Sri Padma Mahapuranam-I
Chapters
రెండవ అధ్యాయము సృష్టిఖండ విషయవర్ణనమ్ నూత ఉవాచ నమస్యే సర్వలోకానా మీశ్వరం విశ్వకారణం| య ఇమం కురుతే భావం సృష్టిరూపం ప్రధానవిత్ || 1 లోకకృ ల్లోకతత్వజ్ఞో యోగమాస్థాయ యోగవిత్ | అసృజత్ సర్వభూతాని స్థాపరాణి చరాణి చ || 2 త మజం విశ్వకర్మాణం చిత్పతిమ్ లోక సాక్షిణమ్ | పురాణాఖ్యాన జిజ్ఞాసు ర్ర్వజామి శరణం విభుమ్ || 3 బ్రహ్మ విష్ణు గిరీ శాంశ్చ నమస్కృత్వా సమాహితః | ఇంద్రాది లోక పాలేభ్యః సవిత్రేచ సమాధినా || 4 మునీనాంచ వరిష్టాయ వశిష్టాయ మహాత్మనే | తద్వక్త్రే భాతతపసే జాతుకర్ణాయ చాక్షుషై || 5 తసై#్మ భగవతే న త్వా వేదవ్యాసాయ వేధసే | పురుషాయ పురాణాయ భృగువాక్యానువర్తినే || 6 తస్మా దహ ముపాశ్రౌషం పురాణం బ్రహ్మవాదినః | సర్వజ్ఞాత్ సర్వలోకేషు పూజితాద్దీప్తతేజసః || 7 సూతుడిట్లనియె ! సర్వలోకేశ్వరునకు విశ్వకారణునకు నమస్కారము. ఏ పరమేశ్వరుడు ప్రకృతి ననుసరించి సృష్టిసంకల్పము జేసి లోకములను యోగారూఢుడై చరాచరాత్మకసర్వభూతములను సృజించెనో యట్టి విశ్వకర్మను చిద్రూపుని లోకసాక్షిని పుట్టుకలేని వానిని నమస్కరించెదను. పురాణాఖ్యానములను దెలసికొననెంచి యవ్విబుని శరణు సొచ్చెదను. త్రిమూర్త్యాత్మకమైన తత్త్వమునకు మ్రొక్కి యింద్రాది దిక్పాలకులకు సూర్యునకు మునిశ్రేష్ఠుడగు వసిష్ఠునకు తపస్వియైన లోమహర్షుణనకు వేదవ్యాసభగవానునకు భృగువాక్యముననుసరించు నాపురాణ పురుషునకు నమస్కరించెదను. ఆబ్రహ్మవాది వలన నేను పురాణములను విన్నాను. ఆయన సర్వజ్ఞుడు. బ్రహ్మతేజస్సంపన్నుడు. సర్వలోక వంద్యుడు. అవ్యక్తం కారణం యత్తన్నిత్యం సదాసదాత్మకమ్ | మహదాది విశేషాంతం సృజతీతి వినిశ్చయం || 8 అండే హిరణ్మయే పూర్వం బ్రహ్మణః సూతిరుత్తమా | అండస్యావరణం చార్భిరపామపి చ తేజసా || 9 వాయునా తస్య వాయోః ఖాత్త ద్భూతాదిత ఆవృతమ్ | భూతాదిర్యహతా చాపి అవ్య క్తేనావృతో మహాన్ || 10 ప్రాదుర్భావశ్చ లోకానామండ ఏవోపవర్ణితః | నదీనాం పర్వతానాంచ ప్రాదుర్భావో7నువర్ణ్యతే || 11 మన్వంతరాణాం సంక్షేపాత్ కల్పానాంచోపవర్ణనమ్ | బ్రహ్మ వృక్షలయబ్రహ్మ ప్రజాసర్తోప వర్ణనమ్ ||
12 కల్పానాం సంచర శ్చైవ జగతః స్థాపనం తథా | శయనంచ హరేరప్సు పృథివ్యుద్ధరణం పునః 13 దశరధా జన్మసంచారో భృగుశాపేన కేశ##వే | సన్నివేశో యుగాదీనాం సర్వాశ్రమ విభాజనమ్ || 14 స్వర్గస్థాన విభాగశ్చ మర్త్యానాం సర్గచారిణామ్ | పశూనాం పక్షిణాం చైవ సంభవః పరికీర్తితః || 15 తధా నిర్వచనం కల్పం స్వాధ్యాయస్య పరిగ్రహః | ప్రతిసర్గా పునః ప్రోక్తాఃబ్రహ్మణో బుద్ధిపూర్వకాః || 16 అవ్యక్తము నదసద్విలక్షణము నగు పరబ్రహ్మ మహత్తు దగ్గర నుంచి సృష్టివిశేషమును సృష్టించుననునది నిశ్చయమైనమాట. హిరణ్మయాండం నుండి బ్రహ్మ పుట్టెను. ఆ బ్రహ్మాండమునకు నావరణముగా జలమున్నది. దాని కావరణముగ తేజస్సు వాయువు నా వాయువునకాకాశము నావరణములుగా నున్నవి. భూతాది యనగా నాకాశము మహ త్తత్వముచేతను అది అవ్యక్తముచేతను అవరింపబడియున్నది. అవ్యక్తమనగా పరమాత్మయే. ఆ యవ్యక్తముచేతనే మహత్తత్వము (బుద్ధి) ఆవరింపబడియున్నది. లోకములయొక్క యావిర్భావము హిరణ్మయాండము (బంగారు గ్రుడ్డు) నుండియే. నదులు పర్వతములు మొదలగు వాని పుట్టుక మొదలు పిపీలి కాది సర్వ సృష్టియు గల్పాది కాలపరిగణనము ప్రతిసర్గము బ్రహ్మయొక్క బెద్ధితత్త్వము