Sri Padma Mahapuranam-I
Chapters
చతుస్త్రింశత్తమో೭ధ్యాయః -: బ్రహ్మాండదానమ్ :- భీష్మ ఉవాచ :- కస్మిన్కాలే భగవతా బ్రహ్మణా లోకకారిణా || యజ్ఞియైర్యష్టుమారబ్ధం తద్భవాన్వక్తుమర్హతి | కిం నామాన ఋత్విజఃబ్రాహ్మణాయ ప్రకల్పితాః | కా చ వై దక్షిణా తేషాం దత్తా తేన మహాత్మనా ||
2 యథాభూతం యథావృత్తం తథా త్వం మే ప్రకీర్తయ | సుమహత్కౌతుకం జాతం యజ్ఞం పైతామహం ప్రతి ||
3 పులస్త్య ఉవాచ :- పూర్వమేవ మయా೭ఖ్యాతం యదా స్వాయంభువో మనుః || సృష్ట్వా ప్రజాపతీన్సర్వానుక్తః సృష్టిం కురుష్వ వై |
4 స్వయం తు పుష్కరం గత్వా యజ్ఞస్యాహృత్య విస్తరం | ససంభారాన్సమానాప్య వహ్న్యగారే స్థితోభవత్ ||
5 గాయంతి నిత్యం గంధర్వా నృత్యంత్సప్సరసాం గణాః | బ్రహ్మోద్గాతా హోతాధ్వర్యుశ్చత్వారో యజ్ఞవాహకాః ||
6 ఏకైకస్య త్రయశ్చాన్యే పరివారాః స్వయంకృతాః | బ్రహ్మా చ బ్రాహ్మణా చ్ఛంసీ పోతా చాగ్నీధ్ర ఏవ చ ||
7 ఆన్వీక్షికీ సర్వవిద్యా బ్రాహ్మీ హ్యేషా చతుష్టయీ | ఉద్గాతా చ ప్రత్యుద్గాతా ప్రతిహర్తా సుబ్రహ్మణ్యః ||
8 చతుష్టయీ ద్వితీయైషా తూద్గాతుశ్చ ప్రకీర్తితా | హోతా చ మైత్రావరుణస్తధా೭చ్ఛావాక ఏవ చ || 9 గ్రావస్తుశ్చ చతుర్థోత్ర తృతీయా చ చతుష్టయీ | అధ్వర్యుశ్చ ప్రతిష్ఠాతా నేష్టోన్నేతా తధైవ చ ||
10 చతుష్టయీ చతుర్థ్యేషా ప్రోక్తా శంతనునందన | ఏతే వై షోడశ ప్రోక్తా ఋత్విజో వేదచింతకైః ||
11 ముప్పది నాలుగవ అధ్యాయము -: బ్రహ్మాండదానము :- భీష్ముడనియె. ఎప్పుడు బ్రహ్మ సృష్టికర్త యజ్ఞ సామగ్రితో యజ్ఞారంభము చేసెనది యానతిమ్ము. ఋత్విక్కుల పేరేమి? వారికిచ్చిన దక్షిణ యేమి? ఆ జరిగినదెల్ల వ్రశంసింపుము. ఎంతో కుతూహలము గల్గుచున్నది యన పులస్త్యుడనియె. ఇంతమున్నే స్వాయంభువ ప్రజాపతులను స్వాయంభువ మనువు సృష్టి సేయుమని సెప్పబడెను, బ్రహ్మ తాను పుష్కరమున కేగి యజ్ఞ సామాగ్రి సమకూర్చుకొని అగ్నిశాలలో గూర్చుండెను. గంధర్వులు పాడిరి. అప్సరసలాడిరి. బ్రహ్మ ఉద్గాత. హోత, అధ్వర్యుడు నల్వురు యజ్ఞ ప్రధాన నిర్వాహకులు ఒక్కొక్కరికి మఱి ముగ్గురు వంతున పరివారము నేర్పరచెను. బ్రహ్మ చ్చంసీ హోత ఆగ్నీధ్రుడు అన్విక్షకీ సర్వవిద్యా బ్రహ్మ అను నీ నల్వురు ఉద్గాత, ప్రత్యుద్గాత ప్రతిహర్త సుబ్రహ్మణ్యుడు నను నల్వురు. రెండవ పరివారము ఉద్గాతది. హోత మైత్రావరుణుడు అచ్చావాకుండు గ్రావస్తువు నను నల్వురు హోత్రమును మూడవది. నాల్గవది అదృశ్యుడు ప్రతిష్ఠాత నేష్ట ఉన్నేత నను నలుగురు నాల్గవ వర్గము. వీరు మొత్తము పదునారుగురు ఋత్విజులు.
11 శతాని త్రీణి షష్టిశ్చ యజ్ఞాః సృష్టాః స్వయంభువా | ఏతాంశ్చైతేషు సర్వేషు వ్రవదంతి సదా ద్విజాన్ ||
12 సదస్యం కేచిదిచ్ఛంతి త్రిసామాధ్వర్యుమేవ చ | బ్రహ్మాణం నారదం చక్రే బ్రాహ్మణాచ్ఛంసి గౌతమమ్ ||
13 దేవగర్భం చ పోతారమాగ్నీధ్రం చైవ దేవలం | ఉద్గాతాంగిరసః ప్రత్యుద్గాతా చ పులహస్తథా ||
14 నారాయణః ప్రతిహర్తా సుబ్రహ్మణ్యోత్రిరుచ్యతే | తస్మిన్యజ్ఞే భృగుర్హోతా వసిష్టోమైత్ర ఏవ చ ||
15 ఆచ్ఛావాకః క్రతుః ప్రోక్తో గ్రావస్తు చ్చ్యవనస్తథా | పులస్తోధ్వర్యురేవాసీత్ర్పతిష్ఠాతా చ వై శిబిః ||
16 బృహస్పతిస్తత్ర నేష్టా ఉన్నేతా శాంశపాయనః | ధర్మః సదస్యస్తత్రాసీత్సుత్రపౌత్రసహాయవాన్ || 17 భరద్వాజః శమీకశ్చ పురుకుత్సో యుగంధరః | ఏనకస్తీర్ణకశ్చైవ కేశః కుతప ఏవ చ || 18 గర్గో వేదశిరాశ్చైవ త్రిసామాధ్వర్యవః కృతాః | కణ్వాదయస్తథా చాన్యే మార్కండో గండిరేవ చ || 19 పుత్రపౌత్రసమేతాశ్చ సశిష్యాః సహ బాంధవాః | కర్మాణి తత్ర కుర్వాణా దివానిశమతంద్రితాః || 20 మన్వంతరే వ్యతీతే తు యజ్ఞస్యావభృథో`òభవత్ | దక్షిణా బ్రహ్మణ దత్తా ప్రాచీ హోతుస్తు దక్షిణా || 21 స్వయంభువు బ్రహ్మ మొత్తము మూడువందల యరువై యజ్ఞములను సృష్టించెను. ఇందే ఋత్విక్కులు, బ్రాహ్మణులు పేర్కొనబడిరి. ఒకరిందు త్రిసామాధ్వర్యుని సదస్యునిగ బ్రహ్మముగ నారదుని గౌతముని బ్రాహ్మణంచ్చంసిగ దేవగర్భుని హోతగ, దేవలుని ఆగ్నీధుడుగ, అంగీరసుని ఉద్గాతగ పులహుడు ఉద్గాతగ నారాయణుడు ప్రతిహర్తగ అత్రి సుబ్రహ్మణ్యుడుగ నుండిరి, భృగువు హోత, మైత్రుడు వశిష్ఠుడు, అచ్చావాకుడు క్రతువు, గ్రావుడు చ్చవనుడు, పులస్త్యు డధ్వర్యుడు, శిబి ప్రతిష్ఠాతగ, బృహస్పతి నేష్టశాంశపాయనుడు ఉన్నేత పుత్రపౌత్రులతో ధర్ముడు సదస్యుడయ్యెను. భరద్వాజులు మొదలు వేద శిర్ససుదాకా పదిమంది యధ్వర్యుదైత్యాదులు మార్కండుడు గండియు పుత్రపౌత్రులతో శిష్యులతో బంధువులతో నతి రేయింబవళ్ళు యజ్ఞకర్మ నిర్వర్తించు వారైరి. మన్వంతరము చివర యజ్ఞమున కవబృధమైనది. బ్రహ్మకు దక్షిణ తూర్పు దిక్కు. హోతకు దక్షిణ దిశ అధ్వర్యునకు పడమటి దిశ, ఉద్గాతున కుత్తర దిశ దక్షిణ యాయబడెను. మొత్తము మూడు లోకములను దక్షిణగ వారికి బ్రహ్మ యిచ్చెను. 22 అధ్వర్యవే ప్రతీచీ తు ఉద్గాతుశ్చోత్తరా తథా | త్రైలోక్యం సకలం బ్రహ్మా దదౌ తేషాం తు దక్షిణామ్ || 22 ధేనూనాం చ శతం ప్రాజ్ఞె ర్దాతవ్యం యజ్ఞసిద్ధయే | అష్టౌ తు యజ్ఞవాహనాం చత్వారింశాధికాస్తథా || 23 ద్వితీయస్థానినాం చైవ చతుర్వింశత్ప్రకీర్తితాః | షోడశైవ తృతీయానాం దేయా వై ధేనవః శుభాః || 24 ద్వాదశైవ తథా చాన్యా ఆగ్నీధ్రాదిషు దాపయేత్ | అనయా సంఖ్యయా చైవ గ్రామాన్దాసీరజావికమ్ || 25 సహస్రభోజ్యం దాతవ్యం స్నాత్నా చావభృథే క్రతౌ | యుజమానేన సర్వస్వం దేయం స్వాయంభువోబ్రవీత్ || 26 అధ్వర్యూణాం సదస్యానాం స్వేచ్ఛయా దానమిష్యతే | విష్ణుం చాహూయ వై బ్రహ్మా వాక్యమాహ ముదాన్వితః || 27 యజ్ఞ సిద్ధికి నూఱు ధేనువుల నీయవలసి యున్నది. అందు నలుబది యెనిమిది మొదటి స్థానమువారికి, ఇఱువది నాల్గు గోవులను రెండవ స్థానము వారికి, మూడవ స్థానమందు పదునాఱు, ఆగ్నీద్రాదులకు పదునాఱు ఈ లెక్కలోనే గ్రామములు, దాసీలను అజావికము దక్షిణ యీయబడెను. సహస్ర సమారాధన సేయవలెను. అవబృథస్నానము సేసి యజమానుడు తన సర్వస్వమును, సర్వ ధనమును ఈయవలెనని స్వాయంభువు సెప్పినారు. అధ్వర్యులకు సదస్యులకు స్వేచ్ఛగా తన యిష్టానుసార మీయవలెను. అప్పుడు బ్రహ్మ విష్ణువుం బిలిచి యానందముతో నిట్లనియె. 27 అభిప్రసాద్య సావిత్రీం త్వమిహానయ సువ్రత | త్వయి దృష్టే న సా కోపం కరిష్యతి శుభాననా || 28 స్నిగ్ధైః సానునయైర్వాక్యైర్హేతుయుక్తైర్విశేషతః | త్వం సదా మధురాభాషీ జిహ్వా తే స్రవతే7మృతమ్ || 29 యః కరోతి న తే వాక్యం త్రైలోక్యే న స దృశ్యతే | గంధర్వైః సహితో గత్వా ప్రియాం మమ సమానయ || 30 త్వయా ప్రసాదితా సాధ్వీ తుష్టా సా త్వేష్యతి ధృవం | విలంబో న త్వయా కార్యో వ్రజ మాధవ మా చిరమ్ || 31 లక్ష్మీస్తే పురతో యాతు సావిత్ర్యాః సదనం శుభా | తస్యాస్త్వం పదవీం గచ్ఛ సాంత్వయస్య ప్రియాం మమ || 32 న చ తే విప్రియం దేవి వివిక్తం కర్తుమీహతే | ముఖం ప్రేక్ష్య సదా కాలం వర్తతే తవ సుందరీ || 33 ఏవం విధాని వాక్యాని మధురాణి బహూని చ | దేవీ శ్రావయితవ్యా సా యథా తుష్టా7చిరాద్భవేత్ || 34 ఓ వ్రత సంపన్నా ! సావిత్రిని బ్రతిమాలి నీ నిటకు తీసికొనిరా! ఆ శుభానన నీవు కనబడినచో కోపము చూపదు. స్నేహభరితములు, హేతుయుక్తములగు, మంచి మాటలే నీవెప్పుడు మధురముగా మాటలాడుదువు. నీ నాలుక యమృతముంజిందును. నీవన్న మాట సేయనివాడు ముల్లోకముల నొక్కడుం గనబడడు. గంధర్వులతో వెళ్ళి నా ప్రియసతిం దీసికొనిరా. తడవు సేయకు మాధవా వెళ్ళు వెంటనే. కల్యాణి లక్ష్మీదేవి సావిత్రి సదనమునకు నీ ముందు నడువవలెను ఆమె దారిన నీవు జనుము. మా ఆవిడను బ్రతిమాలుము. దేవి నీకప్రియము దనకుదా నొక్కతే నిష్టపడదు. సుందరి యెపుడు నీ మోమునే చూచుచుండునని ఈలాంటి మధుర బాషణము లన్నో వినిపించి మా ఆవిడ సంతోషభరితురాలగునట్లు సేయుము. 34 ఏవముక్తస్తదా విష్ణుర్బ్రహ్మణా లోకకారిణా | జగామ త్వరితో భూత్వా సావిత్రీ యత్ర తిష్ఠతి || 35 దూరారేవాగచ్ఛమానం పత్న్యా సహ చ కేశవం | ఉత్తస్థౌ సత్వరా భూత్వా విష్ణునా చాభివందితా || 36 నమస్తే దేవదేవేశి బ్రహ్మపత్ని నమోస్తు తే | త్వాం నమస్కృత్య సర్వో హి జనః పాపాత్ప్రముచ్యతే || 37 పతివ్రతా మహాభాగా బ్రహ్మణత్వం హృది స్థితా | అహర్నిశం చింతయంస్త్వాం ప్రసాదం తేభికాంక్షతి || 38 సుఖీం చైనాం ప్రియాం పృచ్ఛ లక్ష్మీం భృగుసుతాం సతీం | యది చ శ్రద్ధానాం స వాక్యాదస్మాత్సులోచనే || 39 ఏవముక్త్వా తతః శౌరిః సావిత్ర్యాశ్చరణద్వయం | ఉభాభ్యాం చైవ హస్తాభ్యాం క్షమ దేవి నమోస్తుతే || 40 బ్రహ్మ యిట్లు పలుక విష్ణువు సావిత్రియున్న తావునకు సత్వరమేగెను. పత్నితో గూడ వచ్చుచున్న విష్ణువుం జూచి తొందరతో లేచి నిలువబడ్డ సావిత్రిం జూచి విష్ణువు నమస్కరించెను. దేవదేవేశి! బ్రహ్మపత్ని నీకిదే నమస్కారము. నీకు మ్రొక్కి సర్వ ప్రజ పాపము నుండి విడవడును. పతివ్రత మహానుభావవు. బ్రహ్మ హృదయమందున్న దానవు. రేయిం బవలు నిన్నే తలచి కొనుచు నీ ప్రసాదముం గోరుచున్నాడు. భృగుకుమారి యిదిగో యీ సాధ్వి లక్ష్మి నడుగుము. అని యిటు పలికి శౌరి సావిత్రి రెండు పాదములను రెండు చేతులం బట్టి నమస్కరించెను. 40 జగద్వంద్యే జగన్మాతరితిస్పృష్ట్వా 7భ్యవన్దత | సంకోచ్య పాదౌ సా దేవీ స్వకరేణ కరౌ హరేః || 41 గృహీత్వోవాచ తం విష్ణుం సర్వం క్షాన్తం మయాచ్యుత | ఇయం లక్ష్మీః సదా వత్స హృదయే తే నివత్స్యతి|| 42 వినా త్వయా న చాన్యత్ర రతిం యాస్యతి కర్హిచిత్ | భ్పగోః పత్న్యాం సముత్పన్నా పత్న్యేషా తవ సువ్రతా || 43 దేవదానవయత్నేన సంభూతా చోదధేః పునః | భగవాన్యత్ర తత్రైషా అవతారం చ కుర్వతీ || 44 దేవత్వే దేవదేహా వై మానుషత్వే చ మానుషీ | తత్సహాయా స సందేహో దాంపత్యవ్రతినీ చిరమ్ || 45 సర్వజగద్వంద్యుడు జగన్మాతనిట్లు తాకి నమస్కరించెను. ఆ దేవి పాదముల ముడుచుకొని తనచేత హరి చేతులం బట్టుకొని అచ్యుతా! నేను అన్ని విధాల శాంతనై యున్నాను. ఈ లక్ష్మి నాయన్నా ఎల్లప్పుడు నీ హృదయమందు నివసించును. నిన్నొదలి మరి యెందెన్న డుపేక్ష గొనదు. నీ పత్ని యీమె. యుత్తమ వ్రత సంపన్న భృగుపత్ని కుదయించినది. దేవదానవుల పూనికచే పాలసముద్రమున నుదయించినది. భగవంతుడు హరియై అవతరించునట నీమె యవతరించును. దేవత్వమందీమె దేవశరీరిణి. మానుషత్వమందు మానుషి, నీ తోడనయను వర్తించును. దాంపత్య వ్రతశీలిని యెల్లప్పుడు. నేవిపుడు చేయవలసినదేమో ప్రభూ! తెలుపుమన విష్ణుడనియె. 45 యన్మయా చాత్ర కర్తవ్యం ప్రభో తన్మాం వదస్వ వై | విష్ణు రువాచ :- యజ్ఞావసానం సంజాతం ప్రేషితోహం తవాంతికమ్ || 46 సావిత్రీమానయ క్షిప్రం మయా స్నానం సమాచరేత్ | ఆగచ్ఛ త్వరితా దేవి యాహి తత్ర ముదాన్వితా || 47 పశ్య స్వస్య పతిం మత్వా దేవైః సర్వైస్సమన్వితం | లక్ష్మీ రువాచ :- ఆర్య ఉత్తిష్ఠ శీఘ్రం త్వం యాహి యత్ర పితామహః || 48 వినా త్వయా న యాస్యామి స్పృష్టౌ పాదౌ మయా తవ | ఉత్థాప్య సాగ్రహీద్ధస్తం దక్షిణా దక్షిణ కరే || 49 యజ్ఞము ముగియుచున్నది. నీ సన్నిధికంప బడితిని. సావిత్రిం ద్వరగ తీసికొని రమ్ము, త్వరగా వెళ్ళు, దేవత లందరితో కూడిన బ్రహ్మను చేరుము. లక్ష్మి యనియె. వేగముగ లెమ్మిపుడు. నీ బ్రహ్మదరి కేగుటకు సావిత్రీ నీవు లేకుండా నేను వెళ్ళను. నీ పాదములు తాకి చెప్పుచున్నాను. అని యామెను చేయివేసి నిలువబెట్టెను. 