Sri Padma Mahapuranam-I    Chapters   

చత్వారింశోధ్యాయః

పులస్త్య ఉవాచ: అథ యోగవతాం శ్రేష్ఠమసృజద్భూరివర్చసమ్‌ |

స్రష్టారం సర్వలోకానాం బ్రహ్మాణం సర్వతో ముఖమ్‌ || 1

తస్మిన్హిరణ్మయే పద్మే బహుయోజనవిస్తృతే | సర్వతేజోగుణమయే పార్థివైర్లక్షణౖర్వృతే || 2

తచ్చ పద్మం పురాభూతం పృథివీరూపముత్తమమ్‌ | నారాయణసముద్భూతం ప్రవదంతి మహర్షయః || 3

యత్పద్మం సారసా దేవీ పృథివీ పరికథ్యతే | యే పద్మకేసరా ముఖ్యాస్తాన్దివ్యాన్సర్యతాన్విదుః || 4

హిమవంతం చ నీలం చ మేరుం నిషధమేవ చ | కైలాసం శృంగవంతం చ తథాద్రిం గంధమాదనమ్‌ || 5

పుణ్యం త్రిశిఖరం చైవ కాంతం మందరమేవ చ | ఉదారం పింజరం చైవ వింధ్యమస్తం చ పర్వతమ్‌ || 6

ఏత ఏవ గణానాం చ సిద్ధానాం చ మహాత్మనామ్‌ | ఆశ్రయాః పుణ్యశీలానాం సర్వకామఫలప్రదాః || 7

ఏతేషామంతరే ద్వీపో జంబూద్వీప ఇతి స్మృతః | జంబుద్వీపస్య సంస్థానం యాజ్ఞీయా యత్ర చ క్రియాః || 8

తేభ్యో యద్‌ద్రవతే తోయం దివ్యామృతరసోపమమ్‌ | దివ్యతీర్థశతా ధారాః సరస్యః సర్వతః స్మృతాః || 9

నలుబదియవ అధ్యాయము

పులస్త్యుడు చెప్పెను. అటుపై శ్రేష్టమైన యోగి, మిక్కిలి కాంతిగలవాడు, సర్వలోకముల సృజించువాడు, అన్నివైపుల ముఖముండు బ్రహ్మను పెక్కు యోజనముల విస్తారము గలది, సర్వతేజోగుణములు, పార్థివగుణములు గల బంగారు పద్మమున సృజించెను. ఆ పద్మము సనాతనము, పృథివీరూపము గలది, ఉత్తమమైనది. నారాయణునుండి ఉద్భవించినదియని మహర్షులందురు. ఆ పద్మమే రసవంతమైన పృథివి అని చెప్పబడును. దివ్యపర్వతములే ఆ పద్మకేసరములు. హిమవంతము, నీల, మేరు, నిషధ, కైలాస, శృంగవంత, గంధమాదన, త్రిశిఖర, మందర, పింజర, వింధ్య, అస్తాచల పర్వతములు, ఆ పద్మముయొక్క కేసరములు. ఇవే పుణ్యశీలురైన గణముల, సిద్ధుల మహాత్ముల ఆశ్రయములు. అన్ని కోర్కెల తీర్చునవి. వీనిమధ్యనున్న ద్వీపము జంబూద్వీపమనబడును. ఎక్కడ యజ్ఞసంబంధిక్రియలు జరుగునో అదే జంబూద్వీపము. వానినుంచి ద్రవించు నీరు దివ్యామృతరసము వంటిది. ఎల్లెడెల రసవంతములైన దివ్యతీర్థశతముల ధారలు వున్నవి. 9

యాన్యేతానీహ పద్మస్య కేసరాణి సమంతతః | అసంఖ్యేయాః పృథివ్యాం తే వివిధాశ్చైవ పర్వతాః || 10

యాని పర్ణాని పద్మస్య భూరిపర్వాణి పార్థివ | తే దుర్గమాః శైలచితా వ్లుెచ్ఛదేశాః ప్రకీర్తితాః || 11

యాన్యధోభాగపత్రాణి తాని వాసాస్తు భాగశః | దైత్యానామసురాణాం చ పన్నాగానాం చ పార్థివ || 12

తేషాం మధ్యేంతరం యత్తు తద్రసాతల సంజ్ఞితమ్‌ | మహాపాతక కర్మాణో మజ్జంతే యత్ర మానవాః || 13

చతుర్ధిశాసు సంఖ్యాతాశ్చత్వారః సలిలాకరాః | ఏవం నారాయణస్యార్థే మహీ పుష్కరసంభవా || 14

ప్రాదుర్భావోప్యయం తస్మాన్నామ్నా పుష్కరసంజ్ఞితః | ఏతస్మాత్కారణాద్యజ్ఞే పురాణౖః పరమర్షిభిః || 15

యజ్ఞియైర్వేదదృష్టాంతైర్యజ్ఞైర్యూపచితిః కృతా | ఏవం భగవతా తేన విశ్వవ్యాప్యధరా చితా || 16

పర్వతానాం నదీనాం చ రచనా చైవ నిర్మితా | విశ్వస్య యశ్చాప్రతిమ ప్రభావః ప్రభాకరాభో వరుణోమితద్యుతిః || 17

శ##నైః స్వయంభూః వ్యసృజత్సుషుప్తం జగన్మయః పద్మనిధిం మహార్ణవే |

విఘ్నస్తపసి సంభూతో మధుర్నామ మహాసురః || 18

తేనై వ చ సహోద్భూతో హ్యసురో నామ కైటభః |

భూమిపై ఎల్లెడలనున్న లెక్కలేని వివిధ పర్వతములు పద్మముయొక్క కేసరములు. రాజా ! పద్మముయొక్క పెద్ద ఈనెలుగల ఆకులు, చేరవీలులేనివి, పర్వతములు గలవియగు వ్లుెచ్ఛదేశములే. క్రిందివైపు పత్రములు దైత్యుల, అసురుల నాగుల వాసములే. వాని మధ్య నున్నది రసాతలమనునది. మహాపాతకములు జేయు మానవులక్కడ మునిగెదరు. ఇక నలువైపుల నాలుగు సముద్రములు కూడా చెప్పబడినవి. ఇట్లు నారాయణునికై పృథివి పుష్కరమున నుద్భవించినది. కనుక ఈ ప్రాదుర్భావమునూ పుష్కరమనే అందురు. కనుక పురాతనులైన పరమర్షులు యజ్ఞమున యజ్ఞసంబంధి వేదదృష్టాంతములచే యూపచయనము చేయుదురు. ఈ విధంగా భగవంతుడు విశ్వమును వ్యాపించి భూమిని ఎన్నుకొనెను. పర్వతముల, నదులను నిర్మించెను. అసమానప్రతిభగలవాడు, సూర్యునివంటి కాంతిగలవాడు, వరుణుడు, అమితకాంతిగలవాడు అగు స్వయంభువుడు మహాసముద్రమున శయనించిన పద్మనిధిని సృజించెను. తపము నాచరించుచున్న అతనికి విఘ్నముగా మధువను అసురుడు పుట్టెను. అతనితోడనే కైటభుడను అసురుడూ జన్మించెను. 18

తౌ రజస్తమసోర్భూతౌ సంభూతౌ తామసౌ గుణౌ || 19

ఏకార్ణవం జగత్సర్వం క్షోభ##యేతాం మహాబలౌ | దివ్యరక్తాంబరధరౌ శ్వేతదీప్తోగ్రదంష్ట్రిణౌ || 20

కిరీటమకుటోదగ్రౌ కేయూరవలయోజ్జ్వలౌ | మహావివృతతామ్రాక్షౌ పీనోరస్కౌ మహాభుజా || 21

మహాగిరేః సమాననౌ జంగమావిన పర్వతౌ | నతమేఘప్రతీకాశావాదిత్యప్రతిమాననౌ || 22

విపులాభోగకేయూరకరాభ్యామతి భీషణౌ | పాదసంచారవిన్యాసైర్విక్షిపంతావివార్ణవమ్‌ || 23

కంపయంతౌ హరిమివ శయానం మధుసూదనమ్‌ | తౌ తత్ర విచరంతౌ తు పుష్కరే విశ్వతో ముఖౌ || 24

యోగినాం శ్రేష్ఠమత్యంతం దీప్తం దదృశుస్తదా | నారాయణసమాజ్ఞాతం సృజంతమఖిలాః ప్రజాః || 25

దైవతాని చ విశ్వాని మానసాంశ్చ సుతానృషీన్‌ | తతస్తావూచతుస్తత్ర బ్రహ్మాణమసురోత్తమౌ || 26

దుష్టౌ యుయుత్సూ సంక్రుద్ధౌ క్రోధవ్యాకులితేక్షణౌ | కస్త్వం పుష్కరమధ్యస్థః సితోష్ణీషశ్చతుర్భుజః || 27

ఆవామగణయన్మోహాదాస్సే త్వం విగతస్పృహః | ఏహ్యాగచ్ఛావయోర్యుద్ధం దేహి త్వం కమలోద్భవ || 28

ఆవాభ్యాం పరమేశాభ్యామశక్తః స్థాతుమర్ణవే | తత్ర కశ్చ భ##వేత్తుభ్యం యేన చాత్ర నియోజితః || 29