నుండియే యేర్పడినవి. బ్రహ్మయొక్క ముఖములనుండి భృగ్వాది మహర్షులు (అయోనిజులు) పుట్టిరి. కల్పములందు సృష్టికి సృష్టికి నడిమి సంధి స్వరూపము భృగ్వాది ఋషులయొక్క ప్రజాసర్గము బ్రహ్మర్షియైన వశిష్ఠునియొక్క మహత్వము స్వాయంభువ మనువుయొక్క యంతరము విష్ణునాభి కమలమునుండి బ్రహ్మ మొదలుగా గలిగిన రాజససృష్టి ద్వీవ సముద్ర పర్వతములయొక్క వర్ణనము వాని యోజన ప్రమాణము నచట జీవించు జీవులయొక్క చరిత్ర నామీద నవవర్షములు అందలి నదీపర్వతముల వర్ణనము నీ పురాణ మందు వర్ణింపబడినది. సూర్యాది జ్యోతిర్మండలములు ధ్రువుడు సూర్యాది గ్రహాదుల రథములు శింశుమార చక్రము సృష్టి తరువాత లయము లయము తరువాత సృష్టి జరుగుటయు. త్రయో7న్యే7బుద్ధిపూర్వాంస్తేతథా లోకా నకల్పయత్ | బ్రహ్మణో వదనేభ్యశ్చ భృగ్వాదీనాం సముద్భవః || 17 కల్పయోరంతరం ప్రోక్తం ప్రతిసంధిశ్చ సర్గయోః | భృగ్వాదీనా మృషీణాంచ ప్రజాసర్గోవ వర్ణనమ్ || 18 వశిష్ఠస్య చ బ్రహ్మర్షే ర్ర్బహ్మత్వం పరికీర్షితమ్ | స్వాయంభువస్య చ మనోస్తత శ్చాప్యనుకీర్తనమ్ || 19 ఉక్తోనాభేర్వి స్వర్గశ్చ రజసశ్చ మహాత్మనః | ద్వీపానాంచ సముద్రాణాం పర్వతానాంచ కీర్తనమ్ || 20 ద్వీపభేద సముద్రాణా మంతర్భాగశ్చ సప్తసు | కీర్త్యంతే యోజనాగ్రేణ యేచ తత్ర నివాసినః || 21 తదీయా నిచ వర్షాణి నదీభిః పర్వతైః సహ | జంబూ ద్వీపాదయో ద్వీపాః సముద్రైః సప్తభిర్వృతాః || 22 అండస్యాంతస్త్వియే లోకాః సప్తద్వీపాచ మేదినీ | సూర్యాచంద్ర మసోశ్చారో గ్రహాణాం జ్యోతిషాం తథా || 23 కీర్యతే ధ్రువసామర్ధ్యాత్ ప్రజానాంచ శుభాశుభమ్ | బ్రహ్మణా నిర్మితః సౌరః స్యన్దనో7ర్ధవశాత్ స్వయమ్ || 24 కల్పితో భగవంస్తేన ప్రసర్పతి దివాకరః | సూర్యాదీనాం స్యందనానాం ధ్రువదేవ ప్రవర్తనమ్ | 25 కల్పితః శిశుమారశ్చ యస్య పుచ్ఛే ధ్రువః స్థితః | సంభవాంతే చ సంహారః సంహారంతే చ సంభవః || 26 దేవతానా మృషీణాంచ మనోః పితృగణన్యచ | నశక్యం విస్తరా ద్వక్తు మిత్యుక్తైంచ సమానతః || 27 అతీతానాగతానాం వై సమం స్వాయంభువేన తు | మన్వంతరేషు దేవానాం వ్రజే శానాంచ కీర్తనమ్ || 28 నైమిత్తికః ప్రాకృతికస్తథై వాత్యంతికః న్మృతః | త్రివిధః సర్వభూతానాం కల్పితః వ్రతినంచరః || 29 అనావృష్టి ర్భాస్కరాశ్చ ఘెరః సంవర్త కానలః | మేఘా శ్చైకార్ణవా యేతు తథా రాత్రి ర్మహాత్మనః || 30 సంధ్యాలక్షణ ముద్దిష్టం తథా బ్రాహ్మం విశేషతః | భూతానాం చాపి లోకానాం సప్తానా మనువర్ణనమ్ || 31 సంకీర్యంతే మయా చాత్ర పాపానాం రౌరవాదయః | సర్వేషామేవ సత్వానాం పరిణామవినిర్ణయః || 32 బ్రహ్మణః ప్రతినర్గశ్చ సర్వసంహార వర్ణనమ్ | కల్పేకల్పే చ భూతానాం మహతామపి సంక్షయః || 33 సుసంఖ్యాయ చ బుద్ధ్వా వై బ్రహ్మణశ్చాప్యనిత్యతామ్ | దౌరాత్మ్యంచైవ భోగానాం సంసారస్య చ కష్టతామ్ || 34 దుర్లభత్వం చ మోక్షస్య వైరాగ్యాద్దోషదర్శనమ్ | వ్యక్తావ్యక్తం పరిత్యజ్య సత్వం బ్రహ్మణి సంస్థితమ్ || 35 నానాత్వదర్శనాత్ సుస్థ స్తతన్తదభి వర్తతే | తతస్తాప త్రయాతీతో విరూపాఖ్యో నిరంజనః || 36 ఆనందం బ్రహ్మణః ప్రాప్తో న బిభేతి కుతశ్చన | ఇతికృత్య సముద్దేశః ప్రమాణస్యోపవర్ణితః || 37 కీర్త్యంతే జగతో యత్ర సర్గప్రశయవిక్రియాః | ప్రవృత్తిశ్చాపి భూతానాం నివృత్తీనాం ఫలానిచ || 38 ప్రాదుర్భావో వసిష్ఠస్య శ##క్తే ర్జన్మ తథైవచ | సౌదాసా న్నిగ్రహస్తస్య విశ్వామిత్రకృతేనచ || 39 పరాశరస్య చోత్పత్తి రదృశ్యంత్యాం యధావిభోః | జజ్ఞే పితౄణాం కన్యాయాం వ్యాసశ్చాపి యథా మునిః || 40 శుకన్య చ యథా జన్మ పుత్రస్య సహ ధీమతః | పరాశరస్య విద్వేషో విశ్వామిత్ర కృతోయథా || 41 వసిష్ఠ సంభృతశ్చాగ్ని విశ్వామిత్ర జిఘాంసయా | సంధాన హేతోర్విభునా జీర్ణః కణ్వన ధీమతా || 42 దేవేన విప్రా విప్రాణాం విశ్వామిత్ర హితైషిణా | ఏకం వేదం చతుష్పాదం చతుర్ధా పునరీశ్వరః || 43 యథా బిభేద భగవాన్ వ్యాసః సర్వే ష్వనుగ్రహాత్ | తస్య శిష్యప్రశిషై#్యశ్చ శాఖాభేదాః పునః కృతాః || 44 ప్రయాగే మునివర్యైశ్చ యథా పృష్టః స్వయంప్రభుః | కృష్ణేన చానుశిష్టాస్తే మునయో ధర్మకాంక్షిణః || 45 ఏతత్సర్వం యథా తత్వమాఖ్యాతం ద్విజసత్తమాః | మునీనాం ధర్మనిత్యానాం లోకతంత్ర మనుత్తమమ్ || 46 బ్రహ్మణా య త్పురా ప్రోక్తం పులస్త్యాయ మహాత్మనే | పులస్త్వేనాథ భీష్మాయ గంగాద్వారే ప్రభాషితమ్ || 47 ధన్యం యశస్య మాయుష్యం సర్వపాప ప్రణాశనమ్ | కీర్తనం శ్రవణంచాస్య ధారణం చ విశేషతః || 48 సూతేనానుక్రమేణదం పురాణం సంప్రకాశితమ్ | బ్రహ్మణషు పురా యచ్చ బ్రహ్మణోక్తం సవిస్తరమ్ || 49 పాదమన్య విదన్ సమ్య గ్యో೭ధీ యీత జితేంద్రియః | తేనాధీతం పురాణం స్యాత్ సర్వం నాస్త్యత్ర సంశయః || 50 యో విద్యా చ్చతురో వేదాన్ సాంగోపనిషదో ద్విజః | పురాణం న విజానాతియః న సస్యా ద్విచక్షణః || 51 దేవర్షి పితృగణములకుకూడ సవిస్తరముగ చెప్పుట శక్యము కాదు. నైమిత్తికాదిప్రళయములు ప్రళయ స్వరూపము యుగసంధులు రౌరవాది నరకములు ప్రతి సర్గమని పిలువబడు బ్రహ్మయొక్క యువసంహార (లయ) స్వరూపము బ్రహ్మకూడ నిత్యుడు కాదు అన్న విషయము విషయభోగముయొక్క దౌష్ట్యము (జీవులను విషయము పెట్టు తికమకల స్వరూపము) సంసారమువలని బాధ, మోక్షము దుర్లభమగుట, వైరాగ్యమువలన సంసారము నెడల దోషదృష్టి తాపత్రయ లక్షణము. బ్రహ్మానందము బొందినవాడు దేనికిని భయపడడు అను విషయము, భూతప్రవృత్తి నివృత్తియొక్క ఫలము. వశిష్ఠుడు అతని కుమారుడు శక్తియొక్క వృత్తాంతము నాయన యెడల విశ్వామిత్ర నిమిత్తముగ సౌదాసుని వలన వశిష్ఠ నిగ్రహము. శక్తివలన అదృశ్యంతి యనునామెవలన పరాశరుడుదయించుట, పరాశరునికి పితృకన్య యందు వ్యాసుడు నాయనకు శుకుడుగలుగుట. విశ్వామిత్రునకు, పరాశరుని యెడలద్వేషము, విశ్వామిత్రుని జంపనెంచివశిష్ఠుడు బ్రహ్మదండము నుండి యగ్నిని బుట్టించుట, యా యిద్దరికి సంధిచేయవలెనని కణ్వమహర్షి యా యగ్నిని చల్లార్చుట వ్యాసకృత వేదవిభాగము. ఆయన శిష్యప్రశిష్యులచేత చేయబడిన నా యావేదశాఖా విభాగము. ప్రయాగక్షేత్రమందు ముని వరులడుగగా కృష్ణుడు వారికిచేసినయుపదేశ విశేషములు నిదెల్ల నీపురాణమందలి విషయసంగ్రహము. బ్రహ్మపులస్త్యునకు పులస్త్యుడు భీష్మునికి, నామీద సూతుని వలన శౌనకాది మహర్షులకు గ్రమముగా వచ్చిన పురాణనంప్రదాయము దీనియందు వర్ణింపబడినది. ఈ పురాణమందు నాలుగవ వంతైన చదివిన యతడు సర్వపురాణములను జదివినట్లే నాలుగు వేదములు సాంగముగ జదివి యుపనిషత్తులు తెలిసి యెవడు పురాణములు కూడ తెలిసికొనునో యతడే పండితుడనబడును, ఇతిహాస పురాణములచేత వేదము నుపబృంహింపవలెను. అనగా ఇతిహాస పురాణములు నిగూఢవేదార్థ రహస్యములను సులభభాషలో వ్యాఖ్యానము చేయబడినవన్నమాట. అల్పశ్రుతునకు 'ఇతడు నన్ను దెబ్బకొట్టును' అని వేదము భయపడును. అనగా ఇతిహాస పురాణములను