Sri Padma Mahapuranam-I
Chapters
సప్తదశో೭ధ్యాయః -: బ్రహ్మయజ్ఞే శివస్య భిక్షోద్దేశేనా೭గమనమ్ :- భీష్మ ఉవాచ :- తస్మిన్ యజ్ఞే కిమాశ్చర్యం తదాసీ ద్ద్విజసత్తమ | కథం రుద్రః స్థిత స్తత్ర విష్ణుశ్చా೭పి సురోత్తమః || 1 గాయత్ర్యా కిం కృతం తత్ర పత్నీత్వే స్థితయా తయా | ఆభీరైః కింను తత్త్వజ్ఞె రాజ్ఞత్వా తైశ్చ కృతం మునే! || 2 ఏత ద్వృత్తం సమాచక్ష్వ యథావృత్తం యథాకృతమ్ | ఆభీరై ర్బ్రహ్మణా వా೭పి మమేత త్కౌతుకం మహత్ || 3 పులస్త్య ఉవాచ: తస్మి న్వజ్ఞే యదా೭శ్చర్యం వృత్త మాసీ న్నరాధిప! కథయిష్యామి తత్సర్వం శృణుషై#్వకమనా నృప! || 4 రుద్రస్తు మహాదాశ్చర్యం కృతవాన్వై సదో గతః | నింద్య రూవ ధరో దేవః స్థితో೭ సౌ ద్విజ సన్నిధౌ || 5 విష్ణునా న కృతం కించి త్ప్రాధాన్యేన యతః స్థితః | నాశం తు గోప కన్యాయా జ్ఞాత్వాగోప కుమారకాః || 6 గోప్యశ్చ తా స్త థా సర్వా ఆగతా బ్రహ్మణో೭ంతికమ్| దృష్ట్వా తాం మేఖలా బద్ధాం యజ్ఞసీమ వ్యవస్థితామ్ || 7 హా పుత్రీతి తదా మాతా పితా హా | పుత్రికేతి చ | స్వసేతి బాంధవాః సర్వే సఖ్యాః సఖ్యేన హా! సఖి || 8 కేన త్వ మిహ చా೭ నీతా కేన కస్మాచ్చ వేష్టితా | శాటీం నివృత్తాం కృత్వా తు కేన యుక్తా చ కంబలీ || 9 కేన చేయం జటా పుత్రి! రక్త సూత్రా೭వ కల్పితా! ఏవం విధాని వాక్యాని శ్రుత్వోవాచ పురందరః || 10 ప్రతిషిధ్య తు తా నేవం సర్వా నేవ ప్రసాదయన్ | ఇహ చా೭స్మాభి రానీతా పత్న్యర్థం వినియోజితా || 11 ఇంద్ర ఉవాచ బ్రహ్మణా೭లంబితా బాలా ప్రలాపం మా కృథాస్త్విహ | పుణ్యా చైషా సుభాగ్యా చ సర్వేషాం కుల నందినీ || 12 పుణ్యా చేన్న భవత్యేషా కథ మాగచ్ఛతే సదః | ఏవం జ్ఞాత్వా మహాభాగ ! న త్వం శోచితు మర్హసి || 13 గోపాం స్త్వవష్టభ్య తు తదా శక్రవాక్యా దనంతరమ్ | ఉవాచ స్నిగ్ధయా వాచా ప్రతినంద్య హరిః పునః || 14 విష్ణురువాచ: భోభోగోప! సదాచార ! న త్వం శోచితు మర్హసి| కన్యైషా తే మహాభాగా ప్రాప్తా దేవం విరించినమ్ || 15 యోగినో యోగియుక్తా యే బ్రాహ్మణా వేదపారగాః | న లభంతే ప్రార్థయంత స్తాం గతిం దుహితా గతా || 16 ధర్మవంతం సదాచారం భవంతం ధర్మవత్సలమ్ | మయా జ్ఞాత్వా తతః కన్యా దత్తా చైషా విరించయే || 17 అనయా తారితో గచ్ఛ దివ్యా న్లోకా న్మహోదయాన్ | యుష్మాకం చ కులే చా೭ పి దేవ కర్యా೭ర్థ సిద్ధయే || 18 అవతారం కరిష్యే೭హం సా క్రీడా తు భవిష్యతి | యదా నంద ప్రభృతయో హ్యవతారం ధరాతలే || 19 కరిష్యంతి తదా చా೭హం వసిష్యే తేషు మధ్యతః | యుష్మాకం కన్యకాః సర్వా రమిష్యంతే మయా సహ || 20 తత్ర దోషో న భవితా న ద్వేషో న చ మత్సరః | కరిష్యంతి తదా గోపా భయం చ న మనుష్యకాః || 21 న చా೭సాం భవితా దోషః కర్మణా೭ నేన కర్హిచిత్ | శ్రుత్వా వాక్యం తదా విష్ణో రూచు ర్గోపాః ప్రణమ్య తమ్ || 22 భీష్ముడు విప్రోత్తమ: ఆబ్రహ్మయజ్ఞమందు వింతలేమి జరిగినవి? రుద్రుడు విష్ణువునట నెట్లుండిరి? గాయత్రి యజమాన పత్నిగా నుండెను గదా యామె యేమి సేసినది? నిజము తెలిసిన తరువాత గాయత్రి పుట్టినింటివారు గొల్ల లేమి సేసిరి? వారితో బ్రాహ్మణు లెట్లు ప్రవర్తించింది. వినవలెనని వేడుక గొన్నాడ నానతిమ్మన పులస్త్యుడనియె. రాజా! ఆ యజ్ఞమందు జరిగిన యాశ్చర్యమెల్ల దెలిపెద విను. రుద్రుడు నింద్యరూపుడా బ్రాహ్మణులం దుండెను. విష్ణువక్కడ ప్రధాను డగుటచే నాయన యేపని సేయలేదు. గొల్ల పిల్లకు ప్రమాదము జరుగునని తెలిసి గొల్లలు గోపికలందఱు బ్రహ్మదఱికి వచ్చిరి. ఆ పిల్ల నడుమునకు మౌంజి (ముంజిగడ్డితో పేనిన) త్రాడు గట్టియుండుట చూచి తల్లి అయ్యో పిల్లా యని తండ్రి అయ్యో కూతురా యని, చుట్టాలు చెల్లాయి, స్నేహితురాండ్రు నెచ్చెలీయని వాపోవుచు ఎవడు నిన్నిటకు గొని వచ్చినారు? ఈ మూడు పేటల ముంజి త్రాడు నీ నడుముకు బిగించినా రెవరు? ఈ కంబళి యేమి? నీపై కప్పిరి? ఎఱ్ఱ త్రాటితో నీ జడ వేయబడినది? ఇదంతా ఎవరి పని? యనుచు పలు రీతులు గొల్లలాడు పలుకులు విని ఇంద్రుడు వలదు వలదు అట్ల నకుడనివారి ననునయించెను. అప్పుడింద్రు డిట్లనియె. మీ పిల్ల నిటకు దీసి కొనివాచ్చినాము. యజ్ఞమునకు యజమానియగు బ్రహ్మకు పత్నిగా నుపయోగ పరిచినాము. బ్రహ్మ యీమెను జెపట్టినాడు పేలకుడు మీరు. పుణ్యాత్మురాలీ పిల్ల. మంచి అదృష్టవంతురాలు, కుల మంతను సంతోషపెట్టునది. పుణ్యాత్మురాలే కానిచో నీయజ్ఞ సదస్సున కేలా రాగలదు? ఈ సంగతి తెలిసి నీవు చింతపడకు మని యా పిల్లతండ్రిని సముదాయించెను. అపుడు విష్ణు విట్లనియె. విష్ణు వనియె :- ఓ గొల్లా! మంచి యాచార వంతుడా! చింతింపకు. నీ కుమార్తె మహానుభావురాలు. బ్రహ్మను బొందినది. మహాయోగులు వేదాలు చదివిన బ్రాహ్మణులు కూడా పొందలేని స్థాన మందు కొన్నది. నీవు ధన్యాత్ముడవు, ఆచారవంతుడవు. ధర్మవత్సలుడవు నని తెలిసియే మీ కన్యకను బ్రహ్మదేవుని కిచ్చితిని. ఈమె నిన్ను దరింప జేయగలదు. పరమోత్తమ లోకాలకే గురువు నే నవతారమెత్తెదను. అది నా కొక మాట. నందాదు లవతరించి నపుడేను వారి మధ్య నుందును. మీ పిల్లలందఱు నాతో రమింతురు. అందు తప్పు లేదు. ద్వేషము గాదు మత్సరము గాదు. మానవులైనను గొల్ల లపుడు భయపడరు. ఈ గోపికల కేదోషము కలుగదు. విష్ణువు పలుకు లాలించి గొల్ల లాయనకు మ్రొక్కి యిట్లనిరి. 22 ఏవ మేవ వరో దేవ! యో దత్తో భవితా హి మే| ఆవతారః కులే೭స్మాకం కర్తవ్యో ధర్మసాధనః || 23 భవతో దర్శనా దేవ భవామః స్వర్గ వాసినః | శుభదా కన్యకా చైషా తారిణీ మే కులైః సహ || 24 ఏవం భవతు దేవేశ ! వరదానం విబో! తవ | అనుతీతా స్తదా గోపాః స్వయం దేవేన విష్ణునా|| 25 బ్రహ్మణా೭ప్యేవ మేవం తు వామ హస్తేన భాషితమ్ | త్రపా೭న్వితా దర్మనే తు బంధూనాం వరవర్ణినీ || 26 కై రహం తు సమాఖ్యాతా యేనేమం దేశ మాగతా | దృష్ట్వా తు తాం స్తతః ప్రాహ గాయత్రీ గోప కన్యకా|| 27 గాయత్ర్యువాచ: వామహస్తేన తా న్సర్వాన్ ప్రణిపాత పురస్సరమ్ | అత్ర చా೭హం స్థితా మాత! ర్బ్రహ్మాణం సముపాగతా|| 28 భర్తా లబ్ధో మయా దేవః సర్వస్యా೭ద్యో జగత్పతిః | నా೭హం శోచ్యా భవత్యా ను న పిత్రా న చ బాంధవైః 29 సఖీగణశ్చ మే యాంతు భగిన్యో దారకైః సహ | సర్వేషాం కుశలం వాచ్యం స్థితా೭స్మి సహ దైవతైః 30 గతేషు తేషు సర్వేషు గాయత్రీ సా సుమధ్యమా | బ్రహ్మణా సహితా రేజే యజ్ఞ వాటం గతా సతీ || 31 ఈలాగే మాకు వరమిచ్చినావు. ధర్మము సాధించుటకు మా కులమందు నీ వవతరింప వలసినదే. నీ దర్శన మాత్రమున మేము సర్వర్గవాసుల మయ్యెదము. ఈ కన్య శోభన దేవత. తరతరాల లోకము ద్ధరింప గలదు. ప్రభూ నీ విచ్చిన వర మిట్లే యగు గాక! యనిరి. విష్ణుదేవుడు తనంత గొల్లల నట్లనునయింప బ్రహ్మదేవుడు నెడమ చేయెత్తి యిది యింతే అని యామోదము సూపెను. గోపకన్య బంధువులందఱలో సిగ్గుపడి నా సంగతి వీరికెవరు సెప్పిరి? నన్నిక్కడకు వచ్చి కనుగొన్న వారందఱకు నమస్కరించుచు నెడమ చేయెత్తి గాయత్రి యిట్లు పలికెను ! అమ్మా నే నిటకు వచ్చినాను. బ్రహ్మను గూర్చి వచ్చి నిలువబడినాను. అందఱ కాది పురుషుడు జగత్పతి నాకు సాక్షాత్తు దేవుడు పతిగా దొరికెను. నీవు గాను మా అయ్యగాని చుట్టాలు గాని నన్ను గూర్చి చింతింప వలసిన పనిలేదు. ఈ నెచ్చెలులు అక్క చెల్లెళ్లు తమ పిల్లలతో నందఱును కుశల మడిగి నానని తెల్పుడు. దేవతలతో గలసి యున్నాను. అనినంత వారందఱు నేగిన తరువాత సుందరి యా సాధ్వి బ్రహ్మతో యజ్ఞవాటమున కేగెను. 31 యాచితో బ్రాహ్మణౖ ర్బ్రహ్మా వరాన్నో దేహి చేప్సితాన్ | యథేప్సితం వరం తేషాం తదా బ్రహ్మా೭ ప్యయచ్చత 32 తయా దేవ్యా చ గాయత్ర్యా దత్తం తచ్చా೭నుమోదితమ్ | సా తు యజ్ఞే స్ఠితా సాధ్వీ దేవతానం సమీపగా || 33 దివ్యం వర్షశతం సాగ్రం స యజ్ఞో వవృధే తదా | యజ్ఞవాటం కపర్థీ తు భిక్షార్థం సముపాగతః || 34 బృహ త్కపాలం సంగృహ్య పంచముండై రలంకృతః | ఋత్విగ్భిశ్చ సదసై#్యశ్చ దూరా త్తిష్ఠన్ జుగుప్సితః 35 కథం త్వ మిహ సంప్రాప్తో నిందితో వేదవాదిభిః | ఏవం ప్రోత్సార్యమాణో೭పి నింద్యమానః స తై ర్ద్విజైః|| 35 ఉవాచ తాన్ ద్విజా న్సర్వాన్ స్మితం కృత్వా మహేశ్వరః | మహేశ్వర ఉవాచ : ఆత్ర పైతామహే యజ్ఞే సర్వేషాం తోషదాయిని |37 కశ్చి దుత్సార్యతే నైవ ఋతే మాం ద్విజసత్తమాః | ఉక్తః స తైః కపర్ధీ తు భుక్త్వా చా೭న్నం తతో వ్రజ || 38 కపర్దినా తు తే ఉక్తా భుక్త్వా యాస్యామి భో ద్విజాః ! | ఏప ముక్త్వా నిషణః స కపాలం న్యస్య చా೭గ్రతః || 39 బ్రాహ్మణులు ప్రార్ధింప బ్రహ్మ వారడిగిన వరము లన్నియు నిచ్చెను. గాయత్రీదేవి యాయన వారి కిచ్చిన వరము నామోదించెను. ఆమె వేల్పుల దగ్గరగా యజ్ఞమందామె కూర్చుండెను. నూఱు దివ్య వర్ష మూలాయజ్ఞము సాగెను. 