Sri Padma Mahapuranam-I
Chapters
పంచత్రింశత్తమో೭ధ్యాయః -: భీష్మ ఉవాచ :- ఉక్తం భగవతా సర్వం పురాణాశ్రయసంయుతమ్ | తథా శ్వేతేన బ్రహ్మాండం గురవే ప్రతిపాదితమ్ || 1 శ్రుత్వైతత్కౌతుకం జాతం యథా తేనాస్థిలేహనమ్ | కృతం క్షుధాపనోదార్థే అన్నదానాద్వినా ద్విజ || 2 తదహం శ్రోతుమిచ్ఛామి పృథివ్యా యే చ పార్థివాః | అన్నదానాద్దివం ప్రాప్తాః ఋతవశ్చాన్నమూలకాః ||
3 కథం తస్య మతిర్నష్టా శ్వేతస్య చ మహాత్మనః | న దత్తం తేనాన్నదానమృషిభిర్వా న దర్శితమ్ ||
4 అహో మాహాత్మ్యమన్నస్య ఇహ దత్తస్య యత్ఫలమ్ | పరత్ర భుజ్యతే పుంభిః స్వర్గశ్చాక్షయతాం వ్రజేత్ || 5 అన్నదానం పరం విప్రాః కీర్తయంతి సదోత్థితాః | అన్నదానాత్సురేంద్రేణ త్రైలోక్యమిహ భుజ్యతే || 6 శతక్రతురితిప్రోక్తః సర్వైరేవ ద్విజోత్తమైః | తేనావస్థాం తత్సదృశీం ప్రాప్తవాంస్త్రిదశేశ్వరః || 7 దానాదేవ గతః స్వర్గం త్వత్తః సర్వం శ్రుతం మయా | అపరం చ పురా వృత్తం నివృత్తం యది కర్హిచిత్ || 8 ముప్పది ఐదవ అధ్యాయము భీష్ముడనెను. పురాణాశ్రయ సంయుతమైనదంటూ మీరు చెప్పితిరి. అట్లే శ్వేతుడు తన గురువుకు బ్రహ్మాండమును దానమిచ్చుటను చెప్పితిరి. ఇది విని నాకు, అతను ఆకలిని తొలగించుకొనుటకు ఎముకలను ఆస్వాదించుట ఎట్లు జరిగెనో తెలియ కుతూహము కలిగినది. పృథివిపై అన్నదానమును చేసి స్వర్గమును పొందిన రాజులను గూర్చి విన కోరిక గలదు. ఋతువులు అన్నమే మూలముగా గలవి కదా ! మహాత్ముడగు శ్వేతుడు బుద్దిహీను డెట్లాయెను. అతను అన్నదానమెందుకు చేయలేదు? ఋషులైననూ ఎందుకు దర్శించలేదు? ఆహా! అన్నదానము యొక్క మహాత్మ్యమేమి! ఈ లోకమున దానమిచ్చిన దాని ఫలమును నరులు పరలోకమున ననుభవింతురు. అక్షయ స్వర్గమును పొందెదరు. అన్నదానమే వరమదానమని విజ్ఞులెల్లప్పుడూ కీర్తించెదరు. దానిచేతనే ఇంద్రుడు ముల్లోకముల ఆధిపత్యము ననుభవించుచున్నాడు. విప్రోత్తములు ఇంద్రుని శతక్రతువని అందురు. అన్నదానము చేతనే దేవరాజు అట్టి స్థితిని పొందినాడు. దానము చేతనే స్వర్గమునకు వెళ్ళెనని మీనుండి అంతా వింటిని , మునుపు ఎప్పుడైనా ఇలా జరిగి యుండినచో మరల విన గోరుచున్నాను. తెలియజేయుమని భీష్ముడనెను. 8 పులస్త్య ఉవాచ :- ఏతదాఖ్యానకం పూర్వమగస్త్యేన మహాత్మనా | రామాయ కథితం రాజంస్తద్వక్ష్యామి తే సాంప్రతమ్ || 9 భీష్మ ఉవాచ :- కస్మిన్వంశే సముత్పన్నో రామో೭సౌనృషత్తమః | యస్యాగస్త్యేన కథితశ్చేతిహాసః పురాతనః || 10 పులస్త్య ఉవాచ : - రఘువంశే సముత్పన్నో రామో నామ మహాబలః || 11 దేవకార్యం కృతం తేన లంకాయాం రామణో హతః | పృథివీరాజ్యసంస్థస్య ఋషయో೭భ్యాగతా గృహే || 12 ప్రాప్తాస్తే తు మహాత్మానో రాఘవస్య నివేశనమ్ | ప్రతీహారస్తతో రామమగస్త్యవచనాద్ద్రుతమ్ 13 ఆవేదయామాస ఋషీన్ ప్రాప్తాంస్తాంశ్చ త్వరాన్వితః | దృష్ట్వా రామం ద్వారపాలః పూర్ణచంద్రమివోదితమ్ || 14 కౌసల్యాసుత భద్రం తే సుప్రభాతా೭ద్య శర్వరీ | ద్రష్టుమభ్యుదయం తే೭ద్య సంప్రాప్తో రఘునందన || 15 ఆగస్త్యో మునిభిః సార్థం ద్వారి తిష్టతి తే నృప | శ్రుత్వా ప్రాప్తాన్ మునీన్ రామస్తాన్బాస్కరసమద్యుతీన్ || 16 ప్రాహ వాక్యం తదా ద్వాస్థం ప్రవేశయ త్వరాన్వితః | కిమర్ధం తు త్వయా ద్వారి నిరుధ్దా మునిసత్తమాః || 17 అపుడు పులస్త్యుడు పూర్వము అగస్త్యుడు రామునికి చెప్పిన ఈ ఆఖ్యానకము నిప్పుడు నేను నీకు చెప్పెదననెను. అంత భీష్ముడు రాముడను ఈ రాజ శ్రేష్ఠుడే వంశమున జన్మించెనని అడిగెను. అపుడు పులస్త్యుడు ఇట్లనెను. ''రాముడను మహాబలుడు రఘువంశమున జన్మించెను. దేవకార్యమును నిర్వర్తించిన యాతడు లంకయందు రావణుని జంపెను. అభిషేకము పూర్తి అయిన తరువాత రాముని నివాసానికి ఋషులు ఏ తెంచిరి. వారట్లు రాగా ప్రతీహారి అగస్త్యుని మాటను రామునికి చేరవేసెను. ఋషులు వచ్చిరని నివేదించుటకు వెళ్ళిన ద్వారపాలుడు ఉదయించిన పూర్ణ చంద్రునివలె నున్న రాముని చూచెను. 'కౌసల్యా రామా ! నీకు శుభమగుగాత! ఈనాడు సుప్రభాతమైనది. నీ అభ్యుదయమును గాంచ ఇక్కడికి వచ్చిన అగస్త్యుడు మునులతో ద్వారమువద్ద నిలిచి యున్నాడు.' అని ద్వారపాలుడనగా రాముడు వెంటనే 'ఆ ముని శ్రేష్ఠులను వెంటనే ప్రవేశ##పెట్టుము. ద్వారమువద్ద వారినెందుకు నిలువరించితివి? అని అనెను. 17 రామవాక్యాన్మునీంస్తాంస్తు ప్రావేశయద్యథా సుఖమ్ | దృష్ట్వా తు తాన్మునీన్ ప్రాప్తాన్ ప్రత్యువాచ కృతాంజలిః || 18 రామో೭భివాద్య వ్రణత ఆసనేషు న్యవేశయత్ | తే తు కాంచనచిత్రేషు స్వాస్తీర్ణేషు సుఖేషు చ || 19 కుశోత్తరేషు చాసీనాః సమ్మతాన్మునిపుంగవాః పాద్యమాచమనీయం చ దదౌ చార్ఘ్యం పురోహితః || 20 రామేణ కుశలం పృష్టా ఋషయః సర్వ ఏవ తే | మహర్షయో వేదవిద ఇదం వచనమబ్రువన్ || 21 కుశలం తే మహాబాహో సర్వత? రఘునందన | త్వాం తు దిష్ట్యా కుశలినం పశ్యామో హతవిద్విషమ్ || 22 హృతా సీతా೭తిపాపేన రావణన దురాత్మనా | పత్నీ తే రఘుశార్దూల తస్యా ఏవౌజసా హతః || 23 అసహాయేన చై కేన త్వయా రామ రణ హతః | యాదృశం తే కృతం కర్మ తస్య కర్తా న విద్యతే || 24 ఇహ సంభాషితుం ప్రాప్త్రా దృష్ట్వా పూతాః స్మ సాంప్రతమ్ | దర్శానాత్తవ రాజేంద్ర సర్వే జాతాస్తపస్వినః || 25 రావణస్య వధాత్తే೭ద్య కృతమశ్రుప్రమార్జనమ్ | దత్త్వా పుణ్యామిమాం వీర జగత్యభయదక్షిణామ్ || 26 దిష్ట్యా వర్దసి కాకుత్థ్స జయేనామితవిక్రమ | దృష్టస్సంభాషితతశ్మచాసి యాస్యామశ్చాశ్రమాన్ స్వకాన్ || 27 అరణ్యం తే ప్రవిష్టస్య మయా చేంద్రశరాసనమ్ | అర్పితం చాక్ష¸° తూర్ణౌ కవచం చ పరంతప || 28 భూయో೭ప్యాగగమనం కార్యమాశ్రమే రఘూద్వహ | ఏవముక్త్వా తు తే సర్వే మునయో೭ంతర్హితా೭భవన్ || 29 అని రాముడనగా ప్రతీహారి మునులను లోనికి ప్రవేశ##పెట్టెను. వారిని చూచి రాముడు. జోడించి నమస్కరించెను. బంగారు చిత్రములు గలవీ, చక్కని మెత్తలుగల ఆసనములలో మునులను కూర్చుండబెట్టెను. సమ్మతముతో దర్భాసనములపై కూర్చున్న ఆ ముని పుంగవులకు పురోహితుడు పాద్యమును, ఆచమనీయమును, అర్ఘ్యమునిచ్చెను. రాముడు ఋషులందరి కుశలమడగగా, వేదజ్ఞులగు మహర్షు లిట్లనిరి. 