Sri Padma Mahapuranam-I
Chapters
పదునాఱవ అధ్యాయము భీష్మ ఉవాచ : -:బ్రహ్మ దేవకృతయజ్ఞవర్ణనమ్:- యదేతత్కథితం బ్రహ్మ స్తీర్ఠ మహాత్మ ముత్తమం | కమలస్యాభిపాతేన తీర్థం జాతం ధరాతలే || 1 తత్రస్థేన భగవతా విష్ణునా శంకరేణచ | యత్కృతం మునిశార్దూల తత్సర్వం పరికీర్తయ || 2 కథం యజ్ఞో హి దేవేన విభునా తత్రకారితః | కే సదస్యా ఋత్విజశ్చ బ్రాహ్మణాః కేసమాగతాః || 3 కేభాగాస్తస్య యజ్ఞస్య కిం ద్రవ్యం కాచదక్షిణా | కా వేదీ కిం ప్రమాణంచ కృతం తత్ర పిరించినా || యోయాజ్యః సర్వదేవానాం వేదైః సర్వత్ర పఠ్యతే | కంచకామ మభిధ్యాయన్ వేధా యజ్ఞం చకారహ || యథాసౌ దేవదేవేశో హ్యజర శ్చామర శ్చహ | తథాచైవాక్షయః స్వర్గ స్తస్య దేవస్య దృశ్యతే || అన్యేషాంచైవ దేవానాం దత్తః సర్వో మహాత్మనా | అగ్నిహోత్రార్థముత్పన్నా వేదా ఓషధయ స్తధా || 7 యేచాన్యేపశవోభూమౌ సర్వేతే యజ్ఞకారణాత్ | సృష్టాభగవతానేన ఇత్యేషా వైదికీ శ్రుతిః || తదత్రకౌతుకం సర్వం శ్రుత్వేదం తవభాషితం | యంకామ మధికృత్యైకం యత్పలం యాంచభావనామ్ || కృతశ్చానేన పైయజ్ఞః సర్వం శంసితు మర్హసి || శతరూపాచ యానారీ సావిత్రీ సా త్విహోచ్యతే || 10 భీష్ముడు పులస్త్యునితో ననియె. బ్రహ్మా ! కమలము పైనుండిపడి తీర్థమేర్పడినదని చెప్పినావు. ఆ తీర్థము యొక్క ప్రభావమేమి ? అటనున్న భగవంతుడు విష్ణువు శంకరుడు నేమి సేసిరి? బ్రహ్మయట యజ్ఞమును నెట్లు సేసెను? అందు సదస్యులు ఋత్విజులు వచ్చిన బ్రాహ్మణులు, యజ్ఞభాగము ద్రవ్యము దక్షిణ యజ్ఞవేది కొలత యజింపబడు ముఖ్యదేవతలెవరని వేదము సెప్పినది? కోరికయేమికోరి బ్రహ్మ యజ్ఞమొనరించెను. దేవదేవుడు ముదిమి మృతిలేనివాడై అక్షయస్వర్గమందినట్లు కనబడుచున్నది. అంతేకాదు మఱి యితరదేవతలకును నామహానుభావుడు స్వర్గమిచ్చెను. వేదములు ఓషధులు పశువులు భూమియందు యజ్ఞము నిమిత్తంగా సృజించబడినవని శ్రుతి వినవచ్చును. ఈ విషయములను గూర్చి నీమాటలువిన గుతూహలమొందితిని. ఇంకొకటి యీ యజ్ఞమందాయకోరిక యేమి? ఫలమును ఆయన భావనయును ముచ్చటింపుము. 10 భార్యాసా బ్రహ్మణఃప్రోక్తా ఋషిణాం జననీ చ సా | పులస్త్యా ద్యా స్మునీన్సప్త దక్షాద్యాంశ్చ ప్రజాపతీన్ || 11 స్వాయంభువాదీంశ్చమనూన్ సావిత్రీ సమజీజనత్ | ధర్మపత్నీంతు తాంబ్రహ్మా పుత్రిణీ మాత్మనః ప్రియమ్ || పతివ్రతాం మహాభాగాం సువ్రతాం చారుహాసినీం | కథం సతీంపరిత్యజ్య భార్యామన్యా మవిందత || కింనామ్మీ కిం సమాచారా కస్య సా తనయా విభోః | క్వసా దృష్టా హి దేవేన కేనచాస్య ప్రదర్శితా || కింరూపా సాతుదేవేశ దృష్టా చిత్త విమోహినీ | యాంతుదృష్ట్వా సదేవేశః కామస్య వశ##మేయివాన్ || యథాగృహీతవాన్‌దేవో నారీం తాం లోకసుందరీం | యధాప్రవృత్తో యజ్ఞో೭సౌ తథాసర్వం ప్రకీర్తయ || తాం దృష్ట్వా బ్రహ్మణః పార్శ్వే సావిత్రీ కించకారహ | సావిత్ర్యాంతు తదా బ్రహ్మ కాంతువృత్తి మవర్తత || సన్నిధౌకానివాక్యాని సావిత్రీబ్రహ్మణాతదా | ఉక్తాప్యుక్తవతీభూయః సర్వం శంసితు మర్హసి || కింకృతంతత్ర యుష్మాభిః కోపోవాధ క్షమాపివా | యత్కృతం తత్రయద్ధృష్టం యత్తవోక్తం మయాత్విహా 19 విస్తరేణహకర్వాణి సర్వాణి పరమేష్ఠినః | శ్రోతుమిచ్ఛా మ్యశేషేణ విధే ర్యజ్ఞ విధిం పరమ్ || 20 శ్రోతు మిచ్ఛామ్యశేషేణ విధేర్యజ్ఞ విధింపరమ్ | కర్మణా మాను పూర్వంచ ప్రారంభోహోత్ర మేవచ || 21 హోతుర్భక్షో య ధార్చాపి ప్రథమాకస్యకారితా ! కథంచ భగవాన్ విష్ణుః సాహాయ్యం కేనకీదృశం || 22 అమరైర్వాకృతం యచ్ఛ తద్భవాన్ వక్తుమర్హతి || 23 శతరూప యనునావిడ యిట సావిత్రిగా పేర్కొనబడినది. బ్రహ్మకామె ధర్మపత్ని యని చెప్పబడినది. పులస్త్యాది సప్తమునులను దక్షాది ప్రజాపతుల నామెకన్నది. బ్రహ్మ తనపుత్రిని తనకెంతోకూర్చుదానిని ఆమెను ధర్మపత్నిగా జేకొనెను. పతివ్రత మహానుభావురాలు చక్కని చిఱునవ్వు గలది వ్రతనిష్ఠకలది. తొలుతటిభార్యను సాధ్విని విడిచి యింకొకయామెనెట్లుపొందెను? ఆమె పేరు ఆమె సమాచార మేమి ? ఏవిభునికూతురు? బ్రహ్మ కామె యెక్కడ గనబడెను? ఆయనచిత్తము మోహింపజేసినది. ఆమెంగని యాయన కామవశుడయ్యెను. లోకసుందరినామెను జేపెట్టెను. యజ్ఞమప్పుడెలా సాగినదో వర్ణింపుము. అదిసరే, బ్రహ్మ ప్రక్కనామెంజూచి సావిత్రి యేమిచేసినది ? బ్రహ్మ యామెయెడ బ్రవర్తించిన తీరేమి! దాపుననున్న నామెతో బ్రహ్మయన్న మాటలు ఆమె యన్న మాట లదెల్ల దెల్పనగుదువు. అప్పుడు మీరేమి సేసినారు ? కోపమా ? ఓరిమియా ? మీరు చేసినదేమి ? చూచినదేమి ? నేనన్న, యీయంతయు సవిస్తరముగ తెలుపుడు. బ్రహ్మపనులన్నీ, యాయన యజ్ఞవిధిని పూర్తిగ వినగోరెద. మఱియు నా యజ్ఞాచరణముల యొక్క ఆనుపూర్వి(క్రమము) మొదలు హోత్రము (హోమప్రక్రియ) హోతయొక్క యాహారము, మొదటి యర్చన యెవరికెలా జరుపబడినది? విష్ణుభగవానుడే సహాయమెట్లు సేసెను? దేవతలెవరేవిధముగా సాయమైరది యెల్ల ఆనతీదగుదువీవు. 23 దేవలోకంపరిత్యజ్య కథం మర్త్య ముపాగతః | గార్హ పత్యంచ విధినా అన్వాహార్యం సదక్షిణాం || 24 అగ్ని మావహనీయంచ వేదీంచైవ తథాస్రువమ్ | ప్రోక్షణీయం స్రుచంచైవ ఆవభృథ్యం తధైవచ || 25 అగ్నీంస్త్రీంశ్చ యథాచక్రే హవ్యభాగవహాన్హివై | హవ్యాదాంశ్చ సురాంశ్చక్రే కవ్యాదాంశ్చ పితౄనపి || 26 భాగార్థం యజ్ఞవిధినా యే యజ్ఞాయజ్ఞ కర్మణి ! యూపాన్సమిత్కుశం సోమం సవిత్రం పరిధీనపి || 27 యజ్ఞియానిచ ద్రవ్యాణి యథాబ్రహ్మా చకారహ | విబభ్రాజపురాయశ్చ సారమేష్ఠ్యేన కర్మణా|| 28 క్షణం నిమేషాః కాష్ఠాశ్చ కలా సై#్త్రకాల్య మేవచ | ముహుర్తా స్తి థయో మాసా దినం సంవత్సరస్తథా || ఋతవః కాలయో శ్చ ప్రమాణం త్రివిధంపురా | ఆయుఃక్షేత్రాణ్యపచయం లక్షణం రూపసౌష్టవమ్ || త్రయోవర్ణాస్త్రయోలోకా సై#్త్రవిద్యం పావ కా స్త్రయః | త్రైకాల్యం త్రీణికర్మాణి త్రయోవర్ణా స్త్రయోగుణః || స్పష్టాలోకాః పరాః స్రష్ట్రా యోచాన్యే೭నల్పతేజసా | యాగతిర్ధర్మయుక్తానాం యాగతిఃపాపకర్మణామ్ || చాతుర్వర్ణ్యస్య ప్రభవ శ్చాతుర్వర్ణ్యస్య రక్షితా | చాతుర్విద్యస్య యో వేత్తా చతురాశ్రమ సంశ్రయః || 33 యఃపరంశ్రూయతే జ్యేతిర్యః పరంశ్రూయతే తపః | యఃపరం పరతఃప్రాహ పరంయః పరమాత్మవాన్ || 34 అనుభూతశ్చభూతానా మగ్ని భూతో೭గ్ని వర్చసాం | మనుష్యాణాం మనోభూత స్తపోభూతస్తపస్వినామ్ || 35 వినయోనయవృత్తీనాం తేజస్తేజస్వినామపి | ఇత్యేత త్సర్వ మఖిలాన్సృజన్ లోకపితామహః 36 యజ్ఞా ద్గతీం కామయన్వై చ్ఛ త్కథం యజ్ఞేమితిః కృతా | ఏషమే సంశయోబ్రహ్మ న్నేషమే సంశయః పరమ్ || 37 ఆశ్చర్యః పరమోబ్రహ్మా దేవైర్దైత్యైశ్చ పఠ్యతే | కర్మణాశ్చర్యభూతో೭పి తత్త్వతః సఇహోచ్యతే || 38 దేవలోకమునుండి మానవలోకమునకేల వచ్చెను? గార్హపత్యము అన్వాహార్యము (ఆహవనీయము) దాక్షిణాగ్నిని (త్రేతాగ్నులను) వేది స్రుచము (సుష్క) స్రువము ప్రోక్షణ అవబృథ్యమును (యజ్ఞదీక్షాసమాప్తియందు జేయు అవబృథస్నానమునకు సంబంధించిన సామాగ్రి) నెట్లు సమకూర్చెను? హవ్యమునారగించు దేవతలను కవ్యములను భుజించు పితృదేవతలను భాగార్థ మెవరెవరి నాహ్వానించెను? ఈ యజ్ఞీయద్రవ్యవిభాగమాయన తామ పరమేష్ఠి స్థానమలంకరించుటకింతమున్ను జేసిన యజ్ఞవిధానమందే విభజించెను. ఆపైని క్షణములు నిమేషములు కాష్ఠలు కళలునను త్రికాలవిభాగములను ముహూర్తములు తిథులు మాసములు దినములు సంవత్సరము ఋతువులు త్రివిధమగు కాలముల (పగలు రాత్రి సంధ్య) అను మూడువిధ కాలముల ఘటికాప్రమాణము ఆయువు క్షేత్రములు (ఉపాధులు) అపచయము అక్షణము రూపసౌష్ఠవము మూడువర్ణాలు మూడులోకాలు మూడుపావకములు (అగ్నులు) మూడు గుణములు (సత్వ రజ స్తమోగుణములు) మొదలగు త్రివిధ పరలోకము లింక నాయా త్రివిధ బిభాగమును దన దివ్యతేజస్సుచే నాస్రష్ట (సృష్టికర్త) యెట్లు సేసెను? ధర్మాత్ములకును పాపాత్ములకును నాతడేగతి. చతుర్వర్ణ వ్యవస్థ మూలపురుషుడు రక్షకుడు పరంజ్యోతి యని వినబడు (శ్రుతులు) పరమతపస్సు పరాత్పరము చతురాశ్రమముల కాధారము పరమాత్మయని శ్రుతులేనిం బేర్కొన్నవి. భూతములకు ప్రాణము, అగ్ని, తేజస్సులకు అగ్ని మనుష్యులకు మనస్సు తపస్వులలో తపస్సు వినయశీలురలో వినయగుణము తేజశ్శాలురలో తేజస్సు తానై యీయెల్ల తాను సృజించు లోకపితామహుడు ఆ మహామహుడు యజ్ఞమువలన గతినిగోరి యజ్ఞసంకల్ప మెందులకు జేసెను? ఇది నా సంశయ మింతకుమించినదిలేదు. దేవతలు దైత్యులు పరమాశ్చర్యమూర్తి బ్రహ్మయని స్తోత్రపాఠములు సేయుదురు. చేతలను వింతయైనవాడే. తత్త్వమును బట్టి సత్యమైన వేదవాణి యాయనను బరతత్త్వముగానే పేర్కొనెను. 38 పులస్త్యుడనియె: ప్రశ్నభారో మహానేష త్వయోక్తో బ్రహ్మణశ్చయః | యథాశక్తిస్తు వక్ష్యామి శ్రూయతాం తత్పరం యశః 39 -:యజ్ఞపురుష స్వరూపము:- సహస్రాక్షం సహస్రాక్షం సహస్రచరణంచ యం | సహస్ర శ్రవణంచైవ సహస్రకర మవ్యయమ్ || 40 సహస్రజిహ్వం సాహస్రం సహస్ర పరమంప్రభుమ్ | సహస్రదం సహస్రాదిం సహస్రభుజ మవ్యయమ్ || 41 -:యజ్ఞద్రవ్యసముదయము:- హవనం సువనంచైవ హవ్యం హోతారమేవచ | పాత్రాణి చ పవిత్రాణి వేదీం దీక్షాం చరుం స్రుచిమ్ || 42 -:పురుషసూక్తార్థము:- బ్రహ్మను గూర్చిన నీప్రశ్న భారమైనది చాలపెద్దది ఐనా ఓపినంత సెప్పెదను. ఆ పెద్ద గొప్పతన మాలింపుము. వేయికన్నులుగల వేయికన్నుల వేల్పునుగ వేయిపాదములు వేయిచెవులు వేయిచేతులు వేయినాలుకలు వేయిరూపులుగలవానిగను వేయిమంది ప్రభువులకు పైప్రభువుగ వేలకొలది యిచ్చుదాతగా వేలకొలది దినువానిగా వేయిసేతులువానిగ నున్న యాపరతత్త్వమును యథాశక్తి పేర్కొనుచున్నాను. హవనము (హోమము) సవనము హోమద్రవ్యము (హవిస్సు) హోత పవిత్రములయిన పాత్రలు వేదము దీక్ష చరువు స్రుక్కుస్రువము సోమము అవభృత్తు ప్రోక్షణి దక్షిణా ధనము అద్వర్యుడు సామవేదివిప్రుడు (ఉద్గాత) సదస్య (యజ్ఞపదమందలి సభ్యులు) ''హవనమ్'' అను పదము మొదలు భవం చమమ్ అన్న పదముదాక యివి యజ్ఞద్రవ్యముల పేర్లు. ఆమీద ''ఆగ్నేభుజమ్'' దగ్గరనుంచి శాశ్వతః ప్రభుః అన్నదాక యజ్ఞ పురుషస్వరూపము. వర్ణింపబడినది. ఆ శబ్దముల నిర్వచనము అర్థము శ్రౌతపరిభాషకు సంబంధించినది. శ్రౌతులవలననే వినవలసినది. అందుచేనది యిచట ప్రకటింపలేదు. స్రుక్సోమ మవభృచ్చైవ ప్రోక్షణీ దక్షిణాధనం | అద్వర్యుం సామగం విప్రంసదసా న్సదనం సదః || 43 యూపం సమిత్కుశం దర్వీం చమసోలూఖలానిచ | ప్రాగ్వంశం యజ్ఞభూమించ హోతారం బంధనంచయత్ || హ్రస్వాన్యతిప్రమాణాని ప్రమాణ స్థావరాణిచ | ప్రయశ్చిత్తాని వాజాశ్చ స్థండిలానిచ కుశాస్త థా || మంత్రం యజ్ఞంచ హవనం వహ్నిభాగం భవంచమం | అగ్రేభుజం హోమభుజం శుభార్చిషముదాయుధమ్ || ఆహుర్వేదవిదోవిప్రాః యో యజ్ఞః శాశ్వతః ప్రభుః | యదార్థం భగవాన్బ్రహ్మ భూమౌ యజ్ఞమథాకరోత్ || -:యజ్ఞపరిభాషలు:- (వాడుక మాటలు) హవనము= హోమము; సవనము= యజ్ఞము; హవ్యము= హోమపదార్థం హోత = హోమము సేయునతడు పాత్రలు పవిత్రములు వేది దీక్ష చరువు స్రువము సృక్కు సోమము అవబృధము హోమము సేయుఅన్నము పక్వాన్నము ప్రోక్షణి - ధక్షిణాధనము అద్వర్యులు సామగుడు సదస్యులు సదనము సదస్సు యూపము సమి(థలు) త్కుశలు స్థాలి= దర్వి చమస= చతురశ్రముగానుండు పాత్ర ఉలూఖలములు= ఱోలు ప్రాగ్వంశము= పర్నశాల యజ్ఞభూమి (హోత) రెండవ బంధనము= పశుబంధం హ్రస్వములు అతిప్రమాణాలు ప్రమాణములు స్థావరము ప్రాయశ్చిత్తములు వాజులు= హవిస్సులు స్థండిలములు-దర్భలను అగ్నినుంచుభూమి కుశలు= దర్భలు వహ్నిభాగము భవము చయము= ఇటుకలతోటి అగ్నివేది అగ్రేభుజము- ముందారగించేది హోమభుజము-హోమమారగించునది శుభార్చిషము-ప్రదక్షిణార్చి అధ్వర్వుగణము - అధ్వర్యడు ప్రతిప్రస్థాతనేష్ట - ఉన్నత హోతృగణము-హోత ప్రశాస్త అచ్ఛావాకుడు-గ్రావస్తుతు ఉద్గాతృగణము. ఉద్గాత ప్రస్తోత-ప్రతిహర్త బ్రహ్మ బ్రాహ్మణాచ్ఛంసి అగ్నీద్రుడు హోత. హితార్థం సురమర్త్యానాం లోకానాం ప్రభవాయచ || 48 బ్రహ్మధ కపిలచ్చైవ పరమేష్ఠీ తథైవచ || 49 దేవస్సప్తర్షయశ్చైవ త్రంబకశ్చ మహాయశాః || 50 సనత్కుమారశ్చ మహానుభావః మనుర్మహాత్మా భగవాన్ ప్రజాపతిః | పురాణదేవో೭ ధ తథాప్రచక్రే ప్రదీప్తవైశ్వానరతుల తేజాః || 51 వేదవేత్తలగు విప్రులు యజ్ఞము శాశ్వత ప్రభువందురు. మహారాజ! పుణ్యకథను నీవడుగుచున్నావు విను. బ్రహ్మదేవుడు భూలోకమందెందులకు యజ్ఞముసేసనన; అటదేవతలకు నిటమానవులకు హితవు కావలెనని లోకములు సృష్టికావలెనని