సమగ్రముగ జదివి వ్యాసానుగ్రహపాత్రుడై యందలి యగాధ రహస్యములను దెలిసికొన్నవాడు దప్ప వేద హృదయును జక్కగా గ్రహింపలేడని తాత్పర్యము. ఈ పురాణమందొక్క యధ్యాయము జదివినను అది బ్రహ్మ స్వయముగా జెప్పినది గావున విపత్తుల నుండి ముక్తుడై యభీష్టగతినందగలడు. అతి పురాతనమైన ధర్మపరంపరను సృష్టిపరంపరను దెలుపునది గావున ''పురాణము'' అని నిర్వచనము జేయబడినది. ఈ నిరుక్తిని దెలిసిన యతడు సర్వ పాపముక్తుడగును. (పురాxఅనతి=అతి ప్రాచీన విషయమును బొందునది అనగా చెప్పునది పురాణం) వేరొకచో వ్యాసులు (పురాపి నవమ్-ఎంత ప్రాచీనమో అంత క్రొత్తది - అనగా నెప్పుడో ద్వాపరమందు జెప్పబడినదైనను నిదియన్ని కాలములకు నన్నిదేశములకు నన్నిపాత్రలకు సంబంధించిన సర్వవిజ్ఞానమును నందించునది యని చెప్పినారు.) అపుడు ఋషులిట్లనిరి. బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త్యభగవానుడు భీష్మునితో కలిసికొనెను. పాపాత్ముల కాయన దర్శనము దుర్లభము. క్షత్రియుడాయనను గలియుటయు నారాధించుటయు జాల యాశ్చర్యమైన విషయము. ఆయన చేసిన తపస్సు నియమము నెట్టివి? దానివలన నమ్ముని సంతుష్టుడై యాయనతో మాట్లాడెను గదా! పర్వము లేక పర్వములో సగము లేక సంపూర్ణ పురాణము నేస్థానము నుండి యెక్కడ గనబడి పులస్త్య మహర్షి తెలిపెనో యా విశేషములను మాకు దెలుపుము. వినవలెనని సావధాన మనస్కులమై యున్నాము. (8- 59) అది విని సూతుండిట్లనియె! గంగానది సాధుహితకారిణి పర్వతమును భేదించుకొని నవేగముగ ప్రవహించిన గంగాద్వారము అను మహాతీర్థమందు భీష్ముడు - పితృభక్తిపరుడు - మహానుభావులవలన ధర్మవిశేషములను వినగోరి నూరేండ్లుపైగా సమాధియందు పరబ్రహ్మధ్యానమందుండెను. ఆయన త్రికాల స్నానముచేసి దేవపితృతర్పణముజేసి బ్రహ్మయజ్ఞ స్వాధ్యాయనిష్ఠుడై శరీరమును గ్లేశ##బెట్టుచుండగా చూచి బ్రహ్మ సంతుష్టుడై కుమారుడయిన పులస్త్యునిజూచి నీవు స్వయముగానేగి మహావీరుడు, గురుకుల శ్రేష్ఠుడునగు భీష్ముని తపస్సునుండి మరలింపుము. కారణమేమనగా నామహానుభావుడు భక్తితో పితృధ్యాన నిష్ఠుడై ఉన్నాడు. అతని వాంఛితమును వెంటనే యొసంగుము. నా విని పులస్త్యుడు గంగాద్వారమునకేగి భీష్ముని గని 'మంగళమగుగాక! నీ మనసులో గల వర మడుగుము. నీ తపస్సునకు చతుర్ముఖుడు సంతుష్టుడైనాడు. ఆయన పంపగా నీకు వరములిచ్చుటకు వచ్చితిని.' అన విని భీష్ముడు మనస్సునకు వీనులకును విందైన యా మాటకు తృప్తుడై, కనులు తెఱచి ఎదుటనున్న పులస్త్యునికి సాష్టాంగ ప్రణతుడై యిపుడు నా జన్మము సఫల మైనది. ఈరోజు సుశోభనము. జగద్వంద్యమైన నీ చరణద్వంద్వమును గాంచితిని. తమ దర్శనము వలన తపఫలఃసిద్ధి యయినది. పవిత్ర నదీతీరమున వరములీయ నీవు దయసేయుట మరియు విశేషము. నేను స్వయముగా నల్లిన చిత్రాసన మిదిగో - సుఖకరమగు దీనిపై నాసీనుడవు గమ్ము. మారేడాకుల దొన్నెలో దూర్వాక్షత కుసుమ కుశ సహితముగా తెల్ల యావాలు పెరుగు తేనె యవలు పాలు నను ఎనిమిది పవిత్ర పదార్థములతో కూడినది, (అష్టాంగము) నగు ఋషి నిర్దిష్టమైన అర్ఘ్య మిదిగో, స్వీకరింపుడనియె. తేజస్వియగు భీష్ముని యీ మాటను విని బ్రహ్మ మానసపుత్రుడు పులస్త్య భగవానుడా యాసనమును గ్రహించి, యర్ఘ్య పాద్యాదులనుగొని యా సదాచారమునకు మిక్కిలి సంప్రీతుడయ్యెను. మరియు నతడిట్లనియె. 