Sri Padma Mahapuranam-I
Chapters
పదునైదవ అధ్యాయము బ్రహ్మసభా వర్ణనమ్ భీష్మ ఉవాచ : కింకృతం బ్రహ్మణా బ్రహ్మన్ ప్రేష్యవారాణసీం పురీం | జనార్దనేన కిం కర్మ శంకరేణ చ యన్మునే || 1 కథం యజ్ఞఃకృతస్తేన కస్మింస్తీర్థేవదస్వమే | కే సదస్యాఋత్విజశ్చ సర్వాంస్తాన్ ప్రబ్రవీహిమే || 2 కేదేవా స్తర్పితాస్తేన ఏతన్మే కౌతుకం మహత్ ! పులస్త్య ఉవాచ : శ్రీనిధానం పురం మేరోః శిఖరై రత్రచిత్రతం | అనేకాశ్చర్యనిలయం బహుపాదప సంకులమ్ || 3 విచిత్రధాతుభిశ్చిత్రం స్వచ్ఛస్పటిక నిర్మలమ్ | లతావితాన శోభాఢ్యం శిఖిశబ్దనినాదితం || 4 మృగేంద్రరవవిత్రస్త గజయూథసమాకులమ్ | నిర్ఝరాంబుప్రపాతోత్థ శీకరాసారశీతలం || 5 వాతాహతతరువ్రాత ప్రసన్నాపాన చిత్రితమ్ | మృగనాభివరామోద వాసితాశేషకాననం | 6 లతాగృహరతిశ్రాంత సుప్తవిద్యాధరాధ్వగమ్ : ప్రగీతకిన్నరవ్రాత మధురధ్వని నాదితం || 7 తస్మిన్ననేక విన్యాస శోభితాశేషభూమికమ్ | వైరాజం నామభవనే బ్రహ్మణః పరమేష్ఠినః || 8 తత్రదివ్యాంగనోద్గీత మధురధ్వని నాదితా | పారిజాత తరూత్పన్న మంజరీదామ మాలినీ || 9 రత్నరాశి సమూహోత్థ బహువర్ణ విచిత్రతా | లయతాళయుతానేక గ్రీతవాదిత్రశోభితా || 10 సభా కాంతిమతీనామ దేవానాం శర్మదాయికా | ఋషిసంఘ సమాయుక్తా ముని బృందనిషేవితా || 11 ద్విజాతి సామశ##బ్దేన నాది తానందదాయినీ | తస్యాం నివిష్టోదేవేశః సంధ్యాసక్తః పితామహః || 12 -: బ్రహ్మసభా వర్ణనము :- భీష్ముడనియె : మునీంద్రా ! వారాణసిక్షేత్రమున కంపబడి చతుర్ముఖబ్రహ్మ యేమిసేసెను? హరిహరులేమిగాంచిరి? బ్రహ్మ యజ్ఞమేక్షేత్రమందు జేసె నానతిమ్ము. అందు సదస్యులు ఋత్విజులెవరు? అర్చింపబడినదేవతలెవరు? విన ముచ్చటపడుచున్నా నానతిమ్మన పులస్త్యు డిట్లనియె: శ్రీనివాసమను పురమొకటి మేరుశిఖరమున నిర్మింపబడెను. అది వింతలకెల్ల వింతైనది. బహువృక్ష సంకులము. బంగారము మొదలగు పెక్కుగనులకు నిలయము. అచ్చమగు స్ఫటికముల గడునిర్మలము. కొండ వాగుల జలధారాశీకరముల జలవలంజిమ్మునది. పలుతీవల సొంపొలుకును. నెమళ్ళ కూతలను సంహగర్జనములను నేన్గుల ఘీంకారములను సంకులము గాలిందూగు తరువులచే తేరిన మడుగులును, కస్తూరి వాసనల జిమ్ము వనములచే పూలనెత్తావులం జిమ్ముపొదలందు రతిసలిపి విశ్రమించు తెరువరులు విద్యాధరులచే నతిసుందరము. కిన్నరుల మధురగీతముల ప్రతిధ్వనించు నా నగరమందు ''వై రాజ'' మను బ్రహ్మభవనమొకటి కలదు. అందన్ని యెడల నెన్నేని చిత్రాతిచిత్ర శిల్పవిన్యాసములు దివ్యాంగనల సంగీతములు వీణావేణుమృదంగాది బహువిధ మధురనాదములు ప్రతిధ్వనించు కాంతిమతియను దివ్యసభామందిరమందు గలదు. దేవతలకది యెంతేని హాయిగూర్చునది. రంగు రంగుల రత్నాలరాసుల కాంతుల విచిత్రితము. ఋషిసంఘములు మునిబృందములకు కొలువైనది. ద్విజుల సామగానములచే మార్మోయునది బ్రహ్మానందదాయియగు నా బ్రహ్మ సభయందు దేవేశుడు ధ్యాననిష్ఠుడై కూర్చుండెను. ధ్యాయతిస్మ పరందేవం యేనేదం నిర్మితం జగత్ | ద్యాయతో బుద్ధిరుత్పన్నా కథం యజ్ఞం కరోమ్యహమ్ || 13 కస్మిం స్థానే మయాయజ్ఞః కార్యః కుత్ర ధరాతలే | కాశీ ప్రయాగ స్తుంగాచ నైమిషం శృంఖలం తథా || కాంచీ భద్రా దేవికాచ కురుక్షేత్రం సరస్వతీ | ప్రభాసాదీని తీర్థాని పృథివ్యా మిహ మధ్యతః క్షేత్రాణి పుణ్యతీర్థాని సంతి యానీహ సర్వశః మదాదేశాచ్చ రుద్రేణ కృతా న్యన్యాని భూతలే || యథాహం సర్వదేవేషు ఆదిదేవో వ్యవస్థితః | తథా చైకం పరం తీర్థమాదిభూతం కరో మ్యహమ్ || అహం యత్ర సముత్పన్నః పద్మం త ద్విష్ణునాభిజం | పుష్కరం ప్రోచ్యతే తీర్ధం ఋషిభి ర్వేదపాఠకైః || ఏవం చింతయ తన్తన్య బ్రహ్మణస్తు ప్రజాపతేః మతిరేషా సముతృన్నా ప్రజా మ్యేవ ధరాతలే || ప్రాక్‌స్థానం స సమాసాద్య ప్రవిష్ట న్తద్వనోత్తమమ్ | నానాద్రుమలతాకీర్ణం నానాపుష్పోపశోభితం || నానాపక్షిరవాకీర్ణం నానామృగగణాకులం | ధ్రువం వష్పఫలామోదైర్వాసయ ద్య త్సురాసురాన్ || 23 జగన్నిర్మాతయగుదేవదేవుని ధ్యానించు నా బ్రహ్మదేవుని కొకచక్కనిబుద్ధి పెట్టెను. ఏను యజ్ఞము సేయవలయు సది భూతలమునం దెక్కడ? పృథివియం దిట కాశీక్షేత్రము మొదలుగా ప్రభాసమువరకు పేర్కొనబడిన తీర్థములెన్నో కలవు. నా యాజ్ఞచే రుద్రుడు నిర్మించిన వెన్నోకలవు. కాశి ప్రయాగ తుంగ నైమిశము శృంఖలము, కాంచి భద్ర దేవిక కురుక్షేత్రము సరస్వతి ప్రభాసము మొదలగు తీర్థములు. దేవాదిదేవుడ నేనైనట్లు తీర్థములకెల్ల మొదలైన యాదితీర్థమొకటి నే నిర్మించెద. విష్ణువు నాభికమలమునుండి గదా నేను పుట్టితిని. నా వలన పుట్టిన తీర్థమిదియును పుష్కరము (పద్మము) అను పేర వేదపాఠకులు పేర్కొనవలయును. ఇట్లాలోచించు నా ప్రజాపతి యీతలపుకలిగిన యాక్షణమే యాముందరిప్రదేశములకేగి అటనొక దివ్యవనముం బ్రవేశించెను. అది నానాతరులతాకీర్ణము వన్నెవన్నెల పూవుల నింపొలుకునది. పలువిధములైన పక్షుల కిలకిలారావముల సంకులము. ఎన్నో మృగములగుంపుల గూడినది. పూలంబండ్లను సువాసనల సురలనేకా దసురులనేని వాసింపజేయు నావాసమది. 23 పుష్కరవనశృంగారవర్ణనము = పరమాద్భుతము ఫలైః సువర్ణరూపాఢ్యైర్ఘ్రాణదృష్టిమనోహరైః | బుద్ధిపూర్వమివన్యసై#్తః పుషై#్ప ర్భూషితభూతలం || 24 నానాగంధరసైః పక్వాపక్వైశ్చ షడృతూత్భవైః | జీర్ణం పత్రం తృణం యత్ర శుష్కకాష్టఫలానిచ || బహిః క్షిపతి జాతాని మారుతో7 నుగ్రహా దివ | నానాపుష్పసమూహానాం గంధ మాదాయ మారుతః శీతలో వాతి ఖం భూమిం దిశో యత్రాభివాసయన్ | హరితస్నిగ్ధ నిశ్ఛిద్రై రకీటకవనోత్కటైః || వృక్షైరనేకసంజ్ఞై ర్య ద్భూషితం శిఖరాన్వితైః అరోగై ర్దర్శనీయైశ్చ సువృత్తైః కైశ్చిదుజ్వలైః || కుటుంబ మివ విప్రాణా మృత్విగ్భి ర్భాతి సర్వతః | శోభంతే ధాతు సంకాశై రంకురైః ప్రావృతా ద్రుమాః || కులీనైరివ నిశ్ఛిద్రైః స్వగుణౖః ప్రావృతా నరాః | పవనావిద్ధ శిఖరై స్పృశంతీవ పరస్పరమ్ || అజిమ్రంతీవ చాన్యోన్యం పుష్పశాఖావతంసకాః | నాగవృక్షాః క్వచిత్పుషై#్ప ర్ధ్రుమా వానీరకేసరైః || 31 సువాసనలచే బంగారు రంగుచే రూపముచే ముక్కునకు, కన్నులకు మనసున కింపుగూర్చు పూలతో నాలుకకు రుచులునించు పండ్లతో బుద్ధిపూర్వకముగా గూర్చినట్లున్న యింపుగొలుపు ప్రదేశముల నెండు గడ్డిని చెత్తను ఎండు పుల్లలను వాయుదేవుడు నింగికి నేలకు నలుదెసలకు విసరివేసి పరిశుభ్రము సేయుచుండును. పచ్చని తళుకులీనుచు పురుగుకొఱుకని చినుగని చెట్లతో రకరకాలయాకులంబూవులం దావులుపైనలముకొన, గుండ్రని బోదెల ఋత్విక్కులసందడిగొను శోత్రియకుటుంబమట్లు తీవపొదలతో సువాసనల నెంతో శోభించుచుండును. గైరికాదిధాతువు లట్లు రంగురంగులునించు చివుళ్లతో తమయుత్తమగుణసంపద నింపొదవు నుత్త మవంశసంతానము తోడి మానవు లట్లావృత్తములై, గాలికి పైదూగు పై కొమ్ములతో నొండొకటి తాకుచున్నట్లు పరస్పరము మూర్కొని ముద్దులాడుచున్న ట్లిట చెట్లుతీవ లెంతేని ముచ్చటగొల్పుచుండెను. 31 నయనై రివ శోభంతే చంచలైః కృష్ణతారకైః | పుష్పసంపన్న శిఖరాః కర్ణికారద్రుమాః క్వచిత్ || 32 యుగయుగ్మ విధౌచేహ శోభంత ఇవ దంపతీ | సుపుష్పప్రభవాటోపై స్సిందువార ద్రుపంక్తయః మూర్తిమత్య ఇవాభాంతి పూజితా వనదేవతాః | క్వచిత్క్వచి త్కుందలతాః సపుష్పాభరణోజ్వలాః దిక్షు వృక్షేషు శోభంతే బాలచంద్రా ఇవోచ్చ్రితాః | సర్జార్జునాః క్వచి ద్భాన్తి వనోద్దేశేషు పుష్పితాః ధౌతకేశేయ వాసోభిః ప్రావృతాః పురుషా ఇవ | అతిముక్తకవల్లీభిః పుష్పితాభిస్తథాద్రుమాః || ఉపగూఢావిరాజంతే స్వనారీభి రివ ప్రియాః | అపరస్పర సంసక్తైః సాలాశోకాశ్చ పల్లవైః హసై#్తర్హస్తా న్స్పృశంతీవ దంపత్య ఇవ సంగతాః | ఫలపుష్పభరానమ్రాః పనసాః సరలార్జునాః || అన్యోన్య మర్చయంతీవ పుషై#్పశ్చెవ ఫలైస్తధా | మారుతావేగసంశ్లిష్టెః పాదపాః శాలబాహుభిః || అభ్యాస మాగతం లోకం ప్రతిభావైరివోత్థితాః | పుష్పాణా మవరోధేన సుశోభార్ధం వీవేశితాః || వసంతమహ మాసాద్య పురుషా న్స్పర్ధయంతివ | పుష్పశోభాభరనతైః శిఖర్తెర్వాయుకంపితైః || నృత్యంతీవనరాఃప్రీతాః స్రగలంకృతశేఖరాః | శృంగాగ్ర పవనాక్షిప్తాః పుష్పాంజలియుతా ద్రుమాః సవల్లీకాః ప్రనృత్యంతి మానవాఇవ సప్రియాః | స్వపుష్చనతవల్లీభిః పాదపాః క్వచిదావృతాః || భాంతితారాగణౖః శ్చిత్రైః శరదీవ నభస్తలం | ద్రుమాణా మధ వాగ్రేషు పుష్పితా మాలతీలతాః || శేఖరాఇవశోభంతే రచితా బుద్ధిపూర్వకం | హరితాః కాంచనఛ్ఛాయాః ఫలితాః పుష్పితాద్రుమాః || సౌహృదం దర్శయంతీవ నరాః సాధుసమాగమే | పుష్పకింజల్కకపిలా గతాః సర్వదిశాసుచ || కదంబపుష్పస్యజయం ఘోషయంతీవ షట్పదాః | క్వచిత్పుష్పాసవక్షీబాః సంపతంతి తతస్తతః || పుంస్కోకిలగణా వృక్షగహాన్వేషివ సప్రియాః | శిరీషపుష్పసంకాశాః శుకా మిధునశః క్వచిత్ || కీర్తయంతి గిరశ్చిత్రాః పూజితా బ్రాహ్మణా యధా | సహచారిసుసంయుక్తా మయూరా శ్చిత్ర బర్హిణః || వనాంతేష్వపి నృత్యంతి శోభంత ఇవ నర్తకాః | కూజంతః పక్షిసంఘాతా నానారుత విరావిణః || కుర్వంతి రమణీయం వై రమణీయతరం వనం | నానామృగగణాకీర్ణం నిత్యం వ్రముదితాండజమ్ || తద్వనం నందనసమం మనోదృష్టివివర్దనం | పద్మయోనిస్తు భగవాన్త్సథారూపం వివేశహ || 52 అందొకట నాగవృక్షములుప్రబ్భచెట్లు పూలతో నల్లని కనుపాపలతో చంచలించు కన్నులతో నట్లు సొంపులు నించుచుండెను. నిండ నిండిన పూలతోడు చిగురు కొమ్మలం(గర్ణికారములు) రేల చెట్లు (జంటలు) దీరి దరియుచు విడువడుచు దంపతులట్ల శోభించుచుండెను. చక్కని పూలతో నూగులాటల వావిలిచెట్ల తోపులు పూజలందుకొన్న రూపుగొన్న వనదేవతలట్లు భాసించుచుండెను. ఒక్కొక్కచో మొల్లతీగలు పూలతో నగలతోవలె వెలుగులజిమ్ముచు చెట్ల నలుదెసల చిన్నిబాబిల్లివోలెనుల్లసిలుచుండెను. మద్ధిచెట్లేరుమద్దెలునిండపుష్పించి యచ్చమగు పట్టుబట్టలం గట్టుకొన్న పురుషులట్లుండెను. పూచిన తినిసెలుపూదీగలతో జుట్టుకొని తమయిల్లాండ్ర కౌగిలినున్న ప్రియులట్ల ప్రియము గొల్పుచుండెను. సాలములు, ఏపిచెట్లు, అశోకములు (హేమపుష్పములు) చిగురాకులతో పరస్పరము తాకక, చేతులం జేతులు తాకుచున్నట్టుండి చిరకాలమునకు కలిసికొన్న దంపతులట్లు సొంపు నింపుచుండెను. పండ్ల, పువ్వుల బరువున వ్రాలి పనసలు తెల్లతెగడలు పూలనుబండ్ల నొండొరులను నర్చించుకొనుచున్నట్లుండెను. గాలి వేగమునదూగుకొమ్మల విశాలబాహువులచే దగ్గరకు వచ్చిన జనమును ముచ్చటగొని(భక్తింగొని) చక్కనిపూలమాలల రహదారులనలంకరించి యెదురుసని స్వాగతమిచ్చుచున్నట్లుండెను. వసంతోత్సవమునందు ప్రజ లొండొరులు పందెములు వేసికొని యెగిరి గిలిగింత లిడినట్లు పుష్పశోభల నిండుకొని గాలులందూగు పూలకొమ్మలలో, పూలమాలల తలచుట్టుకొన్నట్లు కొండగాలితూగుచెట్ల గాలికిం తూగు తీవెలతో ప్రియురాండ్రతో దూగు మానవులట్ల నృత్యము సేయ చున్నట్లందము గొలుపుచుండెను. ఒక్కిం తమపూల వంగిన తీవలతో నావరింపబడి వృక్షముల శరత్కాలమున రంగురంగుచుక్కల నలముకొన్న యాకసమ ట్లా వనమెంతో శోభించెను. పూజినమాలతీలత పైపైని చెట్లపై బుద్ధి పూర్వకముగ నెవరో పెట్టిన కిరీటములట్లుండెను. ఆకుపచ్చనివి బంగారురంగులవి పూచిన పండిన చెట్లు సాధువులు (మహాత్ములు) వచ్చినపుడు ఆప్యాయము చూపునట్లు పూలపుప్పొడి కపిలవర్ణము (ఎఱుపు) పలుదెసల నలమి దిరిసెనలట్లుండెను. కడిమిపూవులకు జేకొట్టినట్లు తుమ్మెదలు ఝుంకారముల సేయుచుండెను. చెట్ల గుబురుల మగకోకిల లాడుకోకిలతో నెగురుచు శిరీషములున్నట్లు చిలుకలుజంటలుగా నొకచో చిత్రముగా పూజలందుకొను విప్రులట్లుముచ్చటించు చుండెను. నెమళ్లు తోటివానింగూడి రంగురంగుల పింఛములలో గూయుచు గంతులు వేయుచు పక్షు లవ్వనమును నందనవనమునట్లెంతో మనోహర మొనరించుచుండెను. 