పరమేష్ఠియజ్ఠము సేసెను. ఇందుపాల్గొన్నవారు దేవతలు సప్తర్షులు త్రినేత్రుడు (శివుడు) మహానుభావులు సనత్కుమారుడు మహాత్ముడు మనువు భతవంతుడు ప్రజాపతి అగ్ని వైశ్వానరాగ్నివంటి మహానుభావులు. ఇక నీయజ్ఞానుష్ఠాన విధానము వినుము. -:యజ్ఞవరాహవర్ణనమ్:- పురాకమల జాతస్య స్వపతస్తస్య కోటరే |పుష్కరేయత్రసంభూతా దేవాఋషిగణాస్తథా || 52 ఏషపౌష్కరకోనామ ప్రాదుర్భావో మహాత్మనః | పురాణం కథ్యతేయత్ర వేదస్మృతి సుసంహితమ్ || 53 మున్ను భగవంతుడు విష్ణువు సముద్రమందు వటపత్రమున(రావియాకునందు) నిదురపోవుచుండ నాయన నాభి నుండి పద్మము (పుష్కరము) ఉదయించెను. అందుండి బ్రహ్మ మొదలుగగల నీపేర్కొనబడినదేవత లుదయించిరి. విష్ణునాభికమలమందు బుట్టి బ్రహ్మ ఆ పద్మము కోటరమందు నిద్రవోవుచుండగా నాపుష్కరమందు దేవతలు ఋషులు పుట్టిరి. ఇదే బ్రహ్మయొక్క అవతారము ''పౌష్కరకము'' అను ప్రసిద్ధినందినది. వేదములు స్మృతులు సంహితల రూపమున పురాణమీలా జెప్పబడినది. 53 వరాహస్తు శ్రుతిముఖః ప్రాదుర్భూతో విరించినః | సహాయార్ధం సురశ్రేష్ఠో వారాహంరూపమాస్థితః || 54 విస్తీర్ణం పుష్కరేకృత్వా తీర్థం కోకాముఖంహితం | వేదపాదో యూపదంష్ట్రః క్రతుహస్త శ్చిలీముఖః || అగ్నిజిహ్వో దర్భరోమా బ్రహ్మశీర్షో మహాతపాః | అహోరాత్రేక్షణో దివ్యో వేదాంగః శ్రుతిభూషణః || ఆజ్యనాసః స్రువతుండః సామఘోషస్వనో మహాన్ | సత్యధర్మమయః శ్రీమాన్ కర్మవిక్రమ సత్కృతః 57 ప్రాయశ్చిత్త నఖోధీరః పశుజానుర్మఖాకృతిః | ఉద్గాత్రంత్రో హోమలింగో ఫలబీజ మహౌషధిః || వాయ్వంతరాత్మా మంత్రాస్థిరాపః స్ఫిక్ సోమశోణితః | వేదస్కందోహవిర్గంధో హవ్యకవ్యాతి వేగవాన్ || ప్రాగ్వంశకాయోద్యుతిమాన్ నానాదీక్షాభి రర్చితః | దక్షిణాహృదయో యోగీ మహానత్రమయోమహాన్ || ఉపాకర్మేష్టిరుచిరః ప్రవర్గ్యావర్త భూషణః | ఛాయాపత్రీ సహాయోవై మణిశృంగ మి వోచ్ఛ్రితః || సర్వలోకహితాత్మా యో దంష్ట్రయాభ్యుజ్జహార గామ్ | తతఃస్వస్థానమానీయ పృథివీం పృథివీధరః || 62 తతో జగామ పృథివీ నిర్వాణం ధారణా ద్ధరేః | ఏవ మాదివరాహేణ ధృత్వాబ్రహ్మహితార్థితా || 63 -:యజ్ఞవరాహమూర్తి ఆవిర్భావము:- వేదముఖుడైన వరాహమూర్తి బ్రహ్మనుండి యుదయించెను. ఆ సృష్టికర్తకు సహాయముకొఱకే యారూపున నవతరించెను. పుష్కరమందు కోకాముఖమనుపేర విశాలమైన తీర్థము నేర్పరచి యందాయన యుదయించెను. ఆయన పాదములు వేదములు. కోర యూపస్తంభము క్రతువులు హస్తములు చితి ముఖము జిహ్వ అగ్ని, రోమములు దర్భలు. బ్రహ్మ శిరస్సు పగలు రాత్రియు కన్నులు వేదాంగములు జెవులు. నేయి ముక్కు స్రువము మూతి సామధ్వని ఆర్పు. సత్యధర్మమయుడు. వేదోక్తకర్మము పరాక్రమము. ప్రాయశ్చిత్తము గోళ్లు. పశువుమోకాళ్లు వాయువు మంత్రములు ఎముకలు ఆపస్సు ముఖము రూపము ఉద్గాత ఆంత్రము (ప్రేగు) లింగము హోమము బీజము వనౌషధులు మూలికలు. వాయువు అంతరాత్మ మంత్రములు ఎముకలు ఆపస్సు స్పిక్కుసోమము రక్తము వేదములు బుజములు హవిస్సు వాసన హవ్యము కవ్యము నెడల అతివేగముగలవాడు. ప్రాగ్వశము శరీరము రకరకాలదీక్షలచేనర్పింపబడి తేజస్సంపన్నుడైనవాడు దక్షిణహృదయము యోగి మహాసత్రస్వరూపుడు. ఉపాకర్మేష్టివలన సొంపుగొన్నవాడు ప్రవర్గయందగు నావర్తములు (అట్టిట్టు తిరుగుడులు) భూషణములు ఛాయయను ధర్మపత్ని సహాయముగలవాడు మణిశృంగమట్లు (మణిమయమైనకొండశిఖరమట్లు) ఎత్తైనవాడు. సర్వలోకములకు హితవుసేయు ప్రధానసంకల్పముగలవాడు. శమదమసంపన్న జమున్ను హిరణ్యాక్షునిచే 'చాప జుట్టగాజుట్టుకొనిపోబడిన భూమిని కోరలతో పైకెత్తి (మూడవయవతారము) తరువాతకొనివచ్చి తానెధరించినవాడు. హరిఅవతారమట్లు తననుద్ధరించుటచేతనే పృథివి సుఖమందెను. బ్రహ్మహితవుకొఱకిట్లు ఆదివరాహమూర్తిచేఉన్న సముద్రము నీటిపాలైన భూదేవి పుష్కర మందుద్ధరింపబడినది. ఉద్ధృతా పుష్కరే పృథ్వీ సాగరా೭ంబు గతా పురా | వృతః శమ దమాభ్యాం యో దివ్యే కోకాముఖే స్థితః || 64 ఆదిత్యై ర్వసుఖిః ర్మరుద్భిర్దైవతై సహా | రుద్రై ర్యిశ్వ సహాయైశ్చ యక్ష రాక్షస కిన్నరైః || 65 దిగ్భి ర్విదిగ్భిః పృథివీ నద్‌భిః సహ సాగరైః | చరాచర గురుః శ్రీమా న్బ్రహ్మా బ్రహ్మవిదాం వరః || 66 ఉవాచ వచనం కోకాముఖం తీర్థం త్వయా విభో ! | పాలనీయం సదా గోప్యం రక్షా కార్యా మఖే త్విహ|| 67 ఏవం కరిష్యే భగవంస్తదా బ్రహ్మాణ ముక్తవాన్ | ఉవాచ తం పున ర్బ్రహ్మా విష్ణుదేవం పురః స్థితమ్ || 68 ఆలాటి యీ పుష్కరక్షేత్రమందలి కోకాముఖ తీర్థమందు దేవ దానవ వసు రుద్రాదిత్య సిద్ధ సాధ్య యక్ష రాక్షస కిన్నర విశ్వేదేవులతో, మూర్తిగొన్న దిగ్విదిక్కులతో, పృథివితో, నదులతో, సాగరములతో, చరాచర గురుడు వేద విద్వరుడు బ్రహ్మదేవుడు దయచేసి వసించు చున్నవాడు. విష్ణుభగవానుని గూర్చి ప్రభూ ! ఈ కోకాముఖము గోప్యము. (రహస్యము) ఇది నీచేతనే యెల్లపుడు పాలింప బడ వలెను. ఈ నాయజ్ఞ మందిట రక్ష యీయ వలయు నన, విష్ణువు భగవంతుడా ! ఇట్లే సేసెద నని యపుడు బ్రహ్మకు మాట యిచ్చెను. మఱల బ్రహ్మ యెదుట నిలువబడిన యా విష్ణుదేవుం గూర్చి వెండియు నిట్లనియె. -:బ్రహ్మణా విష్ణుదేవేన ప్రసంగః:- బ్రహ్మోవాచ:- త్వం హి మే పరమో దేవ స్త్వం హి మే పరమో గురుః | త్వం హి మే పరమం ధామ ళక్రాదీనాం నురోత్తమ! || 69 ఉత్ఫుల్లామల పద్మాక్ష ! శత్రుపక్ష క్షయావహ ! | యథా యజ్ఞేన మే ధ్వంసో దానవైశ్చ విధీయతే || తథా త్వయా విధాతవ్యం ప్రణతస్య నమో೭స్తు తే | భయం త్యజస్వ దేవేశ క్షయం నేష్యామి దానవాన్ || యే చా೭న్యే విఘ్నకర్తారో యాతుధానా స్తదా సురాః | ఘాతయిష్యామ్యహం సర్వా న్స్వస్తి తే೭స్తు పితామహ! || ఏవముక్త్వా స్థిత స్తత్ర సాహాయ్యేన కృతక్షణః | ప్రవవుశ్చ శివా వాతాః ప్రసన్నాశ్చ దిశో దశ || సుప్రభాణి చ జ్యోతీంషి చంద్రం చక్రుః ప్రదక్షిణమ్ | న విగ్రహం గ్రహా శ్చక్రుః ప్రసేదు శ్చా ೭పి సింధవః || నీరజస్కా భూమి రాసీ త్సకలాహ్లాద యస్త్రయః | జగ్ముః స్వమార్గం సరితో నా೭పి చక్షుభు రర్ణవాః || అసన్సుభా నీంద్రియాణి నరాణా మంతరాత్మనామ్ | మహర్షయో వీతశోకా వేదా నుచ్చై రవాచయన్ || యజ్ఞే తస్మి న్హవిఃపాకే శివా ఆసంశ్చ పావకాః | ప్రవృత్తా ధర్మసంతృత్తా లోకా ముదిత మానసాః || 77 ముందున్న విష్ణవుం గూర్చి బ్రహ్మ యిట్లనియె. నా పరమ దైవము పరమ గురువు నీవే కదా. నా పరందామము ఇంద్రాది దేవతలకును పరమ గమ్య స్థానము వైకుంఠము. వికసిత స్వచ్ఛపద్మాక్ష ! శత్రుపక్షక్షయావహ! దానవులు నా యజ్ఞమును ధ్వంసము సేయకుండ సేయ వలయు. ఇదే నీకు ప్రణామము. అన విష్ణు విట్లనియె. వెడలుము. దేవేశ్వర ! దానవుల నంత మొందింతును. ఇంక నిట నడ్డు దవులు నందఱ యాతుధానులను వ్యధపెటు వాండ్లను రాక్షసులను మట్టువెట్టెదను. శుభమగు గాక ! నిలువు మని సహాయ పడుట కెదురు సూచుచుండెను వెంటనే శుభవాయువులు వీచెను. దిక్కులు ప్రసన్నము లయ్యెను. జ్యోతిస్సు లుద్దీప్తములై చంద్రునికి బ్రదక్షిణము దిఱిగినవి. గ్రహములు విగ్రహములం పోరాట ముడిగినవి. నదులు తేరుకొన్నవి. భూమి దుమ్మెడలెను. (అచ్ఛమయ్యెను) అపస్సులు = జలములు సర్వానంద మొసగెను. నదులు తమ దారిం బారినవి. సముద్రము క్షోభింపలేదు. (ఉప్పెనలు లేవు) అంతరంగ శుద్ధిగ నరుల యింద్రియములు పరిశుద్ధము లయ్యె. మహర్షు లే బెడద లేక వేదములను గంఠ మెత్తి వల్లించిరి. ఆ యజ్ఞ మందగ్నులు హవిఃపాక మందు హవిర్భాగముల నందుకొని పచనము సేసి దేవతల కందించుట యందు మంగళ కరములయ్యెను. ప్రదక్షిణార్చులు = ప్రదక్షిణముగా దిఱుగు జ్వాలతో శుభలక్షణము లయ్యె నన్నమాట. లోకములు ధర్మవర్తనమున బ్రవర్తించి సంతుష్ట మనస్కము లయ్యెను. 77 విష్ణో స్సత్యప్రతిజ్ఞస్య శ్రుత్వా೭ రినిధనా గిరః | తతో దేవాః సమాయాతా దానవా రాక్షసైః సహ || 78 భూతప్రేతపిశాచాశ్చ సర్వే తత్ర గతాః క్రమాత్ | గంధర్వా೭ప్సరసశ్చైవ నాగా విద్యాధరా గణాః || వానస్పత్య శ్చౌషధయో యచ్చేహ యచ్చ నేహతిః | బ్రహ్మా೭ దేశా న్మారుతేన ఆనీతాః సర్వతో దిశః || యజ్ఞపర్వత మాసాద్య దక్షిణా మభితో దిశమ్ | సురా ఉత్తరతః సర్వే మర్యాదా పర్వతే స్ఠితాః || గంధర్వాప్సరసశ్చైవ మునయో వేద పారగాః | పశ్చిమాం దిశ మాస్థాయ స్థితా స్తత్ర మహాక్రతౌ || సర్వదేవనికాయాశ్చ దానవాశ్చ సురా గణాః | అమర్షం పృష్ఠతః కృత్వా సుప్రీతా స్తే ప స్పరమ్ || ఋషీ న్పర్యచర న్సర్వే శుశ్రూష న్బ్రాహ్మణాం స్థథా | ఋషయో బ్రహ్మర్షయశ్చైవ ద్విజా దేవర్షయ స్తథా || రాజర్షయో ముఖ్యతమా స్సమాయాతా స్సమంతతః | కతమశ్చ సురో೭ప్యత్ర యజ్ఞే యజ్యో భవిష్యతి || 85 -:బ్రహ్మకృతయజ్ఞే దిక్పాలానాం ప్రవృత్తి:- పశవః పక్షిణశ్చైవ తత్రా೭యాతా దిదృక్షవః | బ్రహ్మణా భోక్తుకామాశ్చ సర్వే వర్ణా೭నుపూర్వశః || 86 అన్నమాట అన్నట్టులగు విష్ణుని శత్రుసంహార నిమిత్తములైన మాటలు విని యాపై దేవదానవులతో రాక్షసులతో గూడ భూత ప్రేత పిశాచములు గూడ వరుసగ నటకు వచ్చిరి. వానస్పత్యములు= పూచికాచెడుచెట్లు ఓషధులు (మూలికలు) కోరినవి కోరనివి బ్రహ్మయాజ్ఞచే వాయు వన్నిదెసల నుండి కొని తెచ్చెను. ఉత్తర మందున్న మర్యాచా పర్వత మందుండు దేవతలందరు దక్షిణ దిశగా బయలు దేరి యజ్ఞపర్వతము సేరి నిలిచిరి. పడమటి దెస నున్న గంధర్వాప్సరసలు మునులు వేదపారగులు వచ్చి యట క్రతువు నందు నిల్చిరి. అందరు దేవతలు దానవులు అసురుల గుంపులు, పగ వెనుక బెట్టి యెండొరుల యెడ నెంతో ప్రీతిగొని యందఱును ఋషుల పరిచర్య సేయుచుండిరి. ఋషులు బ్రహ్మర్షులు దేవర్షులు ద్విజులు రాజర్షులు పరమశ్రేష్ఠు లన్ని యెడల నుండి వచ్చిరి. ఈయజ్ఞ మందెవ్వరు (ఏదేవత) యజింపబడు నని చూచి ముచ్చట గొని పశువులు పక్షులుగూడ యట నరుదెంచెను. బ్రాహ్మణులు భోజనప్రియులన్ని వర్ణముల వారు వరుసగా నంద రేగు తెంచిరి. 86 స్వయం చ వరుణో రత్నం దక్షశ్ఛా೭న్నం స్వయం దదౌ | ఆగత్య వరుణో లోకాత్సక్వం చా೭న్నం సృతో೭పచత్ || 87 వాయు ర్భక్ష వికారంశ్ఛ రసపాచీ దివాకరః | అన్నపోచన కృత్సోమో మతి దాతా బృహస్పతిః || 88 ధనదానం ధనాధ్యక్షో వస్త్రాణి వివిధాని చ | సరస్వతీ నదాధ్యక్షా గంగాదేవీ సనర్మదా || యాశ్చా೭న్యాః సరితః పుణ్యాః కుపాశ్చైవ జలాశయాః | పల్వలాని తటాకాని కుందాని వివిధాని చ || ప్రస్రవణాని ముఖ్యాని దేవఖాతా న్యనేకశః | జలాశయాని సర్వాణి సముద్రాః సప్తసంఖ్యకాః || లవణక్షు సురా సర్పి ర్దధి దుగ్ధజలైఃన మమ్ | సప్తలోకాః సపాతాలాః సప్తద్వీపాః సపత్తనాః || వృక్షవల్యః సతృణాని శాకాని చ ఫలాని చ | పృథివీ వాయు రాకాశ మాపో జోతిశ్చ పంచమమ్ || సవిగ్రహాణి భూతాని ధర్మశాస్త్రాణి యాని చ | వేదభాష్యాణి సూత్రాణి బ్రహ్మణా నిర్మితం చ యత్ || అమూర్త మూర్త మత్యంతం మూర్త దృశ్యం తథా೭ఖిలమ్ | ఏవంకృతే తథా తస్మిన్ యజ్ఞే పైతామహే తదా || 94 దేవానాం సన్నిధౌ తత్ర ఋషిభిశ్చ సమాగమే || వరుణుడు సమర్థుడు గదా ! స్వయముగ వచ్చి రత్నమును అన్నము నిచ్చెను. వరుణుడు తనలోకమునుండి స్వయముగా అన్నము వండెను. (ఇట అన్న శబ్దము అన్ని వంటకములను దెలుపును) వాయువు రకరకాల భక్ష్యములనుండి పిండివంటలను దయారు సేసెను. సూర్యుడు రసములను వండెను. సోము డన్నము వండెను. బృహస్పతి మతిదాత. ఈయందఱకు తెలివి నిచ్చువాడయ్యెను. గంగాదేవి నర్మద రకరకాల వస్త్రదానములను జేసిరి. ధనాధ్యక్షుడు కుబేరుడు ధనదానమును సేసెను. నదములు= (పడమటగా పారు నదులు). వానికి అధ్యక్షస్థానము సరస్వతీనది గంగాదేవి నర్మదా నదితో మఱియుం గల పుణ్య నదులు కూపములు (బావులు) పల్వలములు = చెఱువులు కుండములు (వస) వణములు= దోఱులు దేవఖాతములు అన్ని నీటి వనరులు సప్తసముద్రాలు సప్త ఋషులు = బుద్ధి - తెలివి పండ= తత్త్వ మెఱుగ దగినది; 2 మేధి= జ్ఞాపకశక్తి 3. చార్వి = ఊహాపోహలందు నేర్పుగలది 4 చత్వ= చక్కగా నడిగి విసుగు లేక వినే తెల్వి 5 గృహీత = చెప్పినది చక్కగా గ్రహించుట 6 గురుశుశ్రూష = సహనము గల బుద్ధి. 7.