Sri Padma Mahapuranam-I
Chapters
పంచవింశో೭ధ్యాయః ఆదిత్యశయనవ్రతము భీష్మ ఉవాచ :- ఉపవాసేష్వక్తస్య తదేవ ఫలమిచ్ఛతః || అనభ్యాసేన రోగాద్వా కిమిష్టం వ్రతముచ్యతామ్ | 1 పులస్త్య ఉవాచ :- ఉపవాసేష్వశక్తానాం నక్తం భోజనమిష్యతే || యస్మిన్వ్రతే తదప్యత్ర శ్రూయతాం వై వ్రతం మహత్ | 2 ఆదిత్యశయనం నామ యథావచ్ఛంకరార్చనం | యేషు నక్షత్రయోగేషు పురాణజ్ఞాః ప్రచక్షతే || 3 యదా హస్తేన సప్తమ్యామాదిత్యస్య దినం భ##వేత్ | సూర్యస్య చాపి సంక్రాంతిఃస్థితిస్సా సార్వకామికీ || 4 -:ఆదిత్యశయనవ్రతము :- భీష్ముడనియె : ఉపవాస ఫలము కావలెనని కోరును జబ్బు మనిషి. అలాంటి వానికి హితమైన వ్రత మానతిమ్మన పులస్త్యుడనియె. ఉపవాసమునకు శక్తి లేనివానికి నక్త భోజనము (రాత్రి భోజనము) సమ్మతము. ఆదిత్యశయన వ్రత మందది యనుకూలము. ఆ వ్రతమునందు శంకరు నర్చన జరుగును. హస్త నక్షత్రము సప్తమి తిథి భానువారమును కలిసి వచ్చినప్పుడు సూర్య సంక్రాంతి కూడ యైనచో నది సర్వ కామ సమృద్ధి నిచ్చును. 4 ఉమామహేశ్వరస్యార్చామర్చయేత్సూర్యనామభిః | సూర్యార్చాం శివలింగం చ ఉభయం పూజయేద్యతః || 5 ఉమాపతే ర వేశ్చాపి న భేదః క్వచిదిష్యతే | యస్మాత్తస్మాన్నృపశ్రేష్ట గృహే భానుం సమర్చయేత్ || 6 హస్తేతు సూర్యాయ నమోస్తు పాదావర్కాయ చిత్రాసు చ గుల్ఫదేశం | స్వాతీషు జంఘే పురుషోత్తమాయ ధాత్రే విశాఖాసు చ జానుదేశమ్ || 7 తథానురాధాసు నమోభిపూజ్యమూరుద్ద్వయం చైవ సహస్రభానోః | జ్యేష్టాస్వనంగాయ నమోస్తు గుహ్యమింద్రాయ భీమాయ కటిం చ మూలే || 8 పూర్వోత్తరాషాడయుగే చ నాభిం త్వష్ట్రే నమః సప్తతురంగగమాయ | తీక్షాంశ##వే శ్రవణ చాథ కుక్షీం పృష్టం ధనిష్టాసు వికీర్తనాయ || 9 వక్షఃస్థలం ధ్వాంతవినాశాయ జలాధిపర్షే ప్రతిపూజనీయం | పూర్వోత్తరాభాద్రపదద్వయే చ బాహూత్తమశ్చండకరాయ పూజ్యై || 10 సామ్నామధీశాయ కరద్వయం చ సంపూజనీయం నృప రేవతీషు | నఖాని పూజ్యాని తథాశ్వినీఘ నమోస్తు సప్తాశ్వధురంధరాయ || 11 కఠోరధామ్నే భరణీషు కంఠం దివాకరాయేత్యభిపూజనీయం | గ్రీవాగ్నిపక్షేధరసంపుటే తు సంపూజయేద్భారత రోహిణీషు || 12 ఆనాడు చేయవలసినది ఆదిత్య శయన వ్రతము సూర్య నామములు సెప్పి ఉమామహేశ్వర పూజ సేయవలెను. శివలింగమును ఉమామహేశ్వరులనీ యిద్దరిని గలిసి