52 వృక్షదేవతానాం బ్రహ్మణా సమాగమః - సంభాషణమ్ దదర్శాదర్శవ ద్దృష్ట్యా సౌమ్యయా పావన్నివ | తా వృక్ష పంక్తయః సర్వా దృష్ట్వాదేవం తధాగతమ్ || 53 నివేద్య బ్రహ్మణ భక్త్యా ముముచుః | పుష్ప సంపదః | పుష్ప ప్రతిగ్రహం కృత్వా పాదపానాం పితామహః || వరం వృణీధ్వం భద్రం వః పాదపాత్యు వాచ సః | ఏవముక్తా భగవతా తరవో నిరవగ్రహాః || ఊచుః ప్రాంజలయః సర్వే నమస్కృత్వా విరించినం | వరం దదాసి చే ద్దేవ ప్రపన్నజనవత్సల || ఇహైవ భగవ న్నిత్యం వనే సంనిహితో భవ | ఏషనః పరమః కామః పితామహ నమో7స్తు తే || త్వంచే ద్వససి దేవేశ వనేస్మిన్విశ్వభావన | సర్వాత్మానా ప్రపన్నానాం వాంఛతా ముత్తమం వరమ్|| వరకోటిభి రన్యాభి రలం నో దీయతాం వరం | సన్నిధానేన తీర్థే7భ్య ఇదం స్స్యా త్ప్రవరం మహత్ || 59 బ్రహ్మదేవునితో వృక్షదేవతల సమాగమము - సంభాషణము బ్రహ్మ యా వృక్షదేవతా పంక్తుల నెల్ల పవిత్రముసేయుట కల్లల్లన చల్లనిచూపుల నద్దములో నట్లు జూచెను. ఆదయసేసిన బ్రహ్మదేవుని వనదేవతలెల్ల దర్శించి భక్తితో విన్నవించి పూలజల్లులను గురిపించిరి. పితామహుడాతరువుల పూజలను గైకొని వరముకోరుడు. మంగళమగుగాక ! యన వారంద రే మాత్ర మభ్యంతరము గొనక, చేతులు మొగిచి మ్రొక్కి, శరణాగత వత్సల ! భగవంతుడ ! ఎల్లపు డిచటనే వనమున మాకు దగ్గరగుము. ఇదియే మా పరమాభిలాష. నీ కిదేనమస్కారము. నిండుమనసున తీర్థముల సన్నిధి సేసిన నిదియే పరమోత్తమవరమగును. అన బ్రహ్మయిట్లనియె : 59 ఉత్తమం సర్వక్షేత్రాణాం పుణ్య మేత ద్భవిష్యతి | నిత్యం పుష్పఫలోపేతా నిత్యసు స్థిర¸°వనాః 60 కామగాః కామరూపాశ్చ కామరూపఫలప్రదాః | కామసందర్శనాః పుంసాం తపఃసిద్ధ్యుజ్వలా నృణామ్ || శ్రియా పరమయా యుక్తా మత్ప్రసాదా ద్భవిష్యథ | ఏవం స వరదోబ్రహ్మా అనుజగ్రాహ పాదపాన్ || 62 ఇది పరమపవిత్రపుణ్యక్షేత్రము గాగలదు. ఇట నీతరురాజములు పుష్పఫలసమృద్ధములై నిత్య¸°వ్వనములై కామగములై (స్వేచ్ఛాసంచారులై) కామరూపములై మానవులకు తపఃఫలసిద్ధిరూపములై వెలుగొందునవై సంపత్సమృద్ధములగుగాక. యని భక్తవరదుడు బ్రహ్మ యిటు వనదేవతల వృక్షదేవతల ననుగ్రహించెను. 62 బ్రహ్మణా పుష్కర క్షేపణమ్ స్థిత్వా వర్షసహస్రంతు పుష్కరం ప్రోక్షిపద్భువి | క్షీతి ర్నిపతితా తే నవ్యకం పత రసాతలమ్ || 63 వివశా స్తత్యజు ర్వేలాం సాగరాః క్షుభితోర్మయః శక్రాశనిహతానీవ వ్యాఘ్రవ్యాలవృకానిచ || శిఖరా7ణ్యప్యశీర్యంత పర్వతానాం సహస్రశః | దేవసిద్ధవిమానాని గంధర్వనగరాణిచ || ప్రచేలు ర్భభ్రముః పేతు ర్వివిశుశ్చ ధరాతలం | కపోతమేషూః ఖా త్పేతుః పుటసంధాత దర్శినః || జ్యోతిర్గణాం శ్ఛాదయంతో బభూవు స్తీప్ర భాస్కరాః | మహతా తస్యశ##బ్దేన మూకాంధ బధిరీటకృతమ్ || 67 -: బ్రహ్మ పుష్కరమును విసరుట :- బ్రహ్మదేవుడట వేయేండ్లుండి యాపుణ్యభూమిపై పుష్కరమును (పద్మమును) విసరెను. దాన భూమి పాతాళము కంపించెను. సాగరములు వివశములై కెరటములుబికి చెలియలికట్ట దాటినవి. పిడుగుపడి దెబ్బతిన్నట్లు పెద్దపులులుమొదలగు మృగము లడగారినవి. పర్వతశిఖరములు విరిగి పడెను. దేవసిద్ధవిమానములు గంధర్వనగరములు చెల్లచెదరై నేలగూలెను. ఆకసమునుండి కపోతమేఘములు (పావురముల రంగు గలవి) కారుమబ్బులు కుంభవృష్టిగ లాకసమునుండి సుడిదిరుగుచు నీటిధారలం గురిసినవి. నింగిగల నక్షత్రాదులవెలుగుల గ్రిందుపరచుచు తీవ్రములగు మెఱుపుల నించినవి. ఆ పెనుసవ్వడిం జగము మూగ గ్రుడ్డి చెవిటియు నయ్యెను. 67 బభూవ వ్యాకులం సర్వం త్రైలోక్యం సచరాచరం | సురాసురాణాం సర్వేషాం శరీరాణి మనాంసిచ || 68 అవసేదుశ్చ కిమితి కిమి త్యేత న్నజజ్ఞిరే | ధైర్యమాలంబ్య సర్వే7థ బ్రహ్మాణం చాప్యలోకయన్ || నచ తే త మపశ్యంత కుత్రబ్రహ్మా గతోహ్యభూత్ | కిమర్థం కంపితా భూమి ర్నిమిత్తోత్పాతదర్శనమ్ || తావ ద్విష్ణు ర్గతస్తత్ర యత్ర దేవా వ్యవస్థితాః | ప్రణిపత్య ఇదంవాక్య ముక్తవంతో దివౌకసః || కిమేత ద్భగవ న్బ్రూహి నిమిత్తోత్పాతదర్శనం | త్రైలోక్యం కంపితం యేన సంయుక్తం కాలధర్మిణా || 72 చరాచరత్రైలోక్యమెల్ల వ్యాకుల మయ్యెను. సురాసురులశరీరములు, మనస్సులు వశముదప్పి ఏమిది యీ సడియేమని బెదరి బెదరి కారణము తెలియరైరి. ఎట్లో ధైర్యముతెచ్చికొని యందరు బ్రహ్మకై వెదకులాడిరి. కాని యాయన గానరైరి. భూమి యెందులకు కంపించెను. ఇదియేదో కాబోవు నుత్పాతమును సూచించు దుర్నిమిత్తమని క్షోబించుచుండ వారిదరికి విష్ణు వేగెను. ఆయనకు వ్రాలి మ్రొక్కి దేవతలు; స్వామీ ! యీ మహోత్పాత సూచనల లక్షణమేమి సెలవిమ్మిది కల్పాంతమా? 72 జాతకల్పావసానంతు భిన్న మర్యాద సాగరం | చత్వారో దిగ్గజాః కింతు బభూవు రచలాశ్చలాః 73 సమావృతాధరా కస్మాత్సప్తసాగరవారిణా | ఉత్పత్తిర్నాస్తి శబ్దస్య భగవన్నిష్ప్ర యోజనా || ఈదృశోవాశ్రుతః శబ్దోనభూతోన భవిష్యతి | త్రైలోక్యమాకులం యేన చక్రౌరౌద్రౌచోద్యతా || శుభో7శుభోవా శబ్దో7యం త్రైలోక్యస్యదివౌకసాం | భగవన్ యది జానాసి కిమే తత్కథయస్వ నః 76 సముద్రములు హద్దు మీరినవి. దిగ్గజములు నాల్గు నూగులాడినవి. అచలములు (పర్వతములు) చలించినవి. సముద్రజలముచే భూమండలమెల్ల గ్రమ్ముకొన్నది. పనిలేకుండ నింత సడి యూరక కలుగదు. ఈవిన్న చప్పుడింతమున్నెన్నడు కాలేదు. కాబోదు. రుద్రు డుద్యమించి ముల్లోకమాకుల మొనరించెను. ఇది లోకములకు దేవతలకు శుభమా ? అశుభమా ? స్వామీ ! ఎఱుగుదువేని మా కెఱిగింపుమన విష్ణువెంతో అనుభావింపబడి యిట్లనియె. 76 ఏవముక్తో7బ్రవీద్విష్ణుః పరమేశాను భావితః | మాభైష్టమరుతః సర్వే శృణుధ్వంచాత్ర కారణమ్ || 77 నిశ్చయే నానువిజ్ఞాయవక్ష్యామ్యేషయధావిధం ! పద్మహస్తోహి భగవాన్ బ్రహ్మాలోకపితామహః భూప్రదేశే పుణ్యరాశౌ యజ్ఞం కర్తుం వ్యవస్థితః | అవరోహే పర్వతానాం వనేచాతీవ శోభ##నే|| కమలం తన్య హస్తాత్తు పతితం ధరణీతలే | తస్య శబ్దో మహానేష యేన యూయం ప్రకంపితాః || తత్రా సౌ తరు బృందేన పుష్పామోదాభి నందితః ! అనుగ్రుహ్యాధ భగవాన్వనం తత్స మృగాండజమ్ || జగతో7నుగ్రహార్దాయ వాసం తత్రాన్వరోచయత్ | పుష్కరం నామ తత్తీర్ధం క్షేత్రం వృషభ##మేవచ || జనితం తద్భగవతాలోకానాం హితకారిణా | బ్రహ్మాణం తత్రవైగత్వా తోషయధ్వం మయాసహ || ఆరాధ్యమానో భగవాన్ప్రదాస్యతి 7రాస్వరాన్ | ఇత్యుక్త్వా భగవాన్విష్ణుః సహతైర్దేవదానవైః || జగామ తద్వనోద్దేశం యత్రాస్తేసతు కంజజః | ప్రహృష్టాస్తుష్టమనసః కోకిలాలాపలాపితాః || 85 పుష్పోచ్చయోజ్వలం శస్తం వివిశు ర్బ్రహ్మణోవనం| భయపడకుడు. అందఱు వినుడు . నిశ్చయముగ నిట కారణమెఱిగి జరిగినది చెప్పుచున్నాను. బ్రహ్మపద్మమును జేకొని యీ భూమియందు పుణ్యస్థానమున యజ్ఞము సేయ నిలిచెను. పర్వతముపై నెక్కుచుండ పరమశోభనమైన యీవనమందు కమల మాయనచేయిజారి ధరణింబడియెను. దాని దీ మహాధ్వని. మీరందరదరి పోయినారు. అక్కడ తరుబృందముచే పూలపరిమళముచే నభినందింపబడి మృగములు, పక్షులతో నెల్ల జీవుల ననుగ్రహించుట కట నివాసము కోరెను. అది పుష్కరమనుపేర బ్రహ్మక్షేత్రము విష్ణుక్షేత్రముగ నుండెను. నాతోగూడ తామటకేగి బ్రహ్మను సంతోషింపజేయనగును. అట మీచే బ్రహ్మ యారాధింపబడి భగవంతుడు మహావరముల నీయగలడు. అని పలికి విష్ణువు దేవతలతో దానవులతో బ్రహ్మయున్న యావనము చాయకు జనెను. సంప్రా ప్తం సర్వదేవైస్తువనం నందన సంమితమ్ | పద్మినీ మృగ పుష్పాఢ్యం సుదృఢం శుశుభేతదా || ప్రవిశ్యాధవనం దేవాః సర్వపుష్పోపశోభితమ్ ! ఇహదేవో7 స్తీతి దేవా బభ్రముశ్చదిదృక్షవః || మృగయంత స్తతస్తేతు సర్వేదేవాః సవాసవాః | అద్భతస్యవనస్యాంతం నతే ధదృశు రాశుగాః వాయుదేవేనదేవానాం బ్రహ్మదర్శనవిధానవర్ణనమ్ విచిన్వద్భి స్తదాదేవం దైవైర్వాయుర్విలోకితః | స తానువాచ బ్రహ్మణం నద్రక్ష్యధ తపోవినా || తదాఖిన్నావిచిన్వంత స్తస్మిన్పర్వతరోధసి | దక్షిణచో త్తరే చైవ అంతరాలే పునః పునః || వాయూక్తం హృదయేకృత్వా వాయుస్తానబ్రవీత్పునః | త్రివిధోదర్శనో పాయో విరించేరస్య సర్వదా || శ్రద్ధా జ్ఞానేన తపసా యోగేనచ నిగద్యతే | సకలం నిష్కలంచైవ దేవం పశ్యంతి యోగినః || తపస్వినస్తు సకలం జ్ఞానినో నిష్కలం పరమ్ | సముత్పన్నేతు విజ్ఞానే మంద శ్రద్ధేన పశ్యతి || భక్త్వా పరమయాక్షిప్రం బ్రహ్మ పశ్యంతి యోగినః | ద్రష్టవ్యో నిర్వికారో7 సౌప్రధాన పురుషేశ్వరః కర్మణామనసా వాచానిత్యయుక్తాః పితామహమ్ | తపశ్చరత భద్రంవో బ్రహ్మారాధన తత్పరాః || బ్రాహ్మీం దీక్షాం ప్రపన్నానాం భక్తానాం చ ద్విజన్మనామ్ | సర్వకాలం సజానాతి దాతవ్యం దర్శనంమయా || వాయోస్తు వచనం శ్రుత్వాహితమేతదవేత్యచ | బ్రహ్మేచ్ఛావిష్టమతయోవాక్పతించ తతో7బ్రువన్ ప్రజ్ఞాన విబుధాస్మాకం బ్రాహ్మీందీక్షాం నిధత్స్వనః | సదిదీక్షయిషుఃక్షిఫ్ర మమరాన్బ్రహ్మ దీక్షయా || వేదోక్తేన విధానేన దీక్షయామాసతాన్ గురుః || 99 విష్ణువు దేవదానవులతో బ్రహ్మయున్న యవ్వనముపైప్రదేశమునకు వచ్చెను. అందరును మిగుల హర్షించుచు, నట కోకిలల పలుకులం బలుకరింపబడి పూలరాసులనెంతేని చెలువొందు నాబ్రహ్మ వనముం బ్రవేశించిరి. -: బ్రహ్మవనసౌందర్యము :- నందనవన మట్లు దేవతలావనమందడుగిడగానే పద్మినీమనోహరము సర్వపుష్పోవశోభితమునై యలరెను. బ్రహ్మదేవు డిటనున్నాడని దేవత లింద్రునితో గూడ నలుదెసల వెదకులాడిరి కాని యద్భుతమా వనము తుదిగానరైరి. వారికట వాయుభగవానుడెదురుపడెను. అతడు వారింగని, బ్రహ్మను మీరు తపస్సులేకుండ గానలేరనియె. దానికి వేల్పులు ఖిన్నులై మఱిమఱి యట కొండచరియల నలుదెసల లోయల వెదకి వెదకి వాయువన్నమాట నెదనిల్పి యెంతో శ్రమించిరి. మరల వాయువు వారింగని; దర్శనోపాయములు మూడురకములు శ్రద్ధతోడి జ్ఞానము, తపస్సు, యోగము అని చెప్పబడినవి. దేవుడు సకలుడు నిష్కలుడును. అనగా రూపము గలవాడు. రూపములేనివాడు యోగులా రెండు విధముల భగవంతుని దర్శింతురు. తపశ్శాలురు సకలుని (సరూపుని) జ్ఞానులు పరమ పురుషు నిష్కలుని (నీరూపుని) గాంతురు. విజ్ఞాన ముదయించినను శ్రద్ధ కొఱవడినచో గానలేరు. పరమ భక్తితో మట్టుకు యోగులు వేగముగ బ్రహ్మను దర్శింతురు. ప్రధానపురుషుడీశ్వరుడీయన నిర్వికారుడు ఈశ్వరుడు కర్మముచే మనసుచే మాటచే శుద్ధులైన వారికి దర్శనీయుడగును. పితామహుడు బహ్మారాధన తత్పరులు మీరు. మంగళమగుగావుత మీకు ! '' బ్రాహ్మీదీక్షనందిన భక్తులకు ద్విజులకు నెల్లవేళల నేను గనిపించి తీరవలెనని యాయనే యనుకొనుచుండును. అని వాయువన్న పలుకు విని, ఇది హితమైనదని గమనించి, బ్రహ్మపై మనసుపడి, యాపై బృహస్పతిని గని యిట్లనిరి : ప్రజ్ఞాన విబుధుడవు జ్ఞాన విజ్ఞానములు రెండిటం బండితుడవు. మాకు బ్రాహ్మీదీక్ష నొనరింపుమనిరి. వెంటనే కోరి వేదోక్త విధానమున గురువు వారిని దీక్షింపజేసెను. వినీతవేషాః ప్రణతా అంతేవాసిత్వ మాయయుః | బ్రహ్మప్రసాదం సంప్రాప్తాః పౌష్కరం జ్ఞానమీరితమ్ || యజ్ఞంచకార విధినా ధిషణో7ధ్వర్యు సత్తమః | పద్మంకృత్వా మృణాలాఢ్యం పద్మదీక్షాప్రయోగతః || 100 యజ్ఞప్రయోగవర్ణనమ్ అనుజగ్రాహాదేవాం స్తాన్సురేచ్చా ప్రేరితో మునిః | తేభ్యోదదౌ వివేకిభ్యః స వేదోక్త విధానవిత్ || దీక్షాంవైవిస్మ యంత్యక్త్వా బృహస్పతి రుదారధీః | ఏకమగ్నించ సంస్కృత్య మహాత్మా త్రిదివౌకసామ్ || ప్రాదాదాంగిరసస్తుష్టోజప్యం వేదోదితంతుయత్ | త్రిసుపర్ణం త్రిమధుచపావమానీంచ పావనమ్ || సహిజాప్యాదికం సర్వమశిక్షయ దుదారధీః | ఆపోహిష్ఠేతి యత్ స్నానంబ్రాహ్మం తత్పరిపఠ్యతే || పాపఘ్నం దుష్టశమనం పుష్టిశ్రీ బలవర్ధనం | సిద్ధిదం కీర్తిదం చైవ కలికల్మష నాశనమ్ || తస్మాత్సర్వప్రయత్నేన బ్రాహ్మంస్నానం సమాచరేత్ | కుర్వంతోమౌనినోదాంతా దీక్షితాః క్షపితేంద్రియాః || సధ్వేకమండలుయుతా ముక్తకక్షాక్షమాలినః | దండిన శ్చీరవస్త్రాశ్చ జటాభిరతిశోభితాః || స్నానాచారాసన రతాః ప్రయత్న ధ్యానధారిణః | మనోబ్రహ్మణి సంయోజ్య నియతాహారకాంక్షిణః || అతిష్ఠన్ దర్శనాలాపది సంశధ్యా వివర్జితాః | ఏవం వ్రతధరాః సర్వేత్రికాలం స్నానకారిణః || భక్త్వా పరమయా యుక్తావిధినా పరమేణచ | కాలేన మహతాధ్యానా ద్దేవజ్ఞాన మనోగతాః || బ్రహ్మద్యానాగ్నినిర్ధగ్ధా యథాశుద్ధైక మానసాః | అవిర్భభూవ భగవాన్సర్వేషాం దృష్టిగోచరః తేజసాప్యాయితా స్తస్యబభూవుర్భ్రాంతచేతసః | తతో7వ లంబ్య తే ధైర్య మిష్టం దేవం యథావిధి || షడంగవేదయోగేన హృష్టచిత్తాస్తు తత్పరాః | శిరోగతైరంజలిభిః శిరోభిశ్చ మహీంగతాః || తుష్టువుః సృష్టికర్తారం స్థితికర్తార మీశ్వరం | దేవా ఊచుః : బ్రహ్మణ బ్రహ్మదేహాయ బ్రహ్మణ్యా యాజితాయచ || -: బృహస్పతి దేవతలకు బ్రహ్మదీక్షనిచ్చుట :- వినీతవేషులై (ఆడంబరములు తగ్గించుకొని) సురలు గురువునకు వ్రాలిమ్రొక్కి అంతేవాసులైరి. శిష్యులైరి, బ్రహ్మబ్రసాద మందిరి. పౌష్కరము (పద్మసంబంధమైన) జ్ఞానము వారికుపదేశింప బడెను. 