39 తేషాం నిరీక్ష్య తత్కర్మ చక్రే కౌటిల్యమీశ్వరః | ముక్త్వా కపాలం భూమౌ తు తాస్ ద్విజా నవలోకయన్ || 40 ఉవాచ పుష్కరం యామి స్నానార్థం ద్విజసత్తమాః ! తూర్ణం గచ్ఛేతి తై రుక్తః స గతః పరమేశ్వరః || 41 వియత్ స్ధితః కౌతుకేన మోహయిత్వా దివౌకసః | స్నానార్థం పుష్కరం యాతే కపర్దిని ద్విజాతయః || 42 కధం హోమో೭త్ర క్రియతే కపాలే సదసి స్థితే | కపాలాంతా న్యశౌచాని పురా ప్రాహ ప్రజాపతిః || 43 విప్రో೭భ్యధా త్సదస్యేకః కపాల ముత్‌క్షిపామ్యహమ్ | ఉద్ధృతం తు సదస్యేన ప్రక్షిప్తం పాణినా స్వయమ్ 44 తావ దన్యత్ స్థితం తత్ర పున రేవ సముద్ధృతమ్ | ఏవం ద్వితీయం తృతీయం వింశతి స్త్రింశ దప్యహో ! || 45 పంచాశచ్చ శతం చైవ సహస్ర మయుతం తథా | ఏవం నాంతః కపాలానాం ప్రాప్యతే ద్విజసత్తమైః || 46 నత్వా కపర్దినం దేవం శరణం సముపాగతాః | పుష్కరా೭రణ్య మాసాద్య జపై#్యశ్చ వైదికై ర్భృశమ్ || 47 తుష్ణువుః సహితాః సర్వే తావ త్తుష్టో హరః స్వయమ్ | తత స్స దర్శనం ప్రాదా ద్ద్విజానాం భక్తితః శివః || 48 ఉవాచతాం స్తతో దేవః భక్తి నమ్రాన్ ద్విజోత్తమాన్ | శివ ఉవాచ : పురోడాశస్య నిష్పత్తిః కపాలం న వినా భ##వేత్ || 49 కురుధ్వం వచనం విప్రా! భాగః స్విష్టకృతో మమ| ఏవం కృతే కృతం సర్వం మదీయం శాసనం భ##వేత్ || 50 తథే త్యూచు ర్ద్విజా శ్శంభుం కుర్మో వై తవ శాసనమ్ | కపాల పాణి రాహేశో భగవంతం పితామహమ్ || 51 వరం వరయ భో బ్రహ్మన్! హృది యత్తే ప్రియం స్థితమ్| సర్వం తవ ప్రదాస్యామి ఆదేయం నాస్తిమే ప్రభో|| 52 బ్రహ్మోవాచ: న తే వరం గ్రహీష్యామి దీక్షితో೭హం సదః స్ధిత | సర్వ కామ ప్రదశ్చా೭హం యో మాం ప్రార్ధయతే త్విహ 53 ఏవం వదంతం వరదం క్రతౌ తస్మిన్ పితామహమ్ | తథే త్వుక్త్వాతు రుద్ర స్స వర మస్మా దయాచత || 54 తతో మన్వంతరే೭తీతే పున రేవ ప్రభుః స్వయమ్ | బ్రహ్మోత్తరం కృతం స్థానం స్వయం దేవేన శంభునా || 55 చతుర్ష్వపి చ వేదేషు పరినిష్ఠాం గతో హి యః | తస్మిన్ కాలే తదా దేవో నగరస్యా೭ వలోకనే || 56 సంభాషణ ద్విజానాం తు కౌతుకేన సదో గతః | తేనైవోన్మత్త వేషేణ హుత శేషే మహేశ్వరః || 57 ప్రవిష్టో బ్రహ్మణః సద్మ దృష్టో దేపై ర్ద్విజోత్తమైః | ప్రహసంతి చ కే೭ ప్యేనం కేచి న్ని ర్భర్త్సయంతి చ || 58 కపర్ధి (జడదారి) శంకరుడు భిక్షకొఱకు యజ్ఞవాటమున పెద్ద పుర్రె చేకొని యైదుపుర్రెలు మేనగైసేసి వచ్చెను. ఋత్విక్కులు సదస్యులు (సభ్యులు) దూరమందు నిలిచిన యాయనం గని యేవగించుకొనిరి. వేదవాదులు నిందింప బ్రాహ్మణులు పొమ్మని లేవగొట్టిరి. నీ విటకెటుల వచ్చితివి? అన విని మహేశ్వరుడు నవ్వి యిట్లనియె. బ్రాహ్మణోత్తములారా ! అందరికీ సంతోషము కూర్చు నీ బ్రహ్మయజ్ఞమందు నేను దప్ప వెడల గొట్టబడిన వాడు లేడు. కానిండన వారు భోజనము సేసి పొమ్మనిరి. సరే అలాగే వెళ్ళెదనని కూర్చుండీ ముందా పుర్రె నుంచి వారు చక్రము తిఱిగినట్దు తిఱుగుతూ చేయుచున్న యా యజ్ఞకర్మను జూచి కపాలములు నేలపై నుంచి పుష్కరమునకు స్నానము కొఱకు వెళ్ళెను. పో త్వరగా పొమ్మని వారన నింగి నిలిచి దేవతలను మోహపెట్టి స్నానమునకు వెళ్లగా యజ్ఞ సదస్సులో నీ పుర్రె ఉండగా హోమ మెలాచేయుట? పుర్రెతో ననాచారములతో సరి అని (అనగా దానిని మించిన మైల మరి లేదన్నమాట) ఈలా బ్రహ్మ యెపుడో అన్నారు. సదస్సులలో నొకడు కాపాలాన్ని విసరి పారేస్తా నని యెత్తి విసరివేసెను. అంతట మరి యొక కపాలము వచ్చిపడెను. అది విసరి వేసెను. ఈ రెండు మూడు ఇరవై ముప్పది యేబది నూరు వేయి పదివేలు అంతు లేకుండా కపాలాలు బ్రాహ్మణోత్తముల కన్నీ కపాలాలే అపుడా జడదారి నా వేల్పులందరు శరణు బొందిరి. పుష్కరారణ్యమున కేగి ఎంతో వేదమంత్రాలు జపించి యంద రేకమై స్తుతించిరి. అంతట నా యబ్బులింగడు తనకు దా సంతుష్టు డయ్యెను. ఆపై భక్తిచే వ్రాలి మ్రొక్కిన వారిం గని శివు డిట్లనియె. కపాలము లేకుండా పురోడాశము తయారుకాదు. నేను జెప్పినట్లు చేయుడు. స్విష్టక్వత్తులో భాగము నా కిండు. ఇట్లు సేసిన నా యాజ్ఞయెల్ల జేసి నట్లగును. అన నట్లే మీ యానతి నిర్వహింతు మని శంభునితో విప్రులనిరి. అప్పుడు కపాలము చేత గొని యీశ్వరుడు భగవంతుడు బ్రహ్మను గూర్చి యిట్లనియె: ఓ బ్రహ్మా! నీ హృదయ మందున్న వర మిష్ట మైనది కోరు కొను మంతయు నీ కిత్తును. బ్రహ్మ యిట్లనెను : ప్రభూ! నీ కీయరాని దేదియు నాకు లేదు. నీ వరము నే దీసికొనను. నేను దీక్షితుడను. యజ్ఞ సదస్సులో నున్నాను. ఇక్కడ నెవ్వరేది ప్రార్థించిన నన్ని కోరికల నే నిత్తును. యజ్ఞ సందర్భమున నిట్లనుచున్న పితామహునిం గని సరే యని రుద్రు డాయన నిట్లు వర మడిగెను. అంతట మన్వంతరము గడువగా శంభుదేవుడు తనకు దా నాయనకు యజ్ఞమందఱకు పైదిగా బ్రహ్మస్థానమేర్పఱచెను. దాన నీతడు నాల్గు వేదములందును పరినిష్ఠను (అగ్రస్థానమును) బొందెను. అత్తఱి నీశ్వరు డట నున్న నగరము చూచి యట బ్రాహ్మణులతో సంభాషింప గుతూహల పడి అదే పిచ్చివాని వేషముతో యజ్ఞ సదస్సున కేగెను. హోమము శేషించి యుండగా బ్రహ్మ సదనముం బ్రవేశించెను. దేవతల విప్రుల కంట గనబడెను. ఆట కొంద ఱాయనం గని పరిహాసము చేసిరి. కొందఱు బెదరించిరి. 58 ఆపరే పాంశుభిః సించం త్యున్మత్తం తం తథా ద్విజాః | లోష్టెశ్చ లగుడై శ్చా೭న్యే శుష్కిణో బలగర్వితాః || 59 ప్రహరన్తిస్మోపహాసం కుర్వాణా హస్త సంవిదమ్ | తతో೭న్యేవటవ స్తత్ర జటా స్వాగృహ్య చాంతికమ్ || 60 పృచ్ఛంతి వ్రతచర్యాం తాం కేనైషాతే నిదర్శితా | అత్ర వామాః స్త్రియః సంతి తాసా మర్థే త్వమాగతః 61 కేనైషా దర్శితా చర్యా గురుణా పాపదర్శినా | యేన చోన్మత్తవ ద్వాక్యం వదన్ మధ్యే ప్రధావసి || 62 శిశ్నం మే బ్రహ్మాణో రూపం భగం చా೭పి జనార్ధనః | ఉప్యమాన మిదం బీజం లోకః క్లిశ్నాతి చా೭న్యథా || 63 మయా೭యం జనితః పుత్రో జనితో೭ నేన చా೭ప్యహమ్ | మహాదేవ కృతా సృష్టిః సృష్టా భార్యా హిమాలయే 64 ఉమా దత్తా తు రుద్రస్య కస్య సా తనయా వద? | మూఢా యూయం న జానీథ వదతాం భగవాంస్తు చః|| 65 బ్రహ్మణా న కృతా చర్యా దర్శితా నైవ విష్ణునా | గిరిశేనా೭పి దేవేన బ్రహ్మ వధ్యా కృతేన తు || 66 కథం స్విద్గర్హసే దేవం వధ్యో೭స్మాకం త్వ మద్య వై | ఏవం తై ర్హన్యమానస్తు బ్రాహ్మణౖ స్తత్ర శంకరః 67 స్మితం కృత్వా೭ బ్రవీ త్సర్వా న్బ్రాహ్మణాన్ నృపసత్తమ ! || శివ ఉవాచ: కి మాం న విత్థ భో విప్రాః ఉన్మత్తం నష్ట చేతనమ్ | 68 యూయం కారుణికాః సర్వే మిత్ర భావే వ్యవస్థితాః | వదమాన మిదం ఛద్మ బ్రహ్మరూపధరం హరమ్ || 69 మాయయా తస్య దేవస్య మోహితా స్తే ద్విజోత్తమాః | కపర్దినం నిజఘ్ను స్తే పాణి పాదైశ్చ ముష్టిభిః 70 దండై శ్చా೭పి కీలైశ్చ ఉన్మత్త వేషధారిణమ్ | పీడ్యమాన స్తత సై#్తస్తు ద్విజైః కోప మథాగమత్ || 71 కొందఱు దుమ్మెత్తి పోసిరి. ఆ పిచ్చివానిని బలవంతులమని కొందఱు పొగ రెక్కి విరగ బడి పరిహసించుచు చేతులెత్తి ఆగు మాగు మని పారలు బెడ్డలు విసరి దుడ్డు కఱ్ఱలం బాదిరి. కొందఱు వటువులు (బ్రహ్మచారులు) ఆయన జడలు బట్టి లాగుచు దరి కీడ్చి ఈ వ్రతచర్య నీ కెవ్వరు చూపిరి. ఇక్కడ నందగత్తెలెందరో యున్నారు. వారికోసము నీవు వచ్చినావు. పాపదృష్టి యెవడు గురువు నీకీ భిక్షాచర్య చూపినాడు? దీనితో వెఱ్ఱి వాడట్లు మాట లాడుచు జనము మధ్య పరువెడు చున్నావు. ఏమి ఈ ప్రేలాపన? నా శిశ్నము బ్రహ్మరూపము భగము విష్ణువు. నేను వదలున దిది గోబీజము. వేఱొకటైనచో లోకము క్లేశము పాలగును. నేనీబిడ్డను (బ్రహ్మను) గన్నాను. నేను నీతని వలన బుట్టినాను. మహాదేవుని కొఱకే సృష్టి చేయ బడినది. హిమాలయ మందు భార్య సృష్టింప బడినది. రుద్రుని కుమ యివ్వబడినది. ఆమె యెవరి కూతరు? చెప్పు. మీరు మూఢులు. మీ రెఱుగరు. మీకు భగవంతుడు తెలియ జెప్పవలె - శివుడు విష్ణువు బ్రహ్మహత్య నిమిత్తమైన ప్రాయశ్చిత్తము బ్రహ్మ చేసి కొన లేదు. బ్రహ్మదేవుని నిందించు చున్నావేల? ఇప్పుడు మా కీవు చంపవలసిన వాడ వైతివి. అన యిట్ల బ్రాహ్మణులచే తిట్టబడి కొట్ట బడి నవ్వి వారందరిని గూర్చి శంకరు డిట్లనియె. ఓ ! విప్రులారా! నేను పిచ్చి వాడనని మతిపోయిన వాడనని యెఱుగరా! మీరందరు జాలి గలవారు. స్నేహభావ మందున్న వారిని యిట్లు పలుకుచు బ్రహ్మస్వరూపము ధరించి యున్న హరుని తెలియక మాయలో బడి పొరబడి యా బ్రాహ్మణోత్తము లా కపర్ధిని (పిచ్చివానివేషములోనున్నవానిని) (జడదారిని) చేతలతో బాది గుద్ది కాళ్లతో దన్నిరి. కఱ్ఱలతో గసికలతో గొట్టిరి. ఇట్లా బాధింప బడి కోపము గొని వారిని శపించె. 71 తతో దేవేన తే శప్తాః యూయం వేదవివర్జితాః | ఊర్ద్వజటాః క్రతుభ్రష్టా పరదారోపసేవినః || 72 వేశ్యానాం తు రతా ద్యూతే పితృ మాతృ వివర్జితాః | రౌద్రీం భిక్షాం సమశ్నంతు పర పిండోపజీవినః|| 73 ఆత్మానం వర్తయంతశ్చ నిర్మమా ధర్మవర్జితాః | కృపార్పితా తు యై ర్విపై#్ర రున్మత్తే మయి సాంప్రతమ్ || 74 తేషాం ధనం చ పుత్రాశ్చ దాసీ దాస మజావికమ్ | కులోత్పన్నాశ్చ వై నార్యో మయి తుషే భజిష్యథ || 75,76 ఏవం శాపం వరం చైవ దత్వా೭ంతర్ధాన మీశ్వరః | గతో ద్విజా గతే దేవే మత్వాతం శంకరం ప్రభుమ్ || 77 అన్విష్యంతో೭పి యత్నేన న చాపశ్యంత తే యధా | తదా నియమ సంపన్నాః పుష్కరా೭రణ్యమాగతాః || 78 స్నాత్వా జ్యేష్ఠ సరో విప్రా జేపు స్తే శతరుద్రియమ్ | జాప్యా೭వసానే దేవ స్తా నశరీర గిరా೭ వదత్ || 79 ఓ విప్రులారా! ఇప్పుడు పిచ్చివానిపై నాపై జాలి లేని మీరు వేద దూరులై మీదికి జడలూవి వ్రత భష్టులు పరదారల వేశ్యల వలచి జూదమాడుచు తల్లి దండ్రులను వదలి పరాన్న భుక్కులై భయంకరమైన బిచ్చ మెత్తుకొని తినుచు నాది యన్న దేదియు లేక ధర్మశూన్యులై బ్రతుకుదురు గాక. నన్ను సంతుష్టుని జేసి నపుడే వాం డకు ధనము కొడుకులు, దాస దాసీ జనములు, మేకలు గొఱ్ఱలు, ఉత్తమ కుల స్త్రీలు గలుగు గాక. ఈ పిచ్చి వానిపై దయ గొన్న వారికే యీ ధనాది సంపద గల్గు గాక! ఇట్లు శాపము పరమునుం గూడ ఇచ్చి స్వామి యంతర్ధాన మందెను. ఆయన వెళ్లి నంతట నా ప్రభువు శంకరు డని తెలిసి కొని పూని యెంత వెదకిన నాయనను గానరైరి. అపుడు నియమ మూని పుష్కరారణ్యమున కేగి జేష్ఠ సరస్సున స్నానము సేసి శతరుద్రియము జపించిరి. జపము తుద నా దేవు డశరీర వాక్కును ఇట్లు పలికెను. 