49 చిరాయమాణాం సావిత్రీం జ్ఞాత్వా దేవః పితామహః | సమీపస్థం మహాదేవమిదమాహ తదా వచః || 50 గచ్ఛ త్వమనయా సార్థం పార్వత్యా೭సురదూషణ | గౌరీ త్వదగ్రతో యాతు పశ్చాత్త్వం గచ్ఛ శంకర || 51 ప్రతిబోధ్యానయ యథా శీఘ్రమాయాతి తత్కురు | ఏవముక్తౌ తదా తౌ తు పార్వతీపరమేశ్వరౌ || 52 పట్టుకొని లేపి నిలువపెట్టి సావిత్రి యాలస్యము సేయుచున్నదని తెలిసి బ్రహ్మ దగ్గరనున్న శంకరుని కిట్లనియె. ఈ పార్వతితో నీవు ముందేగుము. గౌరి నీ ముందు వెళ్ళవలెను. తరువాత నీవు వెళ్ళుము శంకరా! ఆమె వచ్చునట్లు తెలియజెప్పి శీఘ్రముగా వచ్చునట్లు సేయము. అని పలుక పార్వతీ పరమేశ్వరులు పుణ్యదంపతులటకేగి బ్రహ్మ ప్రియ వల్లభ నిట్లనిరి. 52 గత్వాదిష్టౌ దంపతీ తాం ప్రోచతుః బ్రహ్మణః ప్రియాం | బృహత్కృత్యం త్వయా తత్ కరణీయం పతివ్రతే || 53 పృచ్ఛస్వేమాం వరారోహాం గౌరీం పర్వతనందినీం | లక్ష్మీం చైతాం విశాలాక్షీమింద్రాణీం వా శుభాననే || 54 యాసాం వా శ్రద్ధధాసి త్వం పృచ్ఛ దేవి నమోస్తు తే | ఆశీర్వాదస్తయా దత్తో దేవదేవస్య శూలినః || 55 శరీరార్ధే చ తే గౌరీ సదా స్థాస్యతి శంకర | అనయా శోభ##సే దేవ త్వయా త్రైలోక్యసుందర || 56 సుఖభాగి జగత్సర్వం త్వయా నాధేన శత్రుహన్ | ఏవం బ్రువంతీ సావిత్రీ గృహీతా బ్రహ్మణః ప్రియః || 57 గౌర్యా చ వామహస్తే తు లక్ష్మ్యా వై దక్షిణ కరే | అభివంద్య తు తాం దేవీం శంకరో వాక్యమబ్రవీత్ || 58 చాలా పెద్దపని నీ వట కావింపవలసి యున్నది. సాధ్వి! గిరికన్య నీగౌరి నడుగుము. విశాలాక్షి నీలక్ష్మిని, ఇంద్రాణిని శచీదేవి నడుగుము. ఎవరియందు నీ విశ్వాసమో వారి నడుగుము. దేవీ! నమస్కారమున దేవదేవునికామె దీవనలిచ్చెను. నీ సగము మేన గౌరి యెప్పుడు నుండును గావుత! త్రైలోక్య సుందరుడవే సుందరిచే సదా శోభిల్లుచుందువు. శత్రుసంహారా! నీచె జగమెల్ల సుఖభాగియై యున్నది. అని యీ పలుకు సావిత్రిం జేకొని గౌరి యెడమచేయి లక్ష్మి కుడిచేయి చేకొన నామెకు శంకరుడభివాదము సేసి యిట్లనియె. 58 ఏహ్యాగచ్ఛ మహాభాగే యత్ర తిష్ఠతి తే పతిః | తత్ర గచ్ఛ వరారోహే స్త్రీణాం భర్తా పరా గతిః || 59 బృహదాగ్రహణ దేవి ప్రణయాద్గంతుమర్హసి | లక్ష్మీశ్చైషా పార్వతీ చ స్థితా దేవి తవాగ్రతః || 60 ఏతయోర్వచసా దేవి ఆవయోశ్చ శుభాననే | మానభంగో న తే కర్తుం యుజ్యుతే బ్రహ్మణః ప్రియే || 61 అస్మదభ్యర్థితా దేవి తత్ర యాహి ముదాన్వితా | గౌర్యువాచ :- అహం చ తే ప్రియా దేవి సర్వదా వదసి స్వయమ్ || 62 లక్ష్మీశ్చ తే కరే లగ్నా దక్షిణ చ మయా ధృతా | ఏహ్యాగచ్ఛ మహాభాగే యత్ర తిష్ఠతి తే పతిః || 63 నీతా సా తు తదా తాభ్యాం దేవీ సా మధ్యతః కృతా | పురస్సరౌ విష్ణురుద్రౌ శక్రాద్యాశ్చ తథా సురాః || 64 గంధర్వప్సరసశ్చైవ త్రైలోక్యం సచరాచరమ్ | తత్రాయాతా చ సా దేవీ సావిత్రీ బ్రహ్మణః ప్రియా || 65 రా రమ్ము మహానుభావురాల! నీ భర్త వున్న తావునకు రమ్ము! స్త్రీలకు భర్తయే పరమగతి. పెద్ద ఆగ్రహమందను రాగము గొని దనుట మంచిది. ఎవ్వరి ననుమాన పరుపరాదు. మేము ప్రార్థించుచున్నామట కానందముతో జనుమన గౌరి యిట్లనియె. నీకెంతేని గూర్చుదానము. నీవును స్వయముగా వినుచున్నావు. నీ కుడిచేత లక్ష్మి లగ్నయై యున్నది. నేను నీ యెడమచేయి చేపట్టితిని. నీ స్వామి యున్న చోటికి రారమ్ము అన లక్ష్మీ పార్వతులిద్దరి మధ్య నిలిచి సావిత్రి బయలుదేరెను. విష్ణు రుద్రులు ముందు నడచిరి. ఇంద్రాది దేవతలు గంధర్వు లప్సరసలు చరాచరము త్రైలోక్యము నటు ముందుకు సాగిరి. బ్రహ్మప్రియ సావిత్రి దేవి యటకుం వచ్చెను. సావిత్రీం సుముఖీం దృష్ట్వా సర్వలోకపితామహః | గాయత్ర్యా సహితో బ్రహ్మా ఇదం వచనమబ్రవీత్ || 66 ఏషా దేవీ కర్మకరీ అహం తే వశగస్థితః | సమాదిశ వరారోహే యత్తే కార్యం మయా త్విహ || 67 ఏవముక్తా చ సా దేవీ స్వయం దేవేన బ్రహ్మణా | త్రపయాధోముఖీ దేవీ న చ కించిదవోచత || 68 పాదయోః పతితా దేవీ గాయత్రీ బ్రహ్మచోదితా | కృతవత్యపరాధం తే క్షమ దేవ సమోస్తు తే || 69 ఆలింగ్య సాదరం కంఠే సా పరిష్వజ్య పీడితాం | గాయత్రీం సాంత్వయామాస మాన్యశ్చైష పతిర్మమ || 70 కర్తవ్యం వచనం తస్య స్త్రీణాం ప్రాణశ్వరః పతిః | ఉక్తం భగవతీ పూర్వం సృష్టికాలే విరించిణా || 71 న చ స్త్రీణాం పృథగ్యజ్ఞో న వ్రతం నాప్యుపోషణం | భర్తా యద్వదతే వాక్యం తత్తు కుర్యాదకుత్సయా || 72 భర్తృనిందాం యా కురుతే స్వసృనిందాం తథైవ చ | పరివాదం ప్రలాపం వా నరకం సా తు గచ్ఛతి || 73 పత్యే జీవతి యా నారీ ఉపనాసవ్రతం చరేత్ | ఆయుష్యం హరతే భర్తుర్మృతా నరకమిచ్ఛతి || 74 ఏవం జ్ఞాత్వా త్వయా భర్తుర్న కార్యం విప్రియం సతి | న చాస్య దక్షిణం త్వంగం త్వయా సేవ్యం కథంచన || 75 సర్వకార్వే త్వహం చాస్య దక్షిణం పక్షమాశ్రితా | సవ్యం త్వమాశ్రయే స్సాధ్వి పార్శ్వే నారద పుష్కరే || 76 బ్రహ్మాస్థానాని చాన్యాని స్థితాన్యాయతనాని చ | లభే వై శోభమానేహ యావత్సృష్టిః ప్రజాయతే || 77 భవత్యా చ మయా చైవ స్థాతవ్యం చ న సంశయః | పుష్కరే బ్రహ్మణః పార్శ్వే వామం చ త్వం సమాశ్రయ || 78 సుముఖి నట వచ్చిన సర్వలోక పితామహుడు గాయత్రితో గూడ సావిత్రిం జూచి యిట్లనియె, ఈ దేవి గాయత్రి నీ సెప్పిన నని చక్కబెట్టును. నేను నీ వశుడను నే జేయవలసిన దానతిమ్మని బ్రహ్మ వినయముగ పలుక సిగ్గున మోము వంచుకొని యించుకేని పలుకదయ్యెను. బ్రహ్మ ప్రేరణ గాయత్రి యామె పాదములపై బడి అపరాధము సేసితి క్షమింపు దేవి! నమస్కారము నీకు అనెను. సావిత్రి యాదరముతో మెడవట్టి కౌగలించుకొని యేదో బాధతో నున్నట్లున్న గాయత్రిదేవిని సాంత్వన పరిచి (మంచి మాటలాడి) ఈయన మావారు గౌరవింపవలసినవారు. ఆయన మాట చేయవలసినదే స్త్రీలకు ప్రాణశ్వరుడు గదా భగవంతుడు. బ్రహ్మ సృష్టి సమయమున మున్నన్నారు. స్త్రీలకు వేరు యజ్ఞము లేదు. వ్రతము లేదు. ఉపవాసము లేదు. స్వామి యేమన్ననది కాదనక చేయవలెను. భర్తను నిందించినను, తోబుట్టువును నిందించినను (ఆడపడచును) పరివాదము సేసినా ప్రలాపము (హద్దు మీరి మాటలాడినను) నామె నరకమున కేగును. భర్త జీవించియుండగా నుపవాస వ్రతము సేసిన స్త్రీ భర్త యాయుర్ధాయమును హరించును. నరకమునకేగును. ఇది తెలిసి సాధ్వి! నీవు భర్త కప్రియము సేయరాదు. ఎప్పుడు నీవీయన కుడివైపున నిలువరాదు. ఎల్ల పనుల నే నీయన కుడివైపున నిలుతును. సాధ్వి నీ వెడమవైపున నుండుము. నారదుడు పుష్కరుడు యిరువంకల నుందురు. ఇంక బ్రహ్మ స్థానములు ఆయతనములు (గృహములు) వేరే యున్నవి. సృష్టియగు చున్నంత కాలము శోభిల్లుచున్నవి పొందెదవు. నీవు నేనును నట నుండవలసినదే. సందియము లేదు. పుష్రరమందు బ్రహ్మ యెడమవైపు నీ వుండుము. నా యిచ్చిన ఈ యువ దేశముదే నాతో గూడ సుఖముగ నుండుము. అనేన చోపదేశోన సుఖం తిష్ఠ మయాన్వితా | గాయత్ర్యువాచ :- ఏవమేతత్కరిష్యామి తవ నిర్దేశకారికా || 79 తవైవాజ్ఞా మయా కార్యా త్వం మే ప్రాణసమా సఖీ | అహం తే త్వనుజా దేవి సదా మాం పాతుమర్హసి || 80 దేవదేవస్తదా బ్రహ్మా పుష్కరే విష్ణునా సహ | స్నానావసానే దేవానాం సర్వేషాం ప్రదదౌ వరాన్ || 81 దేవానాం చ పతిం శక్రం జ్యోతిషాం చ దివాకరం | నక్షత్రాణాం తథా సోమం రసానాం వరుణం తథా || 82 ప్రజాపతీనాం దక్షం చ నదీనాం చైవ సాగరం | కుబేరం చ ధనాధ్యక్షం తథా చక్రే చ రక్షసామ్ || 83 భూతానాం చైవ సర్వేషాం గణనాం చ పినాకినం | మానవానాం మనుం చైవ పక్షిణాం గరుడం తథా || 84 ఋషీణాం చ వసిష్ఠం చ గ్రహాణాం చ ప్రభాకరం | ఏవమాదీని వై దత్వా దేవదేవః పితామహః || 85 అపుడు గాయత్రి యిట్లనియె. నీ నిర్దేశమిట్లు సేసెదను. నీ యాజ్ఞ సేయవలసినదే. నీవు నా ప్రాణ సఖివి. నేనో చెల్లెలను నన్నెపుడు రక్షింప దగుదువు. పుష్కరమందు దేవదేవుడు బ్రహ్మ స్నానము సేసి యెల్ల వేల్పులకు వరములిచ్చెను. దేవతల ప్రభువుగా శక్రుని, జ్యోతిస్సులకు దివాకరుని, నక్షత్రములకు సోముని (చంద్రుని), రసములకు వరుణుని, ప్రజాపతులకు దక్షుని, నదులకు సాగరుని, ధనాధ్యక్షునిగ కుబేరుని, రాక్షనులకు భూతములకు సర్వ గణములకు పినాకిని (శివుని), మానవులకు మనువును, పక్షులకు గరుడుని, ఋషులకు వశిష్ఠుని, గృహములకు ప్రభాకరుని ఈ మొదలుగ వారి వారికి ప్రభుత్వమొసగి విష్ణువును, శంకరుని గూర్చి యాదరముతో బ్రహ్మ యిట్లనియె. 85 విష్ణుం చ శంకరం చైవ బ్రహ్మా ప్రోవాచ సాదరం | పృథివ్యాః సర్వతీర్థేషు భవంతౌ పూజ్యసత్తమౌ || 86 భవద్భ్యాం న వినా తీర్థం పుణ్యతామేతి కర్హిచిత్ | లింగం వా ప్రతిమావాపి దృశ్యతే యత్ర కుత్రచిత్ || 87 తత్తీర్ధం పుణ్యతాం యాతి సర్వమేవ ఫలప్రదం | మానవా హ్యుపహారైశ్చ యే కరిష్యంతి పూజనమ్ || 88 యుష్మాకం మాం పురస్స్కృత్య తేషాం రోగభయం కుతః | యేషు రాష్ట్రేషు యుష్మాకముత్సవాః పూజనాదికాః || 89 తామిద్దరు పృథ్వి యందన్ని తీర్థములందును పూజనీయులు. తామిర్వురు లేని తీర్థమెందును పుణ్యత్వమునందదు. లింగము గాని ప్రతిమ గాని యెట కనిపించినను మానవులు లుపహారములతో నన్ను పురస్కరించి పూజ సేయుదురో వారికి రోగ భయమెట్లుండును? ఏ రాష్ట్రములందు మీకు ఉత్సవములు పూజలు మొదలైనవన్ని జరుగునో నట్టి ఫలమాలింపుము. ప్రవర్త్స్యంతీ క్రియాః సర్వా యత్ఫలం తేషు తచ్ఛ్రుణు | నాధయో వ్యాధయశ్చైవ నోపసర్గా న క్షుద్భయమ్ || 90 విప్రయోగో న చాపీష్టైరనిష్టైర్నాపి సంగతిః | నాక్షిరోగః శిరార్తిర్వా పిత్తశీలభగందరాః || 91 నాభిచారం భయం తత్రాపస్మారో న విషూచికా | వృద్ధిర్ని కామత స్తస్మిన్సమృద్ధిరనుత్తమా || 92 ఆరోగ్యం సర్వతశ్చైవ దీర్ఘాయుశ్చ ప్రజాధనం | నాకాలే భవితా మృత్యుః గావో నాల్పపయోముచః || 93 నాకాలఫలితా వృక్షా నోత్పాతభయమణ్వపి | ఏతచ్ఛ్రుత్వా తతో విష్ణుర్ర్బహ్మాణం స్తోతుముద్యతః || 94 -: త్రిమూర్తి పూజా ప్రభావము :- వ్యాధులు, మనోవ్యాధులు, ఇబ్బందులు, ఆకలి భయాలు, ఇష్ట (బంధు) వియోగము, అనిష్ట (శత్రు) సంయోగము, కంటిజబ్బు, నరాల జబ్బు, పిత్త, శూల భగందరాది వ్యాధులు, అభిచారము (చేతబడి), భయము, అపస్మారము (మూర్చ) నిషూచి, ఇవన్నీ పోయి సర్వ విధాల ఆరోగ్యము, దీర్ఘాయువు, ప్రజాధన సమృద్ధి కల్గును. అకాల మృత్యువుండదు. గోవులు సమృద్ధిగ పాలిచ్చును. వృక్షములు సకాలమున ఫలించును. ఉత్పాత భయమణమాత్రము నుండదు. ఇది విని యాపై బ్రహ్మను స్తుతింప బూనెను. -: విష్ణుకృత బ్రహ్మాస్తుతి :- విష్ణురువాచ :- నమోస్త్వనంతాయ విశుద్ధచేతసే స్వరూపరూపాయ సహస్రబాహవే | నహస్రరశ్మిప్రభవాయ వేధసే విశాలదేహాయ విశుద్ధకర్మణ || 95 సమస్తవిశ్వార్తిహరాయ శంభ##వే సమస్తసూర్యానలతిగ్మ తేజసే | నమోస్తు విద్యావితతాయ చక్రిణ సమస్తధీస్థానకృతే సదా