Sri Padma Mahapuranam-I
Chapters
సప్తవింశో೭ధ్యాయః -: తటాక ప్రతిష్ఠా విధి :- భీష్మ ఉవాచ : తటాకారామకూపేషు వాపీషు నలినీషు చ || విధిం వదస్వ మే బ్రహ్మన్ దేవతాయతనేషు చ | 1 కే తత్ర ఋత్విజో విప్రా వేదీ వా కీదృశీ భ##వేత్ | దక్షిణా బలయః కాలః స్థానమాచార్య ఏవ చ || 2 ద్రవ్యాణి కాని శస్తాని సర్వమాచక్ష్వ సువ్రత | పులస్త్వ ఉవాచ : శృణు రాజన్మహాబాహో తటాకాదిషు యో విధిః || 3 పురాణష్వితిహాసోయం పఠ్యతే రాజసత్తమ | ప్రాప్య పక్షం శుభం శుక్లం సంప్రాప్తే చోత్తరాయణ || 4 పుణ్యహ్ని విపై#్రః కథితే కృత్వా బ్రాహ్మణవాచనం | అశుభైర్వర్జితే దేశే తటాకస్య సమీపతః || 5 చతుర్హస్తాం సమాం వేదీం చతురశ్రాం చతుర్ముఖీం | తథా షోడశహస్తః స్యాన్మండపశ్చ చతుర్ముఖః || 6 వేద్యాస్తు పరితో గర్తా రత్నిమాత్రాస్తు మేఖలాః | నవ సప్తాథవా పంచ ఋజువక్త్రా నృపాత్మజ|| 7 వితస్తిమాత్రా యోనిః స్యాత్షట్ సప్తాంగులివిస్త్రృతా | గర్తా చ హస్తమాత్రా స్యు స్త్రిపర్వోచ్చిత్రమేఖలాః || 8 సర్వతస్తు సవర్ణా స్యుః పతాకా ధ్వజసంయుతాః | అశ్వత్థోదుంబరీప్లక్షవటశాఖా కృతాని తు || 9 మండపస్య ప్రతిదిశం ద్వారాణ్యతాని కారయేత్ | శుభాస్తత్రాష్టహోతారో ద్వారపాలానాస్తదష్ట వై || 10 అష్ఠౌ తు జాపకాః కార్యా బ్రాహ్మణా వేదపారగాః | సర్వలక్షణసంపూర్ణాన్మంత్రజ్ఞాన్విజితేంద్రియాన్ || 11 కులశీలసమాయుక్తాన్ స్థాపయేద్వై ద్విజోత్తమాన్ | ప్రతిగర్తేషు కలశా యజ్ఞోపకరణాని చ || 12 వ్యజనే చాసనం శుభ్రం తామ్రపాత్రం సువిస్తరం | తతస్త్వనేకవర్ణాః స్యుర్బలయః ప్రతిదైవతమ్ || 13 ఆచార్యః ప్రక్షిపేద్భూమావనుమంత్ర్య విచక్షణః | ఆరత్నిమాత్రో యూపః స్యాత్ క్షీరవృక్షవినిర్మితః || 14 యజమానప్రమాణోక్ష వా సంస్థాప్యో భూతిమిచ్ఛతా | హోమాలంకారిణః కర్యాః పంచవింశతిఋత్విజః || 15 కుండలాని చ హైమానాని కేయూరకటకాని చ | తథాంగులిపవిత్రాణి వాసాంసి వివిధాని చ || 16 దద్యాత్సమాని సర్వేషామాచార్యే ద్విగుణం స్మృతమ్ | దద్యాచ్ఛ పనసంయుక్తమాత్మనశ్చాపి యత్ర్పియమ్ || 17 సౌవర్ణౌ కూర్మమకరౌ రాజతమత్స్యడుణ్డుభే | తామ్రా కుంభీరమండూకా వాయసః శింశుమారకః || 18 ఏవమాసాద్య తత్సర్వమాదావేవ విశాంపతే | శుక్లమాల్యాంబరధరః శుక్లగంధానులేపనః || 19 సర్వౌషధ్యుదకైః స్నాపితో వేదపారగైః యజమానః సపత్నీకః పుత్రపౌత్రసమన్వితః || 20 పశ్చిమద్వారమాసాద్య ప్రవిశేద్యాగమండపం | తతో మంగలశ##బ్దేన భేరీణాం నిఃస్వనేన చ || 21 రజసా మండలం కుర్యాత్పంచవర్ణేన తత్త్వవిత్ | షోడశారం తతశ్చక్రం పద్మగర్భం చతుర్ముఖమ్ || 22 -: తటాక ప్రతిష్ఠా విధి :c