79 శివ ఉవాచ: అనృతం న మయా ప్రోక్తం స్త్వేరేష్యపి కుతః పునః| ఆగతో నిగ్రహే క్షేమం భూయో೭పి కరవాణ్యహమ్ || 80 శాంతా దాంతా ద్విజా యే తు భక్తిమంతో మయి స్థిరాః| న తేషాం చ్చిద్యతే వేదో న ధనం నా೭పి సంతతిః || 81 అగ్ని హోత్రరతా యే చ భక్తిమంతో జనార్దనే | పూజయంతి చ బ్రహ్మాణం తేజోరాశిం దివాకరమ్ || 82 నా೭శుభం విద్యతే తేషాం యేషాం సామ్యే స్థితామతిః | ఏతా వదుక్త్వా వచనం తూష్ణీం భూతస్తు సో೭భవత్ || 83 లబ్ద్వా వరం దేవదేవా త్సప్రసాదం మహేశ్వరాత్ | ఆజగ్ముః సహితాః సర్వే యత్ర దేవః పితామహః || 84 విరించి సహితా జాపై#్య స్తోషయంతో೭ గ్రతః స్థితాః || తుష్ట స్తా న బ్రవీ ద్ర్బహ్మా మత్తో೭పి వ్రియతాం వరః 85 బ్రహ్మణ స్తేన వాక్యేన హృష్టాః సర్వే ద్విజోత్తమాః | కో వరో యాచ్యతాం విప్రాః పరితుష్టే పితామహే || 86 ఏకే తత్ర೭బ్రువ న్విప్రాః వేదాన్వై వృణవామహే | నేతి చా೭న్యే ధనం చా೭న్యే వ్రియతా మవిశంకితైః || 87 కిమస్మాకం ధనేనేహ కార్యం తుష్టే పితామహే | అగ్ని హోత్రాణి వేదాశ్చ శాస్త్రాణి వివిధాని చ || 88 సాంతానికాశ్చ యే లోకాః వరదానా ద్భవంతు నః | ఏవం ప్రజల్పతాం తత్ర విప్రాణం కో మావిశత్ || 89 కే యూయం కే೭త్ర ప్రవరా వయం శ్రేష్టా స్తథా೭పరే | నేతి నేతి తథా విప్రా ద్విజాం స్తాం స్తత్ర సంస్థితాన్ || 90 బ్రహ్మోవాచా೭భిసంప్రేక్ష్య బ్రాహ్మణాన్ క్రోధపూరితాన్ | యస్మా ద్యూయం త్రిభి ర్భాగైః సంభాయాం బాహ్యతః స్ధితాః || 91 కౌశికీతి గణో నామ తృతీయో భవతు ద్విజాః | త్రిథా బద్ధ మిదం స్థానం సర్వం యుష్మ ద్భవిష్యతి || 92 ఏ ననృత మెన్న డాడలేదు. నా వాండ్ర యెడ నది యెట్లు సేసెదను. కోపము నిగ్రహించు కొన్నాను. మీ కిక క్షేమమే సేసెదను. శాంతులు దాంతులై (ఇంద్రియ నిగ్రహము కలవారై) నా యెడ స్థిర భక్తి గొని ద్విజులెవ్వరు పూజింతురో వారికి వేదము ధనము సంతతి యెదలెడదు. నిత్యగ్నిహోత్రులై విష్ణువు నెడ భక్తి గలిగి తేజో రాశిని సూర్యుని బ్రహ్మ నెవ్వరు పూజింతురో. యేరి మనస్సు సమస్థితి నుండునో వారి కశుభము గలుగదు. అని పలికి యాత డూర కుండెను. దేవదేవు పలన ననుగ్రహముతో నట్లు వర మంది యందరు కూడి బ్రహ్మ సన్నిధి కేతెంచిరి. బ్రహ్మను కలిసి కొని మంత్ర జపములు సేసి యాయనను సంతోష పరచుచు ముందు నిలిచిరి. బ్రహ్మ సంతుష్టుడైనా వలన వరము కోరుడన బ్రహ్మ సంతుష్టు డైనదే చాలు నని కొందరు వేదములం గోరెద మనిరి. కాదని కొందరు శంకింపక ధనముతో బనేమి? అగ్నిహోత్రములు వేదములు పెక్కు రకము లయిన శాస్త్రములు సాంతానికములైన లోకములు గావలెననిరి. ఇట్లు వాగుచున్న యా బ్రాహ్మణులలో కోప మావేశించెను. ఎవరు మీరు? ఇక్క డుత్తము లెవరు? మే మే శ్రేష్ఠల మని కొందరు కాదు కాదని కొందరు వాదులాడుచున్న విప్రుల వంక చూచి కోపముతో బ్రహ్మ యిటనియె. మీరు మూడు భాగములుగా ని సభలోన వెలుప నున్నారు. గావున మీ కిక యెకటే మొదలు గాగలది మొకే కూటమి యేర్పడుగాక. 92 ఉదాసీనా స్ధితా యే తు ఉదాసీనా భవంతు తే | సాయుధా బద్ద నిస్త్రింశా యోద్దుకామా వ్యవస్థితా || 93 తస్మా దామూలికో గుల్మో హ్యేకో భవతు వో ద్విజాః | 94 బాహ్యతో లోక శ##బ్దేన ప్రోచ్యమానాః ప్రజాస్త్విహ | అవిజ్ఞేయ మిదం స్థానం విష్ణుః పాలయితా ధ్రువమ్ || 95 మయా దత్తం చిరస్థాయి అభంగం చభ విష్యతి | ఏవ ముక్త్వా తదా బ్రహ్మా సమాప్తిం తా మవైక్షత || 96 కౌశికి యనునది రెండవది గణమును నది మూడవది కాగలదు. మూడుగా కూర్పబడిన యీ స్థాన మంతయు మీదే కా గలదు. ఇప్పు డిట నుదాసీనులై (తటస్థులై) యుండిరో వా రుదాసీను లగుదురు గాక. ఆయుధములూని యొరలో కత్తి కట్టుకొని పోరాడ గోరి యిట నిలిచినవారు లోకులను పేర ప్రజ యిట బాహ్యముగ నుందుదురు గాక. ఎవ్వరికిం దెలియని ఈ రహస్య స్థానము విష్ణువు తప్పక పాలించును. నే నిచ్చినదిది చిర కాల ముండును. ఎన్నడుం చెడదు. అని పలికి బ్రహ్మ యజ్ఞ సమాప్తి కెదురు చూచెను. బ్రాహ్మణాః సహితా స్తే తు క్రోధా೭మర్ష సమన్వితాః | అతిథిం భోజయానాశ్చ వేదాభ్యాస రతాస్తు తే|| 97 ఏతచ్చ పరమం క్షేత్రం పుష్కరం బ్రహ్మసంజ్ఞితమ్| తత్రస్థా యే ద్విజాః శాంతాః వసంతి క్షేత్రవాసినః || 98 కోప తాపములతో నున్న బ్రాహ్మణ లందరుం గలిసి యాపై నతిధికి భోజనము వెట్టుచు వేదాభ్యాస మందపేక్ష గొనిరి. ఆ క్షేత్ర ముత్తమము. బ్రహ్మ పుష్కర మను పేరందినది. -: పుష్కర క్షేత్ర ప్రశంస :- న తేషాం దుర్లభం కించి ద్బ్రహ్మలోకే భవిష్యతి | కోకాముఖే కురుక్షేత్రే నైమిషే ఋషి సంగమే || 99 వారాణస్యాం ప్రభాసే చ తథా బదరికాశ్రమే | గంగాద్వారే ప్రయాగే చ గంగా సాగర సంగమే || 100 రుద్రకోట్యాం విరూపాక్షే మిత్రస్యా೭పి తథా వనే | తీర్థే ష్వేతేషు సర్వేషు సిద్ది ర్యా ద్వాదశాబ్దికాః || 101 ప్రాప్యతే మానవై ర్లోకే షణ్మాసా ద్రాజసత్తమ | పుష్కరే తు న సందేహో బ్రహ్మచర్య మనా యది || 102 ఆట క్షేత్ర వాసు లందరు ద్విజులు శాంతులు. వారికి బ్రహ్మలోక మందని దేది యుండదు. కోకాముఖము కురుక్షేత్రము, నైమిషము, ఋషిసంగమము, వారణాసి, ప్రభాసము, బదరికాశ్రమము, రుద్రకోటి, మిత్రవనము నీ యెల్ల తీర్థము లందు పండ్రెండేండ్లకు గలుగు స్సిద్ధి పుష్కర మందు బ్రహ్మచర్యము మనః పూర్వక మాచరించినచో నాఱు మాసములలో సిద్ధించును సందియము లేదు. తీర్థముల కెల్ల నుత్తమము. క్షేత్రముల కెల్ల నుత్తమ మిది. బ్రహ్మ యెడ భక్తులగు వారెల్లరు పూజించునది. 102 అంతః పరం ప్రవక్ష్యామి సావిత్ర్యా బ్రహ్మణా సహ | వాదో యథా೭నుభూతస్తు పరిహాస కృతో మహాన్ || 103 సావిత్రీ గమనే సర్వా ఆయాతా దేవయోషితః | భృగోః ఖ్యాత్యాం సముత్పన్నా విష్ణుపత్నీ యశస్విని || 104 ఆమంత్రితా తదా లక్ష్మీ స్త్రత్రా೭యాతా త్వరాన్వితా | మదిరా చ మహాభాగా యోగనిద్రా విభూతిదా || 105 శ్రీః కమలాలయా భూతిః కీర్తిః శ్రద్ధా మనస్వినీ | పుష్టి తుష్టి ప్రదా యా తం దేవ్య ఏతాః సమాగతాః || 106 సతీ యా దక్ష తనయా ఉమేతి పార్వతీ శుభా | త్రైలోక్య సుందరీ దేవీ స్త్రీణాం సౌభాగ్యదాయినీ || 107 జయా చ విజయా చైవ మధుచ్చందా೭మరావతీ | సుప్రియా జనకాంతా చ సావిత్ర్యా మందిరే శుభే || 108 గౌర్యా సహ సమాయాతా న్సువేషా೭భరణాన్వితాః | పులోమ దుహితా చైవ శక్రాణీ చ సహా೭ప్సరాః|| 109 స్వాహా చా೭పి స్వధా యాతా ధూమ్రోర్ణా చ వరాననా | యక్షీతు రాక్షసీ చైవ గౌరీ చైవ మహాధనా || 110 మనోజవా వాయుపత్నీ బుద్ధిశ్చ ధనదప్రియా | దేవకన్యా స్తదా೭యాతా దానవ్యో వసువల్లభాః || 111 సప్పర్షీణాం మహాపత్నీ ఋషీణాం చ వరాంగనాః | ఏవం భగిన్యో దుహితా విద్యాధరగణా స్తధా || 112 రాక్షస్యః పితృ కన్యాశ్ఛ తథా೭న్యా లోక మాతరః | వ ధూభిః సస్నుషాభిశ్చ సావిత్రీ గంతు మిచ్చతి || 113 ఆదిత్యద్యా స్తదా సర్వా దక్షకన్యా స్సమాగతాః | తాభిః పరివృతా సాధ్వి బ్రహ్మాణి కమలాలయా || 114 కాచి న్మోదక మాదాయ కాచిచ్ఛూర్పం వరాననా | ఫల పూరిత మాదాయ ప్రయాతా బ్రహ్మణో೭ంతికమ్ || 115 -: సావిత్రీ బ్రహ్మ సంవాదము :- ఇక సావిత్రితో బ్రహ్మ కేర్పడిన వాదము పెద్ద దది సెప్పెద. సావిత్రి వెళ్ళగా నామెతో నెల్ల దేవతా స్త్రీలు వచ్చిరి. భృగుమహర్షికి ఖ్యాతియందు జన్మించిన (భార్గవి) విష్ణుపత్ని లక్ష్మి పిలువ బడి యటకు తొందరగ వచ్చెను. మదిర మహానుభావురాలు. ఆణిమాది విభూతు లిచ్చు యోగనిద్ర. కమలాలయ శ్రీదేవి విభూతి మొదలు పేర్కొనబడిన శుభ కుబేరప్రియ దాక దేవ సుందర కన్యలు దానవస్త్రీలు వసు పత్నులు సప్తర్షుల భార్యలు ఋషిపత్నులు రాక్షసులు పితృకన్యలు లోకమాతలు వచ్చిరి. ఆడపడుచులతోసావిత్రి యట కేగ నిచ్చగించెను . అదితి మొదలుగ దక్షకన్యలందరరుదెంచిరి. వారితో సాధ్వి బ్రహ్మాణి (సరస్వతి) కమలాలయ (లక్ష్మి) ఒకామె మోదకము (లడ్డు) ఒకతె పండ్లతో నిండిన శూర్పము (చేట) చేకొని బ్రహ్మదరి కేగిరి. ఆఢకీః సహ నిష్పావా గృహీత్వా೭న్యాం స్తథా೭పరా | దాడిమాని విచిత్రాణి మాతులింగాని శోభనా || 116 కరిరాణి తథా చా೭న్యా గృహీత్వా కమలాని చ | కౌసుంభకం జీరకం చ ఖర్జూర మపరా స్తథా || 117 ఉత్తమాన్యపి చా೭దాయ నాలికేరాణి సర్వశః | ద్రాక్షయా పూరితం పాత్రం కాచి చ్ఛృంగాటకం తథా || 118 కర్పూరాణి విచిత్రాణి జంబూకాని శుభాని చ | అక్షోటా೭మలకాన్ గృహ్య జంబీరాణి తథా ೭పరా || 119 బిల్వాని పరిపక్వాని చిపిటాని వరాననాం | కార్పాస