కః స్రష్టా కశ్చ తే గోప్తా కేన నామ్నాభిధీయతే ||

వారిద్దరూ రజస్సు, తమస్సులనుండి జన్మించినవారు. తామసగుణముగలవారు. గొప్పబలము కలిగి ఏకార్ణవమైన జగత్తునంతా క్షోభ##పెట్టసాగిరి. దివ్యమైన ఎర్రని బట్టలు ధరించినవారు, తెల్లనివి, ఉగ్రమైనవగు కోరలు గలవారు, కిరీట మకుటముచే జ్వలించువారు, కేయూరవలయములచే ఉజ్జ్వలముగా నున్నవారు. పెద్దవి, గుండ్రముగానున్న ఎర్రని నేత్రములు గలవారు. విశాలవక్షస్థలముగలవారు, మహాభుజులు, మహాపర్వత సమానముఖముగలవారు, కదలుచున్న పర్వతములవలెనున్నవారు, క్రొత్తమేఘమువలె శోభిల్లువారు, సూర్యునివలె జ్వలించు ముఖముగలవారు, వెడల్పగు కేయూరములు చేతికిధరించి భీషణముగనున్న వారు. అట్టి మధుకైటభులు తమ అడుగులచే భూమిని దద్దరిల్లజేయుచు, నిద్రించిన విష్ణుమూర్తిని కంపించునట్లు జేయుచుండిరి. పుష్కరమున ఎల్లడెల దిరుగుచూ వారు యోగిముఖ్యుడు. ప్రకాశమానుడగు బ్రహ్మ, నారాయణుని ఆజ్ఞచే ప్రజలందరిని సృజించుచుండగా చూచిరి. బ్రహ్మ దేవతలను విశ్వములను మానసపుత్రులను, ఋషులను, సృజించుచుండెను. అపుడు దుష్టులు, యుద్ధముచేయదలచినవారు, క్రోధముతోనున్నవారు, కోపముతో తిరుగు కన్నులు గలవారు అగువారు బ్రహ్మతో ననిరి. 'తెల్లని తలపాగాదాల్చి, నాలుగుభుజములు గలిగి పుష్కరముననున్న నీవెవరు ? మమ్ములను లెక్కపెట్టక, స్పృహలేనట్లున్న నీవు మాతో యుద్ధము చేయుము. అర్ణవముననుండుటకు శక్తుడవుకాదు. ఇక్కడ నిన్ను నియోగించినది యెవరు ? సృజించినదెవరు? రక్షించునదియెవరు ? అతని పేరేమి? ' 29

బ్రహ్మోవాచ : ఈశ్వరః ప్రోచ్యతే లోకే విష్ణుశ్చానంతశక్తిధృత్‌ || 30

తత్సకాశాత్తు జాతం మాం స్రష్టారమవగచ్చతమ్‌ |

మధుకైటభౌ ఊచతుః :- నావయోః పరమం లోకే కించిదస్తి మహామునే || 31

ఆవాభ్యాం ఛాద్యతే విశ్వం తమసా రజసా చ వై | రజస్తమోమయావావామృషీణామతిలంఘినౌ || 32

ధర్మశీలం ఛాదయన్తౌ నాశకౌ సర్వ దేహినామ్‌| అవాభ్యాం యుజ్యతే లోకో దుస్తరాభ్యాం యుగే యుగే || 33

ఆవామర్థశ్చ కామశ్చ యజ్ఞస్సర్వపరిగ్రహః | సుఖం యత్ర మదో యత్ర యత్ర శ్రీః కీర్తిరేవ చ || 34

యేషాం యత్కాంక్షితం కించిత్తత్తదావాం విచింతయ |

బ్రహ్మోవాచ :- ఆవాభ్యాం సంహతౌ దృష్ట్వా యువాం పూర్వం పరాజితౌ || 35

తం సమాధాయ గుణినం సత్త్వం చాస్మి సమాశ్రితః |

యః పరో యోగయుక్తాత్మా యోక్షరః సత్త్యమేవ చ || 36

రజస్తమశ్చైవ యః స్రష్టా విశ్వసంభవః | తతో భూతాని జాయంతే సాత్త్వికానీతరాణి చ || 37

స ఏవ యువయోర్నాశం వాసుదేవః కరిష్యతి | స్వపన్నేవ తతో దేవో బాహుయోజనవి స్తృతౌ || 38

బాహూ నారాయణో బ్రహ్మ కృతవానాత్మమాయయా |

కృష్యమాణౌ తతస్తస్య బాహుభ్యాం బాహుశాలినౌ || 39

అనగా బ్రహ్మ ఇట్లనెను :- అనంత శక్తిని గల విష్ణువు లోకమున ఈశ్వరుడనబడును. అతని నుండి జన్మించిన వానిగా నన్ను తెలుసుకొనుడు-' అది విని కైటభులు ''ఓ మహామునీ! లోకమున మాకంటే పరమగునది లేదు. తమస్సు, రజస్సులచే మేము విశ్వమునంతా కప్పియున్నాము. అవే మేము - ఋషుల దాటి వర్తించువారము. ధర్మమును, శీలమును కప్పి యుంచుచున్నాము. ప్రాణులను నశింపజేయువారము మేమే. దాట వీలులేని మాచేత ప్రతి యుగమున ఈ లోకము కలియుచున్నది. మేమే అర్థము, కామము, యజ్ఞము, పరిగ్రహము. ఎక్కడ సుఖము, మదము, లక్ష్మి, కీర్తి వున్నదో, ఎవరెవరు దేనిని కోరెదరో అదంతా మేమే యని తెలియుము.'' అనగా బ్రహ్మ ఇట్లనెను:- ''పూర్వము మేము మీ రిద్దరూ కలిసియున్నది చూసి ఓడించితిమి. అట్టి ఆ సగుణుని సమాధానపరిచి నేను సత్త్వము నాశ్రయించి యున్నాను. ఎవరైతే యోగ యుక్తుడు, శ్రేష్ఠుడు, అక్షరుడు, సత్త్వమూర్తి, రజస్సును తమస్సును సృజించువాడు, విశ్వకారణుడు, సాత్త్విక మరియు ఇతర ప్రాణుల కారణము అగు వాసుదేవుడే మిమ్ము నశింపజేయును. తన మాయచే అపుడు బ్రహ్మ నారాయణునికి నిద్రించుచునే పొడవైన బాహువుల సృజించెను. ఆ బాహువులచే లాగబడుచూ మధుకైటభులు లావైన పక్షుల వలె చరించసాగిరి. 39

చేరతుస్తౌ విగళితౌ కశునావివ పీవరౌ | తతస్తావాహతుర్గత్వా వాసుదేవం సనాతనమ్‌ || 40

పద్మనాభం హృషీకేశం ప్రణిపత్య నతావుభౌ | జానీవస్త్వాం వివ్వయోనిం త్వామేకం పురుషోత్తమమ్‌ || 41

ఆవయోశ్చైవ హేతుం త్వాం జానన్తౌ బుద్ధికారణమ్‌ |

అఘోఘదర్శనం సత్యం యతస్త్వాం విద్ధ శాశ్వతమ్‌ || 42

తతస్త్వామభితో దేవ కాంక్షావః ప్రసమీక్షితుమ్‌ | అఘోఘదర్శనోసి త్వం నమస్తే సమితిం జయ || 43

శ్రీభగవానువాచ:- కిమర్థం మామనుబ్రూధ యువామసురసత్తమౌ |

గతాయుష్కౌ యువాం భూయస్త్వహో జివితుమిచ్చథః || 44

మధుకైటభా ఊచతుః :- యస్మిన్న కశ్చిన్మృతవాన్‌ దేవ తస్మిన్వధం ప్రభో |

ఇచ్ఛావః పుత్రతాం చైవ భవతః సుమహాతపః || 45

శ్రీభగవానువాచ :- యువయోర్బాఢమేతత్‌ స్సాద్భవిష్యే కలిసంభ##వే ||

భవిష్యథో న సందేహః సత్యమేతద్ర్బవీమి వామ్‌ || 46

వరం ప్రదాయాథ మహాసురాభ్యాం సనాతనో విశ్వధరః సురోత్తమః |

రజస్తమోజౌ తు తదాంజనోపమౌ మమర్ధతావూరుతలేమరప్రభుః || 47

అపుడు వారు వెళ్ళి వాసుదేవుని, సమస్కరించి ఇట్లనిరి :- ''విశ్వ కారణముగా పురుషోత్తముడైన నిన్ను మేమెఱుగుదుము. మాకు కూడా హేతువుగా బుద్ధి కారణుడైన నిన్ను తెలిసి, నీవు సత్యము, అమోఘ దర్శనుడవు అని తెలిసికొంటిమి. కనుక దేవా! నిన్ను అన్నివైపుల నుండి చక్కగా చూడగోరుచుంటిమి. అమోఘ దర్శనుడైన నీకు నమస్కారము.'' అనగా విష్ణుమూర్తి వారితో ఇట్లు పలికెను. ''అసుర సత్తములైన మీరు నాతో మాట్లాడుచుంటి రెండుకు? ఆయుష్షు తీరిన మీరు మరల జీవించ గోరుచుంటిరి.'' అనగా వారు ''దేవా! ఇంతవరకూ ఎవరూ మరణించని చోట మమ్ము వధించుము. మహా తపస్వీ! మేము నీ పుత్రులుగా జన్మింప గోరుచుంటిమి.'' అనగా విష్ణుమూర్తి ''రాబోవు కలియుగమున మీరు పుత్రులవగలరు. సత్యమే చెప్పుచుంటిని.'' అని వరమునిచ్చి, కాటుక వలె నున్న ఆ మహాసురులను రజస్సు- తమస్సుల నుండి జన్మించినవారిని తన తొడలపై నుంచి నలిపివేసెను. 47

స్థిత్వా తస్మింస్తు కమలే బ్రహ్మా బ్రహ్మవిదాం వరః | ఊర్ధ్వబాహుర్మహాతేజాస్తపో ఘోరం సమాశ్రితః || 48

ప్రజ్వలన్నివ తేజోభిర్భాభిః స్వాభిస్తమోనుదః | జభాసే స తు ధర్మాత్మా సహస్రాంశురివాంశుభిః || 49