నమః || 96 అనాదిదేవాచ్యుత శేఖర ప్రభో భావ్యుద్భవద్భూతపతే మహేశ్వర | మహత్పతే సర్వపతే జగత్పతే భువస్పతే భువనపతే సదా నమః || 97 యజ్ఞేశ నారాయణ జిష్ణు శంకర క్షితీశ విశ్వేశ్వర విశ్వలోచన | శశాంక సూర్యాచ్యుత వీరవిశ్వప్రవృత్త మూర్తే೭మృతమూర్త అవ్యయ || 98 జ్వలద్ధుతాశార్చి నిరుద్ధ మండలప్రదేశ నారాయణ విశ్వతోముఖ | సమస్తదేవా ర్తిహరామృతావ్యయ ప్రపాహి మాం శరణాగతం తథా విభో || 99 వక్త్రాణ్యనేకాని విభో తవాహం పశ్యామి యజ్ఞస్య గతిం పురాణం | బ్రహ్మాణమీశం జగతాం ప్రసూతిం నమోస్తు తుభ్యం ప్రపితామహాయ || 100 సంసారచక్రక్రమణౖ రనేకైః క్వచిద్భవాన్దేవ వరాధిదేవః | తత్సర్వవిజ్ఞానవిశుద్ధసత్వైరుపాస్యసే కిం ప్రణమామ్యహం త్వామ్ || 101 ఏవం భవంతం ప్రకృతేః పురస్తాద్యో వేత్యసౌ సర్వ విదాం వరిష్టః | గుణాన్వితేషు ప్రసభం వివేద్యో విశాలమూర్తిస్త్విహ సూక్ష్మరూపః || 102 వాక్పాణిపాదైర్విగతేన్ద్రియోపి కథం భవాన్వై సుగతిస్సుకర్మా | సంసారబంధో నిహితేంద్రియోపి పునః కథం దేవవరోసి వేద్యః || 103 మూర్తాదమూర్తం న తు లభ్యతే పరం పరం వపుర్దేవవిశుద్ధభావైః | సంసారవిచ్ఛిత్తికరైర్యజద్భిరతో వసీయేత చతుర్ముఖత్వమ్ || 104 పరం న జానంతి యతో వపుస్తే దేవాదయోప్యద్భుతరూపధారిన్ | విభోవతారేగ్రతరం పురాణమారాధయేద్యత్క మలాసనస్థమ్ || 105 న తే తత్త్వం విశ్వసృజోపి యోనిమేకం తతో వేత్తి విశుద్ధభావః | పరం త్వహం వేద్మి కథం పురాణం భవంతమాద్యం తపసా విశుద్ధమ్ || 106 పద్మాసనో వై జనకఃప్రసిద్ధ ఏవం ప్రసిద్ధి ర్హ్యసకృత్‌పురాణాత్ | సంచింత్యతే నాథ విభుం భవంతం జానాతి నైవం తపసా విహీనః || 107 అస్మాదృశైశ్చ ప్రవరైర్తిబోధ్యం త్వాం దేవ మూర్ఖాః స్వమతిం విభజ్య | ప్రబోద్ధుమిచ్ఛన్తి న తేషు బుద్ధిరుదారకీ ర్తిష్వపి వేదహీనాః || 108 జన్మాంతరై ర్వేదవివేకబుద్ధిభిర్భవేద్యథా వా యది వా ప్రకాశః | తల్లాభలుబ్ధస్య న మానుషత్వం న దేవగంధర్వపతిః శివః స్యాత్ || 109 న విష్ణురూపో భగవాన్సుసూక్ష్మః స్థూలోసి దేవః కృతకృత్యతాయాః | స్థూలోపి సూక్ష్మః సులభోసి దేవ త్వద్బాహ్యకృత్యా నరకే పతంతి || 110 విముచ్యతే వా భవతి స్థితేస్మిన్దస్రేన్దువహ్న్యర్కమరున్మహీభిః | తత్వైః స్వరూపైః సమరూపధారిభిరాత్మస్వరూ పేవితతస్వభావః ||111 ఇతి స్తుతిం మే భగవన్హ్యనంత జుషస్వ భక్తస్య వివేషతశ్చ | సమాధియుక్తస్య విశుద్ధచేతస స్త్వద్భావభావైకమనోనుగస్య || 112 సదా హృదిస్థో భగవన్నమస్తే నమామి నిత్యం భగవన్పురాణ | ఇతి ప్రకాశం తవ మే తదీశస్తవం మయా సర్వగతి ప్రబుద్ధ || 113 సంసారచక్రే భ్రమణాదియుక్తా భీతిం పునర్నః ప్రతిపాలయస్వ | 114 బ్రహ్మోవాచ :- సర్వజ్ఞస్త్వం న సందేహో ప్రజ్ఞారాశిశ్చ కేశవ | దేవానాం ప్రథమః పూజ్యః సర్వదా త్వం భవిష్యసి || 115 -: రుద్రకృత బ్రహ్మాస్తుతి :- నారాయణాదనంతరం రుద్రో భక్త్యా విరించినం | తుష్ట్వా ప్రణతో భూత్వా బ్రహ్మాణం కమలోద్భవమ్ || 116 నమః కమలపత్రాక్ష నమస్తే పద్మజన్మనే | నమః సురాసురగురోకారిణ పరమాత్మనే || 117 నమస్తే సర్వదేవేశ నమో వై మోహనాశన | విష్ణోన్న భిస్థితవతే కమలాసన జన్మనే || 118 నమో విద్రుమరక్తాంగపాణిపల్లవశోభినే | శరణం త్వాం ప్రపన్నోస్మి త్రాహి మాం భవసంసృతేః || 119 పూర్వం నీలాంబుదాకారం కుడ్మలం తే పితామహ | దృష్ట్వా రక్తముఖం భూయః పత్ర కేసరసంయుతమ్ || 120 పద్మం చానేకపత్రాన్తమసంఖ్యాతం నిరంజనం | తత్రాస్థితేన త్వయైషా సృష్టిశ్చైవ ప్రవర్తితా || 121 త్వాం ముక్త్వా నాన్యతః త్రాణం జగద్వంద్య నమోస్తు తే | సావిత్రీ శాపదగ్ధోహం లింగం మే పతితం క్షితౌ || 122 ఇదానీం కురు మే శాంతిం త్రాహి మాం సహ భార్యయా | బ్రహ్మా వై పాతు మే పాదౌ జంఘే వై కమలాసనః || 123 విరించో మే కటిం పాతు సృష్టికృద్గుహ్యమేవ చ | నాబిం పద్మనిభః పాతు జఠరం చతురాననః || 124 ఉరస్తు విశ్వస్పక్పాతు హృదయం పాతు పద్మజః | సావిత్రీపతిర్మే కంఠం హృషీకేశో ముఖం మమ || 125 పద్మవర్ణశ్చ నయనే పరమాత్మా శిరో మమ | ఏవం న్యస్య గురోర్నామ శంకరో నామ శంకరః || 126 నమస్తే భగవన్ర్బహ్మన్నిత్యుక్త్వా విరరామ హ | తతస్తుష్టో హరం బ్రహ్మా వాక్యమేతదువాచ హ || 127 కం తే కామం కరోమ్యద్య పృచ్ఛ మాం యద్యదిచ్ఛసి | రుద్ర ఉవాచ :- యది ప్రసన్నో మే నాథ వరదో యది వా మమ || 128 తదేకం మే వద విభో యస్మిన్థ్సానే భవాన్థ్సితః | కేషు కేషు చ స్థానేషు త్వాం పశ్యంతి సదా ద్విజాః || 129 నామ్నా చ కేన తే స్థానం శోభ##తే ధరణీతలే | తన్మే వదస్వ సర్వేశ తవ భక్తిరతస్య చ || 130 అపుడు సంతోషించిన బ్రహ్మ శివుని ఇష్టమొచ్చినది కోరుకొనిన, తీర్చెదననెను. అపుడు శివుడు 'నీవు ప్రసన్నుడ వైనచో, నీ స్థానమేమిటో, ద్విజులు ఎక్కడెక్కడ నిన్ను చూతురో తెలుపుము. భూమిపై నీ స్థానము ఏ పేరుతో విలసిల్లుతున్నది. భక్తిగల నాకది తెలుపుము.' అనగా బ్రహ్మ ఇట్లు చెప్పెను. -: బ్రహ్మాక్షేత్ర ప్రశంష :- బ్రహ్మోవాచ :- పుష్కరేహం సురశ్రేష్టో గయాయాం చ చతుర్ముఖః | కాన్యకుబ్జే దేవగర్భో భృగుకక్షే పితామహః || 131 కావేర్యాం సృష్టికర్తా చ నందిపుర్యాం బృహస్పతిః | ప్రభాసే పద్మజన్మా చ వానర్యాం చ సురప్రియః || 132 ద్వారవత్యాం తు ఋగ్వేదీ వైదిశే భువనాధిపః | పౌండ్రకే పుండరీకాక్షః పింగాక్షో హస్తినాపురే || 133 జయంత్యాం విజయశ్చాస్మి జయంతః పుష్కరావతే | అగ్రేషు పద్మహస్తోహం తమోనద్యాం తమోనుదః || 134 అహిచ్ఛన్నే జయానందీ కాంచీపుర్యాం జనప్రియః | బ్రహ్మాహం పాటలీపుత్ర ఋషికుండే మునిస్తథా || 135 మహితారే ముకుందశ్చ శ్రీకంఠః శ్రీనివాసితే | కామరూపే శుభాకారో వారాణస్యాం శివప్రియః || 136 మల్లికాక్షే తథా విష్ణుర్మహేంద్రే భార్గవస్తథా | గోనర్దే స్థవిరాకార ఉజ్జయిన్యాం పితామహః ||137 కౌశాంబ్యాం తు మహాబోధిరయోధ్యాయాం చ రాఘవః | మునీంద్రశ్చిత్రకూటే తు వారాహో వింధ్యపర్వతే || 138 గంగాద్వారే పరమేష్ఠీ హిమవత్యపి శంకరః | దేవికాయామృచాహస్తః స్రువహస్తశ్చతుర్వతే || 139 వృందావనే పద్మపాణిః కుశహస్తశ్చ నైమిషే | గోప్లక్షే చైవ గోపీన్ద్రః సచంద్రో యమునాతటే || 140 భాగీరథ్యాం పద్మతనుర్జలానాందో జలంధరే | కాంకణ చైవ మద్రాక్షః కాంపిల్యే కనకప్రియః. 141 వేంకటే చాన్నదాతా చ శంభుశ్చైవ క్రతుస్థలౌ | లంకాయాం చ పులస్త్యోహం కాశ్మీరేహం సవాహనః || 142 వసిష్ఠశ్చార్బుదే చైవ నారదశ్చోత్పలావతే | మేలకే శ్రుతిదాతాహం ప్రపాతే యాదసాంపతిః || 143 సామవేదస్తథా యజ్ఞే మథురే మథురప్రియః | అంకోటే యజ్ఞభోక్తా చ బ్రహ్మవాదే సురప్రియః || 144 నారాయణశ్చ గోమంతే మాయాపుర్యాం ద్విజప్రియః | ఋషివేదే దురాధర్షో దేవాయాం సురమర్ధనః || 145 విజయాయాం మహారూపః స్వరూపో రాష్ట్రవర్ధనే | పృథూదరస్తు మాలవ్యాం శాకంభర్యాం రసప్రియః || 146 పిండారకే తు గోపాలః శంఖోద్ధారేంగవర్ధనః | కాదంబకే ప్రజాధ్యక్షో దేవాధ్యక్షః సమస్థలే || 147 గంగాధరో భద్రపీఠే జలశాప్యహామర్బుదే | త్ర్యంబకే త్రిపురాధీశః శ్రీపర్వతే త్రిలోచనః || 148 మహాదేవః పద్మపురే కాపాలే వైధసస్తథా | శృంగిబేరపురే శౌరిర్నైమిషే చక్రపాణికః || 149 దండపుర్యాం విరూపాక్షో గౌతమో ధూతపాపకే | హంసనాథో మాల్యవతి ద్విజేంద్రో వలికే తథా || 150 ఇంద్రపుర్యాం దేవనాథో ద్యూతపాయాం పురందరః | హంసవాహస్తు లంబాయాం చండాయాం గరుడప్రియః || 151 మహోదయే మహాయజ్ఞః సుయజ్ఞో యజ్ఞకేతనే | సిద్ధిస్మరే పద్మవర్ణః విభాయాం పద్మబోధనః || 152 దేవదారువనే లింగం మహాపత్తౌ వినాయకః | త్య్రంబకో మాతృకాస్థానే అలకాయాం కులాధిపః || 153 త్రికూటే చైవ గోనర్థః పాతాలే వాసుకిస్తథా | పద్మాధ్యక్షశ్చ కేదారే కూష్మాండే సురతప్రియః || 154 కుండవాప్యాం శుభాంగస్తు సారణ్యాం తక్షకస్తథా | అక్షోటే పాపహా చైవ అంబికాయాం సుదర్శనః || 155 వరదాయా మహావీరః కాంతారే దుర్గనాశనః | అనంతశ్చైవ పర్ణాటే ప్రకాశాయాం దివాకరః || 156 విరాజాయాం పద్మనాభః స్వరుద్రశ్చ వృకస్థలే | మార్కండో వటకే చైవ వాహిన్యాం మృగకేతనః || 157 పద్మావత్యాం పద్మగృహో గగనే పద్మ కేతనః | అష్టోత్తరం స్థానశతం మయా తే పరికీర్తితమ్ || 158 యత్ర వై మమ సాంనిధ్యం త్రిసంధ్యం త్రిపురాంతక | ఏతేషామపి యస్త్వేకం పశ్యతే భక్తిమాన్నరః || 159 స్థానం సువిరజం లబ్ధ్వా మోదతే శాశ్వతీః సమాః | మానసం వాచికం చైవ కాయికం యచ్చ దుష్కృతమ్ || 160 తత్పర్వం నాశమాయాతి నాత్ర కార్యా విచారణా | యస్త్వేతాని చ సర్వాణి గత్వా మాం పశ్యతే నరః || 161 భవతే మోక్షభాగీ చ యత్రాహం తత్ర వై స్థితః | పుష్పోపహారైరూపైశ్చ బ్రాహ్మణానాం చ తర్పణౖః || 162 ధ్యానేన చ స్థిరేణాశు ప్రాప్యతే పరమేశ్వరః | తస్య పుణ్యఫలం చాగ్ర్యమంతే మోక్షఫలం తథా || 163 స బ్రహ్మలోకమాసాద్య తత్కాలం తత్ర తిష్ఠతి | పునః సృష్టౌ భ##వేద్దేవో వైరాజానాం మహాతపాః || 164 బ్రహ్మహత్యాదిపాపాని ఇహ లోకే కృతాన్యపి | ఆకామతః కామతో వా తాని నశ్యంతి తత్‌క్షణాత్ || 165 ఇహలోకే దరిద్రో యో భ్రష్టరాజ్యోథ వా పునః | స్థానేష్వేతేషు వై గత్వా మాం పశ్యంతి సమాధినా || 166 కృత్వా పూజోపహారం చ స్నానం చ పితృతర్పణం | కృత్వా పిండప్రదానం చ సోచిరాద్దుఃఖవర్జితః || 167 ఏకఛత్రో భ##వేద్రాజా సత్యమేతన్న సంశయః | ఇహ రాజ్యాని సౌభాగ్యం ధనం ధాన్యం వరస్త్రియః || 168 భవంతి వివిధాస్తస్య యైర్యాత్రా పుష్కరే కృతా | ఇదం యాత్రా విధానం యః కురుతే కారయేత వా || 169 శ్రుణోతి వా స పాపైస్తు సర్వైరేవ ప్రముచ్యతే | అగమ్యాగమనం యేన కృతం జానాతి మానవః || 170 బ్రహ్మ క్రియాయా లోపేన బహువర్షకృతేన చ | యాత్రా చేమాం సకృత్కృత్వా వేదసంస్కారమాప్నుయాత్ || 171 (158 వ శ్లోకము వరకు నూట ఎనిమిది స్థానములు - వానియందు బ్రహ్మ పేర్లు) మూడు సంధ్యలలో నా సాన్నిధ్యమున నున్నవాడు దివ్యమగు స్థానమును పొంది శాశ్వతముగా ఆనందించును. మనో వాక్కాయముల దుష్కృతము నిస్సందేహముగా నశించును. ఈ స్థానములన్నింటికి వెళ్ళి నన్ను దర్శించువాడు మోక్షమును పొంది నేనున్న స్థానమును పొందును. పుష్పోపహారములచే, ధూపముచే, బ్రాహ్మణ తర్పణచే, స్థిర ధ్యానముచే పరమేశ్వరుని పొందదగును. ఆ పుణ్యఫలమత్యుత్తమమైనది. చివర మోక్షమును కూడా పొందుదురు. బ్రహ్మలోకమును పొంది అచట నుండును. మరల సృష్టి జరగగా వైరాజుల రాజగును. తెలిసిగానీ, తెలియకగానీ ఈ లోకమున చేసిన బ్రహ్మహత్య మున్నగు పాపములు గూడా తక్షణమే నశించును. ఈ లోకమున దరిద్రుడుగానీ, రాజ్యమును కోల్పోయినవాడు గానీ ఈ స్థానములకు వెళ్ళి నన్ను దర్శించినచో, పూజోపహారము చేసి, పితృతర్పణమును, స్నానమును, పిండోపదానమును చేసినచో దుఃఖము తొలగిన వాడగును. నిస్సందేహముగా ఏకఛత్రాధిపతి యగును. పుష్కరయాత్ర చేసినవారికి రాజ్యము, సౌభాగ్యము, ధనధాన్యాదులు, ఉత్తమ స్త్రీలు లభింతురు. ఈ యాత్రా విధమును చేసినవాడు, చేయించినవాడు వినిననాడు కూడా పాపములన్నింటి నుండి విముక్తుడగును. పొందకూడని స్త్రీలను పొందినవాడు, పెక్కు సంవత్సరములు బ్రహ్మక్రియ చేయనివాడు ఒక్కమారు ఈ యాత్రను చేసి వేద సంస్కారమును పొంద వచ్చు. 