పూజింపవలెను. కారణము యిద్దరికి భేదము లేకపోవుటయే. శుక్లపక్షములో హస్త నక్షత్రమున - సూర్యాయ నమః అని చిత్ర '' ఆర్కాయ గుల్పములందు (మడమలందు) స్వాతి '' పురుషోత్తమాయ పిక్కలందు విశాఖ '' ధాత్రే మోకాళ్ళు అనూరాధ '' సహస్ర బాహవే ఊరువులు జ్యేష్ట '' అనంగాయ నమః గుహ్యము మూల '' ఇంద్రాయ నమః పూర్వాషాడ '' భీమాయ నమః కటి, నడుము ఉత్తరాషాఢ '' '' శ్రవణ '' తీష్ణాంశ##వే నమః కుక్షి ధనిష్ట '' వికర్తనాయ నమః వృష్టము శతభిష '' వరుణదేవతాక '' ద్వాంత వినాశకాయ నమః వక్షః స్థలము పూర్వాభద్ర, ఉత్తరాభద్ర '' చండకరాయ నమః బాహువులు రేవతి సామ్నామధీశాయ నమః అరచేతులు అశ్విని '' సప్తాశ్వధురంధరాయ నమః గోళ్ళు భరణి '' కఠోరధామ్నే నమః కంఠము కృత్తిక రోహిణి '' దివాకరాయ నమః గ్రీవ (మెడ) మృగేర్చనీయా రసనా పురారే రౌత్రే తు దంతాహరయే నమస్తే | నమః సవిత్రే ఇతి శంకరస్య నాసాభిఫూజ్య చ పునర్వసౌ చ || 13 లలాటమంభోరుహవల్లభాయ పుష్యేలకాన్వేదశరీరధారిణ | సార్పే చ మోలిం విబుధప్రియామ మఘాసు కర్ణావితి పూజనీ¸° || 14 పూర్వాసు గోబ్రాహ్మణనందనాయ నేత్రాణి సంపూజ్యతమాని శంభోః | అథోత్తరాఫాల్గునిభే భ్రువౌ చ విశ్వేశ్వరాయేతి చ పూజనీయే || 15 నమోస్తు పాదాంకుశపద్మశూలకపాలసర్పేందుధనుర్థరాయ | గయాసురానంగపురాంధకాదివినాశమూలాయ నమః శివాయ || 16 మృగశీర్ష '' పురారి నాలుక ఆర్ద్ర '' పునర్వసు '' సవిత్రే నమః ముక్కు పుష్యమి '' అంభోరుహ వల్లభాయ నమః లలాటము (నుదురు) ఆశ్రేష '' వేద శరీరధారిణ శిరస్సు మఖ '' విబుధ ప్రయాయ చేతులు పూర్వ ఫల్గుని '' గోబ్రాహ్మణ నందనాయ కన్నులు ఉత్తర ఫల్గుని '' విశ్వేశ్వరాయ కనుబొమలు 16 ఇత్యాదికాంగాని చ పూజయిత్వా విశ్వేశ్వరాయేతి | శిరోభిపూజ్యం | అత్రాపి భోక్తవ్యమతైలమన్నమమాంసక్షారమభుక్తశేషమ్ || 17 ఇత్యేవ నృప నక్తాని కృత్వా దద్యాత్పునర్వసౌ | శాలేయతండులప్రస్థమౌదుంబరమథో ఘృతమ్ || 18 సంస్థాప్య పాత్రే విప్రాయ సహిరణ్యం నివేదయేత్ | సప్తమే వస్త్రయుగ్మం తు పారణత్వధికం భ##వేత్ || 19 చతుర్దశేతు సంప్రాప్తే పారణ భారతాదికే | బ్రాహ్మణం భోజయేద్భక్త్యా గుడక్షీరఘృతాదిభిః || 20 కృత్వా చ కాంచనం పద్మమష్టపత్రం సకార్ణికం | శుద్దమష్టాంగులం తచ్చ పద్మరాగదలాన్వితమ్ || 21 శయ్యాం సులక్షణాం కృత్వా