తూలికాశ్చ೭న్యా వస్త్రం కౌసుంభకం తథా || 120 ఏవ మద్యాని చా೭న్యాని కృత్వా సర్వే వరాననాః | సావిత్ర్యా సహితాః నర్వాః సంప్రాప్తాః సహసా శుభాః || 121 కందులు అనుములు మఱి యితర ధాన్యములు చేకొని దానిమ్మపండ్లు మాదీఫలములు బొబ్బర్లు కౌసుంబికములు (కందువులు) జీలకర్ర ఖర్జూరము పెసలు మొదలగునవి మంచి కొబ్బరికాయలు తీసికొని యొకతె వచ్చెను. ఇంకొకతె ద్రాక్ష రస పాత్రము పిండి వంటలు కర్పూరము నేరేడుపండ్లు ఆక్షోటములు = ఆక్రోటు అను పండ్లు ఉసిరికి పండ్లు నిమ్మపండ్లు కొని యింకొకతే మారేడుపండ్లు అటుకులు దూదివత్తులు కుంకుమపువ్వు రంగు వస్త్రములు, ఇవి మొదలుగా మఱి సామాగ్రి చేటల నింపుకొని, యందరు పుణ్య స్త్రీలు పేరంటాండ్రు సావిత్రితో తొందరగా వచ్చిరి. సావిత్రీ మాగతాం దృష్ట్వా భీత స్తత్ర పురందరః | అధోముఖః స్థితో బ్రహ్మ కిమేషా మాం వదిష్యతి || 122 త్రపాన్వితౌ విష్ణురుద్రౌ సర్వే చా೭న్యే ద్విజాతయః | సభాసద స్తథా భీతా స్థథా చా೭న్యేదివౌకసః || 123 పుత్రాః పౌత్రాః భాగినేయాః మాతులా భ్రాతర స్తథా | ఋభవో నామ యె దేవా దేవానా మపి దేవతాః || 124 పైలక్ష్యే೭వస్థితా సర్వే సావిత్రీ కిం వదిష్యతి | బ్రహ్మ పార్శ్వే స్థితా తత్ర కింతు వై గోపకన్యకా || 125 మ్రౌనీభూతా తు శృణ్వానా నర్వేషాం వదతాం గిరః | అధ్వర్యుణా సమాహుతా నాగతా వరవర్ణినీ || 126 వైలక్ష్యే೭ వస్థితాః సర్వే సావిత్రీ కిం వదిష్యతి | బ్రహ్మ పార్శ్వే స్థితా తత్ర కింతు పై గోపకన్యకా || 127 మౌనిభూతా తు శృణ్వానా సర్వేషాం వదతాం గిరః | అధ్వర్యుణా సమాహుతా నాగతా వరవర్ణినీ || 128 అట వచ్చిన సావిత్రిని జూచి యింద్రుడు బెదరి ముఖము వంచి కూర్చుండెను. బ్రహ్మ యీమె నన్నేమనునో యనుకొనెను. విష్ణువు, రుద్రుడు, మఱి యితర బ్రాహ్మణ వర్గము సిగ్గుపడిరి. సభ్యు లడలి పోయిరి. దేవతలు గూడ బెదరిరి. దేవతల కొడుకులు పౌత్రులు మేనల్లుండ్రు మేనమామలు అన్నదమ్ములు ఋభవు లనుపేరి దేవతలు, దేవతలకు గూడ దేవతలు (ఋభవులనగా దేవతలలో నొకరకము వారు) సావిత్రి యే మనునో యని తెల్లవోయిరి. బ్రహ్మ ప్రక్క నిలిచి గొల్లపిల్ల మౌనము పట్టె. యల నందరి మాట లాలించుచు నధ్వర్యుడు పిలిచినను నా సుందరి రాదయ్యెను. 128 శ##క్రేణా೭న్యా హతా೭భీరా దత్తా సా విష్ణునా స్వయమ్ | అనుమోదితా చ రుద్రేణ పిత్రా దత్తా స్వయం తథా || 129 కథం సా భవితా యజ్ఞే సమాప్తి ర్వా వ్రజే త్కథమ్ | ఏవం చింతయతాం తేషాం ప్రవిష్టా కమలాలయా || 130 వృతో బ్రహ్మా సదసై#్యస్తు ఋత్విగ్భి ర్దేవతై స్థథా || 131 హూయంతే చా೭గ్నయ స్తత్ర బ్రాహ్మణౖ ర్వేదసారగైః | వత్నీశాలా స్ఖితా గోపీ సైణ శృంగ సమేఖలా || 132 క్షామ వస్త్ర పరీధానా ధ్యాయంతీ పరమం పదమ్ || పతివ్రతా పతిప్రాణా ప్రాధాన్యే చ నివేశితా || 133 ఇంద్రుడు తీసికొని వచ్చినాడు. విష్ణు వామె నిచ్చినాడు. రుద్రు డౌనన్నాడు. తండ్రి స్వయముగా నామెనూ బ్రహ్మకిచ్చినాడు. ఆమె యజ్ఞమందెలా యుండును! యజ్ఞ సమాప్తి యెట్లౌను? అని వా రాలోచించు చుండ యట లక్ష్మి బ్రవేశించెను బ్రహ్మ సదస్యులతో దేవతలతో వేదపారగు లయిన బ్రాహ్మణులతో జుట్టుకొని యున్నాడు. లేడికొమ్ము చేకొని మేఖలతో గొల్లపడుచు విశాలాక్షి పతివ్రత భర్త సూర్యప్రభ వలె నా (సభను) ప్రకాశింప జేయుచు నట నున్నది ఋత్విజులు నగ్నిని యాశ్రయించు కొనియున్నారు. రూపాన్వితా విశాలాక్షీ తేజసా భాస్కరోపమా | ద్యోతయంతీ సదస్తత్ర సూర్యస్యేవ యథా ప్రభా || 134 జ్వలమానం తథా వహ్నిం శ్రయంతే ఋత్విజ స్తధా | పశూనా మిహా గృహ్ణానా భాగం స్వస్వచరో ర్ముదా || 135 యజ్ఞ భాగా೭ర్ధినో దేవా విలంబాద్ బ్రువతే తదా | కాలహీనం న కర్తవ్యం కృతం న ఫలదం యతః || 136 వేదేష్వేన మధీకారో దృష్టః సర్వై ర్మనీషిభిః | ప్రావర్గ్యే క్రియామాణ తు బ్రాహ్మణౖ ర్వేదపారగైః || 137 క్షీర ద్వయేన సంయుక్త శృతేనా೭ధ్వర్యుణా తథా | ఉపహూతే నా೭గత్వేనచా೭హుతేషు ద్విజన్మసు || 138 క్రియమాణ తథా భ##క్ష్యే దృష్ట్వా దేవీ రుషాన్వితా | ఉవాచ దేవీ బ్రహ్మాణం సదో మధ్యే తు మౌనినమ్ || 139 వేదపారగులు బ్రాహ్మణు లగ్నులందు హోమములు సేయుచున్నారు. పత్నీశాలలో గొపి లేడికొమ్ము చేతగొని మౌంజీమేఖల నడుమున జుట్టుకొని పట్టుజీర గట్టుకొని పరమపదమును ధ్యానించుచు పతివ్రత పతియే ప్రాణముగా గలది రూపవతి ''విశాలాక్షి'' సూర్యుని వంటి ప్రభతో నట సదస్సు నుద్దీపింప జేయుచు ప్రధానముగా నట ప్రవేశింప జేయబడెను. అపుడు ఋత్విక్కులు ఇట తమ తమ చరువులందు పశుభాగము నందుకొనువరై యగ్ని నాశ్రయించు కొనియున్నారు. యజ్ఞ భాగము కోరి దేవతలపు డాలస్యమగుటగని యజ్ఞము కాలహీనము చేయగూడదు. చేసినచో ఫలమీయ దనుచుండిరి. 136 రెండు భాగముల పాలతో గూడి నధ్వర్యునిచే కాచబడిన పురోడాశముతో నా బ్రాహ్మణు లాహూతులై భక్ష్యము (పురోడాశలో) సిద్ధము సేయబడగా సావిత్రీ దేవి చూచి రోషము గొని యా సదస్సులో మౌనము వట్టి కూర్చున్న బ్రహ్మను గూర్చి యిట్లనియె. 139 -: సావిత్ర్యువాచ :- ఉవాచ దేవీ బ్రహ్మాణం సదో మధ్యే తు మౌనికమ్ | కిమేత ద్యుజ్యతే దేవ ! కర్తు మేత ద్విచేష్టితమ్ || 140 మాం పరిత్యజ్య యత్కామా త్కృతవా నసి కిల్బిషమ్ | న తుల్యా పాద రజసా మమైషా యా శిరః కృతా || 141 యద్వదంతి జనా స్సర్వే సంగతా సదసి స్థితాః | ఆజ్ఞా మీశ్వర భూతానాం తాం కురుష్వ యదీచ్ఛసి || 142 భవతా రూప లోలేన కృతం లోక విగర్హితమ్ | పుత్రేషు న కృతా లబ్జా పౌత్రేషు చ న తే ప్రభోః || 143 కామకారం కృతం మన్యే ఏత త్కర్మ విగర్హితమ్ | పితామహో೭సి దేవానా మృషీణాం ప్రపితామహా ! || 144 కథం న తే త్రపా జాతా ఆత్మనః పశ్యత స్తనుమ్ | లోక మధ్యే కృతం హాస్య మహం చా ೭పకృతా ప్రభో || 145 యద్యేష తే స్థిరో భావ స్తిష్ఠ దేవ నమో೭స్తు తే | ఆహం కథం సఖీనాం తు దర్శయిష్యామి వై ముఖమ్ || 146 భర్త్రా మే విధుతా పత్నీ కథ మేత దహం వదే | ఋత్విగ్భి స్త్వరిత శ్చా೭హం దీక్షా కాలా దనంతరమ్ || 147 బ్రహ్మోవాచ :- పత్నీం వినా న హోమో೭త్ర శీఘ్రం పత్రీ మిహానయ | శ##క్రేణౖషా సమానీతా దత్తేయం మమ విష్ణునా || 148 గృహీతా చ మయా సుభ్రు ! క్షమసై#్వతం మయా కృతమ్ | న చా೭పరాధం భూయో೭న్యం కరిష్యే తవ సుప్రతే || పాదయోః పతిత స్తే೭హం క్షమస్వేహ నమో೭స్తు తే || ఏవ ముక్తాతదా క్రుద్ధా బ్రహ్మణం శప్తు మద్యతా || 150 -: సావిత్ర్యా శాపదానమ్ :- పులస్త్య ఉవాచ: యది మే೭స్తి తప స్తప్తం గురవో యది తోషితాః | సర్వ బ్రహ్మ సమూహేషు స్థానేషు వివిధేషు చ || 151 నైవతే బ్రాహ్మణాః పూజాం కరిష్యంతి కదాచన | ఋతే తు కార్తికీ మేకాం పూజాం సాంవత్సరీం తవ || 152 ఇదేమి దేవా ! చేయ రాని పని చేయ దగునా? నన్ను విడిచి కామమున నీ పాపము సేసితివి. నా పాదధూళి కేసి సరికాని యిట తలగా (అగ్రస్థానీయగా) జేయబడినది. ఈ యజ్ఞ సదస్సునందు సమావేశ##మై యున్న జన మెల్ల భూతముల కీశ్వరులైన వారి యాజ్ఞ నిష్టమేని యొనరింపుము. అందముపై నాసవడి లోక నింద్య మీ పని తాము సేసినారు. స్వామీ ! నీ పాడు పనిచేసి కొడుకులలో మనుమలలో పది మందిలో తమకు సిగ్గులేదా ? ఇది కామ వశమున జేసితివనుకొందును. దేవతలకు నీవు తాతవు. ఋషులకు ముత్తాతవు. నీ మేను జూచుకొన్న నీకు సిగ్గెట్లు కలుగ లేదు. నలుగురిలో నీ నవ్వు పని చేసితివి. నేనా అపకారము సేయ బడినాను ప్రభూ! ఇదే నిశ్చయమైనచో నుండుము ! దేవా ! నీ కిదే నమస్కారము. పులస్త్యు డనియె. ఇట్లని కినుక గొని బ్రహ్మను శపింప లేచెను. 150 నే జేసిన తపస్సున్నచో నే గొలిచిన గురువు యున్నచో ఎల్ల బ్రహ్మ సమూహములందు వివిధ స్థానములందు ఎల్ల విప్రుల మనము లెప్పుడు నీకు పూజ సేయనే సేయరు గాక! ఒక్క కార్తిక పూజ సాంవత్సరికము (సంవత్సరమునకొక్కసారి) మాత్రము చేయుదురు. 