'ఓ రామా! నీకంతటా కుశలమగుగాత! మా భాగ్యముచేత శత్రువుల దునుమాడి క్షేమముగానున్న నిన్ను చూచుచుంటిమి. దురాత్ముడగు రావణుడు సీతనవహరించగా, ఆమె తేజస్సు చేతనే రావణుడు మరణించెను. నీవొక్కడివే వేరొకరి సహాయము లేకుండా రణమున రావణుని సంహరించితివి. నీవు చేసినటువంటి దానిని చేయువాడు వేరొకడు లేడు. నీతో మాట్లాడుటకు వచ్చిన మేము నిన్ను చూచి పవిత్రులమైతిమి. రావణుని వధచే కన్నీళ్ళు తుడిచవేయబడినవి. ఈ జగత్తున పుణ్యమగు అభయ దక్షిణనిచ్చి ఆజయముతో నీవు వర్దిల్లచుంటివి. రామా! నిన్ను చూచితిమి, మాట్లడితిమి. ఇక మా ఆశ్రమములకు వెళ్ళెదము. ఆరణ్యమునకు వచ్చిన నీకు నేను ఇంద్రశరాసనమును, అక్షయ తూణీరములను కవచము నిచ్చితిని. మరల ఆశ్రమమునకు రమ్ము' అని మునులందరూ అంతర్హితులైరి. గతేషు మునిముఖ్యేషు రామో ధర్మభృతాం వర | చింతయామాస తత్కార్యం కిం స్యాన్మే మునినోదితమ్ | 30 భూయో೭ప్యాగమనం కార్యమాశ్రమే రఘునందన | ఆవశ్యమేవ గంతవ్యం మయాగస్త్యస్య సన్నిధౌ || 31 శ్రోతవ్యం దేవగుహ్యం తు కార్యమన్యచ్ఛ యద్వదేత్ | ఏవం చింతయతస్త స్య రామస్యామితతేజసః|| 32 కరిష్యే నియతం ధర్మం ధర్మో హి పరమా గతిః | స తు వర్షసహస్రాణి దశ రాజ్యమకారయత్ || 33 దదతో జుహ్వతశ్చైవ జగ్ముస్తాన్యేకవర్షవత్ | ప్రజాః పాలయతస్తస్య రాఘవస్య మహాత్మనః || 34 ఏతస్మిన్నేవ దివసే వృద్దో జానపదో ద్విజః | మృతం పుత్రముపాదాయ రామద్వారముపాగతః || 35 ఉవాచ వివిధం వాక్యం స్నేహాక్షర సమన్వితమ్ | దుష్కృతం కిం తు మే పుత్ర పూర్వదేహాంతరే కృతమ్ || 36 త్వామేకపుత్రం యదహం పశ్యామి నిధనం గతమ్ | అప్రాప్త¸°వనం బాలం పంచవర్షం గతాయుషమ్ || 37 అకాలే కాలమాపన్నం దుఃఖాయ మమ పుత్రక | అకృత్వా పితృకార్యాణి గతో వైవస్వతక్షయమ్ || 38 రామస్య దుష్కృతం వ్యక్తం యేన తే మృత్యురాగతః | బాలవధ్యా బ్రహ్మవధ్యా స్త్రీవధ్యా చైవ రాఘవమ్ || 39 ప్రవేక్ష్యతి న సందేహః సభార్యే తు మృతే మయి | శుశ్రావ రాఘవః సర్వ దుఃఖశోకసమన్వితమ్ || 40 మునిపుంగవులు వెళ్ళిపోగా, రాముడు మునులనిన దానిని గూర్చి ఆలోచించెను. మరల ఆశ్రమమునకు రమ్మని ఆనిరి కదా! తప్పక అగస్త్యాశ్రమమునకు వెళ్ళెదను. దేవరహస్యమూ, ఇతర కార్యమూ ఏది వున్ననూ దానిని వినెదను. అని రాముడు 'ధర్మము నాచరించెద, ధర్మమే కదా పరమగతి' యని తలచి రాజ్యము చేయుచుండగా పదివేల సంవత్సరములు గడిచెను. దానములు, యజ్ఞములు చేయుచుండగా రామునికి పదివేల సంవత్సరములు ఒక్క సంవత్సరమువలె గడిచిపోయెను. అట్లు ప్రజా పాలన చేయుచున్న రాముని వద్దకు ఒకనాడొక వృద్ద గ్రామీణ బ్రాహ్మణుడు తన పుత్రుని మృత దేహముతో వచ్చి ద్వారమువద్ద నిలిచెను. అతను స్నేహమయమైన పలుకులనేకముగా పలికెను. పూర్వ దేహములో నే నే పాపాము చేశాను కుమారా? నే నీనాడు నిన్ను మృతునిగా జూచుచున్నాను. ఐదు సంవత్సరాల వయస్సుననే నీవు ¸°వనము పొందకనే మృత్యువు నొందితివి. నాకు దుఃఖము కలిగించుటకు అకాలమున మృత్యువు నొందితివి. పితృకార్యములు నెరవేర్చకనే మరణించితివి. మృత్యువిట్లు నిన్ను కబళించుటచే రాముని దుష్కృతము వ్యక్తమైనది. నేను నా భార్యతో మరణించి నట్లయితే రాముని బాలవధ, బ్రహ్మహత్య, స్త్రీ హత్య చుట్టుకొన గలవు' అని దుఃఖముతో ఆ వృద్ద బ్రాహ్మణుడన్న మాటలను రాముడు వినెను. 40 నివార్య తం ద్విజం రామో వసిష్ఠం వాక్యమబ్రవీత్ | కిం మయాద్య చ కర్తవ్యం కార్యమేవం విధే స్థితే || 41 ప్రాణానహం జుహోమ్యగ్నౌ పర్వతాద్వా పతే హ్యహమ్ | కథం శుద్దిమహం యామి శ్రుత్వా బ్రాహ్మణభాషితమ్ || 42 వసిష్ఠిస్యాగ్రతః స్థిత్వా రాజ్ఞో దీనస్య నారదః | ప్రత్యువాచ శ్రుతం వాక్యమృషీణాం సన్నిధౌ తదా || 43 శ్రుణు రామ యథాకాలం ప్రాప్తో వై కాలసంక్షయః | పురా కృతయుగే రామ సర్వత్ర బ్రాహ్మణోత్తరమ్ || 44 అబ్రాహ్మణో న వై కశ్చిత్తపస్తపతి రాఘవ | అమృత్యవస్తదా సర్వే జాయంతే చిరజీవినః || 45 త్రేతాయుగే పునః ప్రాప్తే బ్రాహ్మక్షత్రమనుత్తమమ్ | అధర్మ ద్వాపరే తేషాం వైశ్యాన్ శూద్రాంస్తథా ೭విశత్ || 46 ఏవం నిరంతరం జుష్టముద్భూతమనృతం పునః | అధర్మస్య త్రయః పాదా ఏకో ధర్మస్య చాగతః || 47 తతః పూర్వే భృశం త్రస్తా వర్ణా బ్రాహ్మణపూర్వకాః | భూయః పాదస్తు ధర్మస్య ద్వితీయః సమపద్యత || 48 తస్మిన్ ద్వాపరసంజ్ఞే తు తపో వైశ్యం సమావిశత్ | యుగత్రయస్య వైధర్మ్యం ధర్మస్య ప్రతితిష్ఠతి || 49 కలిసంజ్ఞే తతః ప్రాప్తే వర్తమానే యుగేంతిమే | అధర్మశ్చానృతం చైవ వవృధాతే నరర్షభ || 50 ఆ బ్రాహ్మణుని నివారించి రాముడు వసిష్ఠునితో ఇట్లనెను. 'ఈ పరిస్థితిలో నేనేమి చేయవలెను? అగ్నిలో ప్రాణములను వ్రేల్చవలెనా? పర్వతముపై నుండి క్రిందకు దూకవలెనా? బ్రహ్మణుని మాటలు విన్న వెనుక నేనెట్లు శుద్దిని పొందెదను? అని దీనముగా పలుకగా అక్కడనే వున్న నారదుడు ఋషుల సన్నిధిలో రామునితో ఇట్లనెను. 'రామా! వినుము. కాలము ననుసరించి మృత్యువాత పడినాడు. పూర్వము కృత యుగమునందు బ్రాహ్మణు లధికము. బ్రాహ్మణుడు కానివాడు లేకుండెను. తపస్సు చేసి అందరూ మృత్యువులేక చిరంజీవులై యుండిరి. త్రేతాయుగము రాగా బ్రహ్మ క్షత్రియులత్తములై యుండిరి. ద్వాపరమున అధర్మము వైశ్యులను, శూద్రులను ప్రవేశించెను. ఇట్లు నిరంతరముగా సేవింపడిన అనృతము మరల ఉద్భవించినది. మూడు పాదాల అధర్మము, ఒక పాదము మాత్రము ధర్మమేర్పడినది. బ్రాహ్మణ మొదలైన మొదటి మూడు వర్ణములు మిగుల భయము నొందినవి. మరల ధర్మము యొక్క రెండవ పాదమేర్పడినది. ద్వాపరమను యుగమున తపస్సు వైశ్యు నాశ్రయించినది. మూడు యుగముల ధర్మము యొక్క ఉనికి నిలుచుచున్నది. కలియను ఈ చివరి యుగమున అధర్మము, అనృతము వర్ధిల్లుచున్నవి. 