Sri Padma Mahapuranam-I
Chapters
ద్వావింశో೭ధ్యాయః -: వ్రతాధ్యాయము :- భీష్మ ఉవాచ:- భూర్లోకోథ భువర్లోకః స్వర్లోకోథ మహర్జనః | తపః సత్యం చ సపై#్తతే దేవలోకాః ప్రకీర్తితాః | పర్యాయేణ తు సర్వేషామాధిపత్యం కథం భ##వేత్ || 1 ఇహలోకే శుభం రూపమాయురారోగ్యమేవ చ| లక్ష్మీశ్చ విపులా బ్రహ్మన్ కథం స్యాత్సురపూజిత || 2 పులస్త్య ఉవాచ :- పురా హుతాశనః సార్దం మారుతేన మహీతలే ||
3 ఆదిష్టం పురుహూతేన వినాశాయ సురద్విషాం | నిర్దగ్ధేషు తతస్తేన దానవేషు సహస్రశః || 4 తారకః కమలాక్షశ్చ కాలదంష్ట్రః పరావసుః | విరోచనస్తు సంహ్రాదః ప్రయాతాస్తే తదావసన్ || 5 అంతఃసముద్రమావిశ్య సన్నివేశమకుర్వత | అశక్తా ఇతి తేప్యగ్ని మారుతాభ్యాము పేక్షితాః || 6 తతః ప్రభృతి వై దేవాన్మానుషాన్సభుజంగమాన్ | సంపీడ్య చ మునీన్సర్వాన్ప్రవిశంతి పునర్జలమ్ || 7 -: వ్రతాధ్యాయము :- భీష్ముడనియె:- సప్త లోకములు, భూలోకము, భువర్లోకము, స్వర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము. ఇహలోకము నందు (ఇక్కడ) శుభ##మైన రూపము ఆయుస్సు ఆరోగ్యము విశేష లక్ష్మి (సంపద) ఏలా కలుగును? అన పులస్త్యుడనియె. మున్నింద్రుడు వాయువుతో గూడ అగ్నిని దానవులను నశింప జేయుమని ఆజ్ఞ యిచ్చెను. ఆయన వేలకొలది రాక్షసులను దహించెను. తారకుడు మొదలుగా సంహాదుడు దాకా మున్ను చెప్పబడిన రాక్షసులుపోయి సముద్రములో దాగిరి. వారిని కాల్చుట శక్యముగాదని అగ్ని వాయుదేవులా జోలికి వెళ్ళక యూరుకొనిరి. ఇంతటినుండి ఆ రాక్షసులు దేవతలను, మనుష్యులను, నాగులను, నెల్లరు మునులను పీడించి వెళ్ళి తిరిగి వాండ్రు నివసించుచుండిరి. 7 ఏవం యుగసహస్రాణి తే వీరాః సప్త పంచ చ | జలదుర్గబలాద్రాజన్పీడయంతి జగత్రయమ్ || 8 తతః పునరథో వహ్నిమారుతావమరాధిప | ఆదిదేశాచిరాదంబునిధిరేష విశోష్యతామ్ || 9 యస్మాదస్మద్ద్విషాం చైష శరణం వరుణాలయః | తస్మాద్భవద్భ్యామద్యైవ శోషమేష ప్రణీయతామ్ || 10 తాపూచతుస్తతః శక్రం మయశమ్బరసూదనం | అధర్మ ఏష దేవేంద్ర సాగరస్య వినాశనమ్ || 11 యస్మాజ్జీవనికాయస్య మహతః సంక్షయో భ##వేత్ | తస్మాదుపాయమన్యం తు సమాశ్రయ పురందర || 12 యస్య యోజనమాత్రేపి జీవకోటిశతాని చ | నివసంతి సురశ్రేష్ఠ స కథం నాశమర్హతి || 13 ఏవముక్తః సురేంద్రస్తు క్రోధసంరక్తలోచనః | ఉవాచేదం వచో రోషాదమరావగ్నిమారుతౌ || 14 ఆ జలదుర్గము బలముచే నా దానవవీరులు ఐదుగురో, ఏడుగురో ముల్లోకములనట్లు పీడించిరి. దేవేంద్రుడప్పుడు మఱల అగ్ని వాయువులను మీరిప్పుడే సముద్రము నింకింప జేయుడనెను. ప్రభూ! ఈ పని ధర్మము గాదు. ఎన్నో జీవులందు నాశనమై పోవును. కనుక వేరొక యుపాయము చేకొనుము. ఒక్క ఆమడ మేరలో సముద్రములో వందల కొలది ప్రాణులుండను గదా వానిని నశింపజేయుటుచితమగునా? అన సురేంద్రుడు క్రోధముచే కన్నులెఱుపెక్క రోషముగొని అగ్నివాయు దేవతలతో నిట్లనియె. 14 న ధర్మధర్మ సంయోగం ప్రాప్నువంత్యమరాః క్వచిత్ | భవంతౌ తు విశేషేణ మహాత్మానౌ చ తిష్ఠతః || 15 మమాజ్ఞానకృతా యస్మాన్మారుతేన సమం త్వయా | మునివ్రతపరో భూత్వా పరిగృహ్య కలేబరమ్ || 16 ధర్మార్ధశాస్త్రరహితాం యోనిం ప్రతివిభావసో | తస్మాదేకేన వపుషా మునిరూపేణ మానుషే || 17 మారుతేన సమం లోకే తవ జన్మ భవిష్యతి | యదా తు మానుషత్వేపి త్వయా గండూషశోషితః || 18 భవిష్యత్యుదధిర్వహ్నే తదా దేవత్వమాప్స్యసి | ఇతీంద్రశాపాత్పతితే తత్‌క్షాణాత్తే మహీతలే || 19 అవాస్తవంతౌ దేహే చ కుంభాజ్జన్మ తతోభవత్ | మిత్రావరుణ యోర్వీర్యాద్వాసిష్టశ్చాత్మజో೭భవత్ || 20 తతోగస్త్య ఉగ్రతపా బభూవ మునిసత్తమః | అస్మాద్భ్రాతుః స వై భ్రాతా వశిష్ఠస్యానుజో మునిః || 21 దేవతలెప్పుడును ఒక ధర్మముతో నింకొక ధర్మమునకు ముడివెట్టుకొనరు. విశేషించి మీరిద్దరు మహానుభావులయియుండి యిలా చేయరాదు. ఓ అగ్ని గాలితో కలిసి నీవు తెలియక నా మాట ధిక్కరించితివి. కావున మునివ్రత నిష్టుడవై శరీరము దాల్చి ధర్మార్ధశాస్త్ర రహితమైన పుట్టుక నొంది గాలితో సమమైన జన్మ లోకమునందు నీవు కలుగును. నీకు మనుష్య జన్మ వచ్చినప్పుడు నీవు పుక్కిలించి యుమిసినప్పుడు నీ యుమ్మిచే యీ సముద్రుడెండిపోవును. ఆమీద మరల నీవు దేవత్వము నందెదవు. అని యింద్రుడిచ్చిన యీ శాపము వలన అగ్ని వాయు దేవులిద్దరు మహాత్ములాక్షణములో మానవ దేహమునంది కుంభమునుండి పుట్టిరి. మిత్రావరణుల వీర్యము వలన నొకడు వాశిష్టుడు. ఇంకొకడు అగస్త్యుడు ఉగ్ర తపస్వులుగా జన్మించిరి. 21 భీష్మ ఉవాచ:- కథం చ మిత్రావరుణౌ పితరావస్య తౌ స్మృతౌ | జన్మ కుంభాదగస్త్యస్య యథాభూత్తద్వదాధునా ||22 భీష్ముడనియె:- ఈ అగ్నికి మిత్రావరణులెట్లు తండ్రులైరి. ఈయనకు కుంభమునుండి జన్మ యెట్లు వచ్చిన దానతిమ్మన పులస్త్యుడనియె. 22 పులస్త్య ఉవాచ :- పురా పురాణపురుషః కదాచిద్గంధమాదనే || భూత్వా ధర్మసుతో విష్ణుశ్చచార విపులం తపః | 23 తపసా చాస్య భీతేన విఘ్నార్ధే ప్రేషితావుభౌ | శ##క్రేణ మాధవానంగావప్సరోగణసంయుతౌ || 24 యదా చ గీతవాద్యేన భావహావాదినా హరిః | న కామమాధవాభ్యాం చ మోహం నేతుమశక్యత || 25 ఒకప్పుడు పురాణ పురుషుడు (విష్ణువు) ధర్మసుతుడై గంధకమాదనమున గొప్ప తపస్సు సేసెను. ఈయన తపస్సునకు హడలి యింద్రుడు విఘ్నము కొఱకు అప్సరసలతో వసంతుని మన్మధుని పంపించెను. గీత వాద్యాదులచే, హావభావవిలాసములచే విష్ణువు మోహవశుడు గాలేదు. 