విరుద్దాం గ్రంధివర్జితాం | సోపధానవితానాం చ స్వాస్తరావరణాశ్రయామ్ || 22 పాదుకోపానహచ్ఛత్రచామరాసనదర్పణః | భూషణౖరపి సంయుక్తాం ఫలవస్త్రానులేపనై ః || 23 తస్యాం విధాయ తత్పద్మమలంకృత్య గుణాన్వితాం | కపిలాం వస్త్రసంయుక్తామతిశీలాం పయస్వినీమ్ || 24 రౌప్యఖురాం హైమశృంగీం నవత్సాం కాంస్యదోహనాం | దద్యాన్మంత్రేణ తాం ధేనుం పూర్వాహ్ణం నాతిలంఘయేత్ || 25 నూనె, మాంసము, కారము లేని యాహారము తినవలెను. భుక్తశేషము తినరాదు. రాజా! ఈలా నక్తములు చేసి పునర్వసు నక్షత్రమందు శాలి బియ్యమొక ప్రస్థము ఉదుంబర పాత్రమునందుంచి ఆవు నెయ్యితో బంగారము విప్రునకీయ వలెను. సప్తను పారణమందు వస్త్రముల చావు అధికముగ నీయవలెన. పదునాల్గవ పారణమందు బెల్లము, పాలు, నెయ్యి మొదలయిన వానితో బ్రాహ్మణునికి భోజనము పెట్టి బంగారు తామర పువ్వు ఎనిమిదంగుళాల విరిచినది పద్మరాగ మణులు దేవతలతో కర్ణికతో చేయించి సలక్షణమైన శయ్యను విరుద్ధగ్రంధి వర్జితాల తలగడతో, వితానముతో, పక్క దుప్పటితో, పాదుకలు, పాదరక్షలు, గొడుగు చామరము (వింజరామర), పీట (ఆసనము), అద్దము అలంకారములతో పండ్లు, వస్త్రములు, గంధములు దాని యందలంకరించి కపిల గోవును వస్త్రము కప్పి, వెండి డెక్కలతో, బంగారు తొడుగు కొమ్ములతో, దూడతో , కంచు పాలచెంబుతో మంత్ర పూర్వకముగా పూర్వాహ్ణము దాటకుండ దానమీయవలెను. 25 యథైవాదిత్య శయనమశూన్యం తవ సర్వదా | కాంత్యా ధృత్యా శ్రియా పుష్ట్యా తథా మే సంతు వృధ్దయః || 26 యథా న దేవాః శ్రేయాంసం త్వదన్యమనఘం విదుః | తథా మాముద్దరా శేషదుఃఖసంసారసాగరాత్ || 27 తతః ప్రక్షిణకృత్య ప్రణమ్య చ విసర్జయేత్ | శయ్యాం గవాది తత్సర్వం ద్విజస్య భవనం నయేత్ || 28 దాన మిచ్చునపుడు పఠింపవలసిన మంత్రము భావము- ఆదిత్యమూర్తీ భగవంతుడా ! నీశయనమెప్పుడూ అశూన్యమో (నిండుగానుండునో) కాంతిచే, ధైర్యముచే, సంపదచే పుష్టిచే నేలాంటి లోటు లేనిచో అలా నాకు సర్వ వృద్దులు గలుగు గాక ! అలా నన్ను సర్వ దుఃఖ సాగరము నుండి యుద్దరింపు అని పలికి ప్రదక్షిణము సేసి నమస్కరించి యా విప్రుని సాగనంపవలెను. శయ్య గోవు వంటి సత్కరించిన సామగ్రినంతయు నా ద్విజునింటికి జేర్చవలెను. నైతద్విశీలాయ న దాంభికాయ ప్రకాశనీయం వ్రతమిందుమౌలేః | గోవిప్రదేవర్షివికర్మయోగినాం