152 కరిష్యంతి ద్విజాః సర్వే మర్త్యా నా೭న్యత్రభూతలే | ఏత ద్ర్బహ్మాణ ముక్త్వా೭హ శతక్రతు ముపస్థితమ్ || 153 భోభోఃశక్ర ! త్వయా೭నీతా అభీరీ బ్రహ్మణో೭ంతికమ్ యస్మా త్తే క్షుద్రకం కర్మ తస్మా త్త్వం లప్యసే ఫలమ్ || యదా సంగ్రామ మధ్యే త్వం స్థాతా శక్ర భవిష్యసి | తదా త్వం శత్రుభి ర్బద్ధో నీతః పరమికాం దశామ్ || 155 అకించనో నష్టసత్వః శత్రూణాం నగరే స్థితః || పరాభవం మహాత్ప్రాప్య న చిరాదేవ మోక్ష్యసే || 156 బ్రహ్మ నిట్లని దగ్గర నున్న యింద్రుని గూర్చి ఓ ఓ ఇంద్ర ! నీ చే నీ గొల్లది బ్రహ్మదరికి గొని రా బడినది. ఈ పాడు పని చేసితివి. కావున దీని ఫల మనుభవింతువు. యుద్దము నడుమ నీ వున్నపుడు శత్రువులచే బంధించి కొని పో బడి పరమ నీచదశ పా లగుదువు. వట్టి దరిద్రుడవు. దుర్బలుడవై శత్రువుల నగర మం దుండి తొందరలో ఘోర పరాభవము పొంది వెంటనే విడువ బడుదువు. శక్రం శప్త్వా తదా దేవీ విష్ణుం వాక్య మథా೭ బ్రవీత్ | భృగు వాక్యేన తే జన్మ యదా మర్త్యే భవిష్యతి || 157 భార్యా వియోగజం దుఃఖం తదా త్వం తత్ర భోక్ష్యసే | హృతా తే శత్రుణా పత్నీ పరే పారే మహోదధేః || 158 న చ త్వం జ్ఞాస్యసే నీతాం శోకోపహత చేతసః | భ్రా త్రా సహ పరం కష్ట మాపదం ప్రాప్య దుఃశితః || 159 యదా యదుకులే జాతః కృష్ణ సంజ్ఞో భవిష్యసి | పశూనాం దాసతాం ప్రాప్య చిరకాలం భ్రమిష్యసి || 160 దేవి యింద్రు నటు శపించి విష్ణువు గూర్చి యొక మాట యనెను. భృగు మహర్షి మాటం బట్టి మర్త్య లోక మందు నీకు బుట్టు వైనపుడు భార్యా వియోగ దుఃఖ మప్పుడే నీ వనుభవింతువు. నీ శత్రువుచే నీ పెండా మపహరింప బడి సముద్ర మవలి యొడ్డున నుండును. అట్లు కొని పోబడిన యామెను నీ వెఱుగవు. శోకముచే తెలివి దెబ్బతిన తమ్మునితో గూడ కష్టము పాలై యాపద గొని యేడ్తువు. యదుకుల మందు కృష్ణుడను పేర బుట్టి పశువులకు దాసుడవై చిరకాలము తిఱిగెదవు. అని శపించెను. తదా೭హ రుద్రం కుపితా యదా దారువనే స్థితః | తదా త్వాం ఋషయః క్రుద్దా శాపం దాస్యంతి వై హర || 161 భోభోఃకాపాలిక క్షుద్ర! స్త్రీ రస్మాకం జిహీర్షసి | తదేత ద్దర్పితం తే೭ద్య భూమౌ లింగం పతిష్యతి || 162 విహీనః పౌరుషేణ త్వం ముని శాపాచ్చ పీడితః | గంగాద్వారే స్థితా పత్నీ సా త్వా మాశ్వాసయిష్యతి || 163 అగ్నే త్వం సర్వభక్షో೭సి పూర్వం పుత్రేణ మే కృతః | భృగుణా ధర్మనిత్యేన కథం దగ్ధం దహా మ్యహమ్ || 164 జాతవేద స్స రుద్ర స్త్వాం రేతసా ప్లావయిష్యతి | అమేధ్యేషు చ తే జిహ్వా అధికం ప్రజ్వలిష్యతి || 165 ఆపై రుద్రుని గూర్చి కోపించి దారువన మందు నీ వున్నప్పుడు ఋషులు క్రోధులై హరా! నిన్ను శపింతురు. ఓరోరి! కాపాలిక! క్షుద్రా ! మా ఆడు వాండ్రను హరింప గోరి నపుడు పొగ రెక్కిన నీ యీ లింగము నేల పాలగును. మగతనమువోయి నీవు ముని శాపమున పీడ నొందెదవు. గంగాద్వార మందున్న మీ యావిడ అప్పుడు నిన్నోదార్ప గలదు. అగ్నీ! నీవు సర్వ భక్షకుడవు. ధర్మనిత్యుడు భృగువు శాపమున సర్వ భక్షకుడవైతివి. కాల్ప బడిన నిన్నే నెట్లు కాల్తును? జాతవేద! నీ నుండి వేదములు పుట్టినవి. నిన్నా రుద్రుడు రేతస్సుచే ముంచెత్తును. ఆ మేధ్యము లందు నీ నాలుక మఱీ ప్రజ్వలింప గలదు. బ్రహ్మణా నృత్విజః సర్వా న్సావిత్రీవై శశాప హ | ప్రతిగ్రహార్థా೭గ్నిహోత్రో వృథాట వ్యాశ్రయా స్థథా || 166 సదా తీర్థాని క్షేత్రాణి లోభాదేవ భజిష్యథ || పరాన్నేషు సదా తృప్తా అతృప్తాః స్వగృహేషు చ|| 167 అయాజ్య యాజనం కృత్వా కుత్సితస్య ప్రతిగ్రహమ్ | వృథా ధనార్జనం కృత్వా వ్యయం చైవ తథా వృథా 168 ప్రేతానాం తేన ప్రేతత్వం భవిష్యతి న సంశయః | ఏవం శక్రం తథా విష్ణుం రుద్రం వైపావకం తథా || 169 బ్రహ్మణం బ్రహ్మణాంశ్చైవ సర్వాం స్తా శశప్రదుషా ! శాపం దత్వా తథా తేషాం నిష్కాంతాసదస స్థథా || 170 సావిత్రి బ్రాహ్మణులను, ఋత్విక్కులను నిట్లు శపించెను. మీకు చేయి చాచుట కే యగ్నిహోత్రము. తీరి కూర్చుండి అడవుల నివాసము. తీర్థాలు క్షేత్రాల సేవ కేవలము నాసకు లోనయి సేయుదురు. పరాన్నములందు మీకు తృప్తి. స్వగృహ మందతృప్తియే. యజింపపనికి రాని వానిని యజింప జేయుట, నీచున వలన నీచమైన దానములు పట్టుట. ధనార్జనము వ్యయము కూడ, వట్టి వృధ. ప్రేతలది సేయుదురు. (ప్రేతకర్మ నిమిత్తము). ఇట్లింద్రాదుల శపించి బ్రహ్మను బ్రాహ్మణులను గూడ అందఱిని శపించెను. జ్యేష్ఠం పుష్కర మాసాద్య తదా సా చ వ్యవస్థితా | లక్ష్మీం ప్రాహ సతీం తాం చ శక్ర భార్యాం వరా-న-నామ్ 171 యువతీ స్తా స్తథోవాచ నా೭త్ర స్థాస్యామి సంసది | తత్ర చా೭హం గమిష్యామి యత్ర శ్రోష్యే న చ ధ్వనిమ్ || 172 తత స్తాః ప్రమదాః సర్వాః ప్రయాతాః స్వనియేతనమ్ | సావిత్రీ కుపితా తాసా మపి శాపాయ చోద్యతా || 173 ఆపై నామె జేష్ఠ పుష్కరము చేరి యట నుండెను. అప్పుడు పతివ్రత లక్ష్మిని, యింద్ర పత్నిని శచిని, యట నున్న తరుణులం గూర్చి ఈ సదస్సు నందే నుండెను. ఈ ధ్వని వినబడని చోట నుందు ననియె. అంతట నా యువతులు తమతమ యిండ్లకుం జనిరి. సావిత్రి కోపించి వారల శపింప నుద్యమించెను. యస్మా న్మాం తు పరిత్యజ్య గతాస్తా దేవయోషితః | తాసా మపి తథా శాపం ప్రదాస్యే కుపితా భృశమ్ || 174 సావిత్ర్యువాచ: నైకత్ర వాసో లక్ష్మ్యాస్తు భవిష్యతి కదాచన | క్షుద్రా సా చలచిత్తా చ మూర్ఖేషు చ వసిష్యతి || 175 నన్నెందులకు విడిచి పోయి రందులకు దేవతాస్త్రీలకు గూడ శాపమిత్తునని, లక్ష్మి నిలువ నొక్క చోటుండదు. ఆ నీచురాలు చపల చిత్తురాలు. మూర్ఖులందే యుండును. వ్లుెచ్చులు, పొగరుబోతులు, శాపగ్రస్తులైన దురాత్ముల నెడ నీ కునికి యగునని శపించెను. ఆ పై నింద్రాణిని శచీదేవిం గూర్చి యిట్లనియె. వ్లుెచ్ఛేషు పార్వతీయేషు కుత్సితే೭కుత్సితే తథా | మూర్ఖేషు చా೭వలిప్తేషు అభిశ##స్తే దురాత్మని || 176 ఏవం విధే నరే స్యాత్తే వసతిః శాపకారితా | శాపం దత్వా తత స్తస్యా ఇంద్రాణి మవదత్తదా || 177 బ్రహ్మహత్యా గృహీతేంద్రే పత్యౌ తే దుఃఖభాగిని | నహుషా೭పహృతే రాజ్యే దృష్ట్వా త్వాం యాచయిష్యతి || 178 అహ మింద్రః కథం చైషా నోపస్థ్యాస్యతి బాలిశా | సర్వాన్ దేవాన్ హనిష్యామి నలప్స్యే ೭ హం శచీం యది || 179 నష్టా! త్వం చ తదా త్రస్తా వాక్పతే ర్దుఃఖితా గృహే | వసిష్యసే దురాచారే! మమ శాపేన గర్వితే || 180 దేవభార్యాసు సర్వాసు తదా శాప మయచ్ఛత | న చా೭ పత్యకృతాం ప్రీతి మేతాః సర్వా లభిష్యథ || 181 దహ్యమానా దివారాత్రౌ వంధ్యా శ##బ్దేన దూషితాః | గౌర్యప్యేవం తదా శప్తా సావిత్ర్యా వరవర్ణినీ || 182 రుదమానా తు సా దృష్టా విష్ణునా చ ప్రసాదితా ! మా రోదిస్త్వం వాశాలాక్షి ! ఏహ్యాగచ్ఛ సదా శుభే! || 183 విష్ణురువాచ : ప్రవిశ్య చ సభాం దేహి మేఖలాం క్షౌమవాసిని | గృహాణ దీక్షాం బ్రహ్మాణి పాదౌ చ ప్రణమామి తే || 184 ఏవ ముక్తా೭బ్రవీ దేనం న కరోమి వచ స్తవ | తత్ర చా೭హం గమిష్యామి యత్ర శ్రోష్యే న వై ధ్యనిమ్ || 185 ఏతావ దుక్త్వా సా೭రుహ్య తస్మాత్ స్థానా ద్గిరౌ స్థితా | విష్ణు స్తదగ్రతః స్థిత్వా బద్ధ్వా చ కర సంపుటమ్ || 186 తుష్టావ ప్రణతో భూత్వా భక్త్వా పరమయా స్థితః | సర్వగా సర్వభూతేషు ద్రష్టవ్యా సర్వతో ೭ద్భుతా || 187 విష్ణు రువాచ: విష్ణునా సరస్వతీ స్తుతిః నీమగ డింద్రుడు బ్రహ్మ హత్యకు జిక్కి యేడ్చు చుండగా నహుషుడు రాజ్య మపహరింప నిను జూచి యిట్లడుగు కొన గలడు. నేను ఇంద్రుడను. ఈ నీచురాలు నా దరికి రాదేమి? నేను శచిని బొంద నేని యందరు దేవతల సంహరింతు నని అనినంత నీ వపుడు దూరమై దుఃఖించి నాశాపమున గర్వ మెక్కిన నీవు బృహస్పతి యింట దల దాచు కొందువని శపించెను. ఆ పై దేవ భార్య లందణిని సంతాన నిమిత్తమైన ప్రీతి మీ కుండదు. గొడ్రాళ్ళ పేర రేయిం బవలు వగలు వడుచు దూషిత లౌదురని శపించెను. ఇట్లు గౌరీ దేవియు సావిత్రిచే శపింప బడి యేడ్చుచుండ చూచి విష్ణువుచే విశాలాక్షి! ఏడవకుమమ్మ! రా ! యిటు రా. కల్యాణి! దీక్ష సేకొనుము. బ్రహ్మాణి= సరస్వతి నీ సభం బ్రవేశించి దీక్ష గైకొనుము. నీపాదములకు ప్రణమిల్లెద ననెను. విష్ణువు మాట విని నీ మాట నే జేయను. అక్కడకు నే బోను . ఆ ధ్వని కూడ వినను. అని యటనుండి కొండెక్కి నిలిచెను. విష్ణు వాదేవి ముందు నిలువబడి చేతులు మొగిచి వ్రాలి మ్రొక్క పరమ భక్తి నిట్లు స్తుతించెను. -: విష్ణు కృత సరస్వతీ స్తుతి :- -: దేవీక్షేత్ర తీర్థప్రశంసా :- సదసచ్చైవ యత్కించి ద్దృశ్యం తన్నవినా త్వయం | తధా೭పి యేషు స్థానేషు ద్రష్టవ్యా సిద్ధి మీప్సుభిః 188 స్మర్తవ్యా భూతికామై ర్వా తత్ప్రవక్ష్యామి తే೭ గ్రతః | సావిత్రీ పుష్కరే నామ తీర్థానాం ప్రవరే శుభే || 189 నీ వంతట నన్ని భూతములందున్నావు. అంతట నద్భుతవయి దర్శింప దగి యున్నావు. ఉన్నది లేనిదేది కల దది యెల్ల నీవు లేనిది లేదు. అయినను స్థితి నంద గోరువా రి కేయే స్థానములందు కనబడుదువు. తలచికొనడగుదువు. అణిమాది విభూతులు కోరు వారెట్లు సేవింపవలయు నది నీ ముందు వచింతును. వారాణస్యాం విశాలాక్షీ నైమిషే లింగధారిణీ | ప్రయాగే లలితాదేవీ కాముకా గంధమాదనే || 190 మానసే కుముదా నామ విశ్వకాయా తథా೭ంబరే | గోమంతే గోమతీ నామ మందరే కామచారిణీ || 191 మదోత్కటా చైత్రరథే జయంతీ హస్తినాపురే | కాన్యకుబ్జే తథా గౌరీ రంభా మలయ పర్వతే || 192 ఏకామ్రకే కీర్తిమతీ విశ్వా విశ్వేశ్వరీ తథా | కర్ణికే పురుహస్తేతి కేదారే మార్గదాయికా || 193 నంద్యా హిమవతః పృష్టే గోకర్ణే భద్రకాళికా | స్థాణ్వీశ్వరే భవానీ తు బిల్వకే బిల్వపత్రికా || 194 శ్రీశైలే మాధవీ దేవీ భద్రా భ##ద్రేశ్వరీ తథా | జయా వరాహశైలే తు కమలా కమలాలయే || 195 రుద్రకోట్యాం తు రుద్రాణీ కాలీ కాలంజరే తథా | మహాలింగే తు కపిలా కర్కోటే మంగలేశ్వరీ || 196 శాలిగ్రామే మహాదేవి శివలింగే జలప్రియా| మాయాపుర్యాం కుమారీతు సంతానే లలితా తథా|| 197 ఉత్పలాక్షీ సహస్రాక్షే హిరణ్యాక్షే మహోత్పలా | గయాయాం మంగలా నామ విమలా పురుషోత్తమే || 198 విపాశాయా మమోఘాక్షీ పాటలా పుణ్యవర్ధనే| నారాయణీ సుపార్వ్వే తు త్రికూటే భద్రసుందరీ || 199 విపులే విపులా నామ కల్యాణీ మలయాచలే | కోటవీ కోటి తీర్థేతు సుగంధా మాధవీ వనే || 200 కుబ్జామ్రకే త్రిసంధ్యా తు గంగాద్వారే హరిప్రియా | శివకుండే శివానందా నందినీ దేవికా తటే || 201 రుక్మిణీ ద్వారవత్యాం తు రాధా బృందావనే తధా | దేవకీ మధురాయాంతు