25 తదా కామమధుస్త్రీణాం విషాదమభజద్గణః | సంక్షోభాయ తతస్తేషామూరుదేశాన్నరాగ్రజః || 26 నారీముత్పాదయామాస త్రైలోక్యస్యాపి మోహినీం | సంమోహితాస్తయా దేవాస్తౌ తు చైవ సురావుభే || 27 అప్పుడు మన్మథుడు, వసంతుడు అప్సరోగణము బాధనొందెను. వారినింకను సంక్షోభ##పెట్టుటకు నరాగ్రజుడు (నారాయణుడు) తన తొడ నుండి త్రిలోక మోహినియగు నొక సుందరిని బుట్టించెను. ఆమెచే దేవతలందరు మోహవశులైరి. వసంతుడు మన్మథుడును మోహపడిరి. 27 అప్సరాణాం సమక్షం హి దేవానామబ్రవీద్ధరిః | ఊర్వశీతి చ నామ్నేయం లోకే ఖ్యాతిం గమిష్యతి || 28 తతః కామయమానేన మిత్రేణాహూయతోర్వశీ | ప్రోక్తా మాం రమయస్వేతి వాఢమిత్యబ్రవీచ్చ సా || 29 గచ్ఛంతీ తు తతః సూర్యలోకమిందీవరేక్షణా | వరుణన వృతా పశ్చాద్వచనం తమభాషత || 30 మిత్రేణాహం వృతా పూర్వం మమ సూర్యః పతిః ప్రభో | ఉవాచ వరుణశ్చిత్తం సంన్యస్య గమ్యతామ్ || 31 అప్పుడు హరి అప్సరసల దేవతల ముందిట్లనియె. ఈమె ఊరువు నుండి పుట్టినది గావున ఊర్వశి యని లోకమున పేరొందును. సూర్యుడు మోహవశుడై జగన్మోహినినామెను రమ్మని పిలిచెను. ఆమె మంచిదని సూర్యలోకమునకు చనుచుండ త్రోవలో సరియైన రక్షణలేక వరుణుడామెను గోరెను. అతనిం జూచి యామె మిత్రుడు నన్ను మున్ను కోరెను ప్రభూ ! నాకు సూర్యుడే భర్త అనెను. అప్పుడు వరుణుడు మనసు నాపై నుంచి వెళ్ళుమనెను. 31 గతాయాం బాఢమిత్యుక్త్వా మిత్రః శాపమదాదథ | అద్యైవ మానుషే లోకే గచ్ఛ సోమసుతాత్మజమ్ || 32 భజస్వేతి యతో మిధ్యాధర్మ ఏష త్వయా కృతః | జలకుంభే తతో వీర్యం మిత్రేణ వరుణ చ || 33 ప్రక్షిప్తమథ సంజాతే ద్వావేవ మునిసత్తమౌ | నిమిర్నామ నృపః స్త్రీభిః పురా ద్యూతమదీవ్యత || 34 తదంతరే೭భ్యాజగామ వశిష్ఠో బ్రహ్మసంభవః | తస్య పూజామకుర్వాణం శశాప స మునిర్నృపమ్ || 35 విదేహస్త్వం భవస్వేతి శప్తస్తేనాప్యసౌ మునిః | అన్యోన్యశాపాదుభయోర్విశరీరే తు తేజసీ || 36 మంచిదని యట్లామె వెళ్ళగా మిత్రుడు ధర్మము నబద్ధము పాలు చేసితివి గావున సోముని పౌత్రుని నీవిపుడు మనుష్య లోకమున బొందుమనెను. ఆపై మిత్రుడు వరుణుడును దమ వీర్యము జల కుంభమునందు విడిచిరి. దాన నిద్దరు మునీంద్రులు పుట్టిరి. మున్ను నిమియను రాజు స్త్రీలతో జూదమాడెను. ఆ నడిమి బ్రహ్మ కుదయించిన వశిష్ఠుడు వచ్చెను. ఆయనను పూజింపనందున నాయన నిమిని దేహములేని జంతువవు గమ్మని శపించెను. ఆ రాజూ వశిష్ఠుని యట్లే శపించెను. అన్యోన్య శాపమున నిద్దరును శరీరములు లేనివారై కేవలం తేజస్సులైరి. 36 జగ్మతుశ్శాపనాశాయ బ్రహ్మాణం జగతః పతిం | అథ బ్రహ్మసమాదేశాల్లోచనేష్వవసన్నిమిః || 37 నిమేషాః స్యుశ్చ లోకానాం తద్విశ్రామాయ పార్ధివ | వశిష్ఠోప్యభవత్తస్మిన్జలకుంభే చ పూర్వవత్ || 38 తతో జాతశ్చతుర్భాహుః సాక్షసూత్రకమండలుః | అగస్త్య ఇతి శాంతాత్మా బభూవ ఋషిసత్తమః || 39 ఆ యిద్దరు శాప మోచనమునకై జగత్పతి బ్రహ్మదరి కేగిరి. ఆపై బ్రహ్మ యానతిని నిమి విశ్రాంతికొఱకు కన్నులందు జొచ్చెను. ఆతని విశ్రాంతి కొఱకు లోకములకు దాన నిమేషము లేర్పడెను వశిష్ఠుడు మునుపటివలె నా జలకుంభమందే యుండెను. ఆపై నాల్గు చేతులతో అక్ష సూత్రము కమండలువు బూని అగస్త్యుడను పేర మహర్షి పరమశాంతుడై యవతరించెను. 39 మలయసై#్యకదేశే తు వైఖానసవిధానతః | సభార్యః సంవృతో విపై#్రస్తపశ్చక్రే సుదుష్కరమ్ || 40 తతః కాలేన మహతా తారకాదినిపీడితం | జగద్వీక్ష్య స కోపేన పీతవాన్వరుణాలయమ్ || 41 మలయ పర్వతమందొక చోట వైఖానస విధానమున భార్యతో బ్రాహ్మణ పరివారముతో నెవ్వరూ చేయజాలని తపస్సు సేసెను. ఆపై చాలా కాలమునకు తారకాది రాక్షసులచే జగత్తు పీడ నొందుట గని కోపము గని వరుణాలయమును (సముద్రమును) త్రాగివేసెను. తతోస్య వరదాస్సర్వే బభూవుః శంకరాదయః | బ్రహ్మా విష్ణుశ్చ భగవాన్ వరదానాయ జగ్మతుః || 42 వరం వృణీశ్వ భద్రం తే యశ్చాభీష్ఠోత్ర వై మునే || అగస్త్య ఉవాచ :- యావద్బ్రహ్మసహస్రాణాం పంచవిశతికోటయః || 43 వైమానికో భవిష్యామి దక్షిణాంబరవర్త్మని | మద్విమానోదయాత్కుర్యాద్యః కశ్చిత్పూజనం మమ || 44 స సప్తలోకాధిపతిః పర్యాయేణ భవిష్యతి | యస్త్వాశ్రమం పుష్కరే తు మన్నామ్నా పరికీర్తయేత్ || 45 స చైవ పుణ్యతాం యాతు వర ఏష వృతో మయా | శ్రాద్దం యే೭త్ర కరిష్యంతి పిండపూర్వం తు భక్తితః || 46 తేషాం పితృగణాసర్వే మయా సహ దివి స్థితాః | ఏతత్కాలం వసిష్యంతి ఏష ఏవ వరో మమ || 47 ఏవమస్త్వితి తేప్యుక్త్వా జగ్ముర్దేవా యథాగతం | తస్మాదర్ఝః ప్రదాతవ్యో హ్యగస్త్యాయ సదా బుధైః || 48 ఇందువలన శంకరాదులందరు నీయనకు వరదాతలైరి. బ్రహ్మ విష్ణు భగవానుడు వరమీయ నాముని దగ్గరకు జనిరి. నీ యిష్టమైన వరము కోరుము. భద్రమగు గావుత నీకు. మునీ! యనిరి. అగస్త్యుడు: ఇరువదివేల బ్రహ్మ కల్పములు దక్షిణాకాశ మార్గమందు వైమానికుడను (విమాన విహారముచేయువాడను) జేదును. నా విమానోదయమయినప్పటి నుండి నా పూజ సేసిన పుణ్యుడు పర్యాయముగా సప్త లోకాధిపతి కాగలడు. ఎవడు పుష్కరమందు నా పేరనున్న యాశ్రమమును కీర్తించునో నతడును పుణ్యాత్ముడగు గావుత. ఇదియే నేను కోరు వరము. ఇక్కడ భక్తితో పిండ శ్రాధ్దము సేసిన వారి పితృదేవతలుద్యులోకమున వసించి యింత కాలము నాతో వసింతురు గావుత. ఇది నే కోరు వరము. ఇట్లే జరుగునని పలికి దేవతలు వచ్చిన దారిం జనిరి. అందుచే బుధులు (పండితులు) అగస్త్యులకు ధరమీయ వలసినదే. 48 భీష్మ ఉవాచ :- కథమర్ధప్రదానం చ కర్తవ్యం తస్య వై మునేః విధానం యదగస్త్యస్య పూజనే తద్వదస్వ మే || 49 అన విని భీష్ముడు ఆ ఆగస్త్య మునికి అర్ధమునెలా యీయవలెను? అగస్త్యపూజావిధానమేలా సేయవలె నానతిమ్మన పులస్త్యుడనియె. 