171 కిమత్ర బహునో క్తేన ఇదమస్తీహ శంకర | అప్రాప్యం ప్రాప్యతే తేన పాపం చాపి వినశ్యతి || 172 సర్వయజ్ఞఫలైస్తుల్యం సర్వతీర్థఫలప్రదం | సర్వేషాం చైవ వేదానాం సమాప్తిస్తేన వై కృతా || 173 యః కృత్వా పుష్కరే సంధ్యాం సావిత్రీసముపాసితా | స్వపత్నీహస్తదత్తేన పౌష్కరేణ జలేన తు || 174 భృంగారేణ వరేణౖవ మృన్మయేనాపి శంకర | ఆనీయతజ్జలం పుణ్యం సంధ్యోపాస్తిర్దినక్షయే || 175 సమాధినా సమాధియా సప్రాణాయామపూర్వికా | తస్యాం కృతాయాం యత్పుణ్యం తచ్ఛ్రుణుష్వ హరాద్య మే || 176 శంకరా! ఎక్కువ చెప్పి ఏమి ఫలము? పొందడానికి కష్టమైనది పొందవచ్చు. పాపమును నశింపజేసికొనవచ్చు. ఇది అన్ని యజ్ఞముల, తీర్థముల ఫలము నిచ్చును. వేదములన్నింటి సమాప్తిని చేసిన వానిగా, ఈ పుష్కరమున సంధ్యనుపాసించి సావిత్రీ జపముచేసి, తన పత్ని యిచ్చిన పుష్కర జలముతో తర్పణమిచ్చు వానిని భావించవచ్చు, మంచి పాత్రలో (రాగిగానీ, మట్టిదిగానీ) పుష్కరజలమును తెచ్చి సాయంకాలమున సంధ్యనుపాసించి, ప్రాణాయామముతో సమాధి స్థితియందిచ్చిన దాని పుణ్యమును చెప్పెద వినుము. 176 తేన ద్వాదశవర్షాణి భ##వేత్సంధ్యా సువందితా | అశ్వమేధపలం స్నానే దానే దశగుణం తథా || 177 ఉపవాసేప్యనంతం చ స్వయం ప్రోక్తం మయానఘ | సావిత్ర్యాః పురతో యస్తు దంపత్యోర్భోజనం దదేత్ || 178 తేనాహం భోజితస్తత్ర భవామీహ న సంశయః | ద్వితీయం భోజయేద్యస్తు భోజితస్తేన కేశవః || 179 లక్ష్మీ సహాయో వరదో వరాంస్తస్య ప్రయచ్ఛతి | ఉమాసహాయస్తార్తీయే భోజితోసి న సంశయః || 180 అథవా యా కుమారీణాం భక్త్యా దద్యాచ్చ భోజనం | తస్యాః కులే భ##వేద్వంధ్యా న కదాచిచ్చ దుర్భగా || 181 న కన్యా జననీ క్వాపి న భర్తుర్యా న వల్లభా | తస్మాత్సర్వప్రయత్నేన సావిత్ర్యగ్రే తు భోజనమ్ || 182 అతను పన్నెండు సంవత్సరాలు సంధ్యనుపాసించి నట్లగును. స్నానమాడిన అశ్వమేధ ఫలమును, దానమును చేసిన అంతకు పదింతలు ఫలమును పొందును ఉపవసించిన అనంతపుణ్యము లభించును. సావిత్రి యెదుట దంపతులకు భోజనమిచ్చిన నాకు భోజనము పెట్టినట్లే. సందేహము లేదు. కేశవునికి భోజనము పెట్టినట్లే. అతను వరములనిచ్చును. పెళ్ళికాని కన్యలకు భోజనము పెట్టిన వారి కులమున వంధ్య జన్మించదు. కన్యగానే తల్లియగు స్త్రీ, భర్తకు ప్రియముకాని స్త్రీ జన్మించదు. కావున సావిత్రి ఎదుట భోజనము పెట్టవలెను. 182 పారత్రమైహికం వాపి కామయద్భిర్నరైః సదా | దాతవ్యం సర్వదా భీష్మ కటుతైలవివర్జితమ్ || 183 న చావ్లుం న చ వై క్షారం స్త్రీణాం భోజ్యం కదాచన | భక్ష్యం పంచప్రకారం చ రసైః సర్వైస్సుసంస్కృతమ్ || 184 ఘృతపూర్యః సూపకాశ్చ బహుక్షీరసమాన్వితాః | తథా శిఖరిణీ పేయా దధిక్షీరసమన్వితా || 185 ఆహ్లాదకారిణీ పుంసాం స్త్రిణాం చాతీవ వల్లభా | ధనధాన్యాంజనో పేతం నారీణాం చ శతాకులమ్ || 186 పూపకం శష్కులం తస్యాం జాయతే నాత్ర సంశయః | న జ్వరో న చ సంతాపో న దుఃఖం న వియోగితా || 187 అసౌ తారయతే స్వానాం కులానామేకవింశతీం | బంధుమిశ్చ సుతైశ్చైవ దాసీదా సైరనంతకైః || 188 పూరితం చ కులం తస్యాఃపూరికాం యా ప్రదాస్యతి | ఏధతే చ చిరం కాలం పుత్రపౌత్రసమన్వితమ్ || 189 ఇహ పర ఫలములను కోరువారు పుల్లనిది, ఉపై#్పనది దానమివ్వరాదు. స్త్రీలు భుజించరాదు, అన్ని రసములు గల ఐదు రకాల భక్ష్యమును నేతితో, అప్పముతో, క్షీరముతో నివ్వవలెను, అట్లే పెరుగు, పాలతో కూడిన శిఖరిణిని త్రాగవలెను. ఇది పురుషులకు ఆహ్లాదమునిచ్చును. స్త్రీలకెక్కువ ఇష్టము. జ్వరము, సంతాపము, దుఃఖము, వియోగము వారికేర్పడదు. వారు తన కులమున ఇరువది యొక్క తరములను తరింపజేయును. బంధువులతో, దాసదాసీలతో విలసిల్లును. ఇక్కడ పూరికను దానమిచ్చు స్త్రీ పుత్రపౌత్రులతో చిరకాలము వర్ధిల్లును. 189 కులం చ సకలం తస్య శష్కులం యః ప్రయచ్ఛతి | పుత్రిణ్యో వై దుహితరో బంధుభిః సహితం కులమ్ || 190 శిఖరిణీప్రదాత్రీణాం యువతీనాం న సంశయః | మోదతే తు కులం తస్యాః సర్వసిద్ధిప్రపూరితమ్ || 191 మోదకానాం ప్రదానేన ఏవమాహ ప్రజాపతిః | ఏతదేవ తు గౌరీణాం భోజనం హర శస్యతే || 192 సుభగా పుత్రిణీ సాధ్వీ ధనబుద్ధిసమన్వితా | సహస్రభోజినీ శంభో జన్మజన్మభవిష్యతి || 193 పూపాని చైవ పుణ్యాని కృతాని మధురాణి చ | ద్రాక్షారసప్రధానం చ గుడఖండసమన్వితమ్ || 194 శారదేన తు ధాన్యేన కృత్వా ఖండం విమిశ్రితమ్ | స్త్రీణాం చైవతు పేయాని భక్ష్యాణి చ ద్విజన్మనామ్ || 195 ఇహ చావికవాసాంసి వర్షాయోగ్యాని సర్వశః | యాని యాని చ పేయాని తాని యోగ్యాని దాపయేత్ || 196 శష్కులమును (దానమిచ్చువాని కులము, శిఖరిణి దానమిచ్చు యువతుల కులము వర్ధిల్లును. మోదకములు గౌరీ దేవతల ప్రశస్తమైన ఆహారమని ప్రజాపతి చెప్పెను. వేయిమందికి భోజనము వెట్టు సాధ్వి పుత్రులతో, ధన ధాన్యముతో ప్రతి జన్మయందు సౌభాగ్యము నొందును. మధురమైన అప్పములు; ద్రాక్షారసము, బెల్లపు ముక్కలు, శరత్కాలధ్యానముతో స్త్రీలు త్రాగవలెను. యోగ్యపేయ పదార్థముల నిప్పించవలెను. 196 వ్రతిపూజ్యవిధానేన వసుదాన్యైః సకంచుకైః | కుంకుమేనానులిప్తాంగ్యః స్రగ్దామభిరలంకృతాః || 197 దత్వా తూపానహావజ్ఘ్యోర్నారికేలం కరే తథా | అక్‌ష్ణోశ్చైవాంజనం దత్వా సిందూరం చైవ మస్తకే || 198 గుడం ఫలాని హృద్యాని వాంఛితాని మృదూని చ | హస్తే దత్వా సపాత్రాణి ప్రణిపత్య విసర్జయేత్ || 199 ప్రతి పూజ్య విధానముతో రవికలతో బంగారమును ఇవ్వవలెను. కుంకుమతో, పూలతో నలంకరించుకుని చెప్పులను దానమిచ్చి చేతిలో కొబ్బరికాయతో పూజించవలెను. కంటికి కాటుక, తలపై సింధూరము, మంచి పళ్ళు, కోరినవి పాత్రలతో చేతికి దానమిచ్చి నమస్కరించి విడువవలెను. 199 స్వయం భుంజీత వై పశ్చాత్సబంధుర్బాలకైః సహ | అథవా నైవ సంపత్తిస్తీర్థే దానం చ భాజనమ్ || 200 గృహే గతః ప్రదాస్యామి హృష్టో దేవ ప్రసీద మే | ఏవమేవ పితౄణాం చ ఆగత్య స్వీయమందిరే || 201 పిండప్రదానపూర్వం తు శ్రాద్ధం కుర్యాద్విధానతః | పితరస్తస్య వై తృప్తా భవంతి బ్రహ్మణో దినమ్ || 202 తీర్ధాదష్టగుణం పుణ్యం స్వగృ హే దదతాం శివ | న చ పశ్యంతి వై నీచాః శ్రాద్ధం ద్విజాతిభిః కృతమ్ || 203 ఏకాంతే తు గృహే గుప్తీ పితౄణాం శ్రాద్ధమిష్యతే | నీచదృష్ట్యా హతం తచ్చ పితౄన్నైవోపతిష్ఠతి || 204 తరువాత బంధువులతో కలిసి భుజించవలెను. తీర్థమున ఈ విధంగా చేయుటకు వీలులేనివారు 'దేవా! ఇంటికి వెళ్ళి దానమిత్తును. ప్రసన్నుడవు గమ్ము' అని ఇంటికి వచ్చి పితృదేవతలకు కూడా విధ పూర్వకముగా పిండ ప్రదానముతో శ్రాద్ధము నాచరించవలెను. అట్టివాని పితృదేవతలు బ్రహ్మయొక్క పగలు ఎంతకాలమో అంతకాలము తృప్తిని పొందుదురు. తీర్థమునకంటె తన ఇంటచేసిన ఎనిమిదింతల పుణ్యము పొందును. నీచులు మాత్రము, ద్విజాతులు చేయు శ్రాద్ధమును తెలియ జాలరు. ఏకాంతమున ఇంట గుప్తముగా పితరులకు శ్రాద్ధము చేయుట తగినది. నీచదృష్టిచే హతమైన శ్రాద్ధము పితరులను చేరదు. 204 తస్మాత్సర్వప్రయత్నేన శ్రాద్ధం గుప్తం చ కారయేత్ | పితౄణాం తృప్తిదం ప్రోక్తం స్వయమేవ స్వయంభువా || 205 గౌరీభక్త్యాదికా యా తు శస్తా జ్ఞాతక్రియా తు సా | రాజసీ మనసా జ్ఞాతా జనానాం కీర్తిదాయినీ || 206 గుప్తం దానం సదా దేయమాత్మనో హితమిచ్ఛతా | పక్వాన్నం దృశ్యతామేతి దీయమానం జనైర్భువి || 207 దృశ్యమానం తు తత్తుష్ట్యై దృశ్యతే నేహ కర్హిచిత్ | ఏకస్మిన్భోజితే విప్రే కోటిర్భవతి భోజితా || 208 భవనే నాత్ర సందేహః సత్యం పౌరాణికం వచః | తీర్థే తు బ్రాహ్మణం నైవ పరీక్షేత కథంచన || 209 అన్నార్ధినమనుప్రాప్తం భోజ్యం తం మనురబ్రవీత్ | సక్తుభిః పిండదానం చ సంయావైః పాయసేన వా || 210 కర్తవ్యమృషిభిర్దృష్టం పిణ్యాకేనేంగుదేన వా | తిలపిణ్యాకకైర్దేయం భక్తిమద్భిర్నరైః సదా || 211 కనుక, ఏ విధంగానైనా శ్రాద్ధమును గుప్తముగా చేయుట తగినది. దీనిచే పితరులు తృప్తి నొందెదరు. అని పూర్వము బ్రహ్మ చెప్పెను. గౌరీ భక్తిచే అధికముగా చేయబడునది శ్రేష్ఠము. రాజసియను తెలియందగు నిది జనులకు కీర్తి నిచ్చును. తన హితము కోరువాడు ఎల్లప్పుడూ గుప్తదానము చేయవలెను. జనులచే నివ్వబడు పక్వాన్నము కనబడును. అట్టిది ఎప్పుడూ సంతోషము నిచ్చుట కనరాదు. ఇంటిలో ఒక విప్రునికి భోజనము పెట్టిన విప్రకోటికి భోజనము పెట్టినట్లే. సందేహము లేదు. ఈ పురాణ వచనము సత్యము. ఎప్పుడైననూ తీర్థమున బ్రాహ్మణుని పరీక్షించరాదు అన్నమును గోరి వచ్చిన వానికి భోజన మివ్వవలెనని మనువనెను. సక్తువు (సత్తుపిండి) తో పిండదానమును, లేదా యావలతో, పాయసముతో చేయవలెను. పిణ్యాకముతో (రొట్టె) ఇంగుదముతో చేయవచ్చు. భక్తితో నరులు నువ్వులతో ఇవ్వవచ్చును. శ్రాద్ధం తత్ర కర్తవ్యం ధ్యానావాహనవర్జితం | స్వధాం తు గృధ్రాః కాకా వా నైవ దృష్ట్యా హరన్తి తే || 212 శ్రాద్ధం తత్తైర్ధికం ప్రోక్తం పితౄణాం తృప్తిదం పరం | కర్తవ్యం తత్ప్రయత్నేన భక్తిరేవాత్ర కారణమ్ || 213 భక్త్యా తుష్యన్తి పితరస్తుష్టాః కామాన్దిశన్తి తే | పుత్రం పౌత్రం ధనం ధాన్యం కామాన్యాన్మనసీచ్ఛతి || 214 భక్త్యా చారాధితో దద్యాన్నృణాం ప్రీతః పితామహః | అకాలేప్యథ కాలే వా తీర్ధే శ్రాద్ధం సదా నరైః || 215 ప్రాపై#్తరేవ సదా స్నానం కర్తవ్యం పితృతర్పణం | పిండదానం చ కర్తవ్యం పితౄణాం చాతివల్లభమ్ || 216 ధ్యానావాహనములు విడిచి శ్రాద్ధమాచరించవచ్చు. గద్ధలు, కాకులు దృష్టితో దానిని హరించలేవు. పితరులకు తృప్తి నిచ్చు ఇది తైర్థిక శ్రాద్ధము. తప్పక చేయవలెను. భ##క్తే ప్రదానము. భక్తిచే పితరులు సంతోషింతురు. కోరిన కోరికల నిత్తురు. పుత్ర పౌత్ర ధన ధాన్యముల కోరిన దానిని భక్తితో ఆరాధించిన, బ్రహ్మ ఇచ్చును. తగిన కాలమున లేదా అకాలమునగానీ తీర్థమందు నరులు శ్రాద్ధమిడవలెను. స్నానమును, పితృతర్పణమును, పిండదానమును పితరుల కివ్వవలెను. 