100 ఆపైని బృహస్పతి (ప్రతిభావంతుడు) ఆధ్వర్యుశ్రేష్ఠుడు యజ్ఞమొనరించెను. తూడుతోగూడ పద్మమును పద్మదీక్షా ప్రయోగానుసారము ప్రతిష్ఠించి వారియిచ్ఛచే బ్రేరితుడై వివేకులగువారికి వేదోక్తవిధానమును దెలిసిన వాడుగావున వింతగొనక త్యాగబుద్ధితో ననుగ్రహించి యమరులకు దీక్షనిచ్చెను. అందఱకు నొకే యగ్నిని సంస్కరించి వేదముసెప్పిన ఆంగిరసము (బృహస్పతి దేవతగాగలది) మంత్రము నుపదేశించెను. త్రిసుపర్ణము త్రిమధువు పవిత్రముసేయు పావమాని యను మంత్రముల జపవిధినెల్ల నుదారబుద్ధితో శిక్షణ యిచ్చెను. ఆపోహిష్ఠామయోభువః అను మంత్రముతో బాహ్యస్నాన మది పాపహరము దుష్టశమనము పుష్టిని సంపదను బెంపొందించును, సర్వసిద్ధినిచ్చునది కీర్తినిచ్చునది కలిపాపముల హరించునది. సర్వ విధముల దానితో బాహ్యస్నానము సేయవలయును. దేవతులట్లు దీక్షితులై మౌనవ్రతమూని ఇంద్రియములనదుపునం బెట్టుకొని నిగ్రహముకొని యందఱు కమండలువులసేకొని కచ్చలదాక రుద్రాక్షమాలలు వ్రేలాడ దండములుసేకొని నారచీరలం గట్టుకొని జడలచేశోభిలుచు స్నానము ఆచారము ఆసనమునందు ముచ్చటగొని ప్రయత్నపూర్వకముగ ధ్యానము ధారణము మొదలైన అష్టాంగయోగములగొని బ్రహ్మయందు మనస్సులంగించి, యాహారనియమమూని చూచుట మాటాడుట కలియుట తలచుట మొదలయి పనులెల్లమాని నిలిచిరి. ఇట్లందరు వ్రతమూని త్రికాలముస్నానము సేయుచు పరమభక్తితో పరమనిష్ఠతో జాలకాలము సేసిన ధ్యానముచేతనే జ్ఞానముదయించిన మనస్సులుగలవారైరి. అట్టి బ్రహ్మజ్ఞానమనునగ్ని చేదగ్ధమై స్థూలశరీరమెడలి సూక్ష్మశరీరము మనస్సెప్పుడు శుద్ధమైనదో ఆవెంటనేభగవంతుడందఱ కెట్టయెదుట సాక్షాత్కరించెను. ఆయన తేజస్సుచే ఆప్యాయితులై భ్రాంతచేతస్కులైరి. (కంగారు పడిరి.) అపైనిధైర్యము తెచ్చికొని యానందభరితులై యిష్టదేవుని యధావిధి షడంగవేదయోగమున దదేక మనస్కులై శిరములందోసిలొగ్గి ధరణికిందలలువాంచి యాసృష్టికర్తను స్థితికర్తను ఈశ్వరునిటు స్తుతించిరి. 114 దేవానాంబ్రహ్మస్తుతిః నమస్కుర్మః సునియతాః క్రతువేదప్రదాయినే | లోకానుకంపినే దేవసృష్టి రూపాయతేనమః || భక్తానుకంపినే7త్యర్థం వేదజాప్యస్తుతాయచ ! బహురూప స్వరూపాయ రూపాణాం శతథారిణ || సావిత్రీపతయే దేపగాయత్రీపతయేనమః | పద్మాసనాయ పద్మాయ పద్మవక్త్రాయతేనమః || వరదాయవరార్హాయ కూర్మాయచమృగాయచ | జటామకుట యుక్తాయస్రువస్రుచనిథారిణ || మృగాంక మృగధర్మాయ ధర్మనేత్రాయతే నమః | విశ్వనామ్నే7థ విశ్వాయ విశ్వేశాయనమోనమః || ధర్మనేత్రత్రాణ మస్మాదధికం కర్తుమర్హసి | వాఙ్మనః కాయభావైస్త్వాం ప్రపన్నాస్స్మః పితామహ || ఏవంస్తుత స్తదాదేవైర్‌బ్రహ్మా బ్రహ్మ విదాం వరః | ప్రదాస్యామిస్మృతోబాఢమమోఘం దర్శనం హివః || బ్రువంతు వాంఛితం పుత్రాః ప్రదాస్యామి వరాన్వరాన్ | ఏవముక్తా భగవతా దేవా వచన మబ్రువన్ | ఏషఏవాద్య భగవన్ సుపర్యాప్తోమహాన్వరః | జనితోనః సుశబ్దో కమలం క్షిపతా త్వయా || కిమర్థం కంపితాభూమిర్లోకాశ్చాకులితాః కుతః | నైతన్నిరర్థకం దేవ ఉచ్యతామత్ర కారణమ్ || 125 -: దేవతలు సేసిన బ్రహ్మస్తుతి :- మ్రొక్కెదము బ్రహ్మదేవుని బ్రహ్మమూర్తి నజితునిన్ బ్రహ్మనిష్ఠునత్యంత నిష్ఠ క్రతువులన్ వేదముల ననుగ్రహముగోరి దయను దయసేయు సృష్టికర్తకు నమస్సు వేదమంత్రైక సంస్తుతున్ బెక్కురూపు లూని తాఁబెక్కురూపులం బూనఁజేయు స్వామి, సావిత్రి గాయత్రి పతికిమ్రొక్కు వందనము పద్మవసతికిన్ బద్మమునకుఁ బద్మముఖునకు వరదుడౌ బరముపూజ్యు నకును; కూర్మమ్ము మృగమున్ యజ్ఞపురుష మూర్తియై స్రుక్ స్రువమ్ములన్ బూనుమునికి నిది మృగాంకమ్ము మృగధర్మ మెనయుధర్మ నయనునకు విశ్వునకు విశ్వనయనునకును వినతి విశ్వేశునకును వేవేల నతులు మనసు మాట శరీరమ్ము పనులనిన్ బి తామహున్ శరణమందుచున్నాము స్వామి! అని యిట్లు దేవతలు స్తుతింప బ్రహ్మవిద్వరిష్ఠుడు బ్రహ్మ నన్ను దలచుకొనిరి మీకు నాదర్శనమమోఘము బిడ్డలారా ! మీ కోరికల దెలుపుడు. వరములయిన (శ్రేష్ఠములయిన) వరములిత్తును. అని భగవంతుడు ముచ్చటింప వేల్పులు ముచ్చటగొని యిట్లనిరి. తండ్రీ ! ఇది యొక్కటియ వరము మహావరము చాలును. నీవు కమలము నట్టె విసరినంతఁ బెద్దసడియయ్యెను. ఆ చప్పుడునకు పుడమి కంపించినది. లోకములాకులములైనవి. ఇది యూరక జరిగినది కాదెందుల కీ మాత్రమున నింత జరిగినది కారణ మానతిమ్ము అనిరి. 125 -:పుష్కరతీర్థసంభవః:- బ్రహ్మోవాచ; యుష్మద్ధితార్థమేతద్వైపద్మం వినిహితంమయా | దేవతానాంచ రక్షార్ధం శ్రూయతా మత్రకారణమ్ || 126 అసురో వజ్ర నాభో7యం బాలజీవాపహారకః | ఉపస్థిత స్త్వవష్టభ్య రసాతల తలాశ్రయమ్ || యుష్మదాగమనం జ్ఞాత్వా తపస్థాన్ని హితాయుధాన్ | హంతుకామోదురాచారః సేంద్రానపి దివౌకసః || పాతః కమలపాతేన మయా తస్య వినిర్మితః | సరాజ్యైశ్వర్యదర్పిష్ఠ స్తేనాసౌ నిహతోమయా || 129 భూమి యెందులకు కంపించినది. లోకము లెందులకు వ్యాకులమందింపబడినవి ? ఊరక యిటు జరిగెనను కొనను. ఇచట కారణము సెలవిండన బ్రహ్మయనియె. మీ మేలుకొఱకీ దేవతల రక్షించుటకు నే నీ పద్మమిటనుంచితిని. ఇట కారణమాలింపుము. వజ్రనాభుడను నసురుడు పిల్లల ప్రాణములుతీయువాడు. ఆయుధములను విడిచి తపోనిష్ఠులైయున్న మీరాక నెఱిగి సన్నద్ధుడై యింద్రుడు మొదలుగ నెల్లదేవతలను మిమ్ము జంపగోరి వచ్చెను. కమలమును విసరి వానిం జంపవలెనని నిర్ణయించితిని. రాజ్యసంపదచే మదమెక్కిన వాని నేనటీ తామరపూవు పైవైచి వానిం గూల్చితిని. 129 లోకే7స్మి న్మమ యేభక్తా బ్రాహ్మణావేదపారగాః మైవతే దుర్గతిం యాంతు లభతాంసుగతింపునః | 130 దేవానాం దానవానాంచ మనుష్యోరగరక్షసాం | భూకగ్రామస్యసర్వస్య సమో7స్మిత్రిది వౌకసః || యుష్మద్ధితార్ధం పాపో7సౌ మయామంత్రేణషూతితః | ప్రాప్తః పుణ్యకృతాంలోకాన్‌కమలస్యాస్య దర్శనాత్ || యన్మయాపద్మ ముక్తంతు తేనేదం ప్రష్కరంభువి | ఖ్యాతంభవిష్యతే తీర్థం పావనం ప్రణ్యదం మహత్ || పృధివ్యాం సర్వజంతూనాం పుణ్యదం పరివథ్యతే | కృతో హ్వనుగ్రహోదేవాః భక్తానాం భక్తి మిచ్ఛతామ్ || 135 :- బ్రహ్మకృతపుష్కరక్షేత్రప్రశంస :- ఈలోకమందున్న నాభక్తులు వేదపండితులు బ్రాహ్మణులు దుర్గతిపాలుగారాదు. తిరిగి వారు సద్గతినందుదురు. నేను సురాసుర నరనాగుల కెల్ల భూతముల కెల్లరకు సముడను. మీక్షేమముకొఱ కీ పాపాత్ముని గూల్చితిని. ఈ పద్మమును దర్శనము సేయుటవలన నీ పాపాత్ముడును పుణ్యాత్ములలోక మందెను. ఇచ్చట నేను పద్మమును విసరిన కతన నిది భూమియం దీ తీర్థము పుష్కరము (పద్మము) అనుప్రసిద్ధినందును. ఇది పావనము (పవిత్రము) యెల్ల జంతువులకు పుణ్యప్రదమని వర్ణింపబడును. భక్తినిగోరు భక్తులయెడ ననుగ్రహముచే నిది నిర్మింప బడినది. ఈవనమందు వృక్షములు ప్రార్ధింప నిట వచ్చిన నాతోగూడ తపస్వులగు తమ కపూర్వజ్ఞానము ననుగ్రహింప మహాకాలుఁడు (శంకరు) డిటకు వచ్చియున్నాడు. 135 మహాకాలో వనే7త్రాగాదాగతస్యమమానషూః | తపస్యతాంచ భవతాం మహత్‌జ్ఞానం ప్రదర్శితం || 136 కురుధ్వం హృదయే దేవాః స్వార్థంచైవ పరార్ధకమ్ | భవద్భి ర్దర్శనీయంతు నానారూపధరై ర్భువి || ద్విషన్వై జ్ఞానినం విప్రం పాపేనైవార్దితోనరః | నవిముచ్యేత పాపేన జన్మకోటిశ##తైరపి || వేదాంగపారగం విప్రం నహన్యా న్న చ దూషయేత్ | ఏకస్మిన్ని హతేయ స్మాత్కోటిర్భవతిపాతితా || ఏకం వేదాంతగం విప్రంభోజయేచ్ఛద్దయాన్వితః | తస్యభుక్తౌ భ వే త్కోటి ర్విప్రాణాం నాత్రసంశయః || యఃపాత్రపూరణీం బిక్షాం యతీనాంతు ప్రయచ్ఛతి ! విముక్తః సర్వపాపేభ్యో నాసౌ దుర్గతి మాప్నుయాత్ || యథాహం సర్వదేవానాం జ్యేష్ఠః ప్రేష్ఠః పితామహః | తథాజానీ సదాపూజ్యో నిర్మమోనిః పరిగ్రణం || సంసారబంధమోక్షార్థం బ్రహ్మగుప్త మిదంతిహ | మయాప్రణీతం విప్రాణా మపునర్భవకారణం || 142 బ్రహ్మ గుప్తవ్రతప్రశంస దేవతలు మీరు స్వార్ధము పరార్ధము గూడ హృదయమందుంచికొనుడు. నానారూపములు ధరించి యిట మీరు దర్శనము నిండు. జ్ఞానిని విప్రుని ద్వేషించి నరుడు పాపమున బాధనొందును. కోటిజన్మలకైన యా పాపమునుండి ముక్తిపొందడు. వేదవేదాంగ పారగుని విప్రుని జంపరాదు నిందింపరాదు. అట్టివాని నొక్కని జంపిన కోటిమందిని జంపినట్లగును. వేదాంత పండితుని కొక్కనికి శ్రద్ధతో విందుసేసిన కోటిమంది విప్రులకు భోజనము పెట్టినట్లగును. ఇందు సందియములేదు. యతులకు పాత్రనిండ బిక్ష వెట్టినతడు సర్వపాపముక్తుడగును. అతడు దుర్గతిపాలుగాడు. పితామహుడను దేవతల కేను బెద్దను ప్రియుడనైనట్లు జ్ఞాని నిర్మముడు (నాదియని లేనివాడు) చేయిసాచని యతడు నిత్యపూజ్యుడు. సంసారబంధము విడివడుటకు ''బ్రహ్మగుప్తము'' అను వ్రతమిది. నేను విప్రులకు పునర్జన్మరాకుండుటకు రచించితిని. 