50 భవితా శూద్రయోన్యాం తు తపశ్చర్యా కలౌ యుగే | స తే విషయపర్యంతే రాజన్నుగ్రతరం తపః || 51 శూద్రస్తపతి దుర్భుద్దిస్తేన బాలవధః కృతః | యస్యాధర్మమకార్యం వా విషయే పార్థివస్య హి || 52 పురే వా రాజశార్దూల కురుతే దుర్మతిర్నరః | క్షిప్రం స నరకం యాతి యావదాభూతసంప్లవమ్ || 53 చతుర్థం తస్య పాపస్య భాగమశ్నాతి పార్థివః | సత్త్వం పురుషశార్దూల గచ్ఛస్వ విషయం స్వకమ్ || 54 దుష్కృతం యత్ర పశ్యేథాస్తత్ర యత్నం సమాచర | ఏవం తే ధర్మవృద్దిశ్చ బలస్య వర్ధనం తథా || 55 భవిష్యతి నర శ్రేష్ఠ బాలస్యాస్య చ జీవనమ్ | నారదే నైవముక్తస్తు సాశ్చర్యో రఘునందనః || 56 ప్రహర్షమతులం లేభే లక్ష్మణం చేదమబ్రవీత్ | గచ్ఛ సౌమ్య ద్విజశ్రేష్ఠం సమాశ్వాసయ లక్ష్మణ || 57 బాలస్య చ శరీరం త్వం తైలద్రోణ్యాం నిధాపయ | గంధైశ్చ పరమోదారైసై#్తలైశ్చైవ సుగంధిభిః | 58 యథా న శీర్యతే బాలస్తథా సౌమ్య విధీయతామ్ | యథా శరీరం గుప్తం స్యాద్బాలస్యాక్లిష్టకర్మణః || 59 విపత్తిః పరిభేదో వా న భ##వేత్తథా కురు | తథా సందిశ్య సౌమిత్రం లక్ష్మణం శుభలక్షణమ్ || 60 కలియుగమున శూద్రయోనియందు తపశ్చర్య కలుగ గలదు. ఓ రాజా! దుర్భుద్దియైన శూద్రుడొకడు నీ రాజ్యమున ఉగ్ర తపమును చేయుచున్నందుచే బాలుడు వధింపబడినాడు. ఏ రాజు యొక్క పాలనలో గానీ, పురమునగానీ అధర్మమునూ, అకార్యమునూ, చెడు బుద్దిగల నరుడు చేయునో, అతనే ప్రళయము వరకు నరకము నొందును. అతని పాపమున నాలుగవ భాగమును రాజు కూడా పొందును. కనుక నీవు నీ రాజ్యమున తిరిగి వెదకుము. ఎక్కడ దుష్కృతమును చూచెదవో అక్కడే దాని ప్రతిక్రియకై యత్నింపుము. ఇట్లు చేసిన నీకు ధర్మబుద్ది, బాలునికి జీవనము కలుగగలవు.' అని నారదుడనగా రాముడాశ్చర్యమునూ, ఆనందమునూ పొంది లక్ష్మణునితో నిట్లనెను. 'నాయనా ! వెంటనే బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి అతని ఓదార్చుము. ఆ బాలుని శరీరమును 'తైలద్రోణి' (నూనె పాత్ర) లోనుంచుము. అది నాశనము కాకుండా మంచి గంధములను, సుగంధముగల తైలములను ఉపయోగించుము. ఉత్తముడగు ఆ బాలుని శరీరమును కాపాడుము. విపత్తిగానీ భేదముగానీ కాకుండునట్లు చేయుము'. అని రాముడు శుభ లక్షణములు గల లక్ష్మణుని ఆదేశించెను. 60 మనసా పుష్పకం దధ్యౌ ఆగచ్ఛేతి మహాయశాః | ఇంగితం తత్తు విజ్ఞాయ కామగం హేమాభూషితమ్ || 61 ఆజగామ ముహుర్తాత్తు సమీపం రాఘవస్య హి | సో೭బ్రవీత్ ప్రాంజలిర్వాక్యమహమస్మి నరాధిప || 62 అగ్రే తవ మహాబాహో కింకరః సముపస్థితః | భాషితం సుచిరం శ్రుత్వా పుష్పకస్య నరాధిప || 63 అభివాద్య మహర్షీంస్తాన్విమానం సో೭ధ్యరోహత | ధనుర్గృహీత్వా తూణౌ చ ఖడ్గం చాపి మహాప్రభమ్ || 64 నిక్షిప్య నగరే