'నీవు సత్య నిష్ఠుడవు. సత్య ప్రతిజ్ఞుడవు. దానశీలుడవు. అభిమాన ధనుడవు. సర్వమిత్రుడవు. ఓరిమి కలవాడవు. శత్రునిగ్రహమందు పరమ పరాక్రమ వంతుడవు. ధర్మజ్ఞుడవు. కృతజ్ఞుడవు. దయానిధివి. ప్రియభాషివి. పెద్దలను పూజించువాడవు. ధర్మరహస్యముల నెరిగినవాడవు. బ్రహ్మజ్ఞాన సంపన్నుడవు. సాధువుల యెడ వాత్సల్యము గలవాడవు. నాయనా! ప్రణతుడవై నీవు చూపిన భక్తికి సంతుష్టుడనైతిని. నీ చెప్పవలసినది చెప్పుము. అటుపై నేను జెప్పెదను.' నావిని భీష్ముడు 'భగవంతుడా! భగవంతుడగు బ్రహ్మ ఏ కాలమందెక్కడ నుండి దేవాదుల సృష్టి సేసెనో నాకు దెలుపుము. విష్ణువు స్థితి నెట్లు సేసెను. రుద్రుడెట్టేర్పడినాడు, దేవతలు ఋషులు నెట్లు సృజింపబడిరి, ఆకాశాది పంచ భూతములు, పురగిరి సరిత్సాగర ద్వీపగ్రామారణ్యాదులను ప్రజాపతులను సప్తఋషులను యక్షరక్షోగంధర్వులను జ్యోతిర్మండలమును నెట్లు సృజించెనో సెలవిమ్ము. నావిని పులస్త్య మహర్షి యిట్లనియె. బ్రహ్మ పురాణ పురుషుడు. పరమాత్మ రూపవర్ణాది రహితుడు, విషయ దూరుడు, జన్మ నాశనములు లేనివాడు. గుణపరిణామము లేనివాడు. కేవలుడు సర్వసముడు. అనుపమానుడు. సద్రూపుడు. బ్రహ్మయను నామముచే నా వస్తువును జ్ఞానులు పేర్కొందురు. పరమ గుహ్యము నిత్యమ అజము అక్షయము అవ్యయమునై పురుషరూపమున కాలరూపముననున్న యా పరమాత్మను గూర్చి నమస్కరించి సృష్టి యెట్టు సేసెనో చెప్పుచున్నాను. మునువు తామరపువ్వు పాన్పు నుండి బ్రహ్మ సాత్త్వికాది గుణముల యభివ్యక్తి ననుసరించి సృష్టికాల మందు ప్రధాన తత్త్వముతో సృష్టి బీజములైన కర్మవాసనలతో తైజసము, భూతాది, తామసము ననుపేర యహంకార తత్త్వము మూడు విధములై మహత్తత్వము నుండి పుట్టినది. పంచ భూతములు పంచేంద్రియములు పంచకర్మేంద్రియములు యను నివి మహత్తత్వము నుండి పొడమినవి. పృధివ్యప్తేజో వాయురాకాశములను గూర్చి వివరముగ చెప్పుచున్నాను. శబ్దమాత్రమైన ఆకాశమును భూతాదియయిన తత్త్వము ఆవరించి యుండెను. ఆయాకాశము మరల వ్యాకరించునట్టి స్పర్శాను గుణమును సృజించెను. అదే వాయువు. భూతములలోకెల్ల బలిష్ఠమైనది. ఆ వాయువుయొక్క గుణము స్పర్శము. శబ్దమాత్రమైన యాకాశము స్పర్శమాత్రమైన వాయువాక్రమించెను. ఆ వాయువు వికారము చెంది రూపమాత్రమును సృజించెను. ఆ రూపతన్మాత్ర జ్యోతి స్వరూపము. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బృంహయేత్ | బిభేత్యల్ప శ్రుతాద్వేదో మామయం ప్రాహ (త) రిష్యతి || 52 ఆధీత్యయై చైకమధ్యాయం స్వయంప్రోక్తం స్వయంభువా | ఆపదః ప్రాప్య ముచ్యేత యథేష్టాం ప్రాప్నుయాద్గతిమ్ || 53 పురా పరంపరాంవక్తి పురాణం తేనవై స్మృతమ్ | నిరుక్తిమస్య యోవేద సర్వపాపై ః ప్రముచ్యతే || 54 ఋషయోహ్యబ్రువన్ సూతం కథం భీష్మేణ సంగతః | బ్రహ్మణో మానసః పుత్రః పులస్త్యో భగవానృషిః || 55 దుర్లభం దర్శనంయస్య నరైః పాపసమన్వితైః | అత్యాశ్చర్యమిదం సూత క్షత్రియేన కథం మునిః || 56 ఆరాధితో బృహద్భూత స్తన్నోవద మహామతే | కీదృశం వా తపస్తేన కోవాన్యో నియమః కృతః || 57 యేన తుష్టో మునిర్బ్రహ్మం స్తథాతేన ప్రభాషితః | పర్వవాప్యధ పర్వార్థం సమగ్రం వా ప్రభాషితమ్ || 58 యస్మిన్ స్థానే యథాదృష్టః పులస్త్యో భగవానృషిః | తన్నోవద మహాభాగ కల్యాః స్మ శ్రవణవయమ్ || 59 సూత ఉవాచ యత్ర గంగా మహాభాగా సాధూనాం హితకారిణీ | విభిద్య పర్వతం వేగాన్న్సిసృతా లోకపావనీ || 60 గంగాద్వారే మహాతీర్థే భీష్మః పితృపరాయణః | శుశ్రూషుః సుచిరం కాలం మహతాం