142 అగ్నిహోత్ర ముపాదాయ యస్త్యజే దజితేంద్రియః | రౌరవం సప్రయాత్యాశు ప్రణీతో యమకింకరైః || 143 లోకయాత్రా వితందశ్చ క్షుద్రం కర్మకరోతియః | సరాగచిత్తః శృంగారీ నారీజన ధనప్రియః || ఏకభోజీ సుమిష్టాశీ కృషివాణిజ్య సేవకః | అవేదో వేదనిందీచ పరభార్యాం చ సేవతే || ఇత్యాదిదోష దుష్టోయ స్తస్య సంభాషణాదపి | నరో నరక గామీస్యా ద్యశ్చ సద్ర్వత దూషకః || అసంతుష్టం భిన్నచిత్తం దుర్మతిం పాపకారిణమ్ | నస్పృశేదంగసంగేన స్పృష్ట్వాస్నానేన శుద్ధ్యతి || ఏవముక్త్వాసభగవాన్ బ్రహ్మాతైరమరైస్సహ | క్షేత్రం నివేశయామాస యథావత్కధయామి తే || 148 బహుపాపములు-తత్ఫలితములు అగ్నిహోత్ర మారంభించి యింద్రియనిగ్రహములేక విడిచినవాడు యమకింకరులుగొనిపోవ రౌరవనరకమున కేగును. లోకయాత్రయే ముఖ్యముగా నీచమైన పనిసేసినవాడు సరాగి శృంగారి స్త్రీధనప్రియుడు ఏకభోజి (ఎవరికింబెట్టక తానె పిండివంటల మెక్కువాడు) వ్యవసాయము వర్తకము సేయువాడు వేదముచదువనివాడు వేదము నిందించువాడు పరభార్యను బొందువాడు ఇంకనెన్నో పాడుపనుల బాడువడినవాడు=వానితో మాటలాడినవాడును ఉత్తమవ్రతదూషకుడు నరకమునకేగును. అసంతుష్టుని (సంతోషింపనివానిని) ఖేదబుద్ధిని దుర్భుద్ధిని పాపిని దాకగూడదు. తాకెనా స్నానముసేసి శుద్ధుడగును. అని పలికి బ్రహ్మ దేవతలతోగూడ నట క్షేత్ర మేర్పఱచెను. అదియెల్ల నీకు జెప్పెదను. ఉత్తరే చంద్రనద్యాస్తు ప్రాచీయావత్సర స్వతీ| పూర్వంతు నందనా త్కృత్స్నం యావత్కల్పంతు పుష్కరం || 149 వేదహ్యేషాకృతాయజ్ఞే బ్రహ్మణా లోకకారిణా | జేష్ఠంతుప్రథమంజ్ఞేయం తీర్థం త్రైలోక్య పావనం || ఖ్యాతం తద్బ్రహ్మదైవత్వం మధ్యమం వైష్ణవం తథా | కనిష్ఠం రుద్రదైవత్వం బ్రహ్మా పూర్వ మకారయత్ || ఆద్యమేతత్పరంక్షేత్రం గుహ్యం వేదేషుపఠ్యతే | అరణ్యం పుష్కరాఖ్యంతు బ్రహ్మా సన్ని హితః ప్రభుః || ఆనుగ్రహో భూమిభాగే కృతవై బ్రహ్మణా స్వయః | అనుగ్రహార్థం విప్రాణాం సర్వేషాం భూమిచారిణాం || సువర్ణవజ్రపర్యంతా వేదికాంకా మహీకృతా | విచిత్రకుట్టిమారత్నైః కారితా సర్వశోభనా || రమతే తత్రభగవాన్ బ్రహ్మాలోకపితామహః | విష్ణూ రుద్రోతదాదేవో వసవో7ప్యశ్వినావపి || మరుతశ్చ మహేంద్రేణ రమంతేచ దివౌకసః | ఏతత్తే తధ్యమాఖ్యాతం లోకానుగ్రహకారణమ్ || సంహితానుక్రమేణాత్ర మంత్రైశ్చ విధిపూర్వకయ | వేదాన్పఠంతి యే విప్రా గురుశుశ్రూణర తాః వసంతి బ్రహ్మసామీప్యే సర్వే తేనానుభావితాః 158 -: పుష్కరక్షేత్రనిర్మాణము :- చంద్రనది కుత్తరము సరస్వతి తూర్పు నందనవనము ముందు ప్రదేశమంతయు పుష్కరక్షేత్రమది యావత్కల్పముండునది. సృష్టికర్త బ్రహ్మయిది యజ్ఞవేదికం గావించెను. ఇది త్రైలోక్యపావనము జేష్ఠము ప్రథమ మిదియని తెలియనగును. బ్రహ్మదేవతాకమని ప్రఖ్యాతిగన్నది. ఇటమధ్యమతీర్థము వైష్ణవము. విష్ణుదేవతాకము. కనిష్ఠము రుద్రదైవత్వమునుగా బ్రహ్మయేర్పఱచెను. మొదటి దీ పుష్కరక్షేత్రము వేదములందు గుహ్యముగ (రహస్యముగ) పేర్కొనబడినది. ఇటనరణ్యముగూడ పుష్కరము. ఇట ప్రభువు తానుగా బ్రహ్మ బ్రాహ్మణుల భూమింజరించు నెల్లర ననుగ్రహింప సన్నిహితుడై యుండును. బంగారువజ్రముదాకగలభూమి యజ్ఞవేదిక కంకితమైనది. రత్నములచే రంగురంగుల విచిత్రము మెట్టిమము సర్వశోభనమట నిర్మింపబడినది. లోకములతాత భగవంతుడువిధాతయట క్రీడించును. విష్ణువు రుద్రుడు వసువు లశ్వినీదేవతలు సప్తమరుత్తులు మహేంద్రునితో దేవతలు నట రమింతురు. ఇది నిజము లోకానుగ్రహకారణము నీకు దెల్పితిని. సంహితాను క్రమముగా (సంహిత పదము క్రమమువరుసలో) యథావిధి మంత్రములతో నిట వేదపఠనము గురుశుశ్రూషా సక్తులై యిట వేదముల పఠించు విప్రులందరు బ్రహ్మసామీప్యమందాయనచేదలపబడి యిట నుందురు. 158 భీష్మఉవాచః భగవన్ కేనవిధినా అరణ్య పుష్కరే నరైః | బ్రహ్మలోక మభీప్సద్భి ర్వన్తన్యం క్షేత్రవాసిభిః || 159 కిం మనుషై#్య రుతస్త్రీభి రుత వర్ణాశ్రమాన్వితైః వసద్భిః కిమనుష్ఠేయ మేతత్సర్వం బ్రవీహి మే || 160 భీష్ముడనియె. భగవంతుడా ! బ్రహ్మలోకముగోరి యీ పుష్కరారణ్యమందు క్షేత్రమందు వసించు నరులు స్త్రీలు. నాలుగువర్ణములాశ్రమముల వారెట్లు వసింపవలెనేమి సేయవలె నదియెల్ల నానతిమ్మన పులస్త్యుం డిట్లనియె. పులస్త్య ఉవాచ : నరైః స్త్రీభిశ్చవస్తవ్యం వర్ణాశ్రమ నివాసిభిః | స్వధర్మాచారనిరతై ర్దంభ మోహవర్జితైః || కర్మణా మనసావాచా బ్రహ్మభ##క్తై ర్జితేంద్రియైః | అనసూయుభి రక్షుద్రైః సర్వభూత హితేరతైః 162 భీష్మఉవాచ : కింకుర్వాణోనరః కర్మ బ్రహ్మభక్త స్త్విహోచ్యతే | కీదృశాః బ్రహ్మభక్తా శ్చ స్మృతా నౄణాంవదస్వమే || 163 నేసెప్పిన యందరు స్వధర్మమాచారముందప్పక డంబము మోహము విడిచి త్రికరణశుద్ధిగ బ్రహ్మయెడ భక్తులై యింద్రియ నిగ్రహముగొని అసూయలేక నీచులు గాక సర్వభూత హితముగోరి యీ క్షేత్రసేవసేయవలెను. అనవిని భీష్ముండు ఏకర్మమొనరించి యిట బ్రహ్మభక్తు డనిపించుకొనును ? బ్రహ్మభక్తు లేలాటివారిని స్మృతులు పేర్కొన్నవానతిమ్మన పులస్త్యుడనియె. 163 త్రివిధభక్తిస్వరూపవర్ణనమ్ పులస్త్య ఉవాఛ : త్రివిధా భక్తిరుద్దిష్టా మనోవాక్కాయ సంభవా | లౌకికీ వైదికీ బాపి భ##వేదాధ్యాత్మికీ తథా || 164 ధ్యానధారణ మాబుద్ధ్వావేదార్ద స్మరణహియత్ | బ్రహ్మప్రీతి కరీబైషా మానసీ భక్తిరుచ్యతే || మంత్రవేద నమస్కారై రగ్నిశ్రాద్ధాది చింతనైః | జాపై#్యశ్చావశ్యకైశ్చైవ వాచికీ భక్తి రిష్యతే || వ్రతోపవాస నియతైశ్చిత్తేంద్రియ నిరోధిభిః కృచ్ఛ్రైస్సాంతపనై శ్చాన్యైస్తథాచాంద్రాయణాధిభిః బ్రహ్మకృచ్ఛ్రోపవాసైశ్చ స్తథాచాన్యైశ్శుభైర్వ్రతైః | కాయికీభక్తి రాఖ్యాతా త్రివిధాతు ద్విజన్మనామ్ || గోఘృతక్షీర దధిభిః రత్నదీప కుశోదకైః | గంధై ర్మాల్యైశ్చ వివిధై ర్ధాతుభిశ్చోపపాదితైః || ఘృతగుగ్గులు ధూపైశ్చ కృష్ణాగరు సుగంధిభిః | భూషణౖ ర్హేమరత్నాఢ్యై శ్చిత్రాభిః ప్రగ్భిరేవచ || నృత్యవాదిత్యగీతైశ్చ సర్వరత్నోపహారకైః | భక్ష్యభోజ్యాన్నపానైశ్చ యాపుజాక్రియతేనరైః || పితామహం సముద్దిశ్యభక్తిస్సాలౌకికీ మతా | వేదమంత్ర హవిర్యోగై ర్భక్తిర్యా వైదికీమతా || 172 -: త్రివిధభక్తిస్వరూపవర్ణనము :- మనస్సు మాట శరీరము అనుత్రికరణములచే నేర్పడుభక్తి మూడువిధములు. అది లౌకికి - వైదికి - ఆధ్యాత్మికి అని మఱి మూడురకములు ధ్యానము ధారణము చక్క నెఱిగి వేదార్ధము జ్ఞప్తిగొని బ్రహ్మకు ప్రీతి గూర్చు భక్తి యిది మానసి యనబడును. 165 మంత్రములు వేదములనమస్కారములతో అగ్నిహోత్రము శ్రాద్ధము మొదలయినవాని భావించి యావశ్యకములైన యాయాదేవతాజపములు నేచేయునది వాచికీభక్తి. 166 వ్రతోపవాసాదినియమములచే చిత్తము నింద్రియముల నిరోధించి కృచ్ఛ్రచాంద్రాయణసాంతపనములచే బ్రహ్మకృచ్ఛ్రోపవాసములు మఱి యాయాశుభవ్రతములచే చేయునది కాయికీభక్తి. యీ మూడును ద్విజులు సేయవలసినవి. 168 ఆవుపాలు పెరుగు నేయి రత్నదీపము కుశోదకము గంధములు పూలమాలలు శాస్త్రము సెప్పిన రకరకాల ధాతువులు నేయి గగ్గులు నల్లఅగరు మొదలయిన మరిమళములచే బంగారురత్నాల రంగురంగులనగలచే భక్ష్య భోజ్యలేహ్యపానీయములను నాల్గురకాలపిండివంటలచే పితామహునుద్దేశించు చేయుభక్తి లౌకికము. వేదమంత్ర హవిర్హోదులచే చేయుభక్తి వైదికము. అమావాస్య పూర్ణిమనాడు చేయనగు నగ్నిహోత్రాదికము ప్రశస్తమైన దక్షిణా దానము పురోడాశముచరుక్రియ (హోమాదికము) ఇష్టి ధృతి మొదలైనవి సోమపానముసేసినవారు (సోమయాజులు) సేయు సర్వయజ్ఞీయకర్మ ఋత్యజు స్సామ మంత్ర జపములు సంహితాపాఠనము సేసి బ్రహ్మనుద్దేశించి సేయుభక్తి వైదికమనబడును. 172 దర్శేవా పౌర్ణమాస్యాం వాకర్తవ్య మగ్నిహోత్రకం | ప్రశస్తం దక్షిణాదానం పురోదాశం చరుక్రియాం || 173 ఇష్టి ద్దృతిః సోమపానాం యజ్ఞీయం కర్మసర్వశః | ఋగ్యజుస్సామజప్యాని సంహితాధ్యయనానిచ || 174 క్రియంతే విధిముద్దిశ్య సా భక్తి ర్వైదికీష్యతే | అగ్ని భూమ్యనిలాకాశంబు నిశాకర భాస్కరమ్ || 175 (పంచభూతాదిదేవతలు) అగ్ని భూమి వాయువు ఆకాశము జలము సూర్యచంద్రులను నుద్దేశించి సేయు బ్రహ్మదైవత్వమయిన కర్మ మదెల్ల వైదికీభక్తి. 175 సముద్దిశ్యకృతం కర్మ తత్సర్వం బ్రహ్మదైవతం | ఆధ్యాత్మికీతుద్వివిధా బ్రహ్మభక్తిః స్థితానృప || 176 సంఖ్యాఖ్యా యోగజాచాన్యా విభాగం తత్రమేశృణు | చతుర్వింశతి తత్వాని ప్రధానాదీని సంఖ్యయా || చేతనానిచభోగ్యాని పురుషః పంచవింశకః | చేతనః పురుషోభోక్తా న కర్తా తస్యకర్మణః || ఆత్మానిత్యో7వ్యయశ్చైవ అధిష్ఠాతాప్రయోజకః | అవ్యక్తః పురుషోనిత్యః కారణం చ పితామహః || తత్వసర్గోభావసర్గో భూతసర్గశ్చతత్వతః | సంఖ్యయా పరి సంఖ్యాయ ప్రధానంచ గుణాత్మకమ్ || సాధర్మ్య మాన మైశ్వర్యం ప్రధానం చ విధర్మిచ | కారణత్వం చ బ్రహ్మత్వంకామ్యత్వ మిదముచ్యతే || ప్రయోజ్యత్వం ప్రధానస్య వైధర్మ్య మిదముచ్యతే | సర్వత్రకర్తృస్యాద్బ్రహ్మ పురుషస్యాప్యకర్తృతా || చేతనత్వం ప్రధానేచ సాధర్మ్య మిదముచ్యతే || తత్వాంతరంచతత్త్వానాం కర్మ కారణమేవచ || ప్రయోజనంచైవ యోజ్యమైశ్వర్యం తత్త్వ సంఖ్యయా | సంఖ్యాస్తీత్యుచ్యతైష్రాజ్ఞై ర్వినిశ్చిత్యార్థచింతకైః 184 ఇతితత్త్వస్య సంభారం తత్వసంఖ్యాచ తత్త్వతః | బ్రహ్మాతత్త్వాధికంచాపిశ్రుత్వా తత్త్వం విదుర్బుధాః || 185 సాంఖ్యకృధ్బక్తి రేషాచ సద్భిరాధ్యాత్మికీకృతా | యోగజామపిభక్తానాం శృణుభక్తింపితామహ || 186 ఆథ్యాత్మికీభక్తి బ్రహ్మనుద్దేశించిచేయునది రెండురకములు. సుఖియను యోగభక్తియింకొకటి. వానిం గూర్చిన విభాగమాలింపుము. ప్రధానముమొదలగునవి చేతనములు భోగ్యములు. నిఱువదినాల్గుతత్వములు. పురుషుడిఱువదియైదవతత్వము. అతడాకర్మకు కర్త భోక్త. ఆత్మ నిత్యుడు అవ్యయుడు అధిష్ఠాత ప్రయోజకుడు. అవ్యక్తుడు నిత్యుడు పురుషుడు సత్యుడు కారణము పితామహుడు. ఒక సృష్టి తత్వసర్గము భావసర్గము భూత సర్గము నని తత్త్వానుసారము గుణస్వరూపమైన ప్రధానమును లెక్కించవలెను. సాధర్మ్యమానమైన ఐశ్వర్యము (అణిమాదివిభూతులు) విధర్మియైనప్రధానము. ఇదియెల్ల పురుషుని కారణత్వము బ్రహ్మత్వము కామ్యత్వమని చెప్పబడును. ప్రధానముయొక్క ప్రయోజ్యత్వము వైధర్మ్యమనబడును. తత్త్వములయందు వేరువేరుతత్త్వముల కర్మకారణము ప్రయోజనము విభాజ్యము ఐశ్వర్యము తత్త్వసంఖ్య వేదార్థముల జక్కగ విమర్శించి ప్రాజ్ఞులు నిశ్చయించిరి. ఈతత్త్వములకతీతము బ్రహ్మము (సచ్చిదానందాత్మకము) అని విని (శ్రుతులచే) తెలిసికొన్నారు పూర్వులు. అది సాంఖ్యభక్తి. యోగమువలన బ్రహ్మయెడ భక్తుల కేర్పడు భక్తి యోగభక్తి యిక వినుము. 186 ప్రాణాయామపరోనిత్యం ధ్యానవాన్నియతేంద్రియః | ధారణం హృదయే కుర్యా ద్ధ్యాయమానఃప్రజేశ్వరం || హృత్పద్మకర్ణికాసీనం రక్తవక్త్రం సులోచనమ్ | పరితోద్యోతితిముఖం బ్రహ్మసూత్ర కటీతటం || చతుర్వక్త్రం చతుర్భాహుం వరదాభయహస్తకమ్ | యోగజా మానసీసిద్ధి ర్బ్రహ్మభక్తిః పరాస్మృతా || యఏవంభక్తిమాన్ధేవే బ్రహ్మభక్తః స ఉచ్యతే || 190 నిత్యము ప్రాణాయామమొనర్చి ధ్యానమున నిలిచి జితేంద్రియుడై హృదయమందు నిత్యము ప్రజాపతిని (బ్రహ్మను) ధ్యానించుచు హృదయమందు ధారణసేయవలెను. హృదయపద్మమందు కర్ణికపై (నడిబొడ్డుపై) కూర్చుండిన ఎఱ్ఱనివస్త్రము ధరించినవానిని చక్కని కన్నులుగలవానిని నలుముఖముల వెలుగునించు ముఖముగల వానినిగ నడుముదాకవ్రేలాడు బ్రహ్మసూత్రము (జందెము) గలవానిగ నాల్గుముఖములు నాల్గుచేతులుగలవానిగ వరము అభయము నిచ్చు ముద్రలురెండు రెండుచేతులగలవానిని ధ్యానించు యోగసిద్ధమైన మానసిసిద్ధి యిది బ్రహ్మభక్తి యిది భక్తులకెల్ల పైదిది దేవునందొనరించు నాతడు బ్రహ్మభక్తుడనబడును. 190 వృత్తించ శృణు రాజేంద్ర యాస్మృతా క్షేత్రవాసినాం | స్వయందేవేనవిప్రాణాం విష్ణ్వాదీనాంసమాగమే || 191 కథితా విస్తరాత్పూర్వం సర్వేషాం తత్రసన్నిధౌ | నిర్మమా నిరహంకారా నిస్సంగా నిప్పరిగ్రహాః || బంధువర్గేచనిఃస్నేహా స్సమలోష్టాశ్మకాంచనాః | భూతానాంకర్మభిర్నిత్యైర్వివిధైరభయప్రదాః || ప్రాణాయామపరానిత్యం పరధ్యానపరాయణాః | యాజినః శుచయో నిత్యం యతిధర్మపరాయణః || సాంఖ్యయోగవిధిజ్ఞా శ్చ ధర్మజ్ఞా శ్చిన్నసంశయాః | యజంతే విధినాయేన యే విప్రాః క్షేత్రవాసినః || 195 పుష్కరక్షేత్రవాసుల వృత్తిని (వ్యవహారము) రాజేంద్ర ! యిక విను స్మృతులందు జెప్పబడినది. విష్ణువు మొదలగు దేవతల సమావేశమందు విప్రులకిది బ్రహ్మకర్మముగా మున్ను సన్నిధిలో విస్తరముగ జెప్పబడినది. మమకారము అహంకారము (నాదినేననుభావము) లేనివారు నిస్సంగులు ఎందునంటువడనివారు, చేయిచాచనివారు బంధు వర్గమందేనితమి గొననివారు మంటిపెళ్ళరాయి బంగారమొకటిగా గనువారు అనేక నిత్యకర్మాచరణముచే భూతముల కభయము గూర్చువారు నిత్యము ప్రాణాయామపరులు పరమాత్మధ్యానతత్పరులు యాజులు (యజించువారు) సదాశుచులు యతిధర్మపరులు సాంఖ్యయోగ విధానమెరిగినవారు ధర్మజ్ఞులు సందియములవెల్ల తెగినవారు యధావిధియాజించువారు వారుక్షేత్రవాసులు విప్రులు. 