వీరౌ సౌమిత్రిభరతావుభౌ | ప్రాయాత్ ప్రతీచీం త్వరితో విచిన్వన్ సుసమాహితః || 65 ఉత్తరామగమత్పశ్చాద్ధిశం హిమవదాశ్రితమ్ | పూర్వామపి దిశం గత్వా తథా೭పశ్యన్న రాధిప|| 66 సర్వాం శుద్దసమాచారామాదర్శమివ నిర్మలామ్ | తతో దిశం సమాక్రామద్దక్షిణాం రఘునందనః || 67 శైలస్య ఉత్తరే పార్శ్వే దదర్శ సుమహత్సరః | తస్మిన్ సరసి తస్యంతం తాపసం సుమహత్తపః 68 దదర్శ రాఘవో భీమం లంబమానమథోముఖమ్ | తముపాగమ్య కాకుత్థ్సస్తప్యమానం తు తాపసమ్ || 69 ఉవాచ రాఘవో వాక్యం ధన్యస్త్వమమరప్రభ | కస్యాం యోనౌ తపోవృద్ది ర్వర్తతే ధృడనిశ్చయః || 70 రాముడపుడు అక్కడకు రమ్మని పుష్పకమును మనసులో ధ్యానించగా, అతని భావమును తెలిసి బంగారు అలంకరణలు గలిగి స్వేచ్చగా చరించు ఆ విమానము క్షణంలో రాముని వద్దకు వచ్చెను. చేతులు జోడించి రామునితో 'రామా! నీ కింకరుడనై ఎదుట నిలచితిని' అనగా విని రాముడు మహర్షులకు నమస్కరించి ధనుస్సు, తూణీరములు, ఖడ్గమును చేతబూని విమానమును అధిరోహించెను. నగరమున వీరులగు భరత లక్ష్మణులను వుంచి త్వరగా రాముడు పడమటి దిక్కుకి బయలుదేరెను. తరువాత హిమాలయమున్న ఉత్తర దిక్కుకి వెళ్ళెను. తరువాత తూర్ప, పడమర దిక్కులకు వెళ్ళెను. అటు తరువాత శుద్దాచారము గలిగి, నిర్మలముగా నున్న దక్షిణ దిక్కుకు రాముడు చేరెను. పర్వతము యొక్క ఉత్తర భాగమున ఒక గొప్ప సరస్సును, ఆ సరస్సున ఘోర తసస్సు చేయుచున్న తాపసిని రాముడు చూచెను. ఆ తాపసి భయంకరముగా వుండి అధోముఖముగా తపము చేయుచుండెను. అతనిని సమీపించి రాముడు ఇట్లనెను. 'ఓ తపస్వీ! నీవు ధన్యుడవు. ఏ యోనియందు తపోవృద్ది యగును? 70 అహం దాశరథీ రామః పృచ్ఛామి త్వాం కుతూహలాత్ | కోర్థో వ్యవసితస్తుభ్యం స్వర్గలోకో೭థ వేతరః || 71 కిమర్థం తప్యసే వా త్వం శ్రోతుమిచ్ఛామి తాపస | బ్రాహ్మణో వాసి భద్రం తే క్షత్రియో వాథ దుర్జయః || 72 వైశ్యస్తృతీయవర్ణో వా శూద్రో వా సత్యముచ్యతామ్ | తపః సత్యాత్మకం నిత్యం స్వర్గలోకపరిగృహే || 73 సాత్త్వికం రాజసం చైవ తచ్చ సత్యాత్మకం తపః | జగదుపకారహేతుర్హి సృష్టం తద్వై విరించినా || 74 రౌద్రం క్షత్రియతేజోజం తత్తు రాజసముచ్యతే | పరస్యోత్సాదనార్థాయ తచ్చాసురముదాహృతమ్ || 75 అంగాని నిహ్నుతే యోవా అసృగ్దిగ్ధాని భాగశః | పంచాగ్నిం సాధయేద్వాపి సిద్దిం వా మృత్యుమేవ వా || 76 అసురీ హ్యేష తే భావో న చమే త్వం ద్విజోత్తమః | సత్యం తే వదతః సిద్దిరనృతే నాస్తి జీవితమ్ || 77 తస్య తద్బాషితం శ్రుత్యా రామస్యాక్లిష్టకర్మణంః | అవాక్ఛిరస్తథా భూతో వాక్యమేతదువాచ హ|| 78 స్వాగతం తే నృపశ్రేష్ఠ చిరాద్దృష్టో೭సి రాఘవ | పుత్రభూతోc೭స్మి తే చాహం పితృభూతో೭సి మే೭నఘ || 79 అథ వా నైతదేవం హి సర్వేషాం నృపతిః పితాః | స త్వమర్చ్యో೭సి భో రాజన్ ః వయం తే విషయే తపః || 80 నేను దశరథపుత్రుడైన రాముడిని కుతూహలముతో