చెఱువుల, తోటలు, నూతులు, దిగుడు బావులు , తామర కొలనులు, దేవాలయములు ప్రతిష్టించు విధాన మానతిమ్మని భీష్ముడడుగ పులస్త్యు డనియె. రాజోత్తమ! పురాణములందిది పఠింపబడినది వినుము. ఉత్తరాయణమందు శుక్ల పక్షమున శాస్త్రోక్త శుభలగ్నమున బ్రాహ్మణులు పుణ్యాహవాచనము సేసి శుభ ప్రదేశమున చెఱువునకు దగ్గరగా నాల్గు (హస్తముల) మూరల ప్రదేశమందు నలుచదరముగ నాల్గు ముఖాల వేదిక యేర్పరచి పదునారు మూరల విశాలమైన మండపము చతుర్ముఖముతో నేర్పరపవలెను.
వేదిక చుట్టు అరత్ని మాత్రములగు గర్తములు గంటలు తొమ్మిది యేడు అయిదు సూటియైన ముఖములతో వితస్తి జానెడు యోని ఆఱడంగుళముల విరివి గలదియు నేర్పరుప వలెను. మధ్య గంత మూడు పర్వము లెక్కువగానున్న మేఘములతో సమర్చవలెను. జెండాలతో నలువైపుల ఒకే రంగులోనున్న జెండాలుండవలెను. రావి, మేడి, జువ్వి, మఱ్ఱి కొమ్మల మండపము నలుదిక్కుల ద్వారా మేర్పరుప వలెను. ఆట నెనమండుగురు హోతల ద్వార పాహినమండుగురు ఎనమండుగురు జాపకలతో వేదపారంగుల నేర్పరుప వలెను. వారు సర్వ లక్షణ సంపన్నులు, మంత్ర విధులు, జితేంద్రియులు కులశీల సంపన్నులైన వారిని కూర్చుండబెట్టవలెను. ప్రతి గుంటయందు కలశలు యజ్ఞ సాధనములు, విసనకఱ్రలు రెండు ఆసనములు, సువిశాలమైన రాగిచెంబు నుంచవలెను. ప్రతి దేవతకు బలు లనేక రంగులలో నీయవలెను. ఆచార్యుడు అరత్ని మాత్రము పాలకొమ్మ యూపస్తంభము నిలుపవలెను. ఐశ్వర్యము కోరువాడు యజమాని యెత్తుగల యూపమైన నిలుపవలెను. ఇరువదియైదు మంది ఋత్విజులను గూర్చుండ బెట్టవలెను. సువర్ణాలంకృతములగు కంకణములు, కుండలములు, భుజకీర్తు కటభములు, ఉంగరాలు, పవిత్రములు, వివిధ వస్త్రములందరికి సమముగ ఆచార్యునకు రెట్టింపుగ నీయవలెను. బంగారు తాబేలు మొసలి వెండి చాప డుండుభము రాగిది, కుంభీరము కప్ప ఇనుపది శింశుమారకము ఈలా మొదటనే యివన్నియు సమకూర్చి తెల్లని మాలలు, వస్త్రములు గట్టుకొని తెల్లని గంధములు పూసికొని వేద పారగులు అన్ని మూలికల యుదకములచే స్నానము చేయగా యజమానుడు పత్నితో కొడుకులతో మనుషులతో గలిసి పడమటి ద్వారము నుండి యాగ మండపములోనికి ప్రవేశింపవలెను.