216 పితరో హి నిరీక్షన్తే గోత్రజం సముపాగతం | ఆశయా పరయా యుక్తాః కాంక్షంతస్సలిలం చ తే || 217 విలంబో నైవ కర్తవ్యో నైవ విఘ్నం సమాచరేత్ | అచ్ఛిన్నా సన్నతిస్తేషాం సదా కాలం భవిష్యతి || 218 పితరః పుత్రదాతారం వృద్ధిశ్రాద్ధాభికాంక్షిణః | తేన తే సన్తతిచ్ఛేదం న కుర్వన్తి హి కర్హిచిత్ || 219 అతః శ్రాద్ధం పురా ప్రోక్తం స్వయమేవ స్వయంభువా | గుణోత్తరం తు యత్కార్యం ద్విజైః పితృపరాయణౖః || 220 తీర్థే క్షేత్రే గృహే వాపి సంక్రాంతే గ్రహణపి వా | విషువే అయనే చాపి జన్మర్షే చ ప్రపీడితే || 221 ఏతాన్వై శ్రాధ్దకాలాంస్తు పురా స్వాయంభువోబ్రవీత్ | కృతే శ్రాద్ధే న వై పుంసాం పీడా భవతి దేహజా || 222 తదా పుత్రకృతం వాపి సర్వం త్యజతి దుష్కృతం | యథా న భవితా పీడా గ్రహచోరనృపాదికాత్ || 223 దుష్కృతం నశ్యతే నర్వం పరత్ర చ గతిం శుభాం | లభ##తే నాత్ర సందేహః ప్రజాపతివచో యథా || 224 అక్కడికి వచ్చిన తమ గోత్రము వానిని పితరులు మిక్కిలి ఆశతో తర్పణము కోరి చూచుచుందురు. ఆలస్యము చేయ రాదు. అడ్డంకినీ చేయరాదు. అట్టివారి సంతతి ఎప్పటికీ అవిచ్ఛిన్నముగా నుండును. శ్రాద్ధమును, కోరు పితరులు ఎప్పటికీ సంతతి భేదమును చేయరు. అందుకే పూర్వము బ్రహ్మ శ్రాద్ధము గుణోత్తరమనెను. దీనిని పితృపరాయణులైన జనులు సదా ఆచరించవలెను. తీర్థమునగానీ, క్షేత్రమునగానీ, సంక్రమణ కాలమున, గ్రహణకాలమున విషువమున, అయనమున, జన్మ నక్షత్రము పీడింపబడిన సమయాన శ్రాద్ధమాచరించవచ్చు. ఇవి శ్రాద్ధకాలములని స్వయంభువనెను. శ్రాద్ధమిడిన వారికి దేహమున పుట్టిన పీడ కలుగదు. పుత్రకృతమైనదీ కలుగదు. గ్రహచోర నృపాదులు నుండి పీడ కలుగదు. పాపము నశించి పరమున శుభగతి పొందుననుటలో సందేహము లేదు. ప్రజాపతి వాక్కువలె ఇది నిజము. కృతే యుగే పుష్కరాణి త్రేతాయాం నైమిషం స్మృతం | ద్వాపరే చ కురుక్షేత్రం కలే గంగాం సమాశ్రయేత్ || 225 దుష్కరః పుష్కరే వాసో దుష్కరం పుష్కరే తపః | యదన్యత్ర కృతం పాపం తీర్ధే తద్యాతి లాఘవమ్ || 226 న తీర్థకృతమన్యత్ర క్వచిత్సాపం వ్యపోహతి | సాయం ప్రాతః స్మరేద్యస్తు పుష్కరాణి కృతాజ్ఞలిః || 227 ఉపసృష్టం భవత్తేన సర్వతీర్ధేషు భారత | సాయంప్రాతరుపస్పృశ్య పుష్కరే నియతేంద్రియః || 228 క్రతూన్సర్వానవాప్నోతి బ్రహ్మలోకం చ గచ్ఛతి | ద్వాదశాబ్దం ద్వాదశాహం మాసం మాసార్ధమేవ చ || 229 యో వసేత్పుష్కరే నిత్యం స గచ్ఛేత్పరమాం గతిం | సర్వేషామేవ లోకానాం బ్రహ్మలోకోపరిస్థితః || 230 య ఇచ్ఛేత్పుష్కరం గన్తుం సోనుసేవేత పుష్కరం | యథా లోమవిలోమాభ్యాం తథా వ్యస్తసమస్తయోః || 231 స్నాతస్తు పుష్కరే సమ్యక్కోట్యాశ్చ ఫలమశ్నుతే | విధివత్క్రియమాణషు సర్వతీర్థేషు యత్ఫలమ్ || 232 పుష్కరాలోకనాదేవ సరః ప్రాప్నోతి తత్ఫలం | దశకోటిసహస్రాణి తీర్ధానాం వై మహీతలే || 233 సాన్నిధ్యం పుష్కరే తేషాం త్రిసంధ్యం కురునన్దన | యావత్తిష్ఠంతి గిరయో యావత్తిష్టన్తి సాగరాః || 234 తావత్పుష్కరమృత్యూనాం బ్రహ్మలోకో న సంశయః | జన్మాంతరసహసై#్త్రశ్చ ఆజన్మమరణాన్తికమ్ || 235 నిర్దహేద్దుష్కృతం సర్వం సకృత్స్నాత్వాతు పుష్కరే | పుష్కరం దుష్కరం క్షేత్రం సర్వపాపప్రణాశమ్ || 236 కృతయుగమున పుష్కరములు, త్రేతాయుగమున నైమిషము, ద్వాపరమున కురుక్షేత్రము, కలియుగమున గంగను జనులు ఆశ్రయించవలెను. పుష్కరమున వాసము, తపస్సు దుష్కరము. వేరొకచోట చేసిన పాపము తీర్థమున తక్కువగును. కానీ తీర్థమున చేసిన పాపము వేరొకచోట యెక్కడా తొలగిపోదు. చేతులు జోడించి పొద్దున, సాయంత్రము పుష్కరముల స్మరించు వాడు అన్ని తీర్థములను తాకినట్లే. పుష్కరములను పొద్దున, సాయంత్రము తాకువాడు అన్ని క్రతువులను పొంది, బ్రహ్మ లోకమును చేరును. పుష్కరమున పన్నెండేండ్లు, పన్నెండు నెలలు లేదా ఒక నెల లేదా పదిహేను రోజులుండువాడు పరమ గతిని పొందును. అన్ని లోకములకు పైనున్న బ్రహ్మలోకమునకు పైనుండు పుష్కరమును గోరువాడు, పుష్కరములను సేవించవలెను. అనులోమ, విలోమములచే, వ్యస్త సమస్తములచే పుష్కరమున స్నానమాడువాడు కోటియొక్క ఫలమందును. అన్ని తీర్థములలో విధివత్తు చేయు కార్యముల ఫలమును, పుష్కరమును చూచినంతనే పొందుదురు. భూమిపై అసంఖ్యాక తీర్థములు పుష్కరమువద్ద నుండును. పర్వతములు సముద్రములున్నంతరవకు పుష్కరమున మరణించినవారికి బ్రహ్మలోకముండును. ఒక్కమారు పుష్కరమున స్నానమాడి, జన్మాంతరములలో చేసిన పాపముల నశింపజేసికొనవచ్చును. అన్ని పాపముల నశింపజేయు క్షేత్రమిది. 236 ఇదానీం శృణు మే రాజన్పఞ్చపాతకనాశనం | యజనం దేవదేవస్య బ్రహ్మపుత్ర వసుప్రదమ్ || 237 ఇహ జన్మని దారిద్ర్యవ్యాధికుష్టాదిపీడితః | అలక్ష్మీ వానపుత్రస్తు యో భ##వేత్పురుషో భువి || 238 తస్య సద్యో భ##వేల్లక్ష్మీ రాయుః పూర్ణం సుతాస్సుఖం | కృత్వా తు మండలగతం లోకపాలసమన్వితమ్ || 239 బ్రహ్మాణం తు పరం దేవం యః పశ్యతి విదానతః | పూజితం నవనాభేన మన్త్రమూర్తిమయోనిజమ్ || 240 కార్తికే మాసి శుక్లాయాం పౌర్ణమాస్యాం విశేషతః | సర్వాసు వా యజేద్దేవం పూర్ణిమాసు విధానతః || 241 'రాజా ఇప్పుడు నేను నీకు పంచపాతకముల నశింపచేయు దానిని దేవదేవుని యజనము చెప్పెదను. ఇది ఐశ్వర్యము నొసగును. ఈ జన్మలో దారిద్ర్యముచే, వ్యాధులచే పీడింపబడువాడు, పుత్రులు లేనివాడు కూడా దీనిచే వెంటనే సంపదను, ఆయుష్షును, పుత్రులను బడయును. మండలమున లోకపాలురతో బ్రహ్మను చేసి విధి పూర్వకముగా, విశేషముగా కార్తీక శుద్ధ పూర్ణిమనాడు పూజించవలెను. ముఖ్యముగా పూర్ణిమయందు శ్రేష్ఠము. సంక్రమణమునాడు లేదా సూర్యచంద్ర గ్రహణములనాడిది చేయవలెను. 241 సంక్రాంతే చ మహాబాహో చన్ద్రసూర్యగ్రహేపి వా | యః పశ్యతి విభుం దేవం పూజితం గురుణా నృప || 242 తస్య సద్యో భ##వేత్తుష్టిః పాపధ్వంసశ్చ జాయతే | స మాన్యో దేవతానాం భవతీహ నరాధిప || 243 బ్రాహ్మణక్షత్రియవిశాం భక్తానాం తు పరీక్షణం | సంవత్సరం గురుః కుర్యాజ్జాతిశౌచక్రియాదిభిః || 244 ఉపపన్నమితి జ్ఞాత్వా హృదయేనావధారయేత్ | తేపి భక్తియుతా ధ్యాత్వా చార్యం పరమేశ్వరమ్ || 245 సంవత్సరం గురౌ భక్తిం కుర్యుర్విష్ణౌ యథా తథా | ప్రసాదయేయుశ్చ తతః పూర్ణే సంవత్సరే గురుమ్ || 246 -: గురు పూజా ప్రభావము :- గురువుచే పూజింపబడిన దేవుని చూచినవాడికి వెంటనే సంతోషము కలుగును. పాపము నశించును. అతను దేవతలకు కూడా పూజ్యుడగును. గురువు, భక్తులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను జాతి శౌచక్రియలు మొదలగువానిచే సంవత్సరము పరీక్షించవలెను. తగినవాడిగా తెలుసుకొని నిశ్చయించుకొనవలెను. శిష్యులు కూడా భక్తితో పరమేశ్వరుని ధ్యానించుచూ విష్ణువు నందు భక్తి యెట్లో గురువునందూ అట్లే భక్తిని చూపవలెను. సంవత్సరము పూర్తికాగా గురువును ప్రసన్నుని చేసికొనవలెను. 246 భగవంత్వత్ప్రసాదేన సంసారార్ణవతారణం | పరబ్రహ్మోపాసనేన విరించ్యారాధనేన చ || 247 సహస్రశీర్షజప్యేన మణ్డలబ్రాహ్మణన చ | ధ్యానేన స్యాత్తథాస్మాకముపదేశః ప్రదీయతామ్ || 248 ఇచ్ఛామో వైదికీం లక్ష్మీం విశేషేణ ప్రసీద్యతాం | అభ్యర్థితో గురుస్త్వేవం మేథావీ తైస్తదా తతః || 249 యథావిధి సమభ్యర్చేద్బ్రహ్మాణాం విష్ణుమగ్రతః | తే బద్ధనేత్రాః స్వాప్యాస్తు కార్తికస్య చతుర్దశీమ్ || 250 బ్రాహ్మే ముహూర్తే చోత్థాయ బద్ధపద్మాసనాస్తుతే | ధ్యాత్వా గురుం సహస్రారే శ్వేతవస్త్రోపవీతకమ్ || 251 శ్వేతమాల్యాంబరధరం శ్వేతగంధానులేపనం | నిర్గమ్య బహిర్నద్యాం కుర్యుర్నిత్యమతన్ద్రితాః || 252 క్షీరవృక్షోత్థమాచార్యో దాపయేద్దన్తధావనం | తే చ తం భక్షయేయుర్హి నదీం గత్వా సముద్రగామ్ | 253 ఇతరద్వా తటాకం వా గృహే వాపి విధానతః | తద్భక్షయేయుర్మంత్రేణ మంత్రితం పరమేష్ఠినః || 254 అపోహిష్ఠేతి మంత్త్రేణ సప్తకృత్వోభిమంత్రితం | దేవస్య త్వేతి వై జప్త్వా యుంజానేతి కరే న్యసేత్ || 255 ఇరావత్యోతి ప్రక్షాల్య బ్రహ్మోదనేతి వై ముఖే | భక్షయిత్వా క్షిపేద్దూరం పతితం చ నిరీక్షయేత్ || 256 ''భగవాన్! మీ అనుగ్రహముచే పరబ్రహ్మోపాసనము ద్వారా, విరించ్యారాధనము ద్వారా, సహస్రశీర్షజపముచేత, మణ్డల బ్రహ్మణముచేత, ధ్యానముచేత సంసారసాగరమును దాటుట జరుగును. ఇక ఉపదేశమును ఇమ్ము. విశేషముగా వైదిక లక్ష్మిని కోరుచుంటిమి' అని అభ్యర్థించగా గురువు అపుడు చెప్పెను. 'బ్రహ్మను, విష్ణువును యథావిధి అర్చించి, కార్తీక చతుర్దశిన బ్రాహ్మీముహూర్తాన మేల్కొని బద్ధపద్మాసనముననుండి, సహస్రారమున తెల్లని బట్టలు, తెల్లని పూదండను, గంధానులేపనమును ధరించిన గురువును ధ్యానించవలెను. బయట వెడలి నదియందు నిత్యమట్లు అలసించక చేయవలెను. పళ్ళు తోముకొనుటకు క్షీర వృక్షము పుల్లను గురువు ఇప్పించగా దానిని వీరు సముద్రమును చేరు నది వద్దకు వెళ్ళి లేదా వేరొక చెఱువువంటి వానివద్ద నమలవలెను. పరమేష్ఠి మంత్రముతో మంత్రించబడిన దానిని నమలవలెను. 'ఆపోహిష్ఠా' అను మంత్రముతో ఏడుమార్లు అభిమంత్రించి, 'దేవస్యత్వా' అను మంత్రమును జపించి 'యుంజాన' అని చేతనుంచుకొనవలెను. 'ఇరవాత్యా' అనుదానిచే కడిగి, 'బ్రహ్మోదనా' అను మంత్రముచే నమిలి దూరముగా విసిరి, దానివైపు చూచి వెళ్ళవలెను. 256 సమ్ముఖం ప్రాఙ్ముఖం వాపి విదిశం చాపి వా గతం | సంముఖే దేవతాలబ్ధిర్మంత్రసిద్ధిశ్చ జాయతే || 257 పరాఙ్ముఖే దంతకాష్టే సర్వే దేవాః పరాఙ్ముఖాః | ఉత్తరేణ గతే తస్మిన్సిద్ధిర్భవతి వా నవా || 258 దక్షిణన భ##వేన్మృత్యుర్గురోస్తస్య న సంశయః | ప్రేక్ష్యాశుభం స్వపేద్భూమౌ దేవదేవస్య సన్నిధౌ || 259 స్వప్నాన్దృష్ట్వా గురోరగ్నే శ్రావయేయుర్విచక్షణాః | తతః శుభాశుభం తత్ర లక్షయేత్పరమో గురుః || 260 పౌర్ణమాస్యామథ స్నాత్వా తతో దేవాలయం వ్రజేత్ | గురుశ్చ మండలం భూయో కల్పితాయాం తు వర్తయేత్ || 261 లక్షణౖర్వివిధైర్భూమిం లక్షయిత్వా విధానతః | షోడశారం లిఖేత్పద్మం నవధారమథాపి వా || 262 అష్టపత్రమథో వాపి లిఖిత్వా దర్శయేద్బుధః | నేత్రబంధం తు కుర్వీత సితవస్త్రేణ యత్నతః || 263 వర్ణానుక్రమతః శిష్యాన్పుష్పహస్తాన్ర్పవేశ##యేత్ | నవనామం యదా కుర్యాన్మండలం వర్ణకైర్బుధః || 264 ఇంద్రాణీపూర్వకం దేవమింద్రమైంద్ర్యాం తు పూజయేత్ | లోకపాలైః సమం తద్వదగ్నిం సంపూజయేన్నృపః || 265 ఎదురుగా గానీ, తూర్పు వైపున గానీ, దిఙ్మాలలుగానీ అది పడినదా గమనించవలెను. ఆ పళ్ళపుల్ల తనకు ఎదురుగా ముఖముచేసి పడిన దేవతాలబ్ధి, మంత్రసిద్ధి కలుగును. వేరొకవైపు తల తిప్పినట్లున్న దేవతలందరూ పరాఙ్ముఖులగుదురు. ఉత్తరము వైపు పడిన సిద్ధి సందేహాస్పదము. దక్షిణముఖమైన అతని గురువుకు మృత్యువే. అశుభమును గాంచిన, దేవదేవుని సన్నిధిన నిద్రించి వచ్చిన కలలను గురువుకు విన్నవించవలెను. అపుడు వాని శుభాశుభములను గురువు నిర్ణయించును. పౌర్ణమినాడు స్నానము చేసి దేవాలయమునకు వెళ్ళవలెను. గురువిక మరల మండలము నేర్పరచవలెను. వివిధ చిహ్నములుగల భూమిపై పదహారు రేకులతో లేదా తొమ్మిది లేదా ఎనిమిది పత్రములతో పద్మమును లిఖించి చూపవలెను. తెల్లని బట్టతో నేత్ర బంధము కట్టవలెను. వర్ణక్రమము ననుసరించి శిష్యుల ప్రవేశ పెట్టవలెను. ఆ వర్ణములచే మండలమును తొమ్మిది నామములతో చేసి ఇంద్రాణితో ఇంద్రుని తూర్పున పూజింపవలెను. అట్లే లోకపాలురతో అగ్నిని పూజించవలెను. 