అథాన్యద్రూపమాస్థాయ ప్రభుర్నారాయణోవ్యయః | ఆజగామ మహాతేజా యోగాచార్యో మహాయశాః || 50

సాంఖ్యాచార్యశ్చ మతిమాన్‌ కపిలో బ్రహ్మాణాం వరః | ఉభావపి మహాత్మానౌ పూజితౌ తత్ర తత్పరౌ || 51

తౌ ప్రాప్తావూచతుస్తత్ర బ్రహ్మాణమమితౌజసమ్‌ | పరావర విశేషజ్ఞా పూజితౌ చ మహర్షిభిః || 52

బ్రహ్మ సంపరివేద్యం తే విశాలజగదాస్థితౌ | గ్రామణీస్సర్వ భూతానాం బ్రహ్మా త్రైలోక్య పూజితః || 53

తయోస్తద్వచనం శ్రుత్వా విబోధ్య గతయోః పరమ్‌ |

త్రీనిమాన్‌ కృతవాన్‌ లోకాన్యధేయం బ్రహ్మణః శ్రుతిః || 54

పుత్రం స్వసంభవం చైకం సముత్పాదితవాన్భువమ్‌ | తదాగ్రే చాగతస్తస్య బ్రహ్మమానససంభవః || 55

ఉత్పన్నమాత్రో బ్రహ్మాణముక్తవాన్మానసః సుతః | కిం కుర్మస్తవ సాహాయ్యం బ్రవీతు భగవానితి || 56

బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడగు బ్రహ్మ కమలమున నిలిచి, చేతులు పైకెత్తి, గొప్ప తేజస్సు గలిగి ఘోర తపస్సు నాచరించును. తన తేజస్సుచే జ్వలించుచున్నట్లుండును. ఆ కాంతిచే చీకటిని పారదోలుచూ కిరణములతో సూర్యని వలె ప్రకాశించెను. అపుడు అవ్యయుడగు నారాయణుడు వేరొక రూపమును ధరించి వచ్చెను. బ్రహ్మ శ్రేష్ఠుడగు కపిలుడును సాంఖ్యాచార్యుడూ వచ్చెను. బ్రహ్మ వారిని పూజించెను. పర మరియు అవరముల విశేషము తెలిసినవారు అమిత తేజస్వియగు బ్రహ్మతో నిట్లనిరి. ''విశాల జగత్తు యొక్క సరియగు స్థితికై వేదము నీకు వ్యక్తమగును.'' అది విని సర్వభూత గ్రామముల నడుపు బ్రహ్మ ముల్లోకముల సృజించెను. ముందు భూః అను తన పుత్రు నొకని పుట్టించెను బ్రహ్మ మానసపుత్రుడగు అతను, పుట్టగానే బ్రహ్మ ఎదుట నిలచి, ''నీకు సాహాయ్యమేమి చేయగలము? తెలుపుమ''నెను. 56

బ్రహ్మోవాచ :- యదేష కపిలో నామ బ్రహ్మనారాయణ స్తథా |

వదతో భవతస్త్వం తు తత్కురుష్వ మహామతే || 57

బ్రహ్మణా స తథోక్తస్తౌ ప్రాహ భూపసముత్థితః | శుశ్రూషురస్మి యువయోః కిం కరోమి కృతాంజలిః || 58

శ్రీ భగవానువాచ:- యుత్సత్యమక్షరం బ్రహ్మ అష్టాధశవిధం చ తత్‌ |

యత్సత్యమమృతం తత్తు పరం పదనుస్మర || 59

ఏతద్వచో నిశ##మ్యేవం స య¸° దిశముత్తరామ్‌ | గత్వా చ తత్ర స బ్రహ్మ ఆగమత్‌ జ్ఞానచక్షుషా || 60

తతో బ్రహ్మ భువర్నామ ద్వితీయమసృజత్‌ ప్రభుః | సంకల్పయిత్వా మనసా తమేవచ మహామనాః || 61

తతః సోప్యబ్రవీద్వాక్యం కిం కరోమి పితామహ | పితామహా సమాజ్ఞాతో బ్రహ్మాణం సముపస్థితః || 62

బ్రాహ్మణస్యామృతరసోనుభూతస్తేన వై తతః | ప్రాప్తః స పరమం స్థానం స తయోః పార్శ్వమాగతః || 63

తస్మిన్నపి గతే సోథ తృతీయమసృజత్‌ ప్రభుః | మోక్షప్రవృత్తి కుశలం సువర్నామయుతం ప్రభుః || 64

సోపి తం ధర్మమాస్థాయ తయోరేవాగమద్గతిమ్‌ | ఏవం పుత్రాస్తయోప్యేతే గతాః శంభోర్మహాత్మనః || 65

తాన్గ్రుహీత్వా సుతాంస్తస్య తౌ గతావూర్జితాం గతిమ్‌ | నారాయణశ్చ భగవాన్‌ కపిలశ్చ యతీశ్వరః || 66

యం కాలం తే గతా బ్రహ్మ బ్రహ్మ తం కాలమేవ చ |

తపో ఘోరతరం భూయః సంశ్రితః పరమం పదమ్‌ || 67

అపుడు బ్రహ్మ 'ఈ కపిలుడను బ్రాహ్మణుడు. నారాయణుడు నీకేమి చెప్పెదరో నీవు దానిని ఆచరించుమ'నెను. అంత ఆ మానసపుత్రుడు వారితో 'నేను మీకు సేవకుడను ఏమి చేయవలెనో చెప్పిన వినెద'నని చేతులు జోడించి పలికెను. అపుడు విష్ణుమూర్తి సత్యమైనది, నాశనములేనిది. పద్దెనిమిది విధాలుగా నున్న అమృతమైనదగు పరమపదమును స్మరించుమనెను. అది విని యతడు ఉత్తర దిక్కుకు వెళ్ళెను. వెళ్ళి జ్ఞానముతో బ్రహ్మ ఆయెను. అపడు సృష్టికర్త భువః అను రెండవ వానిని సృజించగా అతనూ 'ఏమి చేయవలెనో చెప్పుమనెను. పితామహుని ఆజ్ఞచే బ్రహ్మను చేరిన అతను బ్రాహ్మణుని అమృతరసము ననుభవించెను. అటుపై పరమపదము నొంది వారి చెంత చేరెను. అతనుకూడా వెళ్ళగా ప్రభువు మూడవవానిగా మోక్ష ప్రవృత్తియందు సమర్థుడగు సువః అను వానిని సృజించెను. అతనూ ఆ ధర్మమును పొంది వారి గతినే పొందెను. ఇట్లు ఆతని ముగ్గురు పుత్రులూ గతినొందిరి. నారాయణుడు, కపిలుడగు యతీశ్వరుడు వారిని గ్రహించి గొప్ప గతినొందిరి. ఏ కాలమున వారు వెళ్ళిరో ఆ కాలముననే బ్రహ్మ మరల ఘోర తపము నాశ్రయించెను. 67

న చ శక్తస్తతో బ్రహ్మా ప్రభురేకస్తపశ్చరన్‌ | శరీరార్థాత్తతో భార్యాముత్పాదయతి తచ్ఛుభామ్‌ || 68

ఆత్మనః సదృశాన్‌ పుత్రాన్‌ అసృజద్వై పితామహః విశ్వే ప్రజానాం పతయో యోభ్యో లోకా వినిఃసృతా || 69

విశ్వేశం ప్రథమం తావన్మహాత్మా తపసాత్మజమ్‌ | సర్వత్ర సంహతం పుణ్యం నామ్నా ధర్మం స సృష్టవాన్‌ || 70

దక్షం మరీచిమత్రిం చ పులస్త్యం పులహం క్రతుమ్‌ | వసిష్ఠం గౌతమం చైవ భృగుమంగిరసం మునిమ్‌ || 71

అత్యద్భుతాః స్వకృత్యేన జ్ఞేయాస్తే తు మహర్షయః | త్రయోదశగుణారంభా యే వంశాస్తు మహర్షిణామ్‌ || 72

అదితిర్దితిర్ధనుః కాలా అనాయుః సింహికా ఖసా | ప్రాచీ క్రోధా చ సురసా వినతా కద్రురేవ చ || 73

దక్షస్యాపత్యమేతద్యై కన్యా ద్వాదశ పార్థివ | నక్షత్రాణి చ చంద్రస్య వింశతిస్సప్త చోర్జితాః || 74

మరీచేః కశ్యపః పుత్రస్తపసా నిర్మితః కిల | తసై#్మ ద్వాదశకన్యాశ్చ దక్షస్తాశ్చాన్వమన్యత || 75

నక్షత్రాణి చ సోమాయ తదైవం దత్త వానృపిః | రోహిణ్యాదీని సర్వాణి పుణ్యాని కురునందన || 76

లక్ష్మీస్సరస్వతీ సంధ్యా విశ్యేశా చ మహాయశాః | దేవీ సరస్వతీ చైవ బ్రహ్మణా నిర్మితాః పురా || 77

ఏతాః పంచ వరిష్ఠా వై సుర శ్రేష్ఠాయ పార్థివ | దత్తా ధర్మాయ భద్రం తే బ్రహ్మణా దృష్టకర్మణా || 78