ప్రతిభ = ఒక విషయము మంచి వాగోరణితో సమయోచితముగ శ్రుతి స్మృతి పురాణతిహాసానుభవములు పెక్కు చూపి వినువారు ప్రశ్నించ కుండ విషయములను దెల్పు బుద్ధి. ఉప్పు చెఱకు-సుర (కల్లు) సర్పి = నెయ్యి దధి-పెరుగు దుగ్ధ-పాలు జల-నీరు వీనితోడివి-భూర్-భువర్-సువర్-మహర్-జనస్-తపస్- సత్యసప్తలోకాలు-సప్తపాతాళాలు-అతల-వితల-సుతల-రసాతల-మహాతల-తలాతల పాతాళములు, సప్తద్వీపాలు, సప్తవర్తనములు, చెట్లు, తీగలు, గడ్డి, కూరలు, పండ్లు, భూమ్యాది పంచభూతాలు, నవగ్రహ జీవులు, ధర్మశాస్త్రములు, వేదభాష్య సూత్రములు, బ్రహ్మనిర్మించిన మూర్తము (ఆకారముగలది) అమూర్తము=నిరాకారము. మూర్తదృశ్యము (కనిపించేది) బ్రహ్మణో దక్షిణ పార్శ్వే స్థతో విష్ణుః సనాతనః | వామ పార్శ్వే స్థితో రుద్రః పినాకీ వరదః కృత || 96 సనత్కుమారాదయో యే సదస్యా స్తత్ర తే೭భవన్ | ప్రజాపతయో దక్షాద్యా వర్ణా బ్రాహ్మణ పూర్వకాః || బ్రహ్మణశ్చ సమీపే తు కృతా ఋత్వి గ్వి కల్పనా | వసై#్త్ర రాభరణౖ ర్యుక్తాః కృతా వైశ్రవణన తే || అంగులీయైః సకటకై ర్ముకుటై ర్భూషితా ద్విజాః | చత్వారో ద్వౌ దశా೭న్యే చ తత స్తే షోడశర్త్విజః || బ్రహ్మణా పూజితాః సర్వే ప్రణీపాత పురస్సరమ్ | అనుగ్రాహ్యో భవద్భిస్తు సర్వై రస్మిన్ క్రతా విహ || పత్నీ మమైషా సావిత్రీ యూయం మే శరణం ద్విజాః | విశ్వకర్మాణ మాహూయ బ్రహ్మణః శీర్ష ముండనమ్ || యజ్ఞేతు విహితం తస్య కారితం ద్విజ సత్తమైః | ఆతపేయాని వస్త్రాణి దంపత్యర్ఠే తదా ద్విజైః || 102 -:యజ్ఞశాలా వైభవము:- దేవతల సన్నిధిలో నట ఋషుల సమావేశమందు బ్రహ్మ కుడివైపు విష్ణువు (సనాతనుడు) ఎడమను రుద్రుడు పినాకి (పినాక మను విల్లు పూనువాడు) వర ప్రదాత ప్రభువు నలంకరించిరి. మహాత్ముడు బ్రహ్మ ఋత్విగ్వరణము కావించెను. భృగువు హోతగా వరింప బడెను. పులస్త్యుడు అధ్వర్యుడు మరీచి ఉద్గాత. నారదుడు బ్రహ్మ - సనత్కుమారాదులు సదస్యులు. దక్షాది ప్రజాపతులు బ్రహ్మణాది వర్ణములవారు నట నుండిరి. అటు దగ్గరగా బ్రాహ్మణులు ఋత్విక్కులుగా వరింప బడిరి. వారిని కుబేరుడు వస్త్రాభరణములతో నలంకరించెను. ఉంగరాలు కంకణములు కిరీటములచే వారు భూషింప బడిరి. నలుగురు ఇద్దరు పదిమంది నల్గురు పదునాల్గురు మొత్తము ముప్పదినల్గురు విప్రులను సాష్టాంగ ప్రణామముచేసి బ్రహ్మ ఋత్విక్కులుగా వరించెను. వారందరు నాయనచే ప్రణిపాత పురస్సరముగా బూజింప బడిరి. 102 బ్రహ్మఘోషేణ తే విప్రా వాదయన్త స్త్రివిష్టపమ్ | పాలయంతో జగచ్చేదం క్షత్రియాః సాయుధాః స్థితాః || భక్ష్య ప్రకారా న్వివిధా న్వైశ్యా స్తత్ర ప్రచక్రిరే | రస బాహుల్య యుక్తం చ భక్ష్యం భోజ్యం కృతం తతః || ఆశ్రుతం ప్రాగదృష్టం చ దృష్ట్వా తుష్టః ప్రజాపతిః | ప్రాగ్వటే೭పి దదౌ నామ పైశ్యానాం సృష్టి కృద్విభుః || -:బ్రహ్మ ఋత్విగ్వరణ వైభవమ్:- తామందరు నీక్రతు వందు నన్ననుగ్రహింప వలయు. ఈమె నా పత్ని సావిత్రి. ద్విజులు మీరు నా దిక్కు అని బ్రహ్మ విన్నవించెను. -:బ్రహ్మదీక్షా స్వీకారము:- విశ్వకర్మను బిలిచి బ్రాహ్మణోత్తములట యజ్ఞ మందు విధి విహితముగా శీర్ష ముండనము చేయించిరి. దంపతుల కెండలో నారబెట్టిన దీక్షా వస్త్రములను గట్ట నిచ్చిరి. విప్రులు వేద ఘోషచే స్వర్గమును గూడ ప్రతిధ్వనింప జేసిరి. క్షత్రియులెల్ల జగత్తు పాలించుచు సాయుధులై యట నిల్చిరి. ద్విజానాం పాద శుశ్రూషా శూద్రైః కార్యా సదా త్విహ | పాద పక్షాలనం భోజ్య యుచ్ఛిష్టస్య ప్రమార్జనమ్ || తే೭పి చక్రు స్తదా తత్ర తేభ్యో భూయః పితామహః | శుశ్రూషార్థం మయా యూయం తేరీయెషు పదే కృతాః || ద్విజానాం క్షత్రబంధూనాం పైశ్యానాం చ భవ ద్వి ధైః | త్రిభిః శుశ్రూషణా కార్యే త్యుక్త్వా బ్రహ్మాతథా೭కరోత్ || 110 అనేక విధములైన భక్ష్యములను పిండి వంటలను వైశ్యులు సమకూర్చిరి. మున్ను విననిది చూడనిది యా యజ్ఞ వైభవము చూచి ప్రజాపతి సృష్టికర్త యెంతో హర్షించి వైశ్యులకు 'ప్రాగ్వాట' అను పేరు (బిరుదు) నోసగెను. ఈ యజ్ఞ మందు ద్విజులకు పాదము లొత్తుట శూద్రుల కర్తవ్యము. శుశ్రూష కొఱకే మిమ్ము నేను తురీయ స్థానమం దుంచినాను. ద్విజులకు క్షత్రబంధువులకు వైశ్యులకు మీలాటివారు శుశ్రూష చేయ వలయు నని బ్రహ్మ యిలా చేసెను. ద్వారాధ్యక్షం తథా శక్రం వరుణం రసదాయకమ్ | విత్త ప్రదం వైశ్రవణం పవనం గంధ దాయినమ్|| 111 ఉద్యోత కారిణం సూర్యం; ప్రభుత్వే మాధవః స్థితః | సుసత్కృతా చ పత్నీ సా సావిత్రీ చ వరాంగనా || ఆధ్వర్యుణా సమాహుతా ఏహి దేవి! త్వరాన్వితా | ఉత్ధితాశ్చా గ్నయః సర్వే దీక్షాకాల ఉపాగతః || 113 వ్యగ్రా సా కర్యకరణ స్త్రీస్వభావేన నా೭గతా| ఇహ వై న కృతం కించిద్ ద్వారేవై మడనం మయా || భిత్యాం వై చిత్ర కర్మాణి స్వస్తికం ప్రాంగణన తు | ప్రక్షాళనం చ భాండా నాం న కృతం కిమపి స్త్వి హ || లక్ష్మీ రద్యా೭పి నాయాతా పత్నీ నారయణస్య యా | అగ్నేః పత్నీ తథా స్వాహా ధూమ్రోరా తు యమస్య తు || వారుణీ వై తథా గౌరీ వాయోర్వై సుప్రభా తథా | బుద్ధి ర్వై శ్రవణీ భార్యా శంభో ర్గౌరీ జగత్ప్రియా || మేధా శ్రద్ధా విభూతిశ్చ అనసూయా దృతిః క్షమా | గంగా సరస్వతీ చైవ నా೭ద్యా೭యాతాశ్చ కన్యకాః || ఇంద్రాణి చేంద్రపత్నీ తు రోహిణీ శశినః ప్రియా | అరుంధతీ వశిష్ఠస్య సప్తర్షీణాం చ యాః స్త్రియః || అనసూయాత్రిపత్నీచ తథాన్యాప్రమదా ఇహ | వధ్వో దుహితరశ్చైవ సఖ్యో భగినికా స్తథా|| నా೭ద్యా೭గతాస్తు తాః సర్వా అహం తావత్ స్థితా చిరమ్ || నా೭హ మేకాకినీ యాస్యే యావన్నాయాంతి తాః స్త్రియః|| సర్వాభిః సహితా చా೭హ మగచ్ఛామి త్వరాన్వితా | సర్వైః పరివృతః శోభాం దేవైః సహ మహామతే || భవా న్ర్పాప్నోతి పరమాం తథా೭హం తు న సంశయః | వదమానాం తథా೭ధ్వర్యుః త్వక్త్వా బ్రహ్మాణ మాగత || 124 -:యజ్ఞారంభము:- ఇంద్రుని ద్వారాధ్యక్షునిగ, వరుణుని రసము లిచ్చు వానిగ, ధనదుని (కుబేరుని) ధన ప్రదునిగ, పవనుని (వాయువుని) సువాసనల నిచ్చు వానిగ, సూర్యుని వెలుగు నిచ్చు వానిగ, నియమించెను. మాధవుడు విష్ణువు ప్రభుత్వ మందు (సర్వాధికారి స్థానమందు) ఉండెను. సోముడు వారికి సోమ మందించువాడై వారి ఎడమప్రక్క నుండెను. పత్ని సావిత్రి పరమసుందరి చక్కగ సత్కరింపబడి యుండడు. యధ్వర్యుడు (బ్రహస్పతి) దేవి! రా త్వరగా రావాలి యగ్నులెల్ల యెగసినవి. దీక్షా సమయ మైనది యని కేక వెట్ట, నామె యింటిపనులు చక్కబెట్టు కొనుటలో మునిగి తేలుచు స్త్రీస్వభావముచే రాదయ్యెను. ఇక్కడింకా గుమ్మాని కలంకారం ఏమీ చేయలేదు. గోడమీద బొమ్మలు