నియమేస్థితః 61 యావద్వర్షశతం సాగ్రం పరమేణ సమాధినా | ధ్యాయమానః పరం బ్రహ్మ త్రికాలం స్నానమాచరత్ || 62 పితౄన్ దేవాం స్తర్పయతః స్వాధ్యాయేన మహాత్మనః | ఆత్మానం కర్షతశ్చాస్య తుష్టోదేవః పితామహః || 63 ఉవాచ తనయం బ్రహ్మా పులస్త్యమృషి సత్తమమ్ | స్వయం దేవవ్రతం భీష్మం వీరం కురుకులోద్భవమ్ || 64 తపసః సన్నివర్తస్వ కారణంచాస్య కీర్తయ | పితౄన్ భక్త్యామహాభాగో ధ్యాయమానః సమాస్థితః || 65 యో హృస్య మనసః కామస్తం సంప్రదాయ మాచిరమ్ | పితామహ వచశ్ర్శుత్వా పులస్త్యోముని సత్తమః || 66 గంగాద్వార యథాగత్య భీష్మం వచనమబ్రవీత్ | వరం వరయ భద్రంతే యత్తేమనసి వర్తతే || 67 తుష్టస్తే తపసావీర సాక్షాద్దేవః పితామహః | బ్రహ్మణా ప్రేషితస్తే7హం వరాన్దాస్యామి కాంక్షితాన్ || 68 భీష్మో7పి తద్వచః శ్రుత్వా మనఃశ్రోత్రసుఖావహమ్ | ఉన్మీల్య నయనే దృష్టా పులస్తం పురతః స్థితమ్ || 68 అష్టాంగ ప్రణిపాతేన నత్వా తం మునిసత్త మమ్ | ఉవాచప్రణతో భూత్వా సర్వాంగాలింగితావనిః || 69 అద్యయే సఫలం జన్మ దినంచేదం సుశోభనమ్ | భవతశ్చరణౌ దృష్టౌ జగద్వంద్యౌ మయాత్విహ || 70 తపసశ్చ ఫలం ప్రాప్తం యద్దృష్టో భగవాన్మయా | వరప్రదో విశేషణ సంప్రాప్తశ్చ నదీతటే || 71 ఇయం ఋషీ మయా క్తుప్తా ఆస్యతాం సుఖదాకృతా | అర్ఘ్యపాత్రే తు పాలాశే దూర్వాక్షత సుమైఃకుశైః || 72 సర్షపైశ్చ దధిక్షాద్రైర్యవైశ్చ పయసాసహ | అష్టాంగో హ్యేష నిర్దిష్టో హ్యర్తోహి మునిభిఃపురా || 73 శ్రుత్వైతద్వచనం తస్య భీష్మస్యామిత తేజసః | ఉపవిష్టో బ్రహ్మసుతః పులస్త్యో భగవానృషిః || 74 విష్టరం సహపాద్యేన అర్ఘ్యపాద్యం ముదాన్వితః : జుజోష భగవాన్ ప్రీతః సదాచారేణ తేన తు || 75 ''పులస్త్య ఉవాచ'' సత్యవాన్ దానశీలో7సి సత్యసంధిర్న రేశ్వరః | హ్రీమాన్ మైత్రః క్షమశీలో విక్రాంతో శత్రుశాసనే || 76 ధర్మజ్ఞస్త్వం కృతజ్ఞస్త్వం దయావాన్ ప్రియభాషితా | మాన్యమానయితా విజ్ఞో బ్రహ్మణ్యః సాధువత్సలః || 76 తుష్ఠస్తేహం సదావత్స ప్రణిపాత పరస్యవై | ప్రబ్రూహి త్వం మహాభాగ కధనం తే వదామ్యహమ్ || 77 అపక్షయ వినాశాభ్యాం పరిణామై ర్ద్విజన్మభిః | గుణౖర్వివర్జితః సర్వైః స భాతీతిహి కేవలమ్ || 85 సర్వత్రాసౌ సమశ్చాపి వసన్ననుపమో మతః | భావయన్ బ్రహ్మరూపేణ విద్వద్భిః పరిపఠ్యతే || 85 తం గుహ్యం పరమం నిత్యమజమక్షయ మవ్యయమ్ | తథా పురుష రూపేణ కాలరూపేణ సంస్థితమ్ || 86 తం సత్వాహం ప్రవక్ష్యామి యథా సృష్టిం చకారహ | పూర్వంతు పద్మశయనాదుత్థాయ జగతః ప్రభుః || 87 గుణవ్యంజన సంభూతః సర్గకాలే నరాధిప | సాత్వికో రాజసశ్చైవ తామసశ్చ త్రిథామహాన్ || 88 ప్రధానతత్త్వేన సమం తథా బీజాదిభిర్ర్వతః | వైకారికసై#్తజసశ్చ భూతాదిశ్చైవ తామసః || 89 త్రివిధోయ మహంకారో మహత్తత్వాదజాయత | భూతేంద్రియాణాం పంచానాం తథాకర్మేంద్రియైఃసహ || 90 పృథివ్యాపన్తథా తేజో వాయురాకాశఏవ చ | ఏకైకశః స్వరూపేణ కథయామి యథోత్తరమ్ || 91 శబ్దమాత్ర మథాకాశం భూతాదిః కం సమావృణోత్ | అథాకాశం వికుర్వాణం స్పర్శమాత్రం ససర్జహ || 92 బలవానేషవై వాయుస్తస్య స్పర్శోగుణోమతః | ఆకాశం శబ్దమాత్రంతు స్పర్శమాత్రం సమావృణోత్ || 93 తతోవాయు ర్వికుర్వాణో రూపమాత్రం ససర్జహ | జ్యోతిరూపంతు తద్వాయు స్తద్రూప గుణముచ్యతే || 94 స్పర్శరూపస్తు వైవాయు రూపమాత్రం సమావృణోత్ | జ్యోతిశ్చాపి వికుర్మాణం రసమాత్రం ససర్జహ || 95 