అపుడు బ్రహ్మ తా నొక్కడే తపమాచరించుటకు శక్తి లేనివాడై, తన శరీర సగభాగము నుండి శుభలక్షణములు గల భార్యను వుత్పన్నము జేసెను. పితామహుడు తన వంటి పుత్రులను కూడా సృజించెను. వారు విశ్వమున ప్రజాపతులు, లోకములు వాని నుండే బయల్వెడలినవి. మొదట ధర్మమను వాడిని మహాత్ముడిని అతను సృజించెను. దక్ష ప్రజాపతి, మరీచి, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠ ప్రజాపతి, గౌతముడు, భృగువు, అంగిరసుడు, అను ప్రజాపతులు. తమ కార్యములచే మహర్షులని తెలియదగువారు కలిగిరి. మహర్షుల వంశములు పదమూడు గుణము లారంభము గలవి. అదితి, దితి, దను, కాల, అనాయు, సింహిక, ఖస, ప్రాచీ, క్రోధ, సురస, వినత, కద్రువ అను పన్నెండుగురు కన్యలు దక్షుని పుత్రికలు. అట్లే ఇరువది యేడు నక్షత్రములూ దక్షుని పుత్రికలు. మరీచి తపస్సుచే కశ్యపుని పుత్రునిగా నిర్మించినాడు. ఆ కశ్యపునికి దక్షుడు పన్నెండుగురు కన్యలను, చంద్రునికి ఇరువదియేడు నక్షత్రములనిచ్చి వివాహము చేసెను. పూర్వము లక్ష్మి, సరస్వతి, సంధ్య, విశ్వేశ, దేవియను ఐదుగురు కన్యలను బ్రహ్మ సృజించి సురశ్రేష్ఠుడగు ధర్మునికి ఇచ్చెను. 78

యా రూపార్థవతీ పత్నీ బ్రహ్మణః కామరూపిణీ | సురభిః సహసా భూత్వా బ్రహ్మాణం సముపస్థితా || 79

తతస్తామగమద్‌ బ్రహ్మా మైథునే లోకపూజితః | లోకసర్జనహేతుజ్ఞో గవామర్థాయ సత్తమ || 80

జజ్ఞే చైకాదశ సుతాన్‌ విపులాన్‌ ధర్మసంజ్ఞితాన్‌ | రక్తసంధ్యాభ్రసంకాశాన్‌ మహతస్తిగ్మతేజసః || 81

తే రుదంతో ద్రవంతశ్చ గతవంతః పితామహమ్‌ | రోదనాద్ధ్రవాణాచ్చైవ రుద్రా ఏవేతి తే స్మృతాః || 82

నిర్‌హృతిశ్చైవ సంధ్యశ్చ తృతీయశ్చాప్యయోనిజః | మృగవ్యాధః కపర్దీ చ మహావిశ్వేశ్వరశ్చ యః || 83

అహిర్బుధ్న్యశ్చ భగవాన్‌ కపాలీ చైవ పింగళః | సేనానీశ్చ మహాతేజా రుద్రాశ్చైకాదశ స్మతాః || 84

తస్యామేవ సురభ్యాం చ గావో జాతాః సురాశ్చ యే | అజశ్చైవ తు హంసశ్చ తదైవ నృపసత్తమ || 85

ఓషధ్యః ప్రవరాయాశ్చ సురభ్యాస్తాస్సముత్ఠితాః | ధర్మాల్లక్ష్మీస్తథా కామం సాధ్యాత్సాధ్యా వ్యజాయత || 86

భవం చ ప్రభవం చైవ కృశాశ్వం సువహం తథా | అరుణం వరుణం చైవ విశ్వామిత్ర చలధ్రువౌ || 87

హవిష్మంతం తనూజం చ విధానాభిమతావపి | వత్సరం చైవ భూతిజం చ సర్వాసురనిషూదనమ్‌ || 88

సుపర్వాణం బృహత్కాంతిం సాధ్యాలోకనమస్కృతమ్‌ | వాసవానుగతా దేవీ జనయామాస వై సురాన్‌ || 89

కోరిన రూపమును ధరించునది, బ్రహ్మ పత్ని, రూపార్థవతియగు సురభి ఒక్కమారుగా వుదయించి బ్రహ్మను చేరినది. అపుడామెను లోక పూజితుడగు బ్రహ్మ మైథునముకోరి చేరెను. లోకముల సృజించు హేతువు దెలిసిన బ్రహ్మ ధర్మలక్షణులైన పదకొండుగురు పుత్రులను, రక్త సంధ్య గల ఆకాశము వంటివారిని, తీక్షణ తేజము గలవారిని పుట్టించెను. వారు రోదించుచూ, పారి పితామహుని జొచ్చిరి. రోదించుటచే, పారుటచే వారు రుద్రులను పేరు గాంచిరి. నిర్‌హృతి, సంధ్య, అయోనిజ, మృగవ్యాధుడు, కపర్ది, మహా విశ్వేశ్వరుడు, అహిర్‌బుధ్న్యుడు, భగవాన్‌, కపాలి, పింగళుడు, సేనాని అని వారి పేర్లు. ఆ సురభి నుండే గోవులు, సురులు, అజ, హంస మరియు శ్రేష్ఠమైన ఓషధులు బయల్వెడలినవి. భవుడు, ప్రభవుడు, కృశాశ్వుడు, సువహుడు, అరుణుడు, వరుణుడు, విశ్వామిత్రుడు, చలధ్రువుడు, హవిష్మంతుడు, తనూజుడు, విధానుడు, అభిమతుడు, వత్సరుడు, భూతి, సుపర్వుడు, వాసవునితో సహ దేవిచే సృజింపబడిరి.

ధరం వై ప్రథమం దేవం ద్వితీయం ధ్రువమవ్యయమ్‌ | విశ్వావసుం తృతీయం చ చతుర్థం సోమమీశ్వరమ్‌ || 90

తతో7నురూపమాయం చ యమం తస్మాదనంతరమ్‌ | సప్తమం చ తథా వాయుమష్టమం నిర్హృతిం తథా || 91

ధర్మస్యాపత్యమేతద్వై సురాభ్యాం తదజాయత | విశ్వేదేవాశ్చ విశ్వయాం ధర్మాజ్జాతా ఇతి స్మృతాః || 92

దక్షశ్చైవ మహాబాహుః పుష్కరస్తమ ఏవ చ | చాక్షుషశ్చ తతోత్రిశ్చ తథా భద్రమహోరగౌ || 93

విశ్వాంతక వసుర్బాలో నికుంభశ్చ మహాయశాః | రురుదశ్చాతి సిద్ధౌజా భాస్కరప్రమితద్యుతిః 94

విశ్వాన్‌ దేవాన్దేవమాతా విశ్వేషాం జనయత్సుతాన్‌ | మరుత్వతీ మరుత్వతో దేవానజనయత్సుతాన్‌ || 95

అగ్నిశ్చక్షూరవిర్జ్యోతిః సావిత్రీ మిత్రమేవ చ | అమరం శరవృష్టించ సుకర్షం చ మహత్తరమ్‌ || 96

విరాజం చైవ రాజం చ విశ్వాయుం సుమతిం తథా | అశ్వగం చిత్రరశ్మిం చ తథా చ నిషధం నృపమ్‌ || 97

భూయ ఏవం చాత్మవిధిం చారిత్రం పాదమాత్రగమ్‌ | బృహంతం వై బృహద్రూపం తథా చైవ సనాభిగమ్‌ || 98

మరుత్వతీ ప్రజా జజ్ఞే జ్యేష్ఠాంతం మరుతాం గణమ్‌ | అదితిః కశ్యపాజ్జజ్ఞే ఆదిత్యాన్‌ ద్వాదశైవ హి || 99

మొదట ధరుడిని, రెండవ వానిగా అవ్యయుడగు ధ్రువుని, మూడవ వానిగా విశ్వావసుని, నాల్గవ వానిగా సోముని తరువాత తగినవానిగా ఆయువుని, తరువాత యముని, ఏడవ వానిగా వాయువుని, ఎనిమిదవ వానిగా నిర్‌హృతిని సురయందు ధర్ముడు జనింప చేసెను. విశ్వయందు ధర్మునికి విశ్వేదేవతలు పుట్టిరని తెలియును. దక్షుడు, పుష్కరుడు, తముడు, చాక్షుషుడు, అత్రి, భద్రుడు, మహోరగుడు, విశ్వాంతకవసువు, బాలుడు, నికుంభుడు, రురుదుడు, అతిసిద్దోజస్వి అను విశ్వేదేవతలను దేవమాత జనింపజేసెను. మరుత్వతి మరుద్దేవతలను జనింపజేసెను. అగ్ని యను చక్షువు, రవి యను జ్యోతి, సావిత్రి, మిత్ర, అమరుడు, శరవృష్టి, సుకర్షుడు, విరాజుడు, రాజు, విశ్వాయువు, సుమతి, అశ్వగుడు, చిత్రరశ్మి, నిషధుడు, బృహంతుడు, సనాభిగుడు అను పుత్రులను మరుత్వతి కనెను. ఇక అదితి కశ్యపుని ద్వారా పన్నెండుగురు ఆదిత్యులను కనెను. 99

ఇంద్రో విష్ణుర్బగస్త్వష్టా వరుణోంశోర్యమా రవిః | పూషా మిత్రశ్చ వరదో ధాతా పర్జన్య ఏవ హి || 100

ఇత్యేతే ద్వాదశాదిత్యా వరిష్టాస్త్రిదివౌకసామ్‌ | ఆదిత్యస్య సరస్వత్యాం జజ్ఞాతే ద్వౌ సుతౌ వరౌ || 101

తపః శ్రేష్ఠౌ గుణశ్రేష్ఠౌ త్రిదివస్యాతి సంమతౌ | దనుస్తు దానవాన్‌ జజ్ఞే దితిర్‌ దైత్యాన్‌ వ్యజాయత || 102

కాలా తు కాలకేయాంస్తాన్‌ సురాన్‌ రాక్షసాంస్తథా | అనాయుషాయాస్తనయా వ్యాధయశ్చ మహాబలాః || 103