బొట్టుపెట్టలేదు. ముంగిలివాకిట స్వస్తికము మ్రుగ్గు పెట్టలేదు. భాండములు గిన్నెలుగట్రా కడుగుకోవటమేమి చేయలేదు. నారాయణుని పెళ్లామింతవరకూ రాలేదు. అగ్ని భార్య స్వాహ, యముని యిల్లాలు ధూమ్రోర్ణా, వరుణుని భార్య గౌరి, వాయువు పెండ్లాము సుప్రభ, కుబేరుని భార్య వైశ్రవణి, శంభునిల్లాలు జగత్తున కిష్టురాలు గౌరి, మేధ, శ్రద్ధ విభూతి, అనసూయ, దృతి, క్షమా, గంగ, సరస్వతి, ఎవరూ కన్యక లింతదాకా రాలేదు. ఇంద్రుని భార్య ఇంద్రాణి, (శచీదేవి) శశిప్రియ రోహిణి, వశిష్ఠుని ఆవిడ అరుంధతి, సప్తర్షుల భార్యలు, అత్రి భార్య అనసూయ, ఇంకా ఉన్నవారు పేరంటాండ్రు, కోడళ్లు, కూతుళ్లు చెలులు, చెల్లెండ్రు అందరూ ఇందాకా రాలేదు. వాళ్లురానిచో నెనొక్కతెనూ రాను. వెళ్లి విరించికి ఒక్క ముహూర్తము ఉండుమని అందరినీ కలిసి నేను తొందరగా వస్తానని చెప్పు, మహాబుద్ధిమంతులు సర్వదేవతలతో గలిసి తమరూ నేనూ నీ మహాయజ్ఞమందెంతో శోభ నందెదము. సందేహం లేదు. అని ఆలా మాట్లాడు చున్నా మెను వదలి యధ్వర్యుడు బ్రహ్మ దగ్గరకు వచ్చెను. సావిత్రీ వ్యకులా దేవ! ప్రసక్తా గృహకర్మణి | సఖ్యో నా7భ్యాగతా యావ త్తావ న్నాగమనం మమ || 122 ఏవముక్తో7స్మి వై దేవ కాలశ్చా7ప్యతివర్తతే| యత్తే7ద్య రుచిరం తావ త్తత్కురుష్వ పితామహ! || 123 ఏవముక్త స్తదా బ్రహ్మా కించి త్కోప సమన్వితః | పత్నీం చా7న్యాం మదర్థే వై శీఘ్రం శక్ర ! ఇహా7నయ|| 124 యావ ద్యజ్ఞ సమాప్తిర్మే వర్ణే త్వం మాకృథా మనః | భూయో7పి తాం ప్రమోక్ష్యామి సమాప్తౌతు క్రతో రిహ|| 125 ఏవముక్త స్తదా శక్రో గత్వా సర్వ ధరాతలమ్ | స్త్రియో దృష్టాస్తు యా స్తేన సర్వా స్తా స్తత్పరిగ్రహాః || 126 ఆభీరకన్యా రూపాఢ్యా యాదృశీ సా వరాంగనా | దదర్శ తాం సుచార్వంగీం శ్రియం దేవీ మివా7పరామ్ || 127 సంక్షివంతీం మనోవృత్తి విభవం రూపసంపదా | యద్యత్తు వస్తు సౌందర్యా ద్విశిష్టం లభ్యతే క్వచిత్ || 128 తత్తచ్ఛరీరసంలగ్నం తన్వంగ్యా దదృశే వరమ్ | తాం దృష్ట్వా చింతయామాస యద్యేషా కన్యకా భ##వేత్ || 129 తన్మత్తః కృతపుణ్యో7న్యో న దేవో భువి విద్యతే | యోషిద్రత్న మిదం సేయం సద్భాగ్యా యాం పితామహః 130 సరాగో యది వా స్యాత్తు సఫల స్తేష మే శ్రమః | నీలాభ్రకనకాంభోజ విద్రుమాభాం దదర్శ తామ్ || 131 త్విషం సంభిభ్రతీ మంగై కేశగండేక్షణా7ధరైః | మన్మథాశోకవృక్షస్య ప్రోద్భిన్నాం కలికా మివ || 132 ప్రదగ్ధ హృచ్ఛయేనైవ నేత్రవహ్ని శిఖోత్కరైః | ధాత్రా కథం హి సా సృష్టా ప్రతిరూప మపశ్యతా || 133 కల్పితా చేత్కథం బుధ్వా నైపుణ్యస్య గతిః పరా | ఉత్తుంగాగ్రా విమౌ సృష్టే యన్మే సంపశ్యతః సుఖమ్ || 134 వయోధరౌ నా7తిచిత్రం కస్య సంజాయతే హృది | రాగోపహతదేహో7 య మధరో యద్యపి స్ఫుటమ్ || 135 తథా7పి సేవమానస్య నిర్వాణం సంప్రయచ్ఛతి | వహద్భిరపి కౌటిల్య మలకైః సుఖ మర్ప్యతే || 136 -:బృహస్పతి బ్రహ్మతో ప్రసంగము:- సావిత్రి రాలేదు. స్వామీ! ఇంటి పనులలో నున్నది. సఖురాండ్రు రా నంతవరకు నేను రావడం జరుగదు. అని యన్నది. స్వామీ ! సమయము దాటి పోవుచున్నది. తాతా ! ఇపుడు నీకేది రుచించు నట్ల కావింపు మన బ్రహ్మ కొంచెము కోపముతో :- ఇంకొక పత్నిని నా కొఱకు దేవతలతో జని ఇంద్రా ! త్వరగా తీసి కొని రా యజ్ఞము సాగేటట్లు కాలము కొఱత పడ కుండునట్లు శీఘ్రంగా చేయి. నీ వింకొక స్త్రీని తీసికొని రా. నా యజ్ఞ సమాప్తి యగు దాక వర్ణము కులము మాటపై మనసు పెట్ట వద్దు. ఈ క్రతువు పూర్తి యైన తర్వాత నామెను నేను తిఱిగి వదలి పెట్టెదను - అని బ్రహ్మ పలుక నింద్రుడు వెళ్ళి ధరాతల మెల్ల తిఱిగి స్త్రీలను చూచెను. అందఱును నింకొకరి భార్యలే. ఒక్క గొల్లపిల్ల మాత్రము కన్య, రూపవతి, చక్కనిముక్కు, కళ్ళు, ఆలాటి అందగత్తె, దేవతాస్త్రీ గంధర్వి, ఆసురి, పన్నగి. యింకొకతె లేనే లేదు. ఎంతో చక్కని దానిని రెండవ లక్ష్మీదేవి యట్లున్నదానిం జూచెను. తన రూప సంపదచే చూచువారి మనో భావమును నిమురింప జేయు నట్లుండెను. అనగా మై మఱపు గూర్ఛుచుండె నన్న మాట. ఎక్కడైన వేఱది యందమున నెంతేని ఆ వస్తువు లభించు నా సొంపెల్ల యామె శరీర మందు దర్శించెను. యీమె కన్య యగు నేని (పెండ్లికానిదేని నా కింతటి పుణ్యము సేసినవాడింకొకడు భూమియుం దుండడు. ఈ సుందరీరత్నము ఈ సౌభాగ్యవతి యందు పితామహ డనురక్తు డగునేని యీ నా శ్రమ సఫల మగును. 136 దోషో೭పి గుణవ ద్భాతి భూరి సౌందర్య మాశ్రితః | నేత్రయో ర్భూషితా వంతౌ కర్ణాభ్యాం సుసమాగతౌ || 137 కారణా ద్భావ చైతన్యం ప్రవదంతి హి తద్విదః | కర్ణయో ర్భూషణ నేత్రే నేత్రయోః శ్రవణా విమౌ || 138 కుండలా೭ంజన యో రత్ర నా೭వకోశో೭స్తి కశ్చన | న తద్యుక్తం కటాక్షాణాం యద్ధ్విధా కరణం హృది || 139 తత్ర సంబంధినో యే೭త్ర కథం తే దుఃఖి భాగినః | సర్వ సుందరతా మేతి వికారాః ప్రాకృతై ర్గుణౖః || 140 వృద్ధ క్షణ శతానాంతు దృష్ట మేషాం మయా ఫలమ్ | ధాత్రా కౌశల్య సీమేయం రూపోత్పత్తౌ సుదర్శితా ||141 కరోత్యేషా మనో నౄణాం సస్నేహం కృతి విభ్రమైః | ఏవం విమృశతస్తస్య తద్రూపా ೭పహృత త్విషః || 142 నిరంతరోద్గతై శ్ఛన్న మభవ త్పులకై ర్వపుః | తాం వీక్ష్య తప్తహేమాభాం పద్మపత్రాయతేక్షణామ్ || 143 దేవానా మథ యక్షాణాం గంధర్వోరగ రక్షసాం ! నానా దృష్టా మయా నార్యో నేదృశీ రూప సంపదా || 144 త్రైలోక్యా೭ంతర్గతం యద్య ద్వస్తు తత్తత్ప్రధానతః | సమాదాయ విధాత్రా೭స్యాః కృతా రూపస్య సంస్థితిః || 145 తన యవయవములచే, జుట్టుచే, చెక్కిళ్ళచే, కన్నులచే, పెదవులచే, వరుసగా నల్లని మబ్బు (నలుపు) బంగారము తామరపువ్వు, పవడము, అను వాని, కాంతిని జుట్టు చెక్కిళ్ళు కన్నులు పెదవి యను వాని ద్వారా భాసింపజేయు నందకత్తెను మన్మథు డనెడి యశోకవృక్షము దొడివిన మొగ్గ యట్లున్న దానిని బ్రహ్మ మఱొక రూపముదాహరణ కనిపింప హర నేత్రాగ్నికి దగ్ధమైన మన్మథునితో నేత్రాగ్ని జ్వాలచే తనకూదాతెలివితో తయారుచేయబడినదయినచో నాయన నైపుణ్యమున కీమె పరాకాష్ఠ. యీలాటి దింకొక రూపము లోగడ సృష్టించలేదన్నమాట. అట్టె చూచు నా కన్నులకు విందు గొలుపు నీమెనున్నతాగ్రము లీమె