49 పులస్త్య ఉవాచ :- ప్రత్యూషసమయే విద్వాన్కుర్యాదస్యోదయే నిశి || స్నానం శుక్లతిలై స్తద్వచ్ఛుక్లమాల్యాంబరో గృహే | 50 స్థాపయేదవ్రణం కుంభం మాల్యవస్త్రవిభూషితం | పంచరత్నసమాయుక్తం ఘృతపాత్రేణ సంయుతమ్ || 51 అంగుష్ఠమాత్రం పురుషం తథైవ సువర్ణమధ్యాయుతబాహుదండం | చతుర్భుజం కుంభముఖే నిధాయ ధాన్యాని సప్తాచలసంయుతాని || 52 సకాంస్యపాత్రాక్షతశుక్లయుక్తం మంత్రేణ దద్యాద్ద్విజపుంగవాయ | ఉత్‌క్షిప్య కుంభోపరి దీర్ఘబాహుమనన్యచేతా యమదిజ్ఞ్ముఖస్థామ్ || 53 శ్వేతాం చ దద్యాద్యది శక్తిరస్తి రౌపై#్యః ఖురైర్హేమముభీం సవత్యామ్ ధేనుం నరః క్షీరవతీం ప్రణమ్య స్రగ్వస్త్రఘంటాభరణం ద్విజాయ || 54 ఆసప్తరాత్రాదుదయే నృపాస్య దాతవ్యమేతత్సకలం నరేణ | యావత్సమాస్సప్తదశాథవా స్యురధోర్ధ్వమప్యత్ర వదంతి కేచిత్ || 55 రాత్రి ఆగస్త్యోదయమైన తరువాత వేకువను తెల్ల నువ్వులతో స్నానము సేయవలెను. తెల్లని వస్త్రములు దాల్చి యింట పూలమాలలతో, వస్త్రమలంకరించి పంచ రత్నములతో, నేతి పాత్రతో కూడ ఒచ్చునొరములేని కుంభమును నిలుపవలెను. కుంభము ముందు బొటన వ్రేలంత బంగారు పురుష విగ్రహము నాల్గు బాహువులతో నుంచవలెను, కుంభము చుట్టు ఏడు ధాన్య పర్వతములుంచి కుంభముఖాన చతుర్భుజుని బ్రహ్మనుంచి కంచుపాత్ర తెల్ల యక్షతలతో యంత్రముతో విప్రునకీయ వలెను. చేయి సాచి కుంభముపై నుంచి దక్షిణ దశిగా మోము పెట్టిన పాలిచ్చు తెల్ల గోవును దూడతో మనస్సు నిల్పి పూల మాలలు ఘంటయు నలంకరించి బ్రాహ్మణున కీయవలెను. ఏడు రాత్రు లుదయమందిలా యీయవలెనని, పదునేడు సంవత్సముల పైని కూడా యీ దానము సేయవలెనని కొందరందురు. 55 కాశపుష్పప్రతీకాశ అగ్నిమారుతసంభవ | మిత్రావరుణయోః పుత్ర కుంభయోనే నమోస్తు తే || 56 ప్రత్యబ్ధం చ ఫలత్యాగమేవం కుర్వన్న సీదతి | హోమం కృత్వా తతః పశ్చాద్వర్తయేన్మానవః ఫలమ్ || 57 అనేన విధినా యస్తు పుమానర్దం నివేదయేత్ | ఇమం లోకమావాప్నోతి రూపారోగ్యఫలప్రదమ్ || 58 ద్వితీయేన భువర్లోకం స్వర్లోకం చ తతః పరం | సపై#్తవ లోకానామాప్నోతి సప్తార్ధాన్యః ప్రయచ్ఛతి || 59 ఇతి పఠతి శృణోతి యో హి సమ్యక్ చరితమగస్త్యసమర్చనం చ పశ్యేత్ | మతిమపి చ దదాతి సోపి విష్ణోర్భవనగతః పరిపూజ్యతే ೭మరౌఘైః|| 60 ఇట అగస్త్య మంత్రము '' కాశ పుష్ప ........ నమో೭స్తుతే.''అని. ఱల్లు పువ్వువలె తెల్లనివాడా ) అగ్నికి వాయువునకు జనించిన వాడా ! మిత్రావరుణుల పుత్రుడా కుంభయోని (కుంభమందు పుట్టిన వాడా !) నమస్కారం అని యీమంత్రార్థము. పండ్లు దినక ఈలా ప్రతి సంవత్సరము చేయవలెను. హోమము నేసి సమాప్తిచేపి యాపై ఫలము తినవచ్చును. ఈ విధిని ధనము నివేదించిన పుణ్యుడు చక్కదనము ఆరోగ్యముతోడి జన్మమీ లోకమందందును. సప్తధనము లిచ్చినవాడు భూరాది సత్యలోకము దనుక గల సప్తలోకముల నందును. ఇది చదివి విన్న యాతడు విష్ణులోకమందు దేవ సంఘముచే జూజింపబడును. జ్ఞాన సంపన్నుడగును. 60 భీష్మ ఉవాచ : సౌభాగ్యారోగ్యఫలదమమిత్రక్షయకారకం || భుక్తిముక్తిప్రదం యచ్చ తన్మే బ్రూహి మహామతే | 61 పులస్త్య ఉవాచ : యదుమాయా పురా దేవ ఉవాచాంధకసూదనః | కధాసు సంప్రవృత్తాసు ధర్మాసు లలితాసు చ | తదిదానం ప్రవక్ష్యామి భుక్తిము క్తిఫలప్రదం || 62 గౌర్యువాచ : - దత్త ః శాపో హి సావిత్ర్యా మహ్యం లక్ష్మై సురేశ్వర|| 63 భీష్ముడు సౌభాగ్యారోగ్యము లిచ్చునది, శత్రుక్షయకరము భుక్తి ముక్తు లిచ్చునదానతిమ్మన పులస్త్యుడనియె. అంధకారి (శివుడు) ఉమాదేవికి జెప్పిన చక్కని కథలందలి కథ యొకటి యిపుడు ముచ్చటింతునన, గౌరీదేవి-దేవేశ్వరా ! సావిత్రినాకును లక్ష్మికిని శాపమిచ్చెగదా, నేను లక్ష్మివలె ప్రధానత్వమును (ప్రాముఖ్యమును) పొందెదనో యా రీతి సెప్పుమన శంకరుడనియె. 63 యధా లక్ష్మీ ప్రధానత్వమహం యామి తధా వద | శంకర ఉవాచ :- శృ ణుష్వావహితా దేవీ తథైవాన్యత్ స్వయంకృతమ్ || 64 నరాణామధ నారీణామారాధనమనుత్తమం | నభ##స్యేవాథ వైశాఖే పుణ్య మార్గశిరస్యథ | 65 శుక్లపక్షే తృతీయాయాం స్నాతః సగౌరసర్షపైః గోరోచనం సగోమూత్రం గోరుగ్దంచ ఘృతం తథా || 66 దధిచందనసంమిశ్రం లలాటే తిలకం న్యసేత్ | సౌభాగ్యారోగ్యకృద్యస్మాత్సదా చ లలితా ప్రియమ్ || 67 ప్రతిపక్షం తృతీయాయాం పుమాన్వామి సువాసినీ | ధారయేద్రక్తవస్త్రాణి కుసుమాని సితాని చ 68 విధవా శుక్లవస్త్రం వై త్వేకమేవ హి ధారయేత్ | కుమారీ శుక్లసూక్ష్మే చ పరిదధ్యాతు వాససీ || 69 దేవీం చ పంచగవ్యే న తతః క్షీరేణ కేవలం | స్నాపయేన్మధునా తద్వత్పుష్పగంధేన తు 70 పూజయేచ్ఛుక్లపుషై#్ప స్తు ఫలైర్నానావిధైరపి | ధాన్యలాజాదిలవణగుడం క్షీరఘృతాన్వితైః || 71 శుక్లాక్షతతిలైరర్చా కార్యా దేవి సదా త్వయా | పాదయోరర్చనం కుర్యాత్ర్పతిపక్షం వరాననే || 72 దేవీ!శ్రద్ధతో విను. స్వయముగా జేసిన పుణ్యమిది. పరమోత్తమ మారాధనము పురుషులకు స్త్రీలకు గూడ చేయవలపినది. వైశాఖము శ్రావణము మార్గశిరమున గాని శుక్ల తృతీయనాడు తెల్ల ఆవాలతో స్నానముచేసి గోమూత్రము, గోరోచనము, గోక్షీరము, గోఘృతము చందనముతో గలిపి పెరుగును నుదుట బొట్టు పెట్టుకోవలెను. అది సౌభాగ్యారోగ్యము లిచ్చునది. లలితా ప్రియము ప్రతి పక్షమందు పురుషుడు గాని పుణ్యస్త్రీకాని ఎఱ్ఱని వలువలు పువ్వులు ధరించవలెను. తెల్లనివియు విధవ మాత్రము శుక్లవస్త్ర మొక్కటే కట్టుకొనవలె. కుమారి సువాసినియైన పిల్ల పలుచని చక్కని వస్త్రముల జత ధరింపవలెను. పంచగవములే నాపై పాలతో మాత్రమే తేనెతో స్నానముచేసి పుష్పగంధములచే పూజింపవలెను. తెల్ల పువ్వులతో నానావిధ పలములతో పూజింవలె. ధాన్యము పేలాలు, ఉప్పు, బెల్లము నేతితో గూడ పాలు, తెల్ల అక్షతలు, తెల్ల నువ్వులు నను వీనిచే నర్చింపవలెను. 