సింహికా గ్రహమాతా చ గంధర్వజననీ మునిః | ప్రాచీత్వప్సరసాం మాతా పుణ్యానాం భారతేతరా || 104

క్రోధాసాః సర్వభూతాని పిశాచా సా చ పార్థివ | జజ్ఞే యక్షగణాంశ్చైవ రాక్షసాంశ్చ విశాం పతే || 105

చతుష్పదాని సత్త్వాని ఏతా గాశ్చైవ సౌరభీ | పురాణపురుషశైవ మాయాం విష్ణుర్హరిః ప్రభుః || 106

కథితస్తే7ను పూర్వేణ సంస్తుతశ్చ మహర్షిభిః |

యశ్చేతమగ్ర్యం శ్రుణుయాత్పురాణం సదా నరః పర్వసు చేత్పఠేత || 107

అవాప్య లోకం స హి వీతరాగః పరత్ర చ స్వర్గఫలాని భుంక్తే |

చక్షుషా మనసా వాచాకర్మణా చ చతుర్వాధమ్‌ || 108

ఇంద్రుడు, విష్ణువు, భగుడు, త్వష్ట, వరుణుడు, అంశముడు, అర్యముడు, పూష, మిత్రుడు, వరదుడు, ధాత, వర్జన్యుడు, అనువారు దేవతా శ్రేష్ఠులగు ద్వాదశాదిపత్యులు. ఆదిత్యునికి సరస్వతి యందు ఇద్దరు శ్రేష్ఠులగు పుత్రులు జనించిరి. వారు తపస్సులో, గుణములో శ్రేష్ఠులు. స్వర్గమున అతి ప్రియులు - దనువు దానవులను, దితి దైత్యులను పుట్టించెను. కాలకాలకేయులను, అసురులను, రాక్షసులను జనింపజేయగా అనాయువు వ్యాధులను జనింపజేసెను. సింహిక గ్రహముల తల్లి, ముని గంధర్వుల తల్లి, ప్రాచి అప్సరసల తల్లి. క్రోద అన్ని భూతములను, పిశాచములను, యక్ష గణములను, రాక్షసులను జనింపజేసెను. చతుష్పాత్తులను (నాలుగు కాళ్ళు) జీవులు, గోవులు వీనిని సురభి జనింప జేసెను. మాయయందు విష్ణువు, పురాణపురుషుడు, మహర్షులచే స్తుతింప బడినవాడు చెప్పబడెను. ఈ అగ్రమగు పురాణమును వినువాడు, పర్వదినములందు పఠించువాడు, రాగము తొలిగి పుణ్యలోకము నొందును. పరమున స్వర్గఫలముల నొందును. కళ్ళచే, మనస్సుచే, వాక్కుచే, కర్మచే - నాలుగు విధాలుగా కృష్ణుని ప్రసన్నుని జేసికొనినవానిని కృష్ణుడనుగ్రహించును. 108

రాజ్యం చ లభ##తే రాజా నిర్ధనశ్చోత్తమం ధనమ్‌ || 109

క్షీణాయుర్లభ##తే చాయుః పుత్రకామో7థ సంతతిమ్‌ | యజ్ఞార్థినస్తథా కామాంస్తపాంసి వివిధాని చ || 110

యం యం కామయతే కామం తం తం లోకేశ్వరాల్లభేత్‌ |

సర్వాం విహాయ య ఇమం పఠేద్వై పౌష్కరం హరేః || 111

ప్రాదుర్భావం నరశ్రేష్ఠ న తస్య హ్యశుభం భ##వేత్‌ | ఏష పౌష్కరకో నామ ప్రాదుర్భావో మహాత్మనః || 112

కీర్తితస్తు మహారాజ వ్యాసశ్రుతి నిదర్శనాత్‌ | విష్ణుత్వం శ్రుణు మే విష్ణోర్హరిత్వం చ కృతే యుగే || 113

వైకుంఠత్వం చ దేవేషు కృష్ణత్వం మానుషేషు చ | ఈశ్వరస్య హితసై#్యషా కర్మణాం గహనా గతిః || 114

సాంప్రతం భూతభవ్యం చ శ్రుణు రాజన్యథాతథమ్‌ | అవ్యక్తో వ్యక్తలింగస్థో య ఏష భగవాన్ప్రభుః || 115

నారాయణో హ్యనంతాత్మా ప్రభవాప్యయ ఏవ చ | ఏష నారాయణో భూత్వా హరిరాసీత్సనాతనః || 116

బ్రహ్మా వాయుశ్చ సోమశ్చ ధర్మః శక్రో బృహస్పతిః | అదితే రపి పుత్రత్వమేత్యజః కురునందన || 117

ఏష విష్ణురితి ఖ్యాత ఇంద్రస్యావరజో విభుః | ప్రసాదనం తస్య విభో7దిత్యాః పుత్రకారణమ్‌ || 118

వధార్థం సురశత్రూణాం దైత్యదానవరాక్షసా | ససర్జాథ సురాన్‌ కల్పే బ్రహ్మాణం చ ప్రజాపతీన్‌ || 119

అసృజన్మానసాంస్తత్ర బ్రహ్మవంశాననుత్తమాన్‌ | తేభ్యో7భవన్మహాత్మభ్యః పరం బ్రహ్మ సనాతనమ్‌ || 120

రాజు రాజ్యమును (కోల్పోయిన) పొందును. నిర్ధనుడు ధనమును, క్షీణాయువు ఆయుస్సును, పుత్రకాముడు సంతతిని, యజ్ఞార్థులు వారి కోరికలను, తపస్సులను పొందెదరు. దేని దేనిని కోరునో దానిని లోకేశ్వరుని నుండి పొందును. అన్నింటిని వదిలి ఈ పుష్కర ప్రాదుర్భావమును చదువు వారికి అశుభము కలుగదు. మహారాజా! వ్యాస శ్రుతి, నిదర్శనముచే మహాత్ముడగు విష్ణుమూర్తి ప్రాదుర్భావమగు ఈ పుష్కరమను దానిని చెప్పితిని. విష్ణుత్వమును. కృతయుగమున హరిత్వమును, దేవతలయందు వైకుంఠునిగా నుండుటను, మానవులలో కృష్ణుడనుటను వినుము. హితుడగు ఈశ్వరుని కర్మల గతి ఇది గంభీరమైనది - రాజా! ఇపుడు గతమును, భనిష్యత్తును యథాతథముగా వినుము. ఈ నారాయణుడను ప్రభువు అవ్యక్తుడైననూ వ్యక్తలింగములయందుండువాడు, అనంతాత్ముడు, కారణము, నాశకారకుడు కూడా. నారాయణుడే మునుపు హరిగా అయ్యెను. బ్రహ్మ, వాయువు, సోముడు, ధర్ముడు, ఇంద్రుడు, బృహస్పతి, అదితి పుత్రుడు-గా అజుడగు హరి జన్మించును. ఇతనే ఇంద్రుని తమ్మునిగా విష్ణువని ప్రసిద్ధుడగును. అతనిని ప్రసన్నుని చేసుకొనుటయే అదితి పుత్రుడగుటకు కారణము. దైత్య దానవ రాక్షసుల వధకై అదితి పుత్రుడాయెను. పూర్వ కల్పమున సురులను, బ్రహ్మను, ప్రజాపతులను మానస పుత్రులుగా సృజించెను. ఆ మహాత్ముల నుండి పరం బ్రహ్మ సనాతనమైన దేర్పడెను. 120

ఏతదాశ్చక్యభూతస్య విష్ణోః కర్మానుకీర్తిత | కీర్తనీయస్య లోకేషు కీర్త్యమానం నిబోధ మే || 121

వృత్తే వృత్రవధే భీష్మ వర్తమానే కృతే యుగే | ఆసీత్రైలోక్యవిఖ్యాతః సంగ్రామస్తారకామయః || 122

యత్ర తే దానవా ఘోరాః సర్వే సంగ్రామదుర్జయాః | ఘ్నంతి దేవాసురాన్‌ సర్వాన్‌ సయక్షోరగరాక్షసాన్‌ || 123

తే వధ్యమానా విముఖాశ్ఛిన్నప్రహరణా రణ | తాత్రారం మనసా జగ్ముర్దేవం నారాయణం ప్రభుమ్‌ || 124

ఏతస్మిన్నంతరే మేఘా నిర్వాణాంగారవర్చసః | సార్కగణచంద్రగ్రహణం ఛాదయంతో నభస్తలమ్‌ || 125

చండవిద్యుద్గణోపేతా ఘోరనిర్హ్రాదకారిణః | అన్యోన్య వేగాభిహతాః ప్రవవుః సప్తమారుతాః || 126

దీప్తతోయాః సనిర్ఘాతైః సహ వజ్రానలానిలైః | రవైస్సు ఘోరైరుత్పాతైర్దహ్యమాన మివాంబరమ్‌ || 127

పేతురుల్కాసహస్రాణి నిపేతుః ఖచరాణ్యపి | దైవాని చ విమానాని నిప్రపంత్యుత్పతంతి చ || 128

చతుర్యుగాంతసమయే లోకానాం యద్భయం భ##వేత్‌ | అరూపవంతి రూపాణి తస్మిన్నుత్పాతలక్షణ || 129

తస్మాద్దుష్ప్రథితం సర్వం న ప్రాజ్ఞాయత కించన | తిమిరౌఘపరిక్షిప్తా న రేజుశ్చ దిశో దశ || 130