195 అరణ్య పౌష్కరే తేషాం మృతానాంసత్ఫలంశృణు | యత్ర్పాప్య న పునర్జన్మ లభంతే మృత్యుదాయకం || 196 పునరావర్తనం హిత్వా బ్రాహ్మీం విద్యాం సమాస్థితాః | పునరావృత్తి రన్యేషాం ప్రపంచాశ్రమవాసినాం || గార్హస్థ్యవిధిమాశ్రిత్య సత్కర్మనిరతః సదా | జుహోతి విధినా సమ్య ఙ్మం త్రై ర్యజ్ఞె ర్నిమంత్రితం || అధికం ఫలమాప్నోతి సర్వదుఃఖవివర్జితః | సర్వలోకేషుచాప్యస్య గతిర్నప్రతిహన్యతే || దివ్యే నైశ్వర్య యోగేన స్వారూఢ సపరిగ్రహః | బాలసూర్యప్రకాశేన విమానేనసువర్చసా || వృతఃస్త్రీణాం సహసై#్రస్తు స్వచ్ఛందగమనాలయః | విచర త్యనివార్యేణ గురుశుశ్రూషణనచ || వేదాధ్యయనసంయుక్తో భైక్ష్యవృత్తిర్జితేంద్రియః నిత్యసత్యవ్రతేయుక్తః స్వధర్మేష్వవ్రమాదవాన్ || సర్వకామసమృధ్ధేన సర్వకామావలంబినా | సూర్యేణవ ద్వితీయేన విమానే నానివారితః || గుహ్యకానామబ్రహ్మాఖ్యగణాః పరమసమ్మతాః | అప్రమేయబలైశ్వర్యా దేవదానవ పూజితాః || తేషాం స సమతాంయాతి తుల్యైశ్వర్య సమన్వితః | దేవదానవ మర్త్యేషు భవత్యనియతాయుధః || వర్షకోటి సహస్రాణి వర్షకోటిశతానిచ | ఏవమైశ్వర్య సంయుక్తో విష్ణులోకేమహీయతే || ఉషిత్వాసౌవిభూత్యైవం యదా ప్రచ్యవతేపునః | విష్ణులోకాత్స్వకృత్యేన స్వర్గస్థానేషుజాయతే || 206 పుష్కరారణ్య మాసాద్య బ్రహ్మచర్యాశ్రమే స్థితః | అభ్యాసేనతు వేదానాం వసతేమ్రియతే7పివా || మృతో7సౌయాతి దివ్యేన విమానేన స్వతేజసా | పూర్ణచంద్రప్రకాశేన శశివత్ప్రియదర్శనః || రుద్రలోకం సమాసాద్య గుహ్యకైఃసహమోదతే | ఐశ్వర్యం మహదాప్నోతి సర్వస్యజగతఃప్రభుః || భుక్త్వాయుగసహస్రాణి రుద్రలోకే మహీయతే | ప్రచ్యుతస్తు పునస్తస్మా ద్రుద్రలోకా త్ర్కమేణతు || 210 పుష్కరారణ్యమందు దేహముచాలించినవారి ఫలమాలింపుము. వారు మరణించి మరణము నిచ్చు జన్మము మరల పొందరు. పునరావర్తనము విడిచి బ్రాహ్మీవిద్య నూతగొని క్షేత్రవాసి సుఖముండును. ప్రపంచమం దితరాశ్రమవాసులకు పునరావృత్తి కలుగును. గృహస్థధర్మమాశ్రయించి నిత్యము సత్కర్మ నిరతుడై యధావిధి యజ్ఞములందు నిమంత్రితుడై హోమములు సేయునతడు సర్వదుఃఖము వెడలి యధికఫలమందును. ఇతని కెల్ల లోకములందు సంచారమడ్డుపడదు. దివ్వైశ్వర్యయోగముచే సర్వసాధనసామగ్రితో బాలసూర్యప్రకాశ##మైన తేజోనిధానమైన విమానముపై సహస్రసుందరీ సమావృతుడై యేయడ్డులేక స్వేచ్ఛాసంచారియై చరించును. గురుశుశ్రూషచే వేదాధ్యయనముసేయుచు జితేంద్రియుడై నిత్యసత్యవ్రతియై స్వధర్మముం దప్పక సర్వకామ సమృద్ధము సర్వకామముల కాలంబమునై రెండవసూర్యునట్లున్న విమానముననేయడ్డులేక సర్వైశ్వర్యసంపన్నుల గుహ్యకులను పేరి వారు పరమసమ్మతులు బ్రహ్మగణములు అప్రమేయైశ్వర్య సంపన్నులు దేవతలచేగూడ పూజలందుకొనువారు నైన వారితో సమమైన యైశ్వర్యముతోగూడి వారితో సామ్యమందును. దేవదానవమానవులందడ్డులేని యాయుధములంగొని వందలువేలు కోట్ల సంవత్సరములు సర్వైశ్వర్య సంపన్నుడై విష్ణులోకమున విహరించును. పరమవిభూతితో నిట్లుండి, తన కృత్యమున విష్ణులోకమునుండి జారి స్వర్గస్థానములందు జనించును. 210 నిత్యంప్రముది తస్తత్ర భుక్త్వా సుఖ మనుత్తమం | ద్విజానాం సదనే దివ్యే కులే మహతి జాయతే || 211 మానుషేషు సధర్మాత్మా సురూపో వాక్పతిర్భవేత్ | స్పృహణీయవపుః స్త్రీణాం మహాభోగపతి ర్బలీ || వానప్రస్థసమాచారః గ్రామ్యోపాధి వివర్జితః | సర్వలోకేషుచాప్యస్య గతిర్నప్రతిహన్యతే || శీర్ణపర్ణఫలాహారః పుష్పమూలాంబుభోజనః | కపోతే నాశ్మకుట్టేన దంతోలూఖలికేనచ || వృత్త్యుపాయేనజీవేత చీరవల్కల వాససా | జటీ త్రిషవణస్నాయీ త్యక్తదోషస్తు దండవాన్ || కృచ్ఛ్రవ్రతపరోయస్తు శ్వపచోయదివాపరః | జలశాయీపంచతపా వర్షా స్వభ్రావగాహకః కీటకంటక పాషాణ భూమ్యాంతు శయనంతథా | స్థానవీరాసనరతః సంవిభాగీ దృఢవ్రతః || అరణ్యౌషధిభోక్తాచ సర్వభూతాభయప్రదః | నిత్యం ధర్మార్జనరతో జితక్రోధోజితేంద్రియః || బ్రహ్మభక్తః క్షేత్రవాసీ పుష్కరేవసతేమునిః | సర్వసంగపరిత్యాగీ స్వారామో విగతస్పృహః యశ్చాత్రవసతేభీష్మ శృణుతస్యాపియాగతిః | తరుణార్క ప్రకాశేన వేదికాస్తంభశోభినా || బ్రహ్మభక్తోవిమానేన యాతి కామప్రచారిణా | విరాజమానోనభసి ద్వితీయ ఇవ చంద్రమాః || గీతవాదిత్రనృత్యజ్ఞై ర్గంధర్వాప్సరసాంగణౖః | అప్సరోభిః సమాయుక్తో వర్షకోటిశతాన్యనౌ || యస్యకస్యాపిదేవస్యలోకం యాత్యనివారితః | బ్రహ్మణో7నుగ్రహేణౖవ తత్రతత్ర విరాజతే || బ్రహ్మలోకచ్యుతశ్చాపి విష్ణులోకం సగచ్ఛతి | విష్ణులోకా త్పరిభ్రష్టో రుద్రలోకం సగచ్ఛతి || 223 -: పుష్కరారణ్యమందు బ్రహ్మచారిప్రవర్తనము :- పుష్కరారణ్యమందు బ్రహ్మచర్యాశ్రమస్థుడై వేదాభ్యాసము సేయుచు నొకవేళమరణించిన, నతడు తన తేజమున దివ్యవిమానమెక్కి పూర్ణచంద్రునట్టి కాంతితో చంద్రునట్టి రూపముతో రుద్రలోకమంది గుహ్యకులతో గూడ యానందించును. మహైశ్వర్యమందును, సర్వజగత్ప్రభువగును. వేలయుగములు రుద్రలోకమందు సర్వ భోగములనుభవించి యటనుంచి జారి నిత్యసంతోషియై యుత్తమసుఖమనుభవించి యుత్తమబ్రాహ్మణగృహమందు పుట్టును. మనుజులలోగూడ నతడు ధర్మాత్ముడు సుందరుడు మంచివక్తయునౌను. వానప్రస్థధర్మమూని గ్రామ్యోపాధిగొనక సర్వలోకముల నిరాఘాటముసంచరించును. ఎండుటాకులు పండ్లు పూలమాలలు తామరపూలు భుజించుచు కపోతము ఆశ్మకుట్టము దంతోలూఖవికము నను జీవనోపాయమున నారచీరపట్టలుదాల్చి జడలూని త్రిషవణస్నాయుజ (మూడువేళల స్నానముచేయువాడై) ఏదోషములేక దండమూని కృచ్ఛ్రవ్రతమూని, స్వపచుడయ్యును చండాలుడయ్యు వర్షర్తువున నీటిలోపరుండి పంచతపమూని స్వచ్ఛమగు నాకాశమున, పురుగులు ముళ్లు రాళ్ళున్న నేలపరుండి తగుచోటవీరాసనమందుండి అందఱకెడవడి దృఢవ్రతియై అడవిమూలికలందినుచు నెల్లభూతముల కభయమిచ్చుచు ఎప్పుడును ధర్మముకూడబెట్టుకొనగోర్కికొని కోపమునుగెలిచి యింద్రియములనదిమి బ్రహ్మభక్తుడై మునియై పుష్కరక్షేత్రమందు సర్వసంగపరిత్యాగియై కోరికలెడలి ఆత్మారాముడై (ఆత్మానుసంధానముసేయుచు) వసించును. కపోతవ్రతము=పావురమువలె గూడబెట్టుకొనకుండుట. అశ్మకుట్టుడు, అపక్వపదార్థముల పిండిచేసికొని తినువాడు. దంతోలూఖులికుడు=దంతము తేఱూలుగావాడుకొనువాడు. (ఈమూడు వానప్రస్థుని లక్షణములు) 223 తస్మాదపి చ్యుత స్తేషు పునర్మర్త్వేషు జాయతే | స్వర్గేషు చ తథాన్యేషు భోగాన్భుక్త్వాయధేప్సితాన్ || 224 భుక్త్యైశ్వర్యంతతస్తేషు పునర్మర్త్యేషుజాయతే | రాజావారాజపుత్రోవా జాయతే ధనవా న్సుఖీ || సురూపః సుభగః కాంతః కీర్తిమాన్ భక్తిభావితః | బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రావా క్షేత్రవాసినః స్వధర్వనిరతాజగ్ము స్సువృత్తా శ్చిరజీవినః || సర్వాత్మనా బ్రహ్మభక్తా భూతామగ్రహకారిణి | పుష్కరేతుమహాక్షేత్రే యేవసంతి ముముక్షవః || మృతాస్తే బ్రహ్మభవనం విమానైర్యాంతిశోభ##నైః | అప్సరోగణ సంఘృష్టెః కామగై కామరూపిభిః || అథవాసంప్రదీప్తాగ్నౌ స్వశరీరం జుహోతియః | బ్రహ్మాధ్యాయీ మహాసత్వః సబ్రహ్మభవనంవ్రజేత్ || బ్రహ్మలోకో7క్షయస్తస్య శాశ్వతోవిభ##వైఃసహ | సర్వలోకోత్తమోరమ్యో భవతీష్టార్థసాధకః || పుష్కరేతుమహారణ్య ప్రాణాన్యేసలిలే7త్యజన్ | తేషామప్యక్షయోభీష్మ!బ్రహ్మలోకోమహాత్మనాం || సాక్షాత్పశ్యంతితేదేవం సర్వదుఃఖవినాశనమ్ | సర్వామరయుతందేవం రుద్రవిష్ణుగణౖర్యుతం || అనాశ##కేమృతాశూద్రాః పుష్కరేతువనేనరాః | హంసయుక్తైస్తతోయాంతి విమానైరర్కసప్రభైః || నానారత్న సువర్ణాఢ్యైర్ధృఢై ర్గంధాధివాసితైః | బ్రహ్మలోకేనరా ధీరా రమంతే7నాశ##కేమృతాః || తత్రోషిత్వాచిరంకాలం భుక్త్వాభోగాన్యధేప్సితాన్ | ధనీవిప్రకులేభోగీ జాయతేమర్త్యమాగతః || కారీరొక్షసాధయేద్యస్తు పుష్కరేషువనేనరః | సర్వలోకాన్పరిత్యజ్య బ్రహ్మలోకం సగచ్ఛతి || బ్రహ్మలోకేవసేత్తావ ద్యావత్కల్పక్షయోభ##వేత్ | నవైపశ్యతి మర్త్యంహిక్లిశ్యమానం సృకర్మభిః || గతిస్తస్యాప్రతిహతా తిర్య గూర్ధ్వ మధస్తధా | సపూజ్యః సర్వలోకేషు యశోవిస్తారయన్‌వశీ || సదాచారవిధిప్రజ్ఞః సర్వేంద్రియమనోహరః | నృత్యవాదిత్రగీతజ్ఞః సుభగఃప్రియదర్శనః || నిత్యమవ్లూనకుసుమో దివ్యాభరణభూషితః | నీలోత్పలదలశ్యామో నీ ల కుంచిత మూర్ధజః || అజఘన్యాః సుమధ్యాశ్చ సర్వసౌభాగ్యపూరితాః | సర్వైశ్వర్య గుణోపేతా ¸°వనేనాతిగర్వితాః || స్త్రియః సేవన్తితత్రస్థాః శయనేరమయంతిచ | వీణావేణునినాదైశ్చ సుప్తః సంప్రతిబుధ్యతే || మహోత్సవసుఖంభుంక్తే దుష్ప్రాప్యమకృతాత్మభిః | ప్రసాదా ద్దేవ దేవస్య బ్రహ్మణః శుభకారిణః || 245 భీష్మ ఉవాచ : ఆచారాఃపరమాధర్మాః క్షేత్రధర్మపరాయణాః | స్వధర్మాచారనిరతా జితక్రోథా జితేంద్రియాః || బ్రహ్మలోకం వ్రజంతీతి నైతచ్చిత్రమ్ మతం మమ | అసంశయంచగచ్ఛంతిలోకా న్సర్వానపి ద్విజాః || వినాపద్మోపవాసేన తధైవ నియమేనచ | స్త్రియో వ్లుెచ్చాశ్చశూద్రాశ్చ వక్షిణః పశవోమృగాః || మూకాజడాంధబధిరా స్తపోనియమవర్జితాః | తేషాంవదగతిం విప్ర పుష్కరే యే త్వవస్థితాః || పులస్త్య ఉవాచ : స్త్రియోవ్లుెచ్చాశ్చశూద్రాశ్చ పశవః పక్షిణోమృగాః | పుష్కరేతుమృతాభీష్మ బ్రహ్మలోకం వ్రజంతితే || శరీరై ర్దివ్యరూపైస్తు విమానై రవిసన్నిభైః | దివ్యవ్యూహసమాయుక్తైఃకామగైః కామరూపిభిః || 250 -: పుష్కరక్షేత్రవాసియుత్తమగతి :- భీష్మాచార్య ! ఆలింపుము. బాలసూర్యప్రకాశము వేదికలు స్తంబముల శోభనము నైనవిమానము కామగమెక్కి బ్రహ్మభక్తుడు తేజోమూర్తియై రెండవచంద్రునట్లాకాసమందు దీపించుచు విష్ణులోకమేగును. అటనుండి దిగి రుద్రలోకమేగును. అటనుండిగూడజారి మర్త్యలోకమున బుట్టి సర్వభోగములనుభవించి మఱిమానవులందు జనించుచు రాజుగాని రాజకుమారుడుగానియై ధనవంతుడై చక్కనివాడై కీర్తిమంతు డై భక్తిభరితుడౌను. నాల్గువర్ణములవారెవరైన క్షేత్రవాసు లీ ఫలమందుదురు. ఇట మరణించినవారు నిదేయుత్తమగతినందుదురు. ఇక్కడ శరీర మగ్నికాహుతిసేసిన వేదాధ్యనసంపన్నుడు బ్రహ్మలోకమునకేగును. శాశ్వతవిభవమందు విహరించును. ఇట మరణించినవారు హంసలతోడి విమానముపై తిరిగి బ్రహ్మలోకమున రమింతురు. అటనుండివచ్చి బ్రాహ్మణ కులమందు జన్మించి సర్వభోగానుభవమందును. దేవదేవుడు బ్రహ్మయొక్క శ్రీపాదముపొంది పరమానంద మందును. నానారసాఢ్యం గచ్ఛంతి స్త్రీసహన్రసమాకులాః | బ్రహ్మలోకంమహాత్మానోలోకానన్యాన్యథేప్సితాన్ || 258 బ్రహ్మలోకాచ్చ్యుతాశ్చాపి క్రమాద్ద్వీపేషుయాంతితే | కులేమహతివిస్తీర్ణే ధనీభవతి సద్విజః || 259 తిర్యగ్యోని గతా యేతు సర్వకీటపిపీలికాః | స్థలజాజలజాశ్చైవ స్వేదాండోద్భిజ్జరాయుజాః || 260 సకామావాప్యకామావా పుష్కరేతువనేమృతాః | సూర్యప్రభవిమానస్థా బ్రహ్మలోకంప్రయాంతితే || కలౌయుగే మహాఘోరేప్రజాః పాపసమీరితాః | నాన్యేనాస్మిన్నుపాయేనధర్మః స్వర్గశ్చలభ్యతే || వసంతిపుష్రరేయేతు బ్రహ్మార్చనరతానరాః | కలౌయుగే కృతార్థాస్తేః క్లిశ్యంత్యన్యేనిరర్థకాః || రాత్రౌకరోతియత్పాపం నరః పంచభిరింద్రియైః | కర్మణామనసావాచా కామక్రోధవశానుగః || ప్రాతః సవనమాసాద్య పుష్కరేతు