చతురశ్రం తు పరితో వృత్తం మద్యే సుశోభనం | వేద్యాశ్చోపరితః కృత్వా గ్రహాన్ లోకపతీంస్తతః || 23
సంన్య సేన్మంత్రతః సర్వాన్ర్పతి దిక్షువిచక్షణః | కలశం స్థాపయేన్మధ్యే వారుణం మంత్రమాతశ్రితమ్ || 24
బ్రహ్మాణం చ శివం విష్ణుం తత్రైవ స్థాపయేద్బుధః | వినాయకం చ విన్యస్య కమలామంబికాం తథా || 25
శాంత్యర్థం సర్వలోకానాం భూతగ్రామం న్యస్తేత్తతః | పుష్పభక్ష్యఫలైర్యుక్తమేవం కృత్వాధివాసనమ్ || 26
కుంభాంశ్చ రత్నగర్భాంస్తాన్వాసోభిః పరివేష్టయేత్ | పుష్పగంధై రలంకృత్య ద్వారపాలాన్సమంతతః || 27
యజద్ద్వమితి తాన్బ్రూయాదాచార్యమభిపూజయేత్ | బహ్వృచే పూర్వతః స్దాప్యౌ దక్షిణన యజుర్విదే || 28
సామాగౌ పశ్చిమే స్థాప్యా వుత్తరేణ అధర్వణ | ఉదజ్ముఖో దక్షిణతో యజమాన ఉపావిశేత్ || 29
యజధ్వమితి తాన్ర్బూయాద్వాజకాన్పునరేవ తాన్ | ఉత్కృష్టమంత్రజాప్యేస తిష్టధ్వమితి జాపకాన్ || 30
ఏవమాదిశ్య తాన్సర్వాన్సంధుక్ష్యాగ్నిం స మంత్రవిత్ | జుహుయాదాహుతీర్మంత్రైరాజ్యం చ సమిథస్తథా || 31
ఋత్విగ్భిశ్చైవ హోతవ్యం వారుణౖ రేవ సర్వతః | గ్రహేభ్యో విధివద్ధుత్వా తథేంద్రాయేశ్వరాయ చ || 32
మరుద్భ్యో లోకపాలేభ్యో విధివద్విశ్వకర్మణ | శాన్తిసూక్తం చ రౌద్రం చ పావమానం చ మంగలమ్ || 33
జపేచ్చ పౌరుషం సూక్తం పూర్వంతో బహ్వృచః పృథక్ |
శాక్రం రౌద్రం చ సౌమ్యం చ కూశ్మాండం జాతవేదసమ్ || 34
సౌరం సూక్తం జపేయుస్తే దక్షిణన యజుర్విదః | వైరాజం పౌరుషం సూక్తం సౌవర్ణం రుద్రసంహితమ్ || 35
శైవం పంచనిధనం గాయత్రం జ్యేష్టసామ చ | వామదేవ్యం బృహత్సామ రౌరవం చ రథంతరమ్ || 36
గవాం వ్రతం వికీర్ణం చ రక్షోఘ్నం చ యమం తథా | గాయేయుః సామగా రాజన్పశ్చి మద్వారమాశ్రితాః 37
ఆధర్వణాశ్చోత్తరతః శాంతికం పౌష్టికం తథా | జపేయుర్మనసా దేవమాశ్రితా వరుణం ప్రభుమ్ || 38
పూర్వేద్యురభితో రాత్రావేవం కృత్వాధివాసనం | గజాశ్వరథవల్మీకసంగమాద్ర్వజగోకులాత్ || 39
మృదమాదాయ కుంభేషు ప్రక్షిపేదోషధీస్తథా | రోచనాం చ ససిద్దార్దం గంధాన్గుగ్గులుమేవ చ || 40
స్నాపనం తస్య కర్తవ్యం పంచగవ్యసమన్వితం | పూర్వ కర్తుర్మహామంత్రైరేవం కృత్వా విదానతః || 41