ఇది ఆశ్చర్యమును కలిగించు విష్ణు కర్మల కీర్తనము - లోకములయందు కీర్తించబడదగిన వానిని నేను కీర్తించగ వినుము. భీష్మా! వృత్ర వధకాగా, కృతయుగము నడుచుచుండగా ముల్లోకములలో ప్రసిద్ధమైన తారకామయ యుద్ధముకలిగెను. సంగ్రామమందు జయింప శక్యముగాని ఘోరమైన దానవులు దేవాసురలు నందరినీ యక్ష, సర్ప, రాక్షసులతో కలిపి, వధించుచుండిరి. అపుడు దేవాదులు విముఖులై, ఛేదింపబడిన ఆయుధములతో సొలసి, రక్షకుడగు నారాయణుని మనసుచే చేరిరి. ఇంతలో, ఆరిపోవు మిణుగురు కాంతిగలిగిన మేఘములు సూర్య చంద్ర గ్రహణములతో ఆకాశతలమును కప్పివేయుచూ, ప్రచండమైన మెరుపు తీగలతో, భయంకర ధ్వనినిచేయుచూ, పరస్పరము వేగముగా కొట్టుకొనుచూ ఏడు వాయువులు వీచినవి. వెలుగుచున్న జలములు, వజ్ర, అగ్ని వాయువులతో కూడి, ఘోర ధ్వని చేయుచూ, ఉత్పాతములతో ఆకాశమును దహించుచున్నట్లుండెను. వేలకొద్ది ఉల్కలు నేల రాలినవి. ఆకాశమున చరించునవి నేల కూలినవి. దేవ విమానములు నేలను దాకి మరల రివ్వున ఎగియుచుండినవి. నాలుగు యుగముల అంతమున లోకములకు ఎట్టి భయము కలుగునో అట్లు ఆ ఉత్పాత లక్షణమున రూపము గలవి కూడా రూపము లేనివాయెను. దానిచే అంతటా చీకటి అలుముకొని ఏదీ తెలియకపోయెను. దశ దిశలు చీకటితో దట్టముగా కప్పబడి ప్రకాశించలేదు. 130

వివేశ రూపిణి కాలీ కాలమేఘావగుంఠితా | ద్యౌర్న భాత్యభిభూతార్కా ఘోరేణ తమసా వృతా || 131

తాం ఘనౌఘాం సతిమిరాం దోర్భ్యామాచ్ఛిద్య స ప్రభుః |

వపుః స్వం దర్శయామాస దివ్యం కృష్ణవపుర్హరిః || 132

బలాహకాంజననిభం బలాహకతనూరుహమ్‌ | తేజసా వపుషా చైవ కృష్ణం కృష్ణమివాచలమ్‌ || 133

దీప్తపీతాంబరధరం తప్తకాంచనభూషణమ్‌ | ధూమ్రాంధకారవపుషం యుగాంతాగ్ని మివోత్థితమ్‌ || 134

వృత్తద్విగుణపీనాంసం కిరీటాచ్ఛన్న మూర్ధజమ్‌ | బభౌ చామీకరప్రఖ్యైరాయుధైరుపశోభితమ్‌ || 135

చంద్రార్కకిరణోద్యోతం గిరికూటమివోఛ్రితమ్‌ | నందకానందితకరం కౌస్తుభోద్భాసితోరసమ్‌ || 136

శక్తిచిత్రఫలోదగ్రం శంఖచక్రగదాధరమ్‌ | విష్ణుశైలం క్షమాశీలం శ్రీవత్సశారఙ్గపాణినమ్‌ || 137

త్రిదశోదారఫలదం స్వర్గస్త్రీచారువల్లభమ్‌ | సర్వలోకమనఃకాంతం సర్వసత్వమనోహరమ్‌ || 138

మాయావిశాలవిటపం తోయదౌఘసమప్రభమ్‌ | విద్యాహంకారమానాఢ్యమహాభూతప్రరోహణమ్‌ || 139

విచిత్రపత్రైర్నిచితం గ్రహనక్షత్ర పుష్పితమ్‌ | దైత్యలోకమహాస్కంధం మర్త్యలోకప్రకాశితమ్‌ || 140

కాళి నల్లని మేఘమునే ముసుగుగా చేసుకొని రూపము దాల్చి వచ్చెను. నల్లని చీకటి సూర్యకాంతిని కమ్మివేయగా ఆకాశము ప్రకాశించలేదు. అట్టి దట్టమైన నల్లని మేఘములు గల ఆకాశమును చేతులతో కప్పివేసి నల్లని శరీరముగల విష్ణువు తన శరీరమును చూపించెను. ఆ శరీరము మేఘము, కాటుకల వలె నల్లగ నుండెను. తేజస్సుచే, శరీరముచే నల్లని పర్వతమువలె నుండెను. మెరియుచున్న పీతాంబరములదాల్చి, మేలిమి బంగారు భూషణములు తొడిగి, పొగ వంటి, చీకటి వంటి శరీరముతో యుగాంతమున ఎగిసిన అగ్ని వలె వచ్చినతను విష్ణువు. ఆతని భుజములు గుండ్రంగా, బలముగా నుండెను. తలపై కిరీటముండెను. బంగారు ఆయుధములతో ప్రకాశించుచుండెను. సూర్య చంద్రుల కిరణములచే మెరియుచు పైకి లేచిన గిరి శిఖరమువలె నుండెను. నందకుని ఆనందింపజేసిన చేతులను, కౌస్తుభముచే మెరియు వక్షస్థలమును గలిగి, శక్తిచే విచిత్ర ఫలములచే ఒప్పారు వాడు, శంఖ చక్ర గదలను ధరించువాడు శ్రీ విష్ణువు. అతను క్షమాశీలుడు, శ్రీవత్స శారఙ్గములను చేత ధరించినాడు. దేవతలకు ఉదారముగా ఫలమునిచ్చువాడు, స్వర్గస్త్రీలకమిత ఇష్టుడు అన్ని లోకములయందు అందరికీ మనోహరుడు. మాయయను విశాల విటపము గలవాడు. మేఘ సమూహ సమాన కాంతి గలవాడు. విద్య, అహంకార, మానములు గలిగి మహా భూతముల కారకుడగువాడు - విచిత్ర పత్రములు, గ్రహనక్షత్ర పుష్పములు, దైత్యలోకమున గొప్ప కొమ్మను గలిగి మానవలోకమున ప్రకాశించువాడుగా నుండెను. 140

సాగరాకారనిర్హ్రాదం రసాతలతలాశ్రయమ్‌ | నాగేంద్రపాశైర్వితతం పక్షిజంతుసమన్వితమ్‌ || 141

శీలా నాహార్య గంధాఢ్యం సర్వలోకమహాద్రుమమ్‌ | అవ్యక్తానందసలిలం వ్యక్తాహంకారఫేనిలమ్‌ || 142

మహాభూతకరౌఫ°ఘం గ్రహనక్షత్రబుద్బుదమ్‌ | విమానవాహనైర్య్వాప్తం తోయదాడంబరాకులమ్‌ || 143

జంతుమత్స్యగణాకీర్ణం శైలశంఖకులైర్యుతమ్‌ | త్రైగుణ్యవిషయావర్తం సర్వలోకతిమింగిలమ్‌ || 144

వీరవృక్షలతాగుల్మం భుజగోత్సృష్టశైలవలమ్‌ | ద్వాదశార్కమహాద్వీపం రుద్రైకాదశపత్తనమ్‌ || 145

వస్వష్టపర్వతోపేతం త్రైలోక్యాంభోమహోదధిమ్‌ | సంధ్యాసంధ్యోర్మిసలిలమాపూర్ణానిలశోభితమ్‌ || 146

దైత్యయక్షగణగ్రామం రక్షోగణఝషాకులమ్‌ | పితామహ మహావీర్యం స్వర్గస్త్రీరత్నసంకులమ్‌ || 147

శ్రీ కీర్తికాంతిలక్ష్మీభిర్నదీభిశ్చ సమాకులమ్‌ | కాలయోగ మహావర్షప్రళయోత్పత్తివేగితమ్‌ || 148

సత్సంయోగమహాపారం నారాయణమహార్ణవమ్‌ | దేవాతిదేవం వరదం భక్తానాం భక్తపత్సలమ్‌ || 149

అనుగ్రహకరం దేవం ప్రశాంతికరణం శుభమ్‌ | హర్యశ్వరథసంయుక్త సుపర్ణధ్వజశోభితే || 150

సముద్రము వంటి ధ్వని గలిగి, రసాతల తలమును ఆశ్రయముగా గలిగి, నాగేంద్రపాశములచే విస్తరించి, పక్షుల, జంతువుల గలిగినవాడు, అన్నిలోకములకు పెద్ద చెట్టువంటివాడు, అవ్యక్తమగు ఆనందమును జలమును, వ్యక్తమగు అహంకారమను నురుగును కలవాడు, మహాభూతములే హస్తములుగా (కెరటాలుగా) గ్రహ నక్షత్రములే బుడగలుగా గలిగి విమాన వాహనములచే వ్యాపించినవాడు, మేఘముల యాడంబరముచే కల్లోలితమైనవాడు. జంతుగణములచే, మత్స్యగణములచే కూడుకున్నవాడు. శైలములు, శంఖములు గలవాడు. త్రైగుణ్య విషయములే సుడులుగా గలవాడు, అన్ని లోకములను తనయందు దాచుకునేవాడు. గొప్ప వృక్షములు, లతలు గలవాడు, సర్పములచే విడువబడిన నాచు (శైవలము) గలవాడు. ద్వాదశాదిత్యులకు మహాద్వీపము. ఏకాదశ రుద్రులకు పట్టణము, అష్టవసువులకు పర్వతము, ముల్లోకములను నీటికి సముద్రము ఈ నారాయణుడు. సంధ్యా కాలమను వేడికి నీరు, పూర్తి అగ్నిచే ప్రకాశించువాడితను. దైత్య యక్ష గణముల సమూహము, రాక్షస గణములతో, జలచరాలతో కూడుకున్నవాడు. పితామహుని గొప్పశక్తి, స్వర్గస్త్రీల రత్నములలో కూడినవాడు. తేజస్సు, కాంతి, కీర్తి, లక్ష్మి మొదలగు వానిచే, నదిచే కూడినవాడు. కాలము, యోగము, మహావర్షము, ప్రళయమను వాని యుత్పత్తిచే వేగము నొందినవాడు. సత్సంయోగమను గొప్ప తీరము, నారాయణుడను మహా సముద్రము, దేవరాజు, వరముల నిచ్చువాడు, భక్తప్రియుడు, అనుగ్రహించు దేవుడు, ప్రశాంతత నొనగూర్చువాడు అగు నారాయణుడు. 150