పాతాలే పరమేశ్వరీ || 202 చిత్రకూటే తధా సీతా వింధ్యే వింధ్య నివాసినీ | సహ్యాద్రా వేక వీరా తు హరిశ్చంద్రే తు చంద్రికా || 203 రమణా రామతీర్ధే తు యమునాయాం మృగావతీ | కరవీరే మహాలక్ష్మీ రుమాదేవీ వినాయకే || 204 ఆరోగా వైద్యనాథే తు మహాకాలే మహేశ్వరీ | అభయా పుష్ప తీరక్థే తు అమృతా వింధ్య కందరే || 205 మాండవ్యే మాండవీ దేవీ స్వాహా మహేశ్వరే పురే | వేగవే తు ప్రచండా೭థ చండికా೭ మర కంటకే || 206 సోమేశ్వరే వరారోహా ప్రభాసే పుష్కరావతీ | దేవమాతా నరస్వత్వాం పారా೭పారే తటా స్థితా || 207 మహాలయె మహాపద్మా పయోష్ణ్వాం పింగలేశ్వరీ | సింహికా కృతశౌచే తు కార్తికేయే తు శంకరీ || 208 ఉత్పలా೭ వర్తకే లోలా సుభద్రా సింధు సంగమే | ఉమా సిద్దవనే లక్ష్మీ రనంగా భరతా೭ శ్రమే || 209 జాలంధరే విశ్వముఖీ తారా కిష్కింధ పర్వతే | దేవదారు వనే పుష్టి ర్మేధా కాశ్మీర మండలే || 210 భీమా దేవీ హిమాద్రౌ చ తుష్టి ర్వస్త్రేశ్వరే తథా | కపాల మోచనే శ్రద్ధా మాతా కాయ7వరోహణ || || 211 శంఖోద్దారే ధ్వని ర్నామ ధృతిః పిండారకే తథా | కాలా తు చంద్రభాగాయా మచ్ఛోదే సిద్ధిదాయినీ || 212 వేణాయా మమృతా దేవీ బదర్యా ముర్వశీ తథా | ఔషధీ చోత్తర కురౌ కుశద్వీపే కుశోదకా || 213 మన్మథా హేమకూటే తు కుముదే సత్యవాదినీ | అశ్వత్థే వందనీయా తు నిధి ర్వైశ్రవణా ೭లయే || 214 గాయత్రీ వేదవదనే పార్వతీ శివసన్నిధౌ | దేవలోకే తథేంద్రాణీ బ్రహ్మాస్యే తు సరస్వతీ || 215 సూర్యబింబే ప్రభా నామ మాతౄణాం వైష్ణవీ తథా | అరుంధతీ సతీనాం తు రామాసు చ తిలోత్తమా || 216 చిత్రే బ్రహ్మకలా నామ శక్తిః సర్వశరీరిణామ్ | ఏత ద్భక్త్వా మయా ప్రోక్తం నామా ೭ష్టశత ముత్తమమ్ || 217 అష్టోత్తరం చ తీర్థానాం శత మేత దుదాహృతమ్ || మో జపేత్ శ్రుణుయా ద్వాపి సర్వపాపైః ప్రముచ్యతే || 218 ఫలశ్రుతి యేషు తీర్థేషుయః కృత్వా స్నానం పశ్యే న్నరోత్తమః | సర్వ పాప వినిర్ముక్తః కల్పం బ్రహ్మ పురే వసేత్ || 219 నానూ೭ష్టక శతం యస్తు శ్రావయే ద్ర్బహ్మ సన్నిధౌ | పౌర్ణమాస్యా మమాయాం వా బహుపుత్రో భ##వే న్నరః || 220 గోదానే శ్రాధ్దదానే వా అహ న్యహని వా పునః | దేవర్చన విధౌ శృణ్వ న్పరం బ్రహ్మా೭ధి గచ్ఛతి || 221 ఏవం స్తువంతం సావిత్రీ విష్ణుం ప్రోవాచ సువ్రతా | సమ్యక్ స్తుతా త్వయా పుత్ర త్వ మజయ్యో భవిష్యసి || 222 అవతారే సదార స్త్వం పితృ మాతృషు వల్లభః | ఇహ చా೭గత్య యో మాం తుస్తవేనా೭నేన సంస్తుయాత్ || 223 సర్వ పాప వినుర్ముక్తః పరం స్థానం గమిష్యతి | గచ్ఛ యజ్ఞ విరించస్య సమాప్తిం నయ పుత్రక || 224 కురు క్షేత్రే ప్రయాగే చ భవిష్యే చా೭న్న దాయినీ | సమీపగా స్థితా భర్తుః కరిష్యే తవ భాక్షితమ్ || 225 ఏవ ముక్తో గతో విష్ణు ర్బ్రహ్మణం సద ఉత్తమమ్ | గతాయా మధ సావిత్ర్యాం గాయత్రీ వాక్య మబ్రవీత్ || 226 -: క్షేత్రతీర్థ సేవా ఫలశ్రుతి :- ఈ క్షేత్ర తీర్థముల జపించి నతడు విన్నతడు సర్వపాప విముక్తు డగును. ఇట స్నానము సేసి ఆకల్పము బ్రహ్మ పుర మందుండును. అష్టోత్తరశతనామములు బ్రహ్మ సన్నిధిని (పుష్కర క్షేత్రమందు) పూర్ణిమ నాడు పఠించి విని బహుపుత్రవంతు డగును. గోదాన సమయ మందు శ్రాద్ధదాన మందును ప్రతిదినము దేవతార్చనమందు గాని విన్నచో బ్రహ్మ సాయుజ్య మందును. ఇట్లు స్తుతింప బడి సావిత్రి విష్ణువుతో నాయనా చక్కగా నన్ను స్తుతించితివి. నీ వజయ్యుడ వౌదువు. కృష్ణావతారమున నీవు పత్నులతో తలిదండ్రుల యదెంతో వల్లభుడ వౌదువు. వెళ్ళి బ్రహ్మ యజ్ఞమును సమాప్తి నందింపుము. కురుక్షేత్రమందు ప్రయాగ యందు న్న దాయినినై భర్త సమీపమందుండి నీ వన్నది సేసెదను అని పలుక విని విష్ణు బ్రహ్మ దగ్గఱ కేగెను. సావిత్రియు నేగె. నంత గాయత్రి యిట్లనియె. 226 శృణ్వంతు వాక్య మృషయో మదీయం భర్తృ సన్నిధౌ యదిదం వచ్మ్యహం తుష్టా వరదానాయ చోద్యతా || 227 బ్రహ్మాణం పూజయిష్యంతి నరా భక్తి సమన్వితాః | తేషాం వస్త్రం ధనం ధాన్యం దారాః సౌఖ్యం ధనాని చ|| 228 అవిచ్ఛినం తథా సౌఖ్యం గృహే వై పుత్ర పౌత్రకమ్ | భుక్త్వా೭సౌ సుచిరం కాల మంతే మోక్షం గమిష్యతి || 229 -: గాయత్రియనియె :- భర్త సన్నిధి నేను సంతోషించి యో ఋషులారా ! వరమీయ నుద్యమించి పలుకు పలుకులు వినుడు. భక్తితో బ్రహ్మను బూజించు వారికి ధన ధాన్య వస్త్ర సమృద్ధి సుఖము నింటిలో పుత్ర పౌత్రాదిక మెడ వడక కలుగును. అదెల్ల యనుభవించి మోక్షమందురు. పులస్త్య ఉవాచ బ్రహ్మాణం చ ప్రతిష్ఠ్యాప్య నర్వ యత్నై ర్విధానతః | యత్పుణ్య ఫల మాప్నోతి తదేకాగ్ర మనాః శృణు || 230 సర్వ యజ్ఞ తపో దాన తీర్థ వేదేషు యత్ఫలమ్ | తత్ఫలం కోటిగుణితం లభ##తే తత్ప్రతిష్ఠయా || 231 పౌర్ణమా స్యుపవాసం తు కృత్వా భక్త్యా నరాధిప! | అనేన విధినా యస్తు విరించిం పూజయే న్నరః || 232 ప్రతిపది మహాబాహో స యాతి బ్రహ్మణః పదమ్ | విరించిం వాసుదేవం తు ఋత్విగ్భిశ్చ విశేషతః || 233 కార్తికే మాసి దేవస్య రథయాత్రా ప్రకీర్తితా | యాం కృత్వా మానవా భక్త్యా సంయాంతి బ్రహ్మలోకతామ్ || 234 కార్తికే మాసి రాజేంద్ర పౌర్ణమాస్యాం చతుర్ముఖమ్ | మార్గేణ బ్రహ్మణాసార్ధం సావిత్ర్యా చ పరంతప! || 235 భ్రామయే న్నగరం సర్వం నానా వాద్య సమన్వితః | స్నపయే ద్భ్రామయిత్వా తు స లోకం నగరం నృప || 236 బ్రాహ్మణా న్భోజయిత్వా೭గ్రే శాండిలేయం ప్రపూజ్య చ | ఆరోపయే ద్రధే దేవంపుణ్యవాదిత్ర నిఃస్వనైః 237 రథా೭గ్రే శాండిలీ పుత్రం పూజయిత్వా విధానతః | బ్రాహ్మణా న్వాచయిత్వాతు కృత్వా పుణ్యా೭హ మంగళమ్ || 238 దేవ మారోపయిత్వా తు రథే కుర్యా త్ప్రజాగరమ్ | నానా విధైః ప్రేక్షణకైః బ్రహ్మ ఘోషైశ్చ పుష్కలైః || 239 కృత్వా ప్రజాగరం దేవం ప్రభాతే బ్రాహ్మణా న్నృప | భోజయిత్వా యథాశక్తి భక్ష్య భోజ్యైః రనేకశః || 240 పూజయిత్వా జనం ధీర మంత్రేణ విధినా నృప | ఆజ్యేన తు మహాబాహో పయసా పాయసేన చ || 241 బ్రాహ్మణా న్వాచయిత్వా తు స్వస్త్యా తు విధివ న్నప | కృత్వా పుణ్యాహ శబ్దం చ తద్రథం భ్రామయే త్పురే || 242 విపై#్రశ్చతు ర్వేద విద్భి ర్భ్రామయే ద్బ్రహ్మణో రథమ్ | బహృ చా೭ధర్వణౖ ర్వీర ఛందోగా೭ధ్వర్యుభి స్తథా || 243 భ్రామయే ద్దేవ దేవస్య సుర శ్రేష్ఠస్య వై రథమ్ | ప్రదక్షిణం పురం సర్వం మార్గేణ సుసమేన తు || 244 న వోఢవ్యో రథో వీర! శూద్రేణ హిత మిచ్ఛతా | న చా೭రోహే ద్రథం ప్రజ్ఞో ముక్త్వైకం భోజనం నృప || 245 పులస్త్యు డనియె : విధి విధానముగ బ్రహ్మను ప్రతిష్ఠించినచో సర్వ యజ్ఞ తప స్తీర్ధ స్వాధ్యాయ ఫల మొకటె గుణిత మగును. పౌర్ణమాసి నుపవాస ముండి పాడ్యమి నాడు బ్రహ్మార్చన సేసి బ్రహ్మ సాలోక్య మందును. బ్రహ్మను విష్ణువును ఋత్విక్కులతో నర్చించి కార్తిక పూర్ణిమ సావిత్రితో బ్రహ్మ నర్చించి రథ యాత్ర మంగళవాద్యములతో సేయింపవలెను. రథము మీద శాండిలేయుని బూజింప నగును. రాత్రి జాగరణము సేసి బ్రాహ్మణులచే పుణ్యాహవాచనము సేయించి భోజనము పెట్టి, బ్రాహ్మణులచే వేద స్వస్తి చెప్పించి రథము నగర మంతయు త్రిప్ప వలెను. ఋగ్యజు స్సామా೭ధర్వణ మంత్ర పఠనములతో ప్రదక్షిణముగ త్రిప్ప వలెను. శూద్రులు రథము లాగ వచ్చును. కాని పై కెక్క రాదు. రథము నడపువాడు ఎక్క వచ్చును. 245 బ్రహ్మణో దక్షిణ పార్శ్వే గాయత్రీం స్థాపయే న్నృప ! భోజకం వామపార్శ్వే తు పురతః పంకజం న్యసేత్ || 246 ఏవం తూర్య నినాదైస్తు శంఖ శ##బ్దైశ్చ పుష్కలైః | భ్రామయిత్వా రధం వీర పురం సర్వం ప్రదక్షిణమ్ || 247 స్వస్థానే స్థాపయే ద్దేవం దత్వా నీరాజనం బుధః | య ఏవం కురుతే యాత్రాం యో వా భక్తో೭పి పశ్యతి || 248 రథం వా కర్షయే ద్యస్తు స గచ్ఛే ద్బ్రహ్మణః పదమ్ | కార్తికే మా స్యమావాస్యా యశ్చ దీప ప్రదీపనమ్ || 249 శాలాయాం బ్రహ్మణః కుర్యా త్సగచ్ఛే తపరమం పదమ్ | గంధ పుషై#్ప ర్నవై ర్వసై#్త్ర రాత్మానం పూజయేత్తు యః || 250 తస్యాం ప్రతిపదాయాం తు స గచ్ఛే ద్భ్రహ్మణం పదమ్ | మహాపుణ్యాతిథి రియం బలి రాజ్య ప్రవర్తినీ || 251 బ్రహ్మణః సుప్రియా నిత్యం బాలేయీ పరికీర్తితా | బ్రహ్మాణం పూజయే ద్యో೭స్యా మాత్మానం చ విశేషతః 252 స యాతి పరమం స్థానం విష్ణో రమిత తేజసః | చైత్రమాసి మహాబాహో! పుణ్యా ప్రతిపదాం వరా || 253 బ్రహ్మకు కుడి వైపు గాయత్రి దేవికి ముందు తామర పూవు నుంచ వలెను. ఇదంత యైన తర్వాత రథమును నీరాజన మిచ్చి యథాస్థానము నిలుప వలెను. ఈ రథ యాత్ర చేయించిన చూచిన లాగిన పుణ్యాత్ముడు బ్రహ్మ స్థాన మందును. గంథ పుష్పము లతో నూతన వస్త్రములతో పాడ్యమి నాడు ఆత్మను (దనను) పూజించు కొన్నతడు ను బ్రహ్మ పద మందును. ఈ కార్తికా೭మావాస్య మహా పుణ్యతిథి బాలేయి యనబడును. బలి రాజ్యారంభ మిందే జరిగినది. బ్రహ్మకు మిక్కిలి ప్రియము. బ్రహ్మను తనను నర్చించి నతడు విష్ణు సాలోక్య మందును. తస్యాం యః స్వపచం స్పృష్ట్వా స్నానం కుర్యా న్నరోత్తమః న తస్య దురితం కించి న్నాధయో వ్యాధయో నృప || 254 భవంతి నరశార్ధూల తస్మాత్ స్నానం సమాచరేత్ ! దివ్యం నీరాజనం తద్ధి సర్వ రోగ వినాశనమ్ || 255 గో మహిష్యాది