అతివాహ్య క్షపామేవం విధియుక్తేన కర్మణా | తతః ప్రభాతే విమలే సంజాతే తు శతం గవామ్ || 42
బ్రాహ్మణభ్యః ప్రదాతవ్యమష్టషష్ట్యథవా పునః | పంచాశద్వాథ షట్రిశత్పంచవింశతి వా పునః || 43
తతశ్చావసర ప్రాప్నౌ శుద్దౌ లగ్నౌ సుశోభనౌ | వేదశ##బ్దైః సగంధర్వైర్వాద్యైశ్చ వివిధైః పునః | 44
కనకాలంకృతాం కృత్వా జలే గామవతారయేత్ | సామగాయ చ సా దేయా బ్రాహ్మణాయ విశాం పతే || 45
పాత్రీమాదాయ సౌవర్ణాం పంచరత్నసమన్వితామ్ | తతో నిక్షిప్య మకరాన్మత్స్యాదీంశ్చైవ సర్వశః | 46
ధృతాం చతుర్భిర్విపై#్రశ్చ వేదవేదాంగపారగైః | మహానదీజలోపేతాం దధ్యక్షతవిభూవిషితామ్ || 47
ఉత్తరాభిముఖాం న్యుబ్దాం జలమధ్యే తు కారయేత్ | అధర్వణన సుస్నాతాం పునర్మాయాం తథైవ చ || 48
ఆపోహిష్టేతి మంత్రేణ క్షిప్త్వాగత్య చ మండపం | పూజయిత్వా సదస్యాన్వై బలిం దద్యాత్సమంతతః || 49
పునర్దినాని హోతవ్యం చత్వారి రాజసత్తమ | చతుర్ధీకర్మ కర్తవ్యం దేయం తత్రాపి శక్తితః || 50
ఐదు రంగుల పిండితో మండలమేర్పరచవలెను. దానికి పదునారు అరలుగల చక్రము విజించి పద్మగర్భుని బ్రహ్మను నాల్గు ముఖములు గలవానిని నాల్గంగుళముల చుట్టు కొలతపై బ్రహ్మ విగ్రహమును తయారుచేసి వేదిక నడుమ నిలుప వలెను. నవ గ్రహములను లోకపాలురను మంత్ర పూర్వకముగ ప్రతిష్టింపవలెను. ఆ మధ్య వరుణ దేవతా మంత్ర పూర్వకముగ కలశ స్థాపన సేయవలెను. బ్రహ్మ, విష్ణు, శివులను ఆ పద్మము రేకులందు ప్రతిష్ఠింపవలెను. వినాయకుని, అంబికను, కమలెముపై లోక శాంతి నిమిత్తము నిలిపి పంచ భూతముల నుంచవలెను. పూలు, పండ్లు, భక్ష్యములతో నీలా అధివాసనము చేసి ఆపై యజించుడు (యాగము కావింపుడని) ఋత్విక్కులను గూర్చి పలికి ఆచార్యుని (పురోహితుని) పూజింపవలెను. తూర్పున ఋగ్వేదకుని దక్షిణమున ఋగ్వేద పదములు, సామవేదికులు, ఉత్తరమునం దధర్వణవేదికి ఇద్దరిద్దరిగ నిలుపవలెను. ఉత్తరాభి ముఖంగా యజమానుడు కూర్చుండవలెను. యజింపుడని మరల వారిని గూర్చి యజమాని పలుకవలెను. జాపకులను ఉత్కృష్ట మంత్ర జపములు సేయుడనవలెను. ఈలా వారిని ఆదేశించి అగ్నిని బ్రజ్వలింపజేసి నేయి సమిధలను హోమముచేసి