పాలిండ్లు చూచిన నెవని హృదయమం దత్యాశ్చర్య మెందులకు గలుగదు! రాగముచే ఎరుపుచే, (విపరీతమోహముచేననిశ్లేష) నణగారిన మేను (రూపము గల) యీమె పెదవి స్పష్టమే. అయిన దీనిని సేవించు వాని కిది మోక్షానందము నిచ్చుచున్నదే. ముంగురులు కౌటిల్యము పంకరలు దిరిగినను వంకర నడకలు (కపటము బూనిన దని శ్లేష.) సుఖము నొసంగు చున్నవి. ఇట దోషము కూడ యందము గొని గుణమయి భాసించుచున్నది. సొంపు గొని యీ పిల్ల కనుగొనలు (వాల్చూపులు) చెవి దాక వచ్చి సొంపు గొన్నవి. కాబట్టి ఏదో యొక కారణముల బట్టి భావములో తెలివి తేటలేర్పడునని తెలిసిన వారందురు. చెవులకు నేత్రములు భూషణములు. కన్నులకు చెక్కిళ్ళు భూషణములు. ఇక్కడి కుండలములకు కాటుకలకు నేలాటి యవసరము లేదు. హృదయమును రెండుగా జేయుట కటాక్షములకు న్యాయము గాదు. (అనగా ఆవాలు చూపులు పైవాలినంత నెంతధీరునికైన మనసట్టిట్టగు నన్నమాట.) నీ చుట్టాలిక్కడ నున్నవారు దుఃఖము పాలెట్టగుదురు? పాత్రోచితమయిన గుణముల వలన వికారము గూడ సర్వ సుందరమని (చక్కదనము) అందురు. ఒక పిల్లకోసము వృద్ధక్షణశతానం- పెంపుగొన్న యీ నూరు క్షణముల ఫలము ఇందున కనబడినది. శుభలక్షణము. -:ఇంద్ర ఉవాచ:- కా చ కశ్చ కుతశ్చ త్వ మగతా సుభ్రు ! కథ్యతామ్ | ఏకాకినీ కిమర్థం చ వీధి మధ్యేతు తిష్ఠసి || 146 యా న్యేతా న్యంగ సంస్థాని భూషణాని భిభర్షి చ | నైతాని తవ భూషాయై త్వ మేవేషాం హి భూషణమ్ || 147 న దేవీ స చ గంధర్వీ నా సురీ న చ పన్నగీ || కిన్నరీ దృష్టపూర్వా వా యాదృశీ త్వం సులోచనే ! || 148 ఉక్తా మయాపి೭ బహుశః కస్మా ద్ధత్సే హి నోత్తరమ్ | త్రపాన్వితా తు సా కన్యా శక్రం ప్రోవాచ వేపతీ || 149 సృష్టికర్త నానా రూపముల నంద చందముల చక్క దిద్దుటలో తన నేర్పున కెల్ల యెల్లగ నీమెను బ్రదర్శించెను. మానసుల మనముల నీమె తన లీలా విలాసముల స్నేహ భరితములు సేయుచున్నది. ఇలా విమర్శించుచు నామె సౌందర్యమునకుం దెల్లవోయి మేను బులకలం గ్రమ్ముకొనెను. క్రొత్త బంగారు వన్నె మేను తామర రేకు లంత కన్నులుం గల యామెం గని, దేవగంధర్వాదుల నెందఱనో చూచితి. నీలాటి యందగత్తెం జూడలేదు. త్రిభువనము లందున్న యంద మెల్ల జేకొని విధాత యీమె రూపు దిద్దెను. అని యింద్రు డిట్లామెను బలుకరించెను. సుందరి! నీ వెందుండి వచ్చితివి? చెప్పుము. ఒంటికత్తెవై వీధులం నిలిచినావు! మేన నీవు దాల్చిన నగలు నీకు భూషణములు కావు. వానికే నీవు భూషణమవు. సునేత్రా! దేవివి కావు, గంధర్వివి కావు, ఆసురివికావు. నాగివి కావు. మున్ను నేజూచిన కిన్నరివి కావు. ఎంతో అడుగుచున్నాను గదా! జవా బీయ వేమి? అన్నంత నప్పు డాకన్య సిగ్గువడి వణకుచు యింద్రుని కిట్లనెను. 149 కన్యోవాచ :- గోపకన్యా త్వహం వీర! విక్రీణా మీహ గోరసమ్ | నవనీత మిదం శుద్ధం దధి చేదం విమండకమ్ || 150 దధ్నా చైవా೭త్ర తక్రేణ రసేనా೭పి పరంతప ! | ఆర్థీ యేనా೭సి తద్‌బ్రూహి ప్రగృహ్ణీష్వ యథేప్సితమ్ || 151 ఏవ ముక్త స్తదా శక్రో గృహీత్వా తాం కరే దృఢమ్ | అనయ త్తాం విశాలాక్షీం యత్ర బ్రహ్మా వ్యవస్థితః || 152 నీయమానా తు సా తేన క్రోశంతీ పితృ మాతరౌ | హా తాత ! మాత! ర్హా భ్రాత! ర్నయ త్యేష నరో బలాత్ || 153 యది తే೭స్తి మయా కార్యం పితరం మే ప్రయాచథ | స దాస్యతి హి మాం నూనం భవతః సత్య ముచ్చతే || 154 నేనైతే గొల్ల పిల్లను. ఓవీరుడా! ఇక్కడ ఆవుపాలు పెరుగు అవీ అమ్ము చున్నాను. ఇదిగో వెన్న మంచిది ఇదిగో మీగడ పెఱుగు. తపశ్శాలివిలా ఉన్నావు. పెఱుగా మజ్జిగా ఏమిరుచి నీకు కావాలి అదిసెప్పు. ఇష్టము వచ్చినది తీసికో. అన నింద్రుడామెను చేత గట్టిగా మెలివడు బట్టు కొని యా విశాలాక్షిని బ్రహ్మయున్న చోటికి గొంపోయెను. 154 కా హి నాభిలషే త్కన్యా భర్తారం భక్తి వత్సలమ్| నా೭దేయ మస్తి తే కించి త్పితు ర్మే ధర్మవత్సల || 155 ప్రసాదయే త్వాం శిరసా మాం సంతుష్టఃప్రదాస్యతి | ఇత్థ మాభాష్యమాణస్తు తయా శక్రో೭నయచ్చ తామ్ || 156 బ్రహ్మణః పురతః స్థాప్య ప్రాహా೭స్యార్థే మయా೭బలే| అనీతా೭సి విశాలాక్షి ! మా శుచో వరవర్ణిని || 157 అట్లు కొని పోవుచుండ నామె గోల పెట్టుచు అయ్యో, అయ్యా! అమ్మా, అన్నయ్యా! అని గోల పెట్టుచు ఈ నరుడు నన్ను బలాత్కారముగ కొని పోవుచున్నాడు. నాతో పని ఉంటే మా అయ్య నడుగుకో. ఆతడు నన్నిస్తాడు. తప్పక తమతో నిజ మాడుచున్నాను. ఏ పిల్ల భక్తి యందు వాత్సల్యము కల వానిని కోరదు? ధర్మవత్సలా ! నీ కీయ రాని వస్తువు నా తండ్రి కేదీ లేదు. తలవంచి యా యనను బ్రతిమాలెదను. సంతుష్టుడై యత డిచ్చును. మా తండ్రి మనసు దెలియకుండ నీకు నన్నిత్తునేని ధర్మము దెబ్బ తినును. అందుచే నేను నిన్ను బ్రతిమాలుట లేదు. మా అయ్య నీ కిచ్చెనేని నీవశములో నే నుంటాను. 157 గోపకన్యాచ తం దృష్ట్వా గౌరవర్ణం మహాద్యుతిమ్ | కమలాక్షం సుబాహ్వంసం పుండరీక నిభేక్షణమ్ || 158 తప్త కాంచన సద్భిత్తి సదృశా೭పీన వక్షసమ్ | మత్తేభ హస్త వృత్తోరు రమ్యోత్తుంగ తలత్విషమ్ || 159 ప్రాప్తం సా೭మన్యతా೭త్మానం మన్మథస్యేషు గోచరే | తత్ప్రాప్తి హేతుక ధియా గత చిత్తేవ లక్ష్యతే || 160 ప్రభుత్వ మాత్మనో దానే గోపకన్యా೭ప్యమన్యత | యద్వేష మాం సురూపత్వా దిచ్ఛయా దాతు మా గ్రహాత్ || 161 నాస్తి సీమంతినీ కాచి న్మత్తో ధన్యతరా భువి | అనేనా೭హం సమానీతా యచ్చ దృగ్గోచరం గతా || 162 అస్య త్యాగే భ##వే న్మృత్యు రత్యాగే జీవితం సుఖమ్ | భ##వేయ మపమానాచ్చ సర్వదా దుఃఖదాయినీ || 163 దృశ్యతే చక్షుషా೭నేన యో೭పి యోషి త్ప్రసాదతః ! సా೭పి ధన్యా న సందేహః కిం పున ర్యా పరిత్యజేత్ || 164 జగ ద్రూప మశేషం కా పృథ క్సంచార మాస్ఠితమ్ | లావణ్యం తదిహైకస్థం దర్శితం విశ్వయోనినా || 165 అస్యోపమా స్మరః సాధ్వీ మన్మథస్యోపమా త్వహమ్ | తిరస్కృతస్తు శోకో೭యం పితా మాతా న కారణమ్ || 166 యది మాం నైష ఆదత్తే న్వల్పం మయి న భాషతే | అస్యా೭ను స్మరణా న్మృత్యుః ప్రభవిష్యతి శోకజః || 167 మనాగపి చ పత్న్యాం తు క్షి ప్రం పాతయ మీదృశీ | కుచయో ర్మణిశోభాయై శుద్ధా ೭ంబుజ సమద్యుతిః || 168 ముఖ మస్య ప్రపశ్యంత్యా మనో మే ధ్యానమాగతమ్ | అస్యా೭ంగస్పర్శ సంయోగం న వాయో| బహుమన్వ సే || 169 స్పృశ న్నతిశ##యేన త్వం శరీరం ప్రాణినాం వరమ్ | అథవా೭స్య న దోషో೭స్తి యదృచ్ఛాచారకో హ్యసి || 170 సుపితః ! స్మర నూనం త్వం సంరక్ష స్యాం ప్రియాం రతిమ్ | త్వత్తో೭పి దృశ్యతే యేన రూపేణా೭యం స్మరాధికః ||171 మమా೭నేన మనో రత్నం సర్వస్వం చ హృతం దృఢమ్ | శోభా యా దృశ్యతే వక్త్రే సా కుతః శశ లక్ష్మణి || 172 ఇట్లు ముచ్చటింప నింద్రుడాబాలికను గొంపోయి బ్రహ ముందు నిలిపి : అబలా! ఏదో పరియాచకంగా నిన్ను తీసుకొని వచ్చినాను. విశాలాక్షి! వరవర్ణిని= సాధ్వి (పతివ్రతా!) అనెను - గోపకన్యయు బ్రహ్మను జూచి గౌరవర్ణుడు= (పసుపుఎఱుపుగలిసిన రంగువాడు) చక్కని బుజాలు మూపులు తెల్ల దామరలవంటి కన్నులు మేలిమి బంగారు నొనట్లు నిండుగా బలిసిన ఱొమ్ము. మదపు టేనుగు తొండ మట్టి తొడలు. ఎఱ్ఱని గోళ్లు గల యాతని తనకు ప్రాప్తించిన వానింగని తానతాను మన్మథబాణములకు గురియైతి నను కొనెను. ఆతడు లభించెనన్న తలపుతో నామె మతి దప్పిన దట్లు కనిపించెను. గోపిక తనను దానిచ్చుకొని నధికారము తనకున్నట్లను కొనెను. ఈతడు నన్నందగత్తె నని తనకు నేనని జేకొన నిచ్చగించునేని, నా కంటే ధన్యురాలిం కొకతె భూమిపై లేదు. ఈయనచే నేను గొని రా బడితిని. ఈయన కంటబడితిని. ఈతని విడిచిన జావగును. విడువకున్న నాబ్రతుకు సుఖ మగును. ఈయన గాదన్న అవమానము వలన పాడువడిన రూపుతో నందఱకు దుఃఖము గూర్చు దాన నయ్యెదను. ఏయింతియేని ఈయన అనుగ్రహము గొని జూచినంజాలు. నాబిడ ధన్యురాలు అదృష్టవంతురాలు. సందేహము లేదు. కౌగిలించు కొనెనా మఱి యేమనవలెను? ఆశేష జగత్సౌందర్యము వేర వేర సంచారములో నున్న దదెల్ల లావణ్య మీ యొక్కచోట విశ్వయోని పరమాత్మ ప్రదర్శించినాడు. ఈయనకు మన్మధుడుసాటి. మన్మథుని సాధ్వి రతీదేవికి సాటి నేను. నోపమా సకలం కస్య నిష్కలంకేన శస్యతే | విద్రుమో೭ప్యధరస్యా೭స్య లభ##తే నోపమా ధ్రువమ్ || 173 యది కించి చ్ఛుభం కర్మ జన్మాంతర శ##తైః కృతమ్ | తత్ప్రసాదాత్ పుమాన్ భర్తా భవ త్యేష మమేప్సితః 174 ఏవం చితా పరాధీనా యావ త్సా గోపకన్యకా | తావ ద్ర్బహ్మా హరిం ప్రాహ యజ్ఞార్థం సత్వరం వచః || 175 దేవీ చైషా మహాభాగా గాయత్రీ నామతః ప్రభో! | ఏవ ముక్తే తదా విష్ణు ర్బ్రహ్మాణం ప్రోక్తవా నిదమ్ || 176 విష్ణురువాచ : తదేనా ముద్వహస్వా೭ద్యమయా దత్తాం జగత్ప్రభో | గాంధర్వేణ వివాహేన వికల్పం మా కృథా శ్చిరమ్‌ః || 177 ఆముం గృహాణ దేవా೭ద్య అస్యాః పాణి మనాకులమ్ | గాంధర్వేణ విధానేన ఉపయేమే పితామహః || 178 తా మవాప్య తదా బ్రహ్మా జగాదా೭ధ్వర్యు సత్తమమ్ | కృతా పత్నీ మయా హ్యేషా సదనే మే నివేశయ || 179 మృగశృంగధరా బాలా క్షౌమవస్త్రా೭వగుంఠితా | పత్నీశాలాం తదా೭నీతా ఋత్విగ్భి ర్వేదపారగైః || 180 ఔదుంబరేణ దండేన ప్రావృతో మృగచర్మణా | మహాధ్వరే తదా బ్రహ్మా దామ్నా స్వేనైన శోభ##తే || 181 ప్రారబ్ధం చ తదా హోత్రం బ్రాహ్మణౖ ర్వేదపారగైః | భృగుణా సహితైః కర్మ వేదోక్తం తైః కృతం తదా| తధా యుగ సహస్రం తు స యజ్ఞః పుష్కరే೭భవత్ || ఇతి శ్రీపద్మ పురాణ ప్రథమే సృష్టిఖండే గాయత్రీ సంగ్రహో నామ షోడశో೭ధ్యాయః. నా ఈ దుఃఖము తీరి పోయినది తండ్రి గాదు తల్లి గాదు కారణము. ఒక వేళ నితడు నన్ను జేకొనడేని నించుక నా విషయము మాటలాడడేని యీ యననే తలచుకొని శోకించుట వలన నాకు చావగును. ఏ యపరాధము లేకుండా యీలాటి దురవస్థకు నేను పాలు గావలసి యుందును. కుచములకు రత్నా లలంకార శోభ రావలెనని అచ్చము తామర పూవు వంటి శోభ గల యీతని ముఖము చూచుచుండగా నా మనస్సు ధ్యానమున దిగెను. ఓ వాయువూ! నీతని శరీర స్పర్శ సంయోగము మహాయోగ మని యను కొనుట లేదు. అందుకే ప్రాణుల శరీరమే మంచిదని తెగ తిఱుగుచున్నావు. లేదా ఇతని తప్పు లేదు. నీవు ఇష్టము వచ్చినట్లు తిరుగు స్వేచ్ఛాచారుడవు. తిరుగుబోతువు కదా! మన్మథా! మారా ! విరహులను జంపువాడవు. నీవు ముషితుడవు= మోసగింపబడినావు నిజ మిది. నీవు నీ ప్రియురాలిని బెండ్లామును రక్షించుకో. 177 నీ కంటె అందగాడు ఈతడు కనబడు చున్నాడు. ఇతడు నా మనోరత్నమును (మనస్సు అను రత్నమును) నా సర్వస్వమును దొంగిలించి నాడు నిజ మిది. ఈయన ముఖ మందు గనిపించు శోభ వేడి మచ్చగల చంద్రునం దెట్లుండును? కళంకము గలవానికి నిష్కళంకునితో సామ్య మేమి బాగుండదు. 179 తామర పువ్వు ఈతని కన్నులకు సాటి రాదు. నీటి శంఖముతో ఈయన చెవి సంకువులకు పోలిక యేమి? ఈయన పెదవికి పవడము సామ్యముండదు. ఈయన పెదవి ఆత్మస్థమైన ఈ తనయందున్న, అమృతమును సర్వాంతరస్థమైన బ్రహ్మానందమును జాల్కొల్పును. (అట్టి దానికి జడమైన యీ పవడముతో పోలిక లేదన్నమాట) కొంచె మేని మంచి పని వందల కొలది జన్మముల జేసితి నేని ఆ ప్రసాదముచే నీ మహాపురుషుడు నే కోరినవాడు భర్తయగును. అని యిలా చింతించుచు పరాధీనయై గోపిక యుండగా బ్రహ్మ యజ్ఞము కొఱకు తొందరగొని హరిం గూర్చి ప్రభూ! మహానుబావురాలగు నీమె 'గాయత్రి' యనుపేరుతో విలసిల్లును. అనగానే బ్రహ్మనుగూర్చి విష్ణుమూర్తి యిటు పల్కెను. -: బ్రహ్మతో విష్ణువు :- ఈమె నిపుడు నే నిత్తును జగత్ప్రభూ ! గాంధర్వ వివాహమున వివాహ మాడుము. దీనికిమారు సేయకుము. ఆలస్యము వద్దు. దేవా! యీమె పాణిం గ్రహింపుము. కంగారు పడకు. అని హరి యనగానే పితామహుడు గాంధర్వ వివాహముచే నామెను గైకొనెను. బ్రహ్మ జగత్తు నందధ్వర్యుల కెల్ల నుత్తముని బృహస్పతిం గని, ఈమెను నేను పత్నిని జేసి కొన్నాను. మా గృహ మందు బ్రవేశింప జేయు మనెను. లేడికొమ్ము చేబట్టి పట్టు చీర పై గప్పుకొని యా దేవపత్ని వేద పారగులైన ఋత్విక్కులచే నపుడు పత్నీ శాలకు రావింప బడెను. మేడి దండముతో లేడిచర్మముపై దాల్చి యపుడమ్మహా యజ్ఞమున బ్రహ్మ తన తేజస్సుచేతనే తానెంతో శోభించెను. అవ్వల వేదపారగులైన బ్రాహ్మణులు శుక్రాచార్యులతో ప్రారంభముసేసిరి. వారు వేదోక్త విధానమున సర్వమెనరించిరి. ఆ విధముగ పుష్కర క్షేత్ర మందా యజ్ఞము వేయి యుగములు జరిగెను. 190 ఇది శ్రీ పద్మపురాణము ప్రథమము సృష్టిఖండము బ్రహ్మయజ్ఞములో గాయత్రీ సంగ్రహమను పదునాఱవ యధ్యాయము.