చంద్రార్క చక్రరచిత ఉదారాక్షవృతాంతరే | అనంతరశ్మి సంయుక్తే దుర్దర్శే మేరుకూబరే || 151

తారకాచిత్రకుసుమే గ్రహనక్షత్ర బంధురే | భ##యేష్వభయదే వ్యోమ్ని దైత్యాపరాజితే || 152

హర్యశ్వరథసంయుక్త ముక్తాశోభాసమన్వితమ్‌ | దధృశుస్తే స్థితం దేవం దివ్యలోకమయే రథే || 153

తే కృతాంజలయః సర్వే దేవా ఇంద్రపురోగమాః | జయశబ్దం పురస్కృత్య శరణ్యం శరణం గతాః || 154

ఏతేషాం చ గిరః శ్రుత్వా స విష్ణుర్దైవదైవతః | మనశ్చక్రే వినాశాయ దానవానాం మహామృధే || 155

ఆకాశే తు స్థితో విష్ణురుత్తమం వపురాశ్రితః | ఉవాచ దేవతా సర్వాః సప్రతిజ్ఞమిదం వచః || 156

శాంతిం వ్రజత భద్రం వో మా భైష్ట మరుతాం గణాః |

జితా మే దానవాః సర్వే త్రైలోక్యం పరిగృహ్యతామ్‌ || 157

తతో7స్య సత్యసంధస్య విష్ణోర్వాక్యేన తోషితాః | దేవాః ప్రీతిం పరాం జగ్ముః ప్రాశ్యామృతమివోత్తమమ్‌ || 158

తతస్తమశ్చ సంహృత్య వినేశుశ్చ బలాహకాః | ప్రవవుశ్చ వాతాః ప్రసన్నాశ్చ దివో దశ || 159

శుద్ధప్రాయాణి జ్యోతీంషి సోమం చక్రుః ప్రదక్షిణమ్‌ |

న విగ్రహం గ్రహాశ్చక్రుః ప్రసన్నాశ్చాపి సింధవః || 160

సూర్యాశ్వరథముతో కూడి, గరుడధ్వజము గలిగి, సూర్య చంద్రుల బింబముచే చేయబడిన నక్షత్రముల వలయముల మధ్య అనంత కిరణముల గలవానిని, చూడవీలుకాని మేరు కూబరమున, నక్షత్రములే చిత్ర కుసుమములుగా గల చోట గ్రహ నక్షత్రములతో నున్న ఆకాశమున దివ్యలోకమయ రథమున నారాయణుని సూర్యాశ్వ రథముతో కూడుకున్న వానిగా ఇంద్రాది దేవతలు చూచి అంజలిబద్ధులై జయమని పలికి శరణమిచ్చువాడిని శరణు వేడిరి. వారి మాటలు విని పరమ దేవతయగు విష్ణువు రాక్షసులను మహాయుద్ధమున నశింపజేయ దలిచెను. ఉత్తమ శరీరమును దాల్చి విష్ణు వాకాశమున నిల్చి, దేవతలందరినీ ఉద్దేశించి ప్రతిజ్ఞా పూర్వకముగా నిట్లనెను- ''మరుద్గణములారా! శాంతి నొందుడు. మీకు భద్రమగుగాక! భయపడరాదు! నాచేత దానవులు జయింపబడినారనే తెలియుడు. ముల్లోకములు గ్రహింపబడుగాక!'' అనగా సత్యసంధుడగు విష్ణువు పలికిన వాక్యముచే సంతోషించి దేవతలు ఉత్తమ అమృతమును ద్రావినట్లు పరమ ప్రీతి నొందిరి. అంతట చీకటి తొలగినది. మేఘములు నశించినవి. మంగళకర వాయువులు వీచినవి. దిక్కులన్ని తెల్లనైనవి. నక్షత్రములు శుద్ధముగా మారి చంద్రుని చుట్టు తిరిగినవి. గ్రహాములు యుద్ధమును చేయలేదు. సముద్రములు కూడా ప్రసన్నమైనవి. 160

విరజా అభవన్మార్గా లోకాః స్వర్గాదయస్త్రయః | యథార్థమూహుస్సరితశ్చుక్షుభే న తథార్ణవః || 161

ఆసంఛుఖానీంద్రియాణి నరాణామంతరాత్మసు | మహర్షయో వీతశోకా వేదానుచ్చైరధీయత || 162

యజ్ఞేషు చ హవిః పాకం శివమాప చ పావకః | ప్రవృత్తధర్మసంవృత్తా లోకా ముదితమానసాః || 163

విష్ణోః సత్యప్రతిజ్ఞస్య శ్రుత్వారినిధనా గిరః | తతో7భయం విష్ణుముఖాచ్చృత్వా దైతేయదానవాః || 164

ఉద్యోగం విపులం చక్రుర్యుద్ధాయ విజయాయ చ | మయస్తు కాంచనమయం తినల్వాంతరమవ్యయమ్‌ || 165

చతుశ్చక్రం సువిపులం సుకల్పితమహాయుధమ్‌ | కింకిణీజాలనిర్ఘోషం ద్వీపిచర్మపరిష్కృతమ్‌ || 166

రుచిరం రశ్మిజాలైశ్చ హైమజాలైశ్చ శోభితమ్‌ | ఈహామృగగణాకీర్ణం పక్షిసంఘవిరాజితమ్‌ || 167

దివ్యాస్త్రశస్త్రరుచిరం పయోధరనినాదితమ్‌ | స్వక్షం రథవరోదారం సూపస్థం గగనోపమమ్‌ || 168

గదాపరిఘసంపూర్ణం మూర్తిమంతమివార్ణవమ్‌ | హేమకేయూర వలయం చంద్రమండలకూబరమ్‌ || 169

సపతాకధ్వజో పేతం సాదిత్యమివ మందరమ్‌ | గజేంద్రాభోగవపుషం క్వచిత్కేసరవర్చనమ్‌ || 170

యుక్తమృక్ష సహస్రేణ సుధారాంబుదనాదితమ్‌ | దీప్తమాకాశగం దివ్యం రథం పరరథారుజమ్‌ || 171

మార్గములు ధూళి లేనివాయెను. అట్లే స్వర్గాది ముల్లోకములు నిర్మలమాయెను. నదులు వాస్తవముగాప్రవహించెను. సముద్రము క్షోభించలేదు. నరుల ఆంతరాత్మయందు ఇంద్రియములు శుభములాయెను. మహర్షులు శోకము తొలగి వేదములను గట్టిగా చదివిరి. యజ్ఞములయందు అగ్ని శుభమగు హవిస్సుచే గ్రహించెను. లోకములు ప్రవర్తించు ధర్మముతో సంతోషించినవి. సత్యమగు ప్రతిజ్ఞగల విష్ణువు శత్రువుల నశింప జేసెదననుటను, అభయమిచ్చుటను విని దైత్యులు, దానవులు, యుద్ధము చేయుటకు, విజయము సాధించుటకు గొప్ప ప్రయత్నము చేసిరి. మయుడు గొప్ప బంగారు రథమును అధిరోహించెను, అది పన్నెండు వందల మూరల మధ్య నిడివి గలిగి నశించనిది. నాలుగు చక్రాలతో విశాలమైనది. అనేక మహాయుధాలు గలిగినది. చిరుగంటల ధ్వని గలిగి పక్షి సంఘాలతో విరాజిల్లునది. దివ్యాస్త్ర శస్త్రములతో అందమైన మేఘమువలె నినదించునది. చక్కని ఇరుసు, ముందు భాగము కలిగి ఆకాశమువలె నున్నది. గద, పరిఘలు కలిగి మూర్తీభవించిన సముద్రమువలె నున్నది. బంగారు కేయూర వలయములు గలిగి చంద్రమండలపంటి కాడి గలది. పతాకములు ధ్వజములు గలిగి సూర్యునితోని మందర పర్వతమువలె నున్నది. గజేంద్రుని శరీరమును, కొన్నిచోట్లకేసరము వంటి కాంతి గలిగి వేయి నక్షత్రాలతో, చక్కని ధారలతో నినదించు చుండెను. ఆకాశమున వెళ్ళగలుగు రథమది దివ్యమైనది. 171

అధ్యతిష్ఠద్రణాకాంక్షీ మేరుం దీప్తమివాంశుమాన్‌ | తారస్తు క్రోశవిస్తారమాయామే చ తథావిథమ్‌ || 172

శైలకూబరసంకాశం నీలాంజనచయోపయమ్‌ | కాలలోహస్య రత్నానాం సమూహాబద్ధ కూబరమ్‌ || 173

తిమిరోద్గార కిరణం గర్జంతమివ తోయదమ్‌ | లోహజాలేన మహతా గవాక్షేణ దంశితమ్‌ || 174

ఆయసైః పరిఘైః పూర్ణం క్షేపణీయైశ్చ ముద్గరైః | ప్రాసైః పాశైశ్చ వితతైర సంయుక్తైశ్చ కణ్టకైః || 175