ఆహుతిలీయవలెను. ఋత్విక్కులు వారుణ మంత్రనములతోనే యాజ్య హోమము సేయవలెను. విధి విహితముగ గ్రహములకు, నింద్రునికి ఈశ్వరునికి మరుత్తులకు లోక పాలురకు, విశ్వకర్మకు హోమములు సేసి శాంతి సూక్తము, రుద్ర సూక్తము, మంగళకరమగు పాపమానము, పురుష సూక్తము నను వీనిని తూర్పుదిశ బహ్వృచులు (ఋగ్వేదులు) జపింపవలెను. ఇంద్ర సూక్త రౌద్రము, సౌమ్యము, కౌశ్మాండము జాత వేదసము, సౌరసూక్తమును దక్షిణదిశ యజుర్వేదులు జపింప వలెను. వైరాజము, పౌరుషము, (పురుష సూక్తము) సౌవర్ణము రుద్రసంహిత, శైవము, పంచనిధనము, గాయత్రము; జ్యేష్ఠ సామ వామదేవ్యము, బృహత్సామ, రౌరవము, రథంతరము, గోవ్రతం వికీర్ణము, రక్షోఘ్నము, యమము నను సామలను సామవేదులు పశ్చిమ ద్వారమందు గానము సేయవలెను. ఉత్తర దిశయందు అధర్వణవేదులు శాంతి పౌష్టిక సూక్తములను జపింతురు. మనసు వరుణ ప్రభువుపై నుంచి వారు అధర్వణ మంత్రములను జపింపవలెను. ముందు రోజు రాత్రియే యిలా అధివాసనము గావించి గజ, అశ్వ, రథ సంస్పర్శ గల చోటి నుండి , పుట్టల నుండి, గొల్ల పల్లెల నుండి, గోకులము నుండి మన్ను తెచ్చి కడవలందుంచి, ఓషదుల నించి, గోరోచనం, ఆవాల పిండి, గంధములు, గుగ్గులు అను వానిచే పంచ గవ్యముతో కూడ వానికి స్వాపనము సేయవలెను. ముందు యీలా సేసి రాత్రినిలా గడపి తెల్లవారగనే బ్రాహ్మణులకు నూరు గోవులనీయవలెను. ఎనిమిది ఆఱు ఏబది ముప్పదియాఱు ఇరువదిగాని యీయవచ్చును. ఆవల శుభలగ్న మందు వేద శబ్దములతో సంగీతములతో మంగళవాద్యముతో బంగారు నగల నలంకరించి గోవును నీట నిలిపి సామవేదికాగోవు నీయవలెను. బంగారు పాత్ర పంచరత్నములతోడ చేకొని యందు మొసళ్ళను చేసలు మొదలయినవానినందునిచి నల్గురు విప్రులు వేదవేదాంగజ్ఞులు కలిసి యెత్తి పట్టుకొన్న దానిని మహానదుల జలము లభించినవానిని పెరుగు అక్షతలనలంకరించిన దానిని ఉత్తరాభిముఖముగా మునిగిపోకుండ జలమధ్యమందుంచి అధర్వణ మంత్రములచే జక్కగ స్నానముగావించి అపోహిష్ఠా అను మంత్రముచే మాయాశక్తి అధిష్టానమయిన దానిని నీటిమధ్యనుంచి తిరిగి మండపమునకువచ్చి సదస్యులను పూజించి పూర్తిగ బలినీయవలెను. తిరిగి దానములు హోమములు నాల్గు నిర్వర్తింపవలెను.