సంభవంతి తతో %ంభాసి రూపమాత్రం సమావృణోత్ | వికుర్వాణానిచాంభాంసి గంధమాత్రం ససర్జిరే || 96 సంఘాతో జాయతే తస్మాత్తస్యగంధో మతోగుణః | తైజసానీంద్రియాణ్యాహు ర్దైవా వైకారికా దశ || 97 ఏకాదశం మనశ్చాత్ర దేవా వైకారికాః స్మృతాః | త్వక్చక్షుర్నాసికా జిహ్వాశ్రోత్రీమత్రచ పంచకమ్ || 98 ఏతేషాంతు మతం కృత్యం శబ్దాది గ్రహణం వునః | వాక్పాణి పాదపాయూని చోపస్థం తత్రపంచమమ్ || 99 విసర్గ శిల్పగత్యుక్తిగుణా ఏషాం విపర్యయాత్ | ఆకాశ వాయు తేజాంసి సలిలం పృథివీతథా || 100 శబ్దాదిభిర్గుణౖర్వీర యుక్తానీత్యు త్తరోత్తరైః శాంతాఘోరాశ్చ మూఢాశ్చ విశేషా స్తేన్గతేస్మృతాః || 101 నానావీర్యా పృథక్భూతా స్తతస్తేసంహతింవినా | నాశక్నువన్ ప్రజాః స్రష్టు మనహగమ్య కృత్సృశః || 102 సమేత్యాన్యో సంయోగాత్ సరస్పర సమాశ్రయాత్ | ఏకసంఘాత లక్షాశ్చ సంప్రాపై#్యక్యమశేషతః || 103 పురుషాధిష్టిత త్వాచ్చ వ్యక్తానుగ్రహణ తథా | మహదాదయో విశేషాంతా హ్యండముత్పాదయంతివై || 104 తత్ర్కమేణ వివృత్తంతు జలబుద్బుదవత్ సమమ్ | తత్రావ్యక్త స్వరూపో`òసౌ వ్యక్తరూపీ జనార్దనః || 105 బ్రహ్మ బ్రహస్వరూపేణ స్వయమేవ వ్యవస్థితః | మేరు రుల్బమభూతస్య జరాయశ్చ మహీధరాః || 106 గర్భోధికం సముద్రాశ్చ తస్యాసంశ్చ మహాత్మనః | తత్ర ద్వీపాః సముద్రాశ్చ సజ్యోతిర్లోక సంగ్రహః || 107 తస్మిన్నండే3భవన్ వీర సదేవాసురమానుషాః | వారివహ్న్యనిలాకాశై ర్వృతై ర్భూతాదినా బహిః || 108 వృతం దశగుణౖ రండం భూతాదిర్మహతా తథా | అవ్యక్తేనావృతో రాజంసై#్తః సర్వైః సహితో మహాన్ || 110 ఏభిరావరవైః సర్వైః సర్వభూతైశ్చ సంవృతమ్ | నారివేళఫలం యద్వద్బీజం బాహ్యదళైరివ || 111 బ్రహ్మాస్వయంచ జగతో విసృష్టో సంప్రవర్తతే | సృష్టంచ పాత్యనుయుగం యావత్కల్ప వికల్పనా || 112 ససం జ్ఞాం యాతి భగవానేక ఏవ జనార్దనః | సత్వభు గ్గుణవాన్ దేవో హ్యప్రమేయ పరాక్రమః || 113 త మోద్రేకంచ కల్పాంతే రూపం రౌద్రం కరోతి చ| రాజేంద్రాఖిల భూతాని భక్షయద్యతి భీషణః || 114 భక్షయిత్వా చ భూతాని జగత్యేకార్ణవీకృతే | నాగపర్వంకశయనే శేతే సర్వస్వరూపధృక్ || 115 ప్రబుద్ధశ్చ పునఃసృష్టిం ప్రకరోతిచ రూపధృక్ | సృష్టి స్థిత్యంతకరణాద్ బ్రహ్మవిష్ణు శివాత్మకః || 116 సృష్టా సృజతి చాత్మానం విష్ణుః పాల్యంచ పాతిచ | ఉపసం హ్రియతే చాపి సంహర్తా చ స్వయం ప్రభుః || 117 పృథివ్యాపస్తథా తేజో వాయురాకాశ ఏచ | సయేవ సర్వభూతేశో విశ్వరూపో యతో7వ్యయః || 118 సర్గా ఏదికం తతో`òసై#్యవ భూతస్థ ముపకారకమ్| సఏవ సృజ్యః స చ సర్గకర్తా స ఏవ పాల్యం ప్రతిపాల్యతేయతః || 119 బ్రహ్మాద్యవస్థాభి రశేష మూర్తి ర్ర్బహ్మ వరిష్ఠో వరదో వరేణ్యః | ఇతి శ్రీ పద్మపురాణ ప్రథమే సృష్టిఖండే పురాణావతారే ద్వితీయోధ్యాయః || 120 అది రూపము గుణముగాగలది, స్పర్శ రూపమయిన వాయువారూప తన్మాత్ర నావరించెను. జ్యోతిస్సు వికారమును బొంది రస తన్మాత్రను సృజించెను. దానినుండి యుదకములుపుట్టినవి. అవి గంధ తన్మాత్రను సృజించినవి. దానినుండి వృథివి జనించినది అందువలన దానికి గంధము గుణమైనది. ఇంద్రియములు తై జసములు. ఆవే దేవతలు. అవి పదకొండు (11) అవే దేవతలని వై కారికములని చెప్పబడును. 5 కర్మేంద్రియములు 5 .