Sri Padma Mahapuranam-I
Chapters
షడ్వింశో೭ధ్యాయః -: రోహిణీ చంద్రశయన వ్రతమ్ :- భీష్మ ఉవాచ : దీర్ఘాయురారోగ్య కులాతివృద్దిభిర్యుక్తః పుమాన్ రూపకులాన్వితః స్యాత్ || ముహుర్ముహుర్జన్మని యేన సమ్యక్ వ్రతం సమాచక్ష్వ చ శీతరశ్మే ః | 1 పులస్త్య ఉవాచ : త్వయా పృష్టమిదం సమ్యగక్షయస్వర్గకారకం || రహస్యం తు ప్రవక్ష్యామి యత్పురాణవిదో విదుః | 2 రోహిణీచంద్రశయనం నామ వ్రతమిహోచ్యతే| తస్మిన్నారాయణస్యార్చామర్చయేదిందునామభిః 3 యదా సోమదినే శుక్లభ##వేత్పంచదశీ క్వచిత్ | అథవా బ్రహ్మనక్షత్రం పౌర్ణమాస్యాం ప్రజాయతే || 4 తదా స్నానం నరః కుర్యాత్పంచగవ్యేన సర్షపైః | ఆప్యాయస్వేతి చ జ పేద్విద్వానష్టశతం పునః || 5 -: రోహిణీ చంద్రశయన వ్రతము :- దీర్ఘాయు రారోగ్య కులాభివృద్ధులతో పురుషుడు యావత్కుటుంబము రూప సంపదతో పెక్కు జన్మలు శోభించుచు అక్షయ స్వర్గ భోగముల నుభవించుటకు జేయనగు వ్రతమానతిమ్మన భీష్మునకు పులస్త్యుడనియె. అక్షయ స్వర్గ కారణమగు వ్రతము రహస్యమిది తెల్పెదను. పురాణవేత్తలే యెఱుగుదురందు చంద్ర నామములతో నారాయణు నర్చింపవలయును. సోమావారము పూర్ణిమ తిధియైన నాడు లేదా బ్రహ్మ నక్షత్రము పూర్ణిమయందైననాడు పంచ గవ్యములతో తెల్లావాలతో స్నానము సేయవలెను. ''ఆప్యాయస్వ'' యను మంత్రమును నూట యెనిమిది మారులు జపింపవలెను. 5 శూద్రోపి పరయా భక్త్యా పాషండాలాపవర్జితః | సోమాయ వరదాయథ విష్ణవే చ నమో నమః || 6 కృతజప్యః స్వభవనమాగత్య మధుసూదనం | పూజయేత్ఫలపుషై#్చశ్చ సోమనామాని కీర్తయన్ || 7 సోమాయ శాంతాయ నమోస్తు పాదావనంతధామ్నేతి చ జానుజంఘే | ఊరుద్వయం చాపి జలోదరాయ సంపూజయేన్మేడ్రమనంగధమ్నే 8 నమో నమః కామసుఖప్రదాయ కటిః శశాంకస్య సదార్చ నీయః | తథోదరం చాప్యమ్యతోదరాయ నాభిః శశాంకాయ నమోభిపూజ్యా || 9 నమోస్తు చంద్రాయ ముఖం చ నిత్యం దంతా ద్విజానామధిపాయ పూజ్యాః | హాస్యం నమశ్చంద్రమసే೭భిపూజ్య మోష్ఠౌ తు కౌమోదవనప్రాయాయ || 10 నాసా చ నాథాయ వరౌషధీనామానందబీజాయ పునర్భ్రువే చ | నేత్రద్వయం పద్మనిభం తథేందోరిందీవరవ్యాసకరాయ శౌరేః || 11 నమః సమస్తాధ్వరపూజితాయ కర్ణద్వయం దైత్యనిషూదనాయ | లలాటమిందోరుదధిప్రియాయ కేశాః సుషుమ్నాధిపతేః ప్రపూజ్యాః 12 శిరః శశాంకాయ నమో మురారేర్విశ్వేశ్వరాయాథ నమః కిరీటిం | పద్మప్రియే రోహిణీనామ లక్ష్మీసౌభ్యామృతసాగరాయ|| 13 దైవీం చ సంపూజ్య సుగంధిపుషై#్పర్నై వేద్య ధూపాదిభిరిందుపత్నీం | సుస్త్వా తు భూయో పునరుత్థితో యః స్నాత్వా చ విప్రాయ హవిష్యభుక్తః || 14 దేయః ప్రభాతే సహిరణ్యవారికుంభో నమః పాపవినాశనాయ | సంప్రాశ్య గోమూత్రమమాంసమన్న మక్షారమష్టాపథ వింశతిం చ || 15 గ్రాసాంశ్చ త్రీన్ సర్పియుతానుపోష్య