కృత్వా తు యజ్ఞపాత్రాణి యజ్ఞోపకరణానిన చ | ఋత్విగ్భ్యస్తు సమం దద్యాన్మండపం విభ##జేత్పునః || 51
హోమపాత్రీం చశయ్యాం చ విప్రాయ చ నివేదయేత్ | తతః సహస్రం విప్రాణామథవా೭ష్టశతం తథా || 52
భోజనీయం యథాశక్తి పంచాశద్వాథ వింశతిః ఏవమేష పురాణషు తటాకవిధిరుచ్యతే|| 53
కూపవాపీషు సర్వాసు తథా పుష్కరిణీషు చ | ఏష ఏవ విధిర్దృష్టః ప్రతిష్టాసు తథైవ చ || 54
మంత్రతస్తు విశేషః స్యాత్ర్పాసాదో ధ్యానభూమిషు | అయం త్వశక్తా వర్థేన విధిధృష్ట ః న్వయంభువా|| 55
స్వల్పే ష్వేకాగ్ని వత్కార్యో విత్తశాఠ్యవివర్జితైః | ప్రావృట్‌కాలే స్థితం తోయమగ్నిష్టోమసమం స్మృతమ్ || 56
శరత్కాలస్థితం యత్స్యాత్తదుక్తఫలదాయకం | వాజపేయాతిరాత్రాభ్యాం హేమంతే శిశిరే స్థితమ్ || 57
అశ్వమేధసమం ప్రాహుర్వసంతసమయే స్థతం | గ్రీష్మేపి యత్థ్సితం తోయం రాజసూయాద్విశిష్యతే || 58
ఏతాన్మహారాజ విశేషధర్మాన్కరోతి చోర్వ్యామతిశుద్దబుద్దిః |
స యాతి బ్రహ్మాలయమేవ శుద్దః కల్పాననేనాన్దివి మోదతే చ || 59
అనేకలోకాన్విచరన్స్వరాదీన్భుక్త్వా పరార్థద్వయమఙ్గనాభిః |
సహైవ విష్ణోః పరమం పదం యత్ర్పాప్నోతి తద్యోగబలేన భూయః || 60
ఇతి శ్రీపాద్మపురాణ ప్రథమే సృష్టిఖండే
తటాకప్రతిష్ఠావిధిర్నామ సప్తవింశోధ్యాయః
నాల్గవరోజు కర్తవ్యముగావించి అక్కడగూడ యథాశక్తి యజ్ఞపాత్రములు యజ్ఞ సాధనములను ఋత్విక్కులకు సరిగా పంచి యీయవలెను. మండపము బంగారు పాత్రలు శయ్యను విప్రునికీయవలెను. ఆపై వేయిమంది లేదా ఎనిమిదివందలమందికి, ఏబదిమంది, యిరువదిమందికైన భోజనము పెట్టవలెను. ఈలా తటాక ప్రతిష్ఠావిధి పురాణములందు తెలుపబడినది. నూతులు దిగుడు బావులు పుష్కరిణుల ప్రతిష్టావిధి యీలా కనిపించుచున్నది. ప్రాసాదములందు (రాజప్రాసాదములందు) ఉద్యానవనములందు మంత్రపూర్వకముగ జేయవలసినదిది. శక్తిలేనప్పుడు బ్రహ్మ ఏకాగ్ని విధానమట్టు తగ్గించి చేయవచ్చును. గాని లోభత్వము మాత్రము పనికిరాదు. వర్షకాలమందున్న నీరు అగ్నిష్టోమములాటిది. శరత్కాలమందు నీరు నాలాటి ఫలమునే యిచ్చును. వాజపేయాతిరాత్రములవంటి హేమంత శిశిరముల నున్న నీరట్టిది. గ్రీష్మమందున్న నీరు అశ్వమేధయాగ సమమందురు. అది రాజసూయ ఫలము మించినదందురు. దేశకాలపాత్రానుసారము శుద్దబుద్దితో జరుపు నాయాధర్మములనంతఫలములనిచ్చును. అలా చేసిన పుణ్యాత్ముడు బ్రహ్మలోకమేగి అనేక కల్పములిట నానందించును. స్వర్గాది పుణ్యలోకములెన్నో యంగనలతో ననుభవించి ధర్మపత్నులతో యోగబలమున విష్ణులోకమునందును.
ఇది తటాకప్రతిష్ఠ విధియను నిర్వదియేడవ అధ్యాయము.