నిన్నడుగుచుంటిని. నీవే ప్రయోజనమాశించి తపమాచరించు చుంటివి? స్వర్గలోకము కొఱకా? వేరొకటా? నీవెందుకు తపము చేయుచుంటివో వినగోరుచున్నాను. నీవు బ్రాహ్మణుడివా, క్షత్రియుడివా? తృతీయవర్ణుడగు వైశ్యుడివా? సత్యము పలుకుము. స్వర్గలోకమును పొందుటకు తపస్సు సత్యమైనది. ఆ సత్యమగు తపస్సు సాత్త్వికం, రాజసం అని రెండు విధాలుగా సృష్టికర్తచే జగదుపకారమునకై సృజింపబడినది. క్షత్రియ తేజస్సుచే జనించిన రౌద్రమగు తపస్సు రాజసము. ఇతరుల నాశనానికై చేయబడినది అసురము. రక్తంతో కూడిన తన శరీరావయవాలను ముక్కలుగా చేయువాడు, పంచాగ్నిని సాధించువాడు, సిద్ధినో, మృత్యువునో పొందును. నీ భావము అసురమని తోచుచున్నది. నీవు ద్విజోత్తముడి వలె లేవు. సత్యముపలికిన సిద్ది కలుగును. అనృతము పలికిన మృత్యువే. అని రాముడనగా తలక్రిందులుగా తపమాచరించుచున్న ఆ తాపసి ఇట్లనెను. 'ఓ రాజా! నీకు స్వాగతము. చాలాకాలము తరువాత నిన్ను చూచితిని. నేను నీకు పుత్రుడివంటివాడిని. నీవు నాకు తండ్రి వంటి వాడివి. లేదా, రాజు అందరికీ తండ్రివంటివాడు. అట్టి నిన్ను అర్చించవలెను. మేము నీ పాలనలో తపముచేయుచుంటిమి. చరామస్తత్ర భాగ్యో೭స్తి పూర్వం సృష్టః స్వయంభువా| న ధన్యాః స్మో వయం రామ ధన్యస్త్వమసి పార్థివ || 81 యస్య తే విషయే హ్యేవం సిద్ధిమిచ్ఛంతి తాపసాః తపసా త్వం మదీయేన సిద్ది మాప్నుహి రాఘవ || 82 యదేతద్బవతా ప్రోక్తం యోనౌ కస్యాం తు తే తపః | శూద్రయోని ప్రసూతో೭హం తప ఉగ్రం సమాస్థితః || 83 దేవత్వం ప్రార్థయే రామ స్వశరీరేణ సువ్రత | న మిథ్యాహం వదే భూప దేవలోకజిగీషయా|| 84 శూద్రం మాం విద్ది కామత్థ్స శంబూకం నామ నామతః | బాషతస్తస్య కాకుత్సః ఖడ్గం తు రుచిరం ప్రభమ్ || 85 నిష్కృష్య కోశాద్విమలం శిరశ్చిచ్ఛేద రాఘవః | తస్మిన్ శూద్రే హతే దేవాః సేంద్రాశ్చాగ్నిపురోగమాః || 86 సాధు సాధ్వితి కాకుత్థ్సం ప్రశశంసుర్ముహుర్ముహుః | పుష్పవృష్టిశ్చ మహతీ దేవానాం సుసుగంధినీ || 87 ఆకాశాద్విప్రముక్తా తు రాఘవం సర్వతో೭ కిరత్ | సుప్రీతాశ్చా೭ బ్రువన్ దేవా రామం వాక్యవిదాంవరమ్ || 88 సురకార్యమిదం సౌమ్య కృతం తే రఘనందన | గృహాణ చ వరం రామ యమిచ్ఛసి మహావ్రత || 89 త్వత్కృతేన హి శూద్రో೭యం సశరీరో೭భ్యగాద్ధివమ్ దేవానాం భాషితం శ్రుత్వా రాఘవః సుసమాహితః || 90 అందు మాకు పూర్వము బ్రహ్మచే సృజింపబడిన బాగము కలదు. రామా! మేము ధన్యులము గాము. నీకే ధన్యుడవు. నీ పాలనలో తాపసులిట్లు సిద్దిని గోరి తపము జేయుచున్నందున నీవే ధన్యుడవు. నీవు నా తపస్సుచే సిద్దిని పొందుము. ఏజాతి యందు జన్మ యని నీ వడిగితివి కదా! శూద్రయోని యందు జన్మించితిని నేను. దేవత్వము కోరి నా శరీరముతో తపస్సు నాచరించుచుంటిని. దేవలోకమును జయింపగోరితిని. అబద్ధమును పలుకుటలేదు. రామా! నేను శూద్రుడను - శంబూకుడని నా పేరు, అని అతను పలుకుచునుండగానే రాముడు అందమైనది, కాంతిగలదీ యగు తన ఖడ్గమును ఒర నుండి లాగి అతని తలను నరికెను. ఆ శూద్రుడట్లు చంపబడగా ఇంద్రుడు మొదలగు దేవతలు 'బాగు, బాగు' యని రాముని పొగిడిరి. వారట్లు మరల మరల పొగడగా దేవతలు సుగంధము గల పుష్పముల వర్షించిరి. ఆకాశము నుండి పడిన ఆ పుష్క వృష్టి రామునిపై నంతటా పడెను. అపుడు ప్రీతి నొందిన దేవతలు రామునితో నిట్లనిరి. 