జ్ఞానేంద్రియములు మనస్సు పదకొండవది. చర్మము కన్ను ముక్కు నాలుక చెవి యివి అయిదు జ్ఞానేంద్రియములు. వరుసగ శబ్ద-స్పర్శ-రూప-రస (రుచి) గంధములను అయిదు విషయములను గ్రహించుట వీనిపని. ఇక కర్మేంద్రియములు వాక్కు-(పాణి)-పాదము-వాయువు-ఉపన్థయనునవి వీని గుణములు మాట-గమనము-శిల్పము!- (గ్రహించుట శిల్పరచన మొదలయిన పనులన్న మాట) వినాశము (శరీరములోని మలములను విసర్జించుట) ఇది పాయువు(గుదము) - ఉపస్థ అని రెండిటి యొక్క లక్షణము. ఆకాశ వాయు తేజో జల భూములనెడి యైదు భూతములు తరువాతి తరువాతి భూత గుణములతో గూడ కూడియుండును. అనగా పృథివి గుణమయిన గంధము దాని ముందున్న నీటియొక్క రసముతోపాటుండును. నీరు దాని ముందరితేజో భూతము యొక్క రూపగుణముతో గూడ కలిసియుండును. రూపగుణము దానిముందున్న వాయువునందు స్పర్శగుణముతోపాటుండును, స్పర్శగుణము దాని ముందున్న ఆకాశ భూతమందు శబ్దగుణముతో గూడి యుండును. ఈ విధముగ పంచీకృత పంచ భూత వికారమే ప్రపంచమనబడు నన్నమాట. ఆయా పంచభూత గునసంబంధముచేతనే జీవులు శాంతములు ఘోరములు మూఢులునని నీలాటి విశేషములు భేదములు గలుగునని చెప్పబడినవి. నానావిధ బలములుగల్గి విడబడియున్న యీప్రాణి సంఘము సంహతి (సంయోగము) లేకుండ సంతానమును గనజాలవు. అస్యోన్య సంయోగముచే నొండొరులు కలిసికొని యొండొరుల యాశ్రయమువలన (ఆధారము వలన) ఒకే సంఘాత మందు లక్ష్యము పెట్టికొని యైవ్యంబొంది పురుషాధిష్ఠితము లగుటవలన వ్యక్తస్థితి స్వీకరణమందు మహదాది తత్త్వము లొకయండమునను ఉత్పాదన చేయును. అది క్రమముగా నీటిలో బుడగవలె వివృతమగును. అనగా వ్యక్తస్థితినందును. దాని యందవ్యక్త రూపుడై విష్ణువు అంతర్యామియై యుండును. బ్రహ్మ బ్రహ్మస్వరూపమున దనకు దానయైయుండును. ఆ బ్రహ్మకు మేరువు ఉల్బము అగును. పర్వతములు జరాయువు (మావి) రూపమునొందును, గర్భము సముద్రములు. ద్వీపములు సముద్రము జ్యోతిశ్చక్రము దేవాసుర మానుషాది జీవసంతతి దాని యందుద్భవించును. ఆకాశాది పంచభూతములు పదియు పదిరెట్లుగానున్న వానిచే నీయండమావృతమైయుండును. భూతాది కూడ (అహంకారతత్వము) దాని నావరించియుండును. ఆ భూతాది నావరించి మహత్తుండును, (బుద్ధి తత్వము) అది యవ్యక్త ముచే నావరింపబడును. ఈ వివిధావరణలచేత సర్వభూతములచే నీబ్రహ్మాండము బీజయుతమైన కొబ్బరికాయ వెలుపలి డిప్పలచేత నావరింపబదినట్లావృతమైయిండును. అప్పుడు బ్రహ్మ స్వయముగ జగములను సృజించుటకు బూనుకొనును; ఆ సృష్టించిన దానిని కల్పాంతమువరకు యుగయుగమునందు నవతరించి రక్షించును. ఆ ఒక్క భగవంతుడే బ్రహ్మ విష్ణు శిపరూపమున వేరువేరు పేర్లంది సత్వరజస్తమో గుణములనెడి సత్తువగొని యింతింతిన రానిపరాక్రమముగలవాడై కల్పాంతమందు తమోగుణోద్రేక రూపమయిన రౌద్రరూపమును దాల్చును. ఆ రూపముతోసర్వభూతములను భక్షించును. అప్పుడు జగత్తంతయు నొకటే సముద్రమగును. అప్పుడందులో శేషశయనమందు సర్వస్వరూపముతానయై శయనించును. మేల్కని రూప మూని మరల సృష్టి గావించును. సృష్టి స్థితి లయములను బ్రహ్మ విష్ణు శివస్వరూపుడై గావించును. పృథివ్యాది పంచభూతములు సర్వభూతములకు బ్రభువు విశ్వరూపుడును అవ్యయుడైన యాతడే. అందువలన భూతములందు జరుగు సృష్టిప్రముఖ వ్యాపారమీయనకే యువకారకము. అతడే సృష్టింపబడు పదార్థము, అతడే సృజించువాడు. పాలింపవలసిన దానిని బాలించువాడు నాయనయే. బ్రహ్మాది వివిధావస్థల యందు అన్ని మూర్తులు నాయనయే. ఆయనయే బ్రహ్మ. వరిష్ఠుడు వరదుడు వరేణ్యుడు నా ప్రభువే. ఇది పద్మపురాణమున సృష్టిఖండమున పురాణావతారమున రెండవ యధ్యాయము.