్దృష్ట్వా తథా చాన్యా న్దానవేంద్రా నథాబ్రవీత్ | అంతత దానవులు గురునింగని శిశువులము మమ్ము నీ యెదుట నున్నవారికి దీక్ష యిమ్మన, పురోహితుడు బృహస్పతి యట్లసేసి వ్రతిజ్ఞాపూర్వకముగ మీరింకొక దేవతకు నమస్కరింపరాదు. అందరు నేకముగ గూర్చుండి అరచేతిలో భోజనము సేయవలెనని వెంట్రుకలు క్రిములులేని నీ రెక్కడున్నం ద్రావవచ్చును. ప్రియము నప్రియము సమానము గావలెను. ఇది మంచిది ఇది చెడ్డది యను భేదబుద్ధి పనికిరాదు. ఇతరుల దృష్టిపడినది మాత్రము తినగూడదు. ఈ యాచారము ననుసరింపుడు. మీరందరు నేకముగండు (ఒకే సంఘముగా నుండుడు). కలిసి మోక్షముం బొందుడని అర్హన్మత నియమముల దానవులకిట్లు చెప్పి ధిషణుడు (దేవగురువు) స్వర్గమేగి దానపులచే దాను జేయించిన నాస్తికమత స్వీకార వృత్తమంతయుం జెప్పెను. అ అసురులు నర్మదాతీర ప్రాంతమున వసించిరి. ప్రహ్లాదునితో విడిపోయిన యా దానవులం జూచి దేవేంద్రు డానందించి హిరణ్యాక్షుడు మొదలు సుషేణునిదాకగల వారిని మరి యితరులం గని యిట్లనియె. ఇన్ద్ర ఉవాచ దానవేంద్రాః పురాజాతాః కృతం రాజ్యం త్రివిష్టపే | 407 ఇదానీం కథమే వేదం వ్రతం వేద విలోపకమ్ | భవద్భిః కర్తుమారబ్ధం నగ్నముండి కమండులు || 408 మయూర ధ్వజ ధారిత్వం కథం చైవేహ తిష్ఠథ | దానవా ఊచుః త్యక్తః సర్వాసురభావ ఋషిధర్మే వయం స్థితాః | 409 ధర్మవృద్ధికరం కర్మ చరామః సర్వ జంతుషు | త్రైలొక్య రాజ్య మఖిలం భుంక్ష్వ శక్ర వ్రజస్వచ || 410 తధేతి చోక్త్వా మఘవా పునర్యాత స్త్రివిష్టవమ్ | ఏవం తే మోహితాః సర్వే భీష్మ దేవ పురో ధసా || 411 (19) మీరు మున్ను దానవేశ్వరులయి పుట్టినారు. స్వర్గమునేలినారు. వేదలోపముసేయు నీవ్రత మెట్లు సేయుట ? దిగంబరము ముండనము కమండలువు నెమలి యీకల జెంజా ధరించుట. ఛీ ఛీ యీ వేషముతో నిట నుండుటెట్లు? దానవులు. ఆ సుర స్వభావము వదలివేసినాము. ఋషిధర్మములో మేమున్నాము. సర్వజంతువులయెడ ధర్మవృద్ధిసేయుపని నాచరింతుము. ఓ శక్ర ! త్రైలోక్యరాజ్య నర్వస్వము నీవనుభవింపుము. వెళ్లుమన మఘవుడు (ఇంద్రుడు) అట్లేయని స్వర్గమునకు తిరిగి వెళ్ళెను. భీష్మాచార్య దేవపురోహితునిచే నసురులీవిధముగ మోహితులైరి. నర్మదా సరితం ప్రాప్య స్థితా దానవ సత్తమాః | జ్ఞాత్వా శుక్రేణతే సర్వే వృత్తాంత మనుబోదితాః || 412 తదా త్రైలోక్య హరణ చక్రుః క్రూరాం వునర్మతిమ్ || 413 ఇతి శ్రీపద్మపురాణ ప్రథమే సృష్టిఖండే అవతార చరితం నామ త్రయోదశో7ధ్యాయః నర్మదానది కేగి యట నుండిరి. ఈ మోసము శుక్రుడు తెలిసికొని తెలియజెప్పినమీదట తిరిగి త్రైలోక్యమును హరింప తలంపుగొనిరి. ఇది అవతారచరితమను పదమూడవ యధ్యాయము