పితామహం | అభిగమ్య శుచిర్భూత్వా తస్మాత్పాపా త్ప్రముచ్యతే || అర్కస్యోదయమారభ్య యావద్దర్శన మూర్ధ్వగం | మానసాఖ్యే ప్రసంచింత్య బ్రహ్మయోగేహరేదఘం || దృష్ట్వా విరించింమధ్యాహ్నేనరః పాపా త్ప్రముచ్యతే | మధ్యాహ్నాస్తమయాంతంయ దింద్రియైః పాపమాచరేత్ || పితామహస్యసంధ్యాయాం దర్శనా దేవ ముచ్యతే | శబ్ధాదీన్విషయాన్సర్వా న్భుంజానో7పి సకామతః || యఃపుష్కరే బ్రహ్మభక్తో నివసేత్తపసిస్థితః | పుష్కరారణ్యమధ్యస్థో మిష్టాన్నాస్వా దభోజనః || త్రికాలమపిభుంజానో వాయుభక్షసమోమతః | వృక్షమూలే7శ్మకుట్టేన సర్వదా తపతే తపః || 270 వసంతిపుష్కరే యేతు నరాః స్వకృతకర్మిణః | తే లభంతేమహాభోగాన్ క్షేత్రస్యాస్యప్రభావతః || యథామహోదధేస్తుల్యో నచాన్యో7స్తి జలాశయః | తథాపై పుష్కరస్యాపి సమంతీర్థం నవిద్యతే || దేవాధికో యథాబ్రహ్మా తథానాన్యో7ధికోభ##వేత్ | పుర్కరారణ్యసదృశం తీర్థం నాస్త్యధికంగుణౖః || అథతే7న్యాన్ప్రవక్ష్యామి యేస్మిన్‌క్షేత్రే వ్వవస్థితాః | విష్ణునా సహితాః సర్వ ఇంద్రాద్యాశ్చ దివౌకసః || గజవక్త్రః కుమారశ్చ రేవంతః సదివాకరః | శివదూతీ తథాదేవీ కన్యా క్షేమంకరీవరా || స్థితా హితార్థం జగతో బ్రహ్మణోనిలయేసదా | అలంతపోభిర్నయమైః సుక్రియార్చన కారిణాం || వ్రతోపవాస కర్మాణి కృత్వాన్యత్ర మహాన్త్యపి | జ్యేష్ఠేతుపుష్కరారణ్య యస్తిష్ఠతి నిరుద్యమః || లభ##తే సర్వకామిత్వం యో7త్త్రైవాస్తే ద్విజః సదా | పితామహసమంయాతి స్థానం పరమమవ్యయం || కృతేద్వాదశభీర్వర్షై స్త్రేతాయాం హాయనేనతు | మానేన ద్వాపరే భీష్మ అహోరాత్రేణతత్కలౌ || ఫలంసంప్రాప్యతేలోకైః క్షేత్రే7స్మిస్తీర్థవాసిభిః | ఇత్యేవం దేవదేవేనారణ్య మేతత్సమాశ్రయేత్ || గృహస్థోబ్రహ్మచారీచ వానప్రస్థో7థ భిక్షుకః | యథోక్తకారిణః సర్వే గచ్ఛంతి పరమాంగతిమ్ || ఏకస్మిన్నాశ్రమేధర్మే యో7నుతిష్ఠేద్యథావిధి | అకామద్వేషసంయుక్తః సపరత్ర మహీయతే || చతుష్టృదాహినిశ్రేణి బ్రహ్మణౖషా ప్రతిష్ఠితా | ఏతామాశ్రిత్య నిశ్రేణీం బ్రహ్మలోకే మహీయతే || ఆయుషో7పి చతుర్భాగం బ్రహ్మచా ర్యనసూయకః | గురౌ వాగురుపుత్రేవా వసే ద్ధర్మార్ధకోవిదః || కర్మాతిరేకేణగురో రధ్యేతవ్యం బుభూషతా | దక్షిణానాంప్రదాయీస్యా దాహూతో గురు మాశ్రయేత్ || 285 జఘన్యశాయీ పూర్వఃస్యా దుత్థాయీ గురువేశ్మని | యచ్చ శిష్యేణకర్తవ్యం కార్య మాసేవనాదికమ్ || కృతమిత్యేవతత్సర్వం కృత్వాతిష్ఠేత్తు పార్శ్వతః | కింకరః సర్వకారీచ సర్వకర్మసు కో విదః || శుచిర్దక్షోగుణోపేతో బ్రూయాదిష్ట మధోత్తరం | చక్షుషాగురుమవ్యగ్రో నిరీక్షేత జితేంద్రియః || నాభుక్తవతి నాశ్నీయా దపీతవతి నోపిబేత్ | నతిష్ఠతి తథాసీత వసుప్తేనైవ సంవిశేత్ || ఉత్తానాభ్యాంచ పాణిభ్యాం పాదావస్య మృతుస్పృశేత్ దక్షిణం దక్షిణనైవ సవ్యం సవ్యేనపీడయేత్ || అభివాద్యగురుంబ్రూయాదభిదాం స్వాంబ్రువన్నితి | ఇదంకరిష్యే భగవన్నిదం నాపిమయాకృతమ్ || ఇతిసర్వంచ విజ్ఞాప్య నివేద్యగురవేధనం | కుర్యాత్కృతంచతత్సర్వమాఖ్యేయంగురవేసదా || యాంన్సుగంధాన్రసాన్వాపిబ్రహ్మచారీనసేవతే | సేవేతతాన్సమావృత్యఇతిధర్మేషునిశ్చయః || యేకేచిద్విస్తరేణోక్తా నియమాబ్రహ్మచారిణః | తాన్సర్వాననుగృహ్ణీ యాద్యక్తఃశిష్యశ్చతై ర్గురోః || సఏవంగురవేప్రీతి ముపహృత్య యథాబలం ! అగ్రామేష్వాశ్రమేష్వేవం శిష్యోవర్తేత కర్మణా || వేదం వేదౌ తథావేదాన్ వేదార్థాంశ్చ తథాద్విజః భిక్షాభుగ ప్యథంశాయీ సమధీత్య గురోర్ముఖాత్ || వేదవ్రతోపయోగీచ చతుర్ధాంశేన యోగతః గురవే దక్షిణాందత్వా సమావర్తేద్యథావిధి || 297 భీష్ముడనియె : పద్మతీర్థమందుపవాసాదులు తపోనియమములులేకుండనే స్త్రీలు మొదలుగ నందరు నేగతికి బోవుదురదియానతిమ్మన పులస్త్యుడనియె. పుష్కరమందు చనిపోయినవారుబ్రహ్మలోకమునకేగుదురు. కలియుగ మందింతకంటె సులభోపాయములేదు. ఇట బ్రహ్మదేవుని దర్మనమాత్రమున సర్వఫలము సిద్ధించును. ఇక్కడ మూడువేళలం దిన్నవాడుగూడ వాయుభక్షునితో సముడగును. మహాసముద్రములాటి జలాశయముమరొకటిలేనట్లు పుష్కరముతో సమతీర్థమింకలేదు. ఈక్షేత్రమందున్న ఇంద్రాదిదేవతలతోబాటు గజానన కుమారాదులు సూర్యునిదాక గలవారు శివదూతి క్షేమంకరీకన్యమొదలగువారిటనున్నారు. జ్యేష్ఠపుష్కరమందేపనిలేకూరకున్న మాత్రన సర్వకామసిద్ధినందును. కృతయుగమందు బండ్రెండేండ్లు త్రేతాయుగమందొక్కసంవత్సరము ద్వాపరమున నొక్కనెల యొనరించిన పుణ్యఫలమొక్కరాత్రివలన నీ పుష్కరారణ్యమందున్నమాత్రనకలుగును. బ్రహ్మచారి మొదలుగ నన్నియాశ్రమముల వారిటనున్నమాత్రన నిహపరములందు రాణింతురు. ఈపుణ్యభూమి చతుష్పదము(నాల్గుమెట్లుగల) యొక నిచ్చెన బ్రహ్మచేప్రతిష్ఠింపబడినది. దీని యాధారముగొని నతడు బ్రహ్మలోకమందు సుఖమందును. -: గురుసేవావిధానవర్ణనము :- గురునెడ గురుపుత్రుడు సుఖముగబ్రతుకగోరువాడు ధర్మార్థనిపుణుడింకేపనిలేక వసింపవలయును. అధ్యయనము సేయవలెను. వారిచేబిలువబడి దక్షిణయిచ్చి గురువునండచేరవలెను. వారుపరున్న తర్వాత పరుండవలెను. ముందుమేల్కొనవలెను. గురునింట పనులన్ని చక్కబెట్టనగును. చేయవలసినదంతసేసివచ్చి గురులపజ్జ నిలువవలెను. సేవకుడు సర్వముసేసినవాడు అన్ని పనులనేర్పరి శుచి సమర్ధుడు గుణశాలియై యటుపై తమకిష్టమేదని యడుగవలెను. ఇంద్రియనిగ్రహమొంది ఏతొందరపాటుగొనక గురునిపైచూపునిలిపినిలువవలెను. గురువు భోజనము సేయకుండ భుజింపరాదు. మంచినీళ్ళు త్రాగకుండ త్రావరాదు. నిలువబడియుండ కూర్చుండరాదు. చేతులెత్తి గురువుకుడిపాదము కుడిచేత నెడమపాద మెడమచేత మృదువుగతాకవలెను. గురునకు తనపేరుసెప్పికొని వంగిమ్రొక్కవలెను. భగవన్ (స్వామీ) ఇదిసేసెద నిదినేజేయలేదు అని యెల్ల విన్నవించి ధనమును గురునకు నివేదించి సేవించి చేయవలసినదెల్లసేసి తెలియజేయవలెను. పరిమళములను పలురుచులనేవి సేవింపరాదో వానిని గురునుండి తిరిగిగైకొని సేవింపవలెను. గురుభుక్తశేషమారగింపవలెనన్నమాట. ఇది ధర్మశాస్త్రముల సిద్ధాంతము. ఏకొన్ని బ్రహ్మచారిధర్మములు విస్తరించిచెప్పబడినవో వానినన్నిటినాచరించి యనురాగపాత్రుడై శిష్యుడుగురుననుగ్ర హింపజేసికొనవలెను. ఆలా గురువుప్రీతి యధాశక్తి సేకరించుకొని, శిష్యుడు పవిత్రములగు నాయాగార్హస్థ్యాద్యా శ్రమములందు మెలగవలెను. భిక్షాన్నము దిని క్రిందపరుండి గురుముఖమున వేదార్థములను అధ్యయనముసేసి యోగముచే తనంతతాను వేదవ్రతోపయోగమంది ద్రవ్యమందు నాల్గవవంతు గురుదక్షిణయిచ్చి యధావిధి సమావర్తనము సేయవలెను. వివాహాదులకు కనుజ్ఞనొంది యధావిధి సమావర్తనము సేయవలెను. ఇది బ్రహ్మచర్యాశ్రమముయొక్క పరమావధివిధానము. 297 :- గృహస్థధర్మవర్ణనమ్ -: గృహస్థవృత్త యఃపూర్వం చతుస్రో మునిభిఃకృతాః | కుశూలధాన్యాప్రథమా కుంభీధాన్యా ద్వితీయకా || అశ్వస్తనీ తృతీయోక్తా కాపోత్యథ చతుర్థికా | తాసాం పరాపరాశ్రేష్ఠా ధర్మతా లోకజిత్తమా || షట్కర్మవర్తకస్త్వేక స్త్రిభిరన్యఃప్రవర్తతే | ద్వాభ్యాంచైవ చతుర్ధస్తు ద్విజః సబ్రహ్మణి స్థితః || 300 గృహమేధివ్రతాదన్య న్మహత్తీర్థం న చక్షతే | నాత్మార్ధే పాచయేదన్నం న వృథాఘాతయెత్పశుమ్ || ప్రాణీవాయది వాప్రాణీ సంస్కారాద్యజ్ఞ మర్హతి | నదివాప్రస్వ పేజ్జాతు నపూర్వాపరరాత్రయోః || నభుంజీతాంతరామేకః నానృతంతువదేదిహ | నాస్యానశ్నన్వసేద్విప్రః గృహేకశ్చి దపూజితః తధాస్యాతిథయః పూజ్యాహవ్యకవ్యవహాఃస్మృతాః | వేదవిద్యావ్రతస్నాతాః శ్రోత్రియా వేదపారగాః సకర్మజీవినోదాంతాః క్రియాపంతస్తపస్వినః | తేషాంహవ్యంచకవ్యంచాప్యర్హచార్థం విధీయతే || నశ్వరై స్సంప్రయాతస్య స్వధర్మాపగతస్యచ | అపవిద్ధాగ్నిహోత్రస్య గురోర్వాలీకకారిణః || అసత్యాభినివేశస్య స్వధర్మాపగతస్యచ | అపవిద్ధాగ్నిహోత్రస్య గురోర్వాలీకకారిణః || అసత్యాభినివేశస్య నాధికారో7స్తి కవ్యయోః నంవిభగో7త్రభూతానాం సర్వేషామేవశిష్యతే || తథైవాపచమానేభ్యః ప్రదేయం గృహమేథినా | విఘసాశీ భ##వేన్నిత్యం నిత్యంచామృత భోజనః || అమృతంయజ్ఞశేషఃస్యా ద్భోజనం హవిషాసమం | సంభుక్తశేషం యో೭శ్నాతి తమాహుర్విఘసాశినమ్ || 310 :-గృహస్థధర్మవర్ణనము:- gRiXx¤¦¦¦xqósª«sX»R½VòÌÁV ƒyÌæÁV ª«sVVƒ«sVÛÍÁ[LRiöLjiÀÁLji. NRPVxqsWÌÁª«sX¼½ò = (1) చాటెడుధాన్యము. 2) కుంభీధాన్య=కడవెడు ధాన్యము (3) అశ్వస్తని=రేపటికింటనేమియులేని (4) కాపోతి = పావురములప్పటికప్పుడుతినుటకుంచుకొనుట. వానికి పైది పరమశ్రేష్ఠము పుణ్యలోకములను జయించునది ధర్మతా వృత్తి. ఇందొకవృత్తి షట్కర్మప్రవర్తకము. కర్మత్రయప్రవర్తక మింకొకటి. రెండుకర్మముల ప్రవర్తకము నాల్గవవృత్తి. దానిచే ద్విజుడు బ్రహ్మనిష్ఠుడగును. గృహమేధివ్రతముకంటె నింకొక మహాతీర్థము సెప్పబడలేదు. గృహస్థుతనకై అన్న మువండుకోరాదు. వృధాగా పశువును జంపరాదు. ప్రాణిగాని అప్రాణిగాని వస్తువు సంస్కరించుటవలన మంత్రముచేగ్రహించుట కల్ల. యజ్ఞమున కర్హమగును. 303 స్వాహారనిరతోదాంతో దక్షోత్యర్థం జితేంద్రియః | ఋత్విక్పురోహితాచార్య మాతులాతిథిసంయుతః || 304 వృద్ధబాలాతురై ర్వైద్వై ర్జాతిసంబంధిబాంధవైః | మాత్రాపిత్రాచ జామాత్రా భ్రాత్రాపుత్రేణ భార్యయా || ధర్మాన్వితై ర్వృతైర్దారైరగ్నీ నావాహ్యపూజయేత్ | ద్వితీయ మాయుషోభాగం గృహమేధీ సమాచరేత్ || దుహిత్రాదాసవర్గేణ వివాదం నసమాచరేత్ | ఏతాన్విముచ్య సంవాదా న్సర్వపాపైః ప్రముచ్యతే || ఏతైర్జితైస్తుజయతి సర్వలోకా న్నసంశయః | ఆచార్యోబ్రహ్మలోకేశః ప్రాజాపత్యప్రభుః పితా || అతిథిః సర్వలోకేశ ఋత్వి గ్వేదాశ్రయః ప్రభుః | జామాతాప్సరసాంలోకో జ్ఞాతయోవైశ్వదేవికాః || సంబంధిబాంధవా దిక్షు పృథివ్యాం మాతృమాతులే | వృద్దబాలాతురాశ్చైవ ఆకాశే ప్రభవిష్ణవః || పురోథాఋషిలోకేశః సంశ్రితాస్సాధ్యలోకపాః అశ్విలోకపతిర్వైద్యోభ్రాతాతు వసులోకపః || చంద్రలోకేశ్వరీభార్యా దుహితాప్సరసాగృహే భ్రాతాజ్యేష్ఠ సమః పిత్రా భార్యాపుత్రఃస్వకాతనుః || అనగ్నిరనికేతస్తు గ్రామంభిక్షార్థమాశ్రయేత్ | అశ్వస్తనవిధానః స్యా న్ముని ర్భావ సమన్వితః || 320 గృహస్థుపగలెన్నడు నిద్రవోరాదు. రాత్రి తొలిజామున చివర నిద్రవోరాదు. భోజనములకు నడుమ మరలభుజింపరాదు. అనృతమాడరాదు. ఈతనియింట బ్రాహ్మణుడు పూజింపబడక భోజనముసేయక ఒక్కడుండ గూడదు. అలా హవ్యమందుకొనుదేవతలు కవ్యమందుకొను పితృదేవతలు గృహస్థునకతిథులు పూజ్యులని స్మృతులన్నవి. వేదవిద్యావ్రతస్నాతులు శ్రోత్రియులు వేదపారగులు సర్వకర్మపరులు ఇంద్రియనిగ్రహము గలవారు క్రియాశీలురు తపస్యులునగువాని రర్చించుటకు హహ్యము కవ్యమునకు నర్హులు. నశించుస్వభావముకలవిషయములవెంటబడు వానికి (విషయలోలునికి) స్వధర్మముదప్పిన వానికి అగ్నిహోత్రమువిడిచినవానికి గురువును మోసగించువానికి అబద్ధాలకోరునకు కవ్యములందధికారములేదు. పితృదేవతానిమిత్తమై యిచ్చు పదార్థమునధికారములేదు. అన్నిభూతములకు నీకవ్యమందు భాగమున్నది. అందుచే గృహమేధి అపక్వపదార్థములచేగూడ కవ్యమీయవలెను. ఎప్పుడు విఘసాశి=అమృతభోజనుడు కావలెను. అమృతమనగా యజ్ఞశేషము. అది అమృతమే.. లబ్ధాశీ నియతాహారః సకృదన్నం నిషేవయేత్ | కపాలంవృక్షమూలాని కుచైలమసహాయతా || ఉపేక్షాసర్వభూతానామేతావద్భిక్షులక్షణమ్ || :-ఉత్తమబ్రాహ్మణలక్షణాని -: యస్మిన్వాచః ప్రవిశంతి కూపేప్రాప్తామృతా ఇవ | నవక్తారం పునర్యాంతి సకైవల్యాశ్రమే వసేత్ || 322 నైవపశ్యే న్న శృణుయా దవాచ్యంజాతు కస్యచిత్ | బ్రాహ్మణానాంవిశేషేణ నైతద్భూయాత్కథంచస || 323 యద్ర్బాహ్మణస్యానుకూలం తదేవ సతతం వదేత్ | తూష్ణీమాసీతనిందాయాం కుర్వన్భైషజ్యమాత్మనః యేనపూర్ణ మివాకాశం భవత్యేకేన సర్వదా | శూన్యంయేన సమాకీర్ణం తందేవా బ్రాహ్మణం విధుః || యేనకేనచిదాచ్ఛన్నో యేనకేన చిదాశితః యత్రక్వచనశాయీ చ తం దేవా బ్రాహ్మణంవిదిః || అరేరివజనాద్భీతః సుహృదో నరకాదివ | కృపణాదివ నారీభ్య స్తందేవా బ్రాహ్మణంవిదుః || నహృష్యేత విషీదేత మానితో೭మానితన్తథా | సర్వభూతేష్వభయద స్తం దేవా బ్రాహ్మణం విదుః || అనభ్యాహతచిత్తక్చ దాంతశ్చాహతధీస్తథా | వియుక్తః సర్వపాపేభ్యో నరోగచ్చతి నోదివమ్ || అభయం సర్వభూతేభ్యో భూతానామభయంయతః | తస్యదేహవిముక్తస్య భయం నాస్తి కుతశ్చన || 330 యధానాగపదే೭న్యాని పదాని పదగామినాం | సర్వాణ్యవావలీయంతే తథా జ్ఞానాని చేతసి || ఏవం సర్వమహింసాయాం ధర్మో೭ర్ధశ్చ మహీయతే | మృతః స నిత్యం భవతియోహింసాంప్రతిపద్యతే || అహింసకస్తతస్సమ్యగ్ధృతిమా న్నియతేంద్రియః శరణ్య ః సర్వభూతానాం గతిమాప్నోత్యనుత్తమామ్ || ఏవంప్రజ్ఞానతృప్తస్య నిర్భయస్య మనీషిణః | నమృత్యు రధికోభావః సో೭మృతత్వంచ గచ్ఛతి || విముక్తః సర్వసంగేభ్యోమునిరాకాశవత్‌స్థితః | విష్ణుప్రియకరఃశాంత స్తం దేవాబ్రాహ్మణం విదుః || జీవితంయస్యధర్మార్దం ధర్మో೭స్త్యర్థార్థమేవచ | అహోరాత్రాదిపుణ్యార్ధం తందేవా బ్రాహ్మణం విదుః || నివారితసమారంభం నిర్న మస్కార మస్తుతిం | అక్షీణం క్షీణ కర్మాణం తందేవా బ్రాహ్మణం విదుః || 337 సర్వాణిభూతాని సుఖంరమంతే సర్వాణి దుఃఖాని భృశంభవంతి ! తేషాంభవోత్పాదనజాతఖేదః కుర్యాత్తు కర్మాణిచ శ్రద్ధధానః 339 దానంహి భూతాభయదక్షిణాయా సర్వాణి దానాన్యధితిష్ఠతీహ | తీక్‌ష్ఱణం తనుం యఃప్రథమం జుహోతి సో೭నంతమాప్నోత్యభయం ప్రజాభ్యః || ద్విజభుక్త శేషము విఘసము. దేవతాసిద్ధిబాహ్యము. తనయాహారమేకోరువాడు దాంతుcడు. బహీరింద్రియముల నిగ్రహంచినవాడు సహనశీలుడు బహుసమర్ధుడు ఋత్విక్కులు పురోహితులు గురువులు మేనమామ అతిథులతో గూడియుండు వృద్ధులు బాలురు వైద్యులు జ్ఞాతులు సంబంధులు బంధువులు తల్లి దండ్రి అల్లుడు అన్నదములు కొడుకు భార్య కూతురులతో దాసవర్గముతో (నౌకరులు) తగవుపడరాదు. వీరితో వివాదపడనివాడు సర్వపాప విముక్తుడగును. వారే పైచేయిగాన్నున్నవాడు సర్వలోకముల గెలుచును. సందియములేదు. అతిధి సర్వలోకేశుడు. ఋత్విక్కువేదముల కాశ్రయుడు ప్రభువు. తల్లి అప్సరసలసమూహము, జ్ఞాతులు విశ్వేదేవులు (వైశ్వదేవికులు) సంబంధిబాంధవులు. చిక్కులందు తల్లి మేనమామలు భూమియందు, వృద్ధులు బాలురు ఆతురులు (బాధలలో నున్నవరు) ఆకాశమందు బుట్టినవారు పురోహితుడు ఋషిలోకప్రభువు. ఆశ్రితులు సాధ్యలోకాధిపతులు పైద్యు డశ్వలోకాధిపతి (అశ్వినీదేవతల లోకాధిపతి భ్రాత వసులోకపతి భార్య చంద్రలోకేశ్వరి. భార్య పుత్రుడు తనశరీరమే అగ్నులు ఇల్లులేనివాడు ఊరిలో బిచ్చమెత్తుకొనవలెను. మునిహృదయముతో (ఏలాటివిక్షేపములకులోనుగాక) రేపటిమాటయేమనుకోక లభించినదితిని యాహారనియమమూని ఒకసారి అన్నము దినవలెను. చేతకపాలముగ (పుర్రె) చెట్టుమొదలు చినుగుపాత ఒంటరితనము సర్వభూతములయెడ నుపేక్ష యిది భిక్షులక్షణము బిచ్చగానిలక్షణము. ఉత్తానమాస్యేన హవిర్జుహోతి అనంత మ్రాప్నోత్యభితః ప్రతిష్ఠాం | తస్యాంగ సంగాద భినిష్కృతంచ వైశ్వానరం సర్వమిదంప్రపేదే || ప్రాదేశమాత్రే హృది నిస్సృతం య త్తస్మిన్‌ప్రాణ నాత్మయాజీ జుహోతి | తస్యాగ్నిహోత్రం హుతమాత్మ సంస్థం సర్వేషులోకేషు సదైవతేషు || దేవంవిధాతుం త్రివృతం సువర్ణంయేవైవిదుస్తం పరమార్థభూతమ్ | తేసర్వభూతేషు మహీయమానా దేవాః సమర్థా అమృతం వ్రజంతి || వేదాంశ్చ వేద్యంచ విధించ కృత్స్న మథో నిరుక్తం పరమార్థతాంచ | సర్వం శరీరాత్మానియఃప్రవేద తస్యాభి సర్వేప్రచరంతి నిత్యమ్ || భూమావసక్తం దివిచాప్రమేయం, హిరణ్మయంతంచసమండలాంతే | ప్రదక్షిణం దక్షిణమంతరిక్షే యోవేద నాప్యాత్మని దీప్తరశ్మిః || ఆవర్తమానంచ వివర్తమానం షణ్ణమి యద్ధ్వాదశారం త్రిపర్వ | యస్యేదమాస్యం పరిపాతివిశ్వం తత్కాలచక్రంనిహితం గుహాయాత్ || యతఃప్రసాదం జగతః శరీరం సర్వాంశ్చలోకానధిగచ్ఛతీహ | తస్మిన్హిసంతర్ఫయతీహ దేవా న్సవైవి ముక్తో భవతీహ నిత్యమ్ || తేజోమయోనిత్యమతఃపురాణోలోకేభవత్యర్థభయాదువైతి || భూతాని యస్మా న్న భయంవ్రజంతి భూతేభ్యోయో నోద్విజేద్వా కదాచిత్ || అగర్హ ణీయో నచ గర్హతే೭న్యాన్సవై విప్రఃప్రవరంస్వాత్మనీక్షేత్ | వినీతమోహో೭ ప్యపనీతకల్మషో నచేహనాముత్రచయో೭ర్థమృచ్ఛతి || భీష్మ ! ఆలింపుము. మంగళమగు గాక నీకు. ప్రాపంచికదృష్టిగొని దీక్షాపూర్వకముగ నందుండి నివృత్తి మార్గముంబట్టి (వానప్రస్థధర్మమవలంబించి) పుణ్యతీర్థక్షేత్రములందు వసించువారికి దృఢప్రజ్ఞాసంపన్నులకు సత్యము శుచిత్వము ఓర్పుగలవారికి ఆయుర్ధాయములో మూడవభాగము వానప్రస్థాశ్రమ స్వీకారమున కర్హమైనది. (సుతవిన్యన్తపత్నీ కస్తయాం వానుగతో೭పిసన్=ధర్మపత్నిని పుత్రుల కప్పగించికాని లేక యామెవెంటనిడుకొనిగాని గృహస్థు వనమునకేగవలెనని శాస్త్రము సెప్పినది) అదే తృతీయాశ్రమమను పేరందినది. అపుడాతడు అవే యగ్నులను గృహస్థుగా పరిచరించిన యగ్నులనే ఆదేవతలనే పరిచరింపవలెను, (సేవింపవలెమ) ఆహారము ఆహారనియమము విష్ణుభక్తిగొని అగ్నిహోత్రమాత్రములయిన యజ్ఞాంగము లాచరింపవలెను. దున్నకుండ పండిన పంట ధ్యానము యవలు నీవార్గము (నెవరి) విఘసముగ=దేవతలకు హవిస్సుగా) గ్రీష్మఋతువునందు పంచయజ్ఞములందు నివేదింపవలెను. పంచయజ్ఞములు బ్రహయజ్ఞము దేవయజ్ఞము పితృయజ్ఞము భూతయజ్ఞము మనుష్య యజ్ఞము. ఈ చెప్పిన నాల్గువృత్తులు వానప్రస్థాశ్రమమందు గూడ సేయవలెనని స్మృతులు సెప్పినవి. వానప్రస్థు లప్పటికప్పుడు చేకూర్చుకొన్నదే తిందురు. కొందఱు నెలకు కొందఱు సంవత్సరము కొందఱు పండ్రెండేండ్లుదాక సమకూర్చుకొన్నది తిందురు. ఇదికూడ అతిథిపూజకొఱకు యజ్ఞతంత్రముకొఱకే చేయుదురు. తమకొఱకుగాదు. వర్షర్తువులో ఆరుబైట హేమంతములో నీటను గ్రీష్మమందు పంచాగ్ని మధ్యమున (పంచాగ్నులు) నాల్గుదిక్కులందు నాల్గు-ముందు సూర్యుడు. మొత్త మివి పంచాగ్నులు) వసింతురు. శరదృతువులో అమృతభోజను లగుదురు. (అమృతము=దేవతలకు అతిధులకు నివేదింపగా మిగిలినది) అయాచితము=అడుగుకొనకుండ లభించినది కూడా అమృతమే. నేలపైనే కూర్చుందురు దొర్లుదురు. మోగాళ్ళమీదనే కూర్చుందురు. బట్టపరచుకొని నేలమీదనే కూర్చుందురు. కొందఱు దంతోలూఖలులు [దంతములే రోలుగా గలవారు] నమిలి తినగలిగినదే తిందురు. అశ్మకుట్టులు-సన్నికలులోను ఱొలులోనోదంచినది తినువారు. శుక్లపక్షమందుకాగిన యవాగు=గంజినితావుదురు.కృష్ణపక్షములో తనంతదొరికినదితిందురు. గట్టివ్రతమూనికొందరు దుంపలు పండ్లు నీరుమాత్రమేతావుదురు. మొత్తముమీద వైఖానసే = వానప్రస్థమందు చేయువ్రతములరీతిలెన్నోగలవు. వైఖానసులు = వైష్ణవులు విష్ణుభక్తులనియు నర్థము గలదు. ఇంతవరకిది తృతీయాశ్రమ (వానప్రస్థ) లక్షణము. 341 అరోషమోహః సమలోష్టకాంచనః ప్రహీణశోకోగతసంధివిగ్రహః | అపీతనిందాస్తుతి రప్రియా ప్రియశ్చరన్సుదాసేన వదేవభిక్షుః || 342 :-సన్న్యాసాశ్రమవర్ణనమ్ :- అహోవీర్యస్తధా కామ్యః స్థాణు ర్మేధా తీధిర్బుధః | మనోవాకః శినీవాకః శూన్యపాలోకృతవ్రణాః || 343 ఏతేకర్మసువిద్వాంస స్తతః స్వర్గముపాగమన్ | ఏతేప్రత్యక్ష కర్మాణస్త ధాయా యావరాగణా ః || ఋషీణాముగ్రతపసాం ధర్మనైపుణ్య దశ్రినాం | సురేశ్వరం సమారాధ్య బ్రాహ్మణావనమాశ్రితాః || అపాస్యోపరతామాయాం బ్రహ్మణావనమాశ్రతాః | అనక్షత్రాస్తధా೭ధృష్యాదృశ్యన్తే ప్రోషితాగణాః || ఇక తురీయము (చతుర్థము) సన్న్యాసమను ఆశ్రమ లక్షణములు :- నాల్గవది జౌపనిషదమైనధర్మము. కేవలము జ్ఞానవిషయము. సన్న్యాసము-సర్వసాధారణము. :- సన్న్యాసాశ్రమ వైభవవర్ణనము :- కృతయుగమందే యీ చతుర్ధాశ్రమమును సర్వార్థదర్శనులు విప్రులు స్వీకరించిరి. వారు అగస్త్యులు మొదలు అకృణవ్రణులుదాకా పేర్కొనబడినారు. వీరందరు కర్మయోగమందు విద్వాంసులు స్వర్గమును కేగిరి. వీరు ప్రత్యక్షధర్ములు. అనగా ధర్మము - ధర్మఫలమైన స్వర్గాదులు దేవతలు అందఱు ప్రత్యక్షమయినవారు- అంటే యాయావరులను గణమందురు. బియ్యము మొదలైనవానిని ముష్టియెత్తికొని జీవింతురు. వారికి స్థిరనివాసము లేదు. ఇందుల కుదాహరణము జరత్కారుడనుముని. 346 జరయాతుపరిద్యూనాప్యాధినా పరిపీడితాః | చతుర్ధం త్వాశ్రమం శేషం వానప్రస్థా శ్రమాద్యయుః || 347 సద్యస్కరీసునిర్వాప్య సర్వవేద సదక్షిణాం | ఆత్మయాజీసౌమ్యమతిరాత్మ క్రీడాత్మసంశ్రయః || ఉగ్రతపస్వులు ధర్మసూక్ష్మమును బ్రత్యక్షముగ జూచినవారునగు ఋషులు యాయావరగణమువారు స్వర్గమునకు వచ్చిరి. వచ్చి సురేశ్వరుని (ఇంద్రుని) అర్చించి వనమునకుం జనిరి. అట మాయను దొలగించికొని బ్రహ్మనుపాసించుటకు వనమునాశ్రయించిరి. వానప్రస్థులైరన్నమాట. వారు నక్షత్రరూపమునగాక అదృశ్యులై ఎవరికి నోర్వరానివారై జోతిర్మండలమున జ్యోతిర్గణముగా అంతర్దృష్టులకు కనిపించుచుందురు. 348 ఆత్మన్యగ్నిం సమాధ్యాయత్యక్త్వా సర్వపరిగ్రహం | సద్యస్కశ్చ యజేద్యజ్ఞా నిష్టించై వేహ సర్వదా || సదేవయాజినాం యజ్ఞానాత్మనీజ్యాప్రవర్తతే | త్రీనేవాగ్నీం స్త్యజేత్సమ్య గాత్మన్యే వాత్మ నాక్షణాత్ || ప్రాప్నుయా ద్యేనవా యచ్చ తత్ప్రాశ్నియా దకుత్సయన్ | కేశలోమనఖాన్న్యస్యేద్వానప్రస్థాశ్రమే రతః || 351 ఆశ్రమాదాశ్రమంసద్యః పూతేగచ్ఛతి కర్మభిః | అభయం సర్వభూతేభ్యోయోదత్వా ప్రవ్రజే ద్ధ్విజః || ముదిమిచే జిక్కి వ్యాధిపీడితులై కొందఱుఋషులు వానప్రస్థాశ్రమమునుండి మిగిలియున్న చతుర్ధాశ్రమము నొందిరి. :- సన్న్సాసాశ్రమస్వీకారవిధివర్ణనము -: సద్యస్కారి=అప్పటికప్పుడేదిప్రస్తుతమో అదే యా యుపాసనయందు సర్వవేదసంపన్నము సదక్షిణముగ యజ్ఞకలాపమంత యథావిధి నిర్వహించి, మంచిమనస్సుతో (మనశ్శుద్ధినొంది) ఆత్మయాజి - తనయందతాను యజించుకొని ఆత్మారాముడై (తనయందతాన విహరించుచు) లననుదానయాశ్రయించి తనయంద అగ్నిని అధానించి (ఉంచి) ఎల్లపరిగ్రహములను త్యజించి సద్యస్కుడై అప్పటికేదిప్రస్తుతమో అదేచేయు యీలోకమందయెల్లపుడు యజ్ఞములను ఇష్టిని యజింపవలెను. ఎల్లపుడు యజ్ఞములాచరించినవారికే ఆత్మయజ్ఞము ప్రవర్తించును. ఆత్మయందాత్మచేత్రేతాగ్నులను క్షణములో జక్కగ యజింపవలెను. ఆలాటి జ్ఞాని యెవనిచేత నేదిలభించు నదే ఏవగించక తినవలెను. వానప్రస్థాశ్రమరతుడు జుట్టు రోమములు గోళ్ల నాలాగే ఉంచవలెను. ఈలా కర్మానుష్ఠానముచే నప్పటికప్పుడు పవిత్రుడై యొకదానివెంట నొకటి యాశ్రమముస్వీకరించిన యతడు సర్వభూతముల కభయమిచ్చిన ద్విజుడు ప్రవ్రాజనము సేయవలెను. సన్న్యాసాశ్రమస్వీకారము సేయవలెనన్నమాట. 352 లోకాస్తేజోమయాస్తస్య ప్రేత్యచానంత్య మశ్నుతే | సుశీలవృత్తోవ్యపనీత కల్మషోనచేహనాము త్రచరంతు మీహతే || అరోషమోహోగత సంధివిగ్రః సచేదుదానీనవదాత్మచింతయా | యమేనచై వాన్యగతేనవ్యధః స్వశాస్త్రశూన్యో హృదినాత్మ విభ్రమః || భ##వేద్యథేష్టా గతిరాత్మయాజినీ నిస్సంశ##మే ధర్మపరే జితేంద్రియే | అతఃపరం శ్రేష్ఠమతీవసద్గుణౖరధిష్టితం త్రినితవర్ధచాశ్రమాన్ || 355 చతుర్థముక్తం సరమాశ్రమం శృణుప్రకీర్త్యమానం పరమంపరాయణం | ప్రాప్యసంస్కారమేతాభ్యామాశ్రమాభ్యాం తతఃపరమ్ || -: క్రమప్రాప్త చతురాశ్రమువైభవవర్ణనము :- ఈలా క్రమముగ బ్రహ్మచర్యాద్యాశ్రమ ధర్మములను నిర్వహించి తురీయాశ్రమియైనతడు తేజోమయ లోకమంతు లేకుండ యనుభవించును. మంచిశీలము నడవడిగలిగి కల్మషము వెడలి నత డిహమందు పరమందేదియు కోరడు. రోషము మోహము నుండవు. పేచీపూచీలుండవు. ఆత్మచింతనసేయుచు దటస్థుడైయుండును. ఇంద్రియములదుపులోనున్నను నూరేగించుచున్నను వ్యథయుండదు. ఇది నాశాస్త్రము. ఇందు నేను బండితుడనను నదుండదు. ఆత్మనిష్ఠయెడ తొట్రుపాటుండదు. ఆత్మయాజియగు నాతనికి సంశయములెడలి ధర్మపరుడై యింద్రియములదుపులోనున్న యాతనికి స్వేచ్ఛాసంచారమేర్పడును. 