యత్కించి త్తత్సర్వం కర్షయే న్నృప | తేన వస్త్రాదిభిః సర్వై స్తోరణం బాహ్యతో న్యసేత్ || 256 బ్రాహ్మణానాం తథా భోజ్యం కుర్యా త్కురు కులోద్భవ | తిస్రోఖ్యాతాః పురా ప్రోక్తా స్తిధయః కురునందన || 257 కార్తికా೭శ్వయుజే మాసి చైత్రే మాసి తథా నృప! | స్నానం దానం శతగుణం కార్తికే యా తిధి ర్నప! 258 బలి రాజ్ఞస్తు శుభదా పశూనాం హితకారిణీ | మహాబాహువులు గల భీష్మాచార్యా ! చైత్ర శుద్ధ ప్రతిపత్తు (పాడ్యమి) 12 మాసముల ప్రతిపత్తులలోకెల్ల శ్రేష్ఠ మయినది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కుక్క మాంసము తిను (శ్వపచుని) చండాలుని ముట్టుకొని మానవుడు స్నానము జేయ వలెను. రాజా ! అట్లు ముట్టుకొని స్నానము జేసిన వానికి సమస్తపాపపరి హారమగును. ఆధి (మానసదుఃఖము) వ్యాధులు (శరీర దుఃఖములు) గలుగవు. గాన ఓ నరశార్దూలా ! చండాలుని ముట్టుకొని స్నానము జేసినచో ఆది దివ్య నీరాజనము, శుభప్రదము, సర్వరోగ వినాశకరమై యున్నది. ఆ రోజున గోమహిష్యాదు లేమున్నను కర్షణము (దున్నుట) చేయించవలెను. మరియు సమస్త నూతనవస్త్రములతో బాహ్య భాగమున తోరణములను ఆలంకరించ వలెను. కురు కులోద్భవా ! ఆ రోజున బ్రాహ్మణ భోజనము జేయించ వలెను. పూర్వము మూడు ప్రతిపత్తులు ప్రసిద్ధములైనవిగా జెప్పబడినవి. అవి యేవనగా చైత్ర, ఆశ్వయుజ, కార్తిక, శుద్ధ ప్రతిపత్తులు. రాజా ! ఈ మూడు తిథులయందు స్నాన, దానాదులు నూరు రెట్లు ఫలము గలుగ జేయును. ఈ మూడిటిలో కార్తీక శుద్ధ ప్రతిపత్తును బలి చక్రవర్తి రాజ్యము జేసిన తిధిగా వామనమూర్తి వర మున్నందున ''బలి ప్రతిపత్తు'' అని యందురు. ఈ తిధి యందు చేయు స్నాన, దానాదులు శతగుణము లగును. పశువులకు హితకరమై యున్నది. గాయత్ర్యువాచ : యదుక్తం తు తయా వాక్యం సావిత్ర్యా కమలోద్భవమ్ || 259 న తు తే బ్రాహ్మణాః పూజాం కరిష్యంతి కదాచన | మదీయం తు వచః శ్రుత్వా యే కరిష్యంతి చా೭ర్చనమ్|| 260 ఇహ భుక్త్వా తు భోగాం స్తే పరత్ర మోక్ష భాగినః ఏతాం జ్ఞాత్వా పరాం దృష్టిం వరం తుష్టః ప్రయచ్ఛతి || 261 శక్రా೭హం తే వరం దాస్యే సంగ్రామే శత్రు నిగ్రహే | తదా బ్రహ్మా మోచయితా గత్వా శత్రు నికేతనమ్ || 262 స్వపురం లస్స్యసే నష్టం శత్రునాశా త్పరాం ముదమ్ | ఆకంటకం మహ ద్రాజ్యం త్రైలోక్యే తే భవిష్యతి || 263 మర్త్యలోకే యదా విష్ణో ! అవతారం కరిష్యసి | భ్రాత్రా సహ పరం దుఃఖం స్వభార్యా೭ హరణాదిజమ్ || 264 హత్వా శత్రుం పున ర్భార్యాం లప్స్యసే సురసన్నిధౌ | గృహీ త్వాం తాం పునా రాజ్యం కృత్వా స్వర్గం గమిష్యసి || 265 ఏకాదశ సహస్రాణి వర్షాణాం చ పున ర్దివమ్ | ఖ్యాతిస్తే విపులా లోకే ఆనురాగం జనై స్సహ || 266 సంతానికా నామ తేషాం లోకాః స్థాస్యంతి భావితాః | త్వయా తే తారితా దేవ ! రామ రూపేణ మానవాః || 267 బ్రహ్మదేవా ! సావిత్రీ దేవి యిచ్చిన శాపముచే బ్రాహ్మణులు నీకు పూజ జేయరు. నా వచనమును విని ఆర్చనము జేసినచో ఇహమందు భోగభాగ్యము లనుభవించి పరమున మోక్షము బొందుదురు. ఇది తెలిసికొని నీవు సంతుష్టుడవై కోరిన వరముల నిచ్చెదవు గాక. దేవేంద్రా ! నీకు వర మిచ్చెదను. నీవు యుద్ధమందు శత్రువుచే జయింప బడి కారాగార మందున్న సమయమున బ్రహ్మదేవుడు శతృ గృహమునకు వచ్చి నిన్ను విడిపించు గాక. తరువాత ముల్లోకములందు నిష్కంటకమగు మహారాజ్యము ననుభవించెదవు గాక. విష్ణుదేవా ! భూలోకమున నీవు ఆవతరించి నపుడు నీ సోదరసహితముగా భార్యావహరణాది దుఃఖము ననుభవించవలసి యుండును. అట్లయినను, శత్రు సంహారము జేసి దేవతల సమక్షంలో మరల నీ భార్యను నీవు బొందుదువు గాక. ఆమెను గ్రహించి పదకొండు వేల సంవత్సరములు రాజ్యము జేసి వైకుంఠమునకు బోయెదవు గాక. లోకమందు ప్రఖ్యాతిని బొందెదవు గాక. జనులు నిన్ను ప్రేమించుదురు గాక. ఆ జనులందరికి ''సాంతానిక'' నామకములయిన లోకములు గలుగు గాక. దేవా ! లోకమందలి మానవులు రామ రూపుడ వయిన నీ చేత తరించెదరు గాత. 267 గాయత్రీ తు తదా రుద్రం వరదా ప్రత్యభాషత | పతితే೭పి చ తే లింగే పూజాం కుర్వంతి యే నరాః || 268 తే పూతాః పుణ్యకర్మాణః స్వర్గలోకస్య భాగినః | న తాం గతి చా೭గ్నిహోత్రే న క్రతౌ హుత పావకే || 269 యాం గతిం మనుజా యాంతి తవ లింగస్య పూజయాత్ ! గంగా తీరే సదా లింగం బిల్వపత్రేణ యే తవ || 270 పూజయిష్యంతి సుప్రాతా రుద్రలోకస్య భాగినః | ప్రాప్యా೭పి శర్వ భక్తత్వ మగ్రే త్వం భవ పావనః || 271 త్వయి ప్రీతే సురాః సర్వే ప్రీతా వై నా೭త్ర సంశయః | త్వన్ముఖేన హవి ర్దేపైః పీతాః ప్రీతే త్వయిధ్రువమ్ || 272 భుజంతే నా೭త్ర సందేహో వేదోక్తం వచనం యధా | గాయత్రీ బ్రాహ్మణాం స్తాం శ్చసర్వాంశైవా బ్రవీదిదమ్ || 273 తరువాత గాయత్రీ దేవి రుద్రుని జూచి యిట్లనెను. శంకరా! నీకు లింగపతనమయినను యేమానవులు లింగపూజ చేయుదురో అట్టి పుణ్యకర్మలు జేసినవారు పవిత్రులై స్వర్గలోకమునకు బోవుదురు. లింగార్చన జేసినవారికి అగ్ని హోత్రపూజ, క్రతువుయందు హోమములు జేసివారికి లభించని యుత్తమగతులు గలుగును. గంగాతీరమందు ప్రాతఃకాలమున బిల్వప్రతములతో లింగపూజ జేసినవారు రుద్రలోక ప్రాప్తిగలవారగుదురు. శంకరభక్తుడయినవాడు పావనుడవుతాడు. రుద్రా ! పరమ పావనుడవు. నీవు ప్రీతిని బొందినచో సమస్తదేవతలు తృప్తిని బొందుదురు. దేవతలు నీ ముఖముతో హవిస్సులను భుజించుచున్నారు. ఇట్లు వేదోక్తవచనముగాన సందియబడ నక్కరలేదు. తరువాత గాయత్రీ దేవి బ్రాహ్మణుల గురించి యిట్లు బలికెను. యుష్మాకం ప్రీణనం కృత్వా సర్వతీర్థేషు మానవాః | పదం సర్వే గమిష్యంతి వైరాజాఖ్యం న సంశయః || 274 అన్న ప్రకారాన్ వివిధా న్దత్వా దానా న్యనేకశః | శ్రాద్ధేషు ప్రీణనం కృత్వా దేవ దేవా భవంతి తే || 275 యే చ వై బ్రాహ్మణ శ్రేష్ఠా స్తేషా మాస్యే దివౌకసః | భుజంతే చ హవిః క్షిప్రం కవ్యం చైవ పితామహాః || 276 యూయం హి ధారణ శక్తా సై#్త్రలోకస్య న సంశయాః | ప్రాణాయామేన చై కేన సర్వే పూతా భవిష్యథ || 277 విశేషా త్పుష్కరే స్నాత్వా మాం జప్త్వా వేదమాతరమ్ | ప్రతిగ్రహకృతా న్దోషా న్న ప్రాప్స్యధ ద్విజోత్తమాః || 278 పుష్కరే చా೭న్నదానేన ప్రీతాః స్యుః సర్వదేవతాః ఏకస్మిన్ భోజితే విప్రే కోట్యాః ఫల మవాప్స్యతే || 279 బ్రహ్మహత్యా೭ది పాపాని దుష్కృతాని కృతానిచ | కరిష్యంతి నరాః సర్వే దత్వా యుష్మ త్కరే ధనమ్ || 280 మదీయేన తు జాప్యేన పూజనీయః త్రిభిః కృతైః | బ్రహ్మహత్యా సమం పాపం తత్‌క్షణా దేవ నశ్యతి || 281 బ్రాహ్మణులారా ! మానవులు మిమ్ములను సర్వతీర్థక్షేత్రములందు తృప్తిబొందించినచో వై రాజాఖ్యపదములను బొందుదురు గాత ! మానవులు బ్రాహ్మణులను శ్రాద్ధకర్మలయందు తృప్తిగావించినచో దేవతకెల్ల దేవతలగుదురు. దేవతలు బ్రాహ్మణశ్రేష్టులయినవారి ముఖములందు యివ్వబడిన హవ్యములను భుజించుదురు. పితామహులు కవ్యములను భుజించుదురు. ముల్లోకములను ధరించు శక్తి గలవారగుదురు గాక. ఒక ప్రాణాయామముతో పవిత్రులగుచున్నారు. ద్విజోత్తములారా! పుష్కరక్షేత్రమందు విశేషముగా స్నానము జేసి వేదమాతయగు నన్ను జపించిన యడల ప్రతిగ్రహమువలన వచ్చిన దోషములను పొందకుందురు గాక. పుష్కరక్షేత్రమందు అన్నదానము వలన సర్వ దేవతాతృప్తి గలుగును. ఒక బ్రాహ్మణుని భుజింపజేసిన యడల కోటిగుణితఫలము గలుగును. ద్విజులారా ! మానవులు మీ హస్తములందు ధనము సమర్పించినచో బ్రహ్మహత్యాది సమస్తదురితములు నశించును. మూడుసార్లు నా గాయత్రీ మంత్రమును జపించినచో బ్రహ్మహత్యా సమానపాపములు పరిహారమగును. 281 దశభి ర్జన్మభి ర్జాతు శ##తేన చ పురాకృతమ్ | త్రియుగేన సహస్రేణ గాయత్రీ హంతి కిల్బిషమ్ || 282 ఏవం జ్ఞాత్వా సదా పాతా జాప్యేతు మమ వైకృతే | భవిష్యధ్వం న సందేహో నా೭త్రకార్యా విచారణా || 283 ప్రణవేన త్రిమాత్రేణ సార్థం జప్త్యా విశేషతః | పూతాః సర్వేన సందేహో జప్త్వా మాం శిరసా సహ || 284 అష్టాక్షరా స్థితా చా೭హం జగద్వ్యాప్తం మయా త్విదమ్ | మాతా೭హం సర్వ వేదానాం పదై స్సర్వై రలంకృతా || 285 జప్త్వా మాం భక్తితః సిద్ధిం ప్రాప్య్యంతి ద్విజసత్తమాః ! ప్రాధాన్యం మమ జాప్యేన సర్వేషాం వో భవిష్యతి || 286 గాయత్రీ సార మాత్రో೭పి వరం విప్రః నుసంయతః | నా೭యంత్రిత శ్చతుర్వేదీ సర్వాశీ సర్వ విక్రయీ || 287 యస్మా ద్విప్రేషు సావిత్ర్యా శాపో దత్తః సదస్యథ | అత్ర దత్తం హుతం చా೭పి సర్వ మక్షయ కారకమ్ || 288 దత్తో వరో యయా తేన యుష్మాకం ద్విజసత్తమాః | అగ్నిహోత్రపరా విప్రా స్త్రికాలం హోమదాయినః || 289 స్వర్గం తే తు గమిష్యంతి సైకవింశతిభిః కులైః ఏవం శక్రస్య విష్ణోశ్చ రుద్రస్య పావకస్య చ || 290 బ్రహ్మణో బ్రాహ్మణానాం చ గాయత్రీ వర ముత్తమమ్ | తస్మిన్వై పుష్కరే దత్వా బ్రహ్మణః పార్శ్వగా೭భవత్ || 291 నూరుసార్లు గాయత్రీమంత్రముచేత పూర్వముజేసిన పదిజన్మల పాపము నశించును. ఆణువేలగాయత్రీ మంత్ర జపము జేసిన సమస్త కిల్బిషములు నిశించును. విశేషించి త్రిమాత్రయుక్త ప్రణపముతో సువరోం అంతమగు శిరస్సుతో జపించినయడల నా అనుగ్రహముచే నందరు పవిత్రులగుదురు. సందేహము లేదు. నేను అష్టాక్షరస్థితురాలను. జగత్తునంతయు వ్యాపించి యున్నాను. నేను సమస్త వేదములకు తల్లిని, సర్వపదములకు ఆలంకరింపబడినదానిని. ద్విజసత్తము లారా ! నన్ను భక్తితో జపించి సిద్దిని పొందగలరు. ఈ నా మంత్రము మీ యందరికి అన్ని మంత్రములకన్న ముఖ్యమై నదిగా కాగలదు. ఒక్క నాగాయత్రీ మంత్రము మాత్రమే జపించునాతడు బ్రాహ్మణు లందరిలో శ్రేష్ఠుడగుచున్నాడు. నాలుగువేదములు చదివినను, సర్వభక్షకుడైనను, సర్వవిక్రయి అయినను, గాయత్రీ మంత్రజపముచే ధన్యుడగుచున్నాడు. సావిత్రీదేవి శాపమిచ్చినను నా మంత్రజపముజేసినవారికి సావిత్రీ దేవి శాపము ఫలించదు. గాయత్రీమంత్రానుష్ఠానపరులు జేసిన దాన హోమాదులు సర్వము అక్షయములగుచున్నవి. త్రికాలములందు హోమములు చేయు అగ్రిహోత్ర పరులగు ద్విజులు యిరువదియొక్క శతముల వారితో సహా స్వర్గలోకమున కేగుదురు. గాయత్రి ఈ విధముగా ఇంద్ర, విష్ణు, రుద్ర బ్రహ్మ, అగ్రి, బ్రాహ్మణులకు ఆ పుష్కర క్షేత్రమందు ఉత్తమ వరముల నిచ్చి బ్రహ్మదేవుని సమీపమునకు బోయెను. 