72 -: ప్రత్యంగ పూజ :- వరదాయైనమః పాదౌ తథా గుల్ఫౌ శ్రియై నమః | అశోకాయై నమో జంఘే పార్వత్యై జానునీ తథా ||73 ఊరూ మాంగల్యకారిణ్యౖ వామదేవ్యై తథా కటిం | పద్మోదరాయై జఠరం కంఠే శ్రియైనమః || 74 కరౌ సౌభాగ్యదాయిన్యై బాహూ చ సుముఖశ్రియై | ముఖం దర్పవినాశిన్యై స్మరదాయై స్మితం పునః || 75 గౌర్యై నమస్తథా నాసాముత్పలాయై చ లోచనే | తుష్ట్వై లలాటమలకం కాత్యాయన్యై నమః శిరః || 76 నమో గౌర్యై నమః పుష్ట్యై నమః కాంత్యై నమః శ్రియై | రంభాయై లలితాయై చ వామదేవ్యై నమో నమః 77 ''పాదయోః వరదాయై'' (అని పాదములు మొదలు లలాటము దాకా) పూజ చేయవలెను. ఏవం సంపూజ్య విధివదగ్రతః పద్మమాలిఖేత్ | పత్త్రెః షోడశభిర్యుక్తం క్రమేణౖవ సకర్ణికమ్ || 78 పూర్వేణ విన్యసేద్గౌరీమపర్ణాం చ తతః పరః | భవానీం దక్షిణ తద్వద్రుద్రాణీం చ తతఃపరమ్ || 79 విన్యసేత్ పశ్చిమే భాగే సౌమ్యాం మదనవాసినీం | వాయవ్యే పాటలాముగ్రాముత్తరేణ తథా ఉమామ్ || 80 సాధ్యాం పద్భ్యాం తథా సౌమ్మాం మంగలాం కుమదాం సతీం | భ్రదాం చ మధ్యే సంస్థాప్య లలితాం కర్ణికోపరి || 81 కుసుమైరక్షతైర్వా నమస్కారేణ విన్యసేత్ | గీతమంగలఘోషం చ కారయిత్వా సువాసినీమ్ || 82 పూజయేద్రక్తవాసోభీ రక్తమాల్యానులేపనైః | సిందూరం స్నానచూర్ణం చ తాసాం శిరసి పాతయేత్ || 83 సిందూరం కుంకుమం స్నానమతీవేష్టం యతస్తతః | తధోపదేష్టారమపి పూజయేద్యత్నతో గురుమ్ || 84 న పూజ్యతే గురుర్యత్ర సర్వాస్తత్రాఫలాః క్రియాః | జపై#్యశ్చ పూజయేద్గౌరీముతృలైరసితైః సదా || 85 బంధుజీవైః ప్రియే పూజ్యా కార్తికే మాసి యత్నతః | జాతీపుషై#్పర్మార్గశిరే పౌషే పీతైః కురంటకైః || 86 కుందైః కుముదపుషై#్పశ్చ దేవీం మా ఘేపి పూజయేత్ | సిందువారేణ జీత్యా వా ఫాల్గునేఫ్యర్చయేన్నరః || 87 చైత్రే తు మల్లికాశోకైర్వైశాఖే గంధపాటలైః | జ్యేష్ఠే కమలమందారైరాషాడే చ జలాంబుజైః || 88 మందారైరథ మాలత్యా శ్రావణ పూజయేత్సదా | గోమూత్రం గోమయం క్షీరం దధి సర్పిః కుశోదకమ్ || 89 బిల్వపత్రార్కసుమాంబుజగోశృంగవారి చ | పంచగవ్యం చ బిల్వం చ ప్రాశ##యేత్ర్కమశంః సదా || 90 ఏతద్భాద్రపదాదౌ తు ప్రాశనం సముదాహృతం | ప్రతిపక్షం చ మిథునం తృతీయాయాం వరాననే || 91 భోజయిత్వార్చ యేద్భక్త్యా వస్త్రమాల్యానులేపనైః | పుంసః పీతాంబరే దద్యాత్ స్త్రియాః కౌశేయవాససీ || 92 నిష్పావజీరలవణమిక్షుదండగుడాన్వితం | స్త్రియై దద్యాత్ఫలం పుంసః సువర్ణోత్పలసంయుతమ్ || 93 యథా న దేవి దేవస్త్వాం సంపరిష్యజ్వ గచ్ఛతి | తథా మాముద్ధరాశేషదుఃఖసంసారసాగరాత్ || 94 కుమాదా విమలా నందా భవానీ వసుధా శివా | లలితా కమలా గౌరీ సతీ రమ్బాధ పార్వతీ || 95 నభస్యాదిషు మాసేషు ప్రీయతామిత్యుదీరయేత్ | వ్రతాంతే శయనం దద్యాత్సువర్ణకమాలాన్వితమ్ || 96 మిధునాని చతుర్వింశద్ ద్వాదశోథ సమర్చయేత్ | అష్టావష్టావథవా భూయశ్చతుర్మా సేథ వార్చయేత్ || 97 ఈలా పూజించి ఆ దేవత ముందు పద్మమును బదునారు రెక్కలతో కర్ణికతో పద్మమును హస్తముతో తాకుచు పూజ చేయవలెను. తూర్పున గౌరిని, నైరుతి మూల అపర్ణను, ఆగ్నేయమున దక్షిణమున భవాని, పడమట, రుద్రాణి, మదన సౌమ్య తాపిని వాయవ్యమున పాటలను, ఉత్తరమున పాటలను, ఈశాన్యమున సాధ్యను, పద్య సౌమ్య మంగళ కుముద సతి భద్ర అనుదేవతల మధ్యను నిలిపి పూవు కర్ణికలమీద లలిత నుంచవలెను. పూలతో అక్షతలతో నమస్కరించి సువాసినిని పూజించి గీత మంగళ వాద్య ఘోషమములతో మేళవించి ఎఱ్ఱని వస్త్రములు మాలలు గంధాదులతో సువాసినిని పూజింపవలెను. సిందూరము, కుంకుమతో స్నానము దేవికి చాలా ప్రియుములు కావున వానిని సువాసినుల శిరస్సు నందుంచి స్నానము సేయింపవలెను. ఆమీద ఉపదేశమిచ్చిన గురువును బూజింపవలెను. గురుపూజ లేనివన్నియు వ్యర్ధమే. మంద్ర జపములు సేసి నల్ల గలువలతో గౌరిని పూజ చేయవలె. మార్గశిరమున జాజిపువ్వులు, పుష్యమున పసుపుపచ్చని కురంటకములతో గోరంట పువ్వులు, మొల్లలు, తెల్ల గల్వలు, మాఘమందు వావిలి, జాజి పూవులతో, పాల్గుణమున చైత్రమున మల్లెలు అశోకములు, వైశాఖమున గంధిపాటలములు, జ్యేష్ఠమున కమలములు, మందార పువ్వులు, ఆషాడమున తామర పూవులు, శ్రావణమున మందారములు మాలతి పువ్వులతో దేనిని పూజింపవలెను. గోమూత్రము, గోమయము, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, దర్భనీరు, మారేడుపత్రి, జిల్లేడు పువ్వులు, తామర పూలు, ఆవు కొమ్ము నీరు, పంచగవ్యము మారేడు నను వీనిని క్రమముగా తినిపింపవలెను. ఈ ప్రాశనము భాద్రపద శుక్లమందు జెప్పబడినది. శుక్ల కృష్ణ వక్షములందెల్ల తదియనాడు దంపతులకు భక్తితో భోజనము పెట్టి వస్త్ర మాల్య గంధాదులతో పురుషునకు పీతాంబరములు స్త్రీకి పట్టుచీరలు పెట్టవలెను. నిష్పావములు, జీలకర్ర, ఉప్పు, చెఱకుగర్ర, బెల్లము సువాసినికి పురుషునకు బంగారు కలువ పూవుతో చేర్చి యీయవలెను. ''యధా ...... సాగరత'' అన్న యీ మంత్ర భావమును భావించి దేనిని ప్రార్థింపవలెను., భావము - దేవీ ! పరమేశ్వరుడు నిన్ను కౌగలించకుండ వెళ్ళడో అలా నన్ను సంసార సాగరము నుండి యుద్దరింపుము. కుముద మొదలు పార్వతి దాకగల దేవీ నామములను పండ్రెండును. శ్రావణాదిగ పండ్రెండు మాసములందు జపించి దేవి నాయెడల ప్రీతిసెందుగాకయని పలుకవలెను. వ్రత సమాప్తియందు బంగారు కమలముతో శయ్యాదానము సేయవలెను. నలుగురు, పండ్రెండుగురు దంపతులను పూజసేయవలెను. 