265 దిశి వహ్నేర్యమం యామ్యాం నైరృత్యాం చైవ నిరృతం | వరుణాం వారుణాశాయాం వాయుం వాయవ్యగోచరే || 266 ధనదాం చోత్తరే న్యస్య రుద్రమీశానగోచరే | కమండలం పూర్వతో హి స్రుచం వై దక్షిణ తథా || 267 హంసం వై పశ్చిమాయాం తు ఉత్తరాయాం స్రువం తథా | ఆగ్నేయ్యాం చ బ్రుసీం దద్యాన్నైరృత్యాం పాదుకే తథా || 268 వాయవ్యాం యోగపట్టం చ ఈశాన్యాం చ గలంతికాం | విష్ణుస్తు పూర్వతః పూజ్యో దక్షిణ చాపి శంకరః || 269 పశ్చిమే తు రవిర్దేవ ఋషయశ్చోత్తరే తథా | మధ్యే స్వయం పద్మజన్మా సావిత్రీ దక్షిణ తథా || 270 ఉత్తరే చైవ గాయత్రీ దేవీ పద్మదలేక్షణా | ఋగ్వేదం పూర్వతో న్యస్య యజుర్వేదం చ దక్షిణ || 271 పశ్చిమే సామవేదం చ అధర్వం చోత్తరే తథా | ఇతిహాసపురాణాని ఛందో జ్యోతిషమేవ చ || 272 ధర్మశాస్త్రాణి చాన్యాని ఇంద్రాదిదిక్షు విన్యసేత్ | పూర్వపత్రే బలం పూజ్య ప్రద్యుమ్నం దక్షిణ దలే || 273 దక్షిణమున యముని, నైరృతిన నిరృతుని, పడమర దిక్కున వరుణుని, వాయవ్యమున వాయువుని, ఉత్తరమున కుబేరుని, ఈశాన్యమున రుద్రుని స్థాపించవలెను. తూర్పున కమండలును, దక్షిముణన స్రుక్‌ను, పశ్చిమమున హంసను, ఉత్తరమున స్రునమును, ఆగ్నేయమున బ్రుసిని, (ముని ఆసనమును) నైరృతిన పాదుకలను, వాయవ్యమున యోగపట్టమును, ఈశాన్యమున గలంతికమును (చిన్న పాత్ర) ఇవ్వవలెను. తూర్పున విష్ణువు, దక్షిణమున శివుడు, పడమరన సూర్యుని, ఉత్తరమున ఋషులను మధ్యన స్వయముగ బ్రహ్మను పూజించవలెను. దక్షిణమున సావిత్రి, ఉత్తరాన గాయత్రి, తూర్పున ఋగ్వేదము, దక్షిణాన యజుర్వేదమును, పడమటి దిక్కున సామవేదమును, ఉత్తరాన అధ్వర్వణవేదమును ఉంచవలెను. తూర్పు మొదలగు దిక్కులందు ఇతిహాసపురాణములను, ఛందస్సును, జ్యోతిషమును, ధర్మశాస్త్రములు మొదలగువానిని యుంచవలెను. తూర్పువైపున్న దళమున బలమును, దక్షిణాన ప్రద్యుమ్నుని, పశ్చిమాన అనిరుద్ధుని, ఉత్తరాన వాసుదేవుని పూజించవలెను. 273 పశ్చిమే చానిరుద్ధం చ వాసుదేవమథోత్తరే | పూర్వతో వామదేవం చ సద్యోజాతం తు దక్షిణ || 274 ఈశానం పశ్చిమే స్థాప్య తత్పురుషం చోత్తరే తథా | ఆఘోరస్సర్వతః పూజ్య ఏషా పూజా తు మండలే || 275 పూర్వతో భాస్కరం పూజ్య దక్షిణన దివాకరం | ప్రభాకరం పశ్చిమే తు గ్రహరాజమథోత్తరే || 276 ఏవం సంపూజ్య విధివత్ బ్రహ్మాణం పరమేశ్వరం | దిఙ్మండలే తు విన్యస్య అష్టౌ కుంభాన్విధానతః || 277 బ్రాహ్మం తు కలశం మధ్యే నవమం తత్ర కల్పయేత్ | స్నాపయేన్ముక్తికామం తు బ్రహ్మణో వై ఘటేన తు || 278 శ్రీకామం వైష్ణవేనేహ కలశేన తు పార్ధివ | రాజ్యార్ధినం స్నాపయేచ్చ ఐంద్రేణ కలశేన తు || 279 ద్రవ్యప్రతాపకామం తు ఆగ్నేయఘటవారిణా | మృత్యుంజయవిధానాయ యామ్యేన స్నాపయేన్నరమ్ || 280 తూర్పున వామదేవుని, దక్షిణాన సద్యోజాతుని, పశ్చిమాన ఈశానుని, ఉత్తరాన తత్పురుషుని స్థాపించి పూజించ వలెను. అంతటా అఘోరుని పూజించవలెను. మండలమున ఇదీ పూజ - తూర్పున భాస్కరుని, దక్షిణాన దివాకరుని, పడమటి దిక్కున ప్రభాకరుని, ఉత్తరాన గ్రహరాజుని, విధివత్తు పూజింపవలె. దిగ్మండలాన విధిపూర్వకముగా ఎనిమిది కుండలనుంచ వలెను. మధ్య బ్రహ్మమను తొమ్మిదవ కలశము నుంచవలెను - ముక్తికోరువాడు బ్రహ్మ ఘటముతో, సంపదగోరువాడు విష్ణు కలశముతో, రాజ్యము గోరువాడు ఇంద్ర కలశముతో, ద్రవ్య ప్రతాపాల గోరువాడు ఆగ్నేయ కలశముతో, మృత్యుంజయమును గోరువాడు దక్షిణ కలశముతో స్నానము చేయించవలెను. 280 దుష్టప్రధ్వంసనాయాలం నైరృతేన విధీయతే | స్నాపయేద్వారుణనాశు పాపనాశాయ మానవమ్ || 281 శరీరారోగ్యకామం తు వాయవ్యేనాభిషేచయేత్ | ద్రవ్యసంపత్తికామస్య కౌబేరేణ విధీయతే || 282 రౌద్రేణ జ్ఞానకామస్య లోకపాలఘటాస్త్విమే | ఏకైకేన నరః స్నాత్వా సర్వదోషవివర్జితః || 283 జాయతే బ్రహ్మసదృశో రాజా రాజా సద్యో೭థవా నరః | అథివా దిక్షు సర్వాసు యథాసంఖ్యేన లోకపాన్ || 284 పూజయేత్తు స్వనామ్నా తు కుంభై రేవ విధానతః | ఏవం సంపూజ్య దేవాంస్తు లోకపాలాన్ర్పసన్నధీః || 285 పశ్చాత్పరీక్షితాన్శిష్యాన్బద్ధనేత్రాన్ర్పవేశ##యేత్ | దగ్ధ్వాగ్నేయ్యా ధారణయా వాయునా విథునేత్తతః || 286 సోమేనాప్యాయితాన్కృత్వా శ్రావయేత్సమయాం స్తతః | న నింద్యాద్ర్బాహ్మణాన్దేవాన్విష్ణుంబ్రహ్మాణమేవ చ || 287 ఇంద్రమాదిత్యమగ్నిం చ లోకపాలాన్గ్రహాంస్తథా | గురుం చ బ్రాహ్మణం వాపి మునీంద్రం పూర్వదీక్షితమ్ || 288 ఏవం తు సమయాన్ర్శావ్య పశ్చాద్ధోమం తు కారయేత్ | ఓం నమో భగవతే బ్రహ్మణ సర్వరూపిణ హుం ఫట్ స్వాహా || 289 షోడశాక్షరమంత్రేణ హోమయేజ్జ్వలితేనలే | గర్భాదానాదికాః సర్వా ఆహుతీస్సంప్రదాపయేత్ || 290 నైరృతము దుష్ట నాశనానికి సమర్థము. పాపనాశనానికి వారుణము, శరీరారోగ్యమునకు వాయవ్యము, ద్రవ్యలాభానికి ఉత్తరముది, జ్ఞాన ప్రాప్తికి ఈశాన కలశము శ్రేష్ఠము. ఇవి లోకపాల ఘటములు. ఒక్కొక్క కలశముతో స్నానము చేసిన నరుడు అన్ని దోషముల నుండి తొలగిపోవును. బ్రహ్మతో సమానమగును. లేదా, అన్ని దిక్కులలో యథా సంఖ్య లోకపాలుర పూజించి తన పేరుతో కలశములతో పూజించి, పరీక్షించిన శిష్యులను తరువాత కంటికి గంతలతో ప్రవేశ పెట్టవలెను. ఆగ్నేయీ ధారణతో దహింపజేసి, వాయువుతో కంపింపజేసి, సోమమునిచ్చి ప్రతిజ్ఞల వినిపింపవలెను. బ్రాహ్మణుల, దేవతల, బ్రహ్మ, విష్ణు మహేశుల, ఇంద్రాది లోకపాలుర, గ్రహముల, గురువును, పూర్వదీక్షిత మునీంద్రుని నిందించరాదు. అని ప్రతిజ్ఞను వినిపించి, తరువాత హోమమును చేయవలెను. 'ఓం నమో భగవతే బ్రహ్మణ సర్వరూపిణ హుం ఫట్ స్వాహా' అని షోడశాక్షరితో, జ్వలించు అగ్నిలో హోమము చేయవలెను. 290 త్రిసృభిస్తు వ్యాహృతిభిర్దేవదేవస్య సన్విధౌ | హోమాంతే దీక్షితః పశ్ఛాద్దాపయేద్గురుదక్షిణామ్ || 291 హస్త్యశ్వయానశకట హేమధాన్యాధికం నృప | దాపయేద్గురవే ప్రాజ్ఞో మధ్యమే మధ్యమం తథా || 292 దాపయేదపరే యుగ్మం సహిరణ్యం తు తద్గురోః | ఏవం కృతే తు యతృణ్యం మహత్సంజాయతే తథా || 293 తన్న శక్యం నిగదితుమపి వర్షశ##తైరపి | దీక్షితోథ పురా భూత్వా పాద్మం వై శ్రుణుయాద్యది || 294 తేన వేదాః పురాణాని సర్వమంత్రాస్సంగ్రహాః | జప్తాస్స్యుః పుష్కరే తీర్థే ప్రయాగే సింధుసాగరే || 295 దేవహ్రదే కురుక్షేత్రే వారాణస్యాం విశేషతః | గ్రహణ విషువే చైవ యత్ఫలం జపతాం భ##వేత్ || 296 ఫలం శతగుణం తచ్చ పుష్కరస్థం పితామహం | దృష్ట్వా ప్రాప్నోతి వివిధాన్కామాన్కామయతే యది || 297 పూజాం వైధానికీం కృత్వా దీక్షితో యః శ్రుణోతి చ | దేవా అపి తపః కృత్వా ధ్యాయంతి చ వదన్తి చ || 298 కదా మే భారతే వర్షే జన్మ స్యాదితి పార్ధివ | దీక్షితాశ్చ భవిష్యామః పాద్మం శ్రోష్యామహే కదా || 299 పాద్మం తు షోడశాత్మానం న్యస్య దేహే కదా వయం | యాస్యామస్తు పరం స్థానం యద్గత్వా న పునర్భవేత్ || 300 ఏవం జల్పంతి విబుధా మనసా చింతయంతి చ | బ్రహ్మయజ్ఞం చ కార్తిక్యాం కదా ద్రక్ష్యామహే నృప || 301 ఏవం తే విధిరుద్దిష్టో మయా೭యం కురుసత్తమ | దేవగంధర్వయక్షాణాం సర్వదా దుర్లభోహ్యసౌ || 302 గర్భదానాద్యాహుతు లన్నింటినీ ఇప్పించవలెను. దేవదేవుని ఎదుట మూడు వ్యాహృతులచే నట్లు ఇప్పించి, చివర దీక్షితుడు గురుదక్షిణ నివ్వవలెను. ప్రాజ్ఞుడు గురువుకు ఏనుగులు, గుర్రములు, బండ్లు, బంగారము, ధాన్యాది నివ్వవచ్చును. బంగారు సహితంగా రెండుగా నివ్వవలెను. ఇట్లిచ్చిన గొప్ప పుణ్యమేర్పడును. అది చెప్పుటకు వందల యేండ్లైననూ చెప్పనలవి కాదు. దీక్షితుడట పద్మపురాణమును వినినిచో, వేదములు, మంత్రములు, సంగ్రహములతో కూడా జపించినవే యగును. విశేషముగా పుష్కరమున, తీర్థమున, ప్రయాగమున, సింధుసాగరాన, దేవహ్రదమున, కురుక్షేత్రమున, వారణాసీయందు గానీ, గ్రహణాన, విషువమున జపించువారికి ఏ ఫలమో దానికి నూరురెట్లు పుష్కరమున బ్రహ్మను చూచిన కలుగును. కోరిన కోరికలను పొందును. విధివత్ పూజించి వినినచో దేవతలు కూడా తపించి ''మాకు ఎప్పుడు భారతవర్షమున జన్మ కలుగును? మేమెప్పుడు దీక్షితులమై, పద్మ పురాణమును వినెదము?' అని ధ్యానించుచూ అనుకొందురు కూడా. 'షోడశాత్మయగు పాద్మమును హృదయమున నుంచుకొని పరమ స్థానమును (పునరావృత్తి లేనిదానిని) పొందెదమెపుడు?' అనుకొందురు. కార్తీకమున బ్రహ్మ యజ్ఞమునెపుడు చూచెదమను కొందురు. రాజా! నీకీ విధిని చెప్పితిని, దేవ గంధర్వ యక్షులకూ దుర్లభమిది. ఏవం యో వేత్తి తత్త్వేన యశ్చ పశ్యతి మండలం | యశ్చేమం శ్రుణుయాచ్చైవ సర్వే ముక్తా ఇతి శ్రుతిః || 303 అతః పరం ప్రవక్ష్యామి రహస్యమిదముత్తమం | యేన లక్ష్మీర్ధృతిస్తుష్టిః పుష్టిశ్చాపి భ##వేన్నృణామ్ || 304 సర్వే గ్రహాస్సదా సౌమ్యా జాయంతే యేన పార్ధివ | ఆదిత్యవారం హస్తేన పూర్వమాదాయం భక్తితః || 305 భ##క్తైకేన క్షి పేత్తావద్యావత్సప్త చ సంఖ్యయా | తతస్తు సప్తమే పూర్ణే కుర్యాద్ర్బాహ్మణభోజనమ్ || 306 ఆదిత్యం చైవ సౌవర్ణం కృత్వా యత్నేన మానవః | రక్తవస్త్రయుగచ్ఛన్నం ఛత్రికాం పాదుకే తథా || 307 ఉపానహౌ చ దాతవ్యౌ స్థాపయేత్తామ్రభాజనే | ఘృతేన స్నపనం కృత్వా సంపూర్ణాంగద్విజాతయే || 308 దాపయేత్కృత్య విదుషే బ్రాహ్మణాయ విశేషతః | ఏవం కృతే ఫలం తస్య భ##వేదారోగ్యముత్తమమ్ || 309 ద్రవ్యసంపత్సమగ్రాప్తిరితి పౌరాణికీ క్రియా | అవిసంవాదినీ చేయం శాంతిపుష్టిప్రదా నృణామ్ || 310 తద్వచ్చిత్రాసు సంగృహ్య సోమవారం విచక్షణః | రాత్రిభక్షః క్షి పేదష్టౌ సోమవారాన్ర్పయత్నతః || 311 ప్రత్యేకం బ్రాహ్మణా భోజ్యా యథాశక్తి విచక్షణాః | నవమే తు తతః పూర్ణే కుర్యాద్ర్బాహ్మణభోజనమ్ || 312 వస్త్రయుగ్మం చ దాతవ్యం తతః సోమం ప్రదాపయేత్ | కాంస్యభాజనసంస్థం తు క్షీరసంపూరితం తతః || 313 తద్వచ్ఛత్రం పాదుకే చ తథోపానత్సమన్వితం | సంపూర్ణాంగాయ దాతవ్యం బ్రాహ్మణాయ విశేషతః || 314 స్వాత్యామంగారకం పూజ్య క్షపయేన్నక్తభోజనైః | అష్టావేవం చ యావచ్చ కుర్యాద్ర్బాహ్మణభోజనమ్ || 315 అంగారకం చ సౌవర్ణం స్థాపితం తామ్రభాజనే | దాపయేద్ర్బాహ్మణాయాథ సంపూర్ణాంగాయ చైవ హి || 316 దీనినిట్లు వాస్తవముగా తెలిసినవాడు, విన్నవాడు, చూచినవాడు అందరూ ముక్తులవుతారని శ్రుతి చెప్పుచున్నది. ఇకపై అతి రహస్యమగు దానిని చెప్పెదను. దీనిచే సంపద, ధైర్యము, సంతోషము, పుష్టి కలిగి గ్రహములన్నియు శుభములగును. ఆదివారము హస్త నక్షత్రమున ఏడింటిని పూర్తిగా విడిచి, బ్రహ్మణ భోజనము గావించవలెను. సూర్యుని బంగారముతో చేయించి ఎర్రని బట్టలో చుట్టి, గొడుగు, పాదుకలు, పాదరక్షలు కూడా రాగిపాత్రలో నుంచి దానమివ్వాలి. నేతితో స్నానము చేయించి విజ్ఞుడు, సర్వాంగ పూర్ణుడగు బ్రాహ్మణుని కివ్వవలెను. ఇలా చేసిన ఆరోగ్యము కలుగును. ద్రవ్య సంపద కూడ ప్రాప్తించునని పురాణక్రియ, మానవులకు శాంతినీ, పుష్టినీ ఇచ్చును. అట్లే, సోమవారము, చిత్రా నక్షత్రములందు రాత్రి భోజనము మాత్రమే చేయుచూ ఎనిమిది సోమవారములను గడపవలెను. శక్తి కొలది బ్రహ్మణులకు ఒక్కొక్క దినము భోజనము పెట్టవలయు. తొమ్మిదవ నాడు బ్రహ్మణులకు భోజనము పెట్టి కొత్త బట్టల జత నివ్వవలెను. కంచు పాత్రలో పాలను, అందు చంద్రుని వెట్టి దానమివ్వవలెను. అట్లే పాదుకాదులను- అంగారకునికై గూడా రాత్రి భోజనము చేయుచు ఎనిమిది దినములు గడిపి బంగారముతో అంగారకుని చేయించి రాగిపాత్రలో యోగ్యుడగు బ్రాహ్మణునికి దానమివ్వవలెను. 