శోభితం తత్రాసనీయైశ్వతోమరైః సపరశ్వథైః | ఉధ్యతం ద్విషతాం హేతోర్ద్వితీయమివ మందరమ్‌ || 176

యుక్తం ఖురసహస్రేణ సో7ధ్యారోహద్రథోత్తమమ్‌ | విరోచనస్తు సంక్రుద్ధో గదాపాణిరవస్థితః || 177

ప్రముఖే తస్య సైన్యస్య దీప్తశృంగ ఇవాచలః | యుక్తం హయసహస్రేణ హయగ్రీవస్తు దానవః || 178

వ్యూహితం దానవ్యూహం పరిచక్రామ వీర్యవాన్‌ | విప్రచితిసుతః శ్వేతః శ్వేతకుండలభూషణః || 179

స్యందనం వాహయామాస పరానీకస్య మర్ధనః | వ్యాయతం కిష్కుసాహస్రం ధనుర్విస్ఫారయన్మహత్‌ || 1780

స చాహవముఖే తస్థౌ సప్రరోహ ఇవాచలః | ఖరస్తు విష్కిరన్‌ క్రోధాన్నే త్రాభ్యాం రోపజం జలమ్‌ || 181

స్ఫురద్దఃతౌష్ఠనయనః సంగ్రామం సో7భ్యకాంక్షత | త్వష్టా త్వష్టాదశహయం యానమాస్థాయ దానవః || 182

యుద్ధమును చేయదలచి మయుడు సూర్యుడు మేరువు నధిరోహించినట్లు ఆ రథమును అథిరోహించెను. ఇక తారుడను దానవుడు క్రోశ విస్తారము గలిగి పూర్వము చెప్పిన రథమువంటి రథము నెక్కెను. ఆ రథము పర్వతము వంటి కాడి గలిగి, నల్లని కాటుక గుట్టవలె నుండి, కాడికి ఇనుము, రత్నముల సమూహము కట్టబడి యుండెను. చీకటిని చీల్చు కిరణములతో గర్జించు మేఘమువలె నుండి లోహజాలముతో కూడిన కిటికీలు గలిగి యుండెను. ఇనుప ఆయుధములు, పరిఘలు, విసరగలుగు ముద్గరములు నిండి యుండెను. విసరు ఆయుధములు, బంధించు పాశములతో కంటకములు లేకుండ యుండెను. తోమరము, పరశ్వథము మున్నగునవి యుండెను. ద్వేషించువారికొరకు ఎగిసి దూకుటచే రెండవ మందరమువలె నుండెను. వెయ్యి గిట్టలు గల ఆ రథమును తారుడధిరోహించెను. విరోచనుడు కూడా కోపించి చేతిలో గదను దాల్చి సైన్యము ముందు నిలిచి వెలుగుచున్న శిఖరముతో నున్న పర్వతమువలె నుండెను. హయగ్రీవుడను దానవుడు వెయ్యి గుర్రాలు గల దానవ వ్యూహమును చుట్టు నిలిచెను. విప్రచితి యొక్క పుత్రుడు శ్వేతుడనువాడు తెల్లని కుండలముల ధరించి శత్రు సైన్యమును మర్ధించువాడై రధమును నడిపెను. చాలా విశాలమై, వెయ్యి మూరల వెడల్పుగల ధనుస్సును మీటుచూ యుద్ధము యొక్క ముందు భాగమున వృక్షముతో పర్వతమువలె నిలిచెను. ఖరుడనువాడు కోపముచే కళ్ళనుండి నీటిని గక్కుచూ, పళ్ళు, పెదవులు, కళ్ళు అదరుచుండగా యుద్ధము చేయగోరెను. త్వష్ఠ పద్దెనిమిది గుర్రాలను పూన్చిన రథమునెక్కి దివ్య వ్యూహముతో యుద్ధమున నిలిచెను. 182

దివ్యప్యూహప్రతీకాశా యుద్ధాయాభిముఖః స్థితః | అరిష్టో బలిపుత్రశ్చ వరిష్ఠో దుర్దరాయుధః || 183

యుద్ధాయాభిముఖస్తస్ఠౌ ధరాధర వికంపనః | కిశోరస్త్వతిసంహర్షాత్‌ కిశోర ఇవ చోదితః || 184

అభవద్దైత్యమధ్యే స గ్రహమధ్యే యథా రవిః | లంబస్తు నవమేఘాభః ప్రలంబాంబర భూషణః || 185

దైత్యవ్యూహగతో భాతి స నీహార ఇవాంశుమాన్‌ | వసుంధరాభస్తదను ధశనౌష్ఠేక్షణాయుధః || 186

హంసస్తిష్ఠతి దైత్యానామ్మధ్యే క్రూరమహాగ్రహః | అన్యే హయగతాస్తత్ర మత్తేభేంద్రగతాః పరే || 187

సింహవ్యాఘ్రగతాశ్చాన్యే వరాహర్ష్కేషు చాపరే | కేచిత్‌ ఖరోష్ట్రయాతారః కేచిత్తోయదవాహనాః || 188

పత్తయశ్చాపరే దైత్యా భృభణా వికృతాననాః || ఏకపాదాస్త్వపాదాశ్చ ననృతుర్యుద్ధకాంక్షిణః || 189

ఆస్ఫోటయంతో బహవః స్వనంతశ్చ తథాపరే | దృప్తశార్దూలనిర్ఘోషా నేదుర్దానవ పుంగవాః || 190

తే గదా పరిఘైర్ఘోరైః శిలా ముద్గరపాణయః | బాహుభిః పరిఘాకారైస్తర్జయంతి స్మ దేవతాః || 191

ప్రాసైః ఖడ్గైశ్చ పాశైశ్చ తోమరాంశుక పదృసైః | చిక్రీడుస్తే శతఘ్నీభిః శతధారైశ్చ ముద్గరైః || 192

ఖడ్గశైలైశ్చ శైలైశ్చ వరిఘైశ్చోద్యతాయుధైః | యుక్తం బలాహకగణౖః సర్వతః సంవృతం నభః || 193

బలిపుత్రుడు, శ్రేష్ఠుడు, గొప్ప ఆయుధములు గలవాడు అగు ఆరిష్టుడనువాడు భూమిని కంపింపజేయుచు యుద్ధమును గోరి నిలిచెను. కిశోరుడు సంతోషముతో ప్రేరేపించబడిన సింహమువలె, గ్రహముల మధ్య సూర్యునివలె, దైత్యుల మధ్య నిలిచెను. లంబుడను వాడు నీలమేఘము వంటి కాంతితో, వేలాడు భూషణములతో దైత్య వ్యూహమున నుండి మంచుతో నున్న సూర్యునివలె నుండెను. ఇక హంసుడు భూ ప్రకాశమును గలిగి, దంతములు, పెదవులు, కళ్ళు ఆయుధముగా క్రూరమహాగ్రహముగా దైత్యుల మధ్య నిలిచియుండెను, ఇతరులు గుర్రాలపై, మదగజాలపైనుండిరి. మరి కొందరు సింహాలపై, పులులపై, వరాహములపై భల్లూకములపై నుండిరి. మరి కొందరు ఒంటెలను, గాడిదలను, మేఘములను ఎక్కిరి. భీషణముగా వికృతమగు ముఖములు గల మరికొందరు పదాతులై యుద్ధమును కోరి ఒంటి కాలిపై గెంతిరి. గాలిలో ఎగిరి నర్తించిరి. అరుచుచూ, దర్పముతో నున్న పులులవలె దానవ వీరులు కోలాహలము చేసిరి. వారు గదలను, పరిఘలను, శిలలను, ముద్గరములను చేతదాల్చి, పరిఘలవంటి బాహువులతో దేవతలను బెదిరించ సాగిరి. అనేక విధములైన ఆయుధములతో, శతఘ్నులతో ముద్గరములతో క్రీడించిరి. అట్టి ఆయుధములు దాల్చిన వారితో మేఘములతో వలె ఆకాశము అంతటా కప్పబడెను. 193

ఏవం తద్దానవం సైన్యం సర్వసత్వమదోత్కటమ్‌ | దేవతాభిముఖం తస్థౌ మేఘానీకమివోదితమ్‌ || 194

రేజే చ తద్దైత్య సహస్రగాఢం వాయ్వగ్నితైలాంబుదతోయకల్పమ్‌ |

బలం బలౌఘాకుల మభ్యుదీర్ణం యుయుత్సయోన్మత్తమివావభాసే || 195

శ్రుతస్తే దైత్యసైన్యస్య విస్తారః కురునందన | సురాణామపి సైన్యస్య విస్తరం వైష్ణవం శ్రుణు || 196

ఇతి శ్రీ పాద్మ మహాపురాణ ప్రథమ సృష్ఠిఖండే

దైత్యసేనావర్ణనం నామ చత్వారింశత్తమో7ధ్యాయః ||

ఈ విధంగా ఆ దానవ సైన్యము అన్ని జీవుల మదముచే ఉత్కటమై ఉదయించిన మేఘముల సైన్యమువలె దేవతల ఎదుట నిలిచెను. ఆ దైత్య సైన్యము వేలకొలది సైనికులచే వాయువు, అగ్ని, శైలము గల మేఘ జలమువలె నుండి యుద్ధముచేయ కోరికతో ఉన్మత్తమైనట్లు భాసించెను. కురునందనా! దైత్య సైన్యము యొక్క విస్తారమును వింటివి. ఇక సురుల వైష్ణవ సైన్యము యొక్క విస్తారమును వినుము-

ఇది శ్రీ పాద్మ పురాణమున మొదటి సృష్టి ఖండమున

దైత్యసేన వర్ణనమను నలుబదియవ ఆధ్యాయము.

Sri Padma Mahapuranam-I    Chapters