356 యత్కార్యం పరమాత్మార్థం తత్వమేకమనాఃశృణు | కాషాయంథారయిత్వాతు శ్రేణీస్థానేషుచాత్రిషు || 357 యోవ్రజేచ్చపరంస్థానం పారివ్రాజ్యమనుత్తమం | తద్భావనేన సంన్యస్యవర్తనం శ్రూయతాం తధా || ఏకఏవచరేద్ధర్మం సిద్ధ్యర్థమసహాయవాన్ | ఏకశ్చరతియః పశ్యన్న జహాతినహీయతే || అనగ్నిరనికేతస్తుగ్రామం భిక్షార్థమాశ్రయేత్ | అశ్వస్త నవిధానః స్యాన్మునిర్భావసమన్వితః || లఘ్వాశీనియతాహారః సకృదన్నం నిషేవయేత్ | కపాలం వృక్షమూలాని కుచేల మసహాయతా || ఉపేక్షాసర్వభూతానామేతావద్భిక్షులక్షణం | యస్మిన్‌వాచః ప్రవిశంతికూపేప్రాప్తామృతా ఇవ || 362 నవక్తారం పునర్ధాంతి సకైవల్యాశ్రమేవసేత్ | నైవపశ్యేన్న శృణుయాదవాచ్యం జాతుకస్యచిత్ || 363 -: సన్న్యాసాశ్రమప్రశంస :- ఈపైని నెంతేని శ్రేష్ఠము గుణసంపన్నమాశ్రమములు మూ డిన్నింటిపైది నాల్గవయాశ్రమము పరమపరాయణము. నాల్గవయాశ్రమముగూర్చి ప్రశంస నాలింపుము. ఈగృహస్థవాన ప్రస్థానములద్వారా సంస్కారమంది యాపైని యాత్మకొఱకైన తత్త్వము నొక్కమనసునవినుము. -: ఖిక్షుల క్షణవర్ణనము :- మూడువర్ణాశ్రమముల గుర్తులుగ శ్రోణీస్థానములందు [రెండుపిరుదులునడుమ] కాషాయముగట్టుకొని ఆ మీదిస్థాన ముత్త మపారివ్రాజ్యము సన్న్యాసము కూర్పవలెను. ఆలాటిభావముతో సన్న్యసించి వర్తించుటనువినుము. ధర్మముకొఱకు సహాయముగొనక వర్తింపవలెను. ఊరకచూచు చొక్కడైవర్తించు నతడు దేనిని విడువ డంటు వడడు. దిగులుపడడు. అగ్నులు విడిచి యిల్లువాకిలివిడిచి భిక్షకొఱకు గ్రామమున కేగవలెను. భావముగొని [అంతః కరణశుద్ధిగ] ముని రేపటిమాటేమనకుండ యుండవలెను. కొలదిగతిని యాతినునదైన నియమమనుసరించి తినవలెను. భిక్షార్థము కపాలము, ఉనికికి చెట్లమొదళ్లు మేనికి చినుగుపాతయుంగొని తోడులేకుండ యుండ వలెను. ఆన్నిభూతములయెడ ఉపేక్ష (తటస్థభావము) ఇది భిక్షులక్షణము. 363 బ్రాహ్మణానాం విశేషేణనైతద్భూయాత్కధంచన | యద్బ్రాహణస్యాను కూలంతుదేవ సతతం వదేత్ || 364 తూష్ణీమాసీతనిందాయాంకుర్వన్‌భైషజ్యమాత్మనః | యేనపూర్ణమివాకాశం భవత్యేకేన సర్వదా || అన్యంయేన సమాకీర్ణం తందేవా బ్రాహ్మణం విదుః | యేన కేనచిదాచ్ఛన్నొ యేనకేన చిదాశితః || 366 యత్రక్వచనశాయీచతందేవా బ్రాహ్మణంవిదుః | అహేరివ జనాద్భీతః సుహృదో నరకాదివ || 367 కృపణాదివ నారీభ్యస్తందేవా బ్రాహ్మణం విదుః | నహృష్యేతవిషీదేతమానితో೭మానితస్తధా || 368 సర్వభూతేష్వభయదస్తందేవా బ్రాహ్మణం విదుః | 369 నాభినందేతమరణం నాభినందేతజీవితం | కాలమేవనిరీక్షేతనిర్ధేశం కృషికోయధా || 370 అనభ్యాహతచిత్తశ్చ దాంతశ్చాహతధీస్తధా | విముక్తః సర్వపాపేభ్యోనరోగచ్ఛే త్తతో దివమ్ || అభయం సర్వభూతేభ్యో భూతానామభయం యతః | తస్యదేహ విముక్తస్య భయంనాస్తి కుతశ్చన || యధానాగపదే೭న్యాని పదాని పదగామినాం | సర్వాణ్యవావలీయంతే తధాజ్ఞానాని చేతసి || ఏవం సర్వమహింసాయాం ధర్మో೭ర్ధశ్చ మహీయతే | మృతః స నిత్యం భవతి యో హింసాం ప్రతిపద్యతే || అహింసక స్తతః సమ్య గ్ధృతిమాన్ని యతేంద్రియః | శరణ్యస్సర్వభూతానాం గతిమాప్నో త్యనుత్తమామ్ || 375 ఏవంప్రజ్ఞానతృప్తస్య నిర్భయస్య మనీషిణః | నమృత్యు రధికోభావః సో೭మృతత్వంచ గచ్ఛతి || విముక్తః సర్వసంగేభ్యో మునిరాకాశవత్‌స్థితః | విష్ణుప్రియకరః శాంత స్తం దేవా బ్రాహ్మణం విదుః || జీవితంయస్యధర్మార్థం ధర్మో೭ప్యర్థార్థమేవచ | అహోరాత్రాదిపుణ్యార్థం తం దేవా బ్రాహ్మణం విదుః నివారితసమారంభం నిర్నమస్కార మస్తుతిం | అక్షీణం క్షీణకర్మాణంతం దేవా బ్రాహ్మణం విదుః || 379 -: ఉత్తమబ్రాహ్మణలక్షణము : నూతిలోజొచ్చిన నీళ్ళట్లు, ఎవనియందాడిపోసినమాటలు జొచ్చి యాయన్న వానినితిఱిగిపోవునో అతడు కైవల్యాశ్రమమందుండును. అనగా నిందకు ప్రతినిందచేయకుండుట యుత్తమలక్షణమన్నమాట. అవాచ్యుని=పేరైన చెప్పగూడని అపాత్రుని కన్నెత్తి చూడరాదు. వానిపేలాపన లెప్పుడు వినరాదు. బ్రాహ్మణునికిది యేమాత్రముపనికిరాదు. బ్రాహ్మణునికేది యనుకూలమో అదే మాట్లాడవలెను. ఒకవేళ నిందింపవలసివచ్చినను ఎవరేనివారి నిందించుచున్నను తనకుదా వైద్యము సేసికొని మందుతినినట్లు మాటాడక నూరక గూర్చుండవలెను. ఎల్లపుడు నెవ్వనియునికిచే నాకాశమట్లు నిండుకొనియుండు నెవడులేకున్న శూన్యమగునో యాతనిం బ్రాహ్మణుడని తెలియుదురు. ఏదో చలికి పైగప్పుకొనువాడు ఏదో ఆకలికిదినువడు ఎక్కడనోపండుకొనువాడునైన వానిని బ్రాహ్మణుడని దేవతలెఱుంగుదురు. పామునకట్లు జనమునకు, నరకమునకట్లు జనమున, బికారికట్లు స్త్రీలకు, హడలిపోవువానిని దేవతలు బ్రాహ్మణుడని గుర్తింతురు. పొగడినంబొంగడు తెగడినంగ్రుంగడు. అన్ని భూతములకు నభయమిచ్చువాడు బ్రాహ్మణుడని దేవతలు గుర్తింతురు. చావును మెచ్చడు. బ్రతుకును మెచ్చడు. కూలివాడు నిర్దేశము=కూలి కట్లు కాలమున కెదురుచూచును. మనసు దెబ్బతిననివాడు ఇంద్రియముల నదుపులో బెట్టుకొన్న వాడు బుద్ది [తెలివి] తప్పనివాడు సర్వపాపవిముక్తుడై యామీదస్వర్గమునకేగును. ఏ భూతములవలన భయపడనివాడు ఎల్లభూతములకభయమిచ్చువాడు దేహబంధమునుండి ముక్తుడగును. [విదేహముక్తి నందును] అట్టివానికి దేనను భయముండదు. ఏనుగడుగులో పదాతుల [నడచువారి] యడుగులన్నియు నిమిడినట్లు అన్నిజ్ఞానములు జ్ఞానియందు లీనములగును. ఈలాగే ధర్మము అర్థము ననుపురుషార్థములు ఒక్కఅహింపయందు రాణించును. నిత్యము హింసచేయువాడు చచ్చినవానితో లెక్కగును. అందువలన అహింసకుడు మంచిధైర్యము నింద్రియ నిగ్రహముకలవాడునై సర్వభూతశరణ్యుడై పరమోత్తముగతినందును. ఈలాటి ప్రజ్ఞానముచే దృప్తినొందువానికి నిర్భయునకు జ్ఞానికి చావన్నదొకపెద్దవిషయము గాదు. అతడమృతత్వమందితీరును. అన్ని సంగములు [అంటులు] వదల్చుకొని యచ్చమగు నాకాశ మట్లున్నముని శాంతుడై యున్న యాతనిని బ్రాహ్మణుడని దేవతలు గుర్తింతురు. 379 సర్వాణి భూతాని సుఖం రమంతే సర్వాణి దుఃఖాని భృశం భవంతి | తేషాం భవోత్పాదన జాతఖేదః కుర్యాత్తు కర్మాణిచ శ్రద్ధదానః || దానం హి భూతాభయదక్షిణాయాః సర్వాణి దానా న్యధితిష్ఠ తీహ | తీక్‌ష్ణేతు నం యః ప్రధమం జుహోతి సో೭నం మాప్నోత్య భయం ప్రజాభ్యః 381 ఉత్తాన ఆస్యేతుహవిర్జుహోతి అనంతమాప్నోత్యభితః ప్రతిష్ఠాం | తస్యాంగసంగా దభినిష్కృతంచ వైశ్వానరం సర్వమిదం ప్రపేదే || 382 ప్రాదేశమాత్రం హృదభిస్రుతం యత్తస్మిన్ప్రాణనాత్మయాజీ జుహోతి | తస్యాగ్నిహోత్రే హుతమాత్మసంస్థే సర్వేషులోకేషు చదైవతేషు || 383 దేవం విధాతుం త్రివృతం సువర్ణం యేవై విదుస్తంపరమార్థభూతం | తేసర్వభూతేషుమహీయమానాదేవాః సమర్ధా అమృతం వ్రయాంతి || 384 వేదాంశ్చ వేద్యంచ విధించ కృత్స్నమథోనిరుక్తం పరమార్థతాంచ | స ర్వం శరీరాత్మనియః ప్రవేద తస్యాభి సర్వేప్రచరంతిని త్యమ్ || భూమావసక్తం దివిచా ప్రమేయం హిరణ్మయంతంచ సమండలాంతే | ప్రదక్షిణం దక్షిణ మంతరిక్షే యోవేదసో೭ప్యాత్మని దీప్తరశ్మిః 386 -: బ్రాహ్మణధర్మసూక్ష్మములు :- సర్వభూతములు సుఖముగ క్రీడించును. సర్వదుఃఖములు వానంతట గల్గుచుండును. వానికి జన్మ [పుట్టుక] నిమిత్తమైన ఖేదము తప్పదు. అందులకు శ్రద్ధతో విధివిహిత కర్మములు సేయవలసినదే. సర్వభూతముల కభయమిచ్చుటయను దక్షిణతో జేసినదానము సర్వదానములవైది. ఎవడు ముందు తీక్‌ష్ణమును (కోపోద్రిక్తమును) శరీరమును మొదట హోమముసేయునో యతడు ప్రజలనుండి యంతులేని యభయముంబొందును. పైకెత్తిననోటిలో నెవడు హవిస్సును (అన్నాదులను)పైశ్వానరాగ్నిలో హోమము సేయునో యతడనంత ప్రతిష్ఠనందును. వైశ్వానరాగ్నిని (జఠరాగ్నిని= ఆకలిచ్చును) బొందునదే యీయెల్లసృష్టియును ప్రాదేశ మాత్రమైన హృదయమునుండి వెడలు ప్రాణమునందు ఆత్మయాజి హోమము సేయును. అతడాత్మరూపమగు అగ్ని హోత్రమునందు సర్వముహోమము జేసినట్లేయగును. త్రివృత్తము త్రిసుపర్ణము అను రెండుమంత్రములు పరాయతము ఉదకశాంతిలోవాడేమంత్రములు. ఆబ్దికమంత్రములో బ్రహ్మమేతుమే అని 'త్రిసుపర్ణం బ్రాహ్మణాయ తదద్యాత్' అని ఉన్నది. ఇందు మొదటిమంత్రము వీరహత్య (అగ్నిహోత్రములుమానివేసిన మహాపాపమును) రెండవది బ్రహ్మహత్యను (బ్రాహ్మణుని చంపిన మహాపాపమును) హరించును. ఈరహస్యమును తెలిసికొని యెవరు ఈమంత్రములయొక్క పరమార్థమైన భగవంతుని తెలిసికొందురో వారుసర్వసమర్థులైన దేవతలై సర్వభూతముల యందు పరమోన్నతస్థాయిలో తేజరిల్లుదురు. ఆవర్తమానంచ వివర్తమానం షణ్ణమి య ద్ద్వాదశారంత్రిపర్వ | యస్యేదమాస్యం పరిపాతి విశ్వం తత్కాలచక్రం నిహితంగుహాయామ్ || యుతః ప్రసాదం జగతః శరీరం సర్వాం శ్చలోకానధిగచ్ఛతీహ | తస్మిన్హి సంతర్పయతీహదేవాన్‌సపై విముక్తో భవతీహ నిత్యమ్ || తేజోమయో నిత్యమతః పూరాణోలోకే భవత్యర్థ భయాదువైతి | భూతాని యస్మాన్నభయం వ్రజంతి భూతేభ్యో యోనేద్విజతే కదాచిత్ || 389 అగర్హణీయోనచ గర్హతేషః న్యాన్సవైవిప్రః ప్రవరంస్వాత్మనీక్షేత్ | వినీతమోహో వ్యపనీత కల్మన చేహ నాముత్రచయో೭ర్దమృచ్ఛతి || 390 ఆరోషమోహః సమలోష్టకాంచనః ప్రహీణశోకోగతసంధి విగ్రహః | అపేతనిందాస్తుతి ర ప్రియప్రియశ్చరన్ను దాసీనవదేవశిక్షుః || 391 ఇతి శ్రీ పద్మపురాణ ప్రథమే సృష్టిఖండే పుష్కరక్షేత్ర మాహోత్మ్యంనామ పంచదశో೭ధ్యాయంః. భూమినంటడు. దివమున (ఆకాశమునందు) హిరణ్మయుడగు పురుషుడు, జ్యోతిర్మండలములన్నిటిమీదనుండి యూహకందడు నిత్యము ప్రదక్షిణము తిరుగు కేవలము వేదవిహిత విజ్ఞానముచే దెలియదగినవాడై తేజరిల్లు కిరణములతో దిరుగుచు వెనుదిరుగుచు అఱులంచులు[ఆఱుఋతువులు] ద్వాదశారములు (ద్వాదశ+అరలు [పండ్రెండు మాసములు] త్రిపర్వ=మూడు పర్వలు గల యెవనికాలచక్రము [కాలరూపచక్రము] ఈవిశ్వమును రక్షించుచున్నదో గుహమందుంచబడినది అనగా వేదముయొక్కపరమనిగూఢ రహస్యమువేదములారింటి కల్పములో నొకకల్పముచే దెలియదగియున్నది. ఆ హిరణ్మయపురుషునియొక్క ప్రసాదమే యీ జగత్తెల్ల [జాయతే గచ్ఛతీతి జగత్ - పుట్టును గిట్టును కావున నీది జగత్తని నిర్వచనము] ఆయన శరీరము [శీర్యత ఇతి శరీరమ్=నశించునది] ఆతత్త్వము సర్వలోకముల నధిగమించియున్నది. ఆ ఏకైక పురుషునందు [తత్త్వమునందు] దేవతలనందఱ నెవ్వడీలోకమందు సంతర్పించును [హవిరాదులచే దృప్తిపరచు] అతడిక్కడనే నిత్యముక్తుడగును. ఆతడు తేజోమయుడై నిత్యుడై పురాణపురుషుడై అర్ధభయమునుండి విడివడును. ఇంద్రియార్థములయిన విషయములు వానిని వేధింపవన్నమాట. ఆతనికెన్నడు భూతములు వెఱువవు. ఆతడు భూతములకు వెఱువడు. ఎవరిచే నిందింపబడడు. ఎవరిని నిందింపడు. ఆసహ్యించుకొనబడడు. విప్రుడత డాత్మయందు బరమాత్మను దర్శించును. మోహము నడచి కల్మషములుడిగి ఇహ పరములం దపేక్షలేక రోషముగొనక మంటిపెళ్ల బంగారమొక్కటిగనే శోకముడిగి సంధివిగ్రహములు పేచీ పూచీలు పొగడికతెగడికలు ప్రియము నప్రియమనునవిలేక ఉదాసీనుడై భిక్షువై సంచరించును. ఇది శ్రీ పద్మపురాణమందు సృష్టిఖండమున పుష్కరక్షేత్రవాసమాహాత్మ్యమను పదునైదవయధ్యాయము.