316 నక్షత్రానుక్తమేణౖవ క్షి పేన్నక్తాని సప్త వై | అష్టమే తు క్రమాత్ఖేటాన్సౌవర్ణాన్దాపయేద్బుదః || 317 అగ్నికార్యం చ కుర్వీత యథాదృష్టం విధానతః | ఏవం కృతే భ##వేద్యద్వై తన్ని బోధ నరాధిప|| 317 అసౌమ్యాశ్చ గ్రహాస్సర్వే సౌమ్యరూపా భవంతి చ | సర్వే రోగా వినశ్యంతి తుష్టిమాయా న్తి దేవతాః ||319 న విరుద్ధంతి తం నాగాః పితరస్తర్పితాస్తథా | దుస్స్వప్ననాశో భవతి శ్రుణ్వతాం పఠతాం తథా||320 యది భౌమో రవిసుతో భాస్కరో రాహుణా సహ | కేతుశ్చ మూర్థ్ని తిష్టంతి రౌద్రాః పీడాకరా గ్రహాః ||321 అనేన కృతమాత్రేణ ససౌభాగ్యా భవంతి హి | య ఏవం కురుతే రాజన్సదా భక్తిసమన్వితః || 322 తస్య సానుగ్రహాః సర్వే శాంతిం యచ్ఛంతి నాన్యథా | శ##నైశ్చరం రాహుకేతులోహపాత్రేషు విన్యసేత్ || 323 లోహేన కారయేచ్చైనాన్ర్బాహ్మణభ్యశ్చ దాపయేత్ | కృష్ణం వస్త్రయుగం దేయమేతేషాం ప్రీణనాయ వై || 324 సౌవర్ణాంగాశ్చ దాతవ్యాః శాంతిశ్రీవిజయేప్సుభిః | వ్రతాంతే సర్వ ఏతే గ్రహాస్సౌవర్ణకా నృప || 325 దాతవ్యాః శాంతిమిచ్ఛద్భిర్ర్వతాంతే ద్విజభోజనం | యథాశక్తి దక్షిణా చ గ్రహాణం ప్రీతయే తథా|| 326 అల్పాయాప్తేన రాజేంద్ర సర్వాన్కామానవాప్నుయాత్ | శంకరాజ్ఞానమన్విచ్ఛేదారోగ్యం భాస్కరాత్తథా ||327 హుతాశనాద్ధనమిచ్చేద్గతిమిచ్ఛేజ్జనార్దనాత్ | బ్రాహ్మ్యం పితామహాచ్ఛైవ సర్వజంతు ప్రశాంతిదమ్ ||328 నక్షత్రానుసారము ఏడు రాత్రులు గడిపి, ఎనిమిదవనాడు బంగారు ఖేటముల దానమివ్వవలె. అగ్నికార్యమూ చేయ వలె. ఇట్లు చేసిన కలుగు ఫలమును చెప్పెదను, వినుము. ప్రతికూల, క్రూర, గ్రహములనుకూలములగును, రోగములు తొలగును. దేవతలు సంతోషించెదరు. నాగులు విరోధము వహించరు. పితరులు తృప్తి నోందెదరు. దుస్స్వస్నములు నశించును. విన్నవారికి చదివిన వారికి కూడా ఇది ఫలము. అంగారక, శని, సూర్య, కేతువులు రాహువుతో సహా తలపై కూర్చున్ననూ దీనిచే సౌమ్యులై సౌభాగ్యము నిత్తురు. భక్తితో దీనినాచరించువానికి, గ్రహములన్ని అనుకూలమై అనుగ్రహించును. శాంతి నిచ్చును. శ##నైశ్చరుని రాహు కేతువులతో లోహపాత్రలందు యుంచి బ్రాహ్మణులకు దానమివ్వవలెను. వారికి గ్రహ ప్రీతికై నల్లని బట్టల నివ్వవలెను. వ్రతం చివర గ్రహాలన్నింటినీ బంగారముతో చేయించి శాంతి కోరువాడు విప్రులకు దానమివ్వాలి. భోజనము పెట్టాలి. తక్కువలో ఎక్కువ ఫలము నొసంగును. శంకరుని నుండి జ్ఞానము, సూర్యుని నుండి ఆరోగ్యము, అగ్ని నుండి ధనము, విష్ణువు నుండి మోక్షము, బ్రహ్మ నుండి బ్రాహ్మ్యమును కోరవలెను.328 భీష్మ ఉవాచ: యస్త్వయా కథితో యజ్ఞో యజ్వనాం తు ఫలం మహత్ | తథాయుషస్స్వల్పతయా అన్యైః ప్రాప్తుం న శక్యతే || 329 స్వల్పాయాసేన యత్పణ్యం సంవత్పరముపోషజం | భ##వేత్తన్మే మునిశ్రేష్ఠ కథయస్వ మహాఫలమ్ ||330 పుల స్త్య ఉవాచ :- ఇదమర్థం మహారాజ శ్వేతో రాజా మహాయశాః | ముష్టం పృష్టవాన్రృశ్నం క్షుదయా పీడితో భృశమ్||331 ఆసీదిలావృతే వర్షే శ్వేతో రాజా మహాబలః స మహీం సకలాం జిగ్యే సప్తద్వీపాం సపత్తనామ్ || 332 బ్రహ్మపుత్రో వసిష్ఠశ్చ ఆసీత్తస్య పురోహితః | స కదాచిన్నృపశ్రేష్ఠో జిత్వా పరమధార్మికః||333 పురోహితమువాచేదం వసిష్ఠం జపతాం వరం| శ్వేత ఉవాచ : భగవన్నశ్వమేథానాం సహసన్రం కర్తుముత్సహే || 334 సువర్ణరూప్య రత్నానాం దానం కర్తుం ద్విజాతిషు | పృథీవ్యా మన్నదానం తు దాతున్నే చ్చామి వై గురో ||335 నాన్నేన కించిద్దత్తేన దత్తే హేమ్ని ద్విజే ప్రభో | న కించిద్వస్త్వితి జ్ఞాత్వా న దత్తం తత్కదాచన ||336 రక్తవస్త్రమలంకారం గ్రామాంశ్చ నగరాణి చ | అదదాద్ర్బాహ్మణభ్యో ೭సౌ శ్వేతో రాజా మహాయశాః || 337 అనగా భీష్ముడిట్లడిగెను. 'మీరు చెప్పిన వానిని అల్పాయుస్సు పొందుటచే కష్టము. దాన స్వల్పాయాసముతో పొందదగు ఫలమును చెప్పుము' అనెను. అంత పులస్త్యుడు ఇట్లు చెప్పెను:- శ్వేతుడును గొప్పరాజు వసిష్ఠుని ఇదే ప్రశ్న నడిగెను. ఒక పర్యాయము ఆకలితో పీడింపబడి శ్వేతుడు ప్రశ్నించెను. చెప్పద వినుము- ఇలావృతమను దేశమునకు శ్వేతుడను మహాబలుడగు రాజు వుండెడివాడు. అతను ద్వీపములతో, పట్టణములతో నున్న భూమినంతా జయించెను. అతని పురోహితుడు బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు. ఆ రాజు ఒకప్పుడు వసిష్ఠుని ఇట్లడిగెను. 'భగవాన్! వేయి అశ్వమేధ యాగముల జేయ నుత్సహించుచుంటిని. బ్రాహ్మణులకు బంగారము వెండి, రత్నములను దానమివ్వ దలిచితిని. కానీ అన్నమును దానమివ్వను. బంగారమిచ్చిన ఏదైనా ఇచ్చినట్లగును. అన్న మిచ్చిన నేమి ఫలము? బ్రాహ్మణులకు రక్త వస్త్రములను, అలంకారాలను, గ్రామాలను, నగరాల నిచ్చితిని.' శ్వేతుడు అన్నమును గానీ, నీటినిగానీ ఎప్పుడూ దానమిచ్చి యుండలేదు.337 నాన్నం జలం తేన రాజ్ఞా దత్తమాసీత్కదాచన | తతోశ్వమేధైర్బహు భిర్యజ్వాసౌ నృపసత్తమ|| 338 స్వర్గగతః పుణ్యజితం తపస్తప్త్వార్భుదత్రయం | బ్రాహ్మీ సలోకతాం ప్రాప్తః సర్వాలంకార భూషితః ||339 నృత్యంత్యప్సరసస్తత్ర గాయంతే సిద్ధయోషితః | తుంబురుర్నారదస్తత్ర ద్వావప్యనుగతౌ సదా|| 340 అగాయేతాం మహాప్రాజ్ఞౌ మునయశ్చ తపోన్వితాః | వేదోక్తమంత్రైః స్తున్వంతి అనేకక్రతుయాజినమ్ || 341 ఏవం విభవయుక్తస్య రాజ్ఞస్తస్య మహాత్మనః | క్షుధయా పీడ్యతే దేహం తృష్ణయా చ విశేషతః || 342 స తయా పీడ్యమానస్తు క్షుధయా రాజసత్తమః | విమానేనాప్యసౌ స్వర్గం త్యక్త్వా7గాదృక్ష పర్వతమ్ || 343 యత్రాత్మమూర్తిస్తత్రాగాత్పురా దగ్ధా మహావనే | తత్రాస్థీని స్వయం గృహ్య లిహన్నాస్తే స పార్థివః 344 పునర్విమానమారుహ్య య¸° నాకం నరాధిపః | అధ కాలేన మహతా స రాజా సంశ్రితవ్రతః || 345 స్వాన్యస్థీని లిహాన్దృష్టో వసిష్ఠేన పురోధసా | ఉక్తశ్చ కిన్ను రాజేంద్ర స్వాస్థిభక్షో నరాధిప || 346 ఏవముక్తస్తతో రాజా వసిష్ఠేన మహర్షిణా | ఉవాచ వచనం చేదం శ్వేతో రాజా7థ తం మునిమ్ ||347 భగవం స్తుట్‌క్షధార్తో7హామన్న దానం పురా మయా | న దత్తం మునిశార్దూల తే న మాం క్షుత్ర్పభాధతే || 348 ఏవముక్తస్తదా రాజా వసిష్ఠో మునిపుంగవః | ఉవాచ తం నృపం భూయో వాక్యమేతన్మహామునిః || 349 కిం తే కరోమి రాజేంద్ర క్షుధితస్య విశేషితః | వస్తు కస్యాపి కించిద్థి నాదత్తముపతిష్ఠతి ||350 రత్న హేమప్రదానేన భోగవాన్జాయతే నరః | అన్నదాన ప్రదానేన సర్వకామైః ప్రదీపితః ||351 తన్న దత్తం త్వయా రాజన్ స్తోకం మత్వా నరాధిపః | శ్వేత ఉవాచ : అద త్తస్య చ సంభృతిర్యథా భవతి మే గురో || 352 వసిష్ఠ త్వత్ప్రాసాదేన తన్మమాచక్ష్వ పృచ్ఛతః వసిష్ఠ ఉవాచ : అస్త్యేకం కారణం యేన జాయతే నాత్ర సంశయః ||353 తచ్ఛృణుష్వ నరవ్యాఘ్ర కథ్యమానం మాయా తవ | ఆసీద్రాజా పురా కల్పే వినీతాశ్వేతి కీర్తితః || 354 స చాశ్వమేథమారేభే యజ్ఞం కర్తుం వరం నృపః | యజనాంతే ద్విజేంధ్రేభ్యో దత్తం గోశ్వాది యాచితమ్ ||355 అటుపై అతను అశ్వమేధ యాగములనేకము చేసి పొందిన పుణ్యముచే ప్వర్గమునకు వెళ్లెను. చాలా కాలము తపమాచరించి బ్రహ్మసాలోక్యమును పొందెను. అక్కడ అప్సరసలు నర్తించుచుండగా సిద్ధస్త్రీలు గానము చేయుచుండిరి. అక్కడ తుంబురు, నారదుడు ఇద్దరూ గానము చేసిరి. మునులు వేదోక్త మంత్రములతో స్తుతించిరి. ఇంతటి వైభవముగల రాజుకి ఆకలిదప్పులచే పీడకలిగినది. ఆ పీడతో ఆ రాజు స్వర్గాన్ని విడిచి ఋక్ష పర్వతమును చేరెను. తన శరీరము దహింపబడ్డ వనములో తన శరీరపు ఎముకలను నాకుచూ నుండి, మరల విమానమెక్కి స్వర్గమునకు వచ్చుచుండెను. చాలా కాలము గడవగా వసిష్ఠుడు తన ఎముకలను తానే నాకుచున్న శ్వేతుని చూచెను. ఎముకలను నాకుటను గూర్చి యడుగగా, శ్వేతుడు ఆ మునితో ఇట్లనెను. 'భగవాన్ ! పూర్వము నేను అన్నదానము చేసియుండలేదు. కనుక నన్నట్లు ఆకలి బాధించుచున్నది.' అనగా వసిష్టుడు 'రాజా! నేనేమి చేయగలను? ఇవ్వని వస్తువు ఎప్పటికీ చేరదు. రత్నములు, బంగారము దానమిచ్చుటచే నరుడు భోగవంతుడగును. అన్న మిచ్చిన కామములన్నీ పెచ్చరిల్లును. అట్టి అన్నమును నీవు తక్కువయని తలచి దానమివ్వలేదు.' అనగా శ్వేతుడు 'దానమివ్వని వానికి సంభృతి ఎట్లకలుగునో అనుగ్రహింపుము' అని ప్రార్థించగా వసిష్ఠుడిట్లనెను :- రాజా! ఒకే కారణము గలదు. చెప్పెద వినుము. పూర్వము వినీతాశ్వుడను రాజుండెను. అతను అశ్వమేధ యాగమును చేసి, చివర బ్రాహ్మణులకు వారు కోరిన గోవులను, అశ్వములను దానమిచ్చెను. 355 నాన్నం దత్తం తేన కించిత్స్వల్పం మత్వా యథా త్వయా| తతః కాలేన మహతా మృతో7సౌ జాహ్నవీతటే || 356 మాయాపుర్యాం వనీతాశ్వః సార్వభౌమో7భవన్నృపః | స్వర్గం చ గతవాన్సోపి యథా రాజా భవాన్ప్రభో || 357 అసావపి క్షుదావిష్ట ఏవమేవాగతో7భవత్ | మర్త్యలోకే నదీతీరే గంగాయాం నీలపర్వతే || 358 విమానేనార్కవర్ణేన భాస్వతా దేవవన్నృప | దదర్శ స స్వకం దేహం తథా స్వం చ పురోహితమ్ ||359 హోతారం బ్రాహ్మణం నామ యజంతం జాహ్నవీతటే| తం దృష్ట్వాసో7పి పునః పర్యపృచ్ఛద్ద్విజోత్తమమ్ ||360 క్షుదాయాః కారణం రాజన్స హోతా తమువాచ హ | తిలధేనుం చ వై రాజన్ ఘృతధేనుం చ సత్తమ || 361 జలదేనుం చ ధేనుం చ రసదేనుం చ పార్ధివ దేహి శీఘ్రం యేన భవాంస్తృట్‌క్షుదావర్జితో దివి|| 362 రమేత యావదాదిత్యస్తపతే దివ చంద్రమాః ఏవముక్తస్తతో రాజా తం పునః పృష్టవానిదమ్ ||363 తిలధేనుస్థితిం బ్రూహి తథా కృత్వా దదామ్యహం| పురోహిత ఉవాచ: విధానం తిలధేనోస్తు తచ్ర్ఛుణుష్వ నరాధిప ||364 ధేనుస్స్యాత్షోడశోఢక్య చతుర్భిర్వత్సకో భ##వేత్ | ఇక్షుదండమయాః పాదా దన్తాః పుష్పమయాః శుభాః ||365 నాసా గంధమయీ తస్యా జిహ్వా గుడమయీ తథా | పుచ్ఛే స్రక్కల్పనీయా స్యాద్ఘంటాభరణభూషితా|| 366 ఈదృశం కల్పయిత్వా తు స్వర్ణశృంగం తు కల్పయేత్ రౌప్యఖురాం కాంస్యదోహాం పూర్వధేనువిధానతః || 367 అతడునూ నీ వలెనే తక్కువయని యెంచి అన్నదానము చేయలేదు. కాలక్రమేణ గంగాతీరమున మరణించి నీవలెనే స్వర్గము చేరెను. నీవలెనే ఆకలిచే పీడితుడై ఇటకు వచ్చెను. భూలోకమున గంగాతీరమున నీలపర్వతముపై సూర్యకాంతిగల విమానముపై నుండి తన దేహమును, పురోహితుని జూచి అడగగా ఆకలికి కారణము చెప్పి, తిలధేనువు, ఘృతధేనువు, జలధేనువు, రసధేనువును దానమిచ్చిన ఆకలి దప్పికలు తొలగిపోవును. సూర్యచంద్రులు వున్నంతవరుకు స్వర్గమున ఆనందించగలవని పురోహితుడు చెప్పెను. అపుడా రాజు ఇట్లడిగెను- 'తిలధేను విధిని చెప్పిన అట్లే చేసి దానమిచ్చెదను' అపుడు పురోహితుడు బదులిచ్చెను. తిలధేనువు విధానమును వినుము. పదహారు అఢకములది గోవు, నాలుగింటిని దూడను చేసి చెఱకుగడలతో పాదములు, పూలతో దంతములు చేయవలెను. నాసిక గంధముతో, నాలుక బెల్లముతో, తోకవద్ద స్రక్కుతో చేయవలెను. ఘంటాభరణములతో, అలంకరించిన ధేనువును చేసి కొమ్ములను బంగారముతో చేసి , గిట్టలను వెండితో, పొదుగును కంచుతో చేసి బ్రాహ్మణునికి మంత్ర పూర్వకముగా దానమివ్వవలె. కృత్వా తాం బ్రాహ్మణాయాశు దాపయేన్మంత్రతో నృప | స్థితాం కృష్ణాజినే ధేనుం వాసోభిర్గోపితాం శుభామ్ || 368 సూత్రేణాసూత్రితాం కృత్వా పంచరత్న సమన్వితాం | సర్వౌషధిసమాయుక్తాం మంత్రపూతాం తు దాపయేత్ || 369 అన్నం మే జాయతాం సద్యః పానం సర్వరసాస్తథా | కామాన్సంపాదయాస్మాకం