భుక్త్వాతిహాసం శృణుయాన్ముహూర్తం | కదంబనీలోత్పల కేతకాని జాతిః సరోజం శతపత్రికా చ || 16 ఆవ్లూనపుష్పాణ్యథ సిందువారం పుష్పం పునర్భారత మల్లికాయాః | శుక్లం చ పుష్పం కరవీరపుష్పం శ్రీచంపకం చంద్రమసే ప్రదేయమ్ || 17 శ్రవణాదిషు మాసేషు క్రమాదేతాని సర్వదా | యస్మిన్మాసే వ్రతాదిః స్యాత్తత్పుషై#్పరర్చయేద్ధరిమ్ || 18 ఏవం సంవత్సరం యావదుపోష్య విధివస్నరః వ్రతాంతే శయనం దద్యాచ్చ యనోపస్కరాన్వితమ్ || 19 రోహిణీచంద్రమిధునం కారయిత్వా తు కాంచనం | చంద్రః షడంగులః కార్యో రోహిణీ చతురంగులా || 20 ముక్తాఫలాష్టకయుతాం సితనేత్రసమన్వితాం | క్షీరకుంభోపరి పునః కాంస్యపాత్రాక్షతాన్వితామ్ || 21 దద్యాన్మంత్రేణ పూర్వాహ్ణో శాలీక్షుఫలసంయుతాం | శ్యేతామథ సువర్ణాస్యాం రౌప్యఖురసమన్వితమ్ || 22 సవస్త్రభాజనాం ధేనుం తథా శంఖం చ భాజనం | భూషణౖర్ద్విజదామ్పత్యమలంకృత్య గుణాన్వితమ్ || 23 చంద్రోయం విప్రరూపేణ సభార్య ఇతి కల్పయేత్ | యథా తే రోహిణీ కృష్ణ శయనం న త్యజేదపి || 24 సోమరూపస్య వై తద్వన్న మే భేదో విభూతిభిః | యథా త్వమేవ సర్వేషాం పరమానందము క్తిదః || 25 భుక్తిముక్తిస్తథాభక్తిస్త్వయి చంద్ర దృఢాస్తు మే | ఇతి సంసారభీతస్య ముక్తికామస్య చానఘ|| 26 రూపారోగ్యాయుషా మే తద్విథాయకమనుత్తమం | ఇదమేవ పితౄణాం చ సర్వదా వల్లభం నృప ||27 త్రైలోక్యాధిపతిర్భూత్వా సప్తకల్పశతత్రయం | చంద్రలోకమవాప్నోతి పునరావృత్తిదుర్లభమ్ || 28 నారీవ రోహిణీ చంద్రశయనం యా సమాచరేత్ | సాపి తత్పలమాప్నోతి పునరావృత్తిదుర్లభమ్ || 29 ఇతి పఠతి శృణోతి వా య ఇత్థం మధుమథనార్చనీం మధుకీర్తనేన | మతిమపి చ దదాతి సోపి శౌరేర్భవనగతః పరిపూజ్యతేమరౌఘైః || 30 ఇతి శ్రీపాద్మపురాణ ప్రథమే సృష్టిఖండే రోహిణీచంద్రశయనవ్రతం నామ షడ్వింశోధ్యాయః . శూద్రుడైనను పాషండుల (నాస్తికుల) మాటలాడక జపము సేసి యింటికి వచ్చి ఫల పుష్పాదులతో చంద్రనామములు సెప్పి చంద్రుని బూజ సేయవలెను. పాదాది ప్రత్యంగ పూజ ఆయా నామములతో జేయవలెను. ఇందు పత్ని రోహిణిని కూడ పూజించి ధూప దీప నివేదనములు సేసి రాత్రి నేలపై పరుండి ప్రొద్దున లేచి ఉపవసించి గోమూత్ర ప్రాశనము సేసి మాంసము కారము లేకుండ ఎనిమిది యిరువది మూడు ముద్దలు తిని ముహూర్త మాత్రము ఇతిహాసము వినవలెను. (భారతము) కదంబము (కడిమి) మొదలగు పూలు, తెల్ల పూలతో విష్ణువు నర్చింపవలెను. ఈలా యొక్క సంవత్సరము సేసి నాల్గు అంగుళముల రోహీణీ ముద్ర, అరంగుళము చంద్రముద్ర చేయించి దానమీయవలెను. తెల్లగోవును దానమీయవలెను. త్రైలోక్యాధిపతియై చంద్రలోకమందు తిరిగి జన్మించును. ఈవ్రతము సర్వ పుణ్యఫల ప్రదము. ఇది రోహిణీ చంద్రశయన వ్రతమను ఇరువదియారవ అధ్యాయము