'రామా! నీవు దేవ కార్యమును పరిపూర్ణము చేసితివి. ఇష్టమైన వరము కోరుకొనుము. నీ చేత ఈ శూద్రుడు శరీరముతో స్వర్గమునకు వెళ్ళెను. అని దేవతలనగా రాముడు కొద్ది కాలము ఆలోచించి, చేతులు జోడించి ఇంద్రునితో నిట్లనెను. 90 ఉవాచ - ప్రాంజలిర్వాక్యం సహస్రాక్షం పురందరమ్ | యది దేవాః ప్రసన్నా మే వరార్హో యది వా ೭ప్యహమ్ || 91 కర్మణా యది మే ప్రీతా ద్విజపుత్రాః స జీవతు | వరమేతద్ది భవతాం కాంక్షితం పరమం హి మే || 92 మమాపరాధాద్బాలో೭సౌ బ్రాహ్మణసై#్యకపుత్రకః | అప్రాప్తకాలః కాలేన నీతో వైవస్వతక్షయమ్ || 93 తం జీవయత భద్రం వో నానృతీ స్యామహం గురోః | ద్విజస్య సంశ్రుతో హ్యర్థో జీవయిష్యామి తే సుతమ్ || 94 మదీయేనాయుషా బాలం పాదేనార్ధేన వా సురాః జీవేదయం వరో మహ్యం వరకోట్యధికో వృతః || 95 రాఘవస్య తు తద్వాక్యం శ్రుత్వా విబుధ సత్తమాః ప్రత్యూచుస్తే మహాత్మానం ప్రీతాః ప్రీతిసమన్వితాః || 96 నిర్వృతో భవ కాకుత్థ్స బ్రాహ్మణసై#్యకపుత్రికః | జీవితం ప్రాప్తవాన్ భూయః సమేతశ్చాపి బంధుభిః 97 యస్మిన్ ముహూర్తే , కాకుత్థ్స శూద్రో೭యం వినిపాతితః | తస్మిన్ముహూర్తే సమసా జీవేన సమయుజ్యత ||98 స్వస్తి ప్రాప్నుహి భద్రం తే సాధయామ పరంతపః | అగస్త్యస్యాశ్రమపదే ద్రష్టారః స్మ మహామునిమ్ || 99 స తథేతి ప్రతిజ్ఞాయ దేవానాం రఘనందనః | ఆరురోహ విమానం తం పుష్పకం హేమభూషితమ్ || 100 ఇతి శ్రీ పాద్మపురాణ పంచత్రింశత్తమో೭ధ్యాయః దేవతులు నా యెడ ప్రసన్నులైన, నేను వరమున కర్హుడనైనచో ఆ బ్రాహ్మణ పుత్రుడు జీవించు గాక | ఇదే మీ నుండి నే కోరువరము. నా అపరాధము చేతనే బ్రాహ్మణ బాలుడు అకాల మృత్యువు వాతబడినాడు. అతనిని మీరు జీవింపుడు. నేను గురువుకు అనృతము చేయువాడను గాను - నేను నీ పుత్రుడిని బ్రతికించెదనని బ్రాహ్మణునికి మాట నిచ్చితిని. నా ఆయుష్షుతో, సగముతో లేదా పాదముతో నైనా ఈ బాలుడు బ్రతికినచో ఇదే కోటి వరములకంటె ఎక్కువ.' అని రాముడనగా దేవతలు ప్రీతితో ఇట్లనిరి. 'రామా! నీవు ఆనందముగా నుండుము. బ్రాహ్మణుని ఏకైక కుమారుడు మరల బ్రతికి బంధువులతో కలిసియున్నాడు. ఏ క్షణమున శంబూకుడు నేల కూలెనో ఆ క్షణాన విప్ర పుత్రుడు జీవించెను. రామా! నీకు శుభమగు గాక! మేము వెళ్ళివచ్చెదము. అగస్త్యాశ్రమమున మహామునిని చూడబోవుచున్నాము.' అనగా రాముడు అట్లే యని దేవతల నంపి బంగారు అలంకరణాలతో భూసితమైన పుష్పకమను విమానము నెక్కెను. ఇది ముప్పది ఐదవ అధ్యాయము.