తిలధేనో ద్విజేర్షితా || 370 గృహ్ణామి దేవి త్వాం భక్త్యా కుటుమ్బార్ధే విశేషతః | దేహి కామన్వితాన్సర్వాం స్తిలధేనో నమోస్తుతే|| 371 ఏవం విధానతో దత్తా తిలధేనుః నృపోత్తమ | సర్వకామసమావాప్తిం కురుతే నాత్ర సంశయః || 372 జలధేనుస్తథైవేహ కుంభై రేవ ప్రకల్పితా | దత్తా తు విధినా కామాన్సద్యః సర్వాన్ప్రయచ్ఛతి || 373 ధేనుశతం తథా దత్తం పూర్ణిమానియమేన హి | సావిత్రీ ఇవ వై స్వర్గో సర్వకామప్రదా భ##వేత్|| 374 ఘృతధేను స్తదా దత్తా విధానేన విచక్షణౖః | సర్వకామసమావాప్తిం కురుతే కాంతిదా భ##వేత్ || 375 రసధేను స్తధా దత్తా కార్తీకే మాసి పార్థవ | సర్వాన్కామాన్ప్రయచ్ఛేత్తు నిత్యం సా గతిదా భ##వేత్ || 376 ఏతత్తే సర్వమాఖ్యాతం సమాసాద్బహు విస్తరం | అపారే ఫలముద్దిష్టం బ్రహ్మణా సర్వకర్మణా || 377 కృష్ణాజినమున నున్న ధేనువును వస్త్రములతో కప్పి తాడుతో గట్టి, మంత్రపవిత్రమైన దానిని దానమివ్వవలె. వెంటనే నాకు అన్నము, అన్నిరసములు కలుగుగాక! తిలధేనూ! నా కోరికలన్నీ తీర్చుము. దేవీ ! నేను నిన్ను భక్తితో కుటుంబముకై గ్రహించుచుంటిని. కోరికల దీర్చుము" అని దానమిచ్చిన, తిలధేనువు అన్ని కోరికలను నిస్సందేహముగ దీర్చును. అట్లే కడవలతో జలధేనువును దానమిచ్చిన గూడ కోరికలు దీరును. పూర్ణ నియమములతో దానమిచ్చిన నూరు ధేనువులు స్వర్గమున సావిత్రి వలె కోరికలన్నింటినీ దీర్చును. ఘృతధేనువు కాంతి నిచ్చును. కార్తీక మాసమున దానమిచ్చిన రసధేనువు గతినిచ్చును. విస్తారమైన దీనిని క్లుప్తముగా నీకు చెప్పితిని. దీని ఫలమపారమని బ్రహ్మ చెప్పెను. 377 తృష్ణయా క్షుధయా యద్వా పీడితో రాజసత్తమ | తద్దానం కార్తికే దేయం పూర్వం దేహి నరాధిప || 378 బ్రహ్మాండం సర్వసంపన్నం భూతరత్నౌషధీయుతం | దేవదానవయక్షైశ్చయుక్త మేతత్సదా విభో || 379 ఏతత్తు సకలం కృత్వా సర్వతో రజతాన్వితం | సురత్న సూర్యచంద్రాఢ్యం కార్తికే ద్వాదశీదినే || 380 అథవా పంచదశ్యాం తు కార్తికాస్వేవ నాన్యతః | పురోహితాయ గురవే దాపయేద్భక్తిమాన్నరః 381 బ్రహ్మాండోదరవర్తీని యాని భూతాని పార్థివ | తాని దత్తాని వై తేన సమాసాత్కధితం తవ || 382 యద్యజ్ఞైర్యజతో రాజన్సమాప్తవరదిక్షణౖః | సర్వం ఫలం తదఖండస్య బ్రహ్మాండస్య విశేషతః 383 యః పునః సకలం చేదం బ్రహ్మాండం ప్రదిశేన్నరః | తేన జప్తం హుతం దత్తం పఠితం కీర్తితం భ##వేత్ || 384 ఆకలిదప్పులచే బాధపడువాడు కార్తీకమున సర్వాలంకృతమైన బ్రహ్మాండమును దానమివ్వవలెను. ఓ రాజా! వెండితో, సూర్య చంద్రులను రత్నములతో చేసి కార్తీకముననే ద్వాదశినాడు లేదా పంచదశినాడు పురోహితడగు గురువుకి భక్తితో దానమివ్వవలెను. దీనిచే బ్రహ్మాండమున నున్న ప్రాణులన్నింటినీ ఇచ్చినట్లే. క్లుప్తముగా నీకు చెప్పితిని. శ్రేష్ఠమగు దక్షిణములతో, యజ్ఞములను చేసి, సమాప్తము చేయువానికి కలుగు ఫలము బ్రహ్మాండమును దానమిచ్చు వానికి కలుగును. సకలం బ్రహ్మాండమును దానమిచ్చువాడు జపము, హవనము, దానము, అధ్యయనములన్నీ చేసినట్లే. 384 రాజోవాచ :- విధిం బ్రహ్మాండదానస్య కృత్వా తన్మోక్షభాగ్భవేత్ | కాలం దేశం విప్రతీర్థం సర్వం త్వం వద మే నయ|. 385 కృతేన యేన సర్వస్య ఫలభాగీ భవామ్యహం | కుత్సితస్యాస్య భావస్య మోక్షస్స్యాదచిరాచ్చ మే || 386 వసిష్ఠ ఉవాచ :- ఏవం శ్రుత్వా తతో రాజన్పురోధాస్తస్య స ద్విజః| బ్రహ్మాండం కారయామాస సౌవర్ణం సర్వధాతుభిః || 387 యుతం నిష్క సహస్రేణ పద్మం తత్ర హ్యకల్పయత్ | తత్ర బ్రహ్మా తస్య మధ్యే పద్మరాగైరలంకృతః || 388 సావిత్య్రా చైవ గాయత్య్రా ఋషిభిర్మునిభిః సహా | నారదాద్యాః సుతాః సర్వ ఇంద్రాద్యాశ్చ దివౌకసః || 389 సౌవర్ణవిగ్రహాః సర్వే బ్రహ్మణస్తు పురఃసరాః | వరాహరూపే భగవాన్లక్ష్మ్యా సహ సనాతనః || 390 నీలం మరకతం చైవ భూషాయాం తస్య కారయేత్ | గోమేదై స్తస్య వై శోభాం కారయేత చ బుద్దిమాన్ || 391 మౌక్తికై శ్చాపి సోమస్య శోభాం వజ్రైర్దివాకరే | గ్రహాణాం చైవ సర్వేషాం సువర్ణాని చ దాపయేత్ || 392 స్వర్ణాత్సప్త గుణం రౌప్యం రౌప్యాత్తామ్రం తథావిధం | తతః సప్తగుణం కాంస్యం కాంస్యం సప్తగుణం తథా || 393 కాంస్యాత్సప్త గుణం కార్యం త్రపుచైవ నరాధిప | త్రపు సప్తగుణం సీసం సీసాల్లోహం చ కారయేత్ || 394 సప్తద్వీపాస్సముద్రాశ్చ సప్తవై కుల పర్వతాః | అనయా సంఖ్యయా కృత్వా నిపుణౖః శిల్పిభిస్తతః || 395 పాదపాదీని భూతాని రాజతాన్యేవ కారయేత్ | అరణ్యాని చ సత్త్వాని సౌవర్ణాని చ కారయేత్ || 396 వృక్షాన్వనస్పతీన్ గుల్మ తృణపర్ణాని వీరుధః | సర్వం ప్రకల్ప్య విధివత్తీర్థే దేయం విచక్షణౖః || 397 అనగా రాజు ఇట్లనేను:- 'భగవాన్! బ్రహ్మాండదానవిధి నాచరించి మోక్షము నొందును కదా! దాని కాలము, దేశము తీర్థమునంతా చెప్పుము. దేనిచే నేను ఫలము నొంది, కుత్సిత భావమునుండి విముక్తి నొందెదను? తెలియజేయుము' అనగా వసిష్ఠుడు చెప్పెను-ఇది విని రాజా, పురోహితుడు అన్ని ధాతువులతో బంగారముతో బ్రహ్మాండమును చేయించెను. దాని మధ్యన బ్రహ్మ పద్మరాగములతో అలంకరింపబడెను. సావిత్రి, గాయత్రి, నారదాదులు చుట్టియుండిరి. బంగారు విగ్రహములలో ఇంద్రాదులు ముందుండవలెను. లక్ష్మితో వరాహరూపియైన భగవంతుని జేసి అభరణముగా నీలమును, మరకతమును చేయవలెను. గోమేధములచే కాంతిని కల్పించవలెను. ముత్యములతో ఇంద్రునికి, వర్జములతో సూర్యునికి కాంతిని కల్పించవలెను. గ్రహములన్నింటికి బంగారము నివ్వవలెను. బంగారము కంటె ఏడు రెట్లు వెండి, దానికి ఏడురెట్లు రాగి, దానికి ఏడురెట్లు కంచు దానికి ఏడురెట్లు సీసమును, ఈ విధంగా చేయవలెను. సీసముకంటె ఏడు రెట్లు లోహమును చేయవలెను-ఏడు సముద్రాలు ఏడు కులపర్వతాలు ఈ ఏడు సంఖ్యలలో నుండునట్లు నిపుణులు జేసిరి. వెండితో చెట్లు మున్నగు వానిని చేయాలి. వీటన్నిటినీ విధివత్ తీర్థమున దానమివ్వాలి. 397 కురుక్షేత్రే గయాయాం చ ప్రయాగే7మరకంటకే | ద్వారవత్యాం ప్రభాసే చ గంగాద్వారే చ పుష్కరే || 398 తీర్దేష్వేతేషు వై దేయం గ్రహణ శశి సూర్యయోః | దినచ్ఛిద్రేషు సర్వేషు ఆయనే దక్షిణోత్తరే || 399 వ్యతీపాతే బహుగుణం విషువే చ విశేషతః | దాతవ్యమేతద్రాజేంద్ర విచారం నైవ కారయేత్ || 400 శాలగ్నిహోత్రిణం కృత్యా సురూపం చ గుణాన్వితం | సపత్నీకం చ సంపూజ్య భూషయిత్వా చ భూషణౖ || 401 పురోహితం ముఖ్యతమం కృత్వాన్యే చ తథా ద్విజాః | చతుర్వింశద్గుణోపేతాః సపత్నీకా నిమంత్రితాః || 402 అంగులీయాని చ తథా కర్ణవేష్టం చ దాపయేత్ | ఏవం విధాంస్తు తాన్పూజ్య తేషామగ్రే సుసంస్థితః || 403 అష్టాంగప్రణిపాతేన ప్రణమ్య చ పునః పునః | పురోహితాయ పురతః కృత్వా వై కరసంపుటమ్ || 404 యూయం వై బ్రాహ్మణాః ప్రీతా మైత్రత్వేనానుగృహ్ణతమ్ | సౌముఖ్యేన ద్విజశ్రేష్టా భూయః పూతతరస్త్విహ || 405 భవతాం ప్రీతియోగేన స్వయం ప్రీతః పితామహాః | బ్రహ్మాండేన తు దత్తేన తోషం యాతు జనార్దనః || 406 పినాకపాణిర్భగవాన్శక్రశ్చ త్రిదశేశ్వరః | ఏతే తోషం సమాయంతు అనుధ్యానాద్ద్విజోత్తమాః || 407 ఏవం స్తుత్వా తతో రాజా బ్రాహ్మణాన్వేదఫారగాన్ | బ్రహ్మాణ్డం తు గురోః ప్రాదాత్సవిధానం పునః క్షణాత్ || 408 సర్వకామైస్తతస్తృప్తో య¸° స్వర్గం సరాధిపః | తేనైవ గురుణా తచ్చ విభక్తం బ్రాహ్మణౖ సహ || 409 దత్తం తేనాపి చాన్యేభ్యో బ్రహ్మాండం చ నరాధిప | బ్రహ్మాండే భూమిదానే చ గ్రహీ చైకో న వై భ##వేత్ || 410 గృహ్ణన్దోషమవాప్నోతి బ్రహ్మహత్యాం న సంశయః | సర్వేషాం చైవ ప్రత్యక్షం దాతవ్య పరికీర్త్యవై || 411 దీయమానం చ పశ్యంతి తేపి పూతా భవంతి హి | దర్శనాదేవ తే ముక్తా భవన్త్యేవ న సంశయః || 412 యా భీమాద్వాదశీ ప్రోక్తా స్వర్ణం తోయం మృగాజినం | ఏతాని కృత్వా పశ్యన్తు దృష్టైరేతైః క్రియాఫలమ్ || 413 కురుక్షేత్రము, గయ, ప్రయాగ, అమర కంటకము, ద్వారవతీ, ప్రభాసము గంగాద్వారము, పుష్కరము మున్నగు తీర్థములందు సూర్య, చంద్ర గ్రహణ సమయాన, లేక ఉత్తర దక్షిణాయనములలో, వ్యతీపాతమున, విశేషముగా విషువత్తున దాన మివ్వవలెను. విచారణ చేయరాదు. అందమైన, గుణవంతుడగు శాలాగ్ని హోత్రుని భార్యతోసహా భూషణములతో పూజించి, పురోహితుని ముఖ్యునిగా చేసి, ఇరవై నాలుగు గుణాలుగల విప్రుల నితరులను వేలికి ఉంగరాలను, చెవులకు అభరణాలిచ్చి పూజించవలెను. అటుపై వారి ఎదుట నిలిచి సాష్టాంగ ప్రణామము చేసి, పురోహితునికి చేతులు జోడించి ఎదుట నిలిచి 'బ్రాహ్మణులగు మీరు ప్రీతిని అనుగ్రహించుడు_మీ సుముఖతచే నే పవిత్రుడనైతిని. మీరు ప్రీతి చెందిన బ్రహ్మ ప్రీతి నొందును. బ్రహ్మాండ దానముతో విష్ణువు ప్రీతిచెందుగాత' శివుడు, ఇంద్రుడు కూడా ప్రీతినొందుగాక!' అని స్తుతించి రాజు గురువుకు యథావిధి బ్రహ్మాండమును దానమచ్చి తక్షణమే కోరికలు దీరి స్వర్గమునకు వెళ్ళెను. గురువు విభజించిన బ్రహ్మాండమున ఇతరులకూ నిచ్చెను. బ్రహ్మాండ దానమున భూదానమును దానము గ్రహిచంచువాడు ఒక్కడే వుండరాదు. అట్లు గ్రహించిన బ్రహ్మహత్యా పాతకము నొందును. అందరికీ ప్రత్యక్షముగా పేరు పలికి దానమివ్వవలె. దానిని చూచిన వారునూ పవిత్రులగుదురు. చూచినంతనే ముక్తులగుదురు. భీమ ద్వాదశియని పిలువబడు దాన బంగారును, జలము, కృష్ణాజినమును చేసి చూడవలె, చూచినందున చేసినంత ఫలమందును. 413 éఅయత్నాదేవ లభ్యేత కర్తుశ్చైవ సలోకతా | సదా గావః ప్రణామ్యాశ్చ మంత్రేణానేన పార్థివ || 414 నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయీభ్య ఏవ చ | నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః || 415 మంత్రస్య చాస్య స్మరణాద్గోదాన ఫలమావ్నుయాత్ | తస్మాత్త్వమపి రాజేంద్ర పుష్కరే తీర్థ ఉత్తమే || 416 కార్తిక్యాం తు విశేషణ గోదాన ఫలమాప్స్యసి | యత్కించిద్విద్యతే పాపం స్త్రీయో వా పురుషస్య వా || 417 పుష్కరే స్నానమాత్రేణ తదశేషం ప్రణశ్యతి | పృథివ్యాం యాని తీర్థాని అసముద్రాత్తు భారత || 418 పుష్కరే తాన్యుపాయాంతి కార్తిక్యాం తు విశేషతః| ఇతి శ్రీ పాద్మపురాణ ప్రథమే సృష్టిఖండే బ్రహ్మాండదానం నామ చతుస్త్రీంశత్తమో7ధ్యాయః ప్రయత్నము లేకనే కర్తృసలోకమును పొందును. గోవులను ఎల్లప్పుడూ ఈ మంత్రముతో పూజించవలెను: 'నమోగోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయీభ్య ఏవచ, నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః' అను మంత్రము యొక్క స్మరణముచే గోదాన ఫలమును పొందును. కనుక రాజేంద్రా! నీవు కూడా ఉత్తమ తీర్థమైన పుష్కరమున, విశేషంగా కార్తీకమున గోదానము చేసిన, ఫలము నొందుదువు. స్త్రీకిగానీ పురుషునికిగానీ మిగిలిన ఏ కొద్ది పాపమైనా పుష్కరమున స్నానము చేసినంత మాత్రాన పూర్తిగా నశించును. సముద్రము వరకు భూమిపై నున్న తీర్థములన్నీ పుష్కరమున నున్నవి. విశేషంగా కార్తీక మాసమున' అని చెప్పెను. ఇది శ్రీ పాద్మ పురాణమున మొదటి సృష్టి ఖండమున బ్రహ్మాండదానమను ముప్పది నాలుగవ అధ్యాయము.