97 పూర్వం దత్వాథ గురవే పశ్చాదన్యాన్ సమర్చయేత్ | ఉకానన్తతృతీయైషా సదానంతఫలప్రదా || 98 సర్వపాపహరా దేవీ సౌభాగ్యారోగ్యవర్ధనీ | న చైనాం విత్తశాఠ్యేన కదాచిదపి లంఘయేత్ || 99 నరో వా యది వా నారీ సోపవాసప్రతం చరేత్ | గర్భిణీ సూతికా నక్తం కుమారీనాథ రోగిణీ || 100 యదా೭శుద్దా తదాన్యేన కారయేత్ర్పయతా స్వయం | ఇమామనంతఫలదాం యస్తృతీయాం సమాచరేత్ || 101 కల్పకోటిశతం సాగ్రం శివలోకే మహియతే | విత్తహీనోపి కుర్వీత యావద్వర్షముపోషణమ్ || 102 పుష్పమంత్రావిధానేన సోపి తత్పలమాప్నుయాత్ | నారీ వా కురుతే యాతు ఆత్మనః శుభమిచ్ఛతి| 103 జన్మపౌరుషమాప్నోతి గౌర్యనుగ్రహకారితం | ఇతి పఠతి శృణోతి వా య ఇత్థం గిరితనయావ్రతమింద్రలోకసంస్థః | 104 మతిమపి చ దదాతి యోపి దేవైరమరవధూజనకిన్నరైః స పూజ్యః | అన్యామపి ప్రవక్ష్యామి తృతీయాం పాపనాశినీమ్ || 105 గురుపూజ ముందు సేసి తరువాత నందరిని బూజింపవలెను. ఇది అనంతతృతీయా వ్రతము. అనంత ఫలదము. ఇందు దేవి సర్వపాపహర సౌభాగ్యారోగ్య వర్ధిని. లోభముచే దీనినెన్నడూ ఉల్లంఘింపరాదు. స్త్రీగాని పురుషుడుగాని యుపవాస వ్రతపూర్వకముగా జరుపవలెను. గర్భిణి ప్రసవించినది కుమారి (పెండ్లి కాని పిల్ల) రోగిణి, మైల వడినది యింకొకరిచే జేయింపవలెను. ఈ అనంతతృతీయావ్రతమాచరించినతడు కోటి కల్పములు పైగా శివలోకమందు విహరించును. పేదవాడును ఒక్క సంవత్సరముపవాసముండి యీ పుష్పాదులతో మంత్ర విధానమున జేసినదే ఫలమందును. తన శుభముకోరి స్త్రీయైన నీ వ్రతము నేసిన గౌరీదేవి యనుగ్రహమున పురుషజన్మమందును. ఇది చదివిన విన్నను నిచ్చట మనస్సునర్సించినను దేవతలచే దేవతా సుందరులచే కిన్నరులచే పూజలందును. రసకల్యాణినీ మేతాం పురా కల్పభవా విదుః | మాఘే మాసి తు సంప్రాప్య తృతీయాం శుక్లపక్షతః || 106 ప్రాతర్గంధేన పయసా తిలైః స్నానం సమాచరేత్ | స్నాపయేన్మధునా దేవీం తథై వేక్షురసేన తు || 107 గంధోద కేన చ పునః పూజనం కుంకుమేన తు దక్షిణాంగాని సంపూజ్య తతో వామాని పూజయేత్ || 108 లలితాయై పదం దేవ్యై వామగుల్ఫౌ తతోర్చయేత్ | జంఘే జాను తధా శాంత్యై తథైవోరూ శ్రియై నమః 109 మదాలసాయై చ కటిమమలాయై తథోదరం | స్తనే మదనవాసిన్యై కుముదాయై చ కంధరామ్ || 110 భుజం భుజాగ్రం మాధవ్యై కమలాయై సుఖస్మితే | భ్రూలలాటం చ రుద్రాణ్యౖ శంకరాయై తథాలకం || 111 మదనాయై లలాటం తు మోహనాయై పునర్భువే | నేత్రే చంద్రార్ధధారిణ్యౖ తుష్ట్యై చ వదనం పునః || 112 ఉత్కంఠిన్యై నమః కంఠమమృతాయై నమస్తనుం | రంభాయై చ మహబాహువిశోకాయై నమః కరౌ|| 113 హృదయం మన్మధాహ్వాయై పాటలాయై తధోదరం | కటిం సురతవాసిన్యై| తథోరూ పంకజశ్రియై || 114 జాను జంఘే నమో గౌర్యై గుల్ఫౌ శాంత్యై తథార్చయేత్ | ధరాధరాయై పాదౌ తు విశ్వకాయై నమః శిరః || 115 నమో భవాన్యై కామిన్యై వాసుదేవ్యై జగచ్ఛ్రియై | ఆనందదాయై నందాయై సుభద్రాయై నమో నమః || 116 ఏవం సంపూజ్య విధివద్ధ్విజదాంపత్యమర్చయేత్ | భోజయిత్వా తథాన్నేన మధురేణ విమత్సరః || 117 నమోదకం వారికుంభం శుక్లాంబర యుగద్వయం | దత్త్వా సువర్ణకమలం గంధమాల్యైరథార్చయేత్ || 118 రసకల్యాణినీ వ్రతము. ఇది యింత కల్పములందలి వ్రజలెరుగుదురు. మాఘశుక్ల తృతీయనాడు గంధము పాలు నువ్వులతో స్నానము చేయవలెను. దేనిని తేనె చెఱకురసము గంధోదకముచే స్నానము సేయించి కుంకుమపూజ సేయవలెను. లలితాయై నమః అని ఎడమ మడమను శాంత్యైయని పిక్కలు మోకాళ్ళను శ్రియై యని ఊరువులు మదాలసాయైయని నడుము, అమలాయై యని కడుపు మదనవాసిన్యై యని స్తనములు కుముదాయై యని మాధవ్యై యని భుజము కమలాయైమని భుజముపైని సుఖస్మితే అని కనుబొమలు రుద్రాణ్యౖయని నుదురు శంకరాయైయని యలకలు మదనాయైయని మరల నుదురు మోహనాయైయని కనుబొమలు చంద్రార్ధ దారిణ్యౖ యని నేత్రములు రుష్ట్యైయని మరల ముఖము ఉత్కంఠిన్యై యని కంఠము అమృతాయైయని కడుపు రంభాయై యని బాహువులు, విశోకాయై యని చేతులు. మన్మథాహ్వాయై యని హృదయము, పాటలాయై యని ఉదరము, సురత వాసిన్యై యని కటిని నడుమును పంకజశ్రియై యని తొడలు గౌర్యైనమః అని పిక్కలు మోకాళ్ళు శాంత్యైయని మడమలు ధరాధరాయై యని పాదములు విశ్వకాయైనమః అని శిరస్సు, కామిన్యై వాసుదేవ్యై జగచ్ఛ్రియై ఆనందదాయై నందాయై నమో భవాన్యై సుభద్రాయై నమోనమః అని యీలా యధావిధిని పూజించి బ్రాహ్మణ దంపతులనర్చింపవలెను. వారికి మధురాన్నము భోజనము పెట్టి మాత్సర్యము గొనక మోదకములతో ఉండ్రాళ్లు మిఠాయిలాటి భక్ష్యములతో ఉదక కుంభము తెల్లని బట్టల చాపులు రెండోసగి యిది లవణవ్రతము స్వీకరించుగావుత. ఐంగారు కమలము గంధము పూలమాలలతో నిచ్చి యర్చింపవలెను. 118 ప్రీయతామత్ర కుముదా గృహ్ణీయాల్లవణవ్రతం | అనేన విధినా దేవీం మాసి మాసి సదార్చయేత్ || 119 లవణం వర్జయేన్మా ఘే ఫాల్గునే చ గుడం పునః | నవనీతం తథా చైత్రే వర్జం మధు చ మాధవే || 120 పానీయం జ్యేష్టమాసే తు తథాషాడేచ జీరకం | శ్రావణ వర్జయేత్‌క్షీరం దధి భాద్రపదే తథా || 121 ఘృతమాశ్వయుజే తద్వద్వర్జే వర్జ్యం చ మౌక్షికం | ధాన్యాకం మార్గశీర్షే తు పౌష్యే వర్జ్యం చ శర్కరా || 122 వ్రతాంతే కరకం పూర్ణమ్ తేషాం మాసి మాసి చ | దద్యాద్వికాలవేలాయాం భక్ష్యపాత్రేణ సంయుతమ్ || 123 లడ్డూకాస్సేవకాశ్చైవ సంయావమథ పూరికా | నారికా ఘృతపూర్ణశ్చ పిష్టిపూర్ణా చ నందికీ || 124 ఇట ''కుముదా'' దేవి ప్రీతినందుగావుత. లవణ వ్రతమిది గ్రహించుగావుత మని నెలనెల యిలా దేవి నర్చింపవలెను. మాఘమందు ఉప్పు, పాల్గునమున బెల్లము చైత్రమందు వెన్న, వైశాఖమందు తేనె, జ్యేష్ఠమందు పానీయము, ఆషాడమందు జీలకర్ర, శ్రావణమందు పాలు, భాద్రపదమున పెరుగు, అశ్వయుజమున నెయ్యి, కార్తికమున తేనె, మార్గశిరమున ధనియాలు, పుష్యమందు పంచదార తినరాదు. వ్రతము చివర నిండు కరకము బరిణ (కరవడ) ఒక రకము పాత్ర ప్రతినెలలో ద్వికాలవేళ ఉదయము సాయంత్రము యందు భక్ష్యపాత్ర నీయవలెను. లడ్లు సేవకలు సంయావము, పూరికా, బూరె, పాటలము, ఎఱ్ఱ బొద్దుగ, పున్నాగము, కవిగొట్టు. 124 క్షీరశాకం చ దధ్యన్నం పిండశాకం తథైవ చ | మాఘదౌ క్రమశో దద్యాదేతాని కరకోపరి || 125 కుముదా మాధవీ రంభా సుభద్రా చ శివా జయా | లలితా కమాలా೭నంగా మంగలా రతి లాలసా|| 126 క్రమాన్మాఘాదిమా సేషు ప్రీయతామితి కీర్తయేత్ | సర్వత్ర వంచగవ్యం చ ప్రాశనం సముదాహృతం || 127 మాఘమాసము మొదలు వరుసగా నేతితో నిండిన నారిక. పిష్టి (పిష్ట) పిండితో నిండిన నందికి పాలకూర, దధ్యోదనము కుముద మాధవి, రంభ, సుభద్ర, శివ జములలిత, కమల, అనంగ మంగళం తిలాలస. ఇవి మాఘమాసము మొదలు పుష్యమాసముదాక పండ్రెండు నెలలు పేర్కొనవలసిన దేవతలు వీరు ప్రీతి సెందురురుగాకయని యీ వ్రతము సేయవలెను. 127 ఉపవాసీ భ##వేన్నిత్యమశ##క్తేనక్తమిష్యతే | కుర్యాదేవమిదం నారీ రసకల్పాణినీవ్రతం || 128 పంచగవ్య పాశనము అన్ని యెడల సేయవలెను. ఉపవాసము సేయవలెను. ఆశక్తురాలు నక్తము సేయవచ్చును. 128 పునర్మా ఘే చ సంప్రాప్తే శర్కరా కలశోపరి | కృత్వా తు కాంచనీం గౌరీం పంచరత్నసమన్వితాం || 129 స్వకీయాంగుష్టమాత్రం చ సాక్షసూత్రకమండలుం | చతుర్భూజామిందుయుతాం సితనేత్రపటావృతామ్ || 130 తద్వద్గోమిధునం చైవ సువర్ణస్య సితాంబరం | సవస్త్రం భాజనం దద్యాద్భవానీప్రీయతామితి || 131 అనేన విధినా యస్తు రసకల్యాణినీవ్రతం | కుర్యాచ్చ సర్వపాపేభ్యస్తత్వణాదేవ ముచ్యతే || 132 భవానాం చ సహస్రం తు న దుఃఖీ జాయతే క్వచిత్ | అగ్నిష్ఠోమసహస్రేణ యుత్పలం తదవాప్నుయూత్ || 133 నారీ వా కురుతే యా తు కుమారీ వా వరాననే | విధవా చ వరాకా వా సాపి తత్ఫలభాగినీ || 134 సౌభాగ్యారోగ్యసంపన్నా గౌరీలోకే మహీయతే | ఇతి పఠతి య ఇత్థం యః శృణోతి ప్రసంగాత్ సకలకలుషముక్తః పార్వతీలోకమేతి || 135 తిరిగి మాఘమాసము రాగానే పంచదార కలశముపై తన బొటనవ్రేలంత బంగారు గౌరీ ప్రతిమ పంచరత్నములతో నాల్గు చేతులు చంద్రునితో తెల్లని వస్త్రము పెగవునుగూర్చి అక్ష సూత్రముతో కమండలువుతో గో మిధునమును తెల్ల వస్త్రముతో గూడిన దానిని దూర వస్త్రముతో పాత్రతో భవాని ప్రీతిసెందుగావుతమని దానమీయవలెను. ఈలా రసకల్యాణినీ వ్రతము నేసిన క్షణమున పాపముక్తినందును. వేయి జన్మములనైన దుఃఖమందడు. అగ్నిష్టామములు వేయి చేసిన ఫలమందును. పెండ్లికానిది అయినది, విధవ పాపాత్మురాలైనను నదే ఫలమందును. సౌభాగ్యారోగ్య సంపన్నురాలై గౌరీలోకమందును. ఇది చదివిన విన్నును నిదే ఫలమందును. మతిమపి చ విధత్తే యో నరాణాం ప్రియార్దం విబుధపతిజనానాం లోకగః స్యాదమోఘః | తథైవాన్యాం ప్రవక్ష్యామి తృతీయాం పాపనాశినీమ్ || 136 నామ్నా చ లోకవిఖ్యాతామగ్య్రానందకరీమిమాం | యదా శుక్లతృతీయాయామాఫాఢరక్షం భ##వేత్క్వచిత్ || 137 బ్రహర్‌క్షం వాథ చ మఘా హస్తో మూలమథాపి వా | దర్భగంధోదకైః స్నానం తదా సమ్యక్సమాచరత్ || 138 శుక్లమాల్యాంబరదరః శుక్లగంధానులేపనః | భవానీమర్చయేద్బక్త్యా శుక్లపుషై#్పః సుగంధిభిః || 139 మహాదేవం చ సకలముపవిష్టం మహాసనే | వాసుదేవ్యై నమః పాదౌ శంకరాయై నమో హరేః || 140 జంఘే శోకవినాశిన్యై మానదాయై నమః ప్రభోః | రంభాయై పూజయేదూరూ శివాయ చ పినాకినే || 141 ఆనందిన్యై కటిం దేవ్యా ః శూలినశ్శూలపాణయే | మాధవ్యై చ తథా నాభిమథ శంభోర్భవాయ వై || 142 సన్తౌ చానందకారిణ్యౖ శంకరస్యేందుధారిణ | ఉత్కంఠిన్యై నమః కంఠం నీలకంఠాయ వై హరేః || 143 కరావుత్పలధారిణ్యౖ రుద్రాయ జగతః ప్రభోః బాహూ చ పరిరంభిణ్యౖ నృత్యప్రీతాయ వై హరేః || 144 దేవ్యా ముఖం విలాసిన్యై వృషభాయ పునర్విభోః స్మితం చ స్మరణీయాయై విశ్వవక్త్రాయ వై విభోః || 145 నేత్రే మందారవాసిన్యే విశ్వధామ్నే త్రిశూలినః | భ్రువౌ నృత్యప్రియాయై చ శంభోర్వై పాశశూలినే || 146 దేవ్యా లలాటమింద్రాణ్య వృషవాహాయ వై విభోః | స్వాహాయై మకుటం దేవ్యా విభో గంగాధరాయ వై || 147 విశ్వకా¸° విశ్వభుజౌ విశ్వపాదముఖౌ శివౌ | ప్రసన్నవరదౌ వందే పార్వతీపరమేశ్వరౌ|| 148 అగ్ర్యానందకరీ తృతీయా వ్రతము :- ఆషాఢ శుక్ల తృతీయ తిథి బ్రహ్మర్షము మఘ హస్త మూల నక్షత్రము కలిసి వచ్చినపుడు సేయవలసిన వ్రతమిది. దర్భలతో గంధోదకముతో స్నానము చేసి తెల్లని వస్త్రములు పూలమాలలు ధరింపవలెను. సువాసనలుగల పూలతో గంధముతో తాను తెల్లని పూవులు వస్త్రములు ధరించి మహాదేవునితో గూడ భవానినర్చింపవలెను. ''వాసుదేవ్యై నమః పాదౌ'' అని ప్రారంభించి ప్రసన్నవదనౌ వందే పార్వతీ పరమేశ్వరౌ (148 శ్లోకముదాక ) అని నామములు సెప్పి ప్రత్యంగ పూజ సేయవలెను. ఏవం సంపూజ్య విధివదగ్రతః శివయోః పునః | పద్మోత్పలాని రజసా నానవర్ణేన కారయేత్ || 149 శంఖచక్రే సకటకే స్వస్తికం శుభకారకం | యావతః పాంసవస్తత్ర రజసః పతితా భువి || 150 తావద్వర్షసహస్రాణి శివలోకే మహీయతే | చత్వారి ఘృతపాత్రాణి సహిరణ్యాని శక్తితః || 151 దత్వా ద్విజాయ కరకముదకేన సమన్వితం | ప్రతిపక్షం చతుర్మాసం యావదేతాన్ని వేదయేత్ || 152 తతస్తు చతురో మాసాన్పూర్వవత్కరకోపరి | చత్వారి ఘృతపాత్రాణి తిలపాత్రాణ్యనంతరమ్ | 153 గంధోదకం పుష్పవారి చందనం కుజ్కు మోదకం | అపక్వం దధి దుగ్థం చ గోశృంగోదకమేవ చ || 154 అబ్దోదకం తథా వారి కృష్ణచూర్ణాన్వితం పునః | ఉశీరసలిలం చైవ యవచూర్ణోదకం పునః || 155 తిలోదకం చ సంప్రాశ్య స్వపేన్మార్గశిరాదిషు | మాసేషు పక్షద్వితయం ప్రాశనం సముదాహృతమ్ || 156 ఇట్లుసేసి పార్వతీ పరమేశ్వరులముందు పలు రంగుల పిండితో కమలములు కలువలు - పొన్నుతోకూడ శంఖము చక్రములను జేయించి యుంచవలెను. ఈ పిండి రేణువులెన్ని యక్కడ రాలునో అన్ని వేల సంవత్సరములు శివలోకమున రాణించును. నాల్గు శక్తికొలది నేతి చెంబులు బంగారముతో, జలపాత్రము (కరకము = కుండి) ద్విజునకు నాల్గు మాసములు ప్రతిపక్షమునందిలా దానమీయవలెను. ఆషాడ శుక్ల తృతీయనుంచి నాల్గు మాసాలు ఇట్లుచేసి ఆ పైని నాల్గు మాసాలు ప్రతిపక్షమందు నాల్గు తిలపాత్రలు నాల్గు నేతి చెంబులు కరకముపై నుంచి గంధోదకము పుష్పోదకము చందనము కుంకుమోదకము పెరుగు పాలు ఆవుకొమ్ములో నీరు, కృష్ణచూర్ణముతో గలిపిన తామరపూల నీరు, వట్టివేరు నీళ్ళు, యవల పిండి, నీరు, తిలోదకము ఇవి మార్గశిరాది నాల్గు మాసాలు రెండు పక్షములందు తినవలసినవి. సర్వత్ర శుక్లపుష్పాణి ప్రశస్తాని సదార్చనే | దానకాలే చ సర్వత్ర మంత్రమేతముదీరయేత్ || 157 గౌరీ మే ప్రీయతాం నిత్యమఘనాశాయ మంగలా | సౌభాగ్యాయాస్తు లలితా భవానీ సర్వసిద్దయే || 158 సంవత్సరాంతే లవణం గుడకుంకుమసంయుతం | చందనేన యుతం కుంభం సహా స్వర్ణాంబుజేన చ || 159 ఉమాయాః ప్రీతయే హైమం తద్వదిక్షుఫలైర్యుతం | సాస్తరావరణాం శయ్యాం సవిశ్రామాం నివేదయేత్ || 160 సపత్నీకాయ విప్రాయ గౌరీ మే ప్రీయతామితి | ఆత్మానందకరీం నామ ప్రాప్నుయాత్సంపదం నరః || 161 ఆయురానందసంపన్నో న క్వచిచ్ఛోకమాప్నుయాత్ | నారీ వా కురుతే యా తు కుమారీ విధవా తథా || 162 సాపి తతృలమాప్నోతి దేవ్యనుగ్రహలాలితా | ప్రతిపక్షముపోషై#్యవం మంత్రార్చనవిధానతః || 163 రుద్రాణాం లోకమాప్నోతి నరావృత్తిదుర్లభం | ఇమాం యః శ్రుణుయాన్నిత్యం శ్రావయేద్వాపి భక్తితః || 164 శక్రలోకం స గత్వా తు పూజ్యతే కల్పసంస్థితః | శంకర ఉవాచ ః - ఏవంవిధా భవతి చేన్నారీ వ్రతపరాయణా || 165 అర్చనమందెల్లయెడల తెల్లపువ్వులే ప్రశస్తములు. దానమిచ్చు సమయమున పఠింపవలసిన మంత్రము : ''గౌరీమే ప్రీయతాం నిత్యమ్'' నిత్యము పాపము నశింపజేయుటకు నాయెడ గౌరి ప్రీతినెందుగాక. లలితాదేవి సౌభాగ్యమనుగ్రహించుగాక. భవాని సర్వ సిద్దులకగుగాక! ఇది యీ మంత్రార్థము. సంవత్సరము పూర్తియందు బెల్లము కుంకుమ ఉప్పు చందనముతోని కుంభము బంగారు తామరపూవుతో దానమీయవలెను. ఉమాదేవి ప్రీతికి బంగారపుది, చెఱకుతో పండ్లతో అస్తరణతో తలగడతో శయ్యాదానము బ్రాహ్మణ దంపతులకు ''గౌరీమే ప్రీయతామ్'' అని సెప్పుచు దానమీయవలెను. ఇందువలన ఫలము ఆత్మానందకరి = బ్రహ్మానందమును సమకూర్చు సంపదను ఆయురారోగ్యమును సంపదను పొందును. ఎన్నడును శోకమందడు. స్త్రీ పెండ్లికానిది విధవకూడ యీ ఫలమందును. ఇది నేసిన పుణ్యుడు రుద్రలోకమందును పునరావృత్తి నొందడు. ఇది విన్న వినిపించి నతడు కల్పమెల్ల ఇంద్రలోకమేగి పూజింపబడును. శంకరుడనియె ః ఈలా వ్రతనిష్టురాలైన పుణ్యురాలు సామాన్య స్త్రీయే యీ మహాఫలమునందునేని. 165 సావిత్రీ తు వరాకీ సా తస్యాః శాపస్తు కీదృశః | న కాచిద్గణానా చాస్తి యతసై#్రలోక్యసుందరీ || 166 సా పూర్వస్యాపి వంద్యా చ లక్ష్మీర్వష్ణు ప్రతిగ్రహత్ | మయా పూర్వం తవార్దాయ దక్షయజ్ఞస్తు నాశితః || 167 లక్ష్మ్యర్ధం విష్ణునా చాపి వారిథిర్మథితః పురా | ఆజ్ఞాకరౌ భవత్యోశ్చ మా కురుష్య భయం క్వచిత్ || 168 సావిత్ర్యా మాననా కార్యా కుపితాయాః ప్రసాదనం | మయా చ విష్ణునా చైవ బ్రహ్మణా మానమీప్సునా || 169 గమిష్యే బ్రహ్మసదనం త్వం చ తిష్ట వరాననే | ఏవముక్త్వా గతో రుద్రో గౌరీ తత్ర వ్యవస్థితా || 170 కృతం యుగసమగ్రం చ యజ్ఞే తస్మిన్హుతాశనః | వహంస్తు హవ్యం దేవానాం ప్రీణయానో జగత్రయమ్ || 171 భోజనం ద్విజముఖ్యేషు భోగాన్విద్యాధరే గణ | కామావాప్తిం మనుష్యేషు సర్వమేవ దదౌ ప్రభుః|| 172 రుద్రేణోక్త స్తదా విష్ణుర్ధర్మాంస్తే త్వం ప్రకీర్తయ | గౌరీధర్మాన్సరస్వత్యా వ్రతం యత్పరీకీ ర్తితమ్ || 173 సావిత్రి యేపాటిది? ఆమె యిచ్చిన శాపమేపాటిది? ఈ వ్రతము సేసిన పుణ్యురాలు త్రైలోక్య సుందరియై తీరును. మఱి యెవ్వతెకు నీలాటి గౌరవముండదు. లక్ష్మి విష్ణువు సేపట్టి గదా యాయనకన్న ముందైన శివునికూడ మ్రొక్కదగినదైనది. మున్ను నేను నీకొఱకే దక్షయజ్ఞము తుదముట్టించితిని. లక్ష్మి కొఱకే విష్ణువు వారిథిని మథించెను. మీ యిద్దరి ఆజ్ఞ సేసెదను. ఎన్నడు జడియకు. కోపము గొన్నది సావిత్రిని గౌరవింపవలెను. బ్రతిమాలి పరసన్నురాలింగావించికొనవలెను. నేను, విష్ణువు, బ్రహ్మ కూడ గౌరవము గోరి సావిత్రిని గౌరవింపవలెను. బ్రతిమాలి ప్రసన్నురాలింగావించికొనవలెను. నేను, విష్ణువు, బ్రహ్మ కూడ గౌరవము గోరి సావిత్రని గౌరవింపవలసినదే. బ్రాహ్మణో త్తములకు భోజనములు విద్యాధరులందఱకు భోగములు మనుష్యుల కభీష్టసిద్దిని సర్వమును ప్రభువిచ్చినాడు. బ్రహ్మసదనమే నేగెను. సుందరి | నివిట నుండుము అని పలికి రుద్రుడేగెను. గౌరియట నుండెను. ఒక్క యుగమంత యా యజ్ఞమునందగ్ని దేవుడు దేవతలగూర్చి హవ్యములను త్రిలోక ప్రీతికై వహించుచునే యుండెను. రుద్రుడు ధర్మములను గౌరీదేవి సేసిన ధర్మములను సరస్వతి వ్రత వైభవము నీవిట ముచ్చటించుచుండుము. అని రుద్రుడన విష్ణువాదరముతో నిట్లనియె. 173 ఇత్యేవముక్తే రుద్రేణ విష్ణుః ప్రోవాచ సాదరం | నాహం ధర్మం ఖ్యాపయిష్యే స్వకీయం శంకరాధునా || 174 భవానాఖ్యాతు మహాత్మ్యం మదీయం సురసత్తమ | త్వయా వై కథితం పూర్వం కృతే వై పాపసంక్షయః || 175 భవిష్యతి న సందేహో భవాన్ పూతో భవిష్యతి | భీష్మ ఉవాచ :- మధురా గీర్భవేత్కేన వ్రతేన మునిసత్తమ|| 176 తథైవ జనసౌభాగ్యం మతిర్విద్యాసు కౌశలం | అభేదశ్చాపి దాంపత్యే సంగో బంధుజనేన చ || 177 ఆయుశ్చ విపులం పుంసాం తన్యే కథయ సత్తమ| పులస్త్య ఉవాచ ఃసమ్యక్ పృష్టం త్వయా రాజన్ శృణు సారస్వతమ్ వ్రతమ్ || 178 యస్య సంకీర్తనాదేవ దేవీ తుష్వేత్సరస్వతీ | యావద్భక్తః స్తవం కుర్యాదేతతద్ర్వతమనుత్తమమ్ || 179 శంకరా ! ఇపుడు నా ధర్మము నేను జెప్పను. దేవోత్తమ ! నీవు నా మహిమను దెల్పుము. కృతయుగమునందు పాపము క్షయింప నీవే మున్ను జెప్పితివి. దీనివలన పాపము నశించును. సందియములేదు. నీవును బవిత్రుడవగుదువు అనెను. భీష్ముడిట్లనియె. ఏ వ్రతముచే మధురమైన మాట గల్గును మునీంద్రా ! అలాగే జనసంపద, మతి (బుద్ది - జ్ఞానము ) విద్యాకౌశలము దంపతులకు పొరపొచ్చెము లేకుండుట, బందుగులతో సాంగత్యము ఆయుర్భాగ్యము ఎట్లు గల్గునోయది మునీంద్రా నాకు దెల్పుమన పులస్త్యుడనియె చక్కగ నడిగినావు రాజా! విను. సారస్వత వ్రతము పరమోత్తమము. దానిని వర్ణించుటవలన సరస్వతీదేవి సంతోషించును. భక్తుడీ మహోత్తమ వ్రతమునెంతో స్తుతించును. 179 ప్రాగ్వాసరాదౌ సంపూజ్య దివ్యం స్తవం సమారభేత్ ! అధవా రవివారేణ గ్రహతారాబలేన చ || 180 పాయసం భోజయేద్విప్రాన్ కుర్యాద్ర్బాహ్మణవాచనం | శుక్లవస్త్రాణి దత్త్వా చ సహిరణ్యాని శక్తితః || 181 గాయత్రీం పూజయేద్బక్త్యా శుక్లమాల్యానులేపనై ః | యథా నదేవీ భగవాన్ బ్రహ్మా లోకపితామహః || 182 త్వాం పరిత్యజ్య తిష్ఠేచ్చ తథా భవ వరప్రదా | వేదశాస్త్రాణి ధర్మాణి నృత్య గీతాదికం చ యత్ || 183 న విహీనం త్వయా దేవి తథా మే సంతు సిద్దయః | లక్ష్మీర్మేధా ధరా పుష్టిర్గౌరీ తుష్టిర్జయా మతిః || 184 ఏతాభిః పాహి చాష్టాభిః మూర్తిభిర్మాం సరస్వతీ | ఏవం సంపూజ్య గాయత్రీం వీణాకమలధారిణీమ్ || 185 శుక్లపుష్పాక్షతైర్భక్త్యా సకమండలుపుస్తకాం | మౌనవ్రతేన భుంజీత సాయంప్రాతశ్చ ధర్మవిత్ || 186 పంచమ్యాం ప్రతిపక్షం చ గాం చ విప్రాయ శోభనాం | తథైవ తండ్రులప్రస్థం ఘృతపాత్రేణ సంయుతమ్ || 187 క్షీరం దద్యాద్ధిరణ్యం చ గాయత్రీ ప్రియతామితి | సంధ్యాయాం చతథా మౌనమేతత్కుర్వన్ సమాచరేత్ || 188 న రాత్ర్యాం భోజనం కుర్యాద్యావన్మాసాస్త్రయోదశ | సమాప్తే తు వ్రతే దద్యాద్బోజనం శుక్లతండులైః || 189 దివ్యాం వితానాం ఘంటాం చాసితనేత్రపటాన్వితాం | చందనం వస్త్రయుగ్మం చ దధ్యన్నం సురసం పునః ||190 అథోపదేష్టారమపి భక్త్యా సంపూజయేద్గురుం | విత్తశాఠ్యేన రహితో వస్త్రమాల్యానులేపనైః || 191 అనేన విధినా యస్తు కుర్యాత్సారస్వతం వ్రతం | సౌభాగ్యమతియుక్తస్తు సూక్ష్మకంఠశ్చ జాయతే|| 192 సరస్వత్యాః ప్రసాదేన బ్రహ్మలోకే మమీయతే | నారీ వా కురుతే యా తు సాపి తత్పలభాగినీ || 193 బ్రహ్మలోకే వసేద్రాజన్యావత్కల్పాయుతత్రయం | సారస్వతం వ్రతం యస్తు శ్రుణుయాదపి వా పఠేత్ || 194 విద్యాధరపురే సో೭పి వసేదబ్ధాయుతత్రయమ్ | ఇతి శ్రీపాద్మపురాణ ప్రథమ సృష్టిఖండే వ్రతాధ్యాయో నామ ద్వావింశోధ్యాయః వ్రతము సేయునాడు ముందు సరస్వతీదేవి స్తవముచేసి యాపై నారంభింపవలెను. లేదా భానువారమున గ్రహతారాది బల మనుకూలముగ నున్నపుడు బ్రాహ్మణులకు పాయసముతో విందు సేయవలెను. స్వస్తివాచనము సేయింపవలెను. బంగారముతో శుక్ల వస్త్రములిచ్చి భక్తితో తెల్ల పూలతో గంధములతో గాయత్రీ దేనిని బూజింపవలెను. అమ్మా ! భగవంతుడు బ్రహ్మలోక పితామహుడు నిన్ను విడవడకుండునట్లుండి మాకు వరదాత్రి వగుము దేవీ! వేదశాస్త్రము ధర్మములు, నృత్య గీతాదికము, ఏమాత్రము నీతో విడివడకుండునట్లు దేవీ! మాకు వరదాత్రివగుము. అలా సర్వసిద్ధులునాకు కలుగుగాక ! లక్ష్మీ మేధ ధర పుష్టి గౌరి తుష్ఠి జయ మతి అను నీ యెనిమిది మూర్తులతో సరస్వతి నీవు నన్ను రక్షింపుము. అని వీణను కమలమును కమండలువును చేబట్టిన గాయత్రిని తెల్లని పూవు లక్షతలతో భక్తితో చక్కగా సాయం ప్రాతఃకాలము మౌనవ్రతముతో పూజచేసి ప్రతి పక్షమందు పంచమి నాడు శోభనమైన గోవును నాలుగు మానికలు (ప్రస్థము) బియ్యము. నేతిపాత్ర పాయసముతో పాలతో బంగారము గాయత్రి ప్రీతి సెందుగావుతమని బ్రాహ్మణునికీయవలెను. సంధ్యా సమయము మౌనవ్రతమూనవలెను. పదమూడు నెలలు రాత్రి భోజనము సేయరాదు. వ్రత సమాప్తియందు తెల్లని బియ్యము భోజనము పెట్టవలెను. దివ్యమైన చాందిని, గంధచందనము, నూతన వస్త్రముల చాపు, దద్యోదనము, పిండి వంటలు విందీయవలెను. ఆమీద నుపదేశకుని గూడ భక్తితో గంధవస్త్ర మాల్యాదులతో పూజింపవలెను. ఈలా సారస్వతమును నీ వ్రతము సేసినతుడు సరస్వతీ ప్రసాదమున బ్రహ్మలోక మందును స్త్రీయైననూనీ ఫలమందును పదివేల కల్పములు బ్రహ్మలోకమున సుఖించును. ఇది విన్నవారు గూడ ముప్పదివేల సంవత్సరములు దేవలోకమున సుఖముగ వసింతురు. 194 ఇది శ్రీపాద్మపురాణమున మొదటి సృష్టి ఖండములోని వ్రతాధ్యాయమను ఇరువది రెండవ అధ్యాయము.