యశ్చాపి నిందామధికాం విధత్తే || 29 భక్తాయ దాంతాయ చ గుహ్యమేతదాఖ్యేయమానందకరం శివఞ్చ | ఇదం మహాపాతకినాం నరాణాం అథ క్షయం వేదవిదో వదంతి || 30 గుణహీనుని దాంభికునికి వెల్లడింపరాదు. ఇందుమౌళి (చంద్రశేఖరు)నుద్దేశించిన యీ వ్రత వైభవము వెల్లడింపరాదు. గోవులు, విప్రులు, దేవతలు, ఋషులను నిందించు వాండ్రకు, సంయోగులను నిందించు వాండ్రకు వెల్లడింపరాదు. భక్తుడు దాంతుడు నైన వానికే రహస్యము తెలుపదగినది, అని వేదవేత్త లందురు. 30 న బంధుపుత్త్రెర్న ధనైర్వియుక్తః పత్నీభిరానందకరః సురాణాం | నాభ్యేతిరోగం న చ దుఃఖమోహం యా చాపి నారీ కురుతేథ భక్త్యా || 31 ఇదం వసిష్ఠేన పురార్జునేన కృతం కుబేరేణ పురందరేణ | యత్కీర్తనాదప్యఖిలాని నాశమాయాంతి పాపాని న సంశయోత్ర || 32 ఇతి పఠతి శృణోతి వా య ఇత్థం రవిశయనం పురుహూతః వల్లభః స్యాత్ | అపి నరకగతాన్ పితృనశేషానపి దివమానయతీహ యః కరోతి || 33 ఈ వ్రత మాచరించిన స్త్రీ పురుషుడు బంధుప్రీతి ధనాది సంపదల కెడవడడు. భార్యా పుత్రాదులతో నిరంతరానందభరితులగుదురు. మున్ను వశిష్ఠుడు, అర్జునుడు, ఇంద్రుడు, కుబేరుడు మున్నగు భాగ్యవంతులీ వ్రత మాచరించిరి. ఈ కథ పఠించినను నీ ఫలము సింద్దించును. విన్నను పాపములన్నియు పోయి ఫలములివి కల్గును. నరకము పాలైన పితరులను గూడ యిది యుద్దరించును. అశ్వత్థం చ వటం చైవోదుంబరం వృక్షమేవ చ | నందీశం జంబువృక్షం చ బిల్వం ప్రాహుర్మహర్షయః 34 మార్గశీర్షాదిమాసాభ్యాం ద్వాభ్యాం ద్వాభ్యామథ క్రమాత్ | ఏకైకం దంతధావనం వృక్షాష్వేతేషు కారయేత్ || 35 దద్వాత్సమాప్తే దధ్యన్నం వితానధ్వజచామరం | ద్విజానాముదకుంభాంశ్చ పంచరత్నసమన్వితాన్ || 35 న విత్తశాఠ్యం కుర్వీత కుర్వన్దోషానవాప్ను యాత్ | ఇతి శ్రీ పాద్మపురాణ ప్రథమే సృష్టిఖండే ఆదిత్యశయనవ్రతం నామ పంచవింశోధ్యాయః. రావి, మఱ్ఱి, మేడి, నందీశము , నేరేడు, మారేడు నను నీ ఆఱు వృక్షముల పుల్లలతో మార్గశిరము మొదలు రెండేసినెలకొక్క దానిచే దంత ధావనము సేయవలెను. పండ్రెండు మాసాలైనంత దధ్యన్నము, వితానము (చాందిని) జెండా చామరలతోనుదక కుంచములయందు రత్నాలతో దానము సేయవలెను. విత్తలోభము సేయకూడదు. దానిచే సర్వైశ్వర్య సంపన్ను లగుదురు. ఇది ఆదిత్యశయన వ్రతమను యిరువది యైదవ అధ్యాయము.