291 చారణౖస్తు తదా೭ఖ్యాతం లక్ష్మ్యా వై శాపకారణమ్ | యువతీనాం చ సర్వాసాం శాపాన్ జ్ఞాత్పా పృథల్ పృథక్ || 292 లక్ష్మాశ్చైవ వరం ప్రాదా ద్గాయత్రీ బ్రహ్మణః ప్రియా | అకుత్సితాన్ తదా సర్వాన్ కుర్వంతీ ధనశోభనామ్ || 293 శోభిష్యసే న సందేహః సర్వేభ్యః ప్రీతిదాయినీ | యే త్వయా వీక్షితాః పుత్రి ! సర్వే తే పుణ్య భాజనాః || 294 పరిత్యక్తాస్త్వయా యే తు సర్వే తే దుఃఖ భాగినః | తేషాం జాతిః కులం శీలం ధర్మశ్చైవ వరాననే || 295 సభాయాం తే చ శోభంతే దృశ్యంతే చైవ పార్థివైః | అర్థిత్వం చైవ తేషాంతు కరిష్యంతి ద్విజోత్తమాః || 296 సౌజన్యం తేషు కుర్వంతి త్వం నో భ్రాతా పితా గురుః | బాంధవో೭పి న సందేహో న జీవేయం త్వయా వినా || 297 త్వయిదృష్టేప్రసన్నా మే దృష్టి ర్భవతి శోభనా | మనః ప్రసీదతే೭త్యర్థం సత్యం సత్యంవదామి తే || 298 ఏవం విధాని వాక్యాని త్వద్దృష్ట్యా యే నిరీక్షితాః | సజ్జనా స్తే తు శోష్యంతి జనానాం ప్రీతి దాయకాః || 299 ఇంద్ర! త్వం నహుషః ప్రాప్య దృష్ట్యా త్వాం యాచయిష్యతి | త్వద్ దృష్ట్యా తు హతః పాపో హగ్యస్త్య వచనా ద్ధ్రువమ్ || 300 సర్పత్వం సమనుప్రాప్య ప్రార్థయిష్యతి తం తు సః | దర్పేణా೭హం వినష్టో೭స్మి శరణం మే మునే భవ || 301 వాక్యేన తేన తస్యా೭సౌ నృపస్య భగవా నృషిః | కృత్వా మనసి కారుణ్య మిదం వాక్యం వదిష్యతి || 302 ఉత్పత్స్యతే కులే రాజా త్వదీయేం కులనందనః || 303 సర్ప రూప ధరం దృష్ట్యా స తే శాపం హి భేత్య్సతి | తదా త్వం సర్పతాం త్యక్త్వా పునః స్వర్గం గమిష్యసి || 304 ఆశ్వమేధకృతేన త్వం భర్త్రా నహ పునర్ధివమ్ | ప్రాప్స్యసే వర దానేన మదీయేన సులోచనే! || 305 పులస్త్య ఉవాచ : దేవపత్న్య స్తదా సర్వా స్తుష్టయా పరిభాషితాః | అపత్యై రపి హీనానాం నైవ దుఃఖం భవిష్యతి || 306 గౌరీ చైవ తు గాయత్య్రా తదాసా೭పి విబోధితా | బృంహితా పరితోషేణ వరా న్ధత్వా మనస్వినీ || 307 సమాప్తిం తస్య యజ్ఞస్య కాంక్షంతీ బ్రహ్మణః ప్రియా | వరదాం తాం తథా దృష్ట్యా గాయత్రీం వేదమాతరమ్ || 308 ప్రణిపత్య తదా రుద్రః స్తుతి మేతాం చకార హ || 309 లక్ష్మీ మొదలుగా గల అందరు శాపకారణమును తెలిసికొనిరి. బ్రహ్మదేవునికి ప్రియురాలయిన గాయత్రీదేవి వారందరికి వరముల నిచ్చెను. గాయత్రీ దేవి లక్ష్మీదేవికి యిట్లు వరమిచ్చెను. లక్ష్మీ నీవు న్యాయార్జిత ధనములతో అందరిని సంతోషింప చేసెదవు గాక. లక్ష్మీకటాక్షము గలవారందరు పుణ్యాత్ములు. నీ కటాక్షములేనివారు దుఃఖముల పాలగుదురు. నీ కటాక్ష మున్నవారలకు, జాతి, కులము, శీలము, ధర్మము ప్రకాశించును. ఓ! వరాననా ! సభలో రాజులచేత గౌరవింప బడుదురు. ద్విజోత్తములు, అట్టి వారి నుంచి యాచన గూడ చేయుదురు. అట్టివారిని సుజనులుగా భావింతురు. అట్టి ధనవంతులను, తల్లి, దండ్రి గురువని దలంతురు. నీవు లేనిచో జీవించ లేమందురు. నీ చూపు మాయందు ప్రసరించినచో మేము ధన్యులమగుదుము. మా మనస్సులు అత్యంతము ప్రసన్నముగా నుండును. సత్యముగా జెప్పుచున్నాము. సజ్జనులు ఈ వాక్యములు జనములకు ప్రీతిదాయకముగావింతురు. లక్ష్మీ ! నీ కటాక్షమున్నచో ఎట్టివారలయినను గొప్పవారలగుదురు గాత ! శచీదేవీ! నహుషమహారాజు యింద్రపదవిని బొంది నిన్ను పత్నిని గమ్మని అర్థించును. ఆ పాపాత్ముడు అగస్త్య వచనముచే నీ దృష్టిసోకి సర్పత్వమును బొదును. పిమ్మట అగస్త్యులవారిని మునీశ్వరా రక్షించమని శరణు బొందును. అప్పుడు భగవానుడైన అగస్త్యమహర్షి ఆ రాజుమాటకు కరుణగలవాడై ఇట్లు బలికెను. ఓ నహుష మహారాజా నీ వంశమందు కులోద్ధారకుడగు నొకడు జన్మించును. ఆతడు సర్పరూపుడవయిన నిను శాపమునుంచి విముక్తిని బొందించగలడు. అప్పుడు సర్పరూపము విడిచి స్వర్గమునకు బోగలవు. శచీదేవీ ! ఇట్లు నహుషునికి శాపవిమోచనము చేయును. సులోచనా! తరువాత నా వర దానప్రభావముచేత నీ భర్తతో అశ్వమేధయాగము చేసి తిరిగి స్వర్గలోకప్రాప్తి యగుగాత. పులస్త్యుడనియె :- ఇట్లు వరములనిచ్చిన తదుపరి సమస్తదేవపత్నులకు సంతాన హీనులైనను దుఃఖము గలుగకుండునట్లు వరమిచ్చెను. గాయత్రి శారదాదేవిని గూడ వరదానముచే సంతుష్టపరిచెను. బ్రహ్మదేవునికి ప్రియురాలైన గాయత్రీ దేవి యజ్ఞ సమాప్తిని కోరుచుండెను. రుద్రుడు వరదురాలైన వేదమాత గాయత్రినిజూచి నమస్కరించి ఈ విధముగా స్తుతించెను. 309 రుద్రకృత గాయత్రీ స్తుతిః నమో೭స్తు తే వేదమాత రష్టాక్షర విశోధితే ! | గాయత్రీ దుర్గతరణీ వాణీ సప్త విధా తథా || 310 సర్వాణీ స్తుతి శాస్త్రాణి గాధాశ్చ నిఖిలా స్తథా | ఆక్షరాణి చ సర్వాణి లక్షణాని త థైవ చ || 311 భాష్యాది సర్వ శాస్త్రాణి యే చా೭న్యే నియమా స్తదా | అక్షరాణి చ సర్వాణి త్వం తు దేవి! నమో೭స్తుతే || 312 శ్వేతా త్వం శ్వేతరూపా೭సి శశాంకేన సమాననా | బిభ్రతీ విపులౌ బాహూ కదలీ గర్భ కోమలే || 313 ఏణ శృంగం కరే గృహ్య పంకజం చ సునిర్మిలమ్ | వసానా వసనే క్షామే రక్తే నోత్తర వాససా || 314 శశి రశ్మి ప్రకాశేన హారేణోరసి రాజితా | దివ్య కుండల పూర్ణాఖ్యాం కర్ణాభ్యాం సువిభూషితా || 315 చంద్ర సాపత్న భూతేన ముఖేన త్వం విరాజసే ! మకుటేనా೭తిశుద్ధేన కేశ ఖండేన శోభితా || 316 భుజగా೭ భోగ సదృశౌ భుజౌ తే భూషణం దివః | స్తనే తే రుచిరౌ దేవి వర్తులౌ సమచూచుకౌ || 317 జఘనేనా೭తిశుభ్రేణ త్రివళీ భంగ దర్పితా | సుమధ్యవర్తినీ నాభి ర్గంభీరా శుభ దర్శినీ | || 318 విస్తీర్ణజఘనా దేవీ సుశ్రోణీ చ వరాననే | సుజాత వృత్తోరుయుగా సుజూను చరణా తథా || 319 త్రైలోక్య ధారిణీ సా త్వం భువి సత్యోపయాచనా | భవిష్యసి మహాభాగే వరదా వరవర్ణినీ || 320 పుష్కరే చ కృతా యాత్రా దృష్ట్యా త్వాం సంభవిష్యతి ః జేష్ఠమాసే పౌర్ణమాస్యా మగ్ర్యాం పూజాం చ లప్స్యసే || 321 యే చ వా త్వత్ప్రభావజ్ఞాః పూజయిష్యంతి మానవాః | న తేషాం దుర్లభం కించి త్పుత్రతో ధనతో೭పివా || 322 కాంతారేషు నిమగ్నానా యటవ్యాం వా మహార్ణవే | దస్యుభి ర్వా నిరుద్ధానాం త్వం గతిః పరమా నృణామ్ || 323 త్వం సిద్థిః శ్రీః ధృతిః కీర్తి ర్హ్రీ ర్విద్యా సన్నతి ర్మతిః | సంధ్యా రాత్రిః ప్రభా నిద్రా కాలరాత్రి స్త్వ మేవ చ || 324 అంబా చ కమలా మాతర్భ్రహ్మాణీ బ్రహ్మచారిణీ | జననీ సర్వ దేవానాం గాయత్రీ పరమా೭ంగనా|| 325 జయా చ విజయా చైవ పుష్టి స్త్వంచ క్షమా తథా | సావిత్ర్య వరజా చా೭సి సదా చేష్టా పితామహే || 326 నగరేషు చ పుణ్యషు ఆశ్రమేషు వరాననే | వాస స్తవ మహాదేవి ! మనేషూపవనేషు చ || 327 బ్రహ్మస్థానేషు సర్వేషు బ్రహ్మణో వామతః స్థితా | దక్షిణన తు సావిత్రీ మధ్యే బ్రహ్మా పితామహః || 328 అంతర్వేదీ చ యజ్ఞానాం ఋత్విజాం చా೭పి దక్షిణా | సిద్ది స్త్వం హి నృపాణాంచ వేలా సాగర జా మాతా || 329 బ్రహ్మచారిణి యా దీక్షా శోభా చ పరమా మాతా | జ్యోతిషాం చ ప్రభా దేవీ లక్ష్మీ ర్నారాయణ స్థితా || 330 క్షమా సిద్ది ర్మునీనాం చ సక్షత్రాణాం చ రోహిణీ | రాజ ద్వారేషు తీర్థేషు నదీనాం సంగమేషు చ|| పూర్ణిమా పూర్ణచంద్రే చ బుద్ధి ర్నీత్యాం క్షమా ధృతిః | ఉమా దేవీ చ నారీణాం శ్రూయసే వరవర్ణిని || 331 ఇంద్రస్య చారుదృష్టి స్త్వం సహస్రనయనోపగా | ఋషీణాం ధర్మ బుద్ధి స్త్వం దేవానాం చ పరాయణా || 332 కర్షకాణాం చ సీతా త్వం భూతానాం ధరణీ తథా | స్త్రీణా మపైధవ్యకరీ ధనధాన్య ప్రదా సదా || 333 వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా శమయిష్యసి || 334 ఇతి శ్రీపాద్మేపురాణ సృష్టిఖండే సావిత్రీవివాదగాయత్రీ వరప్రదానం నామ నప్తదశో೭ధ్యాయః రుద్రకృత గాయత్రీస్తుతి ఈస్తోత్రము పారాయణార్హము. ఉపదేశమునకు అర్హమయినది గాన ఈ అధ్యాయాంతము వరకు వున్న శ్లోకార్థము అనువదించుట యుక్తము గాదనితోచి వదిలివేయబడినది. ఆసక్తిగలవారు యోగ్యులైన పండితులచే తెలిసికొన గోరుచున్నాము. అర్థము తెలియకపోయినను గాయత్రీస్తోత్రము పారాయణము జేసికొనవచ్చును. ఇట్లు శ్రీపద్మపురాణమున సావిత్రీ వివాదమునందు గాయత్